రాజు మూడు నెలల కిందట షోరూమ్‌లో బైక్ కొనుగోలు చేశాడు. కానీ కంపెనీ ఇచ్చిన హామీ మేరకు బైక్ మైలేజీ రావడంలేదు. కనీసం అందులో సగమైన మైలేజీ రాకపోవడంతో నిరాశ చెందాడు. అయితే బైక్ కొన్నప్పటి నుంచి తాను ఒకే పెట్రోల్ పంపులో పెట్రోల్ కొట్టించేవాడు. అనుకోకుండా ఇటీవల వేరే పంపులోని పెట్రోల్ వాడాడు. అప్పటివరకు సరిగా మైలేజీ రాని తన బైక్ ఈసారి మెరుగైన మైలేజీ నమోదు చేసింది. దాంతో తాను గతంలో వాడిన పెట్రోల్ కల్తీ అయిందని గుర్తించాడు.
మీకూ ఇలాంటి సంఘటనలు ఎదురవుతూనే ఉంటాయి. అందుకు కొన్ని ఏజెన్సీలు పెట్రోల్‌ను కల్తీ చేయడమే కారణం. భారత్ భారీగా పెట్రోల్‌ను దిగుమతి చేసుకుంటోంది. అందుకు పెద్దమొత్తంలో డాలర్లు ఖర్చు చేస్తోంది. దీని ప్రభావం ఆయిల్ మార్కెటింగ్ సంస్థలపై పడుతుంది. వీటికి అనుబంధంగా ఉన్న కొన్ని ఏజెన్సీలు అక్రమంగా డబ్బు పోగు చేసుకోవాలనే దురుద్దేశంతో పెట్రోల్‌ను కల్తీ చేస్తున్నాయి. అయితే మనం వాహనాల్లో వాడే పెట్రోల్ కల్తీ అయిందా..లేదా..అనే విషయాన్ని ఎలా కనుగొనాలో తెలుసుకుందాం.
ఇదీ చదవండి: ఇళ్ల అమ్మకాల తగ్గుదలకు కారణాలు..
రెండు నిమిషాల్లో కల్తీ గుర్తించండిలా..
నిబంధనల ప్రకారం ప్రతి పెట్రోల్ పంపు సిబ్బంది విధిగా తమ వద్ద ఫిల్టర్ పేపర్ ఉంచుకోవాలి. మనం వాహనాల్లో పెట్రోల్ కొట్టించాలనుకున్నప్పుడు పెట్రోల్ పంపు సిబ్బంది నుంచి ఫిల్టర్ పేపర్ అడిగి తీసుకోవాలి. దానిపై పెట్రోల్ గన్ ద్వారా 2-3 డ్రాప్స్ పెట్రోల్ వేయాలి. 2-3 నిమిషాలు ఆ ఫిల్టర్ పేపర్‌ను ఆరనివ్వాలి. తర్వాత పెట్రోల్ పోసినచోట పేపర్‌పై ఎలాంటి మచ్చలు ఏర్పడకపోతే అది స్వచ్ఛమైన పెట్రోల్‌గా పరిగణించవచ్చు. అలాకాకుండా ఏదైనా మచ్చలు ఏర్పడితే కల్తీ జరిగినట్లు భావించాలి.
Comments
Please login to add a commentAdd a comment