
న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను ఉల్లంఘించాయంటూ ఈ–కామర్స్ కంపెనీల మీద వర్తకులు, వాణిజ్య సంఘాల నుంచి ఫిర్యాదులు అందాయని వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాశ్ లిఖిత పూర్వకంగా లోక్‌సభకు వెల్లడించారు.
‘మార్కెట్‌ప్లేస్ ఆధారిత ఈ–కామర్స్ కంపెనీలు సంక్లిష్ట యాజమాన్య పద్ధతులను అవలంభిస్తున్నాయి. నియంత్రిత, ప్రాధాన్యత గల విక్రేతల ద్వారా సరుకు నిల్వ చేసుకుని అమ్మకాలను సాగిస్తున్నాయి. భారీ తగ్గింపులు, దోపిడీ ధర, ప్రత్యేక ఒప్పందాలను ప్రోత్సహిస్తున్నాయి’ అంటూ ఫిర్యాదులు వచ్చాయని మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment