
న్యూఢిల్లీ: వాణిజ్య వాహనాల తయారీ కంపెనీ ‘అశోక్ లేలాండ్’ తన వాహన ధరలను పెంచుతోంది. వచ్చే నెల నుంచి వాహన ధరలను కనీసం 2 శాతం పెంచుతామని కంపెనీ తెలిపింది. ఉత్పత్తి వ్యయాల పెరుగుదల, ఏఐఎస్ 140 నిబంధన అమలు వంటి అంశాలు దీనికి ప్రధాన కారణమని పేర్కొంది.
ఏఐఎస్ 140 నిబంధన ప్రకారం వాహన కంపెనీలు ఏప్రిల్ 1 నుంచి కొత్త, ప్రస్తుతమున్న ప్రజా రవాణా వాహనాల్లో ట్రాకింగ్ డివైస్, ఎమర్జెన్సీ బటన్‌లను అమర్చాలి. కాగా అశోక్ లేలాండ్ కంపెనీ ట్రక్కులు, బస్సులు సహా పలు రకాల వాణిజ్య వాహనాలను మార్కెట్‌లో విక్రయిస్తోంది. ఇక టాటా మోటార్స్, నిస్సాన్ ఇండియా, ఆడి కంపెనీలు కూడా వచ్చే నెల నుంచి వాటి వాహన ధరలను పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి.