న్యూఢిల్లీ: హోండా ఇండియా పవర్ ప్రోడక్ట్స్ (హెచ్‌ఐపీపీ) తాజాగా ఈ–కామర్స్ విభాగంలోకి ప్రవేశించింది. జనరేటర్లు, వాటర్ పంప్‌లు, టిల్లర్లు, బ్రష్ కటర్లు, లాన్ మోవర్లు వంటి అయిదు రకాల ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించనున్నట్లు సంస్థ చైర్మన్, ఎండీ తకహిరో యుడా తెలిపారు.
తమ కంపెనీ డీలర్ షిప్‌లకు రాలేని కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు డిజిటల్ బాట పట్టినట్లు ఆయన వివరించారు. ‘ప్రస్తుతం మాకు దేశవ్యాప్తంగా 600 పైచిలుకు అవుట్‌లెట్స్ ఉన్నాయి. అయితే, కొన్ని ప్రాంతాల్లో కస్టమర్లకు.. సమీప అవుట్‌లెట్లు 50 కిలోమీటర్ల పైగా దూరంలో ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో కస్టమర్లు ఉత్పత్తులను ఎంచుకునేందుకు, చెల్లింపులు జరిపేందుకు మా వెబ్‌సైట్ ఉపయోగపడుతుంది.
ప్రీ–డెలివరీ ఇన్‌స్పెక్షన్, ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ తదితర కార్యకలాపాలను మా డీలర్లు చూసుకుంటారు‘ అని తకహిరో వివరించారు. ఆన్‌లైన్‌లో కొత్త కస్టమర్ల రాకతో డీలర్లకు కూడా ఆదాయం పెంచుకోవడానికి వీలవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆన్‌లైన్ విభాగాన్ని అయిదు ఉత్పత్తులకు పరిమితం చేస్తున్నామని తకహిరో వివరించారు. ఆన్‌లైన్‌లో తొలి ఏడాది 1,000 యూనిట్ల విక్రయాలను అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment