సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ నేడు తన ‘హోండా అమేజ్’ సెకండ్ జనరేషన్ వెర్షన్‌ను హైదరాబాద్‌లో విడుదల చేసింది. అంతా కొత్త ప్లాట్‌ఫామ్‌పై ఈ కారును కంపెనీ రూపొందించింది. దీని ఎక్స్‌షోరూమ్ ప్రారంభ ధర రూ.5.59 లక్షలుగా పేర్కొంది. డీజిల్ సీటీవీ టెక్నాలజీతో భారత మార్కెట్‌లోకి వచ్చిన తొలి వాహనం ఇదే కావడం విశేషం. భారత కస్టమర్ల అవసరాలు, ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని ఈ వాహనాన్ని అభివృద్ధి చేసినట్టు హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ సేల్స్ మార్కెటింగ్ డైరెక్టర్, ఎస్‌వీపీ రాజేష్ గోయల్ చెప్పారు. హెచ్‌సీఐఎల్ వ్యాపారాలకు బలమైన పునాదుల్లో ఇదీ ఒకటిగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తమ వ్యాపారాలను వృద్ధి చేసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తుందన్నారు.
కొత్త అమేజ్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ రూపంలో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో లభ్యమౌతుంది. పెట్రోల్ వేరియంట్ల ధరలు రూ.5.59 లక్షలు నుంచి రూ.7.99 లక్షల శ్రేణిలో, డీజిల్ వేరియంట్ల ధరలు రూ.6.69 లక్షలు నుంచి రూ.8.99 లక్షల శ్రేణిలో ఉన్నాయి. దీనిలో డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, రియర్ పార్కింగ్ సెన్సర్స్, ఏబీఎస్ వంటి పలు ఫీచర్లు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. అంతా కొత్త డిజైన్, అధునాతనమైన, విశాలమైన ఇంటీరియర్, మరింత సమర్థవంతమైన పవర్ట్రెయిన్, అత్యుత్తమ డ్రైవింగ్ డైనమిక్స్, అధునాతన ఫీచర్లు, సేఫ్టీ టెక్నాలజీలు ఈ కారు ఆఫర్ చేస్తోంది. గత కొన్ని రోజుల క్రితమే ఈ వాహనాన్ని ఢిల్లీలో లాంచ్ చేశారు. నేడు(మంగళవారం) కంపెనీ హైదరాబాద్‌లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment