సాక్షి, హైదరాబాద్: ఏపీలో మద్యం అమ్మకాలకు సంబంధించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌ను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొట్టివేసింది. విచారణలో భాగంగా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెల్లడించింది. వివరాల ప్రకారం.. మద్యం అమ్మకాల్లో ఎక్సైజ్ చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపణలు చేస్తూ స్పిరిట్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా.. ఏపీ ప్రభుత్వంపై పిటిషన్ దాఖలు చేసింది.
దీంతో, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా విచారణ చేపట్టింది. కాగా, విచారణలో భాగంగా.. పిటిషన్‌లో చేసిన ఆరోపణలు అవాస్తవని తేలింది. కాంపిటీషన్ లాను ఉల్లంఘించినట్టు నిర్ధారణ కాలేదని కమిషన్ తేల్చింది. ఎక్సైజ్ చట్టం సెక్షన్-4 ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేస్తూ తీర్పును వెల్లడించింది. ఈ సందర్భంగా పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment