Export Certificate
-
త్వరలో ఈ–కామర్స్ ఎగుమతి హబ్‌లు
దేశంలో ఈ–కామర్స్ ఎగుమతి హబ్‌లను ఏర్పాటు చేసేందుకు డీహెచ్ఎల్, లెక్స్షిప్ సహా కొత్తగా అయిదు సంస్థలు దరఖాస్తు చేసుకున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయిదింటిలో మూడు దరఖాస్తులను షార్‌లిస్ట్ చేసినట్లు, వీటిపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. రెండు హబ్‌లు ఢిల్లీ ఎయిర్పోర్ట్ సమీపంలో రాగలవని, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కార్యకలాపాలు ప్రారంభం కాగలవని వివరించారు.కస్టమ్స్, సెక్యూరిటీ క్లియరెన్స్ మొదలైనవి వేగవంతం చేసేందుకు ఇందులో సదుపాయాలు ఉంటాయి. అలాగే నాణ్యత, సర్టిఫైయింగ్ ఏజెన్సీలు కూడా ఉంటాయి. హబ్‌లను నెలకొల్పిన సంస్థల స్పందనను బట్టి దేశవ్యాప్తంగా ఇలాంటివి మరిన్ని ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం సవివరంగా మార్గదర్శకాలను రూపొందిస్తుందని అధికారి పేర్కొన్నారు. లాజిస్టిక్స్ అగ్రిగేటర్ సంస్థ షిప్‌రాకెట్, ఎయిర్‌కార్గో హ్యాండ్లింగ్ కంపెనీ కార్గో సర్వీస్ సెంటర్లను (సీఎస్సీ) ఇప్పటికే పైలట్ ప్రాతిపదికన ప్రభుత్వం ఎంపిక చేసింది.ఇదీ చదవండి: వాట్సప్‌లో చాట్‌జీపీటీ.. అందుకు ఏం చేయాలంటే..2030 నాటికి ఈ–కామర్స్ ఎగుమతులు 100 బిలియన్ డాలర్లకు చేరవచ్చని, రాబోయే రోజుల్లో 200–250 బిలియన్ డాలర్లకు దూసుకెళ్లవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. అలాగే, ప్రస్తుతం 800 బిలియన్ డాలర్లుగా ఉన్న అంతర్జాతీయ ఈ–కామర్స్ ఎగుమతులు 2030 నాటికి 2 లక్షల కోట్ల డాలర్లకు చేరవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఈ–కామర్స్ ఎగుమతుల్లో అగ్రగామిగా ఉన్న చైనాలో ఎక్స్పోర్ట్ హబ్‌లు గణనీయంగా ఉన్నాయి. -
ఏ కష్టమ్స్ లేకుండా..
విలువైన వస్తువులను విదేశాలకు తీసుకెళ్తే.. ఏవైనా విలువైన వస్తువులు, బంగారు నగలను విదేశాలకు తీసుకు వెళ్తున్నారా? తిరిగి వచ్చేటప్పుడు వాటిని మళ్లీ భారత్‌కు తీసుకు రావాలనుకుంటున్నారా? అయితే మీరు ఎక్స్పోర్ట్ సర్టిఫికెట్ పొందాల్సిందే. ఈ సర్టిఫికెట్‌ను విమానాశ్రయాల్లోని ఇంటర్నేషనల్ డిపార్చర్ హాళ్లలోని కౌంటర్లలో మంజూరు చేస్తారు. దీన్ని పొందడానికి ముందుగా అధీకృత వాల్యూవర్‌తో వాటి విలువకు సంబంధించిన సర్టిఫికెట్ పొందాలి. ఎక్స్పోర్ట్ సర్టిఫికెట్ తీసుకుంటే తిరుగు ప్రయాణంలో ఆయా వస్తువులపై సుంకం చెల్లించక్కర్లేదు. లేదంటే ఇబ్బంది తప్పదు. బంగారంపై ఇలా.. ప్రయాణికులు ఎవరైనా ఒక కేజీ వరకు బంగారం కడ్డీలు/ నాణాలు కొన్ని నిబంధనలకు లోబడి వెంట తెచ్చుకోవచ్చు. ప్రయాణికులు భారతీయ లేదా భారత సంతతి పాస్‌పోర్ట్ కలిగి ఉండాలి. కనీసం ఒక ఏడాది విదేశాల్లో ఉండి భారత్‌కు తిరిగి వస్తున్నట్లు ఆధారాలు తప్పనిసరి. తయారీదారుల పేర్లు, సీరియల్ నెంబర్లు, బరువును సూచించే ముద్రలు ఉన్న బంగారం కడ్డీలపై నిర్ణీత దిగుమతి సుంకం వసూలు చేస్తారు. ఇవేవీ లేని వాటిపై అదనపు సుంకం ఉంటుంది. విదేశాల్లో ఏడాది కంటే ఎక్కువ కాలం ఉండి భారత్‌కు తిరిగి వచ్చే పురుషులు సగటున రూ.50 వేల విలువ చేసే బంగారు ఆభరణాలను ఉచితంగా తెచ్చుకోవచ్చు. మహిళలైతే రూ.లక్ష విలువైన ఆభరణాలు తెచ్చుకునే అవకాశం ఉంది. ముత్యాలు, విలువైన రాళ్లు పొదిగిన ఆభరణాలు మినహా ఇతర ఆభరణాలను పరిమితికి మించి తెచ్చుకుంటే సుంకం చెల్లించాల్సి ఉంటుంది. గమనించాల్సిన ఇతర అంశాలు.. కస్టమ్స్, ఇతర సుంకాలను కేవలం స్థానికంగా మార్పిడికి అవకాశం ఉన్న కరెన్సీ రూపంలోనే చెల్లించాలి. ఈ సుంకాలు, నిబంధనలు పరిస్థితులకు అనుగుణంగా మారే అవకాశం ఉంది. కస్టమ్స్ నిబంధనలపై పూర్తి సమాచారం కోసం www.cbec.gov.in వెబ్‌సైట్‌ను చూడండి.