Competition Commission of India (CCI)
-
Play Store pricing policy: గూగుల్‌కు సీసీఐ షాక్
న్యూఢిల్లీ: ప్లే స్టోర్ ధరల విధానం విషయంలో పోటీ వ్యతిరేక పద్ధతులను పాటిస్తోందన్న ఆరోపణలపై గూగుల్‌పై విచారణకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) శుక్రవారం ఆదేశించింది. గూగుల్ అనుసరిస్తున్న చెల్లింపు విధానాలు యాప్ డెవలపర్స్, పేమెంట్ ప్రాసెసర్స్, వినియోగదారులతో సహా అనేక మంది వాటాదారులపై ప్రభావం చూపుతున్నాయని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఆధిపత్య స్థానం దురి్వనియోగానికి సంబంధించిన పోటీ చట్టంలోని సెక్షన్ 4ను గూగుల్ ఉల్లంఘించిందని సీసీఐ ప్రాథమికంగా గుర్తించింది. పీపుల్ ఇంటెరాక్టివ్ ఇండియా (షాదీ.కామ్), మీబిగో ల్యాబ్స్ (కుకు ఎఫ్ఎం), ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్, డిజిటల్ ఫౌండేషన్ (ఐబీడీఎఫ్), ఇండియన్ డిజిటల్ మీడియా ఇండస్ట్రీ ఫౌండేషన్ (ఐడీఎంఐఎఫ్) ఫిర్యాదు మేరకు సీసీఐ తాజా ఆదేశాలు వెలువరించింది. గూగుల్ తన ప్లే స్టోర్ నుండి కొన్ని యాప్స్‌ను తీసివేసిన రెండు వారాల లోపే ఈ ఉత్తర్వులు రావడం గమనార్హం. సరీ్వస్ ఫీజు చెల్లింపులపై వివాదం కారణంగా మార్చి 1న భారత్‌లోని ప్లే స్టోర్ నుండి కొన్ని యాప్స్‌ను గూగుల్ తొలగించింది. ఈ విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడంతో కొన్ని రోజుల్లోనే యాప్స్‌ను తిరిగి పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. -
ఎయిరిండియా-విస్తారా విలీనానికి గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా-విస్తారా విలీనబాటలో కీలక అడుగు పడింది. కొన్ని షరతులకు లోబడి ఎయిర్ ఇండియా–విస్తారా ప్రతిపాదిత విలీనాన్ని కాంపిటీషన్ కమిషన్ శుక్రవారం ఆమోదించింది. తన విమానయాన వ్యాపారాన్ని ఒకే గొడుగు కిందకు తీసుకురావడానికి సంబంధించి టాటా గ్రూప్‌కు ఇది ఒక ప్రధాన ముందడుగు. ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’ పై చేసిన ఒక పోస్టింగ్‌లో విలీనానికి ఆమోదముద్ర వేసినట్లు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తెలిపింది. (ఉద్యోగులకు బంపర్ ఆఫర్: రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన) ‘‘ఎయిరిండియాలో టాటా ఎస్ఐఏ ఎయిర్‌లైన్స్ విలీనానికి సీసీఐ ఆమోదం తెలిపింది. పారీ్టలు అందించే స్వచ్ఛంద కట్టుబాట్లకు, విధి విధానాలకు లోబడి ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ నిర్దిష్ట వాటాలను కొనుగోలు చేస్తుంది‘ అని సీసీఐ పేర్కొంది. విస్తారా, ఎయిర్ ఇండియా టాటా గ్రూప్‌లో భాగంగా ఉన్న రెండు వేర్వేరు విమానయాన సంస్థలు. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు విస్తారాలో 49% వాటా ఉంటే, టాటా సన్స్ వాటా 51%గా ఉంది. ఎయిరిండియా లో 25.1% వాటాను సింగపూర్ ఎయిర్‌లైన్స్ కొను గోలు చేయనున్న ఒప్పందం ప్రకారం విస్తారాను ఎయిర్ ఇండియాతో విలీనం చేస్తున్నట్లు గతేడాది నవంబర్‌లో టాటా గ్రూప్ ప్రకటించింది. -
ఎయిరిండియా, విస్తారా విలీనంపై ముందడుగు
న్యూఢిల్లీ: ఫుల్ సర్వీస్ విమానయాన సంస్థలైన ఎయిరిండియా, విస్తారాలను విలీనం చేసేందుకు అనుమతుల కోసం కాంపిటీషన్ కమిషన్ ఇండియా (సీసీఐ)కి టాటా గ్రూప్ దరఖాస్తు చేసుకుంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్ (ఎస్ఐఏ), టాటా సన్స్ (టీఎస్పీఎల్) జాయింట్ వెంచర్ కంపెనీ అయిన టాటా సియా ఎయిర్‌లైన్స్ (టీఎస్‌ఏఎల్).. విస్తారా బ్రాండ్ కింద విమానయాన కార్యకలాపాలు సాగిస్తోంది. టీఎస్‌ఏఎల్‌లో టీఎస్‌పీఎల్‌కు 51 శాతం, ఎస్‌ఐఏకి 49 శాతం వాటాలు ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం ఎయిరిండియాను కొనుగోలు చేసిన టాటా గ్రూప్.. తమకు వాటాలు ఉన్న విస్తారాను కూడా అందులో విలీనం చేయాలని యోచిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిపాదిత డీల్ ప్రకారం విలీనానంతరం ఎయిరిండియా, దాని అనుబంధ సంస్థల్లో టీఎస్‌పీఎల్‌కు 51 శాతం, ఎస్‌ఐఏకి 25.1 శాతం వాటాలు ఉంటాయి. అటు ఏఐఎక్స్ కనెక్ట్ (గతంలో ఎయిర్ఏషియా ఇండియా)ను ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో విలీనం చేసే ప్రక్రియ 2023 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అక్టోబర్ గణాంకాల ప్రకారం ఎయిరిండియా, విస్తారా మార్కెట్ వాటా 18.3 శాతంగా (రెండింటిదీ కలిపి) ఉంది. ఏఐఎక్స్ కనెక్ట్ కూడా కలిస్తే దేశీయంగా టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్‌లైన్స్ మొత్తం మార్కెట్ 25.9 శాతానికి పెరుగుతుంది. తద్వారా ఎయిరిండియా భారత్‌లో అతి పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌గాను, దేశీ రూట్ల విషయానికొస్తే రెండో పెద్ద విమానయాన సంస్థ గాను నిలుస్తుంది. -
జీఐఎల్, ఏడీపీ డీల్‌కు సీసీఐ ఆమోదం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (జీఐఎల్), ఏరోపోర్ట్స్ డి ప్యారిస్ (ఏడీపీ) ప్రతిపాదిత ఒప్పందానికి కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) ఆమోదముద్ర వేసింది. ఈ డీల్ ప్రకారం జీఐఎల్ జారీ చేసే విదేశీ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్లను ఏడీపీ కొనుగోలు చేయనుంది. అటు జీఐఎల్‌లో జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్(జీఏఎల్) , జీఎంఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ (జీఐడీఎల్) విలీ న ప్రతిపాదనకు కూడా సీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫ్రాన్స్ ప్రభుత్వ నిర్వహణలోని ఏడీపీ అంతర్జాతీయంగా ఎయిర్పోర్ట్ ఆపరేటరుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. లిస్టెడ్ కంపెనీ అయిన జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్.. తన అనుబంధ సంస్థ జీఏఎల్ ద్వారా విమానాశ్ర యాల నిర్వహణ తదితర కార్యకలాపాలు సాగిస్తోంది. జీఐఎల్‌కు జీఐడీఎల్ అనుబంధ సంస్థ. -
గూగుల్‌ది ఆధిపత్య దుర్వినియోగమే
న్యూఢిల్లీ: టెక్ సంస్థ గూగుల్ .. డిజిటల్ డేటాపరమైన పెత్తనం సాగిస్తోందని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆరోపించింది. కంపెనీ తన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందని స్పష్టం చేసింది. గూగుల్‌పై జరిమానా విధించిన కేసుకు సంబంధించి నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)లో సీసీఐ ఈ మేరకు తన వాదనలు వినిపించింది. భారీగా ఆదాయం తెచ్చిపెడుతున్న సెర్చి ఇంజిన్‌ను గూగుల్ ఒక ’కోట’లాగా మార్చుకుందని, దానికి రక్షణగా చిన్న చితకా యాప్‌లను ఒక ’అగడ్త’లాగా ఉపయోగించుకుంటోందని పేర్కొంది. సెర్చి ఇంజిన్ ద్వారా సేకరించే డేటాను తన గుప్పిట్లో ఉంచుకుని ఇతరత్రా పోటీ సంస్థలపై ఆధిపత్యం చలాయిస్తోందని సీసీఐ తెలిపింది. డేటా సేకరణ, డేటా వినియోగాన్ని దుర్వినియోగం చేసి, ప్రకటనలపరమైన ఆదాయార్జన కోసం వాడుకుంటోందని పేర్కొంది. ప్రత్యామ్నాయం ఉండాలనేది సీసీఐ సూత్రం కాగా .. గూగుల్ పెత్తనం వల్ల ప్రత్యామ్నాయం, పోటీ లేకుండా పోతోందని ఆరోపించింది. ఇలాంటి ధోరణులను అరికట్టేందుకు సీసీఐ జారీ చేసిన ఆదేశాలను అమలు చేయడం వల్ల మార్కెట్లో సంస్థలన్నింటికీ మరింత స్వేచ్ఛగా పోటీపడేందుకు అవకాశం లభించగలదని పేర్కొంది. ఆండ్రాయిడ్ మొబైల్ పరికరాల్లో పోటీని దెబ్బతీసే విధానాలు పాటిస్తోందంటూ గూగుల్‌కు సీసీఐ గతేడాది అక్టోబర్ 20న రూ. 1,338 కోట్ల జరిమానా విధించింది. దీన్ని ఎన్సీఎల్ఏటీలో గూగుల్ సవాలు చేసింది. మార్చి 31లోగా దీన్ని తేల్చాలంటూ సుప్రీం కోర్టు ఆదేశించడంతో ఫిబ్రవరి 15 నుంచి ఎన్సీఎల్ఏటీ విచారణ ప్రారంభించింది. -
ఎయిరిండియాకు అపార అవకాశాలు
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ విమానయాన దిగ్గజం ఎయిరిండియాకు అపార అవకాశాలున్నట్లు కంపెనీ సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ తాజాగా పేర్కొన్నారు. వెరసి ఎయిరిండియా గ్రూప్‌ను అంతర్జాతీయ దిగ్గజంగా రూపుదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు. ఈ బాటలో విస్తారాను కంపెనీతో అనుసంధానించే ప్రక్రియ జరుగుతున్నట్లు విలేకరుల వర్చువల్ సమావేశంలో వెల్లడించారు. ప్రస్తుతం కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) అనుమతి కోసం వేచిచూస్తున్నట్లు తెలియజేశారు. ఇదేవిధంగా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఏఐఎక్స్ కనెక్ట్(ఎయిరేషియా ఇండియా)లను సైతం కంపెనీలో విలీనం చేసే కార్యాచరణకు ఇప్పటికే తెరతీసినట్లు తెలియజేశారు. ఎయిరిండియా గతంలో ఎన్నడూచూడని భారీ వృద్ధిని అందుకోనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఈ నెల 14న ఎయిరిండియా 70 వైడ్‌బాడీ మోడల్సహా 470 విమానాల కొనుగోలుకి ఆర్డర్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు నిధులను వివిధ మార్గాల ద్వారా సమీకరించనున్నట్లు విల్సన్ తెలియజేశారు. వీటిలో ఎయిర్‌బస్ నుంచి 250, బోయింగ్ నుంచి 220 విమానాలను పొందనుంది. ఎయిరిండియాను గతేడాది జనవరిలో టాటా గ్రూప్ సొంతం చేసుకున్న విషయం విదితమే. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మరో 370 విమానాలను కొనుగోలు చేసే ప్రణాళికలున్నట్లు వెల్లడించారు. -
సీసీఐ జరిమానాలపై తదుపరి చర్యలు పరిశీలిస్తున్నాం: గూగుల్
న్యూఢిల్లీ: ఆధిపత్య దుర్వినియోగ ఆరోపణలకు సంబంధించి కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) విధించిన జరిమానాలపై తీసుకోతగిన తదుపరి చర్యలను పరిశీలిస్తున్నామని టెక్ దిగ్గజం గూగుల్ వెల్లడించింది. యూజర్లు, డెవలపర్లకు సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. ఆండ్రాయిడ్, గూగుల్ ప్లే స్టోర్‌కి సంబంధించి తాము అందిస్తున్న టెక్నాలజీ, భద్రత మొదలైనవి భారతీయ యాప్ డెవలపర్లకు ప్రయోజనకరంగా ఉంటున్నాయని తెలిపింది. సీసీఐ పెనాల్టీ విధించడమనేది భారత వినియోగదారులు, వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించింది. సీసీఐ ఆదేశాలపై నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)లో గూగుల్ అప్పీలు చేసుకునేందుకు అవకాశం ఉంది. వారం రోజుల వ్యవధిలో రెండు కేసుల్లో గూగుల్‌కు సీసీఐ దాదాపు రూ. 2,274 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు సంబంధించి అసమంజస నిబంధనల విషయంలో రూ. 1,338 కోట్లు పెనాల్టీ కట్టాలంటూ గత వారంలో ఆదేశించింది. యాప్ డెవలపర్లు ప్లే స్టోర్‌లో థర్డ్ పార్టీ బిల్లింగ్‌ను ఉపయోగించుకోనివ్వకుండా చేస్తోందన్న ఆరోపణలపై ఈ మంగళవారం మరో రూ. 936 కోట్ల జరిమానా విధించింది. ఇవి కాకుండా దేశీయంగా న్యూస్ కంటెంట్, స్మార్ట్ టీవీ మార్కెట్లో అసమంజస వ్యాపార విధానాలు పాటిస్తోందన్న ఆరోపణలకు సంబంధించి గూగుల్ మరో విచారణ ఎదుర్కొంటోంది. -
Zee-Sony merger: మూడు ఛానెళ్లు అమ్మకానికి..
న్యూఢిల్లీ: ప్రతిపాదిత మెగా విలీన ప్రతిపాదనకు సంబంధించి మూడు చానెళ్ల విక్రయంపై సీసీఐ విధించిన నిబంధనలకు మీడియా గ్రూప్‌లు సోనీ, జీ అంగీకరించాయి. హిందీ చానెళ్లయిన బిగ్ మ్యాజిక్, జీ యాక్షన్, జీ క్లాసిక్‌లను విక్రయించేలా విలీన ఒప్పందానికి స్వచ్ఛందంగా మార్పులు చేస్తూ కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ)కి ప్రతిపాదన సమర్పించాయి. బుధవారం విడుదల చేసిన 58 పేజీల ఉత్తర్వుల్లో సీసీఐ ఈ విషయాన్ని వెల్లడించింది. వివరాల్లోకి వెడితే.. సీఎంఈ (గతంలో సోనీ పిక్చర్స్ – ఎస్పీఎన్ఐ)లో జీ ఎంటర్టైన్మెంట్ (జీల్), బంగ్లా ఎంటర్టైన్మెంట్ (బీఈపీఎల్) విలీనానికి అక్టోబర్ 4న సీసీఐ కొన్ని షరతులతో కూడిన ఆమోదం తెలిపింది. ఆయా విభాగాల్లో పోటీపై ప్రతికూల ప్రభావం పడకుండా మూడు హిందీ చానెళ్ల విక్రయానికి కొన్ని నిబంధనలు విధించింది. వీటి ప్రకారం సదరు చానెళ్లను స్టార్ ఇండియా లేదా వయాకామ్18కి విక్రయించకూడదు. వాటిని నడిపే ఆర్థిక సత్తా, అనుభవం ఉన్న కొనుగోలుదారులకే అమ్మాలి. ఈ మేరకు విలీన ఒప్పందంలో స్వచ్చందంగా మార్పులు చేసి సమర్పించాలని సీసీఐ సూచించింది. దానికి అనుగుణంగానే జీ, సోనీ తమ ప్రతిపాదనలను సమర్పించాయి. -
సీసీఐకు తాత్కాలిక చైర్పర్సన్ సంగీతా వర్మ నియామకం
న్యూఢిల్లీ: ప్రభుత్వం తాజాగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)కు తాత్కాలిక చైర్‌పర్సన్‌గా సంగీతా వర్మను నియమించింది. ప్రస్తుత ఫుల్‌టైమ్ చైర్‌పర్శన్ అశోక్ కుమార్ గుప్తా మంగళవారం వైదొలగడంతో ప్రభుత్వం సంగీతా వర్మకు తాత్కాలిక బాధ్యతలు అప్పగించింది. సీసీఐలో సభ్యురాలైన వర్మ బుధవారం(26) నుంచి మూడు నెలలపాటు చైర్‌పర్సన్‌గా కొనసాగుతారు. పూర్తిస్థాయి చైర్‌పర్సన్‌ను ఎంపిక చేసేటంతవరకూ లేదా తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకూ వర్మ బాధ్యతలు నిర్వహిస్తారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలియజేసింది. మంగళవారం రాజీనామా చేసిన గుప్తా 2018 నవంబర్‌లో సీసీఐకు చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు. -
గూగుల్‌కు సీసీఐ జరిమానా..భారత్‌లో కస్టమర్లు, వ్యాపారాలకు పెద్ద ఎదురుదెబ్బ
మొబైల్ వెబ్ బ్రౌజర్లు, ఆన్లైన్ వీడియో హోస్టింగ్లలో క్రోమ్, యూట్యూబ్ వంటి యాప్‌ల స్థానాన్ని కాపాడుకోవడానికి ఆన్లైన్ సెర్చ్, ఆండ్రాయిడ్ కోసం యాప్ స్టోర్ వంటి మార్కెట్లలో గూగుల్ తన ఆధిపత్య స్థానాన్ని ఉపయోగించుకుందని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) గూగుల్‌కు రూ.1,338 కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా అనుచిత వ్యాపార విధానాలు అమలు చేయడాన్ని మానుకోవాలని ఆదేశించింది. నిర్దిష్ట వ్యవధిలోగా తన తీరును మార్చుకోవాలని సూచించింది. అయితే భారత్ నిర్ణయంపై గూగుల్ స్పందించింది. భారత్ నిర్ణయం.. దేశంలోని వినియోగదారులు, వ్యాపారాలకు పెద్ద ఎదురుదెబ్బ అని గూగుల్ తెలిపింది. ఆండ్రాయిడ్ అనేది వినియోగదారులకు ఏం కావాలో.. దాన్ని ఎంపిక చేసేందుకువ వీలుగా సృష్టించింది ఈ ఆండ్రాయిడ్. భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న వారందరికి మద్దతుగా నిలుస్తుందని గూగుల్ అధికార ప్రతినిధి తెలిపారు. సీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అటు కొనుగోలుదారులకు ఇటు వ్యాపారస్థులకు ఇది పెద్ద ఎదురు దెబ్బ. సెక్యూరిటీ పరంగా ఆండ్రాయిడ్ ఫీచర్‌ను వినియోగిస్తున్న వారందరూ ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. అదే సమయంలో మొబైల్ ధరలు పెరుగుతాయని వెల్లడించారు. చదవండి👉 గూగుల్‌కు భారీ షాక్! -
గూగుల్‌కు సీసీఐ రూ. 1,338 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్ వ్యవస్థకు సంబంధించి వివిధ మార్కెట్లలో తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందన్న అభియోగాలపై టెక్ దిగ్గజం గూగుల్‌కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రూ. 1,338 కోట్ల జరిమానా విధించింది. అంతే కాకుండా అనుచిత వ్యాపార విధానాలు అమలు చేయడాన్ని మానుకోవాలని ఆదేశించింది. నిర్దిష్ట వ్యవధిలోగా తన తీరును మార్చుకోవాలని సూచించింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఆధారిత స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై మూడేళ్ల పాటు సాగిన విచారణ అనంతరం సీసీఐ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను స్మార్ట్ఫోన్లలో ఉపయోగించే మొబైల్ తయారీ సంస్థలు (ఓఈఎం) .. గూగుల్ మొబైల్ సూట్‌ను (జీఎంఎస్) కూడా పొందుపర్చేలా తప్పనిసరిగా నిర్దిష్ట ఒప్పందం కుదుర్చుకోవాలని గూగుల్ షరతు విధిస్తోందన్న ఆరోపణ కూడా ఈ ఫిర్యాదుల్లో ఉంది. దీనితో పాటు మరికొన్ని అభియోగాలపై లోతుగా విచారణ జరపాలంటూ 2019 ఏప్రిల్‌లో సీసీఐ ఆదేశించింది. అక్టోబర్ 25న పదవీ విరమణ చేస్తున్న సీసీఐ చైర్పర్సన్ అశోక్ కుమార్ గుప్తా తాజాగా తుది ఉత్తర్వులు ఇచ్చారు. అన్ఇన్స్టాల్ చేసే ఆప్షన్ లేకుండా జీఎంఎస్ను తప్పనిసరిగా ప్రీ–ఇన్స్టాల్ చేయాలనడం డివైజ్‌ల తయారీదారులకు అసమంజస షరతు విధించడమే అవుతుందని ఆదేశాల్లో పేర్కొన్నారు. అలాగే, స్మార్ట్ డివైజ్‌లలో ప్రీ–ఇన్స్టాల్డ్ యాప్స్‌ను ఎక్కడ ఉంచాలనే విషయంలోనూ ఓఈఎంలపై ఒత్తిడి తేకూడదని స్పష్టం చేశారు. -
మద్యం అమ్మకాలపై పిటిషన్ కొట్టివేత.. ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
సాక్షి, హైదరాబాద్: ఏపీలో మద్యం అమ్మకాలకు సంబంధించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌ను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొట్టివేసింది. విచారణలో భాగంగా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెల్లడించింది. వివరాల ప్రకారం.. మద్యం అమ్మకాల్లో ఎక్సైజ్ చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపణలు చేస్తూ స్పిరిట్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా.. ఏపీ ప్రభుత్వంపై పిటిషన్ దాఖలు చేసింది. దీంతో, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా విచారణ చేపట్టింది. కాగా, విచారణలో భాగంగా.. పిటిషన్లో చేసిన ఆరోపణలు అవాస్తవని తేలింది. కాంపిటీషన్ లాను ఉల్లంఘించినట్టు నిర్ధారణ కాలేదని కమిషన్ తేల్చింది. ఎక్సైజ్ చట్టం సెక్షన్-4 ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేస్తూ తీర్పును వెల్లడించింది. ఈ సందర్భంగా పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు పేర్కొంది. -
ఎయిర్ ఏషియా ఇకపై ఉండదు! కారణమిదే?
న్యూఢిల్లీ: ఎయిర్ఏషియా ఇండియాలో మొత్తం ఈక్విటీ వాటాలను ఎయిరిండియా కొనుగోలు చేసే ప్రతిపాదనకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదముద్ర వేసింది. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో ఈ మేరకు ట్వీట్ చేసింది. పరిశ్రమలో గుత్తాధిపత్యానికి దారితీసే అవకాశం ఉండే డీల్స్‌కు సీసీఐ ఆమోదం అవసరమవుతుంది. వివరాల్లోకి వెడితే .. టాటా సన్స్ (టీఎస్పీఎల్), ఎయిర్ఏషియా ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ (ఏఏఐఎల్) కలిసి జాయింట్ వెంచర్ సంస్థగా ఎయిర్ఏషియా ఇండియాను ఏర్పాటు చేశాయి. ఇందులో టీఎస్‌పీఎల్‌కు 83.67 శాతం, ఏఏఐఎల్‌కు 16.33 శాతం వాటాలు ఉన్నాయి. 2014 జూన్‌లో ఎయిర్ఏషియా ఇండియా దేశీయంగా ప్రయాణికులకు ఫ్లయిట్ సర్వీసులు, సరుకు రవాణా, చార్టర్ ఫ్లయిట్ సేవలను ప్రారంభించింది. అంతర్జాతీయంగా కార్యకలాపాలు లేవు. మరోవైపు, టాటా గ్రూప్‌లో భాగమైన టాలేస్ ప్రైవేట్ లిమిటెడ్.. ఈ ఏడాదే ప్రభుత్వ రంగ ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ను రూ. 18,000 కోట్లకు కొనుగోలు చేసింది. టాటా గ్రూప్ ఇప్పటికే జాయింట్ వెంచర్లయిన ఎయిర్ఏషియా ఇండియా, విస్తార ద్వారా సేవలందిస్తోంది. తాజాగా ఎయిరిండియా కొనుగోలు తర్వాత ఏవియేషన్ కార్యకలాపాలను క్రమబద్ధీకరించుకునే ప్రయత్నాల్లో ఉంది. -
ఆ రూ. 200 కోట్లు... 45 రోజుల్లో కట్టేయండి
Amazon Future Coupons Case, న్యూఢిల్లీ: ఫ్యూచర్ రిటైల్ సబ్సిడీ– ఫ్యూచర్ కూపన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో (ఎఫ్సీఎల్సీ) ఒప్పందం విషయంలో అమెజాన్‌కు నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)లోనూ చుక్కెదురైంది. ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తూ కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఇచ్చిన ఉత్తర్వును అప్పీలేట్ ట్రిబ్యునల్ కూడా సమర్థించింది. ఒప్పందంపై కొన్ని అంశాలను దాచిపెట్టినందుకు దీనిని సస్పెండ్ చేస్తున్నట్లు 2021 డిసెంబర్ 17వ తేదీన అమెజాన్‌కు కాంపిటేషన్ వాచ్డాగ్ రూ.200 కోట్ల జరిమానా విధించింది. దీనిని అమెజాన్ అప్పీలేట్ ట్రిబ్యునల్‌లో సవాలు చేసింది. అయితే ఇక్కడ ఈ–కామర్స్ దిగ్గజానికి చుక్కెదురైంది. ఈ వివాదంలో సీసీఐ విధించి రూ.200 కోట్ల డిపాజిట్‌కు అప్పీలేట్ ట్రిబ్యునల్ అమెజాన్‌కు 45 రోజుల సమయం మంజూరు చేసింది. అయితే సెక్షన్ 44, 45 సెక్షన్ల క్రింద విధించిన రూ.కోటి చొప్పన ప్రత్యేక జరిమానాలను రూ.50 లక్షల చొప్పున తగ్గించింది. మరిన్ని వివరాలు... అమెజాన్.కామ్ అనుబంధ సంస్థ అమెజాన్.కామ్ ఎన్వీ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ ఎఎసీ( అమెజాన్) 2019 ఆగస్టులో అన్‌లిస్టెడ్ ఫ్యూచర్ కూపన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎఫ్‌సీపీఎల్)లో 49 శాతం వాటా కొనుగోలు చేసింది. డీల్ విలువ రూ.1,400 కోట్లు. ఎఫ్‌సీపీఎల్‌కు ఫ్యూచర్ రిటైల్‌లో (ఎఫ్ఆర్ఎల్) 9.82 శాతం వాటా (కన్వర్టబుల్బాండ్స్ ద్వారా) ఉంది. ఈ ఒప్పందాన్నే కారణంగా చూపిస్తూ, ఎఫ్‌ఆర్‌ఎల్‌ను కొనుగోలుకు సంబంధించి మొదటి హక్కు తమకే ఉంటుందని, 3 నుంచి 10 సంవత్సరాల్లో తాను ఫ్యూచర్ రిటైల్‌ను కొనుగోలు చేసే వెసులుబాటు ఒప్పందం ప్రకారం ఉందని అమెజాన్ వాదిస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో ఎఫ్ఆర్ఎల్ (దీనితో సహా మరో 19 కంపెనీలు) రూ.24,713 కోట్ల విక్రయ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ తీవ్ర న్యాయపోరాటం చేసింది. అయితే అసలు ఫ్యూచర్స్‌తో ఒప్పంద ప్రతిపాదనను పూర్తిగా వెనక్కు తీసుకుంటున్నట్లు రిలయన్స్ ఏప్రిల్‌లో ప్రకటించింది. ఎఫ్ఆర్ఎల్ ప్రస్తుతం ఎన్సీఎల్టీ ముంబై బెంచ్‌లో దివాలా చర్యలను ఎదుర్కొంటోంది. సీఏఐటీ హర్షం కాగా, అమెజాన్ వాదనలను పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈ వివాద విచారణలో భాగంగా ఉన్న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) తాజా అప్పీలేట్ ట్రిబ్యునల్ రూలింగ్‌పై వ్యాఖ్యానిస్తూ, ‘‘భారత్ ఈ–కామర్స్ అలాగే రిటైల్ వాణిజ్యాన్ని ఎవరైనా గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంటే, ఈ చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవంతం కాబోవు’’ అని పేర్కొంది. -
కుమ్మక్కు ధోరణులతో పెను సవాళ్లు
న్యూఢిల్లీ: ధరల పెరుగుదల, సరఫరాపరమైన అంతరాయాలకు దారి తీసే గుత్తాధిపత్య విధానాలను అరికట్టడంపై మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. కంపెనీలు కుమ్మక్కయ్యే ధోరణులను ఎదుర్కొనడం పెను సవాలుగా ఉండనుందని ఆమె తెలిపారు. దేశీయంగా డిమాండ్‌ను తీర్చడంతో పాటు ఎగుమతులు కూడా చేసేంత స్థాయిలో భారత్‌కు పుష్కలమైన సామర్థ్యాలు ఉన్నప్పటికీ ముడి వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయని కొంత ఆందోళన వ్యక్తమవుతోందంటూ మంత్రి చెప్పారు. కరోనా మహమ్మారి, తూర్పు యూరప్‌లో యుద్ధ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయంగా కమోడిటీలు, ముడి వస్తువుల కొరత నెలకొందని, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు ఏర్పడుతున్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) 13వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు వివరించారు. ‘వివిధ దశల్లో అవాంతరాలు వస్తున్నాయి. ఇవి నిజంగానే కోవిడ్ లేదా యుద్ధం వల్ల తలెత్తినవా అనే అంశాన్ని లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. గుత్తాధిపత్యం లేదా రెండు సంస్థల ఆధిపత్యం వల్ల ధరలు పెరిగిపోవడం, సరఫరాపరమైన అంతరాయాలు కలగకుండా చూడాలి‘ అని మంత్రి సూచించారు. గత రెండేళ్లుగా సీసీఐ సవాళ్లను మరింత సానుకూలంగా అధిగమిస్తోందని ఆమె కితాబిచ్చారు. ‘సవాళ్లు చాలా సంక్లిష్టంగా మారుతున్నాయి. కాబట్టి, ఇలాంటి వాటిని పరిష్కరించడంలో వెనుకబడి పోకుండా సీసీఐ తన నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకుంటూ ఉండాలి‘ అని పేర్కొన్నారు. -
గ్లోబల్ టెక్ దిగ్గజాలకు సమన్లు
న్యూఢిల్లీ: పోటీని అణచివేసే ధోరణిలో వ్యవహరిస్తున్న ఆరోపణలతో పలు గ్లోబల్ టెక్ దిగ్గజాలకు సమన్లు జారీ కానున్నాయి. ఇందుకు గురువారం పార్లమెంటరీ కమిటీ నిర్ణయాన్ని తీసుకుంది. వెరసి గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, ట్విటర్ తదితరాలకు సమన్లు జారీ కానున్నాయి. తద్వారా ఆయా కంపెనీల పోటీతత్వ విధానాలను పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై తదుపరి సమావేశాన్ని పార్లమెంటరీ కమిటీ వచ్చే నెల 12న నిర్వహించే అవకాశముంది. పలు టెక్ దిగ్గజాలు పోటీ నివారణా పద్ధతులు అవలంబిస్తున్న ఆరోపణలపై ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూలంకషంగా చర్చించింది. చదవండి: హైదరాబాద్‌లో గూగుల్ క్యాంపస్, యువతకు ఐటీ ఉద్యోగాల రూప కల్పనే లక్ష్యంగా! ఆపై కాంపిటీషన్ కమిషన్(సీసీఐ)కు ఈ అంశాలను నివేదించింది. కాగా.. పోటీ నివారణ పద్ధతులపై సరైన రీతిలో స్పందించేందుకు వీలుగా డిజిటల్ మార్కెట్స్ అండ్ డేటా యూనిట్‌ను ఏర్పాటు చేసినట్లు సీసీఐ పేర్కొంది. తద్వారా గ్లోబల్ టెక్ దిగ్గజాలపై యాంటీకాంపిటీషన్ చర్యలు చేపట్టేందుకు సీసీఐ చట్ట సవరణల కోసం కొత్త బిల్లును తీసుకురానున్నట్లు తెలియజేసింది. అంతేకాకుండా డిజిటల్ విభాగంలో పలు పరిశోధనలను చేపట్టినట్లు వెల్లడించింది. ఈ జాబితాలో గూగుల్, ఫేస్బుక్, వాట్సాప్, యాపిల్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మేక్మైట్రిప్–గోఐబిబో, స్విగ్గీ, జొమాటో తదితరాలున్నట్లు పేర్కొంది. -
ఎయిర్ఏషియా ఇండియాపై ఎయిరిండియా కన్ను
న్యూఢిల్లీ: చౌక చార్జీల విమానయాన సంస్థ ఎయిర్ఏషియా ఇండియాను కొనుగోలు చేయాలని ఎయిరిండియా యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన డీల్‌కు అనుమతులు ఇవ్వాలంటూ కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ)కు దరఖాస్తు చేసుకుంది. ఎయిర్ఏషియా ఇండియాలో టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 83.67 శాతం, మలేషియాకు చెందిన ఎయిర్ఏషియా గ్రూప్‌లో భాగమైన ఎయిర్ఏషియా ఇన్వెస్ట్‌మెంట్‌కు మిగతా వాటాలు ఉన్నాయి. ఎయిరిండియా, దాని అనుబంధ సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ను టాటా సన్స్‌లో భాగమైన టాలేస్ ఇటీవలే కొనుగోలు చేసింది. వీటితో పాటు సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి ఫుల్ సర్వీస్ ఎయిర్‌లైన్ విస్తారాను కూడా టాటా గ్రూప్ నిర్వహిస్తోంది. విమానయాన సేవలను కన్సాలిడేట్ చేసుకునే క్రమంలో ఎయిర్ఏషియా ఇండియాను పూర్తిగా కొనుగోలు చేయాలని టాటా గ్రూప్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో మార్కెట్లో గుత్తాధిపత్య సమస్య తలెత్తకుండా నిర్దిష్ట డీల్స్‌కు సీసీఐ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతిపాదిత కొనుగోలుతో దేశీయంగా పోటీపై, మార్కెట్ వాటాపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదని సీసీఐకి చేసుకున్న దరఖాస్తులో ఎయిరిండియా పేర్కొన్నట్లు సమాచారం. -
గూగుల్‌కు భారత్‌లో భారీ ఝలక్!
టెక్ దిగ్గజం గూగుల్‌కు భారత్‌లో మరో ఝలక్ తగిలింది. చెల్లింపులు లేకుండా గూగుల్ సెర్చ్ ఫలితాల్లో వార్తలను ప్రచురించడంపై వార్తా సంస్థల అభ్యంతరాలను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు గూగుల్‌కి వ్యతిరేకంగా వార్త ప్రచురణ సంస్థలు చేస్తున్న ఆరోపణలపై దర్యాప్తు చేపట్టనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఆండ్రాయిడ్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయించడంతో పాటు థర్డ్ పార్టీగా ఉంటూ యాప్ డెవలపర్స్‌ను కమిషన్ పేరుతో ఇబ్బంది పెడుతోందన్న ఆరోపణలపై గూగుల్‌పై ఇదివరకే సీసీఐ దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే యాంటీ ట్రస్ట్ చట్టాల్ని గూగుల్ ఉల్లంఘిస్తోందంటూ డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోషియేషన్(డీఎన్‌పీఏ) తాజాగా సీసీఐని ఆశ్రయించాయి. దేశంలో కొన్ని మీడియా కంపెనీలకు సంబంధించిన డిజిటల్ విభాగాల్లో ఒకటైన డీఎన్‌పీఏ.. తమ సభ్యులకు ప్రకటనల ఆదాయాన్ని పారదర్శకంగా చెల్లించేందుకు గూగుల్ విముఖత వ్యక్తం చేసిందని ఫిర్యాదులో పేర్కొంది. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టింది సీసీఐ. దేశంలోని నిర్దిష్ట ఆన్లైన్ సెర్చ్ సేవలపై Google ఆధిపత్యం చెలాయిస్తోందని, వార్తా ప్రచురణకర్తలపై అన్యాయమైన షరతులు విధిస్తోందని పేర్కొంటూ దర్యాప్తునకు ఆదేశించింది సీసీఐ. ప్రజాస్వామ్యంలో కీలకంగా వ్యవహరిస్తున్న న్యూస్ మీడియాను అణగదొక్కడమే అవుతుందని కీలక వ్యాఖ్యలు చేస్తూ దర్యాప్తునకు ఆదేశించింది సీసీఐ. ఇదిలా ఉంటే Google వంటి ఆన్లైన్ అగ్రిగేటర్లకు ప్రకటనల ఆదాయాన్ని కోల్పోతున్నాయి వార్తా సంస్థలు. టెక్ కంపెనీలు తమ సెర్చ్ ఫలితాలలో కథనాలను, చెల్లింపు లేకుండా ఇతర ఫీచర్లను ఉపయోగిస్తాయంటూ కొన్నేళ్లుగా వార్త సంస్థలు గళం వినిపిస్తున్నా ఇన్నాళ్లూ ప్రయోజనం లేకుండా పోయింది. ఒక్క భారత్‌లోనే కాదు.. మరికొన్ని దేశాల్లో సైతం ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొంటుండగా.. భారీ భారీ జరిమానాలు విధిస్తున్నాయి ఆయా దేశాల విచారణ సంస్థలు. ఈ నేపథ్యంలో భారత్‌లో తాజాగా ఎదురైన పరిణామం గూగుల్‌ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టినట్లయ్యింది. సంబంధిత వార్త: గూగుల్‌న్యూస్.. గూగుల్‌కు ఫ్రాన్స్ రూ.4,415 కోట్ల ఫైన్ -
ఫ్యూచర్ రిటైల్‌లో ఆర్థిక అవకతవకలు
న్యూఢిల్లీ: ఫ్యూచర్ రిటైల్ (ఎఫ్ఆర్ఎల్) తీవ్ర ఆర్థిక అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని అమెజాన్ ఆరోపించింది. ఈ మేరకు స్వయంగా ఫ్యూచర్ రిటైల్ ఇండిపెండెంట్ డైరెక్టర్లకు ఒక లేఖ రాసింది. ఇందుకు సంబంధించి ఆర్ఎఫ్ఎల్, ఇతర ఫ్యూచర్ గ్రూప్ సంస్థల చోటుచేసుకున్న లావాదేవీలపై ‘‘ ‘పూర్తి, స్వతంత్ర పరిశీలన‘ జరపాల్సిన అవసరం ఉందని పేర్కొంది. కాగా, అసలు ఇలాంటి లేఖ రాసే ఎటువంటి అర్హతా అమెజాన్‌కు లేదని ఫ్యూచర్ రిటైల్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) జారీ చేసిన ఒక నోటీసును ఎదుర్కొనే క్రమంలో అమెరికా ఈ–కామర్స్ దిగ్గజం ఈ తరహా ఆరోపణలు చేస్తోందని పేర్కొంది. లేఖ సారాంశమిది... ఎఫ్ఆర్ఎల్ ఇండిపెండెంట్ డైరెక్టర్లకు అమెజాన్ లేఖ విషయానికి వస్తే, ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, ఫ్యూచర్ సప్లై చైన్ సొల్యూషన్స్ లిమిటెడ్, ఫ్యూచర్ 7–ఇండియా కన్వీనియన్స్ లిమిటెడ్‌సహా వివిధ ఫ్యూచర్ గ్రూప్ సంస్థలతో ఎఫ్ఆర్ఎల్ తరచూ ‘‘కీలక లావాదేవీల అవగాహనను’’ చేసుకుంటోంది. సంబంధిత గ్రూప్ సంస్థల్లో కొన్ని తమ వ్యాపారాలకు ప్రధానంగా ఎఫ్ఆర్ఎల్పైనే ఆధారపడుతున్నాయి. ఆయా అంశాల్లో తీవ్ర ఆర్థిక అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. ఎఫ్ఆర్ఎల్ ఆర్థిక నిర్వహణ విషయంపై ఆడిట్ కమిటీ సభ్యులు (ప్రస్తుత మరియు గత సభ్యులు) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్‌ఎల్‌ఆర్, గ్రూప్ సంస్థల మధ్య అవగాహనకు సంబంధించిన అంశాలూ ఇందులో ఉన్నాయి. 2019 డిసెంబర్లో 2020 జనవరిలో తగిన ఈక్విటీ, రుణ నిధిని సమకూర్చుకున్నప్పటికీ, ఎఫ్‌ఆర్‌ఎల్‌లో రుణ భారం పెరగడానికి కారణాలు ఏమిటన్నది తెలుసుకోడానికి స్వతంత్ర నిపుణుల సంస్థతో విచారణ చేయాలని ఆడిట్ కమిటీ కూడా సిఫారసు చేయడం గమనార్హం. ఈ వాస్తవాలను అమెజాన్ స్వతంత్ర డైరెక్టర్ల దృష్టికి ఎందుకు తీసుకువస్తున్నదంటే, వారు వారి చట్టబద్ధమైన, విశ్వసనీయ బాధ్యతలకు అనుగుణంగా పబ్లిక్ షేర్హోల్డర్లు, రుణదాతలు, బ్యాంకర్లు, మూడవ పార్టీ సప్లైయర్లు ప్రయోజనాల కోసం ఈ సమస్యలను వివరంగా విశ్లేషించవచ్చు. దర్యాప్తు చేయవచ్చు. ఫ్యూచర్ ప్రతినిధి ఖండన కాగా, ఎఫ్‌ఆర్‌ఎల్‌లో అమెజాన్ వాటాదారుకానీ, రుణ దారుకానీ కానప్పుడు ఈ లేఖ ఎలా రాస్తుందని ఫ్యూచర్ గ్రూప్ ప్రతినిధి ప్రశ్నించారు. ఎఫ్‌సీపీఎల్ (ఫ్యూచర్ కూపన్స్ ప్రైవేట్ లిమిటెడ్)లో అమెజాన్ పెట్టుబడికి ఇచ్చిన ఆమోదాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా ఆ సంస్థ (ఎఫ్‌సీపీఎల్) కాంపిటేటివ్ కమిషన్ ఆప్ ఇండియాలో దరఖాస్తు చేసిందని, దీనికి విరుగుడుగా ముందుజాగ్రత్తగా తప్పుడు ఉద్దేశాలతో అమెజాన్ తాజాగా ఈ లేఖ రాసిందని ఆయన పేర్కొన్నారు. సుదీర్ఘ న్యాయ వివాదం రిలయన్స్‌కు ఫ్యూచర్ గ్రూప్‌ల ఆస్తుల విక్రయానికి సంబంధించి రూ.24,713 కోట్ల ఒప్పందం వివాదం ప్రస్తుతం సింగపూర్ అర్ర్‌బిటేషన్, సుప్రీంకోర్టు న్యాయపరిధిలో ఉన్న సంగతి తెలిసిందే. ఫ్యూచర్ కూపన్స్‌లో వాటాదారైన అమెజాన్‌కు.. ఎఫ్‌ఆర్‌ఎల్‌లో కూడా కొన్ని వాటాలు ఉన్నాయి. ఒప్పందం ప్రకారం ఎఫ్‌ఆర్‌ఎల్‌ను కొనుగోలు చేసే హక్కులు కూడా దఖలు పడ్డాయన్నది అమెజాన్ వాదన. మరోవైపు, 2020 ఆగస్టులో తమ రిటైల్ తదితర వ్యాపారాలను రిలయన్స్ రిటైల్‌కు విక్రయించేలా ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందం ప్రకటించింది. దీన్ని వ్యతిరేకిస్తూ అమెజాన్ ఫ్యూచర్ గ్రూప్‌నకు లీగల్ నోటీసులు పంపింది. గత ఒప్పందాల ప్రకారం, ఫ్యూచర్ వ్యాపారాలను తనకే అమ్మాలని స్పష్టం చేసింది. అటుపైన సింగపూర్‌లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్‌ను ఆశ్రయించింది. అక్కడ ఆ సంస్థకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. అవి భారత్‌లో చెల్లుబాటు కావంటూ ఫ్యూచర్ గ్రూప్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సింగిల్ జడ్జి అమెజాన్‌కు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వగా.. వాటిపై డివిజనల్ బెంచ్ స్టే విధించింది. ఈ పరిణామాలను సవాలు చేస్తూ అమెజాన్.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇక్కడ అమెజాన్‌కు అనుకూలంగా రూలింగ్ వచ్చింది. దేశంలో లక్ష కోట్ల రిటైల్ వ్యాపారాన్ని సొంతం చేసుకోవాలన్నదే ఆయా సంస్థల న్యాయపోరాటం ప్రధాన ధ్యేయమన్న విమర్శలు ఉన్నాయి. -
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు సుప్రీం షాక్..!
న్యూఢిల్లీ: ప్రత్యర్థుల వ్యాపారాలను నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నారని తమపై వచ్చిన ఆరోపణలను విచారించరాదని కోరుతున్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ విషయంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విచారణను నిలువరించాలన్న అమెరికా ఈ–కామర్స్ దిగ్గజ కంపెనీల అప్పీలేట్ పిటిషన్లను చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ వినీత్ సరాన్, జస్టిస్ సూర్య కాంత్‌లతో కూడిన ధర్మాసనం తోసిపుచి్చంది. ఈ అంశం విషయంలో కర్ణాటక హైకోర్టులో ఓడిపోయిన రెండు ఈ–కామర్స్ సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అమెరికా సంస్థలు తమ ఈ–కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో ఎంపిక చేసిన విక్రేతలను ప్రోత్సహిస్తున్నాయని, తద్వారా పోటీని అణిచివేసే వ్యాపార పద్ధతులకు పాల్పడుతున్నాయని బ్రిక్–అండ్–మోటార్ రిటైలర్లు ఆరోపించాయి. ఢిల్లీ వయాపర్ మహాసంఘ్ ఈ అంశంపై ఫిర్యాదు చేసింది. దీంతో ఈ గుత్తాధిపత్య ఆరోపణలపై విచారణకు 2020 జనవరిలో సీసీఐ ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలపై కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన రెండు సంస్థలకు అక్కడ చుక్కెదురైంది. ‘నిజానికి ఈ తరహా విచారణకు మీకు మీరుగా ముందుకొస్తారని మేము భావించాం. విచారణకు సిద్ధం కావాలి. కానీ మీరు అలా కోరుకోవడం లేదు’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. ‘క్రిమినల్ చట్టం కింద ఏదైనా ఫిర్యాదు దాఖలైతే ఎఫ్ఐఆర్ నమోదుచేస్తారు. ఆ నమోదుకు ముందే నోటీసు ఇవ్వండి అన్నట్లు ఉంది మీ వాదన’ అని కూడా త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా, సుప్రీం తీర్పు వెలువడిన కొద్ది గంటల్లోనే గోయెల్ మరో ప్రకటన చేస్తూ, బడా ఆన్లైన్ రిటైలర్లపై సీసీఐ వద్ద ఫిర్యాదు చేయడానికి తగిన ఆధారాలతో సిద్ధంకావాలని ట్రేడర్లకు విజ్ఞప్తి చేయడం మరో విశేషం. -
వాస్తవాలు ఎందుకు దాచారు?
న్యూఢిల్లీ: ఫ్యూచర్స్ గ్రూప్ తన రిటైల్, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ అసెట్స్‌ను రిలయన్స్‌కు విక్రయించడానికి సంబంధించి అమెజాన్‌తో జరుగుతున్న వివాదం కొత్త మలుపు తిరిగింది. వివాదానికి ప్రధాన మూలమైన 2019 నాటి అమెజాన్–ఫ్యూచర్స్ గ్రూప్ ఒప్పందం పూర్తి వివరాలను ఎందుకు వెల్లడించలేదని కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అమెజాన్‌కు నోటీసులు జారీ చేసింది. ఇందుకుగాను జరిమానాసహా తగిన చర్యలు ఎందుకు తీసుకోకూడదని నాలుగు పేజీల షో కాజ్ నోటీసు జారీ చేసింది. ఈ వివాదంపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో జరుగుతున్న అమెజాన్–ఫ్యూచర్స్ న్యాయపోరాటంలో సీసీఐ తాజా నోటీసులు కీలక పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాల్లోకి వెళితే... తన రిటైల్ అండ్ హోల్‌సేల్, లాజిస్టిక్స్ బిజినెస్‌ను రిలయన్స్ రిటైల్‌కు రూ.24,713 కోట్లకు విక్రయిస్తున్నట్లు ఫ్యూచర్స్ గ్రూప్ (ఎఫ్ఆర్ఎల్) 2020 ఆగస్టు 29న ప్రకటించింది. ఇది ఎంతమాత్రం తగదని 2020 అక్టోబర్‌లో అమెజాన్ సింగపూర్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. ఫ్యూచర్ అన్‌లిస్టెడ్ సంస్థల్లో ఒకటైన ఫ్యూచర్స్ కూపన్స్ లిమిటెడ్‌లో (బీఎస్ఈ లిస్టెడ్ ఫ్యూచర్ రిటైల్‌లో ఫ్యూచర్స్ కూపన్స్ లిమిటెడ్‌కు కన్వెర్టబుల్ వారెంట్స్ ద్వారా 7.3 శాతం వాటా ఉంది) 49 శాతం వాటా కొనుగోలుకు 2019 ఆగస్టులో ఫ్యూచర్స్ లిమిటెడ్‌తో చేసుకున్న ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ, ఫ్యూచర్ కూపన్స్ డీల్ కుదుర్చుకున్నప్పుడే .. మూడు నుంచి పదేళ్ల వ్యవధిలో ఎఫ్ఆర్ఎల్ కూడా కొనుగోలు చేసేందుకు తమకు హక్కులు దఖలు పడ్డాయని అమెజాన్ పేర్కొంది. ఈ వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టు, సింగపూర్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌లో విచారణలో ఉంది. అయితే 2019 నాటి ఒప్పందం వివరాలను తనకు పూర్తిగా వెల్లడించలేదన్నది అమెజాన్‌కు వ్యాపారాల్లో గుత్తాధిపత్య నిరోధక రెగ్యులేటర్– సీసీఐ తాజా నోటీసుల సారాంశం. కాగా రిలయన్స్, ఫ్యూచర్స్ ఒప్పందం సింగపూర్ ట్రిబ్యునల్ విచారణ పరిధిలో ఉంటుందని సుప్రీంకు గురువారం అమెజాన్ తెలిపింది. -
బిగ్‌బాస్కెట్ కొనుగోలుకు టాటా రెడీ
న్యూఢిల్లీ: ఆన్లైన్ గ్రోసరీ ప్లాట్‌ఫామ్ బిగ్‌బాస్కెట్‌లో మెజారిటీ వాటా కొనుగోలుకి టాటా గ్రూప్ ప్రతిపాదించింది. కాంపిటీషన్ కమిషన్(సీసీఐ)కు చేసిన దరఖాస్తు ప్రకారం బిగ్‌బాస్కెట్‌లో 64.3 శాతం వాటాను సొంతం చేసుకోనుంది. ప్రతిపాదిత వివరాల ప్రకారం టాటా డిజిటల్(టీడీఎల్), బిగ్‌బాస్కెట్ నిర్వాహక సంస్థ సూపర్‌మార్కెట్ గ్రోసరీ సప్లైస్(ఎస్జీఎస్)లో 64.3 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. డీల్‌ను ప్రైమరీ, సెకండరీ కొనుగోళ్ల ద్వారా పూర్తిచేయనున్నట్లు తెలుస్తోంది. టాటా సన్స్‌కు పూర్తి అనుబంధ సంస్థ అయిన టీడీఎల్ టెక్నాలజీ సర్వీసులను అందిస్తోంది. వీటిలో ఐడెంటిటీ, యాక్సెస్ మేనేజ్మెంట్, లాయల్టీ ప్రోగ్రామ్, ఆఫర్లు, చెల్లింపులు తదితర సేవలున్నాయి. ప్రతిపాదిత వాటా కొనుగోలు కారణంగా పోటీ లేదా పోటీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పులూ వాటిల్లబోవంటూ సీసీఐకు టీడీఎల్ నివేదించింది. గత కొద్ది రోజులుగా బిగ్‌బాస్కెట్ కొనుగోలుకి టాటా గ్రూప్ ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వెలువడుతున్న విషయం విదితమే. ఈ డీల్ ద్వారా చైనీస్ దిగ్గజం అలీబాబా తదితర సంస్థలు బిగ్‌బాస్కెట్‌లో వాటాను విక్రయించేందుకు వీలు చిక్కనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. 2011లో ప్రారంభమైన బిగ్‌బాస్కెట్ దేశవ్యాప్తంగా 25 పట్టణాలలో కార్యకలాపాలు విస్తరించింది. ఈ విభాగంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, గ్రోఫర్స్ తదితర దిగ్గజాలతో పోటీ పడుతోంది. -
టాటా ‘బిగ్‌బాస్కెట్ ’డీల్!
ముంబై: కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూప్ ఆన్లైన్ గ్రోసరీ విక్రయ సంస్థ బిగ్‌బాస్కెట్‌లో మెజారిటీ వాటా కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్కెట్‌లో 68 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. డీల్ తుది దశకు చేరినట్లు వెల్లడించాయి. ఇందుకు టాటా గ్రూప్ రూ. 9,300–9500 కోట్లవరకూ వెచ్చించే వీలున్నట్లు తెలియజేశాయి. ఒప్పంద వివరాలు నాలుగైదు వారాల్లో వెల్లడయ్యే అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డాయి. కాగా.. డీల్ కుదిరితే ఆన్లైన్ గ్రోసరీ విభాగంలో అతిపెద్ద కొనుగోలుగా నిలవనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ డీల్‌తో బిగ్‌బాస్కెట్ విలువ రూ. 13,500 కోట్లకు చేరనున్నట్లు తెలియజేశారు. అలీబాబా ఔట్ బిగ్‌బాస్కెట్‌లో ఇప్పటికే ఇన్వెస్ట్‌చేసిన చైనీస్ దిగ్గజం అలీబాబాతోపాటు అబ్రాజ్, ఐఎఫ్‌సీ.. టాటా గ్రూప్‌నకు వాటాలను విక్రయించనున్నట్లు తెలుస్తోంది. తద్వారాబిగ్బాస్కెట్లో సుమారు 26 శాతం వాటా కలిగిన అలీబాబా..æకంపెనీ నుంచి వైదొలగనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. డీల్ కుదుర్చుకునేందుకు కాంపిటీషన్ కమిషన్ అనుమతి కోసం రెండు సంస్థలూ నిరీక్షిస్తున్నట్లు తెలియజేశాయి. కాగా.. టాటా గ్రూప్ మెజారిటీ వాటా కొనుగోలు తదుపరి కూడా బిగ్‌బాస్కెట్ సహవ్యవస్థాపకుడు, సీఈవో హరి మీనన్సహా అత్యున్నత అధికారులు బోర్డులో కొనసాగనున్నట్లు అంచనా. అయితే డీల్ అంశంపై అటు టాటా గ్రూప్, ఇటు బిగ్‌బాస్కెట్ స్పందించకపోవడం గమనార్హం! చదవండి: (బైజూస్ చేతికి టాపర్ టెక్!) సూపర్‌యాప్ ఇటీవల అత్యంత వేగంగా వృద్ధిని సాధిస్తున్న దేశీ ఈకామర్స్ బిజినెస్‌లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ అధ్యక్షతన టాటా గ్రూప్ ప్రణాళికలు వేస్తూ వస్తోంది. దీనిలో భాగంగా గ్రూప్‌లోని కన్జూమర్ బిజినెస్‌లన్నిటినీ కలుపుతూ సూపర్ యాప్‌ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. తద్వారా టాటా గ్రూప్‌లోని రిటైల్, ఆన్లైన్ బిజినెస్‌లను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చే సన్నాహాల్లో ఉంది. మరోవైపు దిగ్గజ గ్రూప్‌లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ ఇండస్ట్రీస్(రిటైల్) ఈకామర్స్ రంగంలో భారీ అడుగులు వేస్తున్నాయి. దీంతో పోటీ సైతం తీవ్రతరమవుతున్నట్లు పరిశ్రమవర్గాలు ఈ సందర్భంగా వ్యాఖ్యానించాయి. కాగా.. కొంతకాలంగా ఈకామర్స్ బిజినెస్‌కు సంబంధించి భారీ ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు టాటా గ్రూప్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ఇతర కంపెనీలలో మెజారిటీ వాటాల కొనుగోలుకే ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశారు. -
‘ఆధిపత్య’ ఆరోపణలు... ఫ్లిప్‌కార్ట్‌కు ‘సుప్రీం’ ఊరట
న్యూఢిల్లీ: వ్యాపారంలో దూసుకుపోవడానికి తన ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణల విషయంలో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కు ఊరట లభించింది. దీనిపై పునఃదర్యాప్తు దర్యాప్తు జరపాలని ఫెయిర్ ట్రేడ్ రెగ్యులేటర్ కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ను ఆదేశిస్తూ మార్చి 4వ తేదీన నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్(ఎన్సీఎల్ఏటీ) ఇచ్చిన రూలింగ్‌కు బుధవారం సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఆల్ ఇండియా ఆన్లైన్ వెండార్స్ అసోసియేషన్ (ఏఐఓవీఏ– అమ్మకందారుల సంఘం), సీఐఐలకు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే, న్యాయమూర్తులు ఏఎస్ బోపన్న, జస్టిస్ వీ రామస్వామిలతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఆరోపణలు అవాస్తవం: ఫ్లిప్‌కార్ట్ ఆల్ ఇండియా ఆన్లైన్ వెండార్స్ అసోసియేషన్ దాఖలు చేసిన ఫిర్యాదును విచారించిన సీసీఐ, తక్కువ ధరల విధానంతో తన ఆధిపత్య స్థానాన్ని ఫ్లిప్‌కార్ట్ దుర్వినియోగం చేస్తోందని ఆరోపణలను తోసిపుచ్చుతూ 2018 నవంబర్ 6న రూలింగ్ ఇచ్చింది. అయితే దీనిపై అప్పీల్‌ను స్వీకరించిన ఎన్సీఎల్ఏటీ, అసోసియేషన్ వాదనలపై తిరిగి విచారణ చేపట్టాలని సీసీఐని ఆదేశించింది. దీనిని వ్యతిరేకిస్తూ ఫ్లిప్‌కార్ట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేసులో సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే తన వాదనలు వినిపిస్తూ, ఈ అంశంలో ‘ప్రిడెక్టరీ ప్రైసింగ్’ (అతి తక్కువ ధరకు వస్తు, సేవల ద్వారా ప్రత్యర్థులను మార్కెట్ వదిలిపోయేలా చేయడం) కీలకాంశం అన్నారు. ఇలాంటి ఆరోపణలను (ప్రిడెక్టరీ ప్రైసింగ్) కేవలం ఆధిపత్య కంపెనీపైనే చేయాల్సి ఉంటుందని అన్నారు. అసలు ఫ్లిప్‌కార్ట్ ఆధిపత్య కంపెనీ కోవలోకే చెందదని స్పష్టం చేశారు. ఈ సందర్భంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, ఫ్లిఫ్‌కార్ట్ ఆధిపత్య స్థానంలోనే లేదని సీసీఐ తన ఉత్తర్వు్యలో పేర్కొందని, ఈ విషయాన్ని ఎన్సీఎల్ఏటీ కూడా తోసిపుచ్చలేదని గుర్తుచేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీచేసి, కేసు తదుపరి విచారణకు వాయిదావేసింది. 2018 నవంబర్‌లో ఇచ్చిన సీఐఐ ఉత్తర్వుల ప్రకారం, ఆల్ ఇండియా ఆన్లైన్ వెండార్స్ అసోసియేషన్‌లో 2,000కుపైగా సెల్లర్స్‌కు సభ్యత్వం ఉంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్ తరహాలోనే ఏఐఓవీఏ సభ్యత్వ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తాయి. -
ఫ్లిప్‌కార్ట్‌పై సీసీఐ దర్యాప్తును ఆదేశించిన ఎన్సీఎల్ఏటీ
న్యూఢిల్లీ: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌పై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ను నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఆదేశించింది. సీసీఐ తన డైరెక్టర్ జనరల్ (డీజీ) చేత ఈ దర్యాప్తును జరిపించాలని బుధవారం సూచించింది. జస్టిస్ ఎస్.జే ముఖోపాధ్యాయ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం.. సీసీఐ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెట్టి, తాజా దర్యాప్తునకు ఆదేశించింది. ఫ్లిప్‌కార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అన్‌ఫెయిర్ ప్రాక్టీసెస్‌కు పాల్పడిందని అఖిల భారత ఆన్లైన్ వెండార్స్ అసోసియేషన్ (ఏఐఓవీఏ) 2018 నవంబర్‌లో సీసీఐను ఆశ్రయించిన విషయం తెలిసిందే కాగా.. ఈ వాదనలో నిజం లేదని తేల్చింది. అయితే, ఈ విషయమై కేసు ఎన్సీఎల్ఏటీ వరకు వెళ్లగా.. డీజీ చేత పూర్తిస్థాయి దర్యాప్తు చేయించాలని ఆదేశించింది. ఆన్లైన్ ప్లాట్‌ఫాం ద్వారా చిన్న వర్తకులు నేరుగా వినియోగదారులకు వస్తువులను విక్రయించాల్సి ఉండగా.. ఇందుకు భిన్నంగా క్లౌడ్‌టైల్, డబ్ల్యూఎస్ రిటైల్ వంటి పెద్ద వర్తకులు, సప్లయర్లతో కుమ్మౖMð్క విక్రయాలు నిర్వహించేందుకు ఫ్లిప్‌కార్ట్ అవకాశం కల్పించిందని ఏఐఓవీఏ ఆరోపిస్తోంది. ‘కరోనా’పై సెబీ అప్రమత్తం ముంబై: క్యాపిటల్ మార్కెట్లపై కరోనా వైరస్ ఎలాంటి ప్రభావం చూపుతుందో అనే విషయమై సెబీ అంతర్గతంగా మదింపు చేస్తోంది. కరోనా వైరస్ గురించి, అది మార్కెట్‌పై చూపగల ప్రభావం గురించి సెబీకి తగిన అవగాహన ఉందని సెబీ హోల్–టైమ్ మెంబర్ ఎస్.కె. మోహంతి పేర్కొన్నారు. అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నామని వివరించారు. ఆసోచామ్ ఇక్కడ నిర్వహించిన ఒక సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్(రీట్స్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ (ఇన్విట్)లకు సంబంధించి డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీడీటీ) విషయమై కేంద్రంతో సంప్రదింపులు జరుపుతామని హామీ ఇచ్చారు.