ఐదింటిలో మూడు దరఖాస్తులు షార్ట్‌లిస్ట్
దేశంలో ఈ–కామర్స్ ఎగుమతి హబ్‌లను ఏర్పాటు చేసేందుకు డీహెచ్‌ఎల్, లెక్స్‌షిప్ సహా కొత్తగా అయిదు సంస్థలు దరఖాస్తు చేసుకున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయిదింటిలో మూడు దరఖాస్తులను షార్‌లిస్ట్ చేసినట్లు, వీటిపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. రెండు హబ్‌లు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ సమీపంలో రాగలవని, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కార్యకలాపాలు ప్రారంభం కాగలవని వివరించారు.
కస్టమ్స్, సెక్యూరిటీ క్లియరెన్స్ మొదలైనవి వేగవంతం చేసేందుకు ఇందులో సదుపాయాలు ఉంటాయి. అలాగే నాణ్యత, సర్టిఫైయింగ్ ఏజెన్సీలు కూడా ఉంటాయి. హబ్‌లను నెలకొల్పిన సంస్థల స్పందనను బట్టి దేశవ్యాప్తంగా ఇలాంటివి మరిన్ని ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం సవివరంగా మార్గదర్శకాలను రూపొందిస్తుందని అధికారి పేర్కొన్నారు. లాజిస్టిక్స్ అగ్రిగేటర్ సంస్థ షిప్‌రాకెట్, ఎయిర్‌కార్గో హ్యాండ్లింగ్ కంపెనీ కార్గో సర్వీస్ సెంటర్‌లను (సీఎస్‌సీ) ఇప్పటికే పైలట్ ప్రాతిపదికన ప్రభుత్వం ఎంపిక చేసింది.
ఇదీ చదవండి: వాట్సప్‌లో చాట్‌జీపీటీ.. అందుకు ఏం చేయాలంటే..
2030 నాటికి ఈ–కామర్స్ ఎగుమతులు 100 బిలియన్ డాలర్లకు చేరవచ్చని, రాబోయే రోజుల్లో 200–250 బిలియన్ డాలర్లకు దూసుకెళ్లవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. అలాగే, ప్రస్తుతం 800 బిలియన్ డాలర్లుగా ఉన్న అంతర్జాతీయ ఈ–కామర్స్ ఎగుమతులు 2030 నాటికి 2 లక్షల కోట్ల డాలర్లకు చేరవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఈ–కామర్స్ ఎగుమతుల్లో అగ్రగామిగా ఉన్న చైనాలో ఎక్స్‌పోర్ట్ హబ్‌లు గణనీయంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment