ఇక మీ గోళ్లు కూడా నాకొచ్చు! | KFC is launching a range of 'Finger Lickin' Good' edible nail varnish | Sakshi
Sakshi News home page

ఇక మీ గోళ్లు కూడా నాకొచ్చు!

Published Thu, May 5 2016 8:01 PM | Last Updated on Thu, Sep 13 2018 3:15 PM

ఇక మీ గోళ్లు కూడా నాకొచ్చు! - Sakshi

ఇక మీ గోళ్లు కూడా నాకొచ్చు!

న్యూయార్క్: ఎక్కువ మంది అమ్మాయిల్లో ఉండే గోళ్లు కొరికే అలవాటును గురించి ఇక బెంగ అక్కర్లేదు. ఈ అలవాటును కూడా మార్కెట్ చేసుకోవచ్చిన భావించిన ఓ సంస్థ.. 'ఏం పర్లేదు గోళ్లను కొరకండి, చప్పరించండి.. అదనంగా రుచిని కూడా పొందండి' అంటూ మార్కెట్లోకి ఫింగర్ లిక్కింగ్ నెయిల్ పాలిష్ను తీసుకొస్తోంది.

ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ సంస్థ కేఎఫ్సీ ట్యాగ్లైన్ 'ఫింగర్ లిక్కింగ్ గుడ్' అన్న విషయం తెలుసుగా. ఏదో చికెన్ రుచి అంతలా ఉంటుందని తెలపడానికి పెట్టిన ఈ ట్యాగ్లైన్ను కేఎఫ్సీ ఇప్పుడు నిజం చేస్తోంది. తమ కస్టమర్లతో వేళ్లు చప్పరింపచేసే పనికి కేఎఫ్సీ శ్రీకారం చుట్టింది. అదేంటంటే.. మార్కెట్లోకి కేఎఫ్సీ రెండు నెయిల్ పాలిష్ ప్రొడక్ట్లను విడుదల చేసింది. కేఎఫ్సీ చికెన్లో వాడే స్పైసీ ఫ్లేవర్లను కలిపి విడుదల చేసిన ఈ నెయిల్ పాలిష్ను కావాల్సినప్పుడు చప్పరించొచ్చు.

ఒరిజినల్, హాట్ అండ్ స్పైసీ పేరుతో కేఎఫ్సీ చేసిన ఈ ప్రయోగం ఇప్పుడు ఫుడ్ మార్కెట్తో పాటు ఫ్యాషన్ మార్కెట్ దృష్టిని సైతం ఆకర్షింస్తోంది. ముందుగా ఇతర నెయిల్ పాలిష్ల లాగానే వీటిని గోళ్లకు వేసుకోవచ్చని.. కావాల్సినప్పుడు వాటిని చప్పరించడం ద్వారా కేఎఫ్సీ ఫుడ్ ఫ్లేవర్ను ఆస్వాదించొచ్చని కెఎఫ్సీ ప్రతినిధులు చెబుతున్నారు.

హాంకాంగ్లో కేఎఫ్సీ మార్కెట్ను పెంచుకోవడానికి ఈ వినూత్న ప్రయోగం చేస్తున్నారు. అంతేకాదు.. ఈ రెండు నెయిల్ పాలిష్‌లు ఒరిజినల్, హాట్ అండ్ స్పైసీలలో ఏది బాగుందో చెప్పాలని హాంకాంగ్ ప్రజలను కేఎఫ్సీ కోరింది. రెండింటిలో దేనికి ఎక్కువగా ప్రజల మద్దతు ఉంటే దానిని ఎక్కువ పరిమాణంలో ఉత్పత్తి చేస్తామని కేఎఫ్సీ చెబుతోంది. ఏదేమైనా ఈ వినూత్న ఆలోచన కేఎఫ్సీ బ్రాండ్పై ఆసక్తిని పెంచుతోందంటున్నారు మార్కెట్ విశ్లేషకులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement