ముంబై : ఒకవైపు ప్రముఖ రెస్టారెంట్లు మెక్‌డొనాల్డ్స్ మూతపడటంతో, మరోవైపు కేఎఫ్‌సీ, బర్గర్ కింగ్‌లు మార్కెట్‌లో దూసుకుపోతున్నాయి. నోరూరించే డీల్స్‌తో కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్ల మూతను, ఈ రెస్టారెంట్లు క్యాష్ చేసుకుంటున్నాయని ఓ ఆంగ్ల పత్రిక రిపోర్టు చేసింది. బర్గర్ కింగ్, కేఎఫ్‌సీ, కార్ల్స్ జేఆర్. లాంటి క్విక్ సర్వీసు రెస్టారెంట్లు దేశీయంగా తమ కస్టమర్ బేస్‌ను పెంచుకోవడానికి ఆకర్షణీయమైన వాల్యుమీల్స్ ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నట్టు పేర్కొంది. డిసెంబర్ క్వార్టర్‌లో ఈ అవుట్‌లెట్లలో విక్రయాలు భారీగా పెరిగాయని తెలిపింది.
కన్నాట్ ప్లాజా రెస్టారెంట్ల(సీపీఆర్‌ఎల్) 50:50 జాయింట్ వెంచర్ విక్రమ్ బక్షికి, మెక్‌డొనాల్డ్స్‌కు మధ్య వివాదాలు తలెత్తడంతో గత రెండు వారాలుగా 80కిపైగా మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్లు మూతపడ్డ సంగతి తెలిసిందే. వీటిలో కొన్నింటిన్నీ పునఃప్రారంభించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వివాద నేపథ్యంలో స్థానిక భాగస్వామి నిర్వహిస్తున్న 169 రెస్టారెంట్లలో ఆహార భద్రత, నాణ్యతపై మెక్‌డొనాల్డ్స్‌ఇండియా ఆందోళనలు వ్యక్తంచేస్తోంది.
దీంతో మెక్‌డీ కస్టమర్లు కూడా బర్గర్ కింగ్, కేఎఫ్‌సీ లాంటి రెస్టారెంట్లకు ఆకర్షితులవుతున్నారు. పరిమిత కాల ఆఫర్‌తో తమ రెస్టారెంట్లలోకి ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతుందని బర్గర్ కింగ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాజీవ్ వెర్మన్ అన్నారు.నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రిపోర్టు ప్రకారం 2021 నాటికి దేశీయ ఆహార సర్వీసుల పరిశ్రమ 4.98 ట్రిలియన్లకు చేరుకుంటుందని అంచనా. దేశీయ జీడీపీలో రెస్టారెంట్ సెక్టారే 2.1 శాతం సహకరిస్తుందని కూడా అంచనాలు వెలువడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment