ఫ్యూయెల్ (పెట్రోల్, డీజిల్) వాడకాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్, సీఎన్‌జీ వాహనాలు ఉత్పత్తిని ప్రోత్సహించడం చేస్తోంది. కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' హైడ్రోజన్ వాహనాలను ఉత్పత్తి చేయాలని కంపెనీలకు చెబుతున్నారు. అంతే కాకుండా ఇథనాల్ వాడకాన్ని పెంచాలని సూచిస్తున్నారు. ఇప్పుడు కేంద్ర హోం మంత్రి 'అమిత్ షా' కూడా ఇథనాల్ ఉత్పత్తిని పెంచాలని కోరుతున్నారు.
మోదీ ప్రభుత్వం 2025-26 నాటికి 20 శాతం ఇథనాల్‌ను కలపాలనే లక్ష్యాన్ని సాధిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం అన్నారు. ఇథనాల్ ఉత్పత్తి పెరిగితే ముడిచమురు దిగుమతి తగ్గుతుందని అమిత్ షా చెప్పారు. దీనికోసం చక్కెర మిల్లులు ఇథనాల్‌ను ఉత్పత్తి చేయాలని కోరారు.
పెట్రోల్ వినియోగం తగ్గితే.. పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుందని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ షుగర్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో అమిత్ షా అన్నారు. దాదాపు 5000 కోట్ల లీటర్ల పెట్రోలుకు వెయ్యి కోట్ల లీటర్ల ఇథనాల్ అవసరం ఉంటుందని కూడా ఆయన చెప్పారు.
ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ యూనివర్సల్ 4జీ, 5జీ సిమ్: ఎక్కడైనా.. ఎప్పుడైనా
ఇథనాల్‌ను కలపడం వల్ల పర్యావరణం మెరుగుపడటమే కాకుండా.. చక్కెర మిల్లుల లాభాలు పెరగడం వల్ల రైతులకు మేలు జరుగుతుందని అమిత్ షా అన్నారు. ఇథనాల్ ఉత్పత్తిపైన ప్రతి 3 నెలలకు ఒకసారి సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటామని, మంత్రుల బృందం ద్వారా ఇథనాల్ మిశ్రమాన్ని ప్రధానమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తారని షా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment