galaxy note 7
-
నోట్ 7 పేలుడుకు అసలు కారణమిదే!
సియోల్ : శాంసంగ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గెలాక్సీ నోట్ 7 ఆ కంపెనీ కొంపమొచ్చింది. బ్యాటరీ పేలుళ్లతో ఒక్కసారిగా దాని పేరు, పత్రిష్ట, మరోవైపు నుంచి లాభాలు తుడిచిపెట్టుకుపోయాయి. రీకాల్ చేసి కొత్త ఫోన్లు మార్కెట్లోకి తీసుకొచ్చినా పేలుళ్ల సమస్య మాత్రం ఆ కంపెనీని వీడలేదు. దీంతో మొత్తానికే గెలాక్సీ నోట్7 అమ్మకాలు, ఉత్పత్తి నిలిపివేసి అసలు కారణమేమిటా? అని శోధించడం ప్రారంభించింది. ఎట్టకేలకు ఈ పేలుళ్ల కారణాన్ని శాంసంగ్ పట్టేసిందట. గెలాక్సీ నోట్7 ఫోన్లకు సరిపడ పరిమాణంలో లేని బ్యాటరీలను ఫిక్స్ చేయడం వల్లనే అవి ఓవర్‌హీట్ అయి పేలుతున్నాయని వాల్‌స్ట్రీట్ జర్నల్ శుక్రవారం రిపోర్టు చేసింది. సోమవారం రోజు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను దక్షిణ కొరియా దిగ్గజం ప్రజల ముందుకు తీసుకురానుంది. ఈ నేపథ్యంలో సంబంధిత వర్గాల సమాచారం మేరకు శాంసంగ్ కనుగొన్న కారణాన్ని వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రచురించేసింది. కంపెనీకి సమస్య తీసుకొచ్చిన బ్యాటరీల పరిమాణం సరిగ్గా లేదని, దీనివల్ల అవి ఓవర్‌హీట్ అవుతున్నట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. కంపెనీ తీసుకొచ్చిన ఈ నోట్7 డివైజ్‌లు పేలుళ్ల బారిన పడి, వినియోగదారులకు చిరాకు తెప్పించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌లో కంపెనీ నోట్7 ఫోన్లను రీకాల్ చేయడం ప్రారంభించింది. 2.5 మిలియన్ యూనిట్లను రీకాల్ చేస్తున్నట్టు శాంసంగ్ ప్రకటించింది. రీప్లేస్మెంట్లో కొత్త ఫోన్లను ప్రవేశపెట్టింది. అయినప్పటికీ శాంసంగ్‌ను పేలుళ్ల సమస్య వదలేదు. ఈ నేపథ్యంలో మొత్తానికే నోట్7ను ఆపివేస్తే బాగుంటుందని శాంసంగ్ నిర్ణయించింది. పేలుళ్ల బ్యాటరీలను కంపెనీకి బ్యాటరీల సప్లయర్‌గా ఉన్న ఓ సంస్థ సరఫరా చేస్తుందని శాంసంగ్ చెబుతోంది. తమ తప్పేమి లేదంటూ వాదిస్తోంది. కానీ ఆ సప్లయర్ పేరును మాత్రం శాంసంగ్ వెల్లడించడం లేదు. అయితే ఆ కంపెనీ ఈ దక్షిణ కొరియా దిగ్గజానికి చెందినదేనని, శాంసంగ్ ఎస్డీఐగా పలువురు పేర్కొంటున్నారు. ఈ కంపెనీ శాంసంగ్‌కు అవసరమైన బ్యాటరీలను రూపొందిస్తోంది. సంస్థకు చెందిన మొత్తం ఉత్పత్తిని పూర్తిగా సంస్కరిస్తుందని, మరో సమస్య తలెత్తకుండా క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్‌ను సంస్కరించనున్నామని శాంసంగ్ వాగ్దానం చేసిన సంగతి తెలిసిందే. -
ఆ కారణాలను శాంసంగ్ కనిపెట్టేసింది..
సుదీర్ఘకాల విచారణ అనంతరం ఎట్టకేలకు దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ తన గెలాక్సీ నోట్7 పేలుళ్ల కారణాలు కనిపెట్టేసింది. గెలాక్సీ నోట్7 పేలుడుకు గల మూల కారణాలను తాము కనుగొన్నామని శాంసంగ్ రిపోర్టు చేసింది. ఈ కారణాల రిపోర్టును కొరియా టెస్టింగ్ ల్యాబోరేటరీకి, ఇతర రెగ్యులేటరీ సంస్థలకు శాంసంగ్ సమర్పించింది. అయితే ఈ వివరాలను ఇంకా ప్రజలకు వెల్లడించలేదు. పేలుళ్ల కారణాలను కనుగొన్నాం, వాటిని రెగ్యులేటరీకి సమర్పించామని మాత్రమే ఈ దక్షిణ కొరియా దిగ్గజం పేర్కొంది. గెలాక్సీ నోట్ 7 పేలుళ్లతో శాంసంగ్ తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. గెలాక్సీ నోట్7 ఫోన్లలన్నింటినీ రీకాల్ చేసి సమస్యను పునరుద్ధరించుకుని మళ్లీ కొత్తగా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అయినప్పటికీ ఆ సంస్థను పేలుళ్ల సమస్య వెన్నాడుతూనే ఉంది. దీంతో తమ ఫోన్లను వెనక్కిచేయలంటూ కంపెనీ ప్రకటించింది. పేలుళ్లకు అసలు మూల కారణాలేమిటో తెలుసుకోవడం కోసం ఓ ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను కంపెనీ నియమించింది. ప్రస్తుతం అంతర్గత విచారణ పూర్తయిందని, ఈ రిపోర్టులను బయట ల్యాబోరేటరీలకు పంపించామని శాంసంగ్ వెల్లడించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా గెలాక్సీ నోట్7 ఫోన్‌ను శాంసంగ్ ప్రవేశపెట్టింది. కానీ ఈ ఫోన్‌కు పేలుళ్ల సమస్య తలెత్తడంతో ఎంతోకాలంగా కంపెనీ సాధించుకున్న ప్రతిష్ట మట్టిపాలైంది. చాలామంది గెలాక్సీ కస్టమర్లు ఇతర ఫోన్లకు తరలివెల్లారు. కంపెనీ త్రైమాసిక ఫలితాల్లోనూ ఈ ప్రభావం కనిపించింది. పేలుళ్ల సమస్య కనుగొనే వరకు గెలాక్సీ 8ను కూడా విడుదల చేయమని కంపెనీ జాప్యం చేస్తోంది. ఈ ఫోన్ లాంచింగ్ ఫిబ్రవరిలో ఉండే అవకాశముందని తెలుస్తోంది. -
శాంసంగ్ భారత యూజర్లకు భారీ పరిహారం
ముంబై: గెలాక్సీ నోట్ 7 బ్యాటరీ పేలుళ్లతో భారీ నష్టాలను మూటగట్టుకున్న ప్రపంచంలో అతిపెద్ద మొబైల్ మార్కెట్ లీడర్ శాంసంగ్ సంబంధిత యూజర్లకు భారీ పరిహారాన్నే అందజేస్తోంది. డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా ఇటీవల స్వదేశీ యూజర్లకు క్యాష్ బెనిఫిట్స్ అందించిన ఈ కొరియా సంస్థ ఇపుడు భారతదేశ వినియోగదారులకు కూడా మంచి పరిహారాన్నే ఆఫర్ చేసింది. ముందుగా దేశంలో గెలాక్సీ నోట్ 7 లాంచింగ్ ఆలస్యం.. తదితర పరిణామాలపై క్షమాపణ చెప్పిన శాంసంగ్ .. ప్రీ బుకింగ్ చేసుకున్న ఖాతాదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ బదులుగా గెలాక్సీ ఎస్ 7 గానీ, గెలాక్సీ ఎస్ 7 ఎడ్జ్ స్మార్ట్ ఫోన్ గానీ అందించనుంది. దీంతోపాటు ఫోన్ రీప్లేస్మెంట్ కోరేవారికి వర్చువల్ రియాల్టీ హెడ్ సెట్స్, వైర్ లెస్ హెడ్ ఫోన్స్, దాదాపు ముప్పయివేలకుపైగా (50 డాలర్లు) విలువచేసే వోచర్ ను అదనంగా అందించనుంది. అలాగే ఒక సంవ్సతరంలోపు మొబైల్ స్క్రీన్ పాడైతే..దీన్ని ఒకసారి పూర్తి ఉచితంగా రీప్లేస్ మెంటు చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది. మరోవైపు గెలాక్సీ నోట్ 7 ప్రమాదాల నేపథ్యంలో తమ ఆదాయంపై ఎనలిస్టుల అంచనాలను సంస్థ మరో ప్ర త్యేక ప్రకటనలో తప్పుబట్టింది. ఈ అంచనాలకు భిన్నంగా ఈ ఏడాదిలో ఇప్పటికే రికార్డు స్థాయి అమ్మకాలతో లీడ్ లో ఉన్నట్టు ఒక ప్రకటనలో వివరించింది. కాగా గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ ఫోన్ రీకాల్, శాశ్వత ఉపసంహరణ తదితర పరిణామాల నేపథ్యంలో ఆపరేషన్ ప్రాఫిట్ అంచనాల్లో కోత పెట్టుకుంది. గెలాక్సీ నోట్ 7 నష్టాలతో రాబోయే రెండు క్వార్టర్స్ లాభాలు తగ్గుతాయని అంచనా వేసిన సంగతి తెలిసిందే. -
నోట్7 పేలుళ్ల కారణాలేమిటో తేల్చుతాం..
గెలాక్సీ నోట్7 ఫోన్ బ్యాటరీ పేలుళ్ల ఘటనలతో ఓ వైపు ఉత్పత్తిని, మరోవైపు అమ్మకాలను రెండింటినీ శాశ్వతంగా నిలిపివేసిన శాంసంగ్, ఈ ఘటనలకు కారణమేమిటో త్వరలోనే తేల్చుతుందట. తమ ఫోన్లను వాడొద్దంటూ కఠిన హెచ్చరికలు కూడా చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా విడుదల చేసిన 'నోట్ 7' ఫోన్లు చార్జింగ్ పెట్టేటప్పుడు, ఫోన్ మాట్లాడినప్పుడు పేలుతున్నాయంటూ ఫిర్యాదులు వెల్లువెత్తడంతో దాదాపు 25 లక్షలకుపైగా ఫోన్లను కంపెనీ రీకాల్ చేసింది. రీకాల్ చేసిన ఫోన్లను రీప్లేస్‌మెంట్‌తో కొత్త ఫోన్లను విడుదలచేసింది. రీప్లేస్ చేసిన మోడల్స్ నుంచి కూడా పొగలు రావడంతో కంపెనీ మరింత సంక్షోభంలో కూరుకుపోయింది. తమ ఫోన్లు వెనక్కి పంపించేయడంటూ ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ పేలుళ్లకు అసలు కారణమేమిటో కనుగొనడానికి కంపెనీ ముప్పు తిప్పులు పడుతుందట. ఈ కారణంతోనే ఇన్నిరోజులు కారణమేమిటో కూడా వెల్లడించడానికి శాంసంగ్ తీవ్ర సతమతమైందని తెలుస్తోంది. కానీ చివరగా ఈ పేలుళ్లకు అసలు కారణమేమిటో త్వరలోనే తేల్చుతామని శాంసంగ్ ప్రకటించింది. దీనిపై విచారణ కొనసాగుతుందని, వచ్చే వారాల్లో తమ ముందుకు పేలుళ్ల కారణాలు విడుదలచేస్తామని కంపెనీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. మొదటిసారి పేలుళ్లు సంభవించినప్పుడే కంపెనీకి చెందిన ఇంజనీర్లు కారణాలేమిటో కనుగొనడంలో తీవ్రంగా విఫలమైనట్టు పలు రిపోర్టులు వెల్లడించాయి. వివిధ టెస్టులు నిర్వహించినప్పటికీ ఏ కారణంతో ఇవి పేలుతున్నాయో మూల కారణాన్ని కనుగొనలేకపోయారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. -
శాంసంగ్ డ్యామేజ్ కంట్రోల్ ఆఫర్ అదుర్స్
సియోల్: శాంసంగ్ గెలాక్సీనోట్ 7, 7ఎస్ స్మార్ట్ ఫోన్ వివాదంతో అష్టకష్టాలు పడుతున్న కొరియా మొబైల్ మేకర్ డ్యామేజ్ కంట్రోల్ లో పడింది. ఈ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకోసం లక్ష రూపాయల భారీ పరిహారం అందిస్తోంది. ఇప్పటికే స్వదేశీ (కొరియా) మార్కెట్లో రీప్లేస్మెంట్ మొదలు పెట్టిన సంస్థ భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ ఇవ్వనున్నట్టు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. సుమారు రూ.60 వేల (880డాలర్లు) విలువ చేసే గెలాక్సీనోట్ 7ఎస్ ను వాపస్ ఇచ్చిన వినియోగదారులకు రూ. 30,000ల విలువచేసే కూపన్ తో పాటు, అదనంగా రూ. 70,000 మొబైల్ క్రెడిట్ అందించనుంది. ఐఫోన్7 , ఎల్జీ జీ 5 లాంటి ఇతర మొబైల్స్ ను ఎంచుకున్న వారికి 30 వేల కూపన్ తో 70 వేల సహాయం అందించనుంది. అలాగే మరో ఖరీదైన శాంసంగ్ స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజ్ ఎంచుకున్న వారికి ఫోన్ తో పాటు అదనంగా రూ. 70,000 మొబైల్ క్రెడిట్ అందించనుంది. యూజర్ల భారీ అసౌకర్యాన్ని పూడ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఈ రూ.100,000 అందుకోవాలనుకుంటే, నవంబర్ 30 వరకు శాంసంగ్ ఫోన్లను వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అవకాశం ఏడాది చివరకు అందుబాటులో ఉంటుందనీ, అలాగే ఆయా దేశాల ప్రకారం పరిహారం వేర్వేరుగా ఉంటుందని తెలిపింది. దీంతో భారీ నష్టాల నుంచి శాంసంగ్ షేర్లు కోలుకున్నాయి. 2.4 శాతానికి పైగా పుంజుకున్నాయి. కాగా బ్యాటరీ తయారీ లోపాలతో పేలిపోతున్న శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 ఫోన్లను గ్లోబల్ గా రీకాల్ చేసింది. రీప్లేస్ చేసిన ఫోన్లు కూడా ప్రమాదానికి గురికావడంతో శాశ్వతంగా వీటికి ముగింపు పలికింది. మరోవైపు ఈ రీకాల్ కోసం యూజర్లకు ఫైర్ ప్రూఫ్ బాక్సులు, గ్లౌజులను సరఫరా చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు శాంసంగ్ విడుదల చేసిన వీడియో ట్విట్టర్ లో జోకులు పేలిన సంగతి తెలిసిందే. -
శాంసంగ్ క్యూ3 అంచనాలివే...
సియోల్: కొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ మేకర్ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ తన మూడో త్రైమాసిక ఫలితాలను రివైజ్ చేసింది. గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ ఫోన్ ఆపివేస్తున్నట్లు ప్రకటించిన అనంతరం క్షీణించిన ఆదాయ అంచనాలను ప్రకటించింది. లాభాలను 2.3 బిలియన్లకు (సుమారు రూ. 15,375కోట్లు) సవరించింది.ప్రాథమిక అంచనాలను సవరించిన సంస్థ తన నష్టాలను ప్రతిబింబించేలా ఈ అంచనాలను బుధవారం ప్రకటించింది. శాంసంగ్ వెల్లడించిన తాజా అంచనాల ప్రకారం మూడవ త్రైమాసికంలో నిర్వహణ లాభం 7.8 ట్రిలియన్ డాలర్లనుంచి 5.2 ట్రిలియన్ (రూ. 30,953కోట్లు) కు తగ్గింది. ఇది గత ఏడాదితో పోలిస్తే దాదాపు 29.63 శాతం, ప్రీవియస్ క్వార్టర్ తో పోలిస్తే 36.12 శాతం క్షీణించింది. మూడవ త్రైమాసికంలో ఆదాయాన్ని 49 ట్రిలియన్ల నుంచి 47 ట్రిలియన్ సుమారు (రూ. 2,91,384కోట్లు) తగ్గించబడింది. గత ఏడాదితో పోలిస్తే 9.06 శాతానికి, గత త్రైమాసికం నుంచి 7.73 శాతానికి పడిపోయింది. -
శాంసంగ్ పెయిన్.. ఆపిల్ గెయిన్
స్మార్ట్ ఫోన్ దిగ్గజాలు యాపిల్, శాంసంగ్ మధ్య జరుగుతున్న పోరులో అమ్మకాల పరంగా శాంసంగ్ రారాజులా వెలిగిన మాట వాస్తవం. కానీ తాజా స్మార్ట్ ఫోన్ గెలాక్సీ నోట్ 7 వైఫల్యం శాంసంగ్ ప్రతిష్టను దిగజార్చడంతోపాటూ ఆదాయానికి తీవ్ర గండి పడింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా విడుదల చేసిన 'నోట్ 7' ఫోన్లను దాదాపు 25 లక్షలకుపైగా రీకాల్ చేయనున్నట్టు ప్రకటించడం సంస్థకు తీరని నష్టాన్నిమిగిల్చింది. చివరకు రీప్లేస్ చేసిన ఫోన్లనుంచి పొగలు రావడంతో మరింత సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో శాంసంగ్ ఆదాయం 17 బిలియన్ డాలర్లు (1,13, 517,41,50,000 లక్షా పదమూడు వేల అయిదువందల కోట్లు) దాదాపు రూ. 1.14 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని ఎనలిస్టులు అంచనావేశారు. మరోవైపు బ్యాటరీ పేలుడు ప్రమాదాలతో శాంసంగ్ కేసులను కూడా ఎదుర్కొంటోంది. ఇది చాలదన్నట్టు ఆపిల్ కు అనుకూలంగా ఫెడరల్ కోర్టు తీర్పుతో శాంసంగ్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఇరు సంస్థల మధ్య దీర్ఘకాలంగా సాగుతున్న పేటెంట్ హక్కుల వివాదం లో ఆపిల్ వాదనలను కోర్టు సమర్ధించిన సంగతి తెలిసిందే. గెలాక్సీ నోట్ 7 ఉత్పత్తిని శాశ్వంగా నిలిపి వేస్తున్నట్టు శాంసంగ్ ప్రకటించడంతో మార్కెట్లో ఈ షేర్ ధర భారీగా పడిపోయింది. శాంసంగ్ పరిస్థితి ఇలా ఉంటే ఆపిల్ క్రమంగా పుంచుకుంటోంది. శాంసంగ్ ఫస్ట్ రీకాల్ తర్వాత శాంసంగ్ 8 శాతం క్షీణించగా, ఆపిల్ షేర్లు దాదాపు 10 శాతం లాభపడ్డాయి. అలాగే ఇటీవల లాంచ్ చేసిన ఐ ఫోన్ 7 స్మార్ట్ ఫోన్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయనీ ఆపిల్ స్వయంగా ప్రకటించింది. ఎన్ని ఫోన్లను మార్కెట్లో రిలీజ్ చేసిందీ వెల్లడించడానికి నిరాకరించిన ఆపిల్ అన్ని యూనిట్లను విక్రయించినట్టు పేర్కొంది. గెలాక్సీ నోట్ 7 వైఫల్యంతో కేవలం 10 బిలియన్ డాలర్లు మేరకు శాంసంగ్ నష్టపోయే అవకాశం ఉందనీ, గత నెల షేర్ పతనం అంత భారీదికాదని మరికొంతమంది ఎనలిస్టుల అంచనా. సంస్థ తన తరువాతి స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎస్ 8 హిట్అయితే ఈ నష్టాలనుంచి కోలుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్వార్టర్ లో ఆపిల్ కు 45 మిలియన్ల ఐ ఫోన్లు అమ్మడు పోయాయనీ, గత ఏడాది 48 మిలియన్లతో పోలిస్తే ఇది క్షీణత అని ఎనలిస్టులంటున్నారు. శాంసంగ్ ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 15.6 లక్షల కోట్లు. అయితే, ఈ మధ్య కాలంలో ఈ కంపెనీ విక్రయాలు కొంతమేర పడిపోయాయి. దీనికి తోడు గతం వారం భారీ నష్టాలతో... కంపెనీ విలువ కూడా తగ్గపోయే అవకాశం ఉందని టెక్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
స్మార్ట్‌ఫోన్ షాకింగ్ వీడియో...
గెలాక్సీ నోట్ 7 రూపంలో శాంసంగ్ ను వెన్నాడిన కష్టాలుఅన్నీ ఇన్నీ కావు. ప్రపంచంలో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ లిథియం-అయాన్ బ్యాటరీ పేలుడు ఫిర్యాదులు చేయడంతో మొదలైన కష్టాలు ఇంకా వెన్నాడుతూనే ఉన్నాయి. తాజాగా దక్షిణ కొరియా ఇంచియాన్ నగరంలో ఒక బర్గర్ కింగ్ అవుట్ లెట్ లో స్మార్ట్ ఫోన్ పేలిన వీడియో ఒకటి నెట్ లో హల్ చేస్తోంది. గ్లోబల్ గా ఈ నోట్ 7 స్మార్ట్ ఫోన్ ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించడానికి రెండు రోజులు ముందు ఈ వీడియో అప్ లోడ్ అయింది. అంతే క్షణాల్లో వైరల్ గా మారింది. దాదాపు 10 లక్షల మంది దీన్ని వీక్షించారు. బర్గర్ కింగ్ అవుట్ లెట్ లో పేలిన ఫోను పట్టుకోవడానికి ఆ కార్యాలయ ఉద్యోగి పవర్ ఫుల్ గ్లౌజ్ వేసుకొని కూడా పడిన పాట్లు నెటిజన్లకు షాకిస్తోంది. ఈ సంఘటను శాంసంగ్ ఉద్యోగి కూడా ధృవీకించారు. మరోవైపు ఈఘటనపై సదరు బర్గర్ యజమాని కూడా పరిహారం కోరినట్టు ఒక ఆన్లైన్ వార్తా వెబ్సైట్ వికీ ట్రీ నివేదించింది. కాగా దక్షిణ కొరియా మొబైల్ మేకర్ శాంసంగ తాజా స్మార్ట్ ఫోన్ చార్జింగ్ సమయంలో పేలుతున్న ఘటనలతో వివాదం చెలరేగింది. ఆ తర్వాత విమానాల్లో కూడా మంటలు, పొగలు వ్యాపించిన ఘటనలతో మరిన్ని ఇబ్బందుల్లోచిక్కుక్కుంది. ఈ నేపథ్యంలోప్రపంచ వ్యాప్తంగా ముందు రీకాల్,రీప్లేస్ మెంటు వంటి చర్యలకు దిగినా ఫలితం లేదు. చివరికి దీన్ని పూర్తిగా విరమించుకోవాల్సిని పరిస్థితికి నెట్టబడిన సంగతి తెలిసిందే. -
స్మార్ట్‌ఫోన్ షాకింగ్ వీడియో...
-
ఆఫీసుల్లోనూ నోట్7 నిషేధం!!
శాంసంగ్ కంపెనీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. విమానాల్లోనే కాదు.. ఇప్పుడు కార్యాలయాల్లోనూ శాంసంగ్ మొబైల్స్ వాడొద్దని నిబంధనలు పెడుతున్నారు. తాజాగా చైనాలో చెంగ్డూలోని సిచువాన్ ప్రావిన్స్‌లో గల ఓ ప్రభుత్వ కార్యాలయంలో శాంసంగ్ గెలాక్సీ నోట్7 స్మార్ట్ఫోన్లపై నిషేధం విధించారు.. చెంగ్డూలోని ప్రభుత్వ వ్యవహారాల సర్వీసు సెంటర్ ఉద్యోగులు గెలాక్సీ ఫోన్లను వాడొద్దని పేర్కొంటూ తన మైక్రో బ్లాక్ అకౌంట్లో ఓ నోటీసును పోస్టు చేసింది. భద్రతా కారణాల నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొంది. ఒకవేళ ఎవరైనా బయటవ్యక్తులు ప్రభుత్వ కార్యాలయంలో ఈ ఫోన్లను రీఛార్జ్ పెడుతున్నట్టు గమనించినా.. వారికి నచ్చజెప్పి కార్యాలయంలో రీఛార్జ్ చేయకుండా చూడాలని నోటీసులో తెలిపింది. అయితే సందర్శకులను టార్గెట్ చేసుకునే ఈ సర్వీసు సెంటర్ గెలాక్సీ నోట్7 ఫోన్లపై రద్దును చేపడుతుందని పలు మీడియా సంస్థలు రిపోర్టు చేయడంతో, కేవలం ఈ పాలసీ ఉద్యోగులకు మాత్రమేనని వర్తింపజేస్తామని సందర్శకులకు కాదని తెలిపింది. ఇప్పటికే పలు దేశాల విమానయాన సంస్థలతో పాటు చైనా సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కూడా గెలాక్సీ నోట్7 ఫోన్లపై నిషేధం విధించింది. దేశీయ విమాన ప్రయాణాల్లో ఈ ఫోన్లను వాడటం కాని, రీఛార్జ్ కాని చేయకూడదని ఆదేశాలు జారీచేసింది. చైనాలో ఐదుగురు గెలాక్సీ నోట్7 యూజర్లు తమ ఫోన్లు పేలిపోయాయని ఫిర్యాదు చేశారు. అయితే ఈ పేలుడుకు సంబంధించి ఇంకా సరియైన కారణాలు వెల్లడికాలేదు. మరోవైపు బ్యాటరీ పేలుళ్ల సమస్యతో గెలాక్సీ నోట్7 ఫోన్లను శాంసంగ్ రీకాల్ చేపడుతున్న సంగతి తెలిసిందే. -
నోట్7 ఆలస్యం ఎవరికి కలిసొస్తుంది?
న్యూఢిల్లీ : పండుగల సీజన్ వచ్చిదంటే చాలు...కంపెనీలకు పండుగే పండుగ. కొత్త కొత్త ప్రొడక్ట్‌ల ఆవిష్కరణలతో వినియోగదారుల ముందుకు వస్తుంటాయి. కానీ స్మార్ట్ఫోన్ల రారాజు శాంసంగ్‌కు ఈ పండుగ సీజన్ కొంత నిరాశేమిగిల్చేలా కనిపిస్తోంది. ఓ వైపు ఆపిల్ తన కొత్త మోడల్స్ ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్‌లను దీపావళికి ముందే భారత మార్కెట్లో ప్రవేశపెడుతుండగా.. శాంసంగ్ మాత్రం తన తాజా ఫ్లాగ్షిప్ గెలాక్సీ నోట్7ను విడుదలను జాప్యం చేస్తూ ఉంది. శాంసంగ్‌కు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న ఆపిల్ ఆ జాప్యాన్ని అదునుగా చేసుకుని ఈ పండుగల సీజన్లో బాగా లాభపడే అవకాశం ఉందని సీనియర్ ఇండస్ట్రి ఎగ్జిక్యూటివ్స్ చెబుతున్నారు. భారత్‌లో గెలాక్సీ నోట్7 విడుదల ఆలస్యానికి ప్రధాన కారణం బ్యాటరీ పేలుళ్ల సమస్య. ఇటీవల నెలకొన్న ఈ సమస్య శాంసంగ్‌కు పెద్ద తలనొప్పిలా మారింది. బ్యాటరీ పేలుళ్ల ఘటనలతో గెలాక్సీ నోట్7 అమ్మకాలను నిలిపివేసి, అంతర్జాతీయంగా 2.5 మిలియన్ డివైజ్‌లను రీకాల్ చేసింది. ప్రస్తుతం ఆ బ్యాటరీ పేలుళ్ల సమస్యకు పరిష్కారం కనుగొని, సురక్షితమైన బ్యాటరీతో గెలాక్సీ నోట్7లను మళ్లీ అంతర్జాతీయ మార్కెట్లో పునఃప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. శాంసంగ్‌కు కీలక మార్కెట్లు దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, సింగపూర్, యూఎస్‌లలో రీలాంచ్ చేస్తామని ప్రకటించిన కంపెనీ ప్రకటించింది. కానీ ప్రభావితమైన ఫోన్ రీకాల్ ప్రక్రియ ఆలస్యం అవుతుండటంతో రీలాంచ్‌ను తేదీలను శాంసంగ్ వాయిదా చేసింది. ఆ మార్కెట్లలో రీలాంచ్‌తో పాటు భారత్‌లో కూడా నోట్7ను సెప్టెంబర్ చివరవారంలో ఆవిష్కరించాలని శాంసంగ్ ఇండియా ప్లాన్ చేసింది. కానీ ఆ తేదీని ఆలస్యం చేసి ఐఫోన్7తో పాటు నోట్7 మార్కెట్లోకి వచ్చేలా వ్యూహాలు రచిస్తోంది. దీపావళి కానుకగా ఈ ఫోన్ ను భారత్ లో ప్రవేశపెట్టనున్నట్టు ఓ సీనియర్ ఎగ్జిక్యూటివ్ చెబుతుండగా.. మళ్లీ గెలాక్సీ నోట్ 7 విడుదల ఆలస్యమయ్యే అవకాశాలున్నట్టు మరో ఎగ్జిక్యూటివ్ పేర్కొంటున్నారు. దీపావళి తర్వాతే దీన్ని ఆవిష్కరణ ఉండొచ్చంటున్నారు. దీంతో ఐఫోన్ 7 కంటే తన ఫోన్‌ను ముందుగానే భారత మార్కెట్లోకి ప్రవేపెట్టాలనే ప్లాన్స్, ఫెస్టివల్ కోరిక రెండూ శాంసంగ్‌కు నెరవేరేలా కనిపించడం లేదు. ఎక్కువ రోజులు గెలాక్సీ నోట్7 విడుదలను ఆలస్యం చేస్తూ పోతే వినియోగదారుల నిరీక్షణకు పరిక్ష పెట్టినట్టై, వారు సహనం కోల్పోయే ప్రమాదముందని ఓ మార్కెట్ ఎగ్జిక్యూటివ్ హెచ్చరిస్తున్నారు. కాగ, గత పండుగల కాలం అక్టోబర్-డిసెంబర్లో ఆపిల్ 850,000 ఐఫోన్లను విక్రయించగా.. ఈ ఏడాది ఒక మిలియన్ యూనిట్లను అమ్మే అవకాశాలు కనిపిస్తున్నాయని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ పేర్కొంటోంది. ఆలస్యమవుతున్న నోట్7 విడుదలే, ఈ ఆపిల్ ఫోన్ల విక్రయానికి బాగా కలిసివస్తుందని చెబుతోంది.అక్టోబర్-డిసెంబర్ కాలాన్ని ఎంతో కీలకంగా భావించే స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కొత్త కొత్త ఫోన్ల ఆవిష్కరణలను చేపడతాయి. 40 శాతానికి పైగా ఏడాది అమ్మకాలు ఈ త్రైమాసికంలోనే జరుపుతాయి. -
మార్కెట్లోకి మళ్లీ గెలాక్సీ నోట్7
సియోల్ :బ్యాటరీ పేలుళ్ల ఘటనలతో ఇటు శాంసంగ్ కంపెనీకి అటు వినియోగదారులకు వణుకుపుట్టించిన గెలాక్సీ నోట్ 7 అమ్మకాలు పునఃప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 28 నుంచి దక్షిణ కొరియాలో మళ్లీ అమ్మకాలు చేపట్టనున్నట్టు స్మార్ట్ఫోన్ల దిగ్గజం శాంసంగ్ ప్రకటించింది. లాంచ్ అయిన కొద్ది రోజులకే హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన గెలాక్సీ నోట్7 ఫోన్లు, పేలుళ్ల ఘటనలతో తన పాపులారిటీని, మార్కెట్‌ను రెండింటిని చేజార్చుకున్నాయి. ప్రస్తుతం ఆ నష్టాన్ని పూరించుకోవడానికి శాంసంగ్ తీవ్ర ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సరికొత్త, సురక్షితమైన బ్యాటరీలతో గెలాక్సీ నోట్7 అమ్మకాలను తిరిగి ప్రారంభించనున్నట్టు శాంసంగ్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. స్వదేశంలో సెప్టెంబర్ 28 నుంచి ఈ అమ్మకాలు ప్రారంభిస్తామని తెలిపిన కంపెనీ ప్రతినిధి అమెరికా సహా మిగతా దేశాల్లో ఆయా మార్కెట్ల పరిస్థితులకు అనుగుణంగా ఈ డివైజ్ అమ్మకాలను చేపడతామని తెలిపారు. అక్టోబర్ మొదట్లో ఆస్ట్రేలియాలో చేపడతామన్నారు. ఇప్పటివరకు ఉన్న సామ్సంగ్ ఫోన్లలోని తెలుపు రంగు బ్యాటరీ ఇండికేటర్ కాకుండా.. కొత్త నోట్7 ఫోన్లలో ఆకుపచ్చ రంగు బ్యాటరీ ఇండికేటర్ ఉంటుందని సామ్సంగ్ తెలిపింది. కొత్త గెలాక్సీ నోట్ 7 ఫోన్ భద్రమైందో కాదో తెలుసుకునేందుకు రీటేల్ బాక్స్‌పై లేబుల్ ఉంటుందని సంస్థ పేర్కొంది. స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో రారాజుగా వెలిగిన శాంసంగ్‌కు గెలాక్సీ నోట్7 కోలుకోలేని దెబ్బతగిలించింది. ఒక్కసారిగా పేలుడు వార్తలు రావడంతో అంతర్జాతీయ విమానాల్లో ఈ ఫోన్ల నిషేధం, రీకాల్ వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. సెప్టెంబర్ 2న కంపెనీ దక్షిణ కొరియా, అమెరికా వంటి 10 దేశాల నుంచి ఈ ఫోన్లను రీకాల్ చేస్తున్నట్టు అధికారికంగా అధికారికంగా ప్రకటించింది. చార్జీ చేసేటప్పుడు, కాల్ ఆన్షర్ చేసేటప్పుడు పేలుళ్లు సంభవిస్తున్నాయని ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా గెలాక్సీ నోట్7కు రీప్లేస్‌మెంట్‌గా సురక్షితమైన బ్యాటరీతో మరోఫోన్ను అందించనున్నట్టు తెలిపింది. -
క్షమాపణ కోరుతూ శాంసంగ్ ప్రకటనలు
కొంగొత్త ఆశలతో ప్రత్యేక ఆకర్షణగా వినియోగదారుల ముందుకు వచ్చిన నూతన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ నోట్7తో ఇన్ని చిక్కులు వస్తాయని శాంసంగ్ కంపెనీ బహుశ ఆలోచించనేలేదేమో. గెలాక్సీ నోట్7 విడుదలైన ప్రారంభంలో సప్లైను మించి డిమాండ్ దూసుకెళ్లడంతో, దీనిపై ఆ కంపెనీ భారీగానే ఆశలు పెట్టుకుంది. ఈ ఆశలన్నీ ఒక్కసారిగా తలకిందులయ్యాయి. బ్యాటరీ పేలుళ్ల ఘటనలతో, గెలాక్సీ నోట్7కు అత్యంత ప్రమాదకరమైనదిగా పేరు వచ్చేసింది. ఏం చేయాలో పాలుపోలేని పరిస్థితుల్లో ఆ ఫోన్లను రీకాల్ ప్రారంభించింది. అయితే వినియోగదారులకు ఇంత మొత్తంలో అసౌకర్యం కలిగించినందుకు క్షమాపణ కోరుతోంది ఆ సంస్థ. తాము కలిగించిన ఈ అసౌకర్యవంతమైన పనికి మీడియా ప్రకటనల ద్వారా క్షమాపణలు కోరతామని, క్షమాపణ ప్రకటనలను త్వరలోనే ఆవిష్కరిస్తామని శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ మంగళవారం వెల్లడించింది. మేజర్ మీడియా అవుట్లెట్ల ద్వారా క్షమాపణలు కోరతామని తెలిపింది. చార్జీ పెట్టేటప్పుడు, ఫోన్ ఆన్షర్ చేసినప్పుడు బ్యాటరీ పేలుళ్ల ఘటనలు సంభవిస్తున్నాయంటూ ఫిర్యాదులు వెల్లువెత్తడంతో గెలాక్సీ నోట్7 ఫోన్‌ను శాంసంగ్ సెప్టెంబర్ 2 నుంచి గ్లోబల్‌గా రీకాల్ చేయడం ప్రారంభించింది. రీప్లేస్‌మెంట్‌తో ఈ ఫోన్లను రీకాల్ చేస్తున్నట్టు వెల్లడించింది. శాంసంగ్ ఉద్యోగులందరూ ఈ సమస్యను పరిష్కరించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తామని కంపెనీ పేర్కొంది. రీఫండ్‌కు బదులుగా ఈ ఫోన్ రీప్లేస్‌మెంట్‌కు వేరే డివైజ్‌ను ఎంచుకునే యూజర్లకు సబ్సిడీ అందించనున్నట్టు తెలిపింది. అదేవిధంగా ఓటీఏ అప్డేట్ టెక్నాలజీతో గెలాక్సీ నోట్7 బ్యాటరీ పేలుళ్ల సమస్యను అధిగమించనున్నట్టు పేర్కొంది. -
వణికిస్తున్న 'గెలాక్సీ నోట్ 7' బాంబు
స్మార్ట్ ఫోన్ అమ్మకాల్లో రారాజులా వెలిగిన శాంసంగ్ కు 'గెలాక్సీ నోట్ 7' రూపంలో కోలుకోలేని దెబ్బతగిలింది. అటు ప్రధాన ప్రత్యర్థి ఆపిల్ మార్కెట్లోకి శరవేగంగా దూసుకొస్తోంటే.. అనూహ్యపరిణామాలు సంస్థకు అశనిపాతంలా చుట్టుకున్నాయి. ఒక్కసారిగా పేలుడు వార్తలు రావడం, కొన్ని అంతర్జాతీయ విమానాల్లో నిషేధం తదితర పరిణామాలు చకచకా జరిగిపోయాయి. అమెరికా కన్జ్యూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ కమిషన్ తాజాగా జారీ చేసిన ఆదేశాలు సంస్థను కృంగదీసేలా ఉన్నాయి. వినియోగదారులు గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ ఫోన్ వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని లేదా స్విచ్ ఆఫ్ చేయాలని తెలిపింది. దీని వినియోగా చాలా ప్రమాదకరమైనదని ప్రకటించింది. ఈ వ్యవహారంలో శాంసంగ్ సంస్థతో అధికారిక రీకాల్ కోసం పనిచేస్తున్నట్టు సంస్థ శుక్రవారం వెల్లడించింది. అలాగే సంస్థ ప్రకటించిన రీప్లేస్ మెంట్ ఆఫర్ సరియైనదా కాదా అనే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపింది. ఇటీవలే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా లాంచ్ చేసిన ఈ తాజా ఫోన్ బ్యాటరీలు పేలుతున్న సంఘటనలు సంస్థను వణికించాయి. మరోవైపు యూజర్లకు చెమటలు పట్టించాయి. ఈ నేపథ్యంలో భారత విమానాల్లో ఈ ఫోన్లు వాడొద్దంటూ అధికార డిజీసీఏ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. భారత ఎయిర్ లైన్స్, ఆస్ట్రేలియాకు చెందిన క్వాంటాస్ అలాగే అమెరికాకు చెందిన అమెరికన్ ఎయిర్ లైన్ రెగ్యులేటర్ ,ది ఫెడరల్ ఏవియేషన్ అధారిటీ ( ఎఫ్ఎఎ)లు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. దీంతోపాటు తాజాగా గురువారం అమెరికా విమానయాన భద్రతా అధికారులు కూడా ప్రయాణికులకు నిషేధాజ్ఞలు జారీ చేశారు. లాంచ్ అయిన కొద్ది రోజులకే హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన ఈఫోన్లను దాదాపు 2.5మిలియన్ ఫోన్లను రీకాల్ చేయాలని శాంసంగ్ నిర్ణయించింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా 35ప్రమాదాలు సంభవించినట్టు ధృవీకరించింది. నష్టపోయిన కష్టమర్లకు ప్రత్యామ్నాయంగా గెలాక్సీ ఎస్7, ఎస్7ఎడ్జ్ ఫోన్లను రీప్లేస్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
డిమాండ్‌లో దూసుకెళ్తున్న గెలాక్సీ నోట్7
ఐరిస్ స్కానర్‌తో ప్రత్యేక ఆకర్షణగా వినియోగదారుల ముందుకు వచ్చిన కొత్త గెలాక్సీ నోట్7కు డిమాండ్ భారీగా పెరుగుతుందట. కంపెనీ అంచనాలను అధిగమించి ఈ ఫోన్ డిమాండ్ నమోదవుతుందని టెక్ దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ వెల్లడించింది. గ్లోబల్‌గా సప్లైను డిమాండ్ అధిగమించడంతో లాంచింగ్ కావాల్సిన మార్కెట్లలో ఆవిష్కరణ తేదీలను సర్దుబాటు చేస్తున్నట్టు శాంసంగ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కొత్త ప్రీమియం డివైజ్, తమ వ్యాపారాలను మరింత వృద్ధి బాటలో నడిపిస్తుందని, అత్యధిక రాబడులను ఆర్జించడానికి దోహదం చేస్తుందని ప్రపంచపు స్మార్ట్‌ఫోన్ రారాజు ఆశాభావం వ్యక్తం చేస్తోంది. శాంసంగ్ గెలాక్సీ నోట్7కు పెరుగుతున్న డిమాండ్‌తో దానికి పోటీగా మరో టెక్ దిగ్గజం యాపిల్ తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను వచ్చే నెలల్లోనే ఆవిష్కరించేందుకు సన్నద్ధమవుతుంది. గణనీయమైన స్మార్ట్‌ఫోన్ విక్రయాలతో ఈ త్రైమాసికంలో కూడా శాంసంగే ఆధిపత్యంలో నిలుస్తుందని కంపెనీ వెల్లడిస్తోంది. మరోవైపు డిమాండ్‌కు అనుగుణంగా సప్లై చేయలేని నేపథ్యంలో శాంసంగ్ రెవెన్యూలను కోల్పోవాల్సి వస్తుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. గతేడాది కూడా కర్వ్డ్ డిస్ప్లే గెలాక్సీ ఎస్6 ఎడ్జ్‌ను శాంసంగ్ ఆశించిన మేర సప్లై చేయలేకపోయిందని గుర్తుచేశారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా త్వరలోనే గెలాక్సీ నోట్7 ఉత్పత్తులు చేపడతామని కంపెనీ తెలిపింది. సప్లై సమస్యను వెంటనే పరిష్కరించి డిమాండ్‌ను చేధిస్తామని వెల్లడిస్తోంది.