మోదీ ప్రభుత్వం ఇథనాల్ మిశ్రమ(బ్లెండెడ్) పెట్రోల్‌ను తీసుకొచ్చిన నేపథ్యంలో పెట్రోల్ ధరను తగ్గించాలని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకెత్ గోఖలే రాజ్యసభలో డిమాండ్ చేశారు. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ లీటరుకు కనీసం రూ.9 చౌకగా లభిస్తున్నప్పటికీ వినియోగదారు నుంచి పూర్తి స్థాయిలో వసూలు చేస్తున్నట్లు తెలిపారు. మోదీ ప్రభుత్వం ఈ విషయంలో ప్రజలను మోసం చేస్తోందని, ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును లాగేసుకుంటుందని విమర్శించారు. దాంతో ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు కారణమవుతుందని దుయ్యబట్టారు.
‘మోదీ ప్రభుత్వం పెట్రోల్‌లో 20% ఇథనాల్ కలపాలని గతంలోనే ఆదేశించింది. ఇథనాల్ చౌకైనది మాత్రమే కాదు.. వాహన మైలేజీని కూడా గణనీయంగా ప్రభావితం చేస్తుంది. ఇది బీఎస్-IV, పాత ఇంజిన్‌లను నాశనం చేస్తుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ లీటరుకు కనీసం రూ.9 చౌకగా లభిస్తోంది. కానీ ప్రజలు ఈ రాయితీ పొందడం లేదు. వాస్తవ ధరకే పెట్రోల్ కొనుగోలు చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం నిస్సందేహంగా ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును దొచుకుంటోంది. దాంతో ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు కారణం అవతుంది. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌ను తప్పనిసరి చేస్తే మోదీ ప్రభుత్వం ధరలు తగ్గించాలి’ అని ఎంపీ తెలిపారు.
𝐈𝐦𝐩𝐨𝐫𝐭𝐚𝐧𝐭:
𝐘𝐨𝐮 𝐚𝐫𝐞 𝐛𝐞𝐢𝐧𝐠 𝐎𝐕𝐄𝐑𝐂𝐇𝐀𝐑𝐆𝐄𝐃 𝐛𝐲 𝐚𝐭 𝐥𝐞𝐚𝐬𝐭 ₹𝟗 𝐩𝐞𝐫 𝐥𝐢𝐭𝐞𝐫 𝐚𝐭 𝐭𝐡𝐞 𝐩𝐞𝐭𝐫𝐨𝐥 𝐩𝐮𝐦𝐩.
Modi Govt has mandated 20% blending of ethanol with petrol.
Ethanol is not only cheaper but also significantly reduces your car… pic.twitter.com/iEBjgp9SX9— Saket Gokhale MP (@SaketGokhale) February 5, 2025
ఇథనాల్ పెట్రోల్‌పై భిన్నాభిప్రాయాలు
ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, గ్రీన్ ఎన్విరాన్‌మెంట్‌ను ప్రోత్సహించడంలో భాగంగా గతంలో ప్రభుత్వం పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలపాలని నిర్ణయించింది. ఇథనాల్ పెట్రోల్ కంటే తక్కువ శక్తి కంటెంట్ కలిగి ఉంటుందని అభిప్రాయాలున్నాయి. ఇది వాహనం మైలేజ్‌ను 3-4% తగ్గిస్తుందని వాహన నిపుణులు చెబుతున్నారు. పాత వాహనాలకు ముఖ్యంగా బీఎస్-4 ఇంజిన్లు ఉన్న వాహనాలకు అధిక ఇథనాల్ కంటెంట్ ప్లాస్టిక్, రబ్బరు, అల్యూమినియం భాగాలకు హాని కలిగిస్తుందని తెలియజేస్తున్నారు. ఇది ఇంజిన్ పనిచేయకపోవడం, మన్నిక తగ్గడానికి దారితీస్తుందంటున్నారు.
ఇదీ చదవండి: అంతకంతకూ పెరుగుతున్న పసిడి ధర! తులం ఎంతంటే..
పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలపడం వల్ల ముడి చమురు దిగుమతులపై తక్కువ ఆధారపడే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం తెలుపుతుంది. ఇది ఇంధన భద్రతను బలోపేతం చేస్తుంది. ఇథనాల్ గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గిస్తుంది. చెరకు నుంచి ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరుతుంది.
Comments
Please login to add a commentAdd a comment