గెలాక్సీ నోట్ 7 రూపంలో శాంసంగ్ ను వెన్నాడిన కష్టాలుఅన్నీ ఇన్నీ కావు. ప్రపంచంలో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ లిథియం-అయాన్ బ్యాటరీ పేలుడు ఫిర్యాదులు చేయడంతో మొదలైన కష్టాలు ఇంకా వెన్నాడుతూనే ఉన్నాయి. తాజాగా దక్షిణ కొరియా ఇంచియాన్ నగరంలో ఒక బర్గర్ కింగ్ అవుట్ లెట్ లో స్మార్ట్ ఫోన్ పేలిన వీడియో ఒకటి నెట్ లో హల్ చేస్తోంది. గ్లోబల్ గా ఈ నోట్ 7 స్మార్ట్ ఫోన్ ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించడానికి రెండు రోజులు ముందు ఈ వీడియో అప్ లోడ్ అయింది. అంతే క్షణాల్లో వైరల్ గా మారింది. దాదాపు 10 లక్షల మంది దీన్ని వీక్షించారు.