
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. వరుస ధరల పరుగుకు ఒక రోజు విరామం అనంతరం నేడు (సోమవారం) పెట్రో, డీజిల్ ధరలను పెంచుతూ ప్రభుత్వరంగ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. రోజువారీ సమీక్షలో భాగంగా లీటర్ పెట్రోల్‌పై 5 పైసలు, డీజిల్‌పై 13 పైసలు పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర .80.43 రూపాయలు, లీటర్ డీజిల్ ధర 80.53రూపాయలకు చేరింది. ఢిల్లీలో శనివారం, పెట్రోల్ లీటరుకు 80.38 రూపాయలు, డీజిలు ధర 80.40 రూపాయలుగా ఉంది. దీంతో ఇప్పటివరకు డీజిల్‌పై మొత్తం 10 రూపాయల 39 పైసలు, పెట్రోల్‌పై 9 రూపాయల 23 పైసలు పెరిగాయి.
ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు
న్యూఢిల్లీ : పెట్రోలు 80.43 రూపాయలు, డీజిల్ 80.53 రూపాయలు
ముంబై : పెట్రోలు 87.19 రూపాయలు, డీజిల్ 78.83 రూపాయలు
చెన్నై: పెట్రోలు 83.63, డీజిల్ 77.72 రూపాయలు
హైదరాబాద్ : పెట్రోలు 83.49 రూపాయలు, డీజిల్ 78.69 రూపాయలు
అమరావతి : పెట్రోలు 83.82 రూపాయలు, డీజిల్ 78.98 రూపాయలు
Comments
Please login to add a commentAdd a comment