న్యూఢిల్లీ: ఇటీవల కొన్ని వారాలుగా ఎక్కడ విన్నా, ఏ వార్త చూసిన టమోట పేరే వినపడుతోంది. ఈ ఏడాది ఎన్నడూ లేనంతగా రికార్డ్ ధరలు పలకడంతో ఈ పంట వేసిన రైతులు కొందరు లక్షాధికారి కాగా, మరికొందరు కోటీశ్వరులు కూడా అయ్యారు. దీని ధరలు దడపుట్టిస్తుండడంతో సామాన్య ప్రజలు వంటలో టమోటాకు ప్రత్యామ్నాయాన్ని చూస్తున్నారు. తాజాగా ఇంటర్నెషనల్ సంస్థలైన సబ్‌వే, మెక్‌డొనాల్డ్ కూడా టమోట దెబ్బను తట్టుకోలేక షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నాయి.
భారత్‌లో పలు సబ్‌వే అవుట్‌లెట్లు తమ సలాడ్స్, శాండ్‌విచ్‌ల్లో టమాటలను జోడించడం నిలిపివేశాయి. నాణ్యతా పరమైన అంశాలతో పాటు అధిక ధరల కారణంగా సబ్‌వే ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల పలు కారణాల వల్ల కిచెన్‌లోకి కావాల్సిన ప్రధానమైన వస్తువుల ధరలు 400 శాతానికి చేరుకున్నాయి. ప్రత్యేకంగా టమోట ధరలు కన్నీళ్లను తెప్పిస్తోంది. మరో వైపు ప్రభుత్వం జోక్యం చేసుకున్నప్పటికీ కొన్ని మార్కెట్లలో రికార్డు స్థాయికి దారితీసింది. ఇటీవల ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌లోని ఒక సబ్‌వే అవుట్‌లెట్ ఓ బోర్డులో ఇలా రాసుంది. " కస్టమర్లు మన్నించాలి. తాత్కాలికంగా టమోటాలు అందుబాటులో లేదని తెలిపింది.
వీలైనంత త్వరగా టమోట సరఫరాలను పునరుద్ధరించడానికి తాము చురుకుగా పని చేస్తున్నామని అవుట్‌లెట్ కస్టమర్లకు హామీ ఇచ్చింది. భారతదేశంలోని సబ్‌వే అవుట్‌లెట్‌లలో దాదాపు వందల సంఖ్యల్లో ఉన్నప్పటికీ ఈ నిర్ణయం ద్వారా ప్రభావితమైన అవుట్‌లెట్‌ల ఖచ్చితమైన సంఖ్య అస్పష్టంగానే ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా మరికొన్ని సబ్‌వే అవుట్‌లెట్స్‌లో టమాటాలను సర్వ్ చేయడం కొనసాగుతోంది. సబ్‌వే, మెక్‌డొనాల్డ్స్ బాటలోనే డామినోస్, కేఎఫ్‌సీ టమాటాల వాడకం తగ్గించాయి.
చదవండి: ఐదేళ్లకు లక్ష్మీదేవీ తలుపు తట్టింది.. కొన్ని రోజుల్లో ఆయన లక్షాధికారి!
Comments
Please login to add a commentAdd a comment