షాకింగ్‌ : పెరగనున్న స్మార్ట్‌ ఫోన్ల ధరలు | Smartphone Prices Set To Increase Soon | Sakshi
Sakshi News home page

షాకింగ్‌ : పెరగనున్న స్మార్ట్‌ ఫోన్ల ధరలు

Published Fri, Oct 2 2020 3:13 PM | Last Updated on Fri, Oct 2 2020 3:16 PM

Smartphone Prices Set To Increase Soon - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్‌ కొనాలని మీరు భావిస్తుంటే వెంటనే కొనుగోలు చేయడం మేలు. త్వరలో యాపిల్‌, శాంసంగ్‌, షియోమి, ఒపో వంటి ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్ల ధరలు త్వరలో భారం కానున్నాయి. స్మార్ట్‌ఫోన్ల తయారీలో ఉపయోగించే డిస్‌ప్లే, టచ్‌ ప్యానెళ్లపై ప్రభుత్వం 10 శాతం దిగుమతి సుంకాన్ని విధించడంతో తయారీదారులు ఈ మొత్తాన్ని వినియోగదారులపైనా వడ్డించనున్నారు.

ఆత్మనిర్భర్‌ భారత్‌ కార్యక్రమం కింద స్ధానిక ఉత్పత్తులను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం ఆయా వస్తువులపై దిగుమతి సుంకాన్ని విధించింది. ప్రభుత్వ నిర్ణయంతో డిస్‌ప్లే, టచ్‌ ప్యానెళ్లపై సుంకంతో పాటు అదనపు సెస్‌ను కలుపుకుంటే దిగుమతిదారులపై 11 శాతం భారం పడనుంది. దిగుమతి సుంకాల కారణంగా సెల్‌ఫోన్‌ ధరలు 2 నుంచి 5 శాతం వరకూ పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరిగితే పండగ సీజన్‌ డిమాండ్‌ను దెబ్బతీసే అవకాశం ఉంది. చదవండి : 5జీ ఫోన్ల హవా : వివో ఎక్స్ 50ఈ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement