శాంసంగ్ క్యూ3 అంచనాలివే...
సియోల్: కొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ మేకర్ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ తన మూడో త్రైమాసిక ఫలితాలను రివైజ్ చేసింది. గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ ఫోన్ ఆపివేస్తున్నట్లు ప్రకటించిన అనంతరం క్షీణించిన ఆదాయ అంచనాలను ప్రకటించింది. లాభాలను 2.3 బిలియన్లకు (సుమారు రూ. 15,375కోట్లు) సవరించింది.ప్రాథమిక అంచనాలను సవరించిన సంస్థ తన నష్టాలను ప్రతిబింబించేలా ఈ అంచనాలను బుధవారం ప్రకటించింది.
శాంసంగ్ వెల్లడించిన తాజా అంచనాల ప్రకారం మూడవ త్రైమాసికంలో నిర్వహణ లాభం 7.8 ట్రిలియన్ డాలర్లనుంచి 5.2 ట్రిలియన్ (రూ. 30,953కోట్లు) కు తగ్గింది. ఇది గత ఏడాదితో పోలిస్తే దాదాపు 29.63 శాతం, ప్రీవియస్ క్వార్టర్ తో పోలిస్తే 36.12 శాతం క్షీణించింది.
మూడవ త్రైమాసికంలో ఆదాయాన్ని 49 ట్రిలియన్ల నుంచి 47 ట్రిలియన్ సుమారు (రూ. 2,91,384కోట్లు) తగ్గించబడింది. గత ఏడాదితో పోలిస్తే 9.06 శాతానికి, గత త్రైమాసికం నుంచి 7.73 శాతానికి పడిపోయింది.