Honda India
-
ఈ–కామర్స్ రంగంలోకి హోండా ఇండియా పవర్!
న్యూఢిల్లీ: హోండా ఇండియా పవర్ ప్రోడక్ట్స్ (హెచ్‌ఐపీపీ) తాజాగా ఈ–కామర్స్ విభాగంలోకి ప్రవేశించింది. జనరేటర్లు, వాటర్ పంప్‌లు, టిల్లర్లు, బ్రష్ కటర్లు, లాన్ మోవర్లు వంటి అయిదు రకాల ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయించనున్నట్లు సంస్థ చైర్మన్, ఎండీ తకహిరో యుడా తెలిపారు. తమ కంపెనీ డీలర్ షిప్‌లకు రాలేని కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు డిజిటల్ బాట పట్టినట్లు ఆయన వివరించారు. ‘ప్రస్తుతం మాకు దేశవ్యాప్తంగా 600 పైచిలుకు అవుట్‌లెట్స్ ఉన్నాయి. అయితే, కొన్ని ప్రాంతాల్లో కస్టమర్లకు.. సమీప అవుట్లెట్లు 50 కిలోమీటర్ల పైగా దూరంలో ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో కస్టమర్లు ఉత్పత్తులను ఎంచుకునేందుకు, చెల్లింపులు జరిపేందుకు మా వెబ్సైట్ ఉపయోగపడుతుంది. ప్రీ–డెలివరీ ఇన్స్పెక్షన్, ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ తదితర కార్యకలాపాలను మా డీలర్లు చూసుకుంటారు‘ అని తకహిరో వివరించారు. ఆన్లైన్లో కొత్త కస్టమర్ల రాకతో డీలర్లకు కూడా ఆదాయం పెంచుకోవడానికి వీలవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆన్లైన్ విభాగాన్ని అయిదు ఉత్పత్తులకు పరిమితం చేస్తున్నామని తకహిరో వివరించారు. ఆన్లైన్లో తొలి ఏడాది 1,000 యూనిట్ల విక్రయాలను అంచనా వేస్తున్నట్లు చెప్పారు. -
కరోనా ఎఫెక్ట్: ఇక ఆ కార్లు ఉండవు
సాక్షి, ముంబై: అసలే సంక్షోభంలో చిక్కుకున్న ఆటో పరిశ్రమను కరోనా వైరస్ మరింత దెబ్బతీసింది. లాక్డౌన్ కాలంలో అమ్మకాలు అసలే లేకపోవడంతో ఆదాయాలు క్షీణించి కుదేలయ్యాయి. దీంతో హోండా ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. తమ రెండు ప్లాంట్లలో ఒకదానిలో ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. గ్రేటర్ నోయిడా ప్లాంట్ వద్ద హోండా వాహనాల ఉత్పత్తిని నిలిపివేసింది. అంతేకాదు గ్రేటర్ నోయిడా ప్లాంట్‌లో తయారయ్యే హోండా పాపులర్ కార్లు హోండా సివిక్, సీఆర్-వీ కార్లు ఇకపై ఇండియాలో లభ్యంకావని వెల్లడించింది. భారీ పెట్టుబడి అవసరం కనుక ఈ రెండు కార్లను నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించింది. బహుల జనాదరణ పొందిన హోండా సివిక్ ,హోండా సీఆర్-వీరెండు గ్లోబల్ మోడల్స్‌ను నిలిపివేయడం తమకు చాలాకష్టమైన నిర్ణయమని హెచ్‌సీఐఎల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ,డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాజేష్ గోయెల్ పేర్కొన్నారు. అయితే రాబోయే 15 సంవత్సరాలకు ఈ రెండు కార్ల యజమానులకు అన్ని విధాల తమ సహాయ సహకారాల్ని అందిస్తామన్నారు. తాజా నిర్ణయంతో హోండా పోర్ట్‌ఫోలియోలో కాంపాక్ట్ సెడాన్ అమేజ్, మిడ్-సైజ్ సెడాన్ హోండా సిటీ, సబ్-4 ఎమ్ ఎస్యువి డబ్ల్యుఆర్-వీ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ జాజ్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. నోయిడా ప్లాంట్ పెద్ద హోండా వాహనాలు ఉత్పత్తి అవుతుండగా, రాజస్థాన్‌లోని రెండవ తపుకర ప్లాంట్ చిన్న, హై-స్పీడ్ కార్లు తయారవుతున్నాయి. హోండా సిటీ ఉత్పత్తిని తపుకరలోని ప్లాంట్‌కు మార్చనుంది. -
పండుగ సీజనే కాపాడాలి!
(న్యూఢిల్లీ నుంచి డి.శాయి ప్రమోద్) :దేశీయ ఆటో రంగం రాబోయే పండుగ సీజన్‌పై కోటి ఆశలు పెట్టుకుందని, ఈ సీజన్లో విక్రయాలు ఊపందుకుంటాయని భావిస్తున్నామని హోండా మోటర్‌సైకిల్స్, స్కూటర్ ఇండియా సీఈఓ మినోరు కాటో చెప్పారు. ఈ ఏడాది కూడా రుతుపవనాలు ఫెయిలైతే ఆటో కంపెనీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయన్నారు. గత సెప్టెంబర్ నుంచి ఆటో మొబైల్ కంపెనీల విక్రయాలు క్షీణిస్తూ వస్తున్నాయని, గ్రామీణ ఆర్థికవ్యవస్థలో సంక్షోభమే ఇందుకు ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. పండుగసీజన్ బాగున్నా ప్రథమార్ధంలో మందగమనం కారణంగా 2019–20లో ఆటో విక్రయాల్లో పెద్దగా వృద్ధి ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నట్లు చెప్పారాయన. పరిస్థితులు బాగాలేకున్నా, పండుగ సీజన్‌పై ఆశలతో కొత్త వాహనాన్ని తీసుకువచ్చామని తెలియజేశారు. జీడీపీ వృద్ధి, విద్యుత్ వాహనాలు, ప్రభుత్వ పాలసీలు, కొత్త పెట్టుబడులు, నూతన వాహనాల విడుదల తదితర అంశాలపై సంస్థ వైస్‌ప్రెసిడెంట్ యద్వీందర్ సింగ్ గులేరియాతో కలిసి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో ఆయన మాట్లాడారు. విశేషాలివీ... ‘బీఎస్–6’ అమలు ఇబ్బందికరమే... 2025 నుంచి ద్విచక్ర వాహనాలకు సంబంధించి 150 సీసీ దిగువ విభాగాల్లో విద్యుత్ వాహనాలను మాత్రమే విక్రయించాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. అంటే ఇప్పటివరకు బాగా పాపులరైన 100, 110, 125 సీసీ పెట్రోల్ ఇంజిన్ వాహనాల ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేయాల్సి ఉంటుంది. దీంతోపాటు 2020 ఏప్రిల్ 1 నుంచి బీఎస్–6 నిబంధనలకు అనుగుణంగా ఉండే ద్విచక్రవాహనాలనే ఉత్పత్తి చేయాల్సి ఉంది. ఈ డెడ్‌లైన్‌ను అందుకునేందుకు ఆటో కంపెనీలు ఉత్పత్తి ప్లాట్‌ఫామ్‌లను మార్చుకుంటున్నాయి. ఒకపక్క విక్రయాలు బాగా దెబ్బతిన్న ఈ సందర్భంలో ఇంత హడావుడిగా కొత్త నిబంధనలను అమలు చేయడం చాలా ఇబ్బందికరమే. యూరప్ దేశాల్లో యూరో 5 నిబంధనలకు మారేందుకు చాలా గడువిచ్చారు. కానీ ఇక్కడ కేవలం మూడునాలుగేళ్లలో మారాల్సి వస్తోంది. ఈ మార్పు కారణంగా వాహనాల ధరలు పెంచాల్సి వస్తుంది. ఇది విక్రయాలపై మరింత ప్రభావం చూపవచ్చు. ఈ విషయమై ఎస్‌ఐఏఎంతో కలిసి ప్రభుత్వాన్ని సంప్రతిస్తాం. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ భారత్‌లో చాలా బలహీనంగా ఉంది. తక్కువ దూరాలు తిరిగే మార్కెట్లలో ఈవీలకు ఉన్నంత ఆదరణ ఇక్కడ ఉండదు. దేశీయ మార్కెట్లో ఈవీలను ప్రవేశపెట్టడం చాలా పెద్ద సవాలు, ఈ విషయమై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బీఎస్–4 ఉత్పత్తిని కొనసాగిస్తాం... క్రమంగా కంపెనీ ఉత్పత్తులన్నింటినీ బీఎస్–6 నిబంధనలకు అనుగుణంగా మారుస్తాం. అయితే బీఎస్ 4 ప్లాట్‌ఫామ్‌పై ఉత్పత్తిని కొనసాగిస్తూనే ఉంటాం. ఈ వాహనాలను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తాం. ప్రభుత్వ హడావుడి, విక్రయాల మందగమనం కారణంగా ఉత్పత్తి సామర్ధ్య విస్తరణపై పునరాలోచిస్తాం. కొత్త మోడళ్లు, ఆర్అండ్డీపై మాత్రం కొత్త పెట్టుబడులు కొనసాగిస్తాం. ఇప్పటికే ఆరంభించిన గుజరాత్ ప్లాంట్ విస్తరణ పనులు పూర్తిచేస్తాం. తెలుగురాష్ట్రాల్లో అగ్రస్థానం దక్షిణాదిన, ప్రధానంగా ఏపీ, తెలంగాణాల్లో స్కూటర్ల అమ్మకాల పరంగా అగ్రస్థానంలో ఉన్నాం. రెండు రాష్ట్రాల్లో అమ్మకాలు పెంచేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నాం. హైదరాబాద్‌లో రోడ్‌సేఫ్టీ అవగాహనా కార్యక్రమాన్ని రెండేళ్లుగా కొనసాగిస్తున్నాం. తాజాగా విడుదల చేసిన బీఎస్6 అనుకూల యాక్టివా 125సీసీ విక్రయాలను రెండో త్రైమాసికంలో ఆరంభిస్తాం. దీని ధర ఇప్పటి హోండా 125 సీసీ కన్నా 10– 15 శాతం అధికంగా ఉంటుంది. బీఎస్6 వాహనాలతో 2020 చివరకు తమ వాహనాల ద్వారా ఉత్పత్తయ్యే కార్బన్‌డైఆక్సైడ్‌ను 30 శాతం మేర తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వర్షాలు బాగుంటేనే రికవరీ... దేశీయ ఎకానమీ కీలక సంధి దశలో ఉంది. ఈ దఫా వర్షపాతం సరిగ్గా ఉంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో రికవరీ వస్తుంది, ఇప్పటివరకు తీసుకువచ్చిన సంస్కరణలు సత్ఫలితాలిస్తాయి. జీడీపీ అంచనాల కన్నా తక్కువ నమోదవుతోంది, నిజానికి అసలు వృద్ధి అంతకన్నా తక్కువ, 5–6 శాతమే ఉండొచ్చు. కానీ ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే భారత ఎకానమీ నెమ్మదిగానైనా వృద్ధి బాటలోనే పయనిస్తోంది. ఇది మరింత జోరందుకోవాలంటే వినియోగంలో ఊపు రావాల్సి ఉంది. సమీప భవిష్యత్‌లో జీఎస్టీ శ్లాబుల తగ్గింపు ఉండకపోవచ్చు. ఎన్బీఎఫ్సీ సంక్షోభం రూరల్ అమ్మకాలను బాగా దెబ్బతీసింది. ప్రభుత్వం ఈ సంక్షోభాన్ని పరిష్కరించకుంటే ఎకానమీలో మరిన్ని రంగాలకు విస్తరించే ప్రమాదం ఉంది. -
కొత్త హోండా అమేజ్ లాంచ్
-
తెలంగాణలోకి కొత్త హోండా అమేజ్
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ నేడు తన ‘హోండా అమేజ్’ సెకండ్ జనరేషన్ వెర్షన్‌ను హైదరాబాద్‌లో విడుదల చేసింది. అంతా కొత్త ప్లాట్‌ఫామ్‌పై ఈ కారును కంపెనీ రూపొందించింది. దీని ఎక్స్‌షోరూమ్ ప్రారంభ ధర రూ.5.59 లక్షలుగా పేర్కొంది. డీజిల్ సీటీవీ టెక్నాలజీతో భారత మార్కెట్లోకి వచ్చిన తొలి వాహనం ఇదే కావడం విశేషం. భారత కస్టమర్ల అవసరాలు, ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని ఈ వాహనాన్ని అభివృద్ధి చేసినట్టు హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ సేల్స్ మార్కెటింగ్ డైరెక్టర్, ఎస్వీపీ రాజేష్ గోయల్ చెప్పారు. హెచ్‌సీఐఎల్ వ్యాపారాలకు బలమైన పునాదుల్లో ఇదీ ఒకటిగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తమ వ్యాపారాలను వృద్ధి చేసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తుందన్నారు. కొత్త అమేజ్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ రూపంలో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో లభ్యమౌతుంది. పెట్రోల్ వేరియంట్ల ధరలు రూ.5.59 లక్షలు నుంచి రూ.7.99 లక్షల శ్రేణిలో, డీజిల్ వేరియంట్ల ధరలు రూ.6.69 లక్షలు నుంచి రూ.8.99 లక్షల శ్రేణిలో ఉన్నాయి. దీనిలో డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, రియర్ పార్కింగ్ సెన్సర్స్, ఏబీఎస్ వంటి పలు ఫీచర్లు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. అంతా కొత్త డిజైన్, అధునాతనమైన, విశాలమైన ఇంటీరియర్, మరింత సమర్థవంతమైన పవర్‌ట్రెయిన్, అత్యుత్తమ డ్రైవింగ్ డైనమిక్స్, అధునాతన ఫీచర్లు, సేఫ్టీ టెక్నాలజీలు ఈ కారు ఆఫర్ చేస్తోంది. గత కొన్ని రోజుల క్రితమే ఈ వాహనాన్ని ఢిల్లీలో లాంచ్ చేశారు. నేడు(మంగళవారం) కంపెనీ హైదరాబాద్‌లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. -
హోండా అమేజ్, మొబిలియో ‘సెలబ్రేషన్ ఎడిషన్’
న్యూఢిల్లీ: వచ్చే పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకోవడానికి ప్రముఖ కార్ల కంపెనీ హోండా ఇండియా తన కాంపాక్ట్ సెడాన్ అమేజ్, మల్టీ పర్పస్ వెహికల్ మొబిలియోలలో కొత్తగా సెలబ్రేషన్ ఎడిషన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అమేజ్, మొబిలియోలలో కొత్త ఎడిషన్‌ను తీసుకురావడం చాలా ఆనందంగా ఉందని, కస్టమర్లకు కొత్త ప్రాడక్ట్‌లను అందించడంలో కంపెనీ ఎప్పుడూ ముందుంటుందని హోండా ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జ్ఞానేశ్వర్ సేన్ తెలిపారు. ఈ సెలబ్రేషన్ ఎడిషన్‌లో స్టైలిష్ బాడీ గ్రాఫిక్స్, ఎక్స్టీరియర్ డెకరేషన్ వంటి ప్రత్యేకతలు ఉంటాయని పేర్కొన్నారు.