
సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్ ఒప్పందానికి సంబంధించి పూర్తి వివరాలు ప్రజా బాహుళ్యంలోకి చేరాలా లేదా అనేది నిర్దారించిన తర్వాతే విమానాల ధరలపై చర్చ జరగాలని సుప్రీం కోర్టు పేర్కొంది. రాఫెల్ విమానాల ధరల వివరాలు ప్రజలకు బహిర్గతం చేయాలా లేదా అనే దానిపై మనం ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ అన్నారు. రూ 60,000 కోట్ల రాఫెల్ ఒప్పందంపై జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లతో కూడిన సుప్రీం బెంచ్ ఎదుట బుధవారం వాదనలు జరిగాయి.
మరోవైపు రాఫెల్ డీల్‌పై కోర్టు పర్యవేక్షణలో విచారణ చేపట్టాలన్న పిటిషనర్ల వాదనను కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాల సేకరణ న్యాయస్ధానాల సమీక్ష పరిధిలో లేని అంశమని స్పష్టం చేసింది. రాఫెల్ డీల్‌పై ఆరోపణలు కేవలం మీడియా వార్తలు, వదంతుల ఆధారంగానే ఉన్నందున ఈ అంశంలో న్యాయస్ధానం జోక్యం అవసరం లేదని కేంద్రం తరపున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ పేర్కొన్నారు.
రాఫెల్ డీల్‌లో టెండర్ ప్రక్రియను తప్పించుకునేందుకు ప్రభుత్వాల మధ్య ఒప్పందంగా (ఐజీఏ)గా దీన్ని చేపట్టిందని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పిటిషనర్ల తరపున వాదనలు వినిపించారు. ప్రభుత్వం గోప్యత క్లాజును అడ్డుపెట్టుకుని రాఫెల్ విమానాల ధరలు వెల్లడించకుండా దాగిఉందని ఆరోపించారు. ఈ డీల్‌కు సంబంధించి
Comments
Please login to add a commentAdd a comment