ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో నమ్మకంతో తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆదివారం ఉదయం ఆయన సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... ’దేశంలోని అన్ని రాష్ట్రాల రాజకీయ పార్టీల నేతలు తెలంగాణలో అమలు అవుతున్న పథకాలను అమలు చేస్తామని చెబుతున్నారు. కేసీఆర్ ప్రధాని అయితే దేశం రూపురేఖలు మారుతాయి.