kfc
-
కెంటకీకి కేఎఫ్‌సీ గుడ్‌బై
కెంటకీ ఫ్రైడ్ చికెన్. క్లుప్తంగా కేఎఫ్‌సీ. పరిచయమే అక్కర్లేని ప్రపంచ ప్రసిద్ధ బ్రాండ్. ఈ ఫుడ్ జాయింట్ దిగ్గజానికి పిల్లల నుంచి పండు ముసలి దాకా లెక్కలేనంత మంది అభిమానులు! అమెరికాకు చెందిన ఈ బ్రాండ్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఇంతకాలం తన కేరాఫ్‌గా నిలిచిన కెంటకీలోని లూయిస్విల్లే నుంచి టెక్సాస్‌లోని ప్లానోకు ప్రధాన కార్యాలయాన్ని తరలిస్తోంది. కొన్ని కార్యకలాపాలు మాత్రం కెంటకీ నుంచి ఇకముందూ కొనసాగుతాయని యాజమాన్యం ప్రకటించింది. కేఎఫ్‌సీ నిర్ణయంపై కెంటకీ రాష్ట్ర గవర్నర్ ఆండీ బెషెర్ విచారం వెలిబుచ్చారు. ఈ విషయం తెలిస్తే బహుశా ఆ సంస్థ వ్యవస్థాపకుడు కల్నల్ హార్లండ్ శాండర్స్ కూడా బాధపడి ఉండేవాడన్నారు. ‘‘ఆ కంపెనీ పేరే మా రాష్ట్రంతో మొదలవుతుంది. తన ఉత్పత్తుల విక్రయానికి మా రాష్ట్ర సంస్కృతిని, వారసత్వాన్ని ఉపయోగించుకుంది’’అని చెప్పు కొచ్చారు. పరిశ్రమలు, సంస్థలపై పన్నుల భారాన్ని టెక్సాస్ కొన్నే ళ్లుగా బాగా తగ్గించింది. దాంతో పాటు అక్కడి వ్యాపార అనుకూల వాతావరణానికి అమె రికన్ కంపెనీలు ఆకర్షితమవుతున్నాయి. పెద్ద సంఖ్యలో ఆ రాష్ట్ర బాట పడుతున్నాయి. కేఎఫ్‌సీని 1930ల్లో కెంటకీలోని కోర్బిన్లో ఓ సరీ్వస్ స్టేషన్ దగ్గర ఫ్రైడ్ చికెన్ చిన్న దుకాణంగా శాండర్స్ మొదలు పెట్టారు. దాని రుచికి జనాలు ఫిదా కావడంతో చూస్తుండగానే యమా పాపులరైంది. ఇప్పుడు 145కు పైగా దేశాల్లో సంస్థకు ఏకంగా 24 వేల పై చిలుకు ఔట్‌లెట్లున్నాయి! ప్రతి కేఎఫ్‌సీ షాపు ముందూ కన్పించే గమ్మత్తైన ఫేసు దాని వ్యవస్థాపకుడు శాండర్స్దే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆకాశంలో విహరిస్తూ ఫుడ్ ఆరగించిన టాలీవుడ్ హీరో.. ఫోటోలు వైరల్!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వీడీ12 మూవీతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల కేరళలో ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నారు. అంతేకాకుండా బాలీవుడ్లో ఓ ఆల్బమ్ సాంగ్‌లో వీడీ కనిపించనున్నారు. సాహిబా అనే సాంగ్ కోసం ప్రముఖ బాలీవుడ్ సింగర్ జస్లిన్ రాయల్‌తో కలిసి పని చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఇటీవల ముంబయిలో ప్రకటించారు. షూటింగ్‌కు కాస్తా గ్యాప్ రావడంతో విజయ్ చిల్ అవుతున్నారు. (ఇది చదవండి: కిందపడ్డ విజయ్ దేవరకొండ.. వీడియో వైరల్!)అయితే తాజాగా ఆయన తన ఫెవరేట్ ఫుడ్ కేఎఫ్‌సీ చికెన్ తింటూ గాల్లో ఎంజాయ్ చేశారు. హాట్ ఎయిర్ బెలూన్‌లో ప్రయాణిస్తూ గాల్లోనే ఫుడ్‌ను ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలను విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఆకాశంలో విహరిస్తూ తనకు ఇష్టమైన కేఎఫ్‌సీ ఫుడ్ తింటూ కనిపించారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) -
హైదరాబాద్‌లో 100 రెస్టారెంట్ల సిబ్బందికి శిక్షణ
అమెరికన్ ఫాస్ట్‌ఫుడ్ దిగ్గజం కెంటకీ ఫ్రైడ్ చికెన్ (కేఎఫ్‌సీ) హైదరాబాద్‌లో 100 రెస్టారెంట్లకు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. ‘ఇండియా సహయోగ్ ప్రోగ్రామ్’ పేరుతో ఇప్పటికే 2021లో స్థానికంగా 100 రెస్టారెంట్లలో పని చేస్తున్న వారికి ఈ కార్యక్రమం ద్వారా శిక్షణ కల్పించింది. తాజాగా మరో 100 రెస్టారెంట్లలోని సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది.ఇండియా సహయోగ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఎంపిక చేసుకున్న రెస్టారెంట్లలోని సిబ్బందికి ఆహార భద్రత, పరిశుభ్రత, కస్టమర్ సర్వీస్, లాభదాయకత..వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. దీనివల్ల స్థానిక రెస్టారెంట్లు వృద్ధి చెందడంతోపాటు కస్టమర్లకు మెరుగైన ఆహారం, సేవలందేలా ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా ముంబయి, బెంగళూరు, ఢిల్లీ, గౌహతి, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లో దాదాపు 800 రెస్టారెంట్లలో సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.ఈ సందర్భంగా కేఎఫ్‌సీ ఇండియా, పార్టనర్ కంట్రీస్ జనరల్ మేనేజర్ మోక్ష్ చోప్రా మాట్లాడుతూ..‘ఆహార పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతోంది. మారుతున్న ట్రెండ్లు, కస్టమర్ ప్రాధాన్యతలు, వారి డిమాండ్లకు అనుగుణంగా సర్వీస్ అందించడం చాలా ముఖ్యం. ఇండియా సహయోగ్ కార్యక్రమంలో భాగంగా 2024 నాటికి దేశవ్యాప్తంగా 1000 రెస్టారెంట్లకు శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. ఈ కార్యక్రమం నిర్వహణకు నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ), ఎఫ్ఎస్ఎస్ఏఐకు చెందిన ఫుడ్ సేఫ్టీ అండ్ ట్రైనింగ్ సర్టిఫికేషన్ (ఎఫ్‌ఓఎస్‌టీఏసీ) ప్రోగ్రామ్ అధికారులతో కలిసి పని చేస్తున్నాం. హైదరాబాద్‌లో ఈ ప్రోగ్రామ్ కింద 2021లో 100 రెస్టారెంట్లకు శిక్షణ ఇచ్చాం. తాజాగా మరో 100 రెస్టారెంట్లలోని సిబ్బందికి అవగాహన కల్పించనున్నాం’ అని తెలిపారు.ఇదీ చదవండి: ఏళ్లు గడిచినా గతం గుర్తుండేలా.. కొత్త పరికరం ఆవిష్కరణతెలంగాణ ఆహార భద్రత కమిషనర్ ఆర్వి కర్ణన్ మాట్లాడుతూ..‘ఆహార భద్రత, పరిశుభ్రతకు వినియోగదారులు పెద్దపీట వేస్తున్నారు. పట్టణ ఆర్థిక వ్యవస్థలో స్థానిక రెస్టారెంట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆహార భద్రత విషయంలో ప్రతి రెస్టారెంట్ యాజమాన్యం సరైన నాణ్యతాప్రమాణాలు పాటించాలి. ఈమేరకు స్థానిక రెస్టారెంట్ సిబ్బందికి అవగాహన కల్పిస్తున్న కేఎఫ్‌సీ ప్రయత్నాలు అభినందనీయం’ అన్నారు. ఆహార భద్రత పరిశ్రమ వృద్ధికి ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) మద్దతుగా ఉంటుందని సంస్థ ప్రెసిడెంట్ సురేష్ సింఘాల్ తెలిపారు. -
KGF రికార్డును బద్దలు కొడతా అంటున్నధృవ సర్జా..
-
రూ.149కే కేఎఫ్‌సీ లంచ్ స్పెషల్ - వివరాలు
2024 ప్రారంభంలోనే కేఎఫ్‌సీ 'లంచ్ స్పెషల్' అనే కొత్త ఆఫర్ తీసుకువచ్చింది. ఈ ఆఫర్ కింద కేఎఫ్సీలో ఇష్టమైన వాటిని బుక్ చేసుకోవచ్చు. ప్రారంభ ధర రూ.149 మాత్రమే కావడం విశేషం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కేఎఫ్‌సీ అందించే ఓ స్పెషల్ ఆఫర్ 149 రూపాయలతో ప్రారంభమవుతుంది. వినియోగదారులు లాంగర్ బర్గర్లు, రోల్స్ లేదా రైస్ బౌల్జ్తో పాటు ఐకానిక్ హాట్ & క్రిస్పీ చికెన్, పెరి పెరీ చికెన్ స్ట్రిప్స్ లేదా ఫ్రైస్‌తో పాటు రిఫ్రెష్ డ్రింక్స్ వంటి వాటిని ఆర్డర్ చేసుకోవచ్చు. వీటి ధరలు వివిధ రకాలుగా ఉండే అవకాశం ఉంటుంది. కేఎఫ్‌సీ లంచ్ స్పెషల్స్ అనేది అన్ని కేఎఫ్‌సీ రెస్టారెంట్లలో ఉదయం 11:00 నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఇది కూడా 5X సేఫ్టీ ప్రామిస్ ఆఫ్ శానిటైజేషన్, స్క్రీనింగ్, సోషల్ డిస్టెన్సింగ్, వ్యాక్సినేషన్ టీమ్‌లతో ఉంటుంది. ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ ఆటోలో కనిపించిన సీఈఓ - ఆనంద్ మహీంద్రా రియాక్షన్ ఇలా.. ఫుడ్ డెలివరీ చేసే వ్యక్తులు మాత్రమే కాకుండా రెస్టారెంట్‌లోని అన్ని ప్రాంతాలు క్రమం తప్పకుండా శుభ్రంగా ఉంచుతారు. సంస్థ రైడర్ల ఆరోగ్య పరిస్థితులను కూడా క్రమం తప్పకుండా నోటీస్ చేస్తూ ఉంటుంది. ఇవన్నీ కస్టమర్ ఆరోగ్య రక్షణను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కేఎఫ్‌సీ లంచ్ స్పెషల్స్ కోసం కేఎఫ్‌సీ యాప్ లేదా వెబ్సైట్లో ఆర్డర్ చేసుకోవచ్చు. -
నకిలీ వెబ్సైట్లో రూ.11 లక్షలు మోసపోయిన బెంగళూరు వాసి - ఎలా జరిగిందంటే?
ఆధునిక కాలంలో ఆన్లైన్ మోసాలు చాలా పెరిగిపోయాయి. ఆదమరిస్తే డబ్బు పోగొట్టుకోవడం ఖాయం. ఇలాంటి సంఘటలను గతంలో చాలానే వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో సంఘటన కర్ణాటకలో జరిగినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, బెంగళూరుకు చెందిన 43ఏళ్ల వ్యాపారవేత్త ఫ్రాంచైజీని కొనుగోలు చేయడంలో భాగంగా నకిలీ కేఎఫ్సి వెబ్సైట్లో రూ. 11 లక్షలు కోల్పోయాడు. దీనిపైన ఈస్ట్ CEN పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. నిజానికి అతడు ఫ్రాంచైజీని కొనుగోలు చేసి నగరంలో అవుట్‌లెట్‌ను ఏర్పాటు చేయడానికి కేఎఫ్సి సంప్రదింపు వివరాలను తెలుసుకోవడానికి గూగుల్ సెర్చ్ చేసారు. అతడు ఓపెన్ చేసిన కేఎఫ్సి వెబ్సైట్ అతనికి సంబంధించిన వివరాలు కోరింది. ఇవన్నీ పూర్తి చేసిన తరువాత గుర్తు తెలియని నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చాయి. వారు కేఎఫ్సి ఉద్యోగులుగా పరిచయం చేసుకున్నారు. వారు అతనితో మాట్లాడిన తరువాత ఒక ఇమెయిల్ వచ్చింది. దీని ద్వారా కొన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగించాడు. దాదాపు ఒక నెల రోజులు సంభాషణ తరువాత అతని అభ్యర్థనలను ప్రాసెస్ చేయడానికి డబ్బు అడిగారు. నిజమని నమ్మిన వ్యాపారవేత్త రూ. 11.8 లక్షలు బదిలీ చేసాడు. వారికి డబ్బు పంపిన తరువాత వారు ఎటువంటి సమాచారం అందించకపోగా.. ఆ కాంటాక్ట్ నంబర్లు స్విచ్ ఆఫ్ అయినట్లు గుర్తించి.. మోసపోయినట్లు తెలుసుకున్నాడు. దీంతో పోలీసులకు పిర్యాదు చేసాడు. కేఎఫ్సి నోటీసు: కేఎఫ్సి తన అధికారిక వెబ్సైట్లో ఇటువంటి మోసాలు & నకిలీ కేఎఫ్సి ఫ్రాంచైజీ వెబ్సైట్ల పట్ల జాగ్రత్త వహించాలని హెచ్చరికలు జారీ చేసింది. బ్రాండ్ పేరుతో మోసం చేసేవారి సంఖ్య ఎక్కువైపోయింది. ఇప్పటికే చాలా మోసపూరిత వెబ్సైట్లు ఉన్నాయని తెలిపింది. కావున వినియోగదారులు చాలా జాగ్రత్త వహించాలని స్పష్టం చేసింది. -
తాత్కాలికంగా బంద్.. కస్టమర్లు మన్నించాలి.. మెక్‌డొనాల్డ్, సబ్వే షాకింగ్ నిర్ణయం!
న్యూఢిల్లీ: ఇటీవల కొన్ని వారాలుగా ఎక్కడ విన్నా, ఏ వార్త చూసిన టమోట పేరే వినపడుతోంది. ఈ ఏడాది ఎన్నడూ లేనంతగా రికార్డ్ ధరలు పలకడంతో ఈ పంట వేసిన రైతులు కొందరు లక్షాధికారి కాగా, మరికొందరు కోటీశ్వరులు కూడా అయ్యారు. దీని ధరలు దడపుట్టిస్తుండడంతో సామాన్య ప్రజలు వంటలో టమోటాకు ప్రత్యామ్నాయాన్ని చూస్తున్నారు. తాజాగా ఇంటర్నెషనల్ సంస్థలైన సబ్వే, మెక్‌డొనాల్డ్ కూడా టమోట దెబ్బను తట్టుకోలేక షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నాయి. భారత్‌లో పలు సబ్వే అవుట్లెట్లు తమ సలాడ్స్, శాండ్‌విచ్‌ల్లో టమాటలను జోడించడం నిలిపివేశాయి. నాణ్యతా పరమైన అంశాలతో పాటు అధిక ధరల కారణంగా సబ్వే ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల పలు కారణాల వల్ల కిచెన్‌లోకి కావాల్సిన ప్రధానమైన వస్తువుల ధరలు 400 శాతానికి చేరుకున్నాయి. ప్రత్యేకంగా టమోట ధరలు కన్నీళ్లను తెప్పిస్తోంది. మరో వైపు ప్రభుత్వం జోక్యం చేసుకున్నప్పటికీ కొన్ని మార్కెట్లలో రికార్డు స్థాయికి దారితీసింది. ఇటీవల ఢిల్లీ ఎయిర్పోర్ట్ టెర్మినల్‌లోని ఒక సబ్వే అవుట్లెట్ ఓ బోర్డులో ఇలా రాసుంది. " కస్టమర్లు మన్నించాలి. తాత్కాలికంగా టమోటాలు అందుబాటులో లేదని తెలిపింది. వీలైనంత త్వరగా టమోట సరఫరాలను పునరుద్ధరించడానికి తాము చురుకుగా పని చేస్తున్నామని అవుట్లెట్ కస్టమర్లకు హామీ ఇచ్చింది. భారతదేశంలోని సబ్వే అవుట్లెట్లలో దాదాపు వందల సంఖ్యల్లో ఉన్నప్పటికీ ఈ నిర్ణయం ద్వారా ప్రభావితమైన అవుట్లెట్ల ఖచ్చితమైన సంఖ్య అస్పష్టంగానే ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా మరికొన్ని సబ్వే అవుట్‌లెట్స్‌లో టమాటాలను సర్వ్ చేయడం కొనసాగుతోంది. సబ్వే, మెక్‌డొనాల్డ్స్ బాటలోనే డామినోస్, కేఎఫ్‌సీ టమాటాల వాడకం తగ్గించాయి. చదవండి: ఐదేళ్లకు లక్ష్మీదేవీ తలుపు తట్టింది.. కొన్ని రోజుల్లో ఆయన లక్షాధికారి! -
ఇండియాకు కేఎఫ్సి, పిజ్జా హట్ రావడానికి కారణం ఇతడే..!
యావత్ భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి, మాస్టర్ కార్డ్ మాజీ సీఈఓ 'అజయ్ బంగా' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన 2023 జూన్ 02 నుంచి వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే అజయ్ బంగా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రపంచ బ్యాంకు కొత్త అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించనున్న అజయ్ బంగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసి, ఢిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టభద్రుడయ్యాడు. చదువు పూర్తయిన తరువాత 1981లో నెస్లేతో ఉద్యోగ జీవితం ప్రారంభించారు. ఆ తరువాత పెప్సికోలో కూడా పనిచేశారు. 2010లో అజయ్ బంగా మాస్టర్ కార్డ్‌లో ప్రెసిడెంట్ బాధ్యతలను, ఆ తరువాత సీఈఓగా నియమితులయ్యారు. 2020లో ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ICC) ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఈయన ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ జనరల్ అట్లాంటిక్‌లో వైస్ చైర్మన్‌గా ఉన్నారు. (ఇదీ చదవండి: 1998లో ప్రభంజనం సృష్టించిన టాటా ఇండికా - అరుదైన వీడియో) భారతదేశానికి కేఎఫ్సి, పిజ్జా హట్ వంటివి రావడం వెనుక అజయ్ బంగా హస్తం ఉందని కొంతమంది భావిస్తున్నారు. నివేదికల ప్రకారం అజయ్ బంగా మొత్తం ఆస్తుల విలువ 2021లో 206 మిలియన్ డాలర్లు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 1689 కోట్లకంటే ఎక్కువ. అంతే కాకుండా 11,31,23489 విలువైన మాస్టర్ కార్డ్ స్టాక్లను కలిగి ఉన్నట్లు సమాచారం. మాస్టర్ కార్డ్‌లో ఆయన జీతం రోజుకి 52 లక్షలు కావడం గమనార్హం. (ఇదీ చదవండి: ఈ ప్లాన్ కింద 5జీబీ డేటా ఫ్రీ - కేవలం వారికి మాత్రమే!) పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన అజయ్ బంగా తండ్రి భారత సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్. ఈ కారణంగానే దేశంలో చాలా ప్రాంతాలను తిరగాల్సి వచ్చింది. మొత్తానికి ఈ రోజు భారతదేశం మొత్తం గర్వించే స్థాయికి ఎదిగాడు. ప్రపంచ బ్యాంక్ అజయ్ బంగాతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తోంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ సందేహాలను, అభిప్రాయాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
శాఖాహార ‘చికెన్’! కేఎఫ్‌సీ అరుదైన ప్రయోగం
కెంటకీ ఫ్రైడ్ చికెన్ (KFC) అరుదైన ప్రయోగానికి సిద్ధపడింది. ప్లాంట్ బేస్డ్ చికెన్‌ను కస్టమర్ల కోసం తీసుకురాబోతోంది. అంటే అది శాకాహార చికెన్!!. మొక్కల నుంచి ఉత్పత్తి అయ్యే ‘మాంసం లాంటి’ ఫుడ్ అన్నమాట. జనవరి 10న అమెరికాలో బియాండ్ మీట్ పేరుతో ఈ ‘మాంసం కానీ మాంసం(చికెన్)’ ఫ్రైడ్ రుచులను కస్టమర్లకు అందించబోతోంది. వాస్తవానికి గత కొన్నేళ్లుగా మాంసం పత్యామ్నాయాల కోసం పరిశోధనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ల్యాబ్‌లో పెంచుతున్న మాంసం, తక్కువ మాంసం మోతాదు ఉన్న ఉత్పత్తులతో పాటు మాంసానికి ప్రత్యామ్నాయంగా మొక్కల ఆధారిత మాంసం మీద పరిశోధకులు ఫోకస్ ఉంటోంది. లెగ్యుమెస్ (సోయాబీన్స్, లెంటిల్స్), క్వినోవా లాంటి ధాన్యాలు, కోకోనట్ ఆయిల్, సెయిటన్, పచ్చి బఠానీ లాంటి ప్రొటీన్లు ఉన్న కూరగాయల్ని, ఇతరత్రాల్ని ప్లాంట్ బేస్డ్ మీట్స్‌లో ఉపయోగిస్తారు. సో.. ఇది ప్యూర్ వెజ్ మీట్ అన్నమాట. యమ్ కంపెనీలో బిగ్గెస్ట్ బ్రాండ్‌గా పేరున్న కేఎఫ్‌సీ ఒక్క అమెరికాలోనే 4వేలకు పైగా రెస్టారెంట్లను కలిగి ఉన్న విషయం తెలిసిందే. యమ్లోనే కేఎఫ్‌సీ తరపున బియాండ్ మీట్ కంపెనీ వేరుగా శాఖాహార ఫుడ్ ప్రొడక్టులతో 2019 ఆగష్టు నుంచి(అట్లాంటా కేంద్రంగా) కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఇక శాఖాహార ‘చికెన్’ ప్రకటన నేపథ్యంలో బియాండ్ షేర్లు 7 శాతం మేర పెరగడం విశేషం. బియాండ్ ఫ్రైడ్ చికెన్ ధర 7 డాలర్లు(దాదాపు 500రూ. పైనే) నిర్ణయించారు. త్వరలో ఈ ఫ్రాంచైజీలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది బియాండ్ మీట్. -
కేఎఫ్‌సీ చికెన్ తింటున్నారా.. అయితే జాగ్రత్త!
కేఎఫ్‌సీ చికెన్ తెలియని వారు ఎవరూ ఉండరు. చిన్న నుంచి పెద్దవారి వరకు లొట్టలేసుకుంటూ తినేవారు చాలామంది ఉంటారు. లాక్డౌన్ అనంతరం కేఎఫ్‌సీ సెంటర్లు తిరిగి తెరుచుకోవడంతో భోజన ప్రియులు మళ్లీ క్యూ కడుతున్నారు. అయితే తాజాగా ఓ కస్టమర్‌కు కేఎఫ్‌సీ నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఇది ఎక్కడో వేరే రాష్ట్రంలో అనుకుంటే పొరబడ్డట్లే. హైదరాబాద్ నగరంలోనే చోటుచేసుకున్న ఆ వివరాలు ఇలా ఉన్నాయి. చికెన్ తినేందుకు సాయితేజ అనే వ్యక్తి కూకట్‌పల్లిలోని కేఎఫ్‌సీ సెంటర్‌కు వెళ్లాడు. అక్కడ చికెన్ ఆర్డర్ ఇవ్వగా.. కేఎఫ్‌సీ సిబ్బంది సరిగా ఉడకని చికెన్ పీస్‌లను సర్వ్ చేశారు. అది చూసిన కస్టమర్ షాక్ అయ్యి ఇలా ఉందేంటీ అని సిబ్బందికి ఫిర్యాదు చేయగా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఈ విషయాన్ని అతను ట్విట్టర్ వేదికగా పోస్టు చేశాడు. హైదరాబాద్‌లోని జెఎన్టీయూ మెట్రో కేఎఫ్‌సీ స్టోర్ నుంచి నుంచి తీసుకున్న చికెన్‌లో నాణ్యత లేదని.. పీస్ అస్సలు ఉడకలేదంటూ సాయి తేజ వాపోయాడు. ఇలాంటి ఆహారాన్ని తింటే కస్టమర్లకు కడుపు నొప్పి సమస్యలు వస్తాయని, ఈ పరిశీలించాలంటూ కూకట్పల్లి జోనల్ కమిషనర్‌ను ట్యాగ్ చేశాడు. దీనిపై జీహెచ్ఎంసీ జోనల్ కమీషనర్ స్పందించారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. @KFC_India Very Disappointed with the Quality of Food which was Taken today from JNTU Metro #kfcStore in #Hyderabad. The Piece was Not at all cooked & if you serve such kind of Food, Customers will get Stomach Problems. Req @zckukatpally Garu to Send @AMOH_KUKATPALLY for Checking pic.twitter.com/EysElyYLTc — SAITEZAA (@ActivistTeja) August 8, 2021 -
రాబోయే రోజుల్లో భారత్ మంచి మార్కెట్
కరోనా వైరస్ మహమ్మారి వ్యాపారంలో నిర్మాణాత్మక మార్పులను తీసుకువచ్చింది. ఇలాంటి సమయంలో ఎవరైనా కొంత వ్యాపారాన్ని ప్రారంభించాలంటే కొంచెం ఆలోచిస్తున్నారు. కానీ, అమెరికాకు చెందిన ఫాస్ట్ ఫుడ్ సంస్థ కెంటకీ ఫ్రైడ్ చికెన్(కేఎఫ్‌సీ) భారతదేశంలో తమ రెస్టారెంట్ వ్యాపార నెట్వర్క్ ను విస్తరింపజేయాలని ఆలోచనలో ఉంది. రాబోయే సంవత్సరాల్లో భారత దేశం వృద్ధి గణనీయంగా పెరగనున్నట్లు తాను నమ్ముతున్నానని కేఎఫ్‌సీ కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గత ఏడాది కరోనా మహమ్మారి సృష్టించిన ఇబ్బందికర పరిణామాల మధ్యలో కూడా సుమారు 30 కొత్త రెస్టారెంట్లను కేఎఫ్‌సీ ఇండియా ప్రారంభించింది. ఈ సంవత్సరం కూడా కొత్త ఔట్లెట్లను స్థాపించాలని చూస్తోంది. భారతదేశంలో వినియోగదారులు కేఎఫ్‌సీ చికెన్ పై ఎక్కువగా మక్కువ చూపిస్తున్న నేపథ్యంలో భవిష్యత్ లో కూడా ఇండియా మార్కెట్ లో కేఎఫ్‌సీ బిజినెస్ బాగా సాగుతుందని భావిస్తోంది. కేఎఫ్‌సీ బ్రాండ్‌ను విస్తరింప చేసే ప్రణాళికలో భాగంగా కొత్త ఔట్లెట్లను ప్రారంభిస్తున్నట్లు సంస్థ పేర్కొన్నది. అంతేకాకుండా కస్టమర్లకు అన్ని రకాలుగా అందుబాటులో ఉంటూ మా బ్రాండ్ విలువ పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నామని కేఎఫ్‌సీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మీనన్ అన్నారు. కరోనా మహమ్మారి రాకముందు ఇండియాలో ఉన్న కేఎఫ్‌సీ రెస్టారెంట్ల సంఖ్య 450గా ఉంటే ప్రస్తుతం 130కి పైగా నగరాల్లో 480కి పైగా రెస్టారెంట్లు ఉన్నాయి. చదవండి: ఏప్రిల్ 1 నుంచి కీలక మార్పులు భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల విడుదల ఇప్పట్లో కష్టమే! -
మెక్‌డొనాల్డ్స్ ఫుడ్ ఆర్డర్ చేసుకోండి: బర్గర్ కింగ్
లండన్: కరోనా కాలంలో ఎన్నో సంఘటనలు చేసుకున్నాయి. మహమ్మారి మనుషుల మధ్య దూరాన్ని పెంచినప్పటికీ... మనుషుల్లో మానవత్వాన్ని బయటకు తీసింది. కోవిడ్ నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా ప్రపంచ దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. ఈ నేపథ్యంలో తిరిగి తమ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకునేందుకు శత్రు దేశాలు సైతం మిత్రులుగా మారుతున్నాయి. ఈ తరుణంలో నువ్వా నేనా అంటూ సొంత దేశంలో పోటీపడే ఫుడ్ చైన్ వ్యాపారాలు కూడా ఈ సంక్షోభంలో మద్దతుగా నిలుస్తున్నాయిని చెప్పడానికి ఈ తాజా సంఘటనే రుజువు. లాక్డౌన్లో ప్రముఖ వ్యాపార సంస్థలు ఆర్థిక సంక్షభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీంతో పలు సంస్థలు ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. దీనివల్ల వేలల్లో ఉద్యోగుల జీవితాలు రోడ్డునే పడే అవకాశం ఉంది. అలాంటి వారిని ఆదుకోవాలంటూ యుకేలోని ప్రముఖ ఫుడ్ చైన్ వ్యాపార సంస్థ బర్గర్‌కింగ్ చేసిన ట్వీట్ ప్రపంచ వ్యాప్తంగా ప్రజల హృదయాలను ఆకట్టుకుంటోంది. అమెరికన్ బెస్డ్ ఫాస్ట్‌ఫుడ్ సంస్థ అయిన బర్గర్ కింగ్ యుకేలోని మెక్‌డొనాల్డ్స్, కేఎఫ్‌సీ, పాపా జాన్స్, టాకో బెల్స్ల ఫుడ్‌ను ఆర్డర్ చేసుకుని ఆ సంస్థ ఉద్యోగులను ఆదుకోవాలని సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చింది. (చదవండి: షూ జతలో ఏకంగా 119 అరుదైన సాలీళ్లు) We know, we never thought we’d be saying this either. pic.twitter.com/cVRMSLSDq6 — Burger King (@BurgerKingUK) November 2, 2020 ‘మేము ఇలాంటి ట్వీట్ చేస్తామని కలలో కూడా ఊహించలేదు. కానీ రెస్టారెంట్స్, ఫుడ్స్ వ్యాపార సంస్థలలో పని చేసే వేలమంది ఉద్యోగులకు ఇప్పుడు మీ మద్దతు చాలా అవసరం. ఇందుకోసం మీరు కేఎఫ్‌సీ, మెక్‌డోనాల్డ్స్ ఆహారం కొనుగోలు చేయండి. వేల మంది ఉద్యోగుల జీవితాలను ఆదుకోండి. అయితే ఈ మహమ్మారి కాలంలో జాగ్రత్త ఉండటం మంచి విషయమే.. కానీ మంచిపని కోసం బయటి ఆహారం ఆర్డర్ చేయడం అంత చెడ్డ విషయం కాదు’ అంటూ బర్గర్ కింగ్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వ్యాపారంలో పోటీ దారులైన మెక్‌డోనాల్డ్స్ ఉద్యోగుల కోసం ఈ ట్వీట్ చేసిన బర్గ్కింగ్ తీరుకు ఫిదా అవుతూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘బర్గర్ కింగ్ చోరవ ఎంతో మందికి స్పూర్తినిస్తుంది. మనం ఎప్పటికీ మన పోటీదారులతో అసమానంగా పోరాడచ్చు. అలాగే అవసరమైన సమయాల్లో వారికి మద్దతుగా కూడా నిలబడవచ్చని బర్గర్ కింగ్ రుజువు చేసింది’ , ‘గొప్ప చర్య బర్గర్ కింగ్, మెక్‌డోనాల్డ్స్ అభిమానుల నుంచి భారీ మద్దతు, గౌరవం’ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. (చదవండి: కాకరకాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లితో రసగుల్లా..) -
అలా పెరిగే కోళ్లతో డేంజర్
సాక్షి, న్యూఢిల్లీ : కోళ్ల పరిశ్రమలో లాభాపేక్ష కొక్కరొకో! అంటోంది. స్వల్ప కాల వ్యవధిలో అధిక లాభాలను ఆర్జించాలనే అత్యాశతో కొందరు కోళ్ల పెంపకం దారులు పెడదారులు తొక్కుతున్నారు. జన్యుపరమైన ఇంజక్షన్లు ఇవ్వడం ద్వారా 50, 60 రోజుల్లో పెరగాల్సిన కోడి పిల్లలను 35 రోజుల్లో పెరిగేలా చేస్తున్నారు. పర్యవసానంగా కోళ్ల కాళ్లు, గుండె, ఊపిరితిత్తులు తగిన రీతిలో ఎదగకుండా దెబ్బతింటున్నాయి. వీటివల్ల కోళ్లలో మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. మరణం సంభవించకపోయిన కోళ్ల కాళ్లల్లో కురుపులు వస్తున్నాయి. వాటిని తినడం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇలా అనవసరంగా కోళ్లను వేగంగా పెరగనిచ్చి వాటిని కొంత చౌక ధరలకు విక్రయిస్తుండడం వల్ల వాటినే కొనుగోలు చేసేందుకు రెస్టారెంట్లు, హోటళ్లు ప్రాధాన్యతనిస్తున్నాయని, ప్రస్తుతం లండన్ మార్కెట్లో ఇదే జరుగుతోందని ‘రాయల్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు యానిమల్స్ (ఆర్ఎస్పీసీఏ)’ వెల్లడించింది. ‘వరల్డ్ యానిమల్ ప్రొటెక్షన్’, ‘ఫామ్ యానిమల్ వెల్ఫేర్ ఫోరమ్’లతో కలిసి అతి వేగంగా పెంచుతున్న మూడు రకాల కోళ్ల బ్రీడింగ్‌పై ఆర్ఎస్పీసీఏ అధ్యయనం జరపగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 1950లో కోడి పిల్లలు కోతకొచ్చే కోళ్లుగా ఎదిగేందుకు 70 రోజులు పట్టగా ప్రస్తుతం 35 రోజుల్లో ఆ స్థాయికి జన్యు ఇంజెక్షన్ల ద్వారా పెంచేసి విక్రయిస్తున్నారని ఆ చారిటీ సంస్థ తెలియజేసింది. ఇలాంటి కోళ్ల కొనుగోలుకు దూరంగా ఉండాలంటూ తామిచ్చిన పిలుపునకు కెఎఫ్సీ, మార్క్స్ అండ్ స్పెన్సర్, వెయిట్రోస్ సంస్థలు సానుకూలంగా స్పందించినట్లు ఆ చారిటీ సంస్థ తెలియజేసింది. ఇలా అతి వేగంగా పెంచుతున్న కోళ్లు అనారోగ్యం బారిన పడి చనిపోయే అవకాశం సాధారణంకన్నా రెట్టింపు ఉంటోందని అధ్యయనంలో తేలింది. వీటిని తినడం వల్ల ప్రజల ఆరోగ్యానికి ఎంత హానికరమన్న విషయంలో ఈ అధ్యయనం జరగలేదని, ఇలా వేగంగా పెంచడం వల్ల కోళ్లు ఎంత నరక యాతన అనుభవించాల్సి వస్తోందన్న విషయంలోనే ఈ అధ్యయనం కొనసాగిందని అధ్యయన సంస్థ పేర్కొంది. ఇలా జన్యుపరంగా వేగంగా పెంచిన కోళ్లు అనారోగ్యం, అనవసరమైన బాధతోని అర్ధాయుషు మాత్రమే బతుకుతున్నాయని వరల్డ్ యానిమల్ ప్రొటెక్షన్ బ్రిటన్ చీఫ్ జేమ్స్ మాక్కోల్ ఆందోళన వ్యక్తం చేశారు. -
కేఎఫ్సీలో ఉద్యోగి హత్య
బొమ్మనహళ్లి : దోపిడీకి వచ్చిన నలుగురు దుండగులు కేఎఫ్‌సీ సెంటర్లోకి దూరి ఓ వ్యక్తిని హత్య చేసిన సంఘటన సోమవారం రాత్రి హోసూరు రోడ్డులోని హెబ్బగోడి బొమ్మసంద్రలో ఉన్న కేఎఫ్‌సీ సెంటర్లో చోటు చేసుకుంది. దుండగుల దాడిలో హత్యకు గురైన యువకుడు ఒరిస్సాకు చెందిన సమీర్ (25)గా గుర్తించారు. వివరాలు... సోమవారం రాత్రి 10 గంటల సమయంలో రెండు బైకుల్లో వచ్చిన నలుగురు దుండగులు కేఎఫ్‌సీ సెంటర్లో జొరబడ్డారు. అందులో ఉన్న యువకులపై దాడి చేయడంతో పాటు నగదు, మొబైల్ ఫోన్ లాక్కున్నారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న సమీర్ వారిని అడ్డుకోవడానికి యత్నించగా వారు చాకుతో సమీర్ కడుపులో పొడిచి హత్య చేసి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆధారాలు చేపట్టారు. సమీర్ మృతదేహాన్ని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
నోరూరించే డీల్స్ ఆఫర్ చేస్తున్న కేఎఫ్‌సీ, బర్గర్ కింగ్
ముంబై : ఒకవైపు ప్రముఖ రెస్టారెంట్లు మెక్‌డొనాల్డ్స్ మూతపడటంతో, మరోవైపు కేఎఫ్‌సీ, బర్గర్ కింగ్‌లు మార్కెట్లో దూసుకుపోతున్నాయి. నోరూరించే డీల్స్‌తో కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్ల మూతను, ఈ రెస్టారెంట్లు క్యాష్ చేసుకుంటున్నాయని ఓ ఆంగ్ల పత్రిక రిపోర్టు చేసింది. బర్గర్ కింగ్, కేఎఫ్‌సీ, కార్ల్స్ జేఆర్. లాంటి క్విక్ సర్వీసు రెస్టారెంట్లు దేశీయంగా తమ కస్టమర్ బేస్‌ను పెంచుకోవడానికి ఆకర్షణీయమైన వాల్యుమీల్స్ ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నట్టు పేర్కొంది. డిసెంబర్ క్వార్టర్లో ఈ అవుట్లెట్లలో విక్రయాలు భారీగా పెరిగాయని తెలిపింది. కన్నాట్ ప్లాజా రెస్టారెంట్ల(సీపీఆర్ఎల్) 50:50 జాయింట్ వెంచర్ విక్రమ్ బక్షికి, మెక్‌డొనాల్డ్స్‌కు మధ్య వివాదాలు తలెత్తడంతో గత రెండు వారాలుగా 80కిపైగా మెక్‌డొనాల్డ్స్ అవుట్లెట్లు మూతపడ్డ సంగతి తెలిసిందే. వీటిలో కొన్నింటిన్నీ పునఃప్రారంభించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వివాద నేపథ్యంలో స్థానిక భాగస్వామి నిర్వహిస్తున్న 169 రెస్టారెంట్లలో ఆహార భద్రత, నాణ్యతపై మెక్డొనాల్డ్స్ఇండియా ఆందోళనలు వ్యక్తంచేస్తోంది. దీంతో మెక్‌డీ కస్టమర్లు కూడా బర్గర్ కింగ్, కేఎఫ్‌సీ లాంటి రెస్టారెంట్లకు ఆకర్షితులవుతున్నారు. పరిమిత కాల ఆఫర్‌తో తమ రెస్టారెంట్లలోకి ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతుందని బర్గర్ కింగ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాజీవ్ వెర్మన్ అన్నారు.నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రిపోర్టు ప్రకారం 2021 నాటికి దేశీయ ఆహార సర్వీసుల పరిశ్రమ 4.98 ట్రిలియన్లకు చేరుకుంటుందని అంచనా. దేశీయ జీడీపీలో రెస్టారెంట్ సెక్టారే 2.1 శాతం సహకరిస్తుందని కూడా అంచనాలు వెలువడుతున్నాయి. -
నాలుగు ముంజెలు చారెడు చక్కెర....
వేసవి జ్ఞాపకం... ఎండాకాలంలో వీధుల్లో తాటిముంజల మనిషి తిరగడం ఒక కళ. పచ్చివాసనలేసే తాటి ఆకుల్లో వొలిచిన తాటి ముంజెల్ని చుట్టి కావడి బద్దకు వేళ్లాడగట్టి అటూ ఇటూ పచ్చటి కట్టలను భుజాన మోస్తూ ‘తాటి ముంజలో’ అని తిరగడం ఎండ పూట మెరిసే ఒక ఊరి కళ. కాని అమ్మేవాళ్లలో చాలా మందికి ఈ ఓపిక ఉండదు. చెట్టు నుంచి దించిన గెలల్ని నేరుగా తీసుకొని బజారుకు వచ్చేస్తారు. కొడవలితో తీపి చిలకరింతలు పెట్టడానికి సిద్ధమవుతారు. తినేవారికి కొదవా? చుట్టూ మూగుతారు. నాకొకటి నాకొకటి అని తాటిముంజెల్ని అందుకుని పొడిచి తినడానికి బొటనవేలును స్పూన్‌లా మార్చేస్తారు. మూడు కన్నులు తేలిన తాటికాయను ఒక చేతిలో బౌల్‌లాగా పట్టుకొని మరో చేతి బొటనవేలుతో ఒక్కో ముంజెను పొడిచి పొడిచి తింటారు. కొన్ని ముంజెల్లో నీళ్లు నిండుగా ఉంటాయి. వేలు పొడవగానే చివ్వున లేచి ముఖాన కొడతాయి. అవి నేల పాలు కాకుండా నోటికి పట్టి గుటకాయస్వాహా చేయడం పెద్ద నైపుణ్యం. ఇక పిల్లలకైతే ముంజెల బండి దగ్గర నిలుచోవడం సరదా. ఎండ పూట ఏదో ఒక కూడలిలో చెట్టు నీడన బండి ఆపి ముంజెలమ్మే మనిషి ఒక్కో తాటికాయను కోరిన వారికి కొట్టి కొట్టి ఇస్తూ ఉంటే చూడటం పిల్లలకు వేడుక. ఒక్కోసారి దయదలిచిన వారు వాళ్లకూ ఒక కాయ ఆఫర్ చేయవచ్చు. రెండు ముంజెలు తిని మూడోదాన్ని వాళ్లకు వదిలిపెట్టవచ్చు. ఖాళీ చేసిన తాటికాయను బండి చక్రంగా మార్చుకోవడం ఒక ఆట. రెండు తాటికాయలను రెండు చక్రాలుగా చేసి మధ్యలో పుల్ల గుచ్చి తాటి ఆకు చీలికను పుల్లకు ముడి వేసి ముడి చివరన పురికోస కట్టి లాక్కూంటూ వెళ్లడం ఇన్నోవా క్రిస్టా కంటే తక్కువ లగ్జరీ కాదు. కొందరు ఒక పంగా కర్ర చివరన ఒక తాటికాయను గచ్చి దానిని స్టీరింగ్‌లా వాడుతూ పంగతో బండి తోసుకెళ్లడం కూడా ముద్దులొలికే ఆట. ముదురు బెండకాయే కాదు ముదురు తాటిముంజ కూడా తినడానికి పనికి రాదు. తింటే కడుపులో నొప్పి పడుతుంది. అసలు వైభోగం అంటే ఏమిటంటే మంచి ఎండపూట తాటి ముంజెలు కొనుక్కొని వచ్చి భోజనం చేశాక తీరిగ్గా వొలిచి చిన్న ముక్కలుగా చేసి ఒక స్టీలు పాత్రలో పోసి పైన చక్కెర జల్లి ఫ్రిజ్‌లో పెట్టి మధ్యాహ్నం కునుక్కు ఉపక్రమించాలి. నిద్ర లేచే సరికి ముంజెలు చల్లబడి చక్కెరపట్టి నోటికి హాయిగా కడుపుకు చల్లగా సిద్ధంగా ఉంటాయి. కెఎఫ్సి, మెక్డొనాల్డ్స్లా తాటిముంజెలు ప్రచారం చేసుకోలేకపోవచ్చు. సమ్మర్ ఆఫర్స్ ప్రకటించకపోవచ్చు. కాని వేళ్లు దిగిన సంస్కృతి వందలఏళ్లైనా పోదు. కాకుంటే గుర్తు పెట్టుకొని ఒక తరం నుంచి ఇంకో తరానికి అందించాలి. ఈ వేసవిలో పిల్లలకు తాటి చెట్టు చూపించండి. తాటి ఆకు చూపించండి. తాటి ముంజె చూపించండి. బండి దగ్గర ఆగి కొట్టిన తాటి ముంజెన చేతికి ఇస్తే బొటన వేలు గుచ్చగానే నీళ్లు వారి ముఖాన జివ్వున కొడుతూ ఉంటే వారు నవ్వుతూ ఉంటే మీరూ ఫక్కున నవ్వండి. వేసవికి ఇవ్వదగ్గ మర్యాద ఇదే అని గ్రహించండి. -
ఇక మీ గోళ్లు కూడా నాకొచ్చు!
న్యూయార్క్: ఎక్కువ మంది అమ్మాయిల్లో ఉండే గోళ్లు కొరికే అలవాటును గురించి ఇక బెంగ అక్కర్లేదు. ఈ అలవాటును కూడా మార్కెట్ చేసుకోవచ్చిన భావించిన ఓ సంస్థ.. 'ఏం పర్లేదు గోళ్లను కొరకండి, చప్పరించండి.. అదనంగా రుచిని కూడా పొందండి' అంటూ మార్కెట్లోకి ఫింగర్ లిక్కింగ్ నెయిల్ పాలిష్‌ను తీసుకొస్తోంది. ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ సంస్థ కేఎఫ్‌సీ ట్యాగ్‌లైన్ 'ఫింగర్ లిక్కింగ్ గుడ్' అన్న విషయం తెలుసుగా. ఏదో చికెన్ రుచి అంతలా ఉంటుందని తెలపడానికి పెట్టిన ఈ ట్యాగ్‌లైన్‌ను కేఎఫ్‌సీ ఇప్పుడు నిజం చేస్తోంది. తమ కస్టమర్లతో వేళ్లు చప్పరింపచేసే పనికి కేఎఫ్‌సీ శ్రీకారం చుట్టింది. అదేంటంటే.. మార్కెట్లోకి కేఎఫ్‌సీ రెండు నెయిల్ పాలిష్ ప్రొడక్ట్‌లను విడుదల చేసింది. కేఎఫ్‌సీ చికెన్‌లో వాడే స్పైసీ ఫ్లేవర్లను కలిపి విడుదల చేసిన ఈ నెయిల్ పాలిష్‌ను కావాల్సినప్పుడు చప్పరించొచ్చు. ఒరిజినల్, హాట్ అండ్ స్పైసీ పేరుతో కేఎఫ్‌సీ చేసిన ఈ ప్రయోగం ఇప్పుడు ఫుడ్ మార్కెట్‌తో పాటు ఫ్యాషన్ మార్కెట్ దృష్టిని సైతం ఆకర్షింస్తోంది. ముందుగా ఇతర నెయిల్ పాలిష్‌ల లాగానే వీటిని గోళ్లకు వేసుకోవచ్చని.. కావాల్సినప్పుడు వాటిని చప్పరించడం ద్వారా కేఎఫ్‌సీ ఫుడ్ ఫ్లేవర్‌ను ఆస్వాదించొచ్చని కెఎఫ్సీ ప్రతినిధులు చెబుతున్నారు. హాంకాంగ్‌లో కేఎఫ్‌సీ మార్కెట్‌ను పెంచుకోవడానికి ఈ వినూత్న ప్రయోగం చేస్తున్నారు. అంతేకాదు.. ఈ రెండు నెయిల్ పాలిష్‌లు ఒరిజినల్, హాట్ అండ్ స్పైసీలలో ఏది బాగుందో చెప్పాలని హాంకాంగ్ ప్రజలను కేఎఫ్‌సీ కోరింది. రెండింటిలో దేనికి ఎక్కువగా ప్రజల మద్దతు ఉంటే దానిని ఎక్కువ పరిమాణంలో ఉత్పత్తి చేస్తామని కేఎఫ్‌సీ చెబుతోంది. ఏదేమైనా ఈ వినూత్న ఆలోచన కేఎఫ్‌సీ బ్రాండ్‌పై ఆసక్తిని పెంచుతోందంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. -
కేఎఫ్‌సీ భోజనంలో పురుగులు!
కేఎఫ్‌సీ.. తన వినియోగదారులకు షాకుల మీద షాకులిస్తోంది. సాయంత్రం సరదాగా అలా బయట తిందామని వెళ్లిన వారికి కేఎఫ్‌సీ పాప్‌కార్న్ చికెన్ మీల్లో పురుగులు కనిపించడంతో ఆశ్చర్యం, అసహ్యం రెండూ కలిగాయి. ఇటీవలి కాలంలో కేఎఫ్‌సీ మీద పలు సందర్భాల్లో ఆరోపణలు వచ్చాయి. ఇటీవల ఇండియాలో హైదరాబాద్, మంగుళూరు తదితర ప్రాంతాల్లో కేఎఫ్‌సీ బర్గర్లలో పురుగులు రావడం, చికెన్‌లో బ్యాక్టీరియా ఉండటం కనిపించాయి. తాజాగా 27 ఏళ్ల జెన్నిఫర్ ఆల్డెర్సన్ తన కుమార్తె లిడియా హోనేతో కలసి బిషప్ ఆక్లాండ్ లోని దుర్హామ్ ప్రాంతంలో ఉన్న కేఎఫ్‌సీకి వెళ్లారు. అక్కడ చికెన్ పాప్‌కార్న్ మీల్ కోసం ఆర్డర్ ఇచ్చారు. తీరా లిడియా తింటున్న పాప్‌కార్న్‌లో పురుగు కనిపించడంతో జెన్నిఫర్ షాకయ్యింది. ఒకేవారంలో ఇలా కేఎఫ్‌సీ ఆహారంలో క్రిములు కనిపించడం ఇది రెండోసారని అక్కడే ఉన్న మరో మహిళ చెప్పడం.. అగ్నికి ఆజ్యం పోసింది. పురుగు కనిపించిన తర్వాత జెన్నిఫర్ కుటుంబ సభ్యులు.. మిగిలిన పదార్థాలను తినలేకపోయారు. పదార్థాలన్నింటినీ వాపస్ ఇచ్చేసిన ఆల్డెర్సన్.. కేఎఫ్‌సీ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పదార్థాలను చుట్టి ఫ్రిజ్ లో పెట్టిన తర్వాత పురుగులు ఎలా వస్తాయని, మీ అజాగ్రత్త వల్లే ఇలా జరిగిందని మండిపడింది. దీంతో కేఎఫ్‌సీ సిబ్బంది మరోసారి ఇలా జరగకుండా చూస్తామంటూ క్షమాపణలు చెప్పారు.. అయితే మొక్కజొన్న వంటి సహజ ఉత్పత్తుల విషయంలో దురదృష్టవశాత్తు అరుదుగా ఇలా అవుతుందని, గింజలను తొలిచి క్రిములు లోపల ఉండటంతో కనపడవని కేఎఫ్‌సీ సిబ్బంది సంజాయిషీ ఇస్తున్నారు. ఇలాంటి తప్పులు జరిగితే తాము ఆర్డర్ పూర్తిగా వాపస్ తీసుకుంటామని, తమ కస్టమర్ కేర్ సిబ్బంది కూడా అందుబాటులో ఉండి ఎటువంటి సహాయం కావాలన్నా అందిస్తారని చెప్తున్నారు. ఆహార భద్రతాధికారులు కూడా ఒకే వారంలో రెండుసార్లు ఇలాంటి ఘటనలు జరగడంపై కేఎఫ్‌సీని వివరణ కోరారు. -
జింజర్ బర్గర్లో పురుగులు కదిలితే...
బెంగళూరు: సాయంత్రం పూట అలా సేదతీరుతూ కేఎఫ్సీలో బర్గర్ తింటుంటే ఆ మజాయే వేరు కదా. కానీ ఎంతో ఆకలితో ఆతృతగా, తింటున్న బర్గర్లో ఉన్నట్టుండి పురుగులు, అది కూడా కదులుతూ కనిపిస్తే ఎలా ఉంటుంది? వాక్.. అనిపిస్తుంది కదా. ఓ యువజంటకు సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది. మంగళూరులోని సిటీ సెంటర్ మాల్లో ఉన్న కేఎఫ్సీలో జింజర్ బర్గర్ ఆర్డర్ చేస్తే.. అందులో కదులుతున్న చిన్న చిన్న పురుగులు దర్శనమిచ్చాయి. దీంతో ప్రశాంత్, దీక్షిత అనే ఇద్దరూ అవాక్కయ్యారు. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రశాంత్, దీక్షిత మంగళూరులోని కేఎఫ్సీలో జింజర్ బర్గర్ ఆర్డరిచ్చారు. క్షణాల్లో వేడి వేడి బర్గర్ టేబుల్ మీద రడీ. సగం తిన్నాక ఏదో తేడాగా అనిపించింది దీక్షితకు. ఏదో బంక బంకగా చేతికి తగిలింది. పరిశీలించి చూస్తే సన్నగా కదులుతున్న పురుగులు కనిపించాయి. దీంతో వాంతి వచ్చినంత పనయ్యింది ఇద్దరికీ. ఈ ఉదంతంపై వివరణ కోరిన మీడియాపై కేఎఫ్‌సీ యాజమన్యం రుసరుసలాడింది. ఏదో పొరపాటు జరిగి ఉంటుందని, కూరగాయల నుంచి ఆ పురుగులు వచ్చి ఉంటాయంటూ వింత వాదనలు చేసింది. ఫొటోలు తీయడానికి వీల్లేదని హూంకరించినట్టు సమాచారం. ఈ ఘటన పై రాష్ట్ర కుటుంబ, ఆరోగ్యశాఖ మంత్రిత్వ శాఖ ఆ సెంటర్ యజమానికి నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు విషయం తమ దృష్టికి రాగానే ఆ వినియోగదారుణ్ని తమ కిచెన్ పరిశీలించాల్సిందిగా ఆహ్వానించినట్లు కేఎఫ్‌సీ తెలిపింది. అన్నీ చూసిన తర్వాత ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారని చెప్పింది. అంతర్జాతీయ ప్రమాణాలతో తమ కిచెన్‌ను నిర్వహిస్తున్నామని కేఎఫ్‌సీ ప్రతినిధి వాదిస్తున్నారు. ఇది ఆ స్థానిక ఔట్లెట్ బాధ్యత అని, ఇలాంటి వాటిని సహించబోమని తగిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి నోటీసులు అందలేదని అన్నారు. ఏదైనా ఫిర్యాదు ఉంటే విచారణకు సిద్ధమని చెప్పారు. -
కే ఎఫ్‌సీని నిషేధించాలి
బాలల హక్కుల సంఘం డిమాండ్ - ఈ కొలి, సాల్మోనెల్లా బ్యాక్టీరియా ఆనవాళ్లు - మలమూత్ర విసర్జకాల్లో ఉండే పాథోజెన్స్ ఉనికి బట్టబయలు.. - తీవ్రమైన జీర్ణకోశ వ్యాధులకు కారణమయ్యే విష పదార్థాలు.. - తెలంగాణ రాష్ట్ర ఆహార నాణ్యత పరిశోధన సంస్థ పరీక్షల్లో వెల్లడి పంజగుట్ట: చూడగానే నోరూరించే కేఎఫ్‌సీ (కెంటకీ ఫ్రైడ్ చికెన్)లో అత్యంత విషతుల్యమైన అవశేషాలు ఉన్నట్లు వెల్లడైందని బాలల హక్కులసంఘం స్పష్టం చేసింది. మలమూత్ర విసర్జకాల్లో ఉండే పాథోజెన్స్తో ఈకొలి, సాల్మోనెల్లా బ్యాక్టీరియా ఆనవాళ్లు ఉన్నట్లు తెలంగాణ ఆహార నాణ్యత పరిశోధన సంస్థ ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో నిర్ధారనైనట్టు సంఘం సభ్యులు తెలిపారు . వీటిని తిన డం వల్ల తీవ్రమైన జీర్ణకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నట్టు చెప్పారు. మ్యాగీ వివాదం మొదలైన తర్వాత కేఎఫ్‌సీ కెంటకీ ఫ్రైడ్ చికెన్‌లో నాణ్యత ప్రమాణాలపై తమకు అనుమానం వచ్చిందన్నారు. ఇటీవల హిమాయత్‌నగర్‌లోని కేఎఫ్సీలో చికెన్‌ను కొనుగోలు చేసి తెలంగాణ ఆహార నాణ్యత పరిశోధన సంస్థకు పంపగా, ఇందులో ఆరోగ్యానికి హాని చేసే అత్యంత విష పదార్థాలు ఉన్నట్లు తేలిందన్నారు. పిల్లల ఆరోగ్యానికి హాని చేస్తూ పరోక్షంగా వారి చావుకు కారణం అవుతున్న కేఎఫ్‌సీ కెంటకీ ఫ్రైడ్ చికెన్ విక్రయాలపై నిషేధం విధించి, నిర్వాహకులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బాలల హక్కుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలల హక్కుల కమిషన్ సభ్యుడు అచ్యుతరావు, బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధ, ప్రముఖ పోషకాహార నిపుణురాలు డాక్టర్ సుజాతాస్టీఫెన్ మాట్లాడుతూ కేఎఫ్‌సీ చికెన్‌లో టైఫాయిడ్, ప్యారాటైఫాయిడ్, అమిబియాసిస్, విరోచనాలకు కారణమవుతున్న విష పదార్థాలు ఉన్నాయని, వాటిని తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని చెప్పారు. దీనికి 68 శాతం సాల్మోనెల్లా బ్యాక్టీరియానే కారణమన్నారు. -
అపరిశుభ్రతపై జీహెచ్ఎంసీ కొరడా
- కేఎఫ్‌సీకి జరిమానా - సెప్టిక్ ట్యాంకర్ల సీజ్ - స్వచ్చ హైదరాబాద్‌కు చర్యలు సాక్షి, సిటీబ్యూరో: రోడ్లపై చెత్తా చెదారం, వ్యర్థాలను పడవేసే వారి పై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. హిమాయత్‌నగర్‌లో హోటల్ వ్యర్థాలను రోడ్డుపై వేస్తున్న కేఎఫ్‌సీతో పాటు ఉప్పల్‌లో సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను డ్రైనేజీలో వదులుతుండగా వాహనాలపై అధికారులు కన్నెర్ర చేశారు. ఏకంగా కేసులు నమోదు చేయడమే కాకుండా జరిమానా విధించారు. వివరాల్లోకి వెళ్తే.. హిమాయత్‌నగర్ ప్రధాన రహదారిపై ‘కేఎఫ్‌సీ’ రెస్టారెంట్ వారు గత కొంతకాలంగా హోటల్ వ్యర్థాలను రోడ్డుపై వేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతం దుర్గంధమయం అయింది. స్థానికుల ఫిర్యాదు మేరకు జీహెచ్ఎంసీ అధికారులు రెండు రోజుల క్రితం హోటల్ నిర్వాహకులను తీవ్రంగా హెచ్చరించారు. అయినా కేఎఫ్‌సీ సిబ్బంది ‘మా యాజమాన్యానికి చెబుతాం’ అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఆగ్రహానికి గురైన అధికారులు కేసు నమోదు చేసి రూ. 10 వేల రూపాయలు జరిమానా విధించారు. ఉప్పల్‌లో ట్యాంక్‌లు సీజ్ సెప్టిక్ ట్యాంక్‌లో తీసుకొచ్చిన వ్యర్థాలను డ్రైనేజీలో వదులుతుండగా గమనించిన జీహెచ్ఎంసీ అధికారులు వాహనాలను అదుపులోకి తీసుకుని సీజ్ చేశారు.నగరంలోని రామంతాపూర్ మోడ్రన్ బేకరి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను మ్యాన్‌హోల్‌లో వదులుతుండగా అటుగా వెళ్తున్న ఈస్ట్ జోనల్ కమిషనర్ గమనించారు. వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేసి సెప్టిక్ ట్యాంక్‌ను సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు. అనంతరం కూడా అదే విధంగా మరో వ్యక్తి వ్యర్థాలను వదులుతుండగా గమనించిన మెడికల్ ఆఫీసర్ మల్లిఖార్జున్ రావు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాహనాలను స్వాధీనం చేసుకొని తాళం చెవులను పోలీసులకు అప్పగించారు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చేలోగా మరో తాళం చెవితో వాహనాన్ని తీసుకొని ట్యాంకర్దారుడు ఉడాయించారు. మోటార్ వాహనాల చట్ట ప్రకారం కేసు నమోదుచేసి పరారీలో ఉన్న వాహన యజమాని కోసం గాలిస్తున్నట్లు ఎస్సై విక్రమ్‌రెడ్డి తెలిపారు. -
ఫేస్బుక్లో రగడపై స్పందించిన కేఎఫ్‌సీ
కాలిఫోర్నియా: తమపై అనవసర అభాండాలు మోపుతున్నారని ప్రముఖ సంస్థ కేఎఫ్‌సీ ఆరోపించింది. ఫిర్యాదు చేసిన వ్యక్తిని కలిసేందుకు ప్రయత్నించినా అతడు మాట్లాడేందుకు నిరాకరించాడని పేర్కొంది. చికెన్ ఆర్డ్ ఇస్తే అందులో ఎలుక వచ్చిందంటూ కేఎఫ్సీపై ఆరోపణలు చేస్తూ ఓ వ్యక్తి ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. దీంతో కేఎఫ్సీపై పలు రకాల విమర్శలు వచ్చాయి. వాటిని సీరియస్‌గా తీసుకున్న కేఎఫ్‌సీ ఎట్టకేలకు స్పందించింది. పోస్ట్ చేసిన వ్యక్తిని తాము కలిశామని, అయితే అతడు తమతో మాట్లాడలేదని, ప్రొడక్ట్‌ను పరీక్షలకు పంపుతామని అడిగినా అందుకు అతడు నిరాకరించడని వివరణ ఇచ్చింది. -
కేఎఫ్‌సీలు నిరవధికంగా మూత
కఠ్మాండు: ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ సంస్థ కేఎఫ్‌సీ, పిజ్జా హట్‌కు చెందిన నాలుగు రెస్టారెంట్లు నేపాల్‌లో నిరవధికంగా మూసివేశారు. స్థానిక కార్మికులకు, సంస్థ యాజమాన్యానికి మధ్య వివాదం తలెత్తి ఈ పరిస్థితికి దారి తీసింది. గంటల కొద్ది పనిచేయించుకుంటున్నారని, వాటిని తగ్గించాలని కార్మికులు డిమాండ్ చేయగా అందుకు యాజమాన్యం నిరాసక్తి చూపించడంతో వాటిని మూసి వేసింది. దీంతోపాటు యాజమాన్యంలోని ఒక మేనేజర్‌పై కూడా కార్మికులు దాడి చేశారని, అది కూడా ఒక కారణమని చెప్పారు. నేపాల్‌లో దేవయాని ఇంటర్నేషనల్ అనే సంస్థ కేఎఫ్‌సీ బ్రాంచ్‌లను నిర్వహిస్తోంది. గత మే 13 నుంచి కేఎఫ్‌సీలు మూతపడే ఉన్నాయి. -
బొమికెలను మెడలో వేసుకుందాం..
చికెన్ తింటాం.. మరి మిగిలిపోయిన బొమికెలను ఏం చేస్తారు.. ఏం చేస్తాం.. పడేస్తాం అని అంటారా.. వాటిని మెడలో వేసుకోండి అని మేమంటే.. కచ్చితంగా వెరైటీ లుక్ ఇస్తారు కదూ.. ఇదేం ఆదిమ జాతి అలవాటు అంటూ ముఖం చిట్లిస్తారు కదూ.. ఇది ఆదిమ జాతి అలవాటు కాదు.. ఆధునిక ఫ్యాషన్ అట!! చిత్రంలో కనిపిస్తున్నది అదే. ప్రపంచ ప్రఖ్యాత కేఎఫ్‌సీ(కెంటకీ ఫ్రైడ్ చికెన్) గురించి అందరికీ తెలిసిందే. ఈ బ్రాండ్‌కు ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులున్నారు. వీరిలో కొందరికి.. తమకు ఎంతగానో నచ్చే కేఎఫ్‌సీ చికెన్‌కు మరింత ప్రఖ్యాతి తేవాలని.. అది చిరస్థాయిలో నిలిచిపోయేలా చేయాలని అనిపించింది. దాంతో ఈ చిత్రమైన ఆలోచన వారి బుర్రకు తట్టింది. కేఎఫ్‌సీ చికెన్ తినగా మిగిలిపోయే బొమికెలను ఆభరణాలుగా మార్చేయాలని ఆ అభిమాన గణంలో భాగమైన ‘కెంటకీ ఫర్ కెంటకీ’ అనే సంస్థ యోచించింది. ఈ పనిని కేఎఫ్‌సీ అభిమాని, ఆభరణాల డిజైనర్ మెగ్సీకి అప్పజెప్పింది. మెగ్సీ ఏం చేసింది? ఓ రోజు రాత్రి తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తిన్న కేఎఫ్‌సీ చికెన్‌లో మిగిలిపోయిన బొమికెలను జాగ్రత్తగా దాచి పెట్టింది. అవి మొత్తం 20. వాటిని జాగ్రత్తగా కడిగేసి.. కాపర్ పెయింటింగ్ వేసి.. కొన్ని ప్రక్రియల అనంతరం 14 క్యారెట్ల బంగారు నెక్లెస్‌గా మార్చేసింది. ప్రస్తుతం లిమిటెడ్ ఎడిషన్ పేరిట ఆ 20 కేఎఫ్‌సీ బోన్ గోల్డ్ నెక్లెస్‌లను అమ్మకానికి పెట్టారు. వీటిల్లో చిన్న సైజు బొమికెతో చేసిన నెక్లెస్ ధర రూ.7,550 కాగా.. కొంచెం పెద్ద బొమికతో చేసినది రూ.9,550. గత నెల 27 నుంచి అమ్మకాలు మొదలయ్యాయి. -
పాపను గెంటేశారు