Liquor Traders
-
ప్రతిపక్షంగానే కాదు.. ప్రజాపక్షంగా పోరుకు సిద్ధం బలంగా ఎదుగుదాం
-
అధికారంలోకి వచ్చాక బాబు మార్క్ అరాచకం
-
ఈడీ అరెస్ట్ నుండి బాబు పీఏ శ్రీనివాస్ తప్పించుకోలేరు..
-
ప్రతిపక్షంగానే కాదు.. ప్రజాపక్షంగా పోరుకు సిద్ధం బలంగా ఎదుగుదాం..
-
సొంత ఆదాయం పెంచుకుని.. ప్రభుత్వం ఆదాయం తగ్గిస్తున్నాడు
-
99 రూపాయలకే క్వార్టర్ పై వైఎస్ జగన్ సెటైర్లు
-
బాబుకు వణుకు పుట్టింది.
-
బాబు మాఫియా బండారం బయటపెట్టిన జగన్
-
రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందబ్బా.. చంద్రబాబును ఇమిటేట్ చేసిన జగన్
-
జగన్ నోటా చంద్రబాబు మాటలు ఇది మాములు ర్యాగింగ్ కాదు
-
ఇసుక TO "మద్యం దోచుకో.. పంచుకో.. తినుకో.. వైఎస్ జగన్ సెటైర్లు
-
అవే బ్రాండ్లు... అవే రేట్లు
👉 ఉదయమంతా కష్టపడతారు. సాయంత్రమైతే ఒక పెగ్ వేసుకుని బాధలు మర్చిపోవాలనుకుంటారు. మీకు అండగా నేనుంటా. మేము అధికారంలోకి రాగానే మందు రేట్లు తగ్గిస్తాం. సరసమైన ధరలకే మద్యాన్ని అందుబాటులో ఉంచుతాం’ – ఎన్నికల సమయంలో చంద్రబాబు మాటలు ఇవీ!👉 మద్యం వ్యాపారం ప్రైవేటుగా నిర్వహిస్తాం. మందుబాబులు కోరుకునే బ్రాండ్లన్నీ అందుబాటులోకి తీసుకువస్తాం. లైసెన్స్‌దారులు ఆర్డర్లు పెట్టిన రకాలనే సరఫరా చేస్తాం. రూ.99కే క్వార్టర్ మద్యాన్ని విక్రయిస్తాం’ ఇదీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రుల మాట.సాక్షి, నంద్యాల: చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు తిలోదకాలిచ్చారు. సరసమైన ధరలకే మద్యాన్ని సరఫరా చేస్తామని, మందుబాబులంతా సంతోషంగా ఉండాలని ఊరువాడా ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన నూతన మద్యం పాలసీలో రేట్లను చూసి మందుబాబులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాత బ్రాండ్లు, పాత ధరలనే చూసి అవాక్కవుతున్నారు. రూ.99కే క్వార్టర్ మద్యం ఎక్కడ జిల్లాలో బుధవారం నుంచి నూతన మద్యం పాలసీలో భాగంగా ప్రైవేటు దుకాణాదారులు షాపులను ఏర్పాటు చేశారు. 14వ తేదీ నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో పాల్గొని లైసెన్స్‌లు దక్కించుకున్న వారిలో మొదటి రోజు 65 మంది వరకు దుకాణాలను ప్రారంభించారు. వీరికి ఏపీఎస్‌బీసీఎల్ మద్యాన్ని సరఫరా చేయనుంది. అయితే లిక్కర్ డిపోకు వెళ్లిన వారు అక్కడి రేట్లను చూసి షాక్‌కు గురయ్యారు. గత ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయించిన బ్రాండ్లే ఉన్నాయి. ధరల్లో కూడా ఏ మాత్రం మార్పు లేదు. ఇదేంటి ప్రభుత్వం మద్యం రేట్లు తగ్గిస్తామని చెప్పింది కదా అని దుకాణాదారులు అధికారులను ప్రశి్నస్తే.. ఏమో మాకేం తెలియదు.. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే మద్యాన్ని విక్రయిస్తాం. మీకు ఏ బ్రాండ్లు కావాలో చెప్తే వాటినే ఇస్తాం అంటూ చెప్పడంతో దుకాణాదారులు విస్మయానికి గురయ్యారు. మరోవైపు రూ.99కే క్వార్టర్ మద్యం వస్తుందని ఎదురుచూసిన మందుబాబుల ఆశలు అడియాసలయ్యాయి. రూ.99కే క్వార్టర్ సీసాలు ప్రస్తుతానికి జిల్లాకు రాలేదు. ఎప్పుడు వస్తాయో కూడా అధికారులు చెప్పలేని పరిస్థితి. దీంతో పాత బ్రాండ్లు.. పాత ధరలతోనే విక్రయాలు జరగనున్నాయి. మూతపడిన ప్రభుత్వ దుకాణాలు కొత్త మద్యం విధానం అమలుల్లోకి రావడంతో ప్రభుత్వ మద్య దుకాణాలను పూర్తిగా మూసేశారు. జిల్లా వ్యాప్తంగా 93 మద్యం దుకాణాలు, 1 లిక్కర్ మార్ట్ ఉండేవి. వీటిని మంగళవారం రాత్రి 9 గంటలకు మూసేశారు. వీటి స్థానంలో 105 మద్యం దుకాణాలకు ప్రభుత్వం కొత్తగా లైసెన్స్‌లు జారీ చేసింది. తొలి రోజు నంద్యాల లిక్కర్ డిపో నుంచి సుమారు రూ.6.58 కోట్ల విలువ చేసే మద్యాన్ని దుకాణాదారులు కొనుగోలు చేశారు. 2 శాతం డ్రగ్ కంట్రోల్ సెస్ షాపులు దక్కించుకున్న వారు నిబంధనల ప్రకారం వార్షిక లైసెన్స్ రుసుములో ఆరో వంతు మొత్తాన్ని చెల్లించారు. దీంతో దుకాణాదారులకు తాత్కాలిక లైసెన్స్ జారీ చేశారు. ఇది ఈనెల 22వ తేదీ వరకు అమలులో ఉంటుంది. షాపులను అద్దెకు తీసుకున్న తర్వాత రెండేళ్ల పాటు అమలులో ఉండే పూర్తి స్థాయి లైసెన్స్ ఇస్తారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం మద్యంపై కొత్తగా మాదకద్రవ్యాల నియంత్రణ సుంకాన్ని విధించింది. ల్యాండెడ్ కాస్ట్‌పై 2 శాతం మేర పన్ను వేయనుంది.కూటమిలో ‘దుకాణం’ చిచ్చు! ఆళ్లగడ్డ: బ్రాందీ షాపుల నిర్వహణ ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జనసేన, టీడీపీ వర్గాల మధ్య చిచ్చుపెడుతున్నాయి. ఇంతవరకు ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ఇరిగెల, భూమా వర్గాలకు చెందిన నాయకులు షాపుల నిర్వహణకు సంబంధించి అవసరమైన స్థలాల కోసం యజమానులను బెదిరింపులకు పాల్పడుతుండటంతో ఉద్రిక్తతకు దారి తీస్తోంది. శిరివెళ్ల మండలంలో మొత్తం నాలుగు బ్రాందీ షాపులకు లాటరీ వేయగా అందులో ఇరిగెల వర్గానికి 2, టీడీపీ వర్గానికి 1, ఇతరులకు 1 షాపు వచ్చింది. ఇరిగెల వర్గానికి చెందిన వారు శిరివెళ్ల మండలం ఎర్రగుంట్లలో దుకాణం ప్రారంభించాలని ఎర్రగుంట్ల – వంకినిదిన్నె రహదారిలో ఖాళీగా ఉన్న స్థలాన్ని యజమాని∙దగ్గర లీజుకు తీసుకున్నారు. ఇందుకు గాను రూ. 15 వేలు అడ్వాన్స్ కూడా చెల్లించినట్లు తెలుస్తోంది. అయితే అదే స్థలంలో దుకాణం పెట్టాలని టీటీపీ నాయకుడు ఆ స్థల యజమానిని బలవంతంగా టీడీపీ నియోజకవర్గ నేత దగ్గరకు తీసుకు పోయాడు. అక్కడ ముందుగా అగ్రిమెంట్ రాసిచ్చిన తేదీ కంటే మరో రెండు రోజులు ముందుగానే టీడీపీ నేతలకు రాసిచ్చినట్లు అగ్రిమెంటు రాయించి సంతకాలు పెట్టించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇరిగెల వర్గం వారు అక్కడ దుకాణం వేసే ప్రయత్నం చేయగా టీడీపీ నేతలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించి వేయడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వివాదం పెద్దదై శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడుతుందని అక్కడ ఎవరూ షాపు ఏర్పాటు చేయకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. వైన్ షాపు నిర్వాహకులకు ఎమ్మెల్యే బుడ్డా బెదిరింపులు బండిఆత్మకూరు మండలంలోని సంతజూటూరు వైన్ షాప్ (నెంబర్.16) ఈర్నపాడుకు చెందిన పిట్టం రాజశేఖర్ రెడ్డికి దక్కింది. దీంతో ఆయన నిబంధనల మేరకు లైసెన్స్ ఫీజులో ఆరో వంతు కట్టేసి తాత్కాలిక లైసెన్స్ తెచ్చుకున్నారు. బుధవారం స్థానికంగా దుకాణం కోసం ఒక అద్దె భవనాన్ని ఎంచుకుని యజమానితో మాట్లాడారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ యజమానిని స్టేషన్‌కు పిలిపించి దుకాణానికి అద్దెకు ఎందుకు ఇచ్చావ్.. అద్దెకు ఇస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించినట్లు తెలిసింది. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆదేశాలతోనే ఎస్ఐ ఈ విధంగా మాట్లాడినట్లు టీడీపీ నాయకులే చెబుతున్నారు. ఎస్ఐ బెదిరింపులతో భవనాన్ని అద్దెకు ఇవ్వడానికి యజమాని ముందుకు రాకపోవడంతో నిర్వాహకులు మరో షాపును తీసుకుని సాయంత్రం ఓపెన్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న బుడ్డా నేరుగా రంగంలోకి దిగి నిర్వాహకులు తనతో మాట్లాడిన తర్వాతే షాపును ప్రారంభించాలని లేకుంటే నీ దుకాణమే ఉండదని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధులే ఇలా బహిరంగంగా బెదిరింపులకు పాల్పడితే వ్యాపారం ఎలా చేసుకోవాలో అర్థంకావడం లేదని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
టీడీపీ నేతల సంపద పెంచేందుకే కొత్త మద్యం పాలసీ..
-
లిక్కర్ పాలసీ గొప్పదే అయితే.. బెదిరింపులు ఎందుకు ?
-
లిక్కర్ మాఫియాకు సూత్రధారి.. పాత్రధారి నువ్వు కాదా ?
-
అన్ని దుకాణాలు మావే!
-
బాలకృష్ణ ఇలాకాలో మద్యం షాపు దక్కించుకున్న వ్యక్తి కిడ్నాప్
-
కూటమి నేతల బెదిరింపులు
-
టెండర్ గెలిస్తే.. కమీషన్ లేదా కరెన్సీ టీడీపీ బెదిరింపులు
-
కూటమి నేతల బెదిరింపులు
-
కిడ్నపులు, బెదిరింపులతో టీడీపీ నేతలు మద్యం షాపుల దందా
-
కిక్కెక్కించిన మద్యం దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: ఖజానాకు ‘మద్యం దరఖాస్తుల’రూపంలో కాసుల వర్షం కురిసింది. రానున్న రెండేళ్ల కాలానికి గాను రాష్ట్రంలోని వైన్‌షాపులకు లైసెన్సుల మంజూరు కోసం నిర్వహించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియకు అనూహ్య రీతిలో స్పందన కనిపించింది. శుక్రవారం దరఖాస్తుల ప్రక్రియ ముగియగా, శనివారం మధ్యాహా్ననికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయన్న లెక్కలను ఎక్సైజ్ శాఖ తేల్చింది. ఈ లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 2,620 వైన్‌షాపుల లైసెన్సుల కోసం ఏకంగా 1,31,954 దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం కొనసాగుతున్న లైసెన్సుల కోసం 68,691 దరఖాస్తులు రాగా, ఈసారి గతం కంటే 63,263 దరఖాస్తులు ఎక్కువగా రావడం గమనార్హం. గత రెండేళ్లతో పోలిస్తే రానున్న రెండేళ్ల కాలానికి గాను దరఖాస్తుల సంఖ్య దాదాపు రెట్టింపయింది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రూ.2,639 కోట్ల ఆదాయం కేవలం దరఖాస్తుల రూపంలోనే లభించింది. ఈ దరఖాస్తుల నుంచి జిల్లా స్థాయిలో కలెక్టర్ల పర్యవేక్షణలో ఈనెల 21న డ్రా తీసి లైసెన్సులు మంజూరు చేయనున్నారు. హైదరాబాద్ శివార్లలో భారీగా.. భారీస్థాయిలో మద్యం విక్రయాలు జరుగుతున్న జిల్లాల్లోని వైన్‌షాపులను దక్కించుకునేందుకు ఆశావహులు పెద్ద ఎత్తున పోటీ పడినట్లు గణాంకాలు చెపుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ శివార్లలోని షాపుల కోసం వ్యాపారులు భారీ స్థాయిలో దరఖాస్తులు దాఖలు చేసినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. సరూర్‌నగర్ ఎక్సైజ్ కార్యాలయ పరిధిలోని 134 షాపులకు ఏకంగా 10,908 దరఖాస్తులు రాగా, శంషాబాద్‌లోని 100 షాపులకు 10,811 దరఖాస్తులు వచ్చాయి. ఇవే షాపులకు గత రెండేళ్ల లైసెన్సుల కోసం వచ్చిన దరఖాస్తులతో పోలిస్తే ఈసారి రెట్టింపు సంఖ్యలో రావడం గమనార్హం. సరూర్‌నగర్ పరిధిలోని షాపులకు గత రెండేళ్ల కాలానికి 4,102, శంషాబాద్‌లో 4,122 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇక మరో ఏడు జిల్లాల్లో దరఖాస్తుల సంఖ్య 5 వేలు దాటింది. ఖమ్మం (7,207), కొత్తగూడెం (5,057), సంగారెడ్డి (6,156), నల్లగొండ (7,058), మల్కాజ్గిరి (6,722), మేడ్చల్ (7,017), వరంగల్ అర్బన్ (5,858)లో పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఇక, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో మాత్రమే వెయ్యి కంటే తక్కువ దరఖాస్తులు వచ్చాయి. కాగా, క్రితం సారి 10 రోజుల పాటు నిర్వహించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియలో మొత్తం కలిపి 68 వేల పైచిలుకు దరఖాస్తులు రాగా, ఈసారి చివరి ఒక్కరోజే 56,980 దరఖాస్తులు రావడం గమనార్హం. ఈసారి చివరి నాలుగు రోజుల్లోనే భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈనెల 15న సెలవు దినాన్ని మినహాయిస్తే 14,16,17, 18 తేదీల్లో కలిపి 1.10 లక్షల దరఖాస్తులు రావడం గమనార్హం. ఆదిలాబాద్‌లో 979, ఆసిఫాబాద్‌లో 967 దరఖాస్తులు వచ్చాయి. ఇక, తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చిన జిల్లాల జాబితాలో నిర్మల్ (1,019), గద్వాల (1,179), వనపర్తి (1,329) ఉన్నాయి. ఈ దరఖాస్తుల సరళిని బట్టి రాష్ట్రంలోని రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర వ్యాపార రంగ సంస్థల యజమానులతో పాటు పొరుగు రాష్ట్రాలకు చెందిన లిక్కర్ వ్యాపారులు కూడా దరఖాస్తు చేసి ఉంటారని ఎక్సైజ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
మద్యం అమ్మకాలపై పిటిషన్ కొట్టివేత.. ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
సాక్షి, హైదరాబాద్: ఏపీలో మద్యం అమ్మకాలకు సంబంధించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌ను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొట్టివేసింది. విచారణలో భాగంగా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెల్లడించింది. వివరాల ప్రకారం.. మద్యం అమ్మకాల్లో ఎక్సైజ్ చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపణలు చేస్తూ స్పిరిట్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా.. ఏపీ ప్రభుత్వంపై పిటిషన్ దాఖలు చేసింది. దీంతో, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా విచారణ చేపట్టింది. కాగా, విచారణలో భాగంగా.. పిటిషన్లో చేసిన ఆరోపణలు అవాస్తవని తేలింది. కాంపిటీషన్ లాను ఉల్లంఘించినట్టు నిర్ధారణ కాలేదని కమిషన్ తేల్చింది. ఎక్సైజ్ చట్టం సెక్షన్-4 ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేస్తూ తీర్పును వెల్లడించింది. ఈ సందర్భంగా పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు పేర్కొంది. -
శ్వేత గరళం!
తెల్లగా మెరుస్తుంది. కలిపితే నురగ వస్తుంది. పుల్లపుల్లగా, తియ్యతియ్యగా ఉంటుంది. తాగితే తలతిరిగి పడిపోయేంత నిషా వస్తుంది.. మరి ఇది ఏ తాటిచెట్టు నుంచో, ఈత చెట్టు నుంచో తీసినది కాదు. అచ్చంగా స్వచ్ఛమైన మందు కల్లు. అసలైన కల్లు ఒక్క చుక్క ఉంటే ఒట్టు.. అంతా రసాయనాలు, నిషేధిత మత్తు పదార్థాలు కలిపిన బోరింగ్ నీళ్లే. ఈ ‘మందు’కల్లు తాగేవారు కొద్దిరోజుల్లోనే బానిసలుగా మారుతున్నారు. ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారు. ఈ దందాపై ‘సాక్షి’నిర్వహించిన క్షేత్రస్థాయిలో పరిశీలనలో ఆందోళనకర విషయాలెన్నో బయటకొచ్చాయి. ఈ వివరాలతో ప్రత్యేక కథనం.. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాష్ట్రవ్యాప్తంగా మందు కల్లు దందా విచ్చలవిడిగా సాగుతోంది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ దందా సాగుతోంది. మందు కల్లు తయారీలో వాడే ఆల్ఫ్రాజోలం, డైజోఫాం, క్లోరల్ హైడ్రేట్ (సీహెచ్) వంటి మత్తు పదార్థాలను ప్రభుత్వం నిషేధించినా.. దొంగచాటుగా రవాణా, వినియోగం సాగుతూనే ఉంది. మహారాష్ట్రలోని ముంబై, పుణె, నాగ్‌పూర్‌తోపాటు గుజరాత్, కర్ణాటకల నుంచి రాష్ట్రానికి క్లోరల్ హైడ్రేట్ (సీహెచ్), ఆల్ఫ్రాజోలం రవాణా అవుతోంది. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి దొంగచాటుగా కొన్ని ముఠాలు ఈ మత్తు పదార్థాలను తరలిస్తున్నాయి. పోటెత్తుతున్న మందు కల్లు.. ►ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా మందు కల్లు విక్రయాలు జరుగుతున్నాయి. మొత్తం కల్లు విక్రయాల్లో 70 శాతానికిపైగా ఇదే ఉన్నట్టు ఎక్సైజ్ వర్గాలే చెప్తున్నాయి. ఓ కల్లు డిపో నడుపుతున్న వ్యక్తి మండలాల వారీగా ఏజెంట్లను పెట్టుకుని మరీ ఆల్ఫ్రాజోలం, సీహెచ్, డైజోఫాం సరఫరా చేస్తున్నట్టు సమాచా రం. సదరు వ్యక్తికి రాజకీయ నేతల అండదండలు ఉన్నాయని స్థానికులు చెప్తున్నారు. ►ఉమ్మడి నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా మందు కల్లు పోటెత్తుతోంది. జిల్లాలో 530 గ్రామ పంచాయతీలు ఉండగా.. 400కుపైగా గ్రామాల్లో మందు కల్లు విక్రయాలు సాగుతున్నాయి. నిజామాబాద్ పట్టణంతోపాటు బోధన్, ఎడపెల్లి, రెంజల్, ఇతర మండలాల్లోని డిపోల్లో అమ్మే కల్లు అంతా రసాయనాలతో తయారు చేసినదేనని స్థానికులు చెప్తున్నారు. ►మెదక్ జిల్లాలోని రామాయంపేట, అల్లాదుర్గం, కొల్చారం నర్సాపూర్, తూప్రాన్‌లో సైతం మం దు కల్లు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ►గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు శివారు ప్రాంతా ల్లోని కల్లు డిపోల్లోనూ మందు కల్లు విక్రయాలు జరుగుతున్నట్టు స్థానికులు చెప్తున్నారు. నేతలే ఓనర్లు.. లేకుంటే వాటాలు.. మందు కల్లు డిపోల్లో చాలావరకు ద్వితీయశ్రేణి రాజకీయ నేతల ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాయని ఆరోపణలున్నాయి. వారు పైస్థాయి నేతల సమావేశాలు, సభలు, ప్రజాప్రతినిధులు సూచించిన ఇతర ఖర్చులను భరిస్తున్నారని.. కొందరు అధికారులకు మాత్రం మామూళ్లు వెళ్తుంటాయని చెప్తున్నారు. ఇక రాజకీయాల్లో లేని నిర్వాహకుల ‘లెక్క’లు వేరే ఉంటాయని గీత కార్మిక సొసైటీలు చెప్తున్నాయి. కల్లు డిపోకు సమకూరిన ఆదాయంలో గీతవృత్తి, సొసైటీదారులకు 50 శాతం, పోలీసులకు 5%, ఎక్సైజ్ శాఖకు 10 శాతం, రాజకీయనేతలకు 10%, చందాలకు 10 శాతం, అనుచరులకు 5 శాతం, స్వచ్ఛంద కార్యక్రమాలకు 10 శాతం చొప్పున ఇస్తున్నట్టు పేర్కొంటున్నాయి. కల్లు కాదు.. ఉత్త రసాయనాలే.. చాలా డిపోల్లో అమ్ముతున్న కల్లులో అసలైన కల్లు మొత్తానికే ఉండదు. అంతా నీళ్లు, రసాయనాలే. పు లుపు రావడానికి నిమ్మ ఉప్పు, తెలుపు రంగు కోసం సిల్వర్ వైట్, తీపి కోసం శాకరిన్, నురుగు కోసం డ్రైఈస్ట్, కుంకుడుకాయల రసాన్ని వినియోగిస్తున్నారు. మత్తు కోసం ఆల్ఫ్రాజోలం, డైజోఫాం, క్లోరల్ హైడ్రేట్ (సీహెచ్) వంటి రసాయనాలను కలుపుతున్నారు. ఒక్కో సీసా మందు కల్లును ఆ యా ప్రాంతాన్ని బట్టి, కలిపిన రసాయనాలను బ ట్టి రూ.10 నుంచి రూ.25 వరకు విక్రయిస్తున్నారు. ఖర్చు రూ.6,650.. ఆదాయం రూ.36,000 2,400 సీసాల (100 కేసుల) మందు కల్లు తయారీ కోసం.. నిమ్మ ఉప్పు రూ.110–140, సిల్వర్ వైట్ రూ.150 వరకు, శాకరిన్ రూ.180, కుంకుడుకాయలు రూ.30, డ్రైఈస్ట్కు రూ.150వరకు.. ఆల్ఫ్రాజోలం కోసం రూ.6 వేల వరకు ఖర్చవుతుందని కల్లు డిపోల వర్గాలు చెప్తున్నాయి. ఈ లెక్కన 2,400 సీసాల కల్లుకు రూ.6,650 వరకు ఖర్చు ఉండగా.. ఒక్కో సీసా సగటున రూ.15కు విక్రయిస్తే రూ.36 వేల వరకు ఆదాయం వస్తుండడం విశేషం. ఎక్కువ రేటుకు అమ్మేచోట్ల అయితే.. ఏకంగా 50 వేలకుపైనే వస్తుంది. బలవుతున్నది కూలీలు, కార్మికులే.. మందు కల్లు తాగుతున్న వారంతా పేదలే. వ్యవసాయ పనులకెళ్లే కూలీలు, అడ్డా కూలీలు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర అసంఘటిత రంగ కార్మికులే. వారంతా మందు కల్లుకు అలవాటుపడి బానిసలుగా మారుతున్నారు. రోజూ తాగకుండా ఉండలేని స్థితికి చేరుకుంటున్నారు. తాగుతూనే ఉంటే శరీరం గుల్ల అవుతుంది. ఒక్కసారిగా ఆపేస్తే మానసిక పరిస్థితి దెబ్బతినడం, ఫిట్స్, పిచ్చిగా ప్రవర్తించడం వంటి దుష్పరిమా ణాలు ఎదురవుతున్నాయి. కోవిడ్ లాక్డౌన్ సమ యాల్లో ఇలాంటి ఘటనలు ఎన్నో కనిపించాయి. నిజామాబాద్ జిల్లాలో చికిత్స పొందుతున్న కల్తీ కల్లు బాధితులు (ఫైల్) గతంలో నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు తాగి ఇద్దరు చనిపోవడం, రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరగడంతో మూడు నెలల పాటు కల్లు డిపోలను మూసేశారు. అప్పటికే ఏళ్లుగా మందు కల్లుకు అలవాటైనవారిలో విపరిణామాలు మొదలయ్యాయి. చాలా మంది మతిభ్రమించి పిచ్చిగా ప్రవర్తించారు. కొందరు ఆత్మహత్యలకు ప్రయత్నించారు. మానసిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతిన్న 270 మందికి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స చేయగా.. ఏడుగురు చనిపోయారు. ఇప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మందు కల్లు విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. వరంగల్‌లో రెడ్ హ్యాండెడ్‌గా.. ఇటీవల వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇంతేజార్గంజ్ పరిధిలోని లక్ష్మీపురం కల్లు కాంపౌండ్‌పై దాడిచేసి 300 లీటర్ల మందు కల్లును పట్టుకున్నారు. అసలు కల్లు అనేదే లేకుండా మొత్తంగా నీళ్లు, రసాయనాలతో కల్లు తయారు చేస్తున్నట్టు గుర్తించారు. కల్లు తయారీకి వాడుతున్న ఆల్ఫ్రాజోలం, అమ్మోనియా, శాకరిన్ పౌడర్, సోప్ బెర్రీ, గోబైండా పేస్ట్ స్వాధీనం చేసుకుని.. నలుగురిని అరెస్టు చేశారు. వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్న రసాయనాలు, కల్లు ప్యాకెట్లు -
కల్తీ, అక్రమ మద్యానికి చెక్
సాక్షి, అమరావతి: కల్తీ మద్యం, మద్యం అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సరికొత్త హోలోగ్రామ్ అస్త్రాన్ని ప్రయోగించనుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ విభిన్న ఫీచర్లతో కొత్త హోలోగ్రామ్ రూపొందించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2011 నుంచి మద్యం సీసాల మీద ముద్రిస్తున్న హోలోగ్రామ్ విధానం లోపభూయిష్టంగా ఉండటంతో మద్యం కల్తీ, అక్రమ రవాణాను అరికట్టడం సాధ్యపడటం లేదు. దీంతో దశాబ్దకాలంగా రాష్ట్రంలో మద్యం మాఫియా వ్యవస్థీకృతమైంది. కల్తీ మద్యం తాగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యానికి అడ్డుకట్ట పడటంలేదు. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు గండిపడుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ మద్యం సీసాలపై ముద్రించేందుకు.. పాత విధానంలోని లోపాలను సరిదిద్ది 19 ఫీచర్లతో కొత్త హోలోగ్రామ్‌ను రూపొందించింది. అధికారులు తనిఖీల్లో మద్యం సీసాలపై కొత్త హోలోగ్రామ్‌ను పరిశీలించగానే అవి అసలైనవా, కల్తీవా అన్నది సులభంగా గుర్తించవచ్చు. కొత్త హోలోగ్రామ్‌లోని కొన్ని ముఖ్యమైన ఫీచర్లు.. ప్రస్తుతం ఉన్న హోలోగ్రామ్ కంటే కొత్తదాన్లో ‘డాట్స్ పర్ ఇంచ్ (డీపీఐ) రెండింతలు పెద్దగా పెట్టారు. పాత హోలోగ్రామ్‌లో డీపీఐ 6 వేలు ఉండగా కొత్తదాంట్లో 12 వేలు ఉంది. ప్రస్తుత హోలోగ్రామ్ సైజు 60*15 మిల్లీమీటర్లు ఉండగా కొత్తది 65*15 మిల్లీమీటర్లు ఉంది. కొత్త హోలోగ్రామ్‌లో ట్యాగంట్ ఆప్షన్ ఉంది. మద్యం సీసాపై ఉన్న హోలోగ్రామ్‌పై రీడర్ పెట్టగానే అది ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. మద్యం సీసాను అటూ ఇటూ కదిపితే ఆ హోలోగ్రామ్‌పై ఓ అమ్మాయి బొమ్మ కనిపిస్తుంది. ‘ఓకే’ అనే పదం ఓ వైపునకు ‘టిక్ మార్కు’ మరోవైపునకు కదులుతాయి. దీన్లో కొత్తగా ‘టూ చానల్ ఎఫెక్ట్’ ఉంది. ‘రాస్టర్ టెక్ట్స్’ ఫీచర్ ఉంది. దానిపై కోడర్ ఫిల్మ్ పెడితే ‘ఎక్సైజ్’ అనే పదం కనిపిస్తుంది. కొత్త హోలోగ్రామ్‌పై 10 ఎక్స్ లెన్స్‌తో చూస్తేనే కనిపించే సూక్ష్మ అక్షరాలను ముద్రించారు. దీనిపై ‘వర్టికల్ స్విచ్ ఎఫెక్ట్’ పొందుపరిచారు. వీటిని పరిశీలించి ఆ మద్యం సీసా అసలైనదా.. కల్తీదా అనేది నిర్ధారిస్తారు. కల్తీ మద్యం, మద్యం అక్రమ రవాణా అరికట్టడమే లక్ష్యం రాష్ట్రంలో మద్యం సీసాలపై 2011 నుంచి ముద్రిస్తున్న హోలోగ్రామ్ విధానం లోపాలను సరిదిద్దుతూ కొత్త హోలోగ్రామ్ రూపొందించాం. టెక్నాలజీని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుని కొత్త భద్రతా ఫీచర్లను పొందుపరిచాం. కల్తీ మద్యం, మద్యం అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా హోలోగ్రామ్‌ను డిజైన్ చేశాం. దీన్ని త్వరలోనే ప్రవేశపెడతాం. – డి.వాసుదేవరెడ్డి, ఎండీ, రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్