న్యూఢిల్లీ: ప్లే స్టోర్ ధరల విధానం విషయంలో పోటీ వ్యతిరేక పద్ధతులను పాటిస్తోందన్న ఆరోపణలపై గూగుల్‌పై విచారణకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) శుక్రవారం ఆదేశించింది. గూగుల్ అనుసరిస్తున్న చెల్లింపు విధానాలు యాప్ డెవలపర్స్, పేమెంట్ ప్రాసెసర్స్, వినియోగదారులతో సహా అనేక మంది వాటాదారులపై ప్రభావం చూపుతున్నాయని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఆధిపత్య స్థానం దురి్వనియోగానికి సంబంధించిన పోటీ చట్టంలోని సెక్షన్ 4ను గూగుల్ ఉల్లంఘించిందని సీసీఐ ప్రాథమికంగా గుర్తించింది.
పీపుల్ ఇంటెరాక్టివ్ ఇండియా (షాదీ.కామ్), మీబిగో ల్యాబ్స్ (కుకు ఎఫ్‌ఎం), ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్, డిజిటల్ ఫౌండేషన్ (ఐబీడీఎఫ్), ఇండియన్ డిజిటల్ మీడియా ఇండస్ట్రీ ఫౌండేషన్ (ఐడీఎంఐఎఫ్) ఫిర్యాదు మేరకు సీసీఐ తాజా ఆదేశాలు వెలువరించింది. గూగుల్ తన ప్లే స్టోర్ నుండి కొన్ని యాప్స్‌ను తీసివేసిన రెండు వారాల లోపే ఈ ఉత్తర్వులు రావడం గమనార్హం. సరీ్వస్ ఫీజు చెల్లింపులపై వివాదం కారణంగా మార్చి 1న భారత్‌లోని ప్లే స్టోర్ నుండి కొన్ని యాప్స్‌ను గూగుల్ తొలగించింది. ఈ విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడంతో కొన్ని రోజుల్లోనే యాప్స్‌ను తిరిగి పునరుద్ధరించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment