purity test
-
పెట్రోల్ కల్తీని ఎలా గుర్తించాలంటే..
రాజు మూడు నెలల కిందట షోరూమ్‌లో బైక్ కొనుగోలు చేశాడు. కానీ కంపెనీ ఇచ్చిన హామీ మేరకు బైక్ మైలేజీ రావడంలేదు. కనీసం అందులో సగమైన మైలేజీ రాకపోవడంతో నిరాశ చెందాడు. అయితే బైక్ కొన్నప్పటి నుంచి తాను ఒకే పెట్రోల్ పంపులో పెట్రోల్ కొట్టించేవాడు. అనుకోకుండా ఇటీవల వేరే పంపులోని పెట్రోల్ వాడాడు. అప్పటివరకు సరిగా మైలేజీ రాని తన బైక్ ఈసారి మెరుగైన మైలేజీ నమోదు చేసింది. దాంతో తాను గతంలో వాడిన పెట్రోల్ కల్తీ అయిందని గుర్తించాడు.మీకూ ఇలాంటి సంఘటనలు ఎదురవుతూనే ఉంటాయి. అందుకు కొన్ని ఏజెన్సీలు పెట్రోల్‌ను కల్తీ చేయడమే కారణం. భారత్ భారీగా పెట్రోల్‌ను దిగుమతి చేసుకుంటోంది. అందుకు పెద్దమొత్తంలో డాలర్లు ఖర్చు చేస్తోంది. దీని ప్రభావం ఆయిల్ మార్కెటింగ్ సంస్థలపై పడుతుంది. వీటికి అనుబంధంగా ఉన్న కొన్ని ఏజెన్సీలు అక్రమంగా డబ్బు పోగు చేసుకోవాలనే దురుద్దేశంతో పెట్రోల్‌ను కల్తీ చేస్తున్నాయి. అయితే మనం వాహనాల్లో వాడే పెట్రోల్ కల్తీ అయిందా..లేదా..అనే విషయాన్ని ఎలా కనుగొనాలో తెలుసుకుందాం.ఇదీ చదవండి: ఇళ్ల అమ్మకాల తగ్గుదలకు కారణాలు..రెండు నిమిషాల్లో కల్తీ గుర్తించండిలా..నిబంధనల ప్రకారం ప్రతి పెట్రోల్ పంపు సిబ్బంది విధిగా తమ వద్ద ఫిల్టర్ పేపర్ ఉంచుకోవాలి. మనం వాహనాల్లో పెట్రోల్ కొట్టించాలనుకున్నప్పుడు పెట్రోల్ పంపు సిబ్బంది నుంచి ఫిల్టర్ పేపర్ అడిగి తీసుకోవాలి. దానిపై పెట్రోల్ గన్ ద్వారా 2-3 డ్రాప్స్ పెట్రోల్ వేయాలి. 2-3 నిమిషాలు ఆ ఫిల్టర్ పేపర్‌ను ఆరనివ్వాలి. తర్వాత పెట్రోల్ పోసినచోట పేపర్‌పై ఎలాంటి మచ్చలు ఏర్పడకపోతే అది స్వచ్ఛమైన పెట్రోల్‌గా పరిగణించవచ్చు. అలాకాకుండా ఏదైనా మచ్చలు ఏర్పడితే కల్తీ జరిగినట్లు భావించాలి. -
బంగారం స్వచ్ఛత తెలుసుకోండిలా..
బంగారాన్ని కొందరు ఆభరణంగా వినియోగిస్తే, ఇంకొందరు పెట్టుబడి సాధనంగా భావిస్తారు. దాంతో పెళ్లిళ్లు, పుట్టిన రోజు, పండగలు..వంటి ప్రత్యేక రోజుల్లో కొంత బంగారం కొనుగోలు చేస్తూంటారు. అయితే రిటైల్ షాపుల్లో తీసుకునే బంగారం నిజంగా స్వచ్ఛమైందేనా అనే అనుమానం ఎప్పుడైనా వచ్చిందా? అయినా అంత పెద్దషాపు నిర్వహిస్తున్నవారు ఎందుకు మోసం చేస్తారని అనుకుంటున్నారా? నిబంధనల ప్రకారం నడుపుతున్న షాపుల్లో ఈ మోసాలు తక్కువే. సరైన నిబంధనలు పాటించనివారు మాత్రం బంగారం స్వచ్ఛత విషయంలో వినియోగదారులను మోసం చేసే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో బంగారం నాణ్యతను ఎలా కనిపెట్టాలో తెలుసుకుందాం.బంగారం నాణ్యతను క్యారట్లలో కొలుస్తారు. బంగారం కొనేందుకు షాపులోకి వెళ్లిన వెంటనే నచ్చిన ఆభరణాలు ఎంపిక చేసుకుంటారు. కొన్నిసార్లు షాపు సిబ్బంది 24, 22, 18 క్యారట్ల బంగారం అని చెబుతూ తక్కువ నాణ్యత కలిగిన ఆభరణాలు అంటగట్టే ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకు 18 క్యారట్ నాణ్యత కలిగిన బంగారం చూపుతూ..అది 22 క్యారట్ గోల్డ్ అని చెబుతుంటారు. అది నమ్మి చివరకు 22 క్యారట్ బంగారం ధర చెల్లిస్తుంటారు. అయితే ఇలాంటి మోసాలు ముందుగానే పసిగట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్న బంగారు ఆభరణాలపై ముందుగా ప్రభుత్వ అధీనంలోని బీఐఎస్(బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) సంస్థ హాల్‌మార్క్ ఉందో పరిశీలించాలి. దీంతోపాటు ఆభరణంపై కొన్ని నంబర్లు కూడా ఉంటాయి. వాటిని బట్టి అది ఎంత స్వచ్ఛమైన బంగారమో నిర్ధారించుకోవచ్చు.24 క్యారట్ బంగారం: 999 అనే సంఖ్య ఉంటుంది.22 క్యారట్: 91618 క్యారట్: 75014 క్యారట్: 58310 క్యారట్: 417 అనే నంబర్ ఉంటుంది.ఇదీ చదవండి: గరిష్ఠాలను చేరిన బంగారం ధర!24 క్యారట్ బంగారం వందశాతం స్వచ్ఛమైంది. 22 క్యారట్ బంగారంలో 8.3 శాతం ఇతర పదార్థాలు కలుపుతారు. 18 క్యారట్ బంగారంలో 25 శాతం ఇతర పదార్థాలతో కల్తీ చేస్తారు. 14 క్యారట్-41.7 శాతం, 10 క్యారట్-58.3 శాతం ఇతర పదార్థాలు కలుపుతారు. -
ఆశపడ్డారో ఖేల్ ఖతం! నకిలీ బంగారాన్ని ఎలా గుర్తించాలి?
రాజస్థాన్‌లోని జైపూర్‌లో నకిలీ ఆభరణాన్ని స్వచ్ఛమైన బంగారు నగగా నమ్మించి ఒక అమెరికన్ టూరిస్ట్ మహిళను ఏకంగా రూ. 6 కోట్లకు ముంచేసిన వైనం దిగ్భ్రాంతికి గురి చేసింది. రూ. 300 విలువైన బంగారు పూత పూసిన వెండి నెక్లెస్‌ను గోల్డ్ నెక్లెస్‌గా నమ్మించాడో నగల వ్యాపారి. తరువాత విషయం తెలుసుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అసలేదో, నకిలీ ఏదో ఎలా తెలుసుకోవాలి? కృత్రిమ బంగారు ఆభరణాలను ఎలా గుర్తించాలి? తెలుసుకుందాం రండి! అందం, స్టేటస్‌కోసమో, భవిష్యత్తు అవసరాల కోసమో ప్రజలు తరచుగా బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. బంగార ధర ఎపుడూ ఖరీదైందే కాబట్టి మోసాలకు చాలా అవకాశం ఉంది. అందులోనూ ఈ మధ్యకాలంలో నిజమైన బంగారంలా మురిపిస్తున్న ఇమిటేషన్ జ్యుయల్లరీకి ఆదరణబాగా పెరుగుతోంది. అందుకే అసలు బంగారాన్ని, నకిలీ బంగారానికి తేడాను గుర్తించడం చాలా కీలకం. ఆభరణాల నిపుణులు, అనుభవజ్ఞులైన పెట్టుబడిదారులు బంగారం నిజమో కాదో సులువుగా గుర్తిస్తారు. నిజానికి కాస్త పరిశీలిస్తే అసలు బంగారాన్ని, నకిలీ బంగారాన్ని గుర్తించడం ఎవరికైనా పెద్ద కష్టమేమీకాదు.మెరిసీ ప్రతీదీ బంగారం కాదు పసుపు రంగులో కనిపించే ప్రతిదీ బంగారం కాదు. బంగారం పెద్దగా మెరవదు. నిజమైన బంగారం అందమైన మృదువైన పసుపు రంగులో ఉంటుంది. ఎరుపు రంగు కలిసిన పసుపు రంగులో ఉన్నా, బాగా మెరుస్తున్నా అనుమానించాలి.హాల్‌మార్క్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ జారీ చేసే హాల్‌మార్క్ ధృవీకరణను తనిఖీ చేయడం. బ్రాండ్: కొన్ని రకాల బ్రాండ్లు నాణ్యతకు మారుపేరుగా ఉంటాయి. అలాంటి బ్రాండ్స్‌కి చెందిన లోగో, పేరు, అక్షరాలను శ్రద్దగా గమనించాలి. గోల్డ్ మాగ్నెట్ టెస్ట్: నకిలీ బంగారం లేదా బంగారు మిశ్రమాలు తక్షణమే అయస్కాంతానికి ఆకర్షితులవుతాయి. ఇది అంతర్లీన లోహం యొక్క నిజమైన స్వభావాన్ని వెల్లడిస్తుంది. ఇది బంగారంతో చేసినది కాదు లేదా దానిలో కొద్ది శాతం మాత్రమే అని అర్థం చేసుకోవాలి. స్వచ్ఛమైన బంగారంలో అయస్కాంత మూలకాలు ఉండవు. యాసిడ్ టెస్ట్ : వివిధ కెమికల్స్ యాసిడ్‌ని కూడా బంగారాన్ని గుర్తించడానికి ఉపయోగిస్తారు. బంగారు ఆభరణాల నైట్రిక్ టెస్ట్ చేయడానికి, బంగారంపై కొన్ని చుక్కల నైట్రిక్ యాసిడ్ వేయండి. ఆభరణాల రంగులో మార్పు రాకపోతే, అది బంగారం అని నమ్మవచ్చు.మెటీరియల్‌ని, రాళ్లను బాగా పరిశీలించడం: ఆభరణాల్లో ఉపయోగించి మెటల్స్‌పై చాలా శ్రద్ధ వహించాలి. అలాగే ఆభరణంలోని రాళ్లను, స్ఫటికాలను నిశితంగా గమనించాలి. ఇమిటేషన్ జ్యుయల్లరీ బరువును గమనించాలి. ఫినిషింగ్ చెక్ చేయాలి, పేలవమైన ఫినిషింగ్ లేదా అంచులు గరుకుగా ఉన్నా అనుమానించాలి.తక్కువ ధర అని మభ్య పెట్టినా: బంగారు ఆభరణాలను తక్కువ ధరకే ఇస్తున్నాం అంటే ఖచ్చితంగా అనుమానించాలి. నిజా నిజాలను, నాణ్యత, బరువును నిర్ధారించుకోవాలి. తొందరపడి అస్సలు మోసపోకూడదు. -
భార్య పాతివ్రత్య నిరూపణకు అగ్ని పరీక్ష!
ఉస్మానాబాద్: మహారాష్ట్రలో అమానుష ఘటన జరిగింది. నేటి ఆధునిక కాలంలోనూ భార్యను అనుమానిస్తూ శీల పరీక్ష చేశాడు. పురాణాల్లో అగ్ని పరీక్ష చేయగా నేడు భర్త సలసల కాగే నూనెలో చేతులు పెట్టించి ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించాడు. ఈ ఘోర ఘటన మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా పరాండలోని కచాపురి చౌక్‌లో జరిగింది. అయితే భార్యకు పరీక్ష చేస్తూ దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకోవడం తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. ఫిబ్రవరి 11వ తేదీన భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. భర్తపై కోపంతో భార్య ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లింది. నాలుగు రోజుల పాటు కారు డ్రైవరైన ఆ భర్త ఆమె కోసం గాలించాడు. ఎంతకీ భార్య ఆచూకీ లభించలేదు. ఐదో రోజు భార్య ఫోన్ చేసి ఇంటికి వచ్చింది. అయితే ఇంటికొచ్చిన భార్యను ఎక్కడకు వెళ్లావని భర్త ప్రశ్నించగా.. ఆ నాలుగు రోజులు ఏం జరిగిందో చెప్పింది. గొడవపడిన రోజు కచాపురి చౌక్‌లో బస్సు కోసం ఎదురుచూస్తుండగా ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి తనను బలవంతంగా తీసుకెళ్లిపోయారని భార్య చెప్పింది. తీసుకెళ్లిన వారు నాలుగు రోజులు తమ వద్దే ఉంచుకున్నారని.. తనను ఏమీ చేయలేదని భర్తకు చెప్పింది. ఎలాగోలా వారి బారి నుంచి తప్పించుకుని ఇంటికొచ్చా అని భార్యప్వాపోయింది. అయితే ఈ విషయాలను భర్త నమ్మలేదు. దీంతో తమ (పర్ది) సంప్రదాయం ప్రకారం భార్య పాతివ్రత్యాన్ని పరీక్షించాలని నిర్ణయించాడు. ఈ మేరకు సలసల కాగే నూనెలో ఐదు రూపాయల బిళ్ల వేసి దాన్ని చేతితో తీయాలని పరీక్ష పెట్టాడు. కాగె నూనెలో వేసిన నాణేన్ని చేతితో తీయడంతో భార్యకు చేతికి గాయాలయ్యాయి. ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆమె చెప్పేది తాను నమ్మనని.. ఆమె నిజం చెబుతుందో.. అబద్ధం చెబుతుందో తెలుసుకోవాలనుకుని అలా చేసినట్లు భర్త సమాధానం ఇస్తున్నాడు. తప్పు చేస్తే చేతులు, కాళ్లు కాలిపోతాయని ఆయన చెబుతున్నాడు. అతడి తీరుపై మహిళా సంఘాలతో సామాజికవేత్తలు, మేధావులు మండిపడుతున్నారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై మహారాష్ట్ర శాసనమండలి చైర్పర్సన్ నీలమ్ గోర్హె ఆగ్రహం వ్యక్తం చేసి అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. Nashik , It has been revealed that the same caste panchayat has ruled that a woman with suspicion should be boiled in boiling oil. The husband took a video of the incident and made it viral. pic.twitter.com/eUz5bTmKbp — BHARAT GHANDAT (@BHARATGHANDAT2) February 20, 2021 -
కల్తీ తేనె కలకలం: మరింత కరోనా ముప్పు
సాక్షి, న్యూఢిల్లీ: రోగనిరోధక శక్తి పెంచుతుంది.. యాంటీ ఆక్సిడెంట్, ఇమ్యూనిటీ బూస్టర్ అంటూ కరోనా కాలంలో తేనెను తెగ లాగించేస్తున్నారా? అయితే మీకొక షాకింగ్ రిపోర్టు.. చైనా సుగర్ సిరప్‌తో గుర్తు పట్టలేనంతగా దేశంలో కల్తీ తేనెను చలామణీ చేస్తున్నవ్యవహారం కలకలం రేపుతోంది. చిన్నా పెద్ద సహా దాదాపు అన్ని బ్రాండ్ల తేనె చక్కెర సిరప్‌తో కల్తీ చేస్తున్నారని తమ అధ్యయనం తేలిందని ప్రకటించింది. దేశంలోని 13 ప్రధాన బాండ్లలో డాబర్, పతంజలి, బైద్యనాథ్ జండుతో సహా మొత్తం 10 సంస్థలు విక్రయిస్తున్న తేనె కల్తీమయమని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) తేల్చి చెప్పింది. కరోనా సంక్షోభ సమయంలో ప్రజలు తేనెకు బదులుగా, ఎక్కువ చక్కెరను తింటున్నారని, ఇది కోవిడ్-19 ప్రమాదాన్నిమరింత పెంచుతుందంటూ ఆందోళన వ్యక్తం చేసింది. తేనెలో చైనా చక్కెరతో కలిపి కల్తీ తేనెను విక్రయిస్తున్నారని ఇటీవల నిర్వహించిన క్వాలిటీ పరీక్షల్లో నిర్దారణ అయిందని తెలిపింది. గుజరాత్‌లోని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ (ఎన్డిడిబి) సెంటర్ ఫర్ ఎనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైవ్‌స్టాక్ అండ్ ఫుడ్ (కాల్‌ఎఫ్)లో వీటి నమూనాలను పరీక్షించారు. జర్మనీలోని ఒక ప్రత్యేక ప్రయోగశాలలో ఎన్ఎంఆర్ టెక్నాలజీని ఉపయోగించి పరీక్షించినప్పుడు, చాలా బ్రాండ్లు విఫలమయ్యాయి. పరీక్షించిన 13 బ్రాండ్లలో మూడు బ్రాండ్లు మాత్రమే ఎన్ఎంఆర్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాయని సీఎస్ఈ వెల్లడించింది. అయితే ఈ ఆరోపణలను డాబర్, పతంజలి, జండు ప్రతినిధులు ఖండించారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఎఐ) నిర్దేశించిన ప్రమాణాలకనుగుణంగానే ఉందని వాదిస్తున్నాయి. సీఎస్ఈ విడుదల చేసిన రిపోర్టు అవాస్తవమైందనీ, ఇండియన్ నాచురల్ హనీ ఇండస్ట్రీని దెబ్బ తీసే కుట్ర జరుగుతోందని పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఈ వివాదంపై ప్రముఖ ఆయుర్వేద, హెర్బల్ ఉత్పత్తుల సంస్థ డాబర్ స్పందిస్తూ ప్రపంచంలోనే నంబర్ వన్ తేనె డాబర్ హనీ అని, తమ తేనె 100 శాతం స్వచ్ఛమైంది, సురక్షితమైందని తెలిపింది. తమ తేనెలో కల్తీ జరగలేదని ట్వీట్ చేసింది. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో తేనె అమ్మకాలు పెరిగినప్పటికీ ఉత్తర భారతదేశంలో తేనెటీగల పెంపకందారులు లాభాలు క్షీణించాయని, దీంతో దర్యాప్తు ప్రారంభించినట్లు సీఎస్ఈ డైరెక్టర్ జనరల్ సునీతా నరేన్ తెలిపారు. శీతల పానీయాలపై 2003, 2006 సంవత్సరాల్లో తాముచేపట్టిన పరిశోధనలో పరిశోధనలలో కనుగొన్న దానికంటే దుర్మార్గమైన, దారుణమైన మోసాన్ని గుర్తించామన్నారు. అతి ఘోరమైన, అధునాతన కల్తీ ఇదని, ఇప్పటివరకు గుర్తించినదానికంటే చాలా ఎక్కువ హానికరమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మనం ప్రాణాంతక మహమ్మారితో పోరాడుతున్నామనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని నరేన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోవిడ్-19 పై పోరులో భాగంగా చాలామందితేనెను విరివిగా వినియోగిస్తున్న తరుణంలో ఈ ఫలితాలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. తేనెలోకల్తీని గుర్తించడం కష్టమని ఫుడ్ సేఫ్టీ అండ్ టాక్సిన్స్ టీం ప్రోగ్రామ్ డైరెక్టర్ అమిత్ ఖురానా అన్నారు. సీఎస్ఈ అధ్యయనం ప్రకారం , ప్రారంభంలో తేనెలో తీపిని పెంచేందుకు మొక్కజొన్న, చెరకు, బియ్యం, బీట్రూట్ నుండి తీసిన చక్కెరను తేనెలో కల్తీ చేసేవారు. ఇది సీ3, సీ4 పరీక్షల్లో బయటపడుతుంది. కానీ ఈ కొత్త కల్తీ ‘చైనీస్ సుగర్’ ను న్యూక్లియర్ మాగ్నెటిక్ రెసొనెన్స్ (ఎన్ఎంఆర్) అనే పరీక్ష ద్వారా మాత్రమే గుర్తించగలం. ప్రముఖ బ్రాండ్లైన డాబర్, పతంజలి, బైద్యనాథ్, జండు, హిత్కారీ, అపిస్ హిమాలయా సంస్థలనుంచి సేకరించిన తేనె నమూనాలు ఎన్ఎంఆర్ పరీక్షలో విఫలమయ్యాయి. మారికో సఫోలా హనీ, మార్క్‌ఫెడ్ సోహ్నా, నేచర్ నెక్టా మాత్రమే అన్ని పరీక్షల్లో నెగ్గాయి. World's No. 1 Dabur Honey is 100% Pure & Safe! ✅We are NMR profiled ✅We are 22 FSSAI tests compliant. Dabur Honey clears all FSSAI tests and has the first corporate-owned NMR machine in India to ensure 100% purity. Read the complete report here, https://t.co/hLlEEMzh2M pic.twitter.com/J36fBkvnKG — Dabur India Ltd (@DaburIndia) December 2, 2020 -
మహిళ చేష్టలకు పోలీసులు షాక్
ఫ్రాన్స్: అనుమానిత వస్తువుతో పోలీసులకు దొరికితేనే హడలెత్తిపోతుంటాం.. అలాంటిది ఏకంగా అనుమతించకూడని వస్తువుతో నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి ఇది అదేనా అని అడిగితే పరిస్థితి ఏమిటి? ఫ్రాన్స్‌లో ఇలాగే జరిగింది. ఓ మహిళ మూడు పొట్లాల్లో కొకైన్ తీసుకొని ఏకంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అక్కడ రిసెప్షన్ వద్దకు వెళ్లి తన వద్ద ఉన్న డ్రగ్స్‌ను వారి చేతికి ఇచ్చి.. ఇవి నిజంగా డ్రగ్సేనా.. దీనిలో ఎంతమేరకు స్వచ్ఛత ఉందో పరీక్షించి చెప్పగలరా అని అడిగింది. దాంతో అవాక్కయిన పోలీసులు ఆ మహిళను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఆ వెంటనే కోర్టులో హాజరుపరచగా ప్రత్యేక విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. పోలీసుల వివరాల ప్రకారం టౌలోస్ లోని సౌత్ వెస్ట్రన్ సిటీలో 45 ఏళ్ల మహిళ ఈ పనిచేసింది. ఇలా ఎందుకు చేశావని ఆమెను ప్రశ్నించగా నకిలీ డ్రగ్స్ వాడితే ప్రజల ప్రాణాలకు ప్రమాదం అయినందున అందులో ఎంత ప్యూరిటి ఉందో తెలుసుకుందామనే అడిగానని చెప్పింది. ప్రజల మేలుకోసం తాను ఇలా చేశానని చెప్పుకొచ్చింది. పోలీసులు మాత్రం ఆమె గతంలో డ్రగ్స్ బానిసరాలు అయ్యుండొచ్చని అంటున్నారు.