
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా సిటీ, అమేజ్ మోడళ్ల ధరలను జూన్ నుంచి ఒక శాతం వరకు పెంచనున్నట్లు తెలిపింది. పెరిగిన వ్యయ ఒత్తిళ్ల ప్రభావాన్ని అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ బుధవారం (మే24) ప్రకటించింది.
హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో అమేజ్ ధర రూ.6.99 లక్షల నుంచి రూ.9.60 లక్షల వరకు ఉంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ ట్రిమ్స్‌తో సహా సిటీ మోడల్ శ్రేణి రూ.11.55 లక్షలు మొదలుకుని రూ.20.39 లక్షల వరకు ఉంది.
మరోవైపు హోండా ఇండియా కార్స్ తన తాజా ఎస్‌యూవీ లాంచింగ్ తేదీని ధ్రువీకరించింది. జూన్ 6న హోండా ఎలివేట్ ఎస్‌యూవీని ఆవిష్కరించనుంది. ఈ ఎస్‌యూవీకి సంబంధించిన టీజీర్ చిత్రాన్ని హోండా ట్విటర్ ద్వారా విడుదల చేసింది.
ఇదీ చదవండి: e-Sprinto Amery: మార్కెట్‌లోకి మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి చార్జి చేస్తే 140 కిలోమీటర్లు..
Comments
Please login to add a commentAdd a comment