Burger King
-
ఢిల్లీ బర్గర్ కింగ్ హత్య కేసు: ‘లేడీ డాన్’ అరెస్ట్
ఢిల్లీ: ఢిల్లీలోని రాజౌరి గార్డెన్ ప్రాంతంలో ఉన్న బర్గర్ కింగ్ అవుట్‌లెట్‌లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన ఈ ఏడాది జూన్‌లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు గ్యాంగ్‌స్టర్ హిమాన్షు భావు గర్ల్ ఫ్రెండ్ అన్ను ధంకర్(19)ను ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం సాయంత్రం ఆమెను అరెస్ట్ చేసే సమయంలో నేపాల్ పారిపోవడానికి ప్లాన్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హిమాన్షు భావు ఆదేశాల మేరకు ఆమె దుబాయ్ మీదుగా అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమైనట్లు పేర్కొన్నారు. హిమాన్షు భావు గ్యాంగ్‌లోని సభ్యులు అన్ను ధంకర్ ‘‘లేడీ డాన్’’గా పిలుస్తారని పేర్కొన్నారు.హిమాన్షు భావు ఆదేశాల మేరకు ఆమె అమెరికా పరారు కాలనఇక.. జూన్ 18న పశ్చిమ ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్‌లోని బర్గర్ కింగ్ అవుట్‌లెట్‌లో అమన్ జూన్ (26) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి హత్య చేశారు. ఈ హత్య తామే చేశామని గ్యాంగ్‌స్ట్‌ర్ హిమాన్షు భావు ప్రకటించించారు. శక్తి దాదా హత్యకు ప్రతీకారంగా అమన్ జాన్‌ను హత్య చేసినట్లు తెలిపాడు. అతని స్నేహితులు.. ఆశిష్, వికాస్, బిజేందర్ అనే ముగ్గురు వ్యక్తులు ఈ హత్యలో పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. అందులో ఇద్దరు షూటర్లు ఉన్నట్లు గుర్తించారు. అమన్ హత్య అనంతరం కత్రా రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరా ఫుటేజీలో ధంకర్ చివరిసారిగా కనిపించినట్లు పోలీసులు తెలిపారు.నిందితురాలు అన్ను నకిలీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌ను ఉపయోగించి అమన్‌తో స్నేహం చేసింది. జూన్ 18న అతడిని బర్గర్ కింగ్ అవుట్లెట్కు పిలింపించింది. ఆమె కోసం అమన్ వేచిచూస్తుండగా.. ఆశిష్ , వికాస్ లోపలికి వెళ్లి అమన్‌పై 39 రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. బిజేందర్ అనే మరో వ్యక్తి బైక్‌పై వచ్చి బయట వేచి ఉన్నాడు. కాల్పుల అనంతరం ముగ్గురు పరారయ్యారు. -
బర్గర్ కింగ్ వర్సెస్ బర్గర్ కింగ్..!
పుణె: అంతర్జాతీయ ఫాస్ట్–ఫుడ్ చెయిన్ బర్గర్ కింగ్ కార్పొరేషన్‌పై పుణెలో బర్గర్ కింగ్ పేరుతో ఉన్న రెస్టారెంట్ 13 ఏళ్లపాటు సాగిన న్యాయ పోరాటంలో విజయం సాధించింది. ‘బర్గర్ కింగ్’పేరును వాడుకుంటూ ప్రపంచవ్యాప్తంగా 13 వేలకుపైగా ఔట్లెట్లు కలిగిన తమ పేరును దెబ్బతీస్తున్నారని అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థ బర్గర్ కింగ్ కార్పొరేషన్ 2011లో పుణె కోర్టులో కేసు వేసింది. ఆ పేరును వాడకుండా సంబంధిత రెస్టారెంట్‌ను ఆదేశించాలని, తమ బ్రాండ్‌కు పూడ్చలేని నష్టాన్ని కలుగజేసినందుకు రూ.20 లక్షలు చెల్లించాలని కూడా అందులో కోరింది. దీనిపై పుణె బర్గర్ కింగ్ యజమానులైన అనహిత, షాపూర్ ఇరానీలు న్యాయపోరాటం జరిపారు. ఒక్క పేరు తప్ప, బర్గర్ కింగ్ కార్పొరేషన్‌తో ఎలాంటి సారూప్యతలు తమ రెస్టారెంట్‌కు లేవన్నారు. తమ వంటి చిన్న వ్యాపారాలను దెబ్బకొట్టే దురుద్దేశంతోనే ఆ సంస్థ ఈ కేసు ఏళ్లపాటు కొనసాగించిందని ఇరానీ ఆరోపించారు. దీని కారణంగా తాము తీవ్ర వేదనకు, మానసిక ఒత్తిడికి గురయ్యామని చెప్పారు. విచారించిన జడ్జి సునీల్ వేద్ పాఠక్..‘ఇరానీ 1992లోనే బర్గర్ కింగ్ పేరుతో రెస్టారెంట్‌ను ప్రారంభించారు. కానీ, అమెరికా కంపెనీ 2014 తర్వాతే దేశంలోకి అడుగుపెట్టింది. ఆ కంపెనీ వాదన చాలా బలహీనంగా ఉంది. పుణెలోని రెస్టారెంట్ బర్గర్ కింగ్ పేరుతో వినియోగదారులను తికమకపెట్టినట్లు గానీ, తప్పుదోవ పట్టించినట్లు గానీ నిరూపించలేకపోయింది’అని స్పష్టం చేశారు. అంతేకాదు, పుణె బర్గర్ కింగ్ రెస్టారెంట్‌తో తమ బ్రాండ్‌కు వాటిల్లిన నష్టంపై సరైన ఆధారాలను సైతం అమెరికా కంపెనీ చూపలేదన్నారు. అందుకే పరిహారం పొందే అర్హత కూడా ఆ సంస్థకు లేదన్నారు. ఈ విషయంలో ఎవరూ ఎవరికీ పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పుణె రెస్టారెంట్ అదే పేరుతో తమ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని పేర్కొన్నారు. -
బర్గర్ కింగ్‌లో వాటా విక్రయం
న్యూఢిల్లీ: ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా బర్గర్ కింగ్ బ్రాండ్ కంపెనీ రెస్టారెంట్ బ్రాండ్స్ ఏషియాలో 25.36 శాతం వాటాను ప్రమోటర్ సంస్థ విక్రయించింది. ఇన్వెస్ట్మెంట్ సంస్థ క్యూఎస్ఆర్ ఏషియా పీటీఈ ద్వారా ఎవర్‌స్టోన్ క్యాపిటల్ రూ. 1,494 కోట్లకు ఈ వాటాను అమ్మివేసింది. షేరుకి రూ. 119.1 సగటు ధరలో 25.3 శాతం వాటాకు సమానమైన 12,54,41,820 షేర్లను విక్రయించింది. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం అమల్ ఎన్ పారిఖ్, టాటా ఎంఎఫ్, క్వాంట్ ఎంఎఫ్, ప్లూటస్ వెల్త్ మేనేజ్మెంట్, ఫ్రాంక్లిన్ సింగపూర్3 బ్యాంకెన్ ఏషియా స్టాక్‌మిక్స్, ఐసీఐసీఐ ప్రు లైఫ్ తదితరాలు షేర్లను కొనుగోలు చేశాయి. కాగా.. తాజా లావాదేవీ తదుపరి రెస్టారెంట్ బ్రాండ్స్‌లో ఎవర్‌స్టోన్ వాటా 40.8 శాతం నుంచి 15.44 శాతానికి క్షీణించింది. రెస్టారెంట్ బ్రాండ్స్ దేశీయంగా బర్గర్ కింగ్ ఇండియా, పోపియస్ బ్రాండ్ రెస్టారెంట్లను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వాటా విక్రయ వార్తల నేపథ్యంలో రెస్టారెంట్ బ్రాండ్స్ షేరు ఎన్ఎస్ఈలో 6.4 శాతం జంప్‌చేసి రూ. 128 వద్ద ముగిసింది. -
అంకిత భావానికి రూ. 3.5 కోట్లు ప్రతిఫలం! ఎలానో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
అంకిత భావంతో చేసే పని నలుగురిచే గుర్తించేలా చేస్తుందన్న మాటలు మళ్ళీ ఋజువయ్యాయి. లాస్ వెగాస్‌లోని బర్గర్ కింగ్‌లోని మెక్కారన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో క్యాషియర్ అండ్ కుక్‌గా పనిచేస్తున్న 'కెవిన్ ఫోర్డ్' 27 సంవత్సరాలు ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా పని చేస్తే ఆ సంస్థ అతనికి మిఠాయిలు, పెన్నులు, స్టార్‌బక్స్ కప్ వంటి వాటితో కూడిన మంచి బ్యాగ్‌ని అందుకున్నాడు. అన్ని సంవత్సరాలు ఎంతో నిబద్దతతో పనిచేస్తే సరైన గుర్తింపు లభించలేదని, దానికి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఆ తర్వాత అతని కుమార్తె సెరీనా GoFundMe పేజీ స్టార్ట్ చేసింది. దీనికి అతి తక్కువ కాలంలోనే అన్యూహ్య స్పందన లభించింది. దీని ద్వారా ఏకంగా నాలుగు లక్షల డాలర్లు.. అంటే సుమారు రూ. 3.48 కోట్లు విరాళాలుగా సమకూరాయి. కెవిన్ ఫోర్డ్ అంకిత భావం, చిత్త శుద్ధి ప్రజలను ఎంతగానో ప్రభావితం చేశాయి. దీనివల్లే ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు రాగలిగాయి. కుటుంబం పోషణ కోసం గత కొన్ని సంవత్సరాలుగా పని చేస్తూనే ఉన్నాడు. అయితే ఇటీవల లభించిన విరాళాలు వారికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఇదీ చదవండి: సిమ్ కార్డ్ డీలర్లకు కొత్త రూల్స్.. అతిక్రమిస్తే రూ. 10 లక్షలు జరిమానా! పదవి విరమణ వయసు వచ్చినప్పటికీ ఆర్థికపరమైన కారణాల వల్ల పనిచేస్తూనే ఉన్నాడు. భారీగా విరాళాలు పొందిన ఫోర్డ్.. ప్రపంచంలో చాలామంది దాతృత్వం కలిగి ఉన్నారు. ఇప్పుడు వచ్చిన డబ్బు నా పిల్లలు మనవళ్ల భవిష్యత్తు కోసం పొదుపు చేస్తానన్నట్లు సమాచారం. -
‘నా బర్గర్లలో టమోటాలు ఎందుకు లేవు’?
దేశంలో పెరిగిపోతున్న టమోటా ధరలు ప్రముఖ ఫాస్ట్ ఫుడ్‌చెయిన్ సంస్థల్ని ముప్పుతిప్పలు పెట్టిస్తున్నాయి. టమోటా ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో మెక్‌డోనాల్డ్, సబ్వే తర్వాత ఫాస్ట్‌ఫుడ్ దిగ్గజం బర్గర్ కింగ్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో తమ ఆహార పదార్థాల్లో టమాటాల వినియోగాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. భారత్‌లో రెస్టారెంట్ బ్రాండ్స్ ఏసియా పేరుతో బర్గర్ కింగ్ ఫాస్ట్‌ఫుడ్ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. దేశవ్యాప్తంగా 400 స్టోర్లు ఉన్నాయి. అయితే, ఈ వారం దేశ ఆహార ద్రవ్యోల్బణం జనవరి 2020 నుండి అత్యధిక స్థాయికి చేరుకోవడంతో తమ ఆహార పదార్ధాల నుంచి టమోటాలను ఉపయోగించమని తెలిపింది. గత కొంత కాలంగా యూఎస్‌లోని ఫుడ్ లవర్స్‌కు ఉచిత చీజ్ ముక్కలను ఇవ్వడాన్ని బర్గర్ కింగ్ రద్దు చేసింది. కస్టర్లు అర్ధం చేసుకోవాలి ఇటీవల నా బర్గర్లలో టమోటాలు ఎందుకు లేవు? అంటూ కస్టమర్లు బర్గర్కింగ్ను ప్రశ్నించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. దీనిపై ఇటీవల ఆ సంస్థ స్పందించింది. టమాటా ధరలు భారీగా పెరిగిపోవడంతో నిర్వహణ ఇబ్బందిగా మారింది. అందుకే ఆహార పదార్ధాలలో టమోటాల వినియోగించడం లేదు. కస్టమర్లు అర్ధం చేసుకోవాలి. ఆహార పదార్థాల్లో నాణ్యత, ప్రమాణాల్లో రాజీ పడం.. త్వరలోనే మళ్లీ తిరిగి వస్తాం’ అని పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత చవకైన పిజ్జాలు అదే సమయంలో ప్రత్యర్థి డొమినోస్ తగ్గిపోతున్న కస్టమర్లను ఆకట్టుకునేందుకు పిజ్జా ధరల్ని తగ్గించి అమ్ముతుంది. ఇక్కడే ప్రపంచంలోనే అత్యంత చవకైన పిజ్జాలు లభిస్తున్నాయని సమాచారం. చదవండి👉 జీతం 17 లక్షలు..13 ఉద్యోగాల్ని రిజెక్ట్ చేసిన 21 ఏళ్ల యువతి! -
రూ.10తో బర్గర్ షాప్‌లోకి పదేళ్ల పాప.. చిరునవ్వుతో బయటకు..!
నోయిడా: ప్రస్తుత కాలంలో బర్గర్లు, పిజ్జాలు అంటే చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇలాగే ఓ చిన్నారి బర్గర్ షాప్‌కు వెళ్లి బర్గర్ ఆర్డర్ చేసింది. ఆ తర్వాత తన వద్ద ఉన్న రూ.10 నోటును తీసిచ్చింది. కానీ, ఆమె ఆర్డర్ చేసిన బర్గర్ ధర రూ.90. ఆ విషయం ఆ చిన్నారికి తెలియదు. అయితే, కొద్ది సేపటి తర్వాత ఆ పాప బర్గర్ తింటూ చిరునవ్వుతో బయటకు వచ్చింది. ఇంతకీ లోపల ఏం జరిగిందనే విషయాన్ని బర్గర్ కింగ్ తన ట్విటర్లో పోస్ట్ చేసింది. నొయిడాలోని బొటానికల్ మెట్రో స్టేషన్‌కు దగ్గర్లోని బర్గర్ కింగ్ షాపులోకి 10 ఏళ్ల పాప వచ్చింది. తన పాకెట్లో ఉన్న రూ.10 అక్కడున్న సిబ్బంది చేతికిచ్చి బర్గర్ కావాలని కోరింది. అయితే, దాని ధర రూ.90 ఉన్నప్పటికీ అమాయకంగా చూస్తున్న ఆ చిన్నారిని చూసి క్యాష్ కౌంటర్లోని వ్యక్తి మిగిలిన రూ.80 చెల్లించాడు. బర్గర్ అసలు ధర ఆ పాపకు చెప్పకుండానే కేవలం రూ.10కే బర్గర్‌ను తెప్పించి ఇచ్చాడు. దీంతో బర్గర్ అందుకున్న ఆనందంలో ఆ చిన్నారి చిరునవ్వుతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. అక్కడే ఉన్న సోషల్ మీడియా యూజర్ అమాయకంగా బర్గర్ కోసం ఎదురుచూస్తున్న ఆ చిన్నారి ఫొటో తీశారు. ఆ ఫోటోను లైఫ్ మెంబర్ అనే ట్విటర్లో షేర్ చేయటంతో వైరల్‌గా మారింది. ఈ విషయాన్ని తెలుసుకున్న బర్గర్ కింగ్ సంస్థ యాజమాన్యం చిన్నారికి బర్గర్ అందించిన ఉద్యోగి ధీరజ్ కుమార్‌గా గుర్తించింది. తమ షాపులోకి వచ్చిన చిన్నారి పట్ల ధీరజ్ ప్రవర్తించిన తీరుకు ప్రశంసలు కురిపించింది. అంతే కాదు ఆ వ్యక్తిని సన్మానించింది. ఈ ఫోటోలను ట్విటర్లో షేర్ చేసింది బర్గర్ కింగ్ ‘ఈ ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా మా నోయిడా బొటానికల్ గార్డెన్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్న రెస్టారెంట్లో పని చేస్తున్న ధీరజ్ కుమార్ తన ప్రవర్తనతో అందరిని ఆకట్టుకున్నారు.’ అంటూ జరిగిన సంఘటనను గుర్తు చేసుకూంటూ పలు ఫోటోలు షేర్ చేసింది. #WorldFoodDay2022 पर मेरी नज़र में इससे खूबसूरत तस्वीर और नही हो सकती.. काउंटर स्टाफ के सुनहरे भविष्य की हार्दिक शुभकामनाएं 💖💐@anandmahindra@IAmSudhirMishra @News18India @RandeepHooda @BurgerKing ...👌👌👍💐 pic.twitter.com/RcAp3cKR7R — Life Member (IFTDA) (@Life_Mem_IFTDA) October 19, 2022 This #WorldFoodDay, Dheeraj Kumar, working at our Noida Botanical Garden Metro Station restaurant, has inspired us all with his beautiful act of kindness. We had a very special guest who walked into our restaurant asking for a #burger but had only ₹10 with her. (1/3) pic.twitter.com/89oXh07sOB — BurgerKingIndia (@burgerkingindia) October 20, 2022 ఇదీ చదవండి: యువతి నృత్యం వివాదాస్పదం... పాక్ యూనివర్సిటీ నోటీసులు -
Viral Video: ఆర్డర్ ఆలస్యమైందని మరీ ఇంత దారుణంగా కొట్టాలా!
కొన్ని సంఘటనలను చూస్తే మనుషులకు సహనం తక్కువవుతుందని చెప్పలా? లేదా కోపానికి బానిసైపోతున్నారని అనాలో కూడా తెలియదు. పోనీ మనకు నచ్చకపోతే కాస్త గట్టిగా చెప్పడం లాంటివి చేయోచ్చు లేదా ఒకవేళ కాస్త కోపం వస్తే తిట్టి వదిలేయాలిగానీ మరీ వాళ్లని కొట్టి హింసచడం వంటివి చేయకూడదు. కానీ, ఇటీవల అబ్బాయిలు/అమ్మాయిలు కూడా సిల్లీ సిల్లీ కారణాలకే కోపం తెచ్చుకోవడం, దాడులకు దిగడం వంటివి చేస్తున్నారు. న్యూయర్క్ నగర్లో ఇద్దరు వ్యక్తులు ఆర్డర్ ఆలస్యమైందని దారుణంగా ప్రవర్తించారు. (చదవండి: భయంకరమైన భారీ పీత!.. గోల్ఫ్ స్టిక్‌ని చెకోడీలు విరిచినట్లు పటపట విరిచేసింది!) అసలు విషయంలోకెళ్లితే.. న్యూయార్క్ నగరంలో న్యూయార్క్ నగరంలో బ్రూక్లిన్‌లోని బర్గర్ కింగ్స్ లిండెన్ బౌలేవార్డ్‌లో ఇద్దరు వ్యక్తుల బర్గర్లు ఆర్డర్ చేశారు. అయితే ఆర్డర్ కాస్త ఆలస్యమైంది. అంతే ఇద్దరు కోపంతో ఆర్డర్ కౌంటర్ వద్దకు వచ్చారు. వారిలో ఒక వ్యక్తి కౌంటర్లోకి దూసుకువచ్చి అక్కడ ఉన్న సదరు ఉద్యోగిపై దాడి చేశాడు. సదరు వ్యక్తి సహచరుడు సైతం ఆ ఉద్యోగిని దారుణంగా కొట్టాడు. అయితే ఇంతలో సహచర ఉద్యోగులు జోక్యం చేసుకోవడంతో ఆ భాదితుడు సురక్షితంగా బయటపడ్డాడు. ఈ మేరకు ఆ ఉద్యోగిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటన సమీపంలో ఉన్న సీసీటీవీలో రికార్డైయ్యింది. దీంతో న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీఫుటేజ్ని ట్విట్టర్లో పోస్ట్ చేయడమే కాక ఆ నిందుతులు ఆచూకి తెలిసినవాళ్లు ముందుకు వచ్చి సమాచారం ఇవ్వాలని అభ్యర్థించింది. అయితే ఆ సీసీఫుటేజ్‌లో నిందితులు ముసుగు ధరించి ఉండటం కారణంగా గుర్తుపట్టడం కష్టమవ్వడంతో న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ విధంగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. (చదవండి: 40 రోజుల్లో 700 మైళ్లు.. ప్రీత్ చాందీ ఒంటరి సాహసం..!) 🚨WANTED for ASSAULT: Do you know these guys? On 12/4/21 at approx 6:14 PM, inside of 1661 Linden Blvd in Brooklyn, the suspects engaged in a dispute with a 22-year-old male, then punched him multiple times while displaying a knife. Any info? DM @NYPDTips or call 800-577-TIPS. pic.twitter.com/Y843eiAWkU — NYPD NEWS (@NYPDnews) January 4, 2022 -
వ్వాట్! ఏమన్నారూ.. అనేముందు ఆలోచించాలి
‘బర్గర్ కింగ్’ సేల్స్ నిన్న, మొన్న కొద్దిగా డౌన్ అయ్యాయి! బహుశా ఇది తాత్కాలికమే కావచ్చు. సేల్స్ పడిపోడానికి బర్గర్ ల రుచి తగ్గడం కారణం కాదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఈ మల్టీ నేషనల్ ఫుడ్ జెయింట్ సదుద్దేశంతో మహిళల కోసం చేసిన ఒక కెరీర్ ఆపర్చునిటీ ప్రకటన రుచించక, విషయం అపాలజీ వరకు వచ్చింది. ‘న్యూయార్క్ టైమ్స్’ దినపత్రికలో ఫుల్ పేజీ గా వచ్చిన ఆ ప్రకటనకు బర్గర్ కింగ్ 'Women belong in the Kitchen' అనే హెడ్డింగ్ పెట్టడం మహిళలకు ఆగ్రహం కలిగించింది. ‘వంటపని ఆడవాళ్లదే’ అని ఆ మాటకు అర్థం. మహిళలకు ఓటు హక్కు రాని వందేళ్ల క్రితం నాటి యూసేజ్ అది. ‘వాళ్లకేం తెలుసు వంటింటి కుందేళ్లు’ అని నలుగురు మగవాళ్లు కలసిన వేళల్లో నవ్వుకుంటూ అనుకునే మాట! బర్గర్ కింగ్ ఆ మాటనే యూజ్ చేస్తూ.. ‘లేడీస్, చెఫ్ లుగా మీరెందుకు రాణించకూడదు?! అక్కడా మగవాళ్ల డామినేషనేనా! రండి. మీకు మేము ట్రైనింగ్ ఇస్తాం. స్కాలర్ షిప్ ను ఇస్తాం. మిమ్మల్ని రెస్టారెంట్ ఇండస్ట్రీకి మహారాణులను చేస్తాం..’ అని ఆహ్వానించింది. ఇదంతా లోపల ఉన్నా.. పైకి కనిపించేదే కదా ఎవరైనా చూస్తారు! మహరాణుల ఆగ్రహంలో తప్పేమీ లేదు. మహారాజులే మాటను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి. ‘‘అవును. అయితే ఏంటి?!’’ అనే మాటను ఎప్పుడు అంటాం?! ఒక నిందో, అబద్ధపు ఆరోపణో, విమర్శో వచ్చి మీద పడినప్పుడు; మన నిజాయితీని అంగీకరించడానికి అవతలివారు సిద్ధంగా లేనప్పుడు; వివరించీ, వాదించీ ప్రయోజనం లేదనుకున్నప్పుడు.. తలనొప్పి వదిలించుకోడానికి ‘అవును. అయితే ఏంటి?’ అనేసి, పక్కకు వచ్చేస్తాం. ఎవరికి వారు.. ‘అవును. అయితే ఏంటి?’ అనేస్తే గొడవే లేదు. ఇంకెవరి తరఫునో.. ‘అవును. ఆమె అంతే. అయితే ఏంటి?’ అంటేనే వాగ్వాదాలు, యుద్ధాలు మొదలవుతాయి. ‘బర్గర్ కింగ్’ పేరు వినే ఉంటారు. బర్గర్ల విక్రయాలకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన మల్టీనేషనల్ రెస్టారెంట్ల అమెరికన్ కంపెనీ. చాలాచోట్ల దుకాణాలు ఉన్నాయి. ఉమెన్స్ డే రోజు ఆ కంపెనీ యూ.కె. సంస్థ ఇంచుమించు ఇలాంటి ఒక వివాదంలోనే చిక్కుకుంది. మహిళల తరఫున మాట్లాడబోయి, కొంచెం క్రియేటివ్‌గా మాట్లాడి మహిళల ఆగ్రహానికి గురైంది. పాపం బర్గర్ కింగ్ ఉద్దేశం మంచిదే. పెద్ద పెద్ద రెస్టారెంట్లో ఎందుకనో ఎక్కువగా పురుష చెఫ్‌లే కనిపిస్తారు. మహిళా చెఫ్‌లు కేవలం 20 శాతం మంది మాత్రమే. ఆ విషయాన్నే చెబుతూ.. ‘‘అన్ని రంగాల్లో ముందున్న మహిళలు చెఫ్‌లుగా మాత్రం వెనకబడి ఉండటం ఏంటి? మీకు ఆసక్తి ఉంటే చెప్పండి, మీకు స్కాలర్షిప్ ఇచ్చి, ట్రైనింగ్ ఇప్పించి, రెస్టారెంట్ల మహా సామ్రాజ్యాలకు మిమ్మల్ని మహరాణుల్ని చేస్తాం’’ అని బర్గర్ కింగ్.. ‘న్యూయార్క్ టైమ్స్’ దినపత్రికలో ఒక ఫుల్ పేజీ ప్రకటన ఇచ్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఆ ప్రకటన వచ్చింది కనుక బర్గర్ కింగ్ ఉద్దేశాన్ని శంకించే పనే లేదు. అయితే ఉద్దేశాలు మంచివే అయి ఉండవచ్చు కానీ కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాట్ల వల్ల అవి అపార్థాలకు కారణమై ప్రతిష్టను దెబ్బతీస్తాయి. ఈ ప్రకటనలోని పొరపాటు బర్గర్ కింగ్ తన పికప్ లైన్‌గా (లోపలికి లాగేసే ప్రారంభ వాక్యం) ‘ఉమెన్ బిలాంగ్ ఇన్ ది కిచెన్’ అనే మాటను వాడటం. ఆ మాటకు అర్థం ‘వంటపని ఆడవాళ్లదే’ అని. ఆ మాటలోని అంతరార్థం.. ‘అవును. అయితే ఏంటి? వాళ్లను అననివ్వండి. చెఫ్‌గా రాణించండి’ అని! బర్గర్ కింగ్ మహిళల వైపు మాట్లాడేందుకు, ఇలా మహిళలకు నచ్చని మాటను హెడ్డింగ్‌గా పెట్టడమే వివాదం అయింది. ఆ ఫుడ్ జెయింట్.. పేపర్లో మాత్రమే ఈ యాడ్ ఇచ్చి ఊరుకోలేదు. ట్విట్టర్లో కూడా పోస్ట్ చేసింది. ఆ పోస్టుకు రివర్స్ ట్వీట్లు వచ్చాయి. ‘ఏం మాటలివి బర్గర్ కింగ్. మహిళల్ని కించపరుస్తావా? నువ్వు తయారు చేసే బర్గర్లు రుచిగా ఉంటే సరిపోతుందా.. మాట శుచిగా ఉండొద్దా’ అని ట్విటిజెన్‌లు కామెంట్లు పెట్టారు. బర్గర్ కింగ్ సాయంత్రానికల్లా ఆ ట్వీట్‌ను తొలగించింది. పేపర్నైతే డిలీట్ కొట్టలేదు కదా. నష్టం జరిగిపోయింది. ఒడ్డున పడే మార్గంగా మహిళలకు క్షమాపణలు చెప్పింది. వాస్తవానికి ఆ ప్రకటన ఇప్పటికే బర్గర్ కింగ్‌లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిని ఉద్దేశించి ఇచ్చింది! అయితే యావత్ మహిళావనికి అది స్ఫూర్తిని, ప్రేరణను కలిగిస్తుందన్న ఆలోచనతో అలా బహిరంగ ప్రకటన ఇచ్చింది బర్గర్ కింగ్. ‘ఎక్కడైనా ప్రొఫెషనల్ కిచెన్ ఉందీ అంటే అక్కడ మహిళా చెఫ్ ఉన్నారనే’ అనే క్రియేటివ్ భావనకు వచ్చిన తిప్పలే ఇవి. రీడర్స్కి, నెటిజెన్లకు సరిగా అర్థం కాలేదు. ఎదురొచ్చి తగిలింది. ‘బర్గర్ కింగ్‌లోని మహిళా సిబ్బంది తమ కిచెన్ కలల్ని నిజం చేసుకోడానికి మేమొక స్కాలర్షిప్ ప్రోగ్రామ్ని ఈ మహిళా దినోత్సవం రోజున సగర్వంగా ప్రకటిస్తున్నాం’ అని కూడా ప్రకటనలో ఉంది. అది మాత్రమే ఉండి ఉంటే సరిపోయేది. వందేళ్ల నాటి మగాళ్ల మాట.. ‘ఉమెన్ బిలాంగ్ ఇన్ ది కిచెన్’ ను పట్టుకొచ్చి, శీర్షికగా పెట్టి, పర్యవసానంగా తలపట్టుకుంది బర్గర్ కింగ్. అంతర్జాతీయ మహిళాదినోత్సవం రోజు ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రికలో వచ్చిన బర్గర్ కింగ్ ఫుల్ పేజీ ప్రకటన. మహిళల ఆగ్రహానికి కారణం అయింది ఈ ప్రకటనలోని శీర్షికే అవును. ఇది వందేళ్లనాటి మాటే. ఇప్పుడు వాడటం మహిళల్ని కించపరచడమే. అమెరికాలో వందేళ్ల క్రితం మహిళలకింకా ఓటు హక్కు రాని కాలంలో మగాళ్లు మాత్రమే మనుషులు అన్నట్లు ఉండేది! నలుగురు మగాళ్లు ఒక చోట చేరినప్పుడు వాళ్ల నవ్వులాటలో.. స్త్రీల గురించి.. ‘వాళ్లకేం తెలుసు. వంటింటి కుందేళ్లు’ అనే మాట వాడుకలో ఉండేది. ఆడవాళ్లు ఇంటికీ, వంటకీ పరిమితం అనీ, బయటికి వెళ్లి వాళ్లే పనీ చెయ్యలేరని మగవాళ్లు బలంగా నమ్మిన కాలం నాటి రోజువారీ మాట ఈ ‘ఉమెన్ బిలాంగ్ ఇన్ ది కిచెన్’. కాలక్రమంలో మహిళలకు ఓటు హక్కు వచ్చింది. ఓటర్లుగా మాత్రమే కాదు, పోటీ చేసేవాళ్లుగా కూడా మహిళలు తామేంటో నిరూపించుకున్నారు. విజేతలుగా నిలిచారు. దేశాలను ఏలుతున్నారు. పురుష దేశాధినేతల కంటే కూడా సమర్థంగా పరిపాలిస్తున్నారు. ‘వంట పని ఆడవాళ్లదే’ అనే ఆ మాట దాదాపుగా భూస్థాపితం కూడా అయిపోయింది. ఇప్పుడు ఆ భూతాన్ని బర్గర్ కింగ్ వాళ్లు లేపి, మెడకు తగిలించుకున్నారు. మహిళల నుంచి అభ్యంతరం వ్యక్తం అవడంతో చెంపలు వేసుకున్నారు. చదవండి: బర్గర్ కింగ్‌కు భారీ ఎదురుదెబ్బ -
బర్గర్ కింగ్‌కు భారీ ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: ఫాస్ట్‌ఫుడ్ బిజినెస్ కింగ్ బర్గర్ కింగ్ (యూకే)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జెండర్‌పరంగా మహిళలపై వివక్షపూరితంగా ట్వీట్ చేసి ఇబ్బందుల్లో పడింది. అందులోనూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలనుద్దేశించి వ్యాఖ్యానిస్తూ తన పురుషాధిక్య ధోరణిని చాటుకోవడం వివాదానికి తెరతీసింది. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో తప్పయిందంటూ లెంప లేసుకుంది. అయితే ఆ ట్వీట్‌ను తొలగించిన సంస్థ క్షమాపణ చెబుతూ మరో ట్వీట్ చేసింది. ఈ సమయంలో కూడా బర్గర్ కింగ్ తీవ్ర విమర్శల పాలైంది. స్వచ్ఛందంగా తప్పును ఒప్పుకోవాల్సిన సంస్థ తీవ్రమైన ట్రోలింగ్, అబ్యూసివ్ కమెంట్స్ కారణంగా ఈ ట్వీట్‌ను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. అంతే.. నెటిజన్లు బర్గర్ కింగ్‌పై అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం స్కాలర్షిప్ కార్యక్రమాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా విమెన్ బిలాంగ్ ఇన్ ది కిచెన్ (మహిళలు వంట ఇంటికి చెందినవారు) అంటూ ట్వీట్ చేసింది. ట్వీట్‌తో పాటు న్యూయార్క్ టైమ్స్ ప్రింట్ ఎడిషన్‌లో పూర్తి పేజీ ప్రకటనను ప్రచురించినట్లు వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. "మహిళలు వంటగదిలో ఉన్నారంటూ పెద్ద యాడ్ ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్లు బర్గర్కింగ్పై ఫైర్ అయ్యారు. దీనికి తోడు బర్గర్ కింగ్ సమాధానంతో మరింత మండిపడ్డారు.నెటిజన్లు ట్వీట్ల పరంపర సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. (Women's Day: ఎస్బీఐ బంపర్ ఆఫర్లు) How stupid can you be? Especially on International Women’s Day... #smh https://t.co/FvEeHQh9am pic.twitter.com/LgkrKo5NZC — Alex Chin (@chinstachinsta) March 9, 2021 “Sorry our sexist bait tweet brought in sexists”🙃🙃 https://t.co/a9zTX2B2dx — _kairy_draws_ (@_kairy_draws_) March 9, 2021 Wait so you only deleted because of that but not because what you tweeted was distasteful? That's a pitiful non apology. https://t.co/Ch7y9NuD2y — Pat Orr (@Powerage1986) March 9, 2021 Wait so you only deleted because of that but not because what you tweeted was distasteful? That's a pitiful non apology. https://t.co/Ch7y9NuD2y — Pat Orr (@Powerage1986) March 9, 2021 -
బెక్టర్స్ ఫుడ్ ఐపీవో- వెల్లువెత్తిన బిడ్స్
ముంబై, సాక్షి: ప్రీమియం బిస్కట్ల తయారీ కంపెనీ బెక్టర్స్ ఫుడ్ స్పెషాలిటీస్ పబ్లిక్ ఇష్యూకి అన్ని వర్గాల నుంచీ బిడ్స్ వెల్లువెత్తాయి. ఇష్యూ చివరి రోజు గురువారానికల్లా 198 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి. ఐపీవోలో భాగంగా కంపెనీ 1.32 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 262 కోట్ల షేర్లకుపైగా బిడ్స్ దాఖలయ్యాయి. ప్రధానంగా సంపన్న వర్గాల నుంచి 621 రెట్లు అధికంగా దరఖాస్తులు రాగా.. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి సైతం 29 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి 177 రెట్లు అధికంగా బిడ్స్ లభించినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీల డేటా వెల్లడించింది. రూ. 288 ధరలో బెక్టర్ ఫుడ్ పబ్లిక్ ఇష్యూకి ధరల శ్రేణి రూ. 286-288కాగా.. తద్వారా కంపెనీ రూ. 540 కోట్లు సమీకరించింది. ఐపీవో ప్రారంభానికి ముందురోజు సోమవారం(14న) యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 162 కోట్లు సమకూర్చుకుంది. షేరుకి రూ. 288 ధరలో హెచ్డీఎఫ్సీ లైఫ్, గోల్డ్‌మన్ శాక్స్, ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్, ఎస్బీఐ డెట్ హైబ్రిడ్ తదితర 7 ఎంఎఫ్లకు షేర్లను కేటాయించింది. ఐపీవో నిధులను విస్తరణతోపాటు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది. రాజ్‌పురా యూనిట్లో బిస్కట్ల తయారీకి కొత్త లైన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేసింది. (బర్గర్‌కింగ్ పుష్- బెక్టర్స్ ఫుడ్ ఐపీవోకు రెడీ) దిగ్గజ కస్టమర్లు బర్గర్ కింగ్, మెక్‌డొనాల్డ్స్, కేఎఫ్‌సీ, పిజ్జా హట్ తదితర గ్లోబల్ ఫాస్ట్‌ఫుడ్ చైన్స్(క్యూఎస్ఆర్)కు బెక్టర్ ఫుడ్స్ బన్స్ సరఫరా చేస్తోంది. బెక్టర్స్ క్రీమికా పేరుతో సొంతంగా ప్రీమియం బిస్కట్లను తయారు చేస్తోంది. ఇంగ్లీష్ ఒవెన్ బ్రాండుతో సొంత బ్యాకరీ ప్రొడక్టులను సైతం రూపొందిస్తోంది. లూధియానాకు చెందిన కంపెనీ ఇంతక్రితం 2018లోనూ పబ్లిక్ ఇష్యూ ప్రయత్నాలు చేసింది. సెబీ అనుమతించినప్పటికీ మార్కెట్ పరిస్థితులు అనుకూలించకపోవడంతో విరమించుకుంది. (30 రోజుల్లో 100 శాతం లాభాలు) పోటీ ఎక్కువే.. లిస్టెడ్ దిగ్గజాలు ఐటీసీ, బ్రిటానియాతోపాటు.. పార్లే ఇండియా, మోడర్న్, హార్వెస్ట్ గోల్డ్ కంపెనీలతో బెక్టర్స్ ఫుడ్ పోటీ పడుతోంది. గ్లోబల్ ఫాస్ట్‌ఫుడ్ చైన్స్‌కు భారీ స్థాయిలో బన్స్ సరఫరా చేయడంతోపాటు.. ఫ్రోజెన్ డఫ్ విభాగంలోకీ ప్రవేశించింది. తద్వారా ఈ విభాగంలో మార్కెట్ లీడర్‌గా ఉన్న బేకర్స్ సర్కిల్‌తో పోటీని ఎదుర్కొంటోంది. 2019 మార్చికల్లా బెక్టర్స్ ఫుడ్ ఆదాయం రూ. 762 కోట్లను తాకింది. రూ. 30 కోట్ల నికర లాభం ఆర్జించింది. దేశీయంగా బిస్కట్లు, బేకరీ ప్రొడక్టుల రిటైల్ మార్కెట్ విలువ 7 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 52,000 కోట్లు)గా అంచనా. గత ఐదేళ్లలో వార్షికంగా 9 శాతం వృద్ధిని సాధిస్తూ వస్తోంది. మార్కెట్ విలువలో బిస్కట్లు, రస్కులు, వేఫర్స్, కేకులు 89 శాతం వాటాను ఆక్రమిస్తున్నాయి. బన్నులు, పిజ్జా బేస్‌లు తదితరాల వాటా 11 శాతమని పరిశ్రమ నిపుణులు తెలియజేశారు! -
బర్గర్‌కింగ్- 3 రోజుల్లో 3 రెట్లు లాభం
ముంబై, సాక్షి: అటు నిపుణులు, ఇటు ఇన్వెస్టర్లను నివ్వెరపరుస్తూ కేవలం మూడు రోజుల్లోనే అంతర్జాతీయ ఫాస్ట్‌ఫుడ్(QSR) చైన్ల దిగ్గజం బర్గర్‌కింగ్ షేరు మూడు రెట్లు రిటర్నులు అందించింది. ఇటీవల రూ. 60 ధరలో పబ్లిక్ ఇష్యూకి వచ్చిన బర్గర్ కింగ్ తొలి రోజు సోమవారం స్టాక్ ఎక్స్ఛేంజీలలో భారీ లాభాలతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 60కాగా.. బీఎస్ఈలో ఏకంగా 91 శాతం ప్రీమియంతో రూ. 115 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. తదుపరి రెండు రోజులుగా 20 శాతం అప్పర్ సర్క్యూట్లను తాకుతూ వస్తోంది. తాజాగా బీఎస్ఈలో ఈ షేరు రూ. 33 ఎగసి రూ. 199 వద్ద ఫ్రీజయ్యింది. వెరసి ఇష్యూ ధరతో పోలిస్తే 232 శాతం లేదా 3.3 రెట్లు అధికంగా లాభపడింది! ఇందుకు ఈ కౌంటర్లో కొనేవాళ్లు అధికంకాగా.. అమ్మకందారులు కరువుకావడం ప్రభావం చూపుతున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. (బర్గర్ కింగ్ లిస్టింగ్.. అ‘ధర’హో) మూడేళ్లుగా ఈ ట్రెండ్ రూ. 1,000 కోట్లలోపు పబ్లిక్ ఇష్యూకి వచ్చిన బలమైన కంపెనీలు మూడేళ్లుగా తొలి వారంలో భారీగా లాభపడుతూ వస్తున్నట్లు టార్గెట్ ఇన్వెస్టింగ్‌కు చెందిన కల్రా పేర్కొన్నారు. ఫ్లోటింగ్ స్టాక్ తక్కువగా ఉంటే ఈ మేనియా కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో ట్రేడర్లు, లేదా ఇన్వెస్టర్లకు కంపెనీ వేల్యుయేషన్స్ గుర్తుకురావని వ్యాఖ్యానించారు. డోమినోస్ పిజ్జా రెస్టారెంట్ల కంపెనీ జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ షేరు సైతం ఇదేవిధంగా లిస్టింగ్‌లో పటిష్ట లాభాలు ఆర్జించినట్లు ప్రస్తావించారు. (నేటి నుంచి బెక్టర్స్ ఫుడ్.. పబ్లిక్ ఇష్యూ) కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ 2014 నవంబర్‌లో దేశీయంగా కార్యకలాపాలు ప్రారంభించిన బర్గర్‌కింగ్ తాజాగా 261 రెస్టారెంట్లకు విస్తరించింది. వీటిలో 8 సబ్ఫ్రాంచైజీలున్నాయి. 17 రాష్ట్రాలు, 57 పట్టణాలలో రెస్టారెంట్లను నిర్వహిస్తోంది. రానున్న కాలంలో వ్యాపార విస్తరణ ద్వారా కంపెనీ మరింత జోరందుకునే వీలున్నట్లు ఏంజెల్ బ్రోకింగ్‌కు చెందిన కేశవ్ లహోటీ పేర్కొన్నారు. అయితే క్యూఎస్ఆర్ విభాగంలో జూబిలెంట్ ఫుడ్ వాటా 21 శాతంకాగా.. మెక్‌డొనాల్డ్స్ సంస్థ వెస్ట్‌లైఫ్ డెవలప్మెంట్ 11 శాతం, కేఎఫ్‌సీ 10 శాతం, సబ్వే 6 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఆలస్యంగా అడుగుపెట్టిన బర్గర్‌కింగ్ 5 శాతం వాటాతో వేగంగా విస్తరిస్తున్నట్లు ఈ సందర్భంగా మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. గత ఐదేళ్లలో బర్గర్‌కింగ్ అమ్మకాలు 56 శాతం జంప్‌చేయగా.. వెస్ట్‌లైఫ్ 17 శాతం, జూబిలెంట్ 12 శాతం చొప్పున వృద్ధి చూపాయి. బర్గర్‌కింగ్ 2020 మార్చికల్లా రూ. 835 కోట్ల ఆదాయం సాధించింది. -
రికార్డుల హోరు
ముంబై: ఇంధన, మౌలిక, బ్యాంకింగ్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సోమవారమూ సూచీల రికార్డుల ర్యాలీ కొనసాగింది. ఇంట్రాడేలో వెలువడిన అక్టోబర్ నెల టోకు, రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు ఇన్వెస్టర్లను మెప్పించగలిగాయి. అలాగే రూపాయి బలపడడం, కొనసాగిన విదేశీ పెట్టుబడుల నుంచి కూడా సానుకూల సంకేతాలు అందాయి. ఫలితంగా సెన్సెక్స్ 154 పాయింట్ల లాభంతో 46,253 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 44 పాయింట్లు పెరిగి 13,558 వద్ద ముగిసింది. ఈ స్థాయిలు సూచీలకు కొత్త జీవితకాల గరిష్టాలు కావడం విశేషం. మరోవైపు ఆటో, రియల్టీ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 46,373 వద్ద గరిష్టాన్ని, 45,951 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ సైతం 13,597–13,472 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. నగదు విభాగంలో సోమవారం ఎఫ్ఐఐలు రూ.2,264 కోట్ల షేర్లను కొనగా, దేశీయ ఫండ్స్ (డీఐఐ) రూ.1,721 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీశారు. ఇక డాలర్ మారకంలో రూపాయి 9 పైసలు బలపడి 73.55 వద్ద స్థిరపడింది. అమెరికాలో అత్యవసర పరిస్థితుల్లో ఫైజర్ వ్యాక్సిన్ వాడకానికి అనుమతులు లభించడంతో పాటు బ్రెగ్జిట్ ట్రేడ్ డీల్‌పై బ్రిటన్–ఈయూల మద్య జరిగే చర్చలు ఓ కొలిక్కి వస్తున్నాయనే అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లలో సాను కూల సంకేతాలు నెలకొన్నాయి. ఆసియాలో ప్రధాన మార్కెట్లతో పాటు యూరప్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బర్గర్ కింగ్ బంపర్ లిస్టింగ్ ఫాస్ట్‌ఫుడ్ చైన్ల దిగ్గజం బర్గర్ కింగ్ షేర్లు స్టాక్ మార్కెట్ లిస్టింగ్‌లో బంపర్ హిట్‌ను సాధించాయి. ఇష్యూ ధర రూ. 60తో పోలిస్తే బీఎస్ఈలో 92% ప్రీమియంతో రూ.115 వద్ద లిస్టయ్యాయి. చివరకు 130% లాభంతో రూ.138 వద్ద స్థిరపడ్డాయి. ట్రేడింగ్ ముగిసేసరికి ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 5,282.10 కోట్లుగా ఉంది. బీఎస్ఈలో 191.55 లక్షలు, ఎన్ఎస్ఈలో 18.67 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. ఇటీవలే ముగిసిన ఈ కంపెనీ ఐపీఓ 157 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. బర్గర్ కింగ్ కంపెనీ 2020 సెప్టెంబర్ నాటికి భారత్‌లో 268 దుకాణాలను కలిగి ఉంది. -
బర్గర్ కింగ్.. బ్లాక్‌బస్టర్ లిస్టింగ్
ముంబై, సాక్షి: అంతర్జాతీయ ఫాస్ట్‌ఫుడ్(QSR) చైన్ల దిగ్గజం బర్గర్ కింగ్ తొలి రోజు స్టాక్ ఎక్స్ఛేంజీలలో భారీ లాభాలతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 60కాగా.. ఎన్ఎస్ఈలో ఏకంగా 85 శాతం ప్రీమియంతో రూ. 111 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. వెరసి రూ. 51లాభంతో లిసయ్యింది. తదుపరి రూ. 119 వరకూ ఎగసింది. ప్రస్తుతం రూ. 111 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలోనూ. 115 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇటీవలే ముగిసిన బర్గర్ కింగ్ పబ్లిక్ ఇష్యూ దాదాపు 157 రెట్లు అధికంగా సబ్స్క్రిప్షన్ లభించిన సంగతి తెలిసిందే. 7.44 కోట్ల షేర్లను కంపెనీ అమ్మకానికి ఉంచగా.. మొత్తం 1,167 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖయ్యాయి. రూ. 59-60 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 810 కోట్లను సమకూర్చుకుంది. ఇష్యూ నిధులలో కొంతమేర బర్గర్ కింగ్ రెస్టారెంట్స్ పేరుతో కొత్త కంపెనీ ఏర్పాటుకు వినియోగించనున్నట్లు మాతృ సంస్థ ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. అంతేకాకుండా స్టోర్ల విస్తరణకూ వినియోగించనుంది. ఇష్యూకి ముందు రోజు కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 364 కోట్లకుపైగా సమకూర్చుకుంది. (బర్గర్‌కింగ్ పుష్- బెక్టర్స్ ఫుడ్ ఐపీవోకు రెడీ) ఐదేళ్లలో.. గ్లోబల్ క్యూఎస్ఆర్ చైన్ సంస్థ బర్గర్ కింగ్ దేశీయంగా ఐదేళ్లక్రితం ఏర్పాటైంది. ఈ ఐదేళ్లలో రెస్టారెంట్ల ఏర్పాటురీత్యా వేగంగా వృద్ధి చెందుతూ వచ్చింది. మాస్టర్ ఫ్రాంచైజీ ఒప్పందాల ద్వారా బర్గర్ కింగ్ బ్రాండును దేశీయంగా విస్తరిస్తోంది. అంతర్జాతీయంగా బర్గర్ బ్రాండ్లలో నెట్వర్క్ రీత్యా ఈ కంపెనీ రెండో ర్యాంకులో నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 18,000 రెస్టారెంట్లు కలిగి ఉంది. 2020 సెప్టెంబర్‌కల్లా దేశీయంగా 261 రెస్టారెంట్లను ఏర్పాటు చేసింది. ఫ్రాంచైజీలతో కలిపి దేశవ్యాప్తంగా 57 పట్టణాలలో విస్తరించింది. 2017లో రూ. 233 కోట్లుగా నమోదైన ఆదాయం 2019కల్లా రూ. 633 కోట్లకు జంప్‌చేసింది. ఇదే సమయంలో నష్టాలు రూ. 72 కోట్ల నుంచి రూ. 38 కోట్లకు తగ్గాయి. కాగా.. జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్, వెస్ట్‌లైఫ్ డెవలప్మెంట్ కంపెనీలను దేశీయంగా లిస్టయిన ప్రధాన ప్రత్యర్ధి సంస్థలుగా పేర్కొనవచ్చు. జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్.. డోమినోస్ పిజ్జా రెస్టారెంట్లను నిర్వహిస్తుంటే.. వెస్ట్‌లైఫ్ డెవలప్మెంట్.. మెక్‌డొనాల్డ్ రెస్టారెంట్లను నిర్వహిస్తున్న విషయం విదితమే. -
బర్గర్ కింగ్ ఐపీవో.. స్పందన సూపర్
ముంబై, సాక్షి: అంతర్జాతీయ ఫాస్ట్‌ఫుడ్(QSR) చైన్ల దిగ్గజం బర్గర్ కింగ్ పబ్లిక్ ఇష్యూకి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇష్యూ చివరి రోజుకి దాదాపు 157 రెట్లు అధికంగా సబ్స్క్రిప్షన్ లభించింది. రిటైల్ విభాగంలో 68 రెట్లు అధికంగా స్పందన లభించింది. సంపన్నవర్గాల(హెచ్ఎన్ఐలు) నుంచి ఏకంగా 354 రెట్లు ఎక్కువగా బిడ్స్ దాఖలయ్యాయి. ఇక సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి సైతం 87 రెట్లు దరఖాస్తులు వచ్చినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీల డేటా వెల్లడించింది. వెరసి 7.44 కోట్ల షేర్లను కంపెనీ అమ్మకానికి ఉంచగా.. శుక్రవారానికల్లా మొత్తం 1,167 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖయ్యాయి. రూ. 59-60 ధరల శ్రేణిలో చేపట్టిన ఐపీవో ద్వారా కంపెనీ రూ. 810 కోట్లను సమకూర్చుకుంది. ఇష్యూ నిధులలో కొంతమేర బర్గర్ కింగ్ రెస్టారెంట్స్ పేరుతో కొత్త కంపెనీ ఏర్పాటుకు వినియోగించనున్నట్లు మాతృ సంస్థ ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. అంతేకాకుండా స్టోర్ల విస్తరణకూ వినియోగించనుంది. ఇష్యూకి ముందు రోజు కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 364 కోట్లకుపైగా సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. ఐదేళ్లలో.. గ్లోబల్ క్యూఎస్ఆర్ చైన్ సంస్థ బర్గర్ కింగ్ దేశీయంగా ఐదేళ్లక్రితం ఏర్పాటైంది. ఈ ఐదేళ్లలో రెస్టారెంట్ల ఏర్పాటురీత్యా వేగంగా వృద్ధి చెందుతూ వచ్చింది. మాస్టర్ ఫ్రాంచైజీ ఒప్పందాల ద్వారా బర్గర్ కింగ్ బ్రాండును దేశీయంగా విస్తరిస్తోంది. అంతర్జాతీయంగా బర్గర్ బ్రాండ్లలో నెట్వర్క్ రీత్యా ఈ కంపెనీ రెండో ర్యాంకులో నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 18,000 రెస్టారెంట్లు కలిగి ఉంది. 2020 సెప్టెంబర్‌కల్లా దేశీయంగా 261 రెస్టారెంట్లను ఏర్పాటు చేసింది. ఫ్రాంచైజీలతో కలిపి దేశవ్యాప్తంగా 57 పట్టణాలలో విస్తరించింది. 2017లో రూ. 233 కోట్లుగా నమోదైన ఆదాయం 2019కల్లా రూ. 633 కోట్లకు జంప్‌చేసింది. ఇదే సమయంలో నష్టాలు రూ. 72 కోట్ల నుంచి రూ. 38 కోట్లకు తగ్గాయి. కాగా.. జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్, వెస్ట్‌లైఫ్ డెవలప్మెంట్ కంపెనీలను దేశీయంగా లిస్టయిన ప్రధాన ప్రత్యర్ధి సంస్థలుగా పేర్కొనవచ్చు. జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్.. డోమినోస్ పిజ్జా రెస్టారెంట్లను నిర్వహిస్తుంటే.. వెస్ట్‌లైఫ్ డెవలప్మెంట్.. మెక్‌డొనాల్డ్ రెస్టారెంట్లను నిర్వహిస్తున్న విషయం విదితమే. -
బర్గర్ కింగ్ ఐపీవోకు రిటైలర్ల క్యూ
న్యూఢిల్లీ, సాక్షి: అంతర్జాతీయ ఫాస్ట్‌ఫుడ్(QSR) చైన్ల దిగ్గజం బర్గర్ కింగ్ పబ్లిక్ ఇష్యూ నేడు ముగియనుంది. ఇష్యూకి ధరల శ్రేణి రూ. 59-60కాగా.. రెండో రోజు గురువారానికల్లా 9.4 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. ప్రధానంగా రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 38 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించడం గమనార్హం! ఇష్యూలో భాగంగా ప్రమోటర్ సంస్థ క్యూఎస్ఆర్ ఏసియా పీటీఈ 6 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచింది. వీటికి జతగా మరో రూ. 450 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 810 కోట్లను సమకూర్చుకోవాలని భావిస్తోంది. వెరసి 7.44 కోట్ల షేర్లను అమ్మకానికి ఉంచగా.. గురువారం(3) వరకూ దాదాపు 70 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖయ్యాయి. ఐపీవో నిధులలో కొంతమేర బర్గర్ కింగ్ రెస్టారెంట్స్ పేరుతో కొత్త కంపెనీ ఏర్పాటుకు వినియోగించనున్నట్లు మాతృ సంస్థ ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. అంతేకాకుండా స్టోర్ల విస్తరణకూ వినియోగించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 250 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇష్యూకి ముందు రోజు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 364 కోట్లకుపైగా సమకూర్చుకుంది. ఐదేళ్లలో.. గ్లోబల్ క్యూఎస్ఆర్ చైన్ సంస్థ బర్గర్ కింగ్ దేశీయంగా ఐదేళ్లక్రితం ఏర్పాటైంది. ఈ ఐదేళ్లలో రెస్టారెంట్ల ఏర్పాటురీత్యా వేగంగా వృద్ధి చెందుతూ వచ్చింది. మాస్టర్ ఫ్రాంచైజీ ఒప్పందాల ద్వారా బర్గర్ కింగ్ బ్రాండును దేశీయంగా విస్తరిస్తోంది. అంతర్జాతీయంగా బర్గర్ బ్రాండ్లలో నెట్వర్క్ రీత్యా ఈ కంపెనీ రెండో ర్యాంకులో నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 18,000 రెస్టారెంట్లు కలిగి ఉంది. 2020 సెప్టెంబర్‌కల్లా దేశీయంగా 261 రెస్టారెంట్లను ఏర్పాటు చేసింది. ఫ్రాంచైజీలతో కలిపి దేశవ్యాప్తంగా 57 పట్టణాలలో విస్తరించింది. 2017లో రూ. 233 కోట్లుగా నమోదైన ఆదాయం 2019కల్లా రూ. 633 కోట్లకు జంప్‌చేసింది. ఇదే సమయంలో నష్టాలు రూ. 72 కోట్ల నుంచి రూ. 38 కోట్లకు తగ్గాయి. కాగా.. జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్, వెస్ట్‌లైఫ్ డెవలప్మెంట్ కంపెనీలను దేశీయంగా లిస్టయిన ప్రధాన ప్రత్యర్ధి సంస్థలుగా పేర్కొనవచ్చు. జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్.. డోమినోస్ పిజ్జా రెస్టారెంట్లను నిర్వహిస్తుంటే.. వెస్ట్‌లైఫ్ డెవలప్మెంట్.. మెక్‌డొనాల్డ్ రెస్టారెంట్లను నిర్వహిస్తున్న విషయం విదితమే. -
బర్గర్ కింగ్ ఐపీవో ధర రూ. 59-60
న్యూఢిల్లీ, సాక్షి: అంతర్జాతీయ ఫాస్ట్‌ఫుడ్(QSR) చైన్ల దిగ్గజం బర్గర్ కింగ్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. డిసెంబర్ 2న(బుధవారం) ప్రారంభంకానున్న ఇష్యూ 4న(శుక్రవారం) ముగియనుంది. ఐపీవోకు ధరల శ్రేణి రూ. 59-60. ఇష్యూలో భాగంగా ప్రమోటర్ సంస్థ క్యూఎస్ఆర్ ఏసియా పీటీఈ 6 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచుతోంది. వీటికి జతగా మరో రూ. 450 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 810 కోట్లను సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఇష్యూ నిధులను బర్గర్ కింగ్ రెస్టారెంట్స్ పేరుతో కొత్త కంపెనీ ఏర్పాటుకు వినియోగించనున్నట్లు మాతృ సంస్థ ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. అంతేకాకుండా సాధారణ కార్పొరేట్ అవసరాలకూ వినియోగించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 250 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇంతకంటే అధికంగా కావాలనుకుంటే ఇదే గుణిజాల్లో రూ. 2 లక్షల విలువ మించకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. కంపెనీ బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ కానుంది. ఐదేళ్లలో.. గ్లోబల్ క్యూఎస్ఆర్ చైన్ సంస్థ బర్గర్ కింగ్ దేశీయంగా ఐదేళ్లక్రితం ఏర్పాటైంది. ఈ ఐదేళ్లలో రెస్టారెంట్ల ఏర్పాటురీత్యా వేగంగా వృద్ధి చెందుతూ వచ్చింది. మాస్టర్ ఫ్రాంచైజీ ఒప్పందాల ద్వారా బర్గర్ కింగ్ బ్రాండును దేశీయంగా విస్తరిస్తోంది. అంతర్జాతీయంగా బర్గర్ బ్రాండ్లలో నెట్వర్క్ రీత్యా ఈ కంపెనీ రెండో ర్యాంకులో నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 18,000 రెస్టారెంట్లు కలిగి ఉంది. 2020 సెప్టెంబర్‌కల్లా దేశీయంగా 261 రెస్టారెంట్లను ఏర్పాటు చేసింది. ఫ్రాంచైజీలతో కలిపి దేశవ్యాప్తంగా 57 పట్టణాలలో విస్తరించింది. 2017లో రూ. 233 కోట్లుగా నమోదైన ఆదాయం 2019కల్లా రూ. 633 కోట్లకు జంప్‌చేసింది. ఇదే సమయంలో నష్టాలు రూ. 72 కోట్ల నుంచి రూ. 38 కోట్లకు తగ్గాయి. కాగా.. దేశీయంగా లిస్టయిన ప్రత్యర్ధి సంస్థ జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ స్థాయిలో బర్గర్ కింగ్‌కు ప్రీమియం విలువ లభించకపోవచ్చని ఏంజెల్ బ్రోకింగ్ సహచర ఈక్విటీ విశ్లేషకులు కేశవ్ లహోటీ ఐపీవో సందర్భంగా అంచనా వేశారు. జూబిలెంట్.. లాభాలు సాధిస్తున్నకంపెనీ కావడంతోపాటు పిజ్జా బ్రాండు దేశీయంగా వినియోగదారులను బాగా ఆకట్టుకుంటున్నట్లు అభిప్రాయపడ్డారు. -
మెక్‌డొనాల్డ్స్ ఫుడ్ ఆర్డర్ చేసుకోండి: బర్గర్ కింగ్
లండన్: కరోనా కాలంలో ఎన్నో సంఘటనలు చేసుకున్నాయి. మహమ్మారి మనుషుల మధ్య దూరాన్ని పెంచినప్పటికీ... మనుషుల్లో మానవత్వాన్ని బయటకు తీసింది. కోవిడ్ నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా ప్రపంచ దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. ఈ నేపథ్యంలో తిరిగి తమ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకునేందుకు శత్రు దేశాలు సైతం మిత్రులుగా మారుతున్నాయి. ఈ తరుణంలో నువ్వా నేనా అంటూ సొంత దేశంలో పోటీపడే ఫుడ్ చైన్ వ్యాపారాలు కూడా ఈ సంక్షోభంలో మద్దతుగా నిలుస్తున్నాయిని చెప్పడానికి ఈ తాజా సంఘటనే రుజువు. లాక్డౌన్లో ప్రముఖ వ్యాపార సంస్థలు ఆర్థిక సంక్షభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీంతో పలు సంస్థలు ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. దీనివల్ల వేలల్లో ఉద్యోగుల జీవితాలు రోడ్డునే పడే అవకాశం ఉంది. అలాంటి వారిని ఆదుకోవాలంటూ యుకేలోని ప్రముఖ ఫుడ్ చైన్ వ్యాపార సంస్థ బర్గర్‌కింగ్ చేసిన ట్వీట్ ప్రపంచ వ్యాప్తంగా ప్రజల హృదయాలను ఆకట్టుకుంటోంది. అమెరికన్ బెస్డ్ ఫాస్ట్‌ఫుడ్ సంస్థ అయిన బర్గర్ కింగ్ యుకేలోని మెక్‌డొనాల్డ్స్, కేఎఫ్‌సీ, పాపా జాన్స్, టాకో బెల్స్ల ఫుడ్‌ను ఆర్డర్ చేసుకుని ఆ సంస్థ ఉద్యోగులను ఆదుకోవాలని సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చింది. (చదవండి: షూ జతలో ఏకంగా 119 అరుదైన సాలీళ్లు) We know, we never thought we’d be saying this either. pic.twitter.com/cVRMSLSDq6 — Burger King (@BurgerKingUK) November 2, 2020 ‘మేము ఇలాంటి ట్వీట్ చేస్తామని కలలో కూడా ఊహించలేదు. కానీ రెస్టారెంట్స్, ఫుడ్స్ వ్యాపార సంస్థలలో పని చేసే వేలమంది ఉద్యోగులకు ఇప్పుడు మీ మద్దతు చాలా అవసరం. ఇందుకోసం మీరు కేఎఫ్‌సీ, మెక్‌డోనాల్డ్స్ ఆహారం కొనుగోలు చేయండి. వేల మంది ఉద్యోగుల జీవితాలను ఆదుకోండి. అయితే ఈ మహమ్మారి కాలంలో జాగ్రత్త ఉండటం మంచి విషయమే.. కానీ మంచిపని కోసం బయటి ఆహారం ఆర్డర్ చేయడం అంత చెడ్డ విషయం కాదు’ అంటూ బర్గర్ కింగ్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వ్యాపారంలో పోటీ దారులైన మెక్‌డోనాల్డ్స్ ఉద్యోగుల కోసం ఈ ట్వీట్ చేసిన బర్గ్కింగ్ తీరుకు ఫిదా అవుతూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘బర్గర్ కింగ్ చోరవ ఎంతో మందికి స్పూర్తినిస్తుంది. మనం ఎప్పటికీ మన పోటీదారులతో అసమానంగా పోరాడచ్చు. అలాగే అవసరమైన సమయాల్లో వారికి మద్దతుగా కూడా నిలబడవచ్చని బర్గర్ కింగ్ రుజువు చేసింది’ , ‘గొప్ప చర్య బర్గర్ కింగ్, మెక్‌డోనాల్డ్స్ అభిమానుల నుంచి భారీ మద్దతు, గౌరవం’ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. (చదవండి: కాకరకాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లితో రసగుల్లా..) -
బర్గర్ తిని.. రక్తం కక్కుకున్నాడు
ముంబై : ఓ వ్యక్తి బర్గర్ తిని రక్తం కక్కుకున్న సంఘటన గత బుధవారం పుణేలో చోటు చేసుకుంది. వివరాలు.. సజీత్ పఠాన్ అనే వ్యక్తి(31) తన స్నేహితులతో కలిసి భోజనం చేయడానికి గాను సమీప ఎఫ్‌సీ రోడ్డులో ఉన్న బర్గర్ కింగ్ ఔవుట్‌లెట్‌కి వెళ్లాడు. అనంతరం సజీత్ ఓ బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, సాఫ్ట్ డ్రింక్ ఆర్డర్ చేశాడు. ఫుడ్ వచ్చిన తర్వాత బర్గర్ తీసుకుని కాస్తంత తిన్నాడు. వెంటనే ఉక్కిరిబిక్కిరి అవ్వడమే కాక రక్తం కక్కున్నాడు. గొంతు నొప్పితో విలవిల్లాడాడు. దాంతో సజీత్ తెప్పించుకున్న బర్గర్‌ని పరిశీలించగా.. దానిలో పగిలిన గ్లాస్ ముక్కలు కనిపించాయి. వెంటనే సజీత్ స్నేహితులు అతన్ని సమీప ఆస్పత్రికి తరలించి, వైద్యం చేయించారు. విషయం తెలుసుకున్న స్టోర్ యజమాన్యం.. అప్పటికప్పుడు ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం సజీత్‌కు రూ. 15 వేలు చెల్లించింది. మరుసటి రోజు అంతకు రెట్టింపు డబ్బులు ఇచ్చి.. ఈ విషయం బయటకు చెప్పవద్దని కోరింది. దీని గురించి ఔట్లెట్ మానేజర్ని ప్రశ్నించగా.. తనకు ఈ విషయం గురించి తెలీదని.. ఆ రోజు సెలవులో ఉన్నానని తెలిపాడు. ప్రస్తుతం సజీత్ ఆరోగ్య పరిస్థితి స్థిమితంగానే ఉందన్నారు డాక్టర్లు. అతని శరీరంలోకి చేరిన గ్లాస్ ముక్క అదే బయటకు వస్తుందని.. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకుని కేసు నమోదు చేసుకున్న పోలీసులు మెడికల్ రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అవి రాగానే బర్గర్ కింగ్ ఔట్లెట్ మీద తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
నోరూరించే డీల్స్ ఆఫర్ చేస్తున్న కేఎఫ్‌సీ, బర్గర్ కింగ్
ముంబై : ఒకవైపు ప్రముఖ రెస్టారెంట్లు మెక్‌డొనాల్డ్స్ మూతపడటంతో, మరోవైపు కేఎఫ్‌సీ, బర్గర్ కింగ్‌లు మార్కెట్లో దూసుకుపోతున్నాయి. నోరూరించే డీల్స్‌తో కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్ల మూతను, ఈ రెస్టారెంట్లు క్యాష్ చేసుకుంటున్నాయని ఓ ఆంగ్ల పత్రిక రిపోర్టు చేసింది. బర్గర్ కింగ్, కేఎఫ్‌సీ, కార్ల్స్ జేఆర్. లాంటి క్విక్ సర్వీసు రెస్టారెంట్లు దేశీయంగా తమ కస్టమర్ బేస్‌ను పెంచుకోవడానికి ఆకర్షణీయమైన వాల్యుమీల్స్ ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నట్టు పేర్కొంది. డిసెంబర్ క్వార్టర్లో ఈ అవుట్లెట్లలో విక్రయాలు భారీగా పెరిగాయని తెలిపింది. కన్నాట్ ప్లాజా రెస్టారెంట్ల(సీపీఆర్ఎల్) 50:50 జాయింట్ వెంచర్ విక్రమ్ బక్షికి, మెక్‌డొనాల్డ్స్‌కు మధ్య వివాదాలు తలెత్తడంతో గత రెండు వారాలుగా 80కిపైగా మెక్‌డొనాల్డ్స్ అవుట్లెట్లు మూతపడ్డ సంగతి తెలిసిందే. వీటిలో కొన్నింటిన్నీ పునఃప్రారంభించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వివాద నేపథ్యంలో స్థానిక భాగస్వామి నిర్వహిస్తున్న 169 రెస్టారెంట్లలో ఆహార భద్రత, నాణ్యతపై మెక్డొనాల్డ్స్ఇండియా ఆందోళనలు వ్యక్తంచేస్తోంది. దీంతో మెక్‌డీ కస్టమర్లు కూడా బర్గర్ కింగ్, కేఎఫ్‌సీ లాంటి రెస్టారెంట్లకు ఆకర్షితులవుతున్నారు. పరిమిత కాల ఆఫర్‌తో తమ రెస్టారెంట్లలోకి ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతుందని బర్గర్ కింగ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాజీవ్ వెర్మన్ అన్నారు.నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రిపోర్టు ప్రకారం 2021 నాటికి దేశీయ ఆహార సర్వీసుల పరిశ్రమ 4.98 ట్రిలియన్లకు చేరుకుంటుందని అంచనా. దేశీయ జీడీపీలో రెస్టారెంట్ సెక్టారే 2.1 శాతం సహకరిస్తుందని కూడా అంచనాలు వెలువడుతున్నాయి. -
123 ఏళ్ల జైలుశిక్ష.. అంతలోనే ఆత్మహత్య!
వాషింగ్టన్: పలు కేసుల్లో దోషిగా తేలడంతో ఆ నిందితుడికి 123 ఏళ్ల జైలుశిక్ష విధించారు. కానీ ఆ మరుసటిరోజే జైళ్లో ఆ నిందితుడు తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకుంది. జార్జ్ జాన్సన్(28) అదివరకే పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఈ క్రమంలో గత అక్టోబర్ లో పోలీసులు జాన్సన్ ను అదుపులోకి తీసుకునేందుకు చూడగా మొదట ఓ పోలీసు వాహనాన్ని ధ్వంసం చేసి ఆపై ఓ ఆఫీసులో (బర్గర్ కింగ్)కి ప్రవేశించాడు. ముగ్గురు ఉద్యోగులు సహా ఓ ఏడేళ్ల బాలికను తుపాకీతో బెదిరించాడు. ఎంతగానో వేడుకోగా రెండు గంటల తర్వాత ఇద్దరు ఉద్యోగులను వదిలిపెట్టాడు జాన్సన్. దాదాపు ఐదునున్న గంటల పాడు ఓ ఉద్యోగి, బాలిక అతడి నిర్బంధంలోనే ఉండిపోయారు. చివరికి ఎలాగోలా పోలీసులు జాన్సన్ ను అదుపులోకి తీసుకున్నారు. 2016లో ఆటోమేటిక్ హ్యాండ్ గన్ తో కొన్ని గంటలపాటు కాల్పులకు పాల్పడి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన కేసుతో పాటు మరికొన్ని కేసుల్లో దోషిగా తేల్చేశారు. తనను పోలీసులు అరెస్ట్ చేసే కొన్ని రోజుల ముందు ఓ యువతిపై అత్యాచారం జరిపిన కేసుకుగానూ జాన్సన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. జాన్సన్ పై నమోదైన పలు కేసుల్లో దోషిగా తేలడంతో మేజిస్ట్రేట్ నిందితుడికి 123 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పిచ్చారు. ఆపై కొన్ని గంటల తర్వాత జైలు గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. -
స్మార్ట్‌ఫోన్ షాకింగ్ వీడియో...
గెలాక్సీ నోట్ 7 రూపంలో శాంసంగ్ ను వెన్నాడిన కష్టాలుఅన్నీ ఇన్నీ కావు. ప్రపంచంలో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ లిథియం-అయాన్ బ్యాటరీ పేలుడు ఫిర్యాదులు చేయడంతో మొదలైన కష్టాలు ఇంకా వెన్నాడుతూనే ఉన్నాయి. తాజాగా దక్షిణ కొరియా ఇంచియాన్ నగరంలో ఒక బర్గర్ కింగ్ అవుట్ లెట్ లో స్మార్ట్ ఫోన్ పేలిన వీడియో ఒకటి నెట్ లో హల్ చేస్తోంది. గ్లోబల్ గా ఈ నోట్ 7 స్మార్ట్ ఫోన్ ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించడానికి రెండు రోజులు ముందు ఈ వీడియో అప్ లోడ్ అయింది. అంతే క్షణాల్లో వైరల్ గా మారింది. దాదాపు 10 లక్షల మంది దీన్ని వీక్షించారు. బర్గర్ కింగ్ అవుట్ లెట్ లో పేలిన ఫోను పట్టుకోవడానికి ఆ కార్యాలయ ఉద్యోగి పవర్ ఫుల్ గ్లౌజ్ వేసుకొని కూడా పడిన పాట్లు నెటిజన్లకు షాకిస్తోంది. ఈ సంఘటను శాంసంగ్ ఉద్యోగి కూడా ధృవీకించారు. మరోవైపు ఈఘటనపై సదరు బర్గర్ యజమాని కూడా పరిహారం కోరినట్టు ఒక ఆన్లైన్ వార్తా వెబ్సైట్ వికీ ట్రీ నివేదించింది. కాగా దక్షిణ కొరియా మొబైల్ మేకర్ శాంసంగ తాజా స్మార్ట్ ఫోన్ చార్జింగ్ సమయంలో పేలుతున్న ఘటనలతో వివాదం చెలరేగింది. ఆ తర్వాత విమానాల్లో కూడా మంటలు, పొగలు వ్యాపించిన ఘటనలతో మరిన్ని ఇబ్బందుల్లోచిక్కుక్కుంది. ఈ నేపథ్యంలోప్రపంచ వ్యాప్తంగా ముందు రీకాల్,రీప్లేస్ మెంటు వంటి చర్యలకు దిగినా ఫలితం లేదు. చివరికి దీన్ని పూర్తిగా విరమించుకోవాల్సిని పరిస్థితికి నెట్టబడిన సంగతి తెలిసిందే. -
స్మార్ట్‌ఫోన్ షాకింగ్ వీడియో...