సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరల పరుగు వినియోగదారులకు షాకిస్తోంది. బుధవారం వరుసగా నాలుగవ రోజు కూడా ఇంధన ధరలు పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు 40 పైసలు, డీజిల్ 45 పైసలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయించాయి. గత నాలుగు రోజులలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 2.14 డీజిల్ ధర లీటరుకు రూ.2.23 (ఢిల్లీ రేట్లు) పెరగడం గమనార్హం. ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు 39 పైసలు పెరిగి 80.40 రూపాయలకు చేరింది. అలాగే డీజిల్ ధర 43 పైసలు పెరిగి రూ.70.35 కు చేరింది. (వరుసగా రెండో రోజూ పెట్రో షాక్)
ప్రముఖ నగరాల్లో లీటరు పెట్రోల్, డీజిల్ ధరలు
హైదరాబాద్ : పెట్రోల్ రూ.76.20, డీజిల్ రూ.70
అమరావతి : పెట్రోల్ రూ.76.76, డీజిల్ రూ. 70.62
చెన్నై : పెట్రోల్ రూ. 77.43 , డీజిల్ రూ. 70.13
న్యూఢిల్లీ : పెట్రోల్ రూ.73.40 డీజిల్ రూ. 71.62
చదవండి : మాల్యా అప్పగింత : మరో ఎత్తుగడ
Comments
Please login to add a commentAdd a comment