Prices up
-
తాత్కాలికంగా బంద్.. కస్టమర్లు మన్నించాలి.. మెక్‌డొనాల్డ్, సబ్వే షాకింగ్ నిర్ణయం!
న్యూఢిల్లీ: ఇటీవల కొన్ని వారాలుగా ఎక్కడ విన్నా, ఏ వార్త చూసిన టమోట పేరే వినపడుతోంది. ఈ ఏడాది ఎన్నడూ లేనంతగా రికార్డ్ ధరలు పలకడంతో ఈ పంట వేసిన రైతులు కొందరు లక్షాధికారి కాగా, మరికొందరు కోటీశ్వరులు కూడా అయ్యారు. దీని ధరలు దడపుట్టిస్తుండడంతో సామాన్య ప్రజలు వంటలో టమోటాకు ప్రత్యామ్నాయాన్ని చూస్తున్నారు. తాజాగా ఇంటర్నెషనల్ సంస్థలైన సబ్వే, మెక్‌డొనాల్డ్ కూడా టమోట దెబ్బను తట్టుకోలేక షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నాయి. భారత్‌లో పలు సబ్వే అవుట్లెట్లు తమ సలాడ్స్, శాండ్‌విచ్‌ల్లో టమాటలను జోడించడం నిలిపివేశాయి. నాణ్యతా పరమైన అంశాలతో పాటు అధిక ధరల కారణంగా సబ్వే ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల పలు కారణాల వల్ల కిచెన్‌లోకి కావాల్సిన ప్రధానమైన వస్తువుల ధరలు 400 శాతానికి చేరుకున్నాయి. ప్రత్యేకంగా టమోట ధరలు కన్నీళ్లను తెప్పిస్తోంది. మరో వైపు ప్రభుత్వం జోక్యం చేసుకున్నప్పటికీ కొన్ని మార్కెట్లలో రికార్డు స్థాయికి దారితీసింది. ఇటీవల ఢిల్లీ ఎయిర్పోర్ట్ టెర్మినల్‌లోని ఒక సబ్వే అవుట్లెట్ ఓ బోర్డులో ఇలా రాసుంది. " కస్టమర్లు మన్నించాలి. తాత్కాలికంగా టమోటాలు అందుబాటులో లేదని తెలిపింది. వీలైనంత త్వరగా టమోట సరఫరాలను పునరుద్ధరించడానికి తాము చురుకుగా పని చేస్తున్నామని అవుట్లెట్ కస్టమర్లకు హామీ ఇచ్చింది. భారతదేశంలోని సబ్వే అవుట్లెట్లలో దాదాపు వందల సంఖ్యల్లో ఉన్నప్పటికీ ఈ నిర్ణయం ద్వారా ప్రభావితమైన అవుట్లెట్ల ఖచ్చితమైన సంఖ్య అస్పష్టంగానే ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా మరికొన్ని సబ్వే అవుట్‌లెట్స్‌లో టమాటాలను సర్వ్ చేయడం కొనసాగుతోంది. సబ్వే, మెక్‌డొనాల్డ్స్ బాటలోనే డామినోస్, కేఎఫ్‌సీ టమాటాల వాడకం తగ్గించాయి. చదవండి: ఐదేళ్లకు లక్ష్మీదేవీ తలుపు తట్టింది.. కొన్ని రోజుల్లో ఆయన లక్షాధికారి! -
హోండా కార్లు కొనేవారికి చేదువార్త! ఆ మోడళ్ల ధరల పెంపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా సిటీ, అమేజ్ మోడళ్ల ధరలను జూన్ నుంచి ఒక శాతం వరకు పెంచనున్నట్లు తెలిపింది. పెరిగిన వ్యయ ఒత్తిళ్ల ప్రభావాన్ని అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ బుధవారం (మే24) ప్రకటించింది. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో అమేజ్ ధర రూ.6.99 లక్షల నుంచి రూ.9.60 లక్షల వరకు ఉంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ ట్రిమ్స్‌తో సహా సిటీ మోడల్ శ్రేణి రూ.11.55 లక్షలు మొదలుకుని రూ.20.39 లక్షల వరకు ఉంది. మరోవైపు హోండా ఇండియా కార్స్ తన తాజా ఎస్యూవీ లాంచింగ్ తేదీని ధ్రువీకరించింది. జూన్ 6న హోండా ఎలివేట్ ఎస్‌యూవీని ఆవిష్కరించనుంది. ఈ ఎస్‌యూవీకి సంబంధించిన టీజీర్ చిత్రాన్ని హోండా ట్విటర్ ద్వారా విడుదల చేసింది. ఇదీ చదవండి: e-Sprinto Amery: మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి చార్జి చేస్తే 140 కిలోమీటర్లు.. -
మహీంద్రా థార్ కావాలంటే మరో రూ.లక్ష కావాలి!
మహీంద్రా థార్ వాహనాల ధర రూ.1.05 లక్షల వరకు పెరిగింది . బీఎస్ 6 ఫేజ్ 2 , ఆర్డీఈ ఉద్గార నిబంధనలకు రూపొందించిన నేపథ్యంలో ధరలు పెంచినట్లు తెలుస్తోంది. థార్ X (O) హార్డ్ టాప్ డీజిల్ MT RWD వేరియంట్ ధర రూ. 55,000, మహీంద్రా థార్ LX హార్డ్ టాప్ డీజిల్ MT RWD వేరియంట్ ధర రూ.1.05 లక్షలు పెరిగాయి. ఇతర మోడళ్ల ధర కూడా రూ. 28,000 పెరిగింది. మహీంద్రా థార్ ఎస్యూవీ టాప్-స్పెక్ LX హార్డ్ టాప్ డీజిల్ AT 4WD కొత్త ధర రూ.16.77 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే బేస్ వేరియంట్ ధర రూ.13.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. థార్ కొత్త వేరియంట్? మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ థార్ కొత్త వేరియంట్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం. లీక్ అయిన ఆర్టీఓ డాక్యుమెంట్ ప్రకారం ఆ కొత్త వేరియంట్ ఎంట్రీ లెవల్ థార్ 4x4 వేరియంట్ – AX (AC). ఈ మోడల్ ప్రస్తుతం ఉన్న AX (O) వేరియంట్ కంటే తక్కువగా స్థాయిలో త్వరలో రాబోయే మారుతి సుజుకీ జిమ్నీ కంటే ఎక్కువ స్థాయిలో ఉంటుంది. మహీంద్రా థార్ 4x4 AX (AC) వేరియంట్లో రెండు వరుసల సీట్లు ముందు వైపు రెండు, వెనుకవైపు రెండు ఉండవచ్చని భావిస్తున్నారు. ఇది 2 లీటర్ టర్బో పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ మోడల్‌లలో వస్తుందని పుకార్లు వచ్చాయి. -
డిమాండ్ పెరిగింది.. సరఫరా తగ్గింది
హైదరాబాద్: హైదరాబాద్ ప్రాపర్టీ మార్కెట్లో డిమాండ్ – సరఫరా మధ్య అసమతుల్యత నెలకొందని, దీని ఫలితంగా మార్చి త్రైమాసికంలో ప్రాపర్టీల ధరలు 5.8 శాతం పెరిగినట్టు ‘మ్యాజిక్‌బ్రిక్స్ ప్రాప్ ఇండెక్స్’ నివేదిక వెల్లడించింది. 2023 జనవరి–మార్చి కాలానికి ఈ సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది. ఇళ్లకు డిమాండ్ త్రైమాసికం వారీగా 6 శాతం పెరగ్గా, అదే సమయంలో ఇళ్ల సరఫరా 14.2 శాతం తగ్గినట్టు తెలిపింది. పశ్చిమ హైదరాబాదులో గచ్చిబౌలి, మియాపూర్, కొండాపూర్ ప్రాంతాలకు నివాస పరంగా అధిక డిమాండ్ నెలకొందని, ప్రధాన ఉపాధి కేంద్రాలకు, నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్)కు చేరువగా ఉండడమే అధిక డిమాండ్ కు కారణమని వివరించింది. ఇళ్ల మార్కెట్లో డిమాండ్ అందుబాటు ధరల నుంచి మధ్య స్థాయి (రూ.5000 – 7000 చదరపు అడుగు)కి మారిందని, ప్రస్తుతం నగరంలోని ఇళ్ల డిమాండ్, సరఫరాలో ఈ విభాగమే 50 శాతం వాటా ఆక్రమిస్తోందని తెలిపింది. విశాలమైన ఇళ్లకు ప్రాధాన్యత పెరిగిందని తెలియజేస్తూ.. 90 శాతం డిమాండ్ రెండు, మూడు పడక గదుల ఇళ్లకే ఉన్నట్టు పేర్కొంది. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ 2022–23 ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్ధిక వ్యవస్థ 6–7 శాతం వరకు పెరుగుతుందని ఎన్నో ఏజెన్సీలు అంచనా వేశాయి. ఇటీవలి కేంద్ర బడ్జెట్ సైతం పలు ప్రోత్సాహక కార్యక్రమాలకుతోడు పిఎంఏవై, యూఐడిఎఫ్కు గణనీయమైన కేటాయింపులు చేసింది. ఈ చర్యలు ఉపాధి అవకాశాలను, మౌలిక సదుపాయాల అభివృద్ధిని పెంచుతాయి. సరసమైన, మధ్యస్థాయి విభాగాల్లో రాబోయే త్రైమాసికాలలో డిమాండ్ బాగుంటుందని ఆశిస్తున్నాం’’అని మ్యాజిక్‌బ్రిక్స్ సీఈవో సుధీర్ పాయ్ తెలిపారు. మార్చి త్రైమాసికంలో అత్యధికంగా మెహిదీపట్నం ప్రాంతంలో ప్రాపర్టీ ధరలు 4.27 శాతం పెరగ్గా (త్రైమాసికం వారీగా), కొండాపూర్‌లో 3.96 శాతం, బాలా నగర్లో 3.75 శాతం చొప్పున పెరిగినట్టు ఈ నివేదిక తెలిపింది. అలాగే, బంజారాహిల్స్‌లో 3.94 శాతం, బోడుప్పల్లో 3.77 శాతం, నానక్‌రామ్ గూడలో 3.39 శాతం చొప్పున తగ్గినట్టు పేర్కొంది. -
టాటా కార్లు ప్రియం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన దిగ్గజం టాటా మోటార్స్ కంబషన్ ఇంజిన్ ఆధారిత మోడళ్ల ధరలను 1.2% మేర పెంచుతోంది. ఫిబ్రవరి 1 నుండి ఈ నిర్ణయం అమలులోకి రానున్నట్టు కంపెనీ శుక్రవారం ప్రకటించింది. నూతన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా వాహనాల మార్పు లు, ముడిసరుకు వ్యయాలు పెరగడంతో ధరలను సవరిస్తున్నట్టు టాటా మోటార్స్ వెల్లడించింది. -
షాకిచ్చిన వోల్వో: ఆ మోడల్ కార్లు కొనాలంటే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో కార్ ఇండియా మూడు మోడళ్ల ధరలను పెంచుతోంది. వీటిలో ఎక్స్‌సీ90, ఎక్స్‌సీ60, ఎక్స్‌సీ40 ఉన్నాయి. మోడల్‌నుబట్టి ధర 1.8 శాతం అధికం కానుంది. (Bisleri Success Story 1969-2022: అపుడు 4 లక్షలు, ఇపుడు వేల కోట్లు, ‘బిస్లరీ’ పేరు ఎలా వచ్చింది?) సవరించిన ధరలు నవంబర్ 25 నుంచి అమలులోకి రానున్నాయని కంపెనీ గురువారం తెలిపింది. ఎస్90 పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్, ఎక్స్‌సీ40 పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం పెరగడం తాజా నిర్ణయానికి కారణమని వెల్లడించింది. (షాకింగ్: గూగుల్ పే, పోన్‌పేలాంటి యాప్స్‌లో ఇక ఆ లావాదేవీలకు చెక్?) ఇదీ చదవండి: ఓటీటీలకు షాక్: సీవోఏఐ కొత్త ప్రతిపాదన -
త్వరలో ఆటో చార్జీలు పెంపు?
సాక్షి, చెన్నై: రాష్ట్రవ్యాప్తంగా త్వరలో ఆటో చార్జీలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈమేరకు నియమించిన ప్రత్యేక కమిటీ అన్ని వర్గాల అభిప్రాయాలను క్రోడీకరించి పెంపునకు మొగ్గుచూపాలని సిఫార్సు చేయడమే ఇందుకు కారణం. రాష్ట్రంలోని చెన్నై తదితర ప్రధాన నగరాల్లో ఆటోలకు మీటర్లను 2013లో తప్పని సరి చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పుతో ప్రభుత్వమే అప్పటి నుంచి చార్జీలను నిర్ణయిస్తోంది. ఆ సమయంలో కనిష్ట చార్జీగా రూ. 25, ఆ తర్వాత ప్రతి కి.మీ దూరానికి రూ.12 అదనంగా నిర్ణయించారు. రాత్రుల్లో 50 శాతం మేరకు చార్జీలను పెంచుకునే అవకాశం కల్పించారు. ఆ తర్వాత చార్జీల పెంపుపై దృష్టి సారించలేదు. ఈకాలంలో పెట్రోల్ , డీజిల్ ధరలు అమాంతం పెరగడం వెరసి మీటర్లు వేసే ఆటో డ్రైవర్లే కరువయ్యారు. వారు నిర్ణయించిన చార్జీలను.. ప్రయాణికులు చెల్లించుకోక తప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో డీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చినానంతరం ఆటో చార్జీలపై దృష్టి పెట్టింది. చార్జీల పెంపునకు అన్ని వర్గాల అభిప్రాయల సేకరణ నిమిత్తం ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ చార్జీల పెంపునకు సమ్మతిస్తూ.. ప్రభుత్వానికి బుధవారం నివేదిక అందించింది. ఈ మేరకు కనిష్ట చార్జీ రూ.40గా నిర్ణయించాలని, ఆ తర్వాత ప్రతి కి.మీ దూరానికి రూ. 18గా చార్జీ అదనంగా నిర్ణయించారు. అయితే ఆటో సంఘాలు మాత్రం కనిష్టచార్జీ రూ.50గా నిర్ణయించాలని పట్టుబడుతున్నాయి. ఈనేపథ్యంలో సీఎం స్టాలిన్ ఆమోదం తర్వాత ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ఆటో చార్జీలను సవరించే అవకాశం ఉంది. చదవండి: స్కూటర్ని ఢీ కొట్టిన మోటార్ బైక్: షాకింగ్ వీడియో -
అంత ధరైతే ఎట్టా! పచ్చడి పెట్టలేం.. పండ్లు తినలేం!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: మధుర ఫలం పులుపెక్కింది. ఇటు పచ్చడి నిల్వ చేసుకోవాలనుకునే వారికి.. అటు పండ్ల రుచిని ఆస్వాదించాలనుకున్న వారికి నిరాశే మిగులుతోంది. కొత్తపేట పండ్ల మార్కెట్‌కు గతంలో రోజుకు 1000 టన్నుల మామిడి రాగా, ప్రస్తుతం బాటసింగారం మార్కెట్‌కు 600 టన్నులకు మించి రావడం లేదు. టన్ను ధర (కాయ సైజును బట్టి) రూ.90 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు పలుకుతోంది. నాలుగు రోజుల క్రితం రికార్డుస్థాయిలో రూ.1.24 లక్షలు పలకడం విశేషం. డిమాండ్ మేర దిగుమతి లేకపోవడంతో బహిరంగ మార్కెట్లో ధరలు అమాంతం పెరిగిపోయాయి. పండ్లరసాలు కిలో రూ.150–200 వరకు విక్రయిస్తుండగా, పచ్చడి కాయలు సైజును బట్టి ఒక్కోటి రూ.15–20 చొప్పున అమ్ముతుండటం గమనార్హం. (చదవండి: పిత్తాశయంలో రాళ్లెందుకు వస్తాయి? పరిష్కారాలేమిటి? ) మార్కెట్‌కు తగ్గిన సరఫరా బాటసింగారం మార్కెట్ నుంచి మామిడి సహా ఇతర పండ్లు సరఫరా అవుతుంటాయి. రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం సహా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర శివారు జిల్లాలకు చెందిన రైతులు తమ ఉత్పత్తులను ఇక్కడికే తెచ్చి అమ్ముతుంటారు. ప్రస్తుత సీజన్లో ఆయా జిల్లాల నుంచి రోజుకు సగటున వెయ్యి టన్నులకుపైగా మామిడి రావాల్సి ఉండగా, 500 టన్నుల లోపే వస్తోంది. పచ్చడిలో ఉపయోగించే పుల్లటి మామిడి కాయలే కాదు బంగినపల్లి, తోతాపురి, చెరుకురసం, సువర్ణ రేఖ, నీలం రకాల మామిడి పండ్లు కూడా రావడం లేదు. సాధారణంగా మార్చి చివరి నాటికి మార్కెట్లను ముంచెత్తాల్సిన ఫలరాజం ఏప్రిల్ రెండో వారంలోనూ ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. ఇటు మామిడి.. అటు నిమ్మ వాతావరణ మార్పులతో మామిడి పూత, కాత తగ్గి దిగుబడులపై ప్రతికూల ప్రభావం చూపినట్లు తెలంగాణ రాష్ట్ర కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం అధ్యయనంలో తేలింది. చలికాలంలో భారీ వర్షాలు కురవడం.. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోవడం.. ఫిబ్రవరి నుంచి ఎండలు మండిపోవడం.. మార్చిలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పూత ఎండి పిందె రాలిపోయింది. గతంలో ఒక నిమ్మ చెట్టుకు ఐదు నుంచి ఆరు బస్తాల కాయలు వచ్చేవి. చీడపీడల కారణంగా ఈసారి ఒకటి రెండు బస్తాలకే పరిమితమైంది. వ్యవసాయ మార్కెట్లో బస్తా రూ.2,500 పైగా, సైజును బట్టి రిటైల్‌గా ఒక్కో కాయ రూ.10 పలుకుతోంది. ప్రస్తుతం పచ్చళ్ల సీజన్ మొదలైంది. సాధారణంగా ఈ సీజన్లో ప్రతి ఇంట్లో మామిడి, నిమ్మ పచ్చళ్లను తయారు చేసుకుని ఏడాదంతా నిల్వ చేసుకుంటారు. మామిడి, నిమ్మ కాయల ధరలకు తోడు వంటనూనెలు, మసాల దినుసులు, కారం పొడులు కూడా భారీగా పెరగడంతో పచ్చడి మొతుకుల కోసం సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఆర్థిక భారం తప్పడం లేదు. (చదవండి: అదృశ్యమైన సస్పెండెడ్ హోంగార్డ్ రామకృష్ణ మృతి.. పరువు హత్య?) -
పత్తి ధర క్వింటాల్‌కు రూ.11 వేలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: పత్తి ధర మునుపెన్నడూ లేనివిధంగా పరుగులు పెడుతోంది. రికార్డు స్థాయిలో క్వింటాల్ ధర రూ.11 వేలకు చేరింది. కనీస మద్దతు ధరకు రెట్టింపు ధర పలుకుతుండటంతో రైతుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. మరోవైపు పత్తి గింజల ధరలు సైతం క్వింటాల్‌కు సుమారు రూ.వెయ్యి వరకు పెరిగాయి. పొట్టి పింజ పత్తికి రూ.5,255, పొడవు పింజ రకానికి 5,550 చొప్పున కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించగా.. సీజన్ ప్రారంభంలోనే క్వింటాల్ రూ.7 వేల వరకు పలికింది. ధర క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం రూ.11 వేలకు చేరింది. పత్తి గింజలకు సైతం ఈ ఏడాది డిమాండ్ పెరిగింది. సీజన్ మొదట్లో క్వింటాల్ పత్తి గింజల ధర రూ.3 వేల వరకు పలకగా.. ప్రస్తుతం రూ.4 వేల వరకు ధర పలుకుతోంది. ధరలు పెరగటంతో వచ్చే సీజన్లో పత్తి సాగు విస్తీర్ణం భారీగా పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు ఈ ఏడాది మిర్చి పంట రైతుల్ని నష్టాలకు గురి చేయడంతో ఆ రైతులు పత్తి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే గ్రామాల్లో పత్తి సాగు చేసేందుకు రైతులు కౌలు భూముల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది పత్తి విత్తనాలకు సైతం డిమాండ్ పెరిగే పరిస్థితి ఉంది. దిగుబడి తగ్గినా ధర ఆదుకుంది గత సీజన్లో గుంటూరు జిల్లాలో పత్తి సాగు సాధారణ విస్తీర్ణం 4,23,750 ఎకరాలు కాగా, 2,73,950 ఎకరాల్లో మాత్రమే పంట సాగయ్యింది. ఇందులోనూ అధిక వర్షాలు, గులాబీ రంగు పురుగు కారణంగా కొంత పంట దెబ్బతింది. దాంతో దిగుబడులు కూడా తగ్గాయి. ఇలాంటి పరిస్థితుల నడుమ సీజన్ ప్రారంభంలో క్వింటాల్ ధర రూ.7 వేలు పలకగా.. తరువాత పెరుగుతూ వచ్చింది. పరిస్థితి ఆశాజనకంగా ఉండటంతో క్వింటాల్ ధర రూ.10 వేల వరకు పెరుగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. అయితే, సీజన్ ముగింపు దశలో ఏకంగా రూ.11 వేలకు చేరింది. ఇది రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయి ధరగా నమోదైంది. ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. కనీస మద్దతు ధర కంటే మార్కెట్లో ధరలు అధికంగా ఉండటంతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఈ ఏడాది రైతుల నుంచి కొనుగోళ్లు జరపలేదు. సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం జిల్లాలో గత ఏడాది గులాబీ రంగు పురుగు కారణంగా ఈ ఏడాది ఖరీఫ్‌లో కేవలం 2,73,950 ఎకరాల్లోనే రైతులు పత్తి సాగు చేశారు. పత్తి రైతుల్లో ఎక్కువ మంది మిర్చి పంట వైపు మొగ్గుచూపారు. మిర్చి సాధారణ సాగు విస్తీర్ణం 1,84,442 ఎకరాలు కాగా ఖరీఫ్‌లో 2,66,640 ఎకరాల్లో మిర్చి వేశారు. అయితే, మిర్చికి తామర తెగులు సోకడంతో పంట సుమారు 80 శాతం వరకు దెబ్బతింది. మిర్చి పంట దెబ్బతినడం, పత్తి ధరలు ఆశాజనకంగా ఉండటంతో ఈ ఏడాది పత్తి సాగు భారీగా పెరుగుతుందని ఆశిస్తున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లాకు 13 లక్షల హైబ్రిడ్ పత్తి విత్తన ప్యాకెట్లు అవసరమవుతాయని ప్రభుత్వానికి నివేదికలు పంపాం. ఏప్రిల్ 6న గుంటూరులో విత్తన కంపెనీల ప్రతినిధులతో రాష్ట్రస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. – ఎం.విజయ భారతి, జాయింట్ డైరెక్టర్, వ్యవసాయ శాఖ దరలు ఇంకా పెరగొచ్చు ఈ ఏడాది పత్తి సాగు తగ్గింది. దీనివల్ల మార్కెట్‌కు పంట పెద్దగా రాలేదు. మరోవైపు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. ఫలితంగా పత్తి గింజలకు డిమాండ్ ఏర్పడింది. క్వింటాల్ రూ.4,000 పైగా పలుకుతోంది. జిన్నింగ్ పత్తికి కూడా డిమాండ్ ఉండటంతో మార్కెట్లో ధర పెరుగుతోంది. ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. – ప్రగతి శ్రీనివాసరావు, పత్తి వ్యాపారి -
అల్పాహారం.. అల్లంతదూరం!
సాక్షి, వికారాబాద్ అర్బన్: ఎమర్జెన్సీగా బయటకు వెళ్లే వారు ఎక్కడో ఒకచోట ఆగి ఇష్టమైన టిఫిన్ చేద్దామని అనుకుంటారు. నోటి రుచి కోసం మరికొందరు టిఫిన్ సెంటర్ల నుంచి పార్సిల్ తెచ్చుకొని ఆరగిస్తుంటారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కువగా కనిపించడం లేదు. కొంత ఆలస్యమైనా సరే ఇంట్లోనే టిఫిన్ చేసి పనుల నిమిత్తం బయటకు వెళ్తున్నారు. కొంత ఆలస్యమైనా ఇంట్లోనే అల్పాహారం చేసుకుని తింటున్నారే గాని బయట కొనుక్కోవడానికి పెద్దగా ఇష్ట పడటం లేదు. ఎందుకంటే కరోనాకు ముందు ఉన్న టిఫిన్ ధరలు ఇప్పుడు కంటికి కనిపించడం లేదు. హోటళ్లలో టిఫిన్ల ధరలు అమాంతం పెంచేశారు. కరోనాకు ముందు వికారాబాద్ లాంటి పట్టణాల్లోని పెద్ద పెద్ద హోటళ్లలో ప్లేటు ఇడ్లీ రూ. 20 మాత్రమే ఉండేది. ఇప్పుడు ప్లేటు ఇడ్లీ రూ.35కు పెరిగింది. గతంలో ప్లేట్ వడ(2) రూ. 30 ఉండగా ఇప్పుడు రూ. 45 అమ్ముతున్నారు. నాలుగు బోండాలు.. రూ. 25 ఉండగా ఇప్పుడు రూ. 40కి పెంచారు. ప్రస్తుతం ఒక పరోటా రూ.30కి అమ్ముతున్నారు. గతంలో ప్లేన్ దోశ రూ. 20 ఉండగా ఇప్పుడు ఏకంగా రూ. 30కి పెంచారు. మసాల దోశ రూ. 40కి చేర్చారు. ఇక కాస్త రుచికోసం ఆనియన్ దోశ, ఉత్తప్ప వంటివి కోరితే మాత్రం రూ. 50 చెల్లించాల్సిందే. టిఫిన్ చేశాక కాస్త తియ్యగా టీ, కాఫీ తాగాలనుకునే వారికి తాగక ముందే ధరలను చూసి చేదు అనిపిస్తుంది. కరోనా కంటే ముందు టీ కొన్ని చోట్ల రూ. 5, కొన్ని చోట్ల రూ. 8 అమ్మేవారు. ఇప్పుడు అన్నీ చోట్ల టీ రూ. 10కి అమ్ముతున్నారు. కాఫీ కాస్త రూ. 15కు చేశారు. ధరలు ఇలా ఆకాశాన్ని అంటడంతో సామాన్యులు టిఫిన్లు చేయలేని పరిస్థితి నెలకొంది. మీల్స్ సైతం.. ఇదిలా ఉండగా హోటళ్లలో ప్లేట్ అన్నం రూ. 50 లభించేది. ఇప్పుడు ఏకంగా రూ. 70కి పెంచారు. ఫుల్ మీల్స్ రూ. 70 ఉండేది, ఇప్పుడు అత్యధిక హోటళ్లలో రూ. 100కు చేర్చారు. ఇలా చికెన్, మటన్ బిర్యానీల రేట్లు కూడా అమాంతం పెంచేశారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ధరలు పెంచక తప్పలేదని హోటళ్ల యజమానులు అంటున్నారు. నిత్యావసర వస్తువుల ధరలతో పాటు, హోటల్ అద్దెలు పెంచడంతో తాము ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా అధిక ధరలు సామాన్యులను రుచికరమైన అల్పాహారానికి కొంత దూరం చేసిందనే చెప్పవచ్చు. -
ఇళ్ల ధరలకు ఈ ఏడాది రెక్కలు
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఇళ్ల ధరలు రెక్కలు విప్పుకోనున్నాయి. సుమారు 30 శాతం మేర పెరుగుతాయని ఎక్కువ మంది డెవలపర్లు భావిస్తున్నారు. ప్రధాన కారణం బిల్డింగ్ మెటీరియల్స్ (నిర్మాణంలో వినియోగించే ఉత్పత్తులు) ధరలు గణనీయంగా పెరగడం వల్ల నిర్మాణ వ్యయం కూడా అధికమైనట్టు వారు చెబుతున్నారు. ఇది ధరలపై ప్రతిఫలిస్తుందని చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) ‘రియల్ ఎస్టేట్ డెవలపర్స్ సెంటిమెంట్ సర్వే 2022’ పేరుతో ఒక సర్వేను 2021 డిసెంబర్ 30 నుంచి 2022 జనవరి 11 మధ్య నిర్వహించింది. సర్వేలో 1,322 మంది డెవలపర్లు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సర్వే అంశాలు ► 60 శాతం మంది డెవలపర్లు 2022లో ఇళ్లు/ఫ్లాట్ల ధరలు కనీసం 20 శాతం పెరగొచ్చని అంచనా వేశారు. బిల్డింగ్ మెటీరియల్స్ ధరలు పెరగడం వల్లేనని వీరు చెప్పారు. ► ధరలు 10–20 శాతం మధ్య పెరగొచ్చని 35 శాతం మంది అంచనాగా ఉంది. ► 25 శాతం మంది ధరల పెరుగుదల 10 శాతం వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ► మరో 21 శాతం మంది అయితే ధరల పెరుగుదల 30 శాతం వరకు ఉండొచ్చన్న అభిప్రాయాన్ని తెలియజేశారు. ► నిర్మాణ వ్యయాలను తగ్గించడం, జీఎస్టీపై ఇన్పుట్ క్రెడిట్ (రుణాలు) అందించడం, రుణ లభ్యతను పెంచడం, ప్రాజెక్టులకు అనుమతులు వేగంగా మంజూరు చేయడం వంటి చర్యలు తీసుకోవాలని డెవలపర్లు కోరుతున్నారు. ► 92 శాతం మంది ఈ ఏడాది కొత్త ప్రాజెక్టులను చేపట్టనున్నట్టు తెలిపారు. ముఖ్యంగా 96 శాతం మంది నివాస ప్రాజెక్టులను చేపట్టేందుకే ఆసక్తి చూపించారు. ► 55 శాతం మంది వ్యాపారంలో వర్చువల్ రియాలిటీ టెక్నాలజీని అమలు చేస్తామని చెప్పారు. ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలి ‘‘కరోనా మూడో విడత కొనసాగుతుండడంతో ఈ మహమ్మారి ప్రభావాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలపై దృష్టి సారిస్తుందని భావిస్తున్నాం’’ అని క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ హర్‡్షవర్ధన్ పటోడియా అన్నారు. చాలా మంది డెవలపర్లు డిజిటల్ టెక్నాలజీకి మళ్లడంపై దృష్టి సారించారని, దీంతో ఆన్లైన్ విక్రయాలు పెరిగినట్టు చెప్పారు. ‘‘39 శాతం డెవలపర్లు 25 శాతం అమ్మకాలను ఆన్లైన్లోనే చేస్తున్నారు. ఈ ఏడాది ఆన్లైన్ అమ్మకాలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నాం’’ అని పటోడియా చెప్పారు. -
బాబోయ్.. ఈ చికెన్ చిక్కనంటోంది
సాక్షి, పరిగి( హైదరాబాద్): కోడి మాసం ధరలు కొండెక్కాయి. శ్రావణమాసంలోనూ ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో మాంసాహార ప్రియులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మార్కెట్లో కిలో స్కిన్లెస్ చికెన్ ప్రస్తుత ధర రూ.270 పలుకుతోంది. దీంతో ముక్క గొంతు దాటని పరిస్థితి నెలకొంది. రెండు నెలల వ్యవధిలో ధరలు రెండింతలు పెరిగాయి. దాణా రేట్లు సైతం ఇదే స్థాయిలో పెరిగాయని కోళ్ల పెంపకందారులు చెబుతున్నారు. స్థానికంగా దాణా లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, దీంతో ఖర్చు తడిసి మోపెడవుతోందని పేర్కొంటున్నారు. పండుగ రోజుల్లో కూడా.. జిల్లా వ్యాప్తంగా నిత్యం సుమారు 1.7 లక్షల కిలోల చికెన్ వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతీ ఆదివారం, ఏదైనా పండగ ఉంటే ఆయా రోజుల్లో రెట్టింపు స్థాయిలో అమ్మకాలు జరుగుతాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న పౌల్ట్రీ ఫారాలలో కోళ్ల పెంపకం ముమ్మరంగా సాగుతోంది. కోడి పిల్లలు వేసిన 40 రోజుల్లో కోళ్లు ఎదిగి అమ్మకానికి వస్తాయి. దీంతో కోళ్ల పెంపకందారులు రెండు నెలలకో బ్యాచ్ తీస్తున్నారు. ఏడాది పొడువునా చికెన్‌కు డిమాండ్ ఉంటున్నా.. గతంలో ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు విక్రయాలు బాగా తగ్గేవి. వరలక్ష్మీ వ్రతం, శ్రావణమాసం, వినాయక చవితి, దేవీ నవరాత్రి ఉత్సవాలు, అయ్యప్ప మాలధారణ, కార్తీకమాసం పూజల నేపథ్యంలో శ్రావణ మాసం నుంచి కార్తీకమాసం ముగిసే వరకు చికెన్ వినియోగం తగ్గుతుంది. దీంతో రేట్లు కూడా తగ్గుముఖం పడుతుంటాయి. ఈఏడాది శ్రావణమాసం ముగుస్తున్నా చికెన్ ధరలు మాత్రం పైపైకే వెళ్తున్నాయి. వ్యాపారులంతా సిండికేట్‌గా మారి ఇష్టారీతిన ధరలు నిర్ణయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కారణాలు ఇవే.. కోవిడ్ కారణంగా ప్రభుత్వాలు ఆంక్షలు విధించడంతో కోళ్ల దాణా ధరలు పెరిగాయి. ఆంక్షలు సడలించినా అదుపులోకి రావడం లేదు. దాణాలో ప్రధానమైన సోయాబీన్ అమాంతం ఎగబాకింది. గతంలో కిలో రూ.33 ఉండగా మూడు నెలలుగా రూ.100 పలుకుతోంది. మొక్కజొన్న రూ.14 నుంచి రూ.25 వరకు పెరిగిందని కోళ్ల పెంపకందారులు చెబుతున్నారు. శ్రావణమాసం కావడంతో చాలా మంది రైతులు ఫారాల్లో కొత్త బ్యాచ్‌లు వేయలేదు. దీంతో ఉత్పత్తి తగ్గి డిమాండ్ పెరిగింది. అలాగే కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు చికెన్‌ను ఎక్కువగా తింటున్నారు. వీటి ప్రభావం ధరలపై పడుతోంది. చదవండి: Bullettu Bandi Bride: ‘బుల్లెట్టు బండి’ వధువుకు బంపర్ ఆఫర్ -
పెట్రో ఎక్సయిజ్ పన్నులతోనే మౌలిక వసతుల అభివృద్ధి
న్యూఢిల్లీ: పెట్రో ఉత్పత్తుల అమ్మకం ద్వారా వచ్చిన ఎక్సయిజ్ పన్ను వసూళ్ల మొత్తాలను ఆర్థిక వ్యవస్థ పటిష్టత కోసం దేశవ్యాప్తంగా పలు ప్రాంతా ల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రభుత్వం ఖర్చు చేస్తోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభలో చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో దేశవ్యాప్తంగా సరకు రవాణాపై తీవ్రభారం చూపడంపై సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి పై వివరణ ఇచ్చారు. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగడంతో దేశంలోనూ ఎక్సయిజ్ పన్ను లీటర్‌కు రూ.19.98 నుంచి రూ.32.9కు పెరిగిందని మంత్రి చెప్పారు. 2020–21లో 13వేల కి.మీ.ల రహదారులు సగటున రోజుకు 13 కి.మీ.ల చొప్పున 2020–21 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 13,327 కి.మీ.ల మేర జాతీయ రహదారులను నిర్మించినట్లు రోడ్డు రవాణా, రహదారుల మంత్రి గడ్కరీ లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 1,39,032 కి.మీ.ల జాతీయ రహదారుల్లో 37,058 కి.మీ.ల 4/6 లేన్ల జాతీయరహదారుల వ్యవస్థ ఉందని ఆయన పేర్కొన్నారు. 2021–22లో మరో 12 వేల కి.మీ.ల రహదారులను నిర్మిస్తామన్నారు. -
Petrol, Diesel Prices Hike: సెంచరీ కొట్టిన పెట్రోల్ ధర
Petrol, Diesel Prices Today: దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. శనివారం పలు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్‌పై 19 నుంచి 30 పైసల పెరుగుదల నమోదైంది. వాణిజ్య రాజధాని ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.100 దాటింది. అక్కడ లీటరు పెట్రోల్ ప్రస్తుతం రూ.100.19, డీజిల్ ధర లీటరుకు 92.17 పెరిగినట్లు ప్రభుత్వ ఇంధన రిటైలర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేర్కొంది. ముంబైలో పెట్రోల్ ధర వంద రూపాయలు దాటడం ఇదే మొదటిసారి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ రేటు లీటరుకు రూ.93.94, డీజిల్ రూ.84.89. దేశంలో మే4 నంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వరుసగా ఇది 15వ సారి. ►హైదరాబాద్ లీటర్ పెట్రోల్ రూ. 97.63, డీజిల్ రూ. 92.54 ►కోల్‌కతా లీటర్ పెట్రోల్ రూ. 93.97, డీజిల్ రూ. 87.74 ►చెన్నై లీటర్ పెట్రోల్ రూ. 95.51, డీజిల్ రూ. 89.65 ►బెంగళూరు లీటర్ పెట్రోల్ రూ. 97.07, డీజిల్ రూ. 89.99 చదవండి: సైకిల్ అమ్మకాల స్పీడ్ -
Petrol, Diesel Prices: మళ్లీ పెరిగిన ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే!
Petrol, Diesel Prices Today: దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. గురువారం పెట్రోల్ ధరపై 25 పైసలు, డీజిల్‌పై 32 పైసల పెరుగుదల నమోదైంది. వాణిజ్య రాజధాని ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.100కు చేరువలో ఉంది. అక్కడ లీటరు పెట్రోల్ ప్రస్తుతం రూ.99.94, డీజిల్ ధర లీటరుకు 91.87 పెరిగినట్లు ప్రభుత్వ ఇంధన రిటైలర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేర్కొంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ రేటు లీటరుకు రూ.93.68, డీజిల్ ధర 84.61కు పెరిగింది. మే 4 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఇది పద్నాలుగోసారి. ► హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.97.52, డీజిల్ రూ.92.39 ► చెన్నైలో పెట్రోల్ రేటు 95.28, డీజిల్ ధర లీటరుకు రూ.89.39 ► కోల్‌కతాలో ధరలు పెట్రోల్ ధర 93.72 కాగా లీటర్ డీజిల్ రేటు రూ.87.46 చదవండి: అమెజాన్ చేతికి ఎంజీఎం -
Petrol, Diesel Prices Today: దిగిరాని ధరలు
Petrol, Diesel Prices Today: ఇంధన ధరల్లో ఎటువంటి మార్పు లేదు. మంగళవారం వరుసగా 23 పైసలు, 25 పైసల మేర పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు అలాగే కొనసాగుతున్నాయి. వాణిజ్య రాజధాని ముంబైలో లీటరు పెట్రోల్ ధర. 99.71, డీజిల్ ధర. 91.57 రూపాయాలుగా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఈ ధరలు వరుసగా.. 93.44, 84.32 వద్ద స్థిరంగా ఉన్నాయి. ఇక రాజస్తాన్‌లోని కొన్ని పట్టణాల్లో ఇప్పటికే లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలు దాటేయగా... మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోనూ సెంచరీ మార్కు దిశగా పరుగులు తీస్తోంది. చెన్నై: పెట్రోల్- రూ.95.06, డీజిల్- రూ. 89.11 కోల్‌కతా: పెట్రోల్- రూ. 93.49, డీజిల్- రూ. 87.16 హైదరాబాద్: పెట్రోల్- రూ. 97.27, డీజిల్- రూ. 92.07 -
Petrol, Diesel Prices In May: భారీగా పెరిగిన ధరలు
Petrol, Diesel Prices Today: ఇంధన ధరలు మరోసారి భగ్గుమన్నాయి. పెట్రోల్ ధర 23 పైసలు, డీజిల్ ధర 25 పైసల మేర పెరిగింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ప్రస్తుతం లీటరు పెట్రోల్ రూ. 93.44, డీజిల్ రూ. 84.32 వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇక ముంబైలో అత్యధికంగా ఈ ధరలు వరుసగా రూ. 99.49(సెంచరీకి చేరువలో), 91.30గా ఉన్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇంధన ధరల్లో మార్పులు చేయాలన్న నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ మేరకు రేట్ల మోత మోగుతుండటం గమనార్హం. ఇక ఈ నెలలో ధరలు పెరగటం ఇది పదమూడోసారి. గత మూడు వారాలుగా మొత్తంగా లీటరు పెట్రోల్ ధర. 3.04, డీజిల్ ధర 3.59 మేర పెరిగాయి. లీటరు పెట్రోల్, డీజిల్ ధరలు ఢిల్లీ: పెట్రోల్- రూ. 93.44, డీజిల్- రూ. 84.32 ముంబై: పెట్రోల్- రూ. 99.49, డీజిల్- రూ. 91.30 చెన్నై: పెట్రోల్- రూ.95.06, డీజిల్- రూ. 89.11 కోల్‌కతా: పెట్రోల్- రూ. 93.49, డీజిల్- రూ. 87.16 హైదరాబాద్: పెట్రోల్- రూ. 97.12, డీజిల్- రూ. 91.92 చదవండి: Stock Market:లాభాలతో మొదలైన సూచీలు -
Petrol, Diesel Prices Hike: మరోసారి పెరిగిన ధరలు
Petrol, Diesel Prices Today: వాహనదారులకు ఇంధన ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రెండు రోజుల వ్యవధి అనంతరం పెట్రోల్, డీజిల్ ధరల్లో శుక్రవారం మరోసారి పెరుగుదల నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర 19 పైసలు పెరగగా, ప్రస్తుతం అక్కడ లీటరు ధర రూ. 93.85గా ఉంది. ఇక 29 పైసల మేర డీజిల్ ధర పెరగడంతో లీటరుకు రూ. 83.80 పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇక వాణిజ్య రాజధాని ముంబై విషయానికొస్తే.. లీటరు పెట్రోల్ ధర సెంచరీకి చేరువ(99.32)లో ఉండగా, డీజిల్ ధర రూ. 91.01గా ఉంది. ఇక చెన్నైలో ఈ ధరలు వరుసగా రూ. 94.71, రూ. 88.62, కోల్‌కతాలో రూ. 93.11,రూ. 86.64గా ఉన్నాయి. కాగా గత పద్దెమినిది రోజులుగా మొత్తం మీద లీటరు పెట్రోల్ ధర రూ. 2.64, డీజిల్ ధరలు రూ. 3.07 మేర పెరిగింది. హైదరాబాద్: లీటరు పెట్రోల్ ధర 96.70(20 పైసల పెరుగుదల), డీజిల్ ధర. 91.36(32 పైసలు). నగరం పెట్రోల్ ధర డీజిల్ ధర ఢిల్లీ 93.04 83.80 ముంబై 99.32 91.01 చెన్నై 94.71 88.62 కోల్‌కతా 93.11 86.64 చదవండి: Stock Market: లాభాలతో ప్రారంభమైన సూచీలు -
టయోటా కార్ల ధరల మోత : ఎంతో తెలుసా?
సాక్షి, ముంబై: వాహన తయారీ కంపెనీలు ఒక్కొక్కటిగా ధరల పెంపునకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే మారుతీ సుజుకీ, రెనో, ఇసుజి, హీరో మోటోకార్ప్ కంపెనీలతో పాటు తాజాగా టయోటా కూడా ఈ జాబితాలో చేరింది. ఏప్రిల్ 1 నుంచి తమ వాహన శ్రేణిలోని అన్ని మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వాహన మోడల్, వేరియంట్ బట్టి ధరల పెంపు ఉంటుందని వివరించింది. అధిక ముడి పదార్థాల రేట్లు, ఇతర కారణాల వల్ల ఉత్పాదక వ్యయాలు పెరగడంతో ధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. అయితే, కస్టమర్‌పై కనీస స్థాయిలో మాత్రమే భారం మోపుతామని హామీ ఇచి్చంది. వాహనాల తయారీలో వినియోగించే స్టీల్, అల్యూమినియం సహా కీలకమైన లోహాల ధరలు పెరుగుతున్నాయి. దీంతో వాహన కంపెనీలు కూడా ఈ భారాన్నీ వినియోగదారులకు బదలాయిస్తున్నాయి. -
షాకింగ్ : పెరగనున్న స్మార్ట్ ఫోన్ల ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్ కొనాలని మీరు భావిస్తుంటే వెంటనే కొనుగోలు చేయడం మేలు. త్వరలో యాపిల్, శాంసంగ్, షియోమి, ఒపో వంటి ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్ఫోన్ల ధరలు త్వరలో భారం కానున్నాయి. స్మార్ట్ఫోన్ల తయారీలో ఉపయోగించే డిస్ప్లే, టచ్ ప్యానెళ్లపై ప్రభుత్వం 10 శాతం దిగుమతి సుంకాన్ని విధించడంతో తయారీదారులు ఈ మొత్తాన్ని వినియోగదారులపైనా వడ్డించనున్నారు. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం కింద స్ధానిక ఉత్పత్తులను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం ఆయా వస్తువులపై దిగుమతి సుంకాన్ని విధించింది. ప్రభుత్వ నిర్ణయంతో డిస్ప్లే, టచ్ ప్యానెళ్లపై సుంకంతో పాటు అదనపు సెస్‌ను కలుపుకుంటే దిగుమతిదారులపై 11 శాతం భారం పడనుంది. దిగుమతి సుంకాల కారణంగా సెల్‌ఫోన్ ధరలు 2 నుంచి 5 శాతం వరకూ పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు స్మార్ట్ఫోన్ల ధరలు పెరిగితే పండగ సీజన్ డిమాండ్‌ను దెబ్బతీసే అవకాశం ఉంది. చదవండి : 5జీ ఫోన్ల హవా : వివో ఎక్స్ 50ఈ -
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. వరుస ధరల పరుగుకు ఒక రోజు విరామం అనంతరం నేడు (సోమవారం) పెట్రో, డీజిల్ ధరలను పెంచుతూ ప్రభుత్వరంగ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. రోజువారీ సమీక్షలో భాగంగా లీటర్ పెట్రోల్‌పై 5 పైసలు, డీజిల్‌పై 13 పైసలు పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర .80.43 రూపాయలు, లీటర్ డీజిల్ ధర 80.53రూపాయలకు చేరింది. ఢిల్లీలో శనివారం, పెట్రోల్ లీటరుకు 80.38 రూపాయలు, డీజిలు ధర 80.40 రూపాయలుగా ఉంది. దీంతో ఇప్పటివరకు డీజిల్‌పై మొత్తం 10 రూపాయల 39 పైసలు, పెట్రోల్‌పై 9 రూపాయల 23 పైసలు పెరిగాయి. ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు న్యూఢిల్లీ : పెట్రోలు 80.43 రూపాయలు, డీజిల్ 80.53 రూపాయలు ముంబై : పెట్రోలు 87.19 రూపాయలు, డీజిల్ 78.83 రూపాయలు చెన్నై: పెట్రోలు 83.63, డీజిల్ 77.72 రూపాయలు హైదరాబాద్ : పెట్రోలు 83.49 రూపాయలు, డీజిల్ 78.69 రూపాయలు అమరావతి : పెట్రోలు 83.82 రూపాయలు, డీజిల్ 78.98 రూపాయలు -
పెట్రోల్, డీజిల్ ధర పైపైకి
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయంగా ఇంధన ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. వరుసగా 14వ రోజు శనివారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. గత రెండు వారాలుగా పెరుగుతూ వస్తున్న ఇంధన ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 51 పైసలు, డీజిల్ ధర 61 పైసలు చొప్పున పెరిగింది. (13వ రోజూ పెరిగిన పెట్రో ధరలు) ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిలు ధరలు లీటరుకు న్యూఢిల్లీ : పెట్రోలు రూ. 78.88, డీజిల్ రూ.77.67 ముంబై : పెట్రోలు రూ. 85.70, డీజిల్ రూ.75.11 చెన్నై: పెట్రోలు ధరూ. 82.27 డీజిల్ రూ.75.29 హైదరాబాద్ : పెట్రోలు రూ. 81.88, డీజిల్ రూ.75.91 అమరావతి : పెట్రోలు రూ. 82.27 డీజిల్ రూ.76.30 Petrol and diesel prices at Rs 78.88/litre (increase by Re 0.51) and Rs 77.67/litre (increase by Re 0.61), respectively in Delhi today. Price of petrol & diesel has increased by Rs 5.88/litre & Rs 6.50/litre respectively since 9th June in the national capital. pic.twitter.com/H8EsN02msX — ANI (@ANI) June 20, 2020 -
13వ రోజూ పెరిగిన పెట్రో ధరలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయంగా పెట్రోలు, డీజిలు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా 13వ రోజు నేడు (శుక్రవారం) కూడా పెట్రో ధరలు పెరుగుదలను నమోదు చేశాయి. పెట్రోలుపై 55 పైసలు, డీజిల్‌పై 63 పైసలు చొప్పున ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తాజాగా ధరలను పెంచాయి. ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిలు ధరలు లీటరుకు న్యూఢిల్లీ : పెట్రోలు రూ. 78.37, డీజిల్ రూ.77.06 ముంబై : పెట్రోలు రూ. 85.21, డీజిల్ రూ.75.53 చెన్నై: పెట్రోలు ధరూ. 81.82, డీజిల్ రూ.74.77 హైదరాబాద్ : పెట్రోలు రూ. 81.36, డీజిల్ రూ.75.31 అమరావతి : పెట్రోలు రూ. 81.76, డీజిల్ రూ.75.73 -
12 వ రోజూ పెట్రో సెగ
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోలు , డీజిలు ధరలు రోజు రోజుకు పెను భారంగా మారుతున్నాయి. దేశీయంగా పెరుగుతూ వస్తున్న ధరలు వరుసగా 12వ రోజు గురువారం కూడా అదే బాటలో సాగాయి. తాజాగా పెట్రోలుపై 46-53 పైసలు, డీజిల్‌పై 54-64 పైసలు పెరిగింది. దీంతో ఇప్పటివరకు పెట్రోలు ధర లీటరుకు 6 రూపాయల 55 పైసలు, డీజిలు ధర 7 రూపాయల 4 పైసలు చొప్పున పెరిగింది. ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిలు ధరలు లీటరుకు న్యూఢిల్లీ : పెట్రోలు ధర రూ. 77.81 డీజిల్ రూ.76.43 ముంబై : పెట్రోలు ధర రూ. 84.66, డీజిల్ రూ.74.93 చెన్నై: పెట్రోలు ధర రూ. 81.32 డీజిల్ రూ.74.23 హైదరాబాద్ : పెట్రోలు ధర రూ.80.77, డీజిల్ రూ.74.70 అమరావతి : పెట్రోలు ధర రూ. 81.99 డీజిల్ రూ.75.14 ముడి చమురు అంతర్జాతీయంగా భారీగా పడిపోతున్నా..దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్లు మాత్రం రికార్డు స్థాయి వైపు పరుగులు పెడుతున్నాయి. జూన్ 6 న మొదలైన పెట్రో ధరల పెంపు ప్రతీ రోజు కొనసాగుతూనే ఉంది. ఇదే తీరు కొనసాగితే కొద్ది రోజుల్లోనే కొన్ని రాష్ట్రాల్లో రేటు రూ. 100 కూడా దాటేస్తుందన్న ఆందోళనలు నెలకొన్నాయి. -
లీటరు రూ. 80 దాటిన పెట్రోలు
సాక్షి, ముంబై: పెట్రోల్, డీజిల్ ధరలు బుధవారం కూడా పెరిగాయి. పెట్రోలుపై 55 పైసలు, డీజిలుపై 60 పైసలు చొప్పున ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ధరలను పెంచాయి. ఇంధన ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. తాజా పెంపుతో గత 11 రోజులుగా పెట్రోలుపై రూ. 6.02, డీజిల్ పై రూ. 6.40 పెరిగినట్టయింది. (పదవ రోజూ పెట్రో షాక్) ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిలు ధరలు లీటరుకు న్యూఢిల్లీ : పెట్రోలు ధర రూ. 77.28, డీజిల్ రూ.75.79 ముంబై : పెట్రోలు ధర రూ. 84.15, డీజిల్ రూ.74.32 చెన్నై: పెట్రోలు ధర రూ. 80.86 డీజిల్ రూ.73.69 హైదరాబాద్ : పెట్రోలు ధర రూ.80.22, డీజిల్ రూ.74.07 అమరావతి : పెట్రోలు ధర రూ. 80.66 డీజిల్ రూ.74.54