ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరో భారీ సేల్‌కు సిద్ధమైంది. దసరా పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ‘బిగ్ దసరా సేల్’ పేరుతో ఈ నెల 22 నుంచి 29 వరకు ప్రత్యేక సేల్ నిర్వహిస్తుంది.
ఈ సేల్‌లో భాగంగా ఆయా బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌లపై షాపింగ్ చేసిన కస్టమర్లకు పది శాతం డిస్కౌంట్, ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్లకు పది శాతం ఈ నెల 21 నుంచి డిస్కౌంట్ అందిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. ఇక,సూపర్ కాయిన్ల ద్వారా ఐదు శాతం అదనపు డిస్కౌంట్ అందుకోవచ్చునని తెలిపింది.
దసరా సేల్‌లో స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, హోం అప్లయెన్సెస్, దుస్తులపై ఆఫర్లు అందచేస్తున్న ఫ్లిప్ కార్ట్ .. పలు కంపెనీలకు చెందిన అన్నీ రకాల స్మార్ట్‌ఫోన్‌లపై ఆఫర్లను అందిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధులు చెబుతున్నారు. ఐఫోన్ 14తోపాటు పలు స్మార్ట్ ఫోన్లపై త్వరలో ఆఫర్లు ప్రకటించనున్నది. కాగా, ఫ్లిప్‌కార్ట్ కొద్ది రోజుల క్రితం బిగ్ బిలియన్ డేస్ సేల్స్‌లో కొనుగోలు దారులకు ఆఫర్లను అందించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment