Pricing
-
Play Store pricing policy: గూగుల్‌కు సీసీఐ షాక్
న్యూఢిల్లీ: ప్లే స్టోర్ ధరల విధానం విషయంలో పోటీ వ్యతిరేక పద్ధతులను పాటిస్తోందన్న ఆరోపణలపై గూగుల్‌పై విచారణకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) శుక్రవారం ఆదేశించింది. గూగుల్ అనుసరిస్తున్న చెల్లింపు విధానాలు యాప్ డెవలపర్స్, పేమెంట్ ప్రాసెసర్స్, వినియోగదారులతో సహా అనేక మంది వాటాదారులపై ప్రభావం చూపుతున్నాయని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఆధిపత్య స్థానం దురి్వనియోగానికి సంబంధించిన పోటీ చట్టంలోని సెక్షన్ 4ను గూగుల్ ఉల్లంఘించిందని సీసీఐ ప్రాథమికంగా గుర్తించింది. పీపుల్ ఇంటెరాక్టివ్ ఇండియా (షాదీ.కామ్), మీబిగో ల్యాబ్స్ (కుకు ఎఫ్ఎం), ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్, డిజిటల్ ఫౌండేషన్ (ఐబీడీఎఫ్), ఇండియన్ డిజిటల్ మీడియా ఇండస్ట్రీ ఫౌండేషన్ (ఐడీఎంఐఎఫ్) ఫిర్యాదు మేరకు సీసీఐ తాజా ఆదేశాలు వెలువరించింది. గూగుల్ తన ప్లే స్టోర్ నుండి కొన్ని యాప్స్‌ను తీసివేసిన రెండు వారాల లోపే ఈ ఉత్తర్వులు రావడం గమనార్హం. సరీ్వస్ ఫీజు చెల్లింపులపై వివాదం కారణంగా మార్చి 1న భారత్‌లోని ప్లే స్టోర్ నుండి కొన్ని యాప్స్‌ను గూగుల్ తొలగించింది. ఈ విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడంతో కొన్ని రోజుల్లోనే యాప్స్‌ను తిరిగి పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. -
గోల్డ్ బాండ్ గ్రాము @ రూ. 5,611
ముంబై: సావరిన్ గోల్డ్ బాండ్ పథకం 2022–23.. తదుపరి దశలో భాగంగా రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) గ్రాముకి రూ. 5,611 ధరను నిర్ణయించింది. ఐదు రోజులపాటు కొనసాగనున్న ఇష్యూ సోమవారం(6న) ప్రారంభంకానుంది. ఈ నెల 10న ముగియనున్న ఇష్యూలో భాగంగా గ్రాముకి ముందస్తు(నామినల్) ధర రూ. 5,611ను ఆర్బీఐ నిర్ణయించింది. కాగా.. ఆర్బీఐతో సంప్రదింపుల తదుపరి కేంద్ర ప్రభుత్వం గ్రాముకి నామినల్ విలువకు రూ. 50 డిస్కౌంట్‌ను ప్రకటించింది. అయితే ఇందుకు ఇన్వెస్టర్లు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని డిజిటల్ విధానంలో చెల్లింపులు చేపట్టవలసి ఉంటుంది.వెరసి గ్రాము గోల్డ్ బాండ్ ధర రూ. 5,561కు లభించనుంది. ప్రభుత్వం తరఫున ఆర్బీఐ సావరిన్ గోల్డ్ బాండ్లను జారీ చేసే సంగతి తెలిసిందే. వీటిని స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్(ఎస్‌హెచ్‌సీఐఎల్), కొన్ని పోస్టాఫీసులు, ఎన్ఎస్ఈ, బీఎస్ఈల ద్వారా విక్రయిస్తారు. వీటి కాలపరిమితి ఎనిమిదేళ్లుకాగా.. ఐదేళ్ల తదుపరి రిడెంప్షన్‌ను అనుమతిస్తారు. ఫిజికల్ గోల్డ్‌కు డిమాండును తగ్గించే బాటలో 2015 నవంబర్‌లో ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారు. దేశీ పొదుపు సొమ్మును ఫిజికల్ గోల్డ్‌కు కాకుండా సావరిన్ గోల్డ్ కొనుగోలువైపు మళ్లించేందుకు ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేసింది. పూర్తి స్వచ్చత(999)గల బంగారం సగటు ధరను బాండ్లకు నిర్ణయిస్తారు. ఒక గ్రామును ఒక యూనిట్‌గా కేటాయిస్తారు. వ్యక్తిగత ఇన్వెస్టర్లను కనిష్టంగా 1 గ్రాము, గరిష్టంగా 4 కేజీలవరకూ కొనుగోలుకి అనుమతిస్తారు. హెచ్‌యూఎఫ్‌లకు 4 కేజీలు, ట్రస్ట్‌లకు 20 కేజీల వరకూ యూనిట్ల కొనుగోలుకి వీలుంటుంది. -
బీబీసీలో ఆర్థిక అవకతవకలు జరిగాయ్
న్యూఢిల్లీ: బీబీసీ గ్రూప్‌లో ఆదాయ పన్ను శాఖ జరిపిన సర్వేలో కీలకమైన ఆధారాలు లభించాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. కొన్ని సంస్థలు చూపిస్తున్న ఆదాయం, లాభాలు భారత్‌లో వారి కార్యకలాపాలకు అనుగుణంగా లేవని, దాని విదేశీ సంస్థల చెల్లింపులపై కట్టాల్సిన పన్నుల్ని ఎగవేసిందని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. ఉద్యోగులిచ్చిన వాంగ్మూలాలు, డిజిటల్ ప్రూఫ్‌లు, సేకరించిన డాక్యుమెంట్ల ద్వారా ఆ గ్రూప్‌లో భారీగా ఆర్థిక అవకతవకలు, పన్ను ఎగవేతలు చేసినట్టుగా ఆదాయ పన్ను శాఖ అధికారులు గుర్తించారని తెలిపింది. ప్రైసింగ్ డాక్యుమెంటేషన్ బదిలీకి సంబంధించి ఎన్నో వ్యత్యాసాలు, అవకతవకలు జరిగినట్టుగా ఐటీ సర్వేలో తేలిందని ఆ ప్రకటన వివరించింది. పన్ను చెల్లింపులో అవకతవకలు జరిగాయని ఆరోపించిన ఐటీ శాఖ సర్వే సమయంలో మందకొడిగా వ్యవహరిస్తూ ప్రతీది ఆలస్యం చేసే వ్యూహాలు రచించిందని ఆరోపించింది. ఢిల్లీ, ముంబై కార్యాలయాల్లో ఫిబ్రవరి 14 నుంచి 16 వరకు మూడు రోజుల పాటు దాదాపు 60 గంటలు ఐటీ శాఖ సర్వే నిర్వహించింది. 2002 గుజరాత్ మతఘర్షణలకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బాధ్యుడిగా ఆరోపిస్తూ ‘‘ఇండియా ది మోదీ క్వశ్చన్’’ పేరిట బీబీసీ డాక్యుమెంటరీని ప్రసారం చేసిన కొద్ది రోజుల్లోనే ఐటీ శాఖ సర్వే జరపడం చర్చనీయాంశంగా మారింది. -
2022లో ప్రకటనల వ్యయాలు...
ముంబై: ప్రకటనల వ్యయాల విషయంలో 2022 భారత్ ఒక కీలక మైలురాయిని అధిగమించనుందని గ్రూప్ఎమ్ ఇండియా ప్రెసిడెంట్ (ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రైసింగ్) సిద్ధార్థ్ పరాశర్ పేర్కొన్నారు. ప్రస్తుత క్యాలెండర్ ఇయర్ 2022లో భారత్ మొత్తం ప్రకటనల వ్యయం 22 శాతం వృద్ధితో రూ.1,07,987 కోట్లకు చేరుతుందని పేర్కొంటూ అంతర్జాతీయ ప్రముఖ మీడియా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ గ్రూప్ఎమ్ తన ‘ దిస్ ఇయర్, నెక్ట్స్ ఇయర్’ 2022 (టీవైఎన్‌వై) ప్రకటనల వ్యయ (యాడెక్స్) అంచనాల నివేదికను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. టెలివిజన్‌ను అధిగమించి డిజిటల్ విభాగం అతిపెద్ద మాధ్యమంగా అవతరించనుందని కూడా నివేదిక పేర్కొంది. ఆయా అంశాలపై సిద్ధార్థ్ పరాశర్ వ్యాఖ్యానిస్తూ, డిజిటల్ రంగం పురోగమిస్తున్నప్పటికీ, కరోనా కష్టకాలం తర్వాత ఓఓహెచ్ (అవుట్ ఆఫ్ హోమ్) అడ్వర్టైజింగ్, సినిమా విభాగాలు కూడా పురోగమిస్తాయని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ఇ–కామర్స్‌పై ప్రకటనలు, ఓటీటీ, షార్ట్ ఫార్మేట్ వీడియోల రంగాల్లో 2021లో చోటుచేసుకున్న వృద్ధి 2022లో కూడా కొనసాగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. బ్రాండ్స్ విషయంలో వినియోగదారు దృష్టి సారించే విధానాలపై మహమ్మారి పాఠాలు నేర్పిందని పేర్కొన్నారు. బ్రాండ్స్ తమ మార్కెట్ నమూనాలను ఆధునికీరించుకోడానికి ఆయా అంశాలు దోహదపడుతున్నట్లు తెలిపారు. దీనితోపాటు వివిధ మాధ్యమాలు పలు ఉత్పత్తులకు విస్తృత వినియోగ మార్కెట్‌ను సృష్టిస్తున్నట్లు విశ్లేషించారు. -
ఈ–కామర్స్ కంపెనీలు, దోపిడీ ధరల్ని ప్రోత్సహిస్తున్నాయి
న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను ఉల్లంఘించాయంటూ ఈ–కామర్స్ కంపెనీల మీద వర్తకులు, వాణిజ్య సంఘాల నుంచి ఫిర్యాదులు అందాయని వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాశ్ లిఖిత పూర్వకంగా లోక్‌సభకు వెల్లడించారు. ‘మార్కెట్‌ప్లేస్ ఆధారిత ఈ–కామర్స్ కంపెనీలు సంక్లిష్ట యాజమాన్య పద్ధతులను అవలంభిస్తున్నాయి. నియంత్రిత, ప్రాధాన్యత గల విక్రేతల ద్వారా సరుకు నిల్వ చేసుకుని అమ్మకాలను సాగిస్తున్నాయి. భారీ తగ్గింపులు, దోపిడీ ధర, ప్రత్యేక ఒప్పందాలను ప్రోత్సహిస్తున్నాయి’ అంటూ ఫిర్యాదులు వచ్చాయని మంత్రి తెలిపారు. -
బంగారం... 1,300 డాలర్లకు వచ్చే అవకాశం!
అంతర్జాతీయంగా తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఎదురయితే, పసిడి ధర వేగంగా పెరగడం సహజం. ఆర్థిక వ్యవస్థపై నిజానికి కోవిడ్–19(కరోనా) వైరస్ ప్రభావం కారణంగా అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్–నైమెక్స్‌లో ఔన్స్ (31.1గ్రా) ధర ఈ నెల మొదట్లో పసిడి ఎనిమిదేళ్ల గరిష్టం 1,704 డాలర్లను తాకింది. అయితే అటు తర్వాత పెట్టుబడులకు సురక్షిత సాధనంగా భావించే ఈ మెటల్ నుంచీ డబ్బును ఇన్వెస్టర్లు ఉపసంహరించి డాలర్లోకి పంప్ చేయడం ప్రారంభించారు. దీనితో ఆరు ప్రధాన కరెన్సీలతో ట్రేడయ్యే డాలర్ ఇండెక్స్ 103 స్థాయి దాటేసింది (52 వారాల కనిష్టం 95.61). పసిడి 20వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో 1,501 డాలర్ల వద్ద ముగిసింది. ఒక దశలో 1,460 డాలర్ల స్థాయినీ చూసింది. పసిడి 52 వారాల కనిష్టం 1,266 డాలర్లు. బులిష్ ధోరణే...: భారీగా పెరిగిన పసిడి నుంచి ప్రస్తుతం లాభాల ఉపసంహరణే జరుగుతోంది తప్ప, మెటల్ బేరిష్ ధోరణిలోకి వెళ్లలేదన్నది పలువురి అభిప్రాయం. ఒకవేళ అలా అయినా మహాఅయితే మరో 150 డాలర్లు పతనం కావచ్చని, 1,360, 1,300 డాలర్లు పసిడికి పటిష్ట మద్దతని వాదనలు ఉన్నాయి. పసిడి కొనుగోళ్లకు ఇది సువర్ణ అవకాశమని యూబీఎస్ గ్రూప్‌లో కమోడిటీ, విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వానీ గార్డెన్ పేర్కొంటున్నారు. పలు సెంట్రల్ బ్యాంకులు సరళతర ఆర్థిక విధానాలు అనుసరిస్తున్న నేపథ్యంలో తిరిగి పసిడి భారీగా పెరగడం ఖాయమన్నది ఆయన విశ్లేషణ. కరోనా ప్రభావంతో ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమై కరెన్సీ యుద్ధం ప్రారంభమయిన పక్షంలో పసిడే ఇన్వెస్టర్లకు ఏకైక పెట్టుబడి సాధనమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన పేర్కొన్నారు. -
రాఫెల్ ఒప్పందంపై సుప్రీంలో ఆసక్తికర వాదనలు..
సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్ ఒప్పందానికి సంబంధించి పూర్తి వివరాలు ప్రజా బాహుళ్యంలోకి చేరాలా లేదా అనేది నిర్దారించిన తర్వాతే విమానాల ధరలపై చర్చ జరగాలని సుప్రీం కోర్టు పేర్కొంది. రాఫెల్ విమానాల ధరల వివరాలు ప్రజలకు బహిర్గతం చేయాలా లేదా అనే దానిపై మనం ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ అన్నారు. రూ 60,000 కోట్ల రాఫెల్ ఒప్పందంపై జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లతో కూడిన సుప్రీం బెంచ్ ఎదుట బుధవారం వాదనలు జరిగాయి. మరోవైపు రాఫెల్ డీల్‌పై కోర్టు పర్యవేక్షణలో విచారణ చేపట్టాలన్న పిటిషనర్ల వాదనను కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాల సేకరణ న్యాయస్ధానాల సమీక్ష పరిధిలో లేని అంశమని స్పష్టం చేసింది. రాఫెల్ డీల్‌పై ఆరోపణలు కేవలం మీడియా వార్తలు, వదంతుల ఆధారంగానే ఉన్నందున ఈ అంశంలో న్యాయస్ధానం జోక్యం అవసరం లేదని కేంద్రం తరపున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ పేర్కొన్నారు. రాఫెల్ డీల్‌లో టెండర్ ప్రక్రియను తప్పించుకునేందుకు ప్రభుత్వాల మధ్య ఒప్పందంగా (ఐజీఏ)గా దీన్ని చేపట్టిందని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పిటిషనర్ల తరపున వాదనలు వినిపించారు. ప్రభుత్వం గోప్యత క్లాజును అడ్డుపెట్టుకుని రాఫెల్ విమానాల ధరలు వెల్లడించకుండా దాగిఉందని ఆరోపించారు. ఈ డీల్‌కు సంబంధించి -
ఓలా, ఉబర్ క్యాబ్ లకు మీటర్లు తప్పనిసరి!
న్యూఢిల్లీః ఓలా, ఉబర్ వంటి టాక్సీ అగ్రిగేటర్లపై ప్రభుత్వం కొరడా ఝళిపించనుంది. ఇష్టారాజ్యంగా రేట్లను పెంచి, అనైతికంగా వినియోగదారులను నిలువుదోపిడీ చేస్తున్న ప్రైవేట్ క్యాబ్ లపై దృష్టి సారించింది. ఇప్పటికే ఉబర్, ఓలా ట్యాక్సీల ధరల పెంపుపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. త్వరలో అటువంటి నిబంధనలను మోటార్ వాహనాల చట్టం పరిధిలోకి తేనుంది. ఆయా అగ్రిగేటర్లను 'ఇంటర్మీడియరీస్' పేరున రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఓ ప్రత్యేక వర్గంగా గుర్తించనుంది. ఓలా, ఉబర్ ట్యాక్సీలు అమాంతం రేట్లను పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని గతంలో కేజ్రీవాల్ ప్రభుత్వం హెచ్చరించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ దేశవ్యాప్తంగా ప్రైవేట్ క్యాబ్ ల దోపిడీ రోజురోజుకూ పెరిగిపోతుండటంతో ప్రభుత్వం స్పందించింది. వారిని కూడ మోటార్ వాహనాల చట్టం పరిధిలోకి తెచ్చి ధరలపై నిబంధనలు విధించేందుకు కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాలు సూచించిన ధరలను అనుసరించే విధంగా చట్టం రూపొందనుంది. భారత ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించనున్న 'ఇంటర్ మీడియరీస్' వర్గం ఇంన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 పరిధిలోకి కూడ వస్తుంది. ఈ విషయంలో చివరి నిర్ణయం తీసుకునేందుకు ఎనిమిది రాష్ట్రాల రవాణా మంత్రులు జూన్ చివర్లో ధర్మశాలలో సమావేశం కానున్నారు. అనుకున్న ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ లభిస్తే ఓలా, ఉబర్ క్యాబ్ లు కూడ ఆటోల్లాగే ఆయా నగరాల నిబంధనలను బట్టి మీటర్లు, డ్రైవర్ల డ్రస్ కోడ్.. వంటివి పాటించాల్సి ఉంటుంది.