Excise and Prohibition
-
ప్రధాని మోదీకి కర్ణాటక సీఎం సవాల్
బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వంపై ప్రధాని నరేంద్రమోదీ ఆరోపణలు చేయడంపై సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ ఎక్సైజ్ శాఖ లో రూ. 700 కోట్ల కుంభకోణం జరిగిందని ప్రధాని చేసిన ఆరోపణలను నిరూపించాలని సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. అవి నిజమని రుజువైతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. అయితే వాటిని నిరూపించలేకపోతే ప్రధాని మోదీ రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ కర్ణాటక ఎక్సైజ్ శాఖలో భారీ కుంభకోణం జరిగిందని, దీని ద్వారా వచ్చిన సొమ్మును కాంగ్రెస్ మహారాష్ట్ర, ఝార్ఖండ్లలో ఎన్నికల ప్రచారానికి వినియోగిస్తోందని ఆరోపించారు. ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ రాష్ట్రం కాంగ్రెస్ రాజ కుటుంబానికి డబ్బులు అందించే ఏటీఎంగా మారిపోతుందని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ రాజ కుటుంబానికి ఇప్పుడు తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలు ఏటీఎంలుగా మారిపోయాయన్నారు.మహారాష్ట్రలో ఎన్నికల కోసం తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వసూళ్లకు పాల్పడుతున్నదని, కర్ణాటకలో ప్రభుత్వ వసూళ్లు రెట్టింపయ్యాయని ప్రజలు చెబుతున్నారన్నారు. కర్ణాటకలోని లిక్కర్ వ్యాపారుల నుంచి రూ.700 కోట్లు వసూలు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయని మోదీ ఆరోపించారు.తాజాగా ప్రధాని మోదీ ఆరోపణలను సీఎం సిద్ధరామయ్య ఖండించారు. దేశ ప్రధాని ఇలాంటి అబద్ధాలు చెప్పడం ఆశ్చర్యంగా ఉన్నదన్నారు. ప్రధానికి తానొక సవాల్ విసురుతున్నానని, ఆయన చేసిన ఆరోపణలను నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, లేనిపక్షంలో ప్రధాని రాజకీయాల నుంచి తప్పుకోవాలని సిద్ధరామయ్య డిమాండ్ చేశారు.ఇదిలావుండగా కర్ణాటక వైన్ మర్చెంట్స్ అసోసియేషన్ ఇటీవల ఎక్సైజ్ విభాగంపై తీవ్ర ఆరోపణలు చేసింది. లైసెన్సులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం రూ. 30 లక్షల నుంచి రూ. 70 లక్షల వరకూ వసూలు చేస్తున్నట్టు ఆరోపించింది. గత ఏడాది కాలంలో ఇలా 1000 లైసెన్సులను అక్రమంగా కేటాయించారని, ఫలితంగా రూ. 300-700 కోట్ల కుంభకోణం జరిగిందని వైన్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆరోపించింది.ఇది కూడా చదవండి: Maharashtra: తొలిసారి ఆ గ్రామంలో ఎన్నికల పండుగ -
మద్యం అమ్మకాలపై పిటిషన్ కొట్టివేత.. ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
సాక్షి, హైదరాబాద్: ఏపీలో మద్యం అమ్మకాలకు సంబంధించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌ను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొట్టివేసింది. విచారణలో భాగంగా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెల్లడించింది. వివరాల ప్రకారం.. మద్యం అమ్మకాల్లో ఎక్సైజ్ చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపణలు చేస్తూ స్పిరిట్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా.. ఏపీ ప్రభుత్వంపై పిటిషన్ దాఖలు చేసింది. దీంతో, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా విచారణ చేపట్టింది. కాగా, విచారణలో భాగంగా.. పిటిషన్లో చేసిన ఆరోపణలు అవాస్తవని తేలింది. కాంపిటీషన్ లాను ఉల్లంఘించినట్టు నిర్ధారణ కాలేదని కమిషన్ తేల్చింది. ఎక్సైజ్ చట్టం సెక్షన్-4 ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేస్తూ తీర్పును వెల్లడించింది. ఈ సందర్భంగా పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు పేర్కొంది. -
‘పండగ పూటా పస్తులేనా?.. మేమేం పాపం చేశాం’
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ అంతటా బతుకమ్మ సంబరాలు, దసరా వేడుకలు జరుగుతున్నాయి. మాకు మాత్రం కష్టాలు, కన్నీళ్లే మిగిలాయి. కష్టపడి చదువుకున్నాం. పోటీపరీక్షల్లో గెలిచాం. ఎక్సైజ్ ఎస్సైలుగా ఎంపికయ్యాం. కానీ ఇప్పటి వరకు పోస్టింగులు ఇవ్వలేదు. 10 నెలలుగా జీతాలు కూడా లేవు. మేమేం పాపం చేశాం. మాకూ కుటుంబాలు ఉన్నాయి. మేం పండగలు చేసుకోవద్దా. సంతోషంగా ఉండొద్దా...’ – ఆబ్కారీశాఖలో ఎస్సైగా ఉద్యోగం సంపాదించిన ఓ మహిళ ఆవేదన ఇది. ఈ మహిళ ఒక్కరే కాదు. రెండేళ్ల క్రితం ఆబ్కారీ ఎస్సైలుగా ఎంపికైన సుమారు 280 మంది ఉద్యోగులదీ ఇదే పరిస్థితి. ‘కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకున్నాం. ఇక ఇంటిల్లిపాదీ సంతోషంగా ఉండొచ్చని భావిస్తున్న తరుణంలో రెండేళ్లుగా అటు పోస్టింగుల్లేక, పది నెలలుగా జీతాలు అందక బాధలు పడుతున్నామ’ని మరో మహిళా ఎస్సై తెలిపారు. గతంలో చేస్తున్న ఉద్యోగాలను వదులుకొని ఆబ్కారీశాఖలో అడుగు పెట్టిన మరికొందరు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. చదవండి: నా భర్తను అంతం చేయాలని ఎర్రబెల్లి కుట్ర ఎక్సైజ్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు.. ► 2015లో గ్రూపు–2 పరీక్షలు రాసి పోటీలో నెగ్గి చివరకు 2019లో ఎక్సైజ్ ఎస్సైలుగా ఎంపికైన ఉద్యోగులకు రెండేళ్లు దాటినా పోస్టింగులు ఇవ్వకపోవడంతో వారంతా నాంపల్లిలోని ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆబ్కారీ శాఖ మంత్రిని, ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. ► నియామకపత్రాలు అందుకున్న ఉద్యోగుల్లో 193 మందిని పలు ఎక్సైజ్ స్టేషన్లకు అటాచ్ చేశారు.కానీ వాళ్లకు ఎలాంటి విధులు అప్పగించలేదు. ► అలాగే మరో 87 మందిని ఎక్సైజ్ అకాడమీకి పంపించారు. సాధారణంగా ప్రతి ఎస్సైకి విధి నిర్వహణ పరిధి ఉంటుంది. కానీ ఎక్సైజ్ స్టేషన్లకు అటాచ్ అయిన ఏ ఒక్క ఎస్సైకి కూడా ఇప్పుడు ఆ పరిధి లేదు. ప్రతి రోజు కార్యాలయానికి వచ్చి సంతకం చేసి వెళ్లవలసిందే. ఇంచుమించు అకాడమీలో ఉన్నవాళ్లు కూడా అంతే. ► ‘తాత్కాలిక పదోన్నతులపైన నిబంధనలను బేఖాతరు చేశారు. మా కోసం సూపర్‌న్యూమరీ పోస్టులను సృష్టించారు. విధి నిర్వహణ లేని ఆ పోస్టుల్లో మేం బలిపశువులుగా మారాం.’ అని మరో ఎస్సై తెలిపారు. చదవండి: ‘జువెనైల్’ ఉన్నట్లు నాకు తెలియదు! అలా తిష్ట వేశారు.. గతంలో జూనియర్, సీనియర్ అసిస్టెంట్లకు ఎస్ఐలుగా తాత్కాలిక (అడ్‌హక్)పదోన్నతులిచ్చారు. గ్రూపు–2లో ఎక్సైజ్ ఎస్సై ఉద్యోగాలు పొందిన వాళ్లకు పోస్టింగులు ఇవ్వాలంటే ఈ తాత్కాలిక ఉద్యోగులను వెనక్కు పంపించాలి. లేదా కొత్తవాళ్ల కోసం మరిన్ని పోస్టులను సృష్టించాలి. కానీ 87 మందికి మాత్రమే సూపర్‌న్యూమరీ పోస్టులను సృష్టించారు.ఈ ఏడాది జనవరితో ఆ గడువు ముగియడంతో జీతాలు నిలిచిపోయాయి. మిగతా వాళ్లను స్టేషన్లకు అటాచ్ చేసినా విధులు మాత్రం లేకపోవడం గమనార్హం. జీతాల్లేక విలవిల... ► సూపర్‌న్యూమరీ పోస్టుల కోసం ఇచి్చన గడువు ముగియడంతో జీతాలు ఇవ్వడం అధికారులకు ఇబ్బందిగా మారింది. దీంతో అప్పట్నుంచి జీతాలు చెల్లించడంలేదు. ఫలితంగా సబ్ ఇన్స్పెక్టర్ల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.కొంతమందికి కుటుంబపోషణ భారంగా మారింది. ► ఇంటి అద్దెలు, నిత్యాసవరాలు, పిల్లల ఫీజులు తదితర అవసరాలకు ఎంతో కష్టంగా ఉందని పలువురు ఆవేదన చెందారు. ప్రైవేట్ సంస్థల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాలను నెట్టుకొస్తున్నట్లు మరికొందరు విస్మయం వ్యక్తం చేశారు. -
3 బార్లకు 3 దరఖాస్తులే.. ఆ 10 బార్ల పై ఆరా..?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కొత్త మున్సిపాలిటీల్లో బార్ల ఏర్పాటు కోసం ఎక్సైజ్ శాఖ చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చర్చనీయాంశమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో వెల్లువలా దరఖాస్తులు వ చ్చినా కేవలం నిజామాబాద్ కార్పొరేషన్, బోధన్ మున్సిపాలిటీలో నోటిఫై చేసిన బార్లకు చాలా తక్కువ దరఖాస్తులు రావడం ఇప్పుడు ఎక్సైజ్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో కొత్తగా 7 బార్లను నోటిఫై చేస్తే అక్కడ కేవలం 10 దరఖాస్తులే వచ్చాయి. ఇక బోధన్ మున్సిపాలిటీలో అయితే 3 బార్లకు గాను 3 దరఖాస్తులే వచ్చాయి. కానీ, రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీల్లో మాత్రం వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 72 మున్సిపాలిటీల్లోని 159 కొత్త బార్లకు నోటిఫికేషన్ ఇస్తే 7,400 వరకు దరఖాస్తులు రావడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో నిజామాబాద్, బోధన్‌లలో చాలా తక్కువగా ఎందుకు దరఖాస్తులు వచ్చాయన్న దానిపై ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆ శాఖ ఉన్నతాధికారుల వద్ద ఆరా తీసినట్టు తెలిసింది. నిజామాబాద్‌లో 7 బార్లకు గాను చివరిరోజు వరకు ఒక్కటే దరఖాస్తు వచ్చిందని, చివరి రోజు కూడా 9 మాత్రమే ఎలా వచ్చాయని, అలాగే బోధన్‌లో అయితే మూడు బార్లకు చివరిరోజే మూడు దరఖాస్తులు రావడం ఎలా సాధ్యమైందని ఆయన అంతర్గతంగా పరిశీలన జరుపుతున్నట్టు సమాచారం. కాగా, ఇక్కడ తక్కువ దరఖాస్తులు రావడానికి సిండికేట్ కారణమైందని తెలుస్తోంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా నోటిఫై అయిన బార్లకు దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 16 వరకు పొడిగించారు. ఇక ఈ నెల 19న లాటరీలు తీసి.. అందులో వచ్చిన వారికి 25వ తేదీన కేటాయిస్తారని ఎక్సైజ్ వర్గాలు వెల్లడించాయి. చదవండి: సముద్రం నీరూ తాగొచ్చు! -
దశలవారీ మద్యనిషేధంపై కసరత్తు షురూ..
సాక్షి, అమరావతి: దశలవారీ మద్య నిషేధం అమలు చర్యలు శరవేగంగా సాగుతోన్నాయి. ఇందులో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మూడు ప్రధాన విభాగాల ఉన్నతాధికారులు శుక్రవారం గుంటూరు ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో సమావేశమయ్యారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన స్పెషల్ ఎన్ ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) గుంటూరు అర్బన్ ప్రత్యేకాధికారి కరిముల్లా షరీఫ్, గుంటూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్. బాలకృష్ణన్ తో కలిసి మద్య విమోచన ప్రచార కమిటీ ఛైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పలు అంశాలపై చర్చించారు. ముందుగా ఎస్ఈబీ ప్రత్యేకాధికారి షరీఫ్ కి లక్ష్మణరెడ్డి అభినందనలు తెలిపారు. అక్రమ మద్యం తయారీ, రవాణాను నిరోధించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక ప్రతిష్టాత్మక చర్యలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు. ఆ శాఖలు సమన్వయంగా పనిచేయాలి.. మద్య నిషేధం అమలులో భాగంగానే ఎస్ఈబీని ఏర్పాటు చేశారని చెప్పారు. ముఖ్యమంత్రి సంకల్పం నెరవేరాలంటే ఎస్ఈబీ, ఎక్సైజ్ శాఖలు సమన్వయంగా పనిచేసి తమ సత్తాను చాటుకోవాలని సూచించారు. కోవిడ్ కంటైన్మెంట్ జోన్లల్లో మద్యం దుకాణాలు తెరవనందున ఇతర ప్రాంతాల నుంచి మద్యాన్ని తరలించే ప్రమాదాన్ని పసిగట్టి నిరోధించాలన్నారు. రాష్ట్ర,జిల్లాల సరిహద్దుల్లో మద్యం అక్రమరవాణాకు పటిష్ట బందోబస్తును మరింత పెంచాల్సిన అవసరం ఉందని అధికారులను లక్ష్మణరెడ్డి కోరారు. కృష్ణాజిల్లాలో ఎమ్మెల్యేలు జోగి రమేష్, రాపాక వరప్రసాద్ ల నేతృత్వంలో నాటు సారా కేంద్రాల్ని మూసేయించడం అభినందనీయమన్నారు. ('ఆ విషయం వైఎస్ జగన్ ముందే చెప్పారు') సరికొత్త శుభ పరిణామం.. నాటు సారా తయారీదారులే స్వచ్ఛందంగా ముందుకొచ్చి కేంద్రాలను అప్పచెప్పారని.. ముఖ్యమంత్రి సంకల్పమే తమలో మార్పునకు కారణమని చెప్పడం సరికొత్త శుభ పరిణామంగా లక్ష్మణరెడ్డి వివరించారు. ఇలాంటి సంఘటనల ఆదర్శంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులంతా పూనుకొని ఎస్ఈబీ, ఎక్సైజ్ శాఖల సమన్వయంతో నాటుసారా తయారీ కేంద్రాల్ని మూత వేయించాలన్నారు. రానున్న రోజుల్లో మద్యం అందుబాటులో ఉండదు.. దశలవారీ మద్య నిషేధ చర్యలతో రానున్న రోజుల్లో మద్యం అందుబాటులో ఉండదని.. అలాంటప్పుడే ఎలాంటి అక్రమాలు జరగకుండా చూడాలన్నారు. నాటుసారా తయారీ, కల్తీకల్లు, గంజాయి ఇతర మత్తుపదార్ధాల ఉత్పత్తి జరగకుండా ఎస్ఈబీ, ఎక్సైజ్ శాఖలను పటిష్టం చేయాలని ఆయన సూచించారు. ఎస్ఈబీలో 70శాతం ఉద్యోగులు, సిబ్బందితోనూ.. ఎక్సైజ్ శాఖ 30 శాతం సిబ్బందితో సమర్ధంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరుశాఖల అధికారులు చెప్పారు. మద్య విమోచన ప్రచార కమిటీ కార్యక్రమాల్లోనూ తమ శాఖల నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని ఆయా శాఖల అధికారులు హామీనిచ్చారు. -
చూసీ చూడనట్టు వదిలేశారు!
సాక్షి, గుంటూరు: గుంటూరు నగరంలోని 83 బార్ అండ్ రెస్టారెంట్లపై సోమవారం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు 19 బృందాలుగా ఏర్పడి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరు నగరంలోని టీడీపీ నాయకుడికి చెందిన ఓ బార్లో ఫుల్ బాటిల్‌ను బయటికి పార్సిల్ చేసినట్టు సమాచారం. నిబంధనల ప్రకారం బార్లలో మద్యాన్ని బయటికి విక్రయించకూడదు. నిబంధనలకు విరుద్ధంగా మద్యాన్ని బయటికి విక్రయించినట్లైతే సదరు బార్‌పై కేసు నమోదు చేసి లైసెన్స్ సస్పెండ్ చేస్తారు. టీడీపీ నాయకుడి బార్లో ఫుల్ బాటిల్ మందు బయటకు విక్రయించినట్లు అధికారులు గుర్తించడంతో వెంటనే ఆయన జిల్లాకు చెందిన ఎక్సైజ్ ఉన్నతాధికారిని సంప్రదించినట్లు తెలుస్తోంది. తనిఖీల్లో పాల్గొన్న ఎక్సైజ్ సీఐకు జిల్లా ఉన్నతాధికారి ఫోన్ చేసి బార్ యజమానికి తనకు కావాల్సిన వాడని చూసి చూడనట్లు వదిలేయమని సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. బాస్ చెప్పడంతో సదరు టీడీపీ నాయకుడి బార్‌పై పార్సిల్ కేసు నమోదు చేయకుండా టెక్నికల్ కేసు నమోదు చేసి వదిలేసినట్లు ఎక్సైజ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ తనిఖీల్లో నిబంధనలు పాటించని బార్ అండ్ రెస్టారెంట్లపై 7 కేసులు నమోదు చేసినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ జిల్లా డెప్యూటీ డైరెక్టర్(ఎఫ్ఏసీ) డాక్టర్ కె. శ్రీనివాస్ తెలిపారు. -
నవంబర్ నుంచి నూతన మద్యం పాలసీ అమలు
సాక్షి, బాల్కొండ: మద్యం సిండికేట్ ఇష్ట్యారాజ్యానికి కొందరు ఎక్సైజ్ అధికారులు మద్దతునిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. నూతన మద్యం పాలసీ అమలు కావడానికి మరో నెల రోజుల సమయం ఉండటంతో పాత వైన్సులకే లైసెన్స్‌ను ఒక నెల రెన్యూవల్ చేసిన విషయం విదితమే. అక్టోబర్ మాసానికి లైసెన్స్ ఫీజు చెల్లించిన మద్యం వ్యాపారులు ప్రతి సీసాపై రూ.10 ధర పెంచి వినియోగదారుల జేబులు గుళ్ల చేస్తున్నారు. అక్టోబర్ నెలకు మద్యం సిండికేట్ చెప్పిన ధరకే వినియోగదారులు మద్యంను కొనుగోలు చేయాల్సి వస్తుంది. మద్యం సిండికేట్‌పై పలువురు ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న సందర్భాలు కనిపించడం లేదు. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి కొనుగోలు చేసే ఒక్కో మద్యం సీసాపై ప్రత్యేక ధరను వసూలు చేస్తున్నారు. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం ఎంఆర్పీ ధరల ప్రకారమే మద్యంను విక్రయించాల్సి ఉంది. ఎక్కువ ధరలకు మద్యం విక్రయిస్తే సదరు వైన్స్‌లను సీజ్ చేసే అధికారం ఎక్సైజ్ అధికారులకు ఉంది. కానీ అక్టోబర్ నెల అంతా ప్రత్యేక ధరకే మద్యం విక్రయిస్తామని మద్యం వ్యాపారులు బహిరంగంగానే చెబుతున్నారు. నవంబర్ నుంచి నూతన మద్యం పాలసీ అమలు కానుంది. ఒక నెల లైసెన్స్ ఫీజు చెల్లించి మద్యం విక్రయిస్తే తమకు గిట్టుబాటు కాదని మద్యం వ్యాపారులు ఎక్సైజ్ అధికారులతో స్పష్టం చేసినట్లు తెలిసింది. కాగా మద్యం దుకాణాల లైసెన్స్‌లను ఖచ్చితంగా రెన్యూవల్ చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఎక్సైజ్ అధికారులు వ్యాపారులపై ఒత్తిడి తీసుకవచ్చారు. అయితే ఈ నెల కోసం అదనంగా లైసెన్స్ ఫీజును చెల్లించే సమయంలో మద్యం వ్యాపారులు కొందరు మొండికేయడంతో వారిని బుజ్జగించడంలో భాగంగా ధర పెంచుకోవడానికి ఎక్సైజ్ ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఒక్కో సీసాపై రూ.10 పెంచి విక్రయించుకోవడానికి ఎక్సైజ్ అధికారులు అనధికార అనుమతులు ఇవ్వడంతో మద్యం వ్యాపారులు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. మద్యం సీసాల పరిమితితో తేడా లేకుండా ప్రతి సీసాపై రూ.10 ధర హెచ్చింపు చేయడం ద్వారా రూ.లక్షల్లో అదనపు ఆదాయం మద్యం సిండికేట్‌కు సమకూరనుంది. ఎక్సైజ్ అధికారులు నోరు మెదపకుండా ఉండటానికి మద్యం సిండికేట్ నుంచి ముడుపులు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ రూ.10 ధర పెంపు ఈ నెలకోసమే అని వ్యాపారులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. రెండు దుకాణాలకు జరిమానా విధించినా.. ఎంఆర్పీ ధరలకు కాకుండా మద్యం ధరలను పెంచి విక్రయిస్తున్నారని వచ్చిన ఆరోపణలపై హైదరాబాద్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఎక్సైజ్ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా రెండు దుకాణాలపై కేసులు నమోదు చేశారు. జిల్లా కేంద్రంలోని రెండు దుకాణాలపై కేసులు నమోదు చేసి జరిమానా కూడా విధించారు. అయినా మద్యం వ్యాపారులు తమ తీరును మార్చుకోలేదు. రూ.10 ధర పెంచి మద్యం విక్రయాలను కొనసాగిస్తున్నారు. ఎంఆర్పీకే విక్రయించాలి మద్యాన్ని ఎంఆర్పీ ధరలకే విక్రయించాలి. ఎక్కువ ధరలకు మద్యం విక్రయిస్తే ఎక్సైజ్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం. వ్యాపారులు నిబంధనల ప్రకారం మద్యం విక్రయించాలి. – డేవిడ్ రవికాంత్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ -
పెరగనున్న కిక్కు!
సాక్షి, రంగారెడ్డి: కొత్త మద్యం పాలసీ ద్వారా ఆబ్కారీ శాఖకు కాసుల కిక్కు రానుంది. గతంతో పోలిస్తే ఈసారి దరఖాస్తు ఫీజు, కిందిస్థాయి స్లాబ్‌కు సంబంధించి రిటైల్ షాప్ ఎక్సైజ్ ఫీజు ( లైసెన్స్) పెరగడంతో అదే స్థాయిలో ఆదాయం అదనంగా చేకూరనుంది. 2019–21 మద్యం పాలసీని ఖరారు చేసిన సర్కారు.. దుకాణాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలోని 422 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదలైంది. గతంతో పోలిస్తే దరఖాస్తు ఫీజు, రిటైల్ షాప్ ఎక్సైజ్ ఫీజును ప్రభుత్వం పెంచడంతో ఆశావహుల నుంచి ఒకింత అసంతృప్తి వ్యక్తమవుతోంది. మొన్నటి వరకు ఉన్న దరఖాస్తు ఫీజు ధర అమాంతం రెట్టింపు అయింది. రూ.లక్ష నుంచి రూ.2లక్షలకు ఎగబాకింది. అలాగే, రిటైల్ షాప్ ఎక్సైజ్ ఫీజు పెంచడంతోపాటు నాలుగు స్లాబులుగా ఉన్న లైసెన్స్ ఫీజును.. ఆరు స్లాబులుగా మార్చారు. పాత పాలసీ ప్రకారం కనిష్టంగా లైసెన్స్ ఫీజు రూ.45 లక్షలు ఉండగా నూతన పాలసీలో దీనిని రూ.50 లక్షలుగా చేశారు. రూ.1.10 కోట్ల గరిష్ట ఫీజులో ఎలాంటి మార్పు లేదు. మిగిలిన స్లాబులు రూ.55 లక్షలు, రూ.60 లక్షలు, రూ.65 లక్షలు, రూ.85 లక్షలుగా నిర్ణయించారు. పెరిగిన షాపుల సంఖ్య జిల్లా వైన్స్ రంగారెడ్డి 195 మేడ్చల్ 182 వికారాబాద్ 45 పాత పాలసీ ప్రకారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 412 మద్యం దుకాణాలు ఉన్నాయి. కొత్త పాలసీ ప్రకారం ఈ సంఖ్య 422కు చేరుకుంది. జిల్లాకు కొత్తగా దుకాణాలు మంజూరు కాకపోయినా.. హైదరాబాద్ నుంచి పది షాపులను మన జిల్లాలో కలిపారు. ఆ షాపుల్లో మద్యం అమ్మకాలు చాలా తక్కువగా ఉండటంతో.. రంగారెడ్డి జిల్లాలో విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. ఫలితంగా గతంతో పోలిస్తే ఈసారి అదనంగా మరో 10 షాపులు పెరిగాయి. శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో ఏడు, సరూర్‌నగర్ ఈఎస్ పరిధిలో ఒక షాపు అదనంగా ఏర్పాటు కానున్నాయి. ఇక మేడ్చల్ జిల్లా పరిధిలోకి రెండు దుకాణాలు వెళ్లనున్నాయి. దరఖాస్తు ఫీజు రూ. 2 లక్షలు దరఖాస్తుల విక్రయం ద్వారానే ఉమ్మడి జిల్లా నుంచి రూ.130 కోట్లను రాబట్టాలని ఆబ్కారీ శాఖ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా షాపుల కోసం పోటీని పెంచేందుకు ఈఎండీని ప్రభుత్వం ఎత్తివేసిందని ఎౖక్సైజ్‌శాఖ అధికారి ఒకరు తెలిపారు. అలాగే, దరఖాస్తు ఫీజును రూ.2 లక్షలకు పెంచేశారు. చివరిసారి కొత్త రంగారెడ్డి జిల్లా పరిధిలో 187 దుకాణాలకు 3,889 దరఖాస్తులు అందాయి. ఆ సమయంలో ఒక్కో దరఖాస్తు ధర రూ.లక్షగా ఉంది. ఈ లెక్కన దరఖాస్తుల ఫీజు రూపంలోనే ఆబ్కారీ శాఖకు రూ.38.89 కోట్ల ఆదాయం సమకూరింది. మేడ్చల్, వికారాబాద్ జిల్లాలు కలుపుకుంటే దాదాపు రూ.90 కోట్లు వచ్చిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 16 వరకు దరఖాస్తుల స్వీకరణ కొత్త దుకాణాలు దక్కించుకునేందుకు ఈనెల 9 నుంచి 16వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 18వ తేదీన డ్రా తీసి షాపులను కేటాయించనున్నట్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిప్యూటీ కమిషనర్ మహ్మద్ యాసిన్ ఖురేషీ తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ కేంద్రాలను ఇంకా ఖరారు చేయలేదన్నారు. ఒకటిరెండు రోజుల్లో ఆ వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. దరఖాస్తులు అన్ని ఎక్సైజ్ పోలీస్స్టేషన్లు, ఈఎస్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయి. అలాగే వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. పాత పాలసీ ప్రకారమే మద్యం దుకాణాల పనివేళల్లో ఎలాంటి మార్పులేదు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు, మిగిలిన ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం షాపులు తెరిచే ఉంటాయి. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి రానుంది. అదే రోజు కొత్త మద్యం దుకాణాలు విక్రయాలు ప్రారంభిస్తాయి. -
సర్కారీ మద్యం దుకాణాలు సిద్ధం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌బీసీఎల్) ఆధ్వర్యంలో అక్టోబరు 1 నుంచి మద్యం దుకాణాలు నిర్వహించనున్నారు. డిస్టలరీలు, బ్రూవరీస్‌లలో తయారైన మద్యాన్ని కొనుగోలు చేసి.. దాన్ని మద్యం దుకాణాల లైసెన్సుదారులకు విక్రయించటానికే ఇప్పటి వరకూ పరిమితమైన ఈ సంస్థ ఇకపై స్వయంగా మద్యం దుకాణాలను నడపనుంది. తొలి అడుగు.. రాష్ట్రంలో దశలవారీ మద్య నిషేధం అమల్లో భాగంగా.. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. నూతన మద్యం విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ నూతన మద్యం విధానాన్ని రూపొందించి అక్టోబరు ఒకటో తేదీ నుంచి అమలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా రెవెన్యూ, ఎక్సైజ్ అధికారులు మద్యం షాపుల అద్దెకు, డిపోల నుంచి మద్యం సరఫరా, ఫర్నీచర్ ఏర్పాటు తదితరాలపై ఆసక్తిదారుల నుంచి టెండర్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా బుధవారం విజయవాడలోని సబ్‌కలెక్టర్ కార్యాలయంలో టెండర్లను జేసీ మాధవీలత ఆధ్వర్యంలో ఖరారు చేశారు. మచిలీపట్నంలో 112 షాపులు ఖరారు.. మచిలీపట్నం ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 117 షాపులకు టెండర్లను ఆహ్వానించారు. బుధవారం ఆయా షాపులకు సంబంధించి 112 మంది దరఖాస్తులను ఖరారు చేశారు. ఉయ్యూరులో 1, కైకలూరులో 3, మువ్వలో 1 షాపునకు వచ్చిన దరఖాస్తులు నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో వాటిని రద్దు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన అద్దెలతో పోలిస్తే కైకలూరులో అతి తక్కువగా 5 వేలు అద్దె ఖరారు అయ్యింది. అత్యధికంగా మచిలీపట్నం పట్టణంలో ఒక షాపునకు రూ. 45 వేలు అద్దె పలికింది. విజయవాడ యూనిట్లో.. విజయవాడ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 126 షాపులకు టెండర్లను ఆహ్వానించగా 116 ఖరారు చేశారు. వీటిలో నందిగామ, పెనుగంచిప్రోలు, గంపలగూడెం ఊటుకూరులో 9 షాపులకు ఎటువంటి అద్దె తీసుకోకుండా ఉచితంగా షాపు యజమానులు ఇవ్వడం విశేషం. ఇందులో నందిగామలో 5 షాపులకు తొలుత 24 మంది దరఖాస్తు చేశారు. ఇందులో ఒక షాపునకు అత్యధికంగా 60 వేలు అద్దెను కోట్ చేశారు. దీంతో జేసీ మాధవీలత, ఎక్సైజ్ అధికారులు వారితో సంప్రదింపులు జరపగా.. చివరకు వారిలో నల్లాని అయ్యన్న, పెద్దినేని చందు, వేలది నరసింహారావు, నల్లాని శ్రీనివాసరావు, వీబీ ప్రతాప్‌లు ఉచితంగా తమ షాపులను అప్పగించేందుకు ముందుకు వచ్చారు. పెనుగంచిప్రోలులో మూడు షాపులకు 16 మంది దరఖాస్తు చేయగా వారిలో ఒక షాపునకు దరఖాస్తుదారుడు అత్యధికంగా రూ. 41 అద్దె కోట్ చేశారు. వీరితోనూ అధికారులు మాట్లాడగా.. చివరకు వీరందరూ ఉచితంగా తమ షాపులను ఇవ్వడానికి ముందుకొచ్చారు. దాంతో లాటరీ పద్ధతి ద్వారా జి.పద్మావతి, ఆర్.దుర్గాప్రసాద్, జి.గోపిచంద్‌లను ఎంపిక చే శారు.గంపలగూడెం, ఊటుకూరులో ఒక షాపునకు రెండు దరఖాస్తులు రాగా.. పసుపులేటి వెంకటేశ్వరరావు ఉచితంగా తన షాపును ఇచ్చారు. ఇక్కడ అత్యధికంగా రూ. 30 అద్దె కోట్ చేశారు. సెప్టెంబరు 1 నుంచి మొదటి దశ ఇటీవల విజయవాడ, మచిలీపట్నం యూనిట్లలో రెన్యువల్ చేసుకోని 59 మద్యం షాపులకు ప్రభుత్వం టెండర్లను ఖరారు చేసింది. వీటిని ప్రభుత్వ ఆధ్వర్యంలో మొదటి దశలో భాగంగా సెప్టెంబరు 1వ తేదీ నుంచి సర్కారే వీటిని నిర్వహించనుంది. ప్రైవేటు మద్యం వ్యాపారులైతే అధికాదాయం కోసం ఎక్కువ సరకు విక్రయించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే గ్రామగ్రామాన మద్యం గొలుసు దుకాణాలూ వెలిసేవి. దీంతో ఎక్కడ కావాలంటే అక్కడ మద్యం లభించి వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ప్రభుత్వమే దుకాణాలు నిర్వహించటం వల్ల గొలుసు దుకాణాలకు అవకాశమే ఉండదు. ఎమ్మార్పీ, సమయపాలన ఉల్లంఘనలు వంటివి తగ్గుతాయి. మద్యం అందుబాటు, లభ్యత తగ్గటం వల్ల కొంతమందైనా ఈ వ్యసనం నుంచి దూరమయ్యేందుకు, కొత్తవారు దీని బారిన పడకుండా ఉండేందుకు ఇవి ఉపయోగపడతాయని ఎక్సైజ్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
సిండి ‘కేటుగాళ్లు’!
సాక్షి, మెదక్: జిల్లాలో మద్యం వ్యాపారులది ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. సిండికేటుగా మారి అధిక ధరలతో విక్రయిస్తున్నా.. బెల్ట్ షాపులకు అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నా.. కృత్రిమ కొరత సృష్టించి బీర్లను వైన్స్ షాపుల నుంచి బార్లకు తరలించి అమ్మకాలు చేస్తున్నా.. వారిని అడిగే నాథుడే కరువయ్యాడు. వాటన్నింటినీ నియంత్రించాల్సిన ఎక్సైజ్ అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంపై అనుమానాలతోపాటు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధనార్జనే ధ్యేయంగా మద్యం వ్యాపారులు కుమ్మక్కయ్యారు. సిండికేట్‌గా మారి అధిక ధరలతో విక్రయాలు చేస్తూ మద్యం ప్రియుల జేబులను కొల్లగొడుతున్నారు. అవినీతికి అలవాటు పడ్డ పలువురు ఎక్సైజ్ శాఖ అధికారులకు డబ్బుల ఎర చూపి.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. డిమాండ్ ఉన్న బీర్లకు సంబంధించి మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి అక్రమంగా బార్లకు తరలిస్తున్నారు. ఇదేక్రమంలో వైన్స్ దుకాణాల్లో మార్జిన్ ఎక్కువ వచ్చే.. డిమాండ్ లేని బీర్లను మద్యం ప్రియులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. అయినా.. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు చోద్యం చూస్తుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పలు వైన్స్లలో అదనంగా వసూళ్లు జిల్లాలోని కొల్చారం మండలంలో ఉన్న చిన్నఘణపూర్‌లో ఒక మద్యం డిపో ఉంది. ఇక్కడి నుంచి మెదక్, సంగారెడ్డి జిల్లాలకు మద్యం సరఫరా అవుతుంది. ఈ డిపో పరిధిలోని రెండు జిల్లాల్లో మొత్తం 99 వైన్స్ దుకాణాలు, 8 బార్లు ఉన్నాయి. ఇందులో మెదక్ జిల్లాకు సంబంధించి 37 వైన్స్ షాపులు, రెండు బార్లు ఉన్నట్లు అధికారిక రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. మెదక్, నర్సాపూర్, తూప్రాన్.. ఇలా ప్రాంతాల వారీగా మద్యం వ్యాపారులు పలువురు సిండికేట్‌గా మారి ఒక్కో బీరు, వైన్, బ్రాందీ, విస్కీ సీసాపై ఎమ్మార్పీ కంటే రూ.5 నుంచి రూ.10 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 1,200కు పైగా ఉన్న బెల్ట్‌షాపులతోపాటు పలు దాబాలకు కూడా అనధికారికంగా మద్యం సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పట్టణంలో రాత్రి 9.30 గంటలకే మూత మెదక్ పట్టణంలో ఐదు వైన్స్ షాపులు.. రెండు బార్లు ఉన్నాయి. వైన్స్ షాపులు ఉదయం పది నుంచి రాత్రి పది గంటల వరకు తెరిచి ఉండాలి. నిర్వాహకులు ఇటీవల రాత్రి 9 నుంచి 9.30 గంటల మధ్యనే క్లోజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మద్యం ప్రియులు తప్పనిసరి పరిస్థితుల్లో బార్లకు వెళ్లక తప్పడం లేదు. బార్ల నిర్వాహకులు ఒక్కో బీర్‌కు అదనంగా రూ.30 వరకు వసూలు చేస్తుండడంతో మద్యం ప్రియుల జేబులు ఖాళీ అవుతున్నాయి. రెండు వైన్స్, రెండు బార్ షాపులు ఒక్కరివే కావడంతో.. మెదక్ పట్టణంలోని ఓ వ్యక్తి రెండు వైన్స్ షాపులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తికి ఇదే ప్రాంతంలో రెండు బార్ షాపులు ఉన్నాయి. బార్ షాపుల్లో అయితే బీరుకు అదనంగా రూ.30 వరకు సమకూరుతుండడం.. స్నాక్స్ ఇతరత్రా వాటికి బిల్లు కూడా వస్తుండడంతో సదరు వ్యక్తి నిర్దేశిత సమయం కంటే వైన్స్ షాపులను గంట, అరగంట ముందే బంద్ చేస్తున్నట్లు సమాచారం. రాత్రి ముందుగానే వైన్స్ దుకాణాలను బంద్ చేస్తే.. మద్యం ప్రియులు తప్పనిసరి పరిస్థితుల్లో బార్ షాపులకు వెళ్తారని ప్లాన్ వేసిన సదరు వ్యక్తి ఇతర వైన్స్ నిర్వాహకులతో కలిసి సిండికేట్ అయినట్లు మద్యం ప్రియుల ద్వారా తెలిసింది. వైన్స్‌లో మార్జిన్ బీర్ల అమ్మకాలకే మొగ్గు ఎండాకాలం బీర్ల కొరత పేరిట సదరు వైన్స్ దుకాణాల నిర్వాహకుడు కొత్త ఎత్తుగడకు తెరలేపాడు. ఎక్కువ మార్జిన్ వచ్చే డిమాండ్ లేని బీర్లను మద్యం ప్రియులకు అంటగడుతున్నారు. ఇదే సమయంలో ఎక్కువ డిమాండ్ ఉన్న బీర్లను తన బార్ షాపులకు తరలిస్తున్నట్లు సమాచారం. రాత్రి పది గంటలకు మూసివేయాల్సిన వైన్స్ షాపులను తొందరగా బంద్ చేసి.. మద్యం ప్రియులు బార్ షాపులకు వెళ్లేలా చూస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు వైన్స్‌లు నిర్దేశిత సమయం కంటే ముందుగానే బంద్ చేస్తున్నా.. పలు వైన్స్ దుకాణాల్లో ఎమ్మార్పీ కంటే అదనంగా వసూలు చేస్తున్నా ఎక్సైజ్ అధికారులు గానీ.. పోలీసులు గానీ పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెలనెలా పలువురు అధికారులు, సిబ్బందికి మామూళ్లు అందుతుండడంతో వారు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చర్యలు తీసుకుంటాం ఎమ్మార్పీకి మించి విక్రయిస్తున్నారని ఫిర్యాదులు అందడంతో నర్సాపూర్ ప్రాంతంలో పలు షాపులపై కేసులు నమోదు చేశాం. మెదక్ టౌన్ పరిధిలో నిర్దేశిత సమయం కంటే వైన్స్‌లను ముందుగానే బంద్ చేస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్‌రెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ బార్‌కు వెళ్తే జేబు గుల్ల ఇటీవల ఓ ప్రాంతానికి టూర్ వెళ్లి వచ్చాను. ఫ్రెండ్స్ పార్టీ అంటే.. వారితో కలిసి మెదక్ పట్టణంలోని వైన్స్ షాపునకు వచ్చా. రాత్రి తొమ్మిదిన్నర కూడా కాలేదు. వైన్స్ షాప్ బంద్ ఉంది. ఇంకో దుకాణానికి వెళ్లా. అదీ మూసి ఉంది. ఇలా అన్ని వైన్స్ షాపులు మూసి ఉండడంతో తప్పనిసరి పరిస్థితిలో బార్‌కు వెళ్లాల్సి వచ్చింది. బిల్లు చూస్తే గుండె పోటు వచ్చినట్లయింది. జేబు గుల్ల అయింది. వైన్స్‌లో తీసుకుంటే సగం పైసలు కూడా కావు. – సురేష్, మెదక్ -
కేసీఆర్ ప్రధాని కావాలని మొక్కుకున్నా..
-
కేసీఆర్ ప్రధాని కావాలని మొక్కుకున్నా..
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో నమ్మకంతో తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆదివారం ఉదయం ఆయన సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... ’దేశంలోని అన్ని రాష్ట్రాల రాజకీయ పార్టీల నేతలు తెలంగాణలో అమలు అవుతున్న పథకాలను అమలు చేస్తామని చెబుతున్నారు. కేసీఆర్ ప్రధాని అయితే దేశం రూపురేఖలు మారుతాయి. కేసీఆర్ ప్రధానమంత్రి కావాలని తిరుపతిలో మొక్కుకున్నా. రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్లో ఆయనదే ముఖ్యపాత్ర. సార్వత్రిక ఎన్నికల్లో 16 పార్లమెంట్ సీట్లు గెలుచుకుంటే మరింత బలం చేకూరుతుంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఒక సైనికుడిగా పనిచేస్తా. ఆబ్కారీ శాఖను నాకు అప్పజెప్పినందుకు నా బాధ్యత పెరిగింది. రాష్ట్రానికి ఆదాయం తెచ్చే ఆబ్కారీ శాఖను నాకు ఇచ్చిన కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయను. తెలంగాణ రాష్ట్రంలో అధికారులు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. ప్రతి ఒక్క శాఖపై పట్టు పెంచుకుని ముందుకు వెళతా. ఇప్పటికే రాష్ట్రంలో అక్రమ మద్యమ రవాణాకు అడ్డుకట్ట వేశాం. రాష్ట్ర ఆదాయం పెంచేందుకు మరింత కష్టపడి పనిచేస్తా. అలాగే గుడుంబాని నిషేధించడంతో దాన్ని తయారు చేస్తున్నవారికి ఉపాధి కూడా కల్పిస్తాం. కల్లును ఆల్కహాల్‌గా కాకుండా మంచి పానీయంగా చూడాలి. గతంలో నిరాను ఉత్పత్తి చేసేవారు. అయితే మరిన్న చెట్లను పెంచి నిరా ఉత్పత్తిని పెంచుతాం. -
అధికార పార్టీ నేతలకు భయపడున్నా: ఎక్సైజ్ సీఐలు
కర్నూలు: ‘బెల్టు దుకాణాలపై దాడులు చేసి పట్టుబడిన మద్యం ఏ షాపు నుంచి వచ్చిందో నిర్ధారించుకుని కేసులు నమోదు చేసి సస్పెండ్ చేస్తే అధికార పార్టీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. ఈ కారణంగానే బెల్టు దుకాణాలను నిర్మూలించలేకపోతున్నాం’ అంటూ కర్నూలు, అనంతపురం జిల్లాల ఎక్సైజ్ సీఐలు డిప్యూటీ కమిషనర్ శ్రీరాములు దృష్టికి తెచ్చారు. కలెక్టరేట్లోని డ్వామా కాన్ఫరెన్స్ హాల్లో గురువారం కర్నూలు, అనంతపురం జిల్లాల ఎక్సైజ్ సీఐలతో డిప్యూటీ కమిషనర్ సమావేశమయ్యారు. ఈసందర్భంగా సీఐలు ఆయన దృష్టికి పలు విషయాలు తెచ్చారు. కర్నూలు జిల్లాలో 4, అనంతపురం జిల్లాలో 6 మద్యం షాపులను సస్పెండ్ చేస్తే కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారని, దీనివల్ల తాము పడుతున్న కష్టం వృథా అవుతోందని సంబంధిత సీఐలు డీసీకి వివరించారు. లక్ష్యాలకు తగ్గకుండా అమ్మకాలు జరపాలన్న ఒత్తిడి వల్ల కూడా వ్యాపారులు బెల్టు షాపులకు మద్యం సరఫరా చేస్తున్నారని, బెల్టు దుకాణ నిర్మూలనకు గ్రామాల్లో రెవెన్యూ అధికారులు సహకరించడం లేదని, మద్యం వ్యాపారులు బార్ కోడ్‌లో డేటాను నిల్వ చేయకుండా తారుమారు చేయడం వల్ల సరైన ఆధారాలు లభించడం లేదని, సకాలంలో సీఐల బదిలీలు చేపట్టకపోవడం వల్ల వ్యాపారులతో సంబంధాలు పెరిగి చర్యలకు వెనుకాడాల్సి వస్తోందని సీఐలు డీసీ దృష్టికి తీసుకువచ్చారు. ఇంటెలిజెన్స్ తరహాలో బెల్టు షాపుల నిర్మూలనకు ఎక్సైజ్ శాఖలో కూడా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని మరికొంతమంది అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయి అధికారుల నుంచి సేకరించిన అభిప్రాయాలను ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు డిప్యూటీ కమిషనర్ తెలిపారు. సమావేశంలో స్టేట్ టాస్క్‌ఫోర్స్ సీఐ శ్యామ్సుందర్తో పాటు కర్నూలు, నంద్యాల ఏఈఎస్‌లు సుధాకర్, హెప్సీబారాణి పాల్గొన్నారు. -
ఎక్సైజ్‌కు మరింత కిక్
బార్ నూతన పాలసీతో జిల్లాలో రూ.15 కోట్లకు పైగా పెరగనున్న ఆదాయం నగరాల్లో రూ.9 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలు పెంపు బార్ హాల్ విస్తీర్ణం 200 చదరపు అడుగులు తప్పనిసరి వచ్చే నెల 1 నుంచి కొత్త పాలసీ అమల్లోకి.. విజయవాడ : జిల్లాలో నూతన బార్ లెసైన్స్ పాలసీ వచ్చే నెల ఒకటి నుంచి అమల్లోకి రానుంది. ప్రధానంగా లెసైన్స్ ఫీజు పెంపు, ఒకటి రెండు కొత్త నిబంధనలు మినహా పాత పాలసీనే యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు. దీంతో జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖకు భారీగా ఆదాయం పెరగనుంది. ఇప్పటికే బార్ల లెసైన్స్‌ల రెన్యూవల్స్ ప్రకియ జిల్లాలో మొదలైంది. కొత్త పాలసీతో జిల్లాలో రూ.15 కోట్లకు పైగా ఆదనపు ఆదాయం లభించనుంది. జిల్లాలో మొత్తం 167 బార్లు ఉన్నాయి. వీటిలో విజయవాడ నగరంలోనే అత్యధికంగా 98 ఉన్నాయి. నూతన పాలసీలో అనేక కొత్త నిబంధనలు ఉంటాయని దీంతో జిల్లాలో బార్ల సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు భావించారు. అలాగే ప్రతి బార్‌కు పార్కింగ్ నిబంధన తప్పనిసరి చేయాలని తొలుత భావించారు. ఈ నిబంధన అమల్లోకి వస్తే జిల్లాలో దాదాపు 50 శాతం బార్లకు పార్కింగ్ వసతి లేదు. దీంతో అనేక బార్లు మాతపడి ఆదాయానికి గండి పడుతుందన్న భావనతో దీని జోలికి వెళ్లలేదు. పాత నిబంధనలు కొద్దిగా మార్చి యథాతథంగా అమలుచేసి లెసైన్స్ రెన్యూవల్స్ ప్రకియ మొదలుపెట్టారు. జిల్లా అధికారులతో సంబంధం లేకుండా నేరుగా లెసైన్స్‌దారులు హైదరాబాద్‌లోని ఎక్సైజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో లెసైన్స్ రెన్యూవల్‌కు సంబంధిత ఫీజు చెల్లిస్తే రెన్యూవల్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అమల్లో ఉన్న బార్ల పాలసీ ప్రకారం నగరంలోని బార్లకు ఏడాదికి రూ.41 లక్షలు, పట్టణాల్లోని బార్లకు రూ.38 లక్షలు వార్షిక ఫీజు ఉండేది. కొత్త పాలసీ ప్రకారం నగరపాలక సంస్థ పరిధిలో అయితే రూ.50 లక్షలు, మున్సిపాలిటీల్లో రూ.40 లక్షలుగా నిర్ణయించారు. గత పాలసీ ప్రకారం ఏటా రూ.65.75 కోట్లు లెసైన్స్ రెన్యూవల్స్ ద్వారా వచ్చేది. కొత్త పాలసీ ప్రకారం 80.16 కోట్లు ఆదాయం రానుంది. పెరిగిన రూ.15 కోట్ల ఆదాయంలో నగరంలోని బార్ల ద్వారానే రూ.10 కోట్లు అదనపు ఆదాయం సమకూరనుంది. మిగిలిన రూ.5 కోట్లు మున్సిపాలిటీల్లోని బార్ల ద్వారా రానుంది. 200 చదరపు అడుగులు తప్పనిసరి.. ఇకపై ప్రతి బార్ హాల్ విస్తీర్ణం తప్పనిసరిగా 200 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండాలి. గతంలో ఈ నిబంధన లేకపోవడంతో అనేక ప్రాంతాల్లో బార్ లెసైన్సులు తీసుకుని స్పీడ్ బార్ పేరుతో, బార్ అండ్ రెస్టారెంట్ పేరుతో వైన్ షాపు తరహా వ్యాపారం నిర్వహించేవారు. బార్లలో సమగ్రంగా సిట్టింగ్ హాల్స్, ఏసీ హాల్స్ లేవు. ఈ క్రమంలో బార్లలో సౌకర్యాలు మెరగుపర్చేందుకు దీన్ని అమల్లోకి తెచ్చారు. నగరంలోని బార్ల లెసైన్స్‌లు రెన్యూవల్స్ చేసే సమయంలో క్షుణ్ణంగా పరిశీలించాలని అధికార యంత్రాగం నిర్ణయించింది. లెసైన్స్ రెన్యూవల్స్‌కు కమిషనరేట్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకున్న బార్లను కొద్ది రోజుల్లో పరిశీలించనున్నారు. బకాయిల బండ కదిలింది ఎక్సైజ్ లెసైన్స్ కోసం యూజర్ చార్జీల చెల్లింపు విజయవాడ సెంట్రల్ : ఎక్సైజ్ నిబంధనలతో నగరపాలక సంస్థకు మొండి బకాయిలు వసూలవుతున్నాయి. జనవరి ఒకటో తేదీ నుంచి మద్యం షాపులకు కొత్తగా లెసైన్స్‌లు మంజూరు చేయనున్న నేపథ్యంలో బకాయిలు ఏమీ ఉండకూడదన్న నిబంధనల్ని ప్రభుత్వం విధించింది. ఈ క్రమంలో బార్ల నిర్వాహకులు నగరపాలక సంస్థకు యూజర్ చార్జీలు చెల్లించేందుకు క్యూకట్టారు. రెండు రోజుల్లో రూ.50 లక్షలకు పైగా బకాయిలు వసూలైనట్లు సమాచారం. మొత్తం 130 బార్ల నుంచి రూ.1.40 కోట్ల మేర యూజర్ చార్జీలు పెండింగ్ ఉన్నాయి. ఏ విధమైన పాత బకాయి ఉన్నా లెసైన్స్ ఇచ్చే ప్రసక్తి లేదని ప్రభుత్వం మెలిక పెట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బార్ల నిర్వాహకులు బకాయిలను క్లియర్ చేస్తున్నారు. -
‘మామూలు’ కోసం ‘వల’లో చిక్కారు
కాకినాడ క్రైం :మద్యం ద్వారా వచ్చే ఆదాయంపై సర్కారుకు ఎంత మక్కువో.. అంతే మక్కువ మామూళ్ల ద్వారా వచ్చే రాబడిపై ఆ శాఖలో అనేకమంది అధికారులకు ఉంటుంది. పేరుకు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ అయినా..నిబంధనలను పాతరేసైనా మద్య విక్రయాల జాతర రాత్రింబవళ్లు జరగాలని, వాడకొకటిగా బెల్టుషాపులు వర్ధిల్లాలని అలాంటి వారు కోరుకుంటారు. అప్పుడే తమకు వచ్చే పైడబ్బులు ఇబ్బడిముబ్బడి అవుతాయనుకుంటారు. అందుకోసం మద్యం షాపుల వారిని వేధిస్తారన్నది బహిరంగ రహస్యమే. అలా లంచం గుంజాలనుకున్న కాకినాడ నార్త్ స్టేషన్ సీఐ వి.శివరామరాజు బుధవారం అవినీతి నిరోధకశాఖ వలలో చిక్కుకున్నారు. కాగా సీఐ శివరామరాజు తమను మామూళ్ల కోసం విపరీతంగా సతాయించే వారని ఆయన పరిధిలోని మద్యం వ్యాపారులు ఆరోపిస్తున్నారు. రెండు రోజుల క్రితం కాకినాడ పద్మప్రియ థియేటర్ రోడ్‌లోని శ్రీ సూర్య లిక్కర్ వరల్డ్‌కు వెళ్లి లెసైన్స్ ఫీజు నిమిత్తం రూ.60 వేలు, తనకు నెలవారీ మామూలుగా రూ.40 వేలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. షాపు యజమాని చిక్కాల సుబ్రహ్మణ్యేశ్వరరావు రూ.లక్ష ఇవ్వలేనని, రూ.80 వేలు ఇచ్చేందుకు బేరం కుదుర్చుకున్నారు. అనంతరం అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన సుబ్రహ్మణ్యేశ్వరరావు వారి సూచన మేరకు బుధవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో వారిచ్చిన రూ.80 వేలు తీసుకుని పైడా వారి వీధిలోని ఎక్సైజ్ నార్త్ స్టేషన్‌కు వెళ్లారు. ఆయన నుంచి ఆ మొత్తాన్ని తీసుకున్న హెడ్ కానిస్టేబుల్ కరెడ్ల శ్రీరామచంద్రరావు దాన్ని ఎస్సై డి.దామోదర్‌కు అప్పగించా రు. ఎస్సై సీఐ కార్యాలయంలోకి వెళ్లి ఙఆ మొత్తాన్ని సీఐ శివరామరాజుకు అందిస్తుండగా మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సీఐ శివరామరాజుతో పాటు హెచ్‌సీ, ఎస్సైలను అదుపులోకి తీసుకున్నారు. వారిని అరెస్టు చేసి, విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలించనున్నట్టు ఏసీబీ డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు తెలిపారు. కార్యాలయంలోని ఫైళ్లతో పాటు శివరామరాజుకు చెందిన ఇతర వ్యవహారాలపై కూడా దర్యాప్తు కొనసాగిస్తామన్నారు. ఏసీబీ సీఐ రాజశేఖర్, సిబ్బంది దాడిలో పాల్గొన్నారు. ఎక్సైజ్ శాఖలో గుబులు కాగా నార్త్ స్టేషన్ సీఐ శివరామరాజు ఏసీబీకి పట్టుబడడంతో ఎక్సైజ్ శాఖలో గుబులు రేగింది. ఈ శాఖపై అనేక అవినీతి ఆరోపణలున్నా బాధితులు ఇంతవరకూ ఏసీబీ అధికారుల ఆశ్రయించలేదు. ఇప్పుడు సీఐ స్థాయి అధికారి ఏసీబీకి పట్టుబడ డం అటు ఎక్సైజ్ శాఖలో, ఇటు మద్యం వ్యాపారుల్లో చర్చనీయాంశమైంది. ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది మద్యం షాపుల నిర్వాహకుల నుంచి నెల నెలా పెద్ద మొత్తంలో సొమ్ములు దండుకుంటూ.. మద్యం అధికధరలకు అమ్మినా, యథేచ్ఛగా బెల్టుషాపులు నడిపినా పట్టించుకోరని, నాటుసారా తయారీ, అమ్మకందారుల నుంచి కూడా నెలవారీ మామూళ్లు గుంజుతారనే విమర్శలు ఎప్పుడూ ఉన్నవే. జిల్లాలో బెల్టుషాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నా నెలకు మండలానికి ఒక బెల్టుషాపుపై కేసు నమోదు చేసి చేతులు దులుపుకొనేలా ఎక్సైజ్ అధికారులకు, మద్యం సిండికేటుకు లోపాయకారీ ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. ఏసీబీ నిశితంగా దృష్టి సారిస్తే ఎక్సైజ్ శాఖలో దొరికే అవినీతిపరులకు కొదవ లేదని పలువురు అంటున్నారు. -
మత్తులో చిత్తు... కిక్కే కిక్కు
అనంతపురం క్రైం, న్యూస్‌లైన్ : ‘అనంత’లో విచ్చలవిడి మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. కర్ణాటక నుంచి తక్కువ ధరకు దొరికే మద్యం తెప్పించి అధిక ధరలకు విక్రయిస్తూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ధనార్జనే ధ్యేయంగా పెట్టుకున్న కొందరు మద్యం కల్తీ చేస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. లెసైన్‌స దుకాణాల సంఖ్య వందల్లో ఉంటే బెల్టుషాపులు వేలల్లో ఉన్నాయి. పేద, మధ్యతరగతి వర్గాల వారు మద్యం మత్తులో పడి కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. యువత సైతం పెడదోవపడుతోంది. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు. జిల్లా వ్యాప్తంగా అధికారికంగా 234 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటికి తోడుగా 6300 బెల్ట్‌షాపులు ఉన్నట్లు ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ వర్గాలు గుర్తించాయి. ప్రతి పల్లెకూ నాలుగు బెల్ట్‌షాపులున్నట్లు తెలుస్తోంది. మేజర్ పంచాయతీ పరిధిలోని ఒక్కో బెల్ట్‌షాపులో రోజుకు రూ.70 వేల నుంచి రూ.80 వేల మద్యం వ్యాపారం జరుగుతోంది. నూతన ఎక్సైజ్ పాలసీ ప్రకారం లెసైన్‌స దుకాణానికి అనుబంధంగా రూ.2 లక్షలు ఎక్సైజ్ శాఖకు చెల్లించి షెడ్ ఏర్పాటు చేసుకుని.. అక్కడ నిల్చొని మద్యం తాగి వెళ్లేందుకు అవకాశం కల్పించారు. అయితే సదరు దుకాణాదారులు నిబంధనలకు విరుద్ధంగా సిట్టింగ్ ఏర్పాట్లు చేసి.. మంచింగ్‌కు సంబంధించిన తినుబండారాలు, శీతల పానీయాలను అందుబాటులో ఉంచి.. బార్లను మరిపిస్తున్నారు. అనంతపురంలో అయితే కొంతమంది వ్యాపారులు మద్యం దుకాణాలకు అనుబంధంగా ఏకంగా హోటళ్లనే నడుపుతున్నారు. అయినా ఎక్సైజ్ అధికారులు ఇవేవీ పట్టించుకోవడం లేదు. భారీగా కర్ణాటక మద్యం దిగుమతి కర్ణాటక మద్యం జిల్లాకు భారీగా దిగుమతి అవుతోంది. నెలలో రెండు మూడు సార్లు తెప్పిస్తున్నట్లు తెలిసింది. సగటున నెలకు రూ.30 కోట్ల మేర కర్ణాటక మద్యం దిగుమతి అవుతోంది. సర్కారీ మద్యం రోజుకు రూ.2 కోట్ల అమ్మకాలు జరుగుతుండగా.. కర్ణాటక మద్యం రూ.కోటి వరకు విక్రయిస్తున్నారు. గార్లదిన్నెలో ఇద్దరు లెసైన్సీదారులే తమ దుకాణాల్లో కర్ణాటక మద్యం అమ్ముతూ పట్టుబడ్డారు. ఎక్సైజ్ శాఖలోని కొందరు అధికారుల అండదండలతోనే కర్ణాటక మద్యాన్ని యథేచ్ఛగా దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిసింది.