revises
-
ఎయిర్టెల్ రీఛార్జ్ ప్లాన్లలో మార్పు: వివరాలివిగో..
భారతదేశంలోని అతిపెద్ద టెలికాం ఆపరేటర్లలో ఒకటైన 'భారతి ఎయిర్టెల్'.. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా తన ప్రీపెయిడ్ ప్లాన్లలో కొన్ని మార్పులు చేసింది. ఇవి వాయిస్ కాల్స్, ఎస్ఎమ్ఎస్ల కోసం ఉపయోగపడతాయి.రూ.509 ప్లాన్ఎయిర్టెల్ అందిస్తున్న రూ. 509 ప్లాన్ 84 రోజులు చెల్లుబాటు అవుతుంది. అపరిమిత వాయిస్ కాల్స్, 900 ఉచిత ఎస్ఎమ్ఎస్ల మాత్రమే ఈ రీఛార్జ్ ద్వారా పొందవచ్చు. అయితే ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్‌కి ఉచిత యాక్సెస్, అపోలో 24/7 సర్కిల్ మెంబర్షిప్, ఉచిత హలో ట్యూన్లు వంటి కొన్ని అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే డేటా లభించదు.రూ.1999 ప్లాన్ఎయిర్టెల్ తన రూ. 1,999 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా సవరించింది. గతంలో ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్లు, 3000 ఉచిత ఎస్ఎమ్ఎస్లు, 24GB మొబైల్ డేటా ఉండేవి. ఇప్పుడు మొబైల్ డేటా ప్రయోజనాలను ఎయిర్టెల్ పూర్తిగా తొలగించింది. కాగా ఇప్పుడు ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్, అపోలో 24/7 సర్కిల్ మెంబర్షిప్, ఉచిత హలో ట్యూన్లకు ఉచిత యాక్సెస్ లభిస్తుంది.ఇదీ చదవండి: ట్రాయ్ కొత్త రూల్స్.. రూ.10తో రీఛార్జ్గతంలో పైన పేర్కొన్న రెండు ప్లాన్లలో డేటా సదుపాయం కూడా లభించేది. ఇప్పుడు డేటాను పూర్తిగా తొలగించింది. అయితే ఈ రెండు ప్లాన్స్ స్పామ్ ఫైటింగ్ నెట్వర్క్ సొల్యూషన్‌తో వస్తాయి. డేటాను ఉపయోగించని కస్టమర్లకు వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ సర్వీసుల కోసం విడిగా ప్లాన్‌ను ప్రవేశపెట్టాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసిన తరువాత ఎయిర్టెల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. -
ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకు బంపర్ ఆఫర్
సాక్షి, ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ తన ఖాతాదారులకు శుభవార్త అందించింది. బల్క్ ఎఫ్డీలపై వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 15 నెలల నుండి 3 సంవత్సరాల వరకు 6.80శాతం వడ్డీని అందించనుంది. కొత్త రేట్లు నవంబర్ 25, 2022 నుండి అమలులోకి వచ్చాయి. రూ. 2 కోట్ల కంటే ఎక్కువ, 5 కోట్ల రూపాయల లోపు ఉండే బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్లపై అందించే వడ్డీ రేట్లను పెంచింది. బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం బ్యాంక్ ప్రస్తుతం 7 రోజుల నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై వడ్డీ రేటు 3.75 - 6.50 శాతం మధ్య ఉంటుంది. 15 నెలల నుండి 3 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇప్పుడు గరిష్ట వడ్డీ రేటు 6.80శాతంగా ఉంటుంది. (WhatsApp డేటా బ్రీచ్ కలకలం: ఆ మెసేజెస్ కాల్స్‌కి,స్పందించకండి!) 30 రోజుల నుండి 45 రోజులలో మెచ్యూర్ అయ్యే వాటిపై 4.75శాతం, 46 - 60 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 5శాతం వడ్డీ లభిస్తుంది. అలాగే 61- 90 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 5.25 శాతం వడ్డీ లభిస్తుంది. 185 రోజుల నుండి 270 రోజులలో మెచ్యూర్ అయ్యే ఎఫ్డీలపై 6 శాతం రేటును ఇస్తోంది. అయితే 2 కోట్ల లోపు డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులను బ్యాంకు ప్రకటించలేదు. (తగ్గేదెలే అంటున్న మస్క్, టెక్ దిగ్గజాలకే సవాల్!) సీనియర్ సిటిజన్లకు అదనంగా 10 శాతం అలాగే రెసిడెంట్ సీనియర్ సిటిజన్ కస్టమర్లకు స్పెషల్‌గా 10శాతం వడ్డీని తాత్కాలికంగా అందిస్తుంది. అయితే డిపాజిట్ మొత్తం తప్పనిసరిగా రూ. 2 కోట్ల కంటే తక్కువగా ఉండాలి. డిపాజిట్ సమయం అయిదేళ్లకుపైన, 10 సంవత్సరాల లోపు ఉండాలి. ఈ స్పెషల్ స్కీం ఏప్రిల్ 7, 2023 తో ముగుస్తుంది. -
యాక్సిస్ బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త..!
గత కొద్ది రోజుల క్రితం బ్యాంకింగ్ సంస్థలు ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. కాగా తాజాగా యాక్సిస్ బ్యాంకు కూడా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను సవరించాయి. ఈ వడ్డీరేట్ల పెంపు మార్చి 17, 2022 నుంచి అమలులోకి రానుంది. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు వివిధ కాల వ్యవధిలో ఫిక్స్డ్ డిపాజిట్లను యాక్సిస్ బ్యాంకు అందిస్తోంది. ఈ వడ్డీరేట్లు 2 కోట్లకు కంటే తక్కువ డిపాజిట్లపై వర్తించనుంది. ఇక 18 నెలల నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ కాలవ్యవధి గల టర్మ్ డిపాజిట్లకు యాక్సిస్ బ్యాంక్ 5.25 శాతం వడ్డీను అందిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై సవరించిన వడ్డీ రేట్లు..! ► 7 రోజుల నుంచి 14 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 2.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 2.90 శాతం ► 15 రోజుల నుంచి 29 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 2.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 2.90 శాతం ► 30 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం ► 46 రోజుల నుంచి 60 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం ► 61 రోజుల నుంచి 90 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం ► 91 రోజుల నుంచి 120 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.00 శాతం ► 1 రోజుల నుంచి 9 నెలల వరకు(6 నెలలగాను ): సాధారణ ప్రజలకు - 4.40 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.90 శాతం ► 1 రోజు నుంచి ఒక సంవత్సరం కంటే తక్కువ(9 నెలల గాను): సాధారణ ప్రజలకు - 4.40 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.90 శాతం ► ఒక ఏడాది గాను: సాధారణ ప్రజలకు - 5.10 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.60 శాతం ► 5 ఏళ్ల వరకు: సాధారణ ప్రజలకు - 5.45 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.95 శాతం ► 5 ఏళ్ల నుంచి 10 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.75 శాతం; సీనియర్ సిటిజన్లకు - 6.25 శాతం చదవండి: ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త..! -
జియో యూజర్లకు మరో షాకింగ్ న్యూస్..!
జియో యూజర్లకు మరో షాకింగ్ న్యూస్..! ప్రముఖ టెలికాం దిగ్గజ సంస్థలు ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా టారిఫ్ రేట్లను పెంచడంతో జియో కూడా తన యూజర్లకు షాకిస్తూ టారిఫ్ ప్లాన్లను ధరలను పెంచింది. ఈ పెరిగిన ప్లాన్స్ ధరలు డిసెంబర్ 1 నుంచి అందుబాటులోకి వచ్చాయి. సాధారణ ప్లాన్ల ధరలతో పాటుగా ఓటీటీ సేవల ధరలను జియో పెంచింది. డిస్నీ+హాట్‌స్టార్ ప్లాన్స్ ధరల పెంపు..! ఓటీటీ ప్రేక్షకుల కోసం పలు టెలికాం సంస్థలు ఓటీటీ రీచార్జ్ ప్లాన్లను యూజర్లకు అందుబాటులో ఉంచాయి. ఈ ఏడాది ఆగస్టు చివరిలో డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సేవల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను జియో తీసుకువచ్చింది. గతవారం సాధారణ టారిఫ్ ప్లాన్ల ధరలను 20 శాతం మేర జియో పెంచింది. దీంతో డిస్నీ+హాట్‌స్టార్ మొబైల్ సేవల ప్రీపెయిడ్ రీఛార్జ్ ధరల పెంపు అనివార్యమైంది. చదవండి: జియో యూజర్లకు గుడ్‌న్యూస్..! 20 శాతం క్యాష్‌బ్యాక్..! ఎలా పొందాలంటే..! పెరిగిన ప్లాన్ ధరలు ఇవే..! రిలయన్స్ జియో ఐదు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లపై డిస్నీ+హాట్‌స్టార్ సేవలను అందిస్తోంది. వీటితో రీఛార్జ్ చేస్తే ఏడాది పాటు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటుగా, సాధారణ ప్లాన్స్ లాగే ఆన్లిమిటెడ్ డేటా, ఎస్ఎంఎస్లను యూజర్లు పొందుతారు. రూ. 499 ప్లాన్ ధరను రూ. 601గా, రూ. 666 ప్లాన్ ధరను రూ. 799గా, రూ.888 ప్లాన్ ధరను రూ. 1,066గా, రూ.2599 ప్లాన్ ధరను రూ. 3,119గా, రూ.549 ప్లాన్ ధరను రూ. 659 గా జియో సవరించింది. చదవండి: ఐఫోన్ 12 ప్రో కొనుగోలుపై రూ. 25 వేల వరకు తగ్గింపు..! -
ఎఫ్‌డీల వడ్డీరేట్లను సవరించిన హెచ్డీఎఫ్సీ
సాక్షి, ముంబై: ప్రైవేటు రంగ రుణదాత హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) వడ్డీ రేట్లను మరోసారి సవరించింది. అలాగే సీనియర్ సిటిజెన్ కేర్ ఎఫ్డి పథకం కింది సాధారణ ప్రజల కంటే 75 బీపీఎస్ పాయింట్ల అధిక వడ్డీ రేటును సీనియర్ సిటిజన్లకు అందిస్తుంది. మే 21 నుంచి ఈ సవరించిన వడ్డీరేట్లు అమలు చేయనుంది. 7 నుండి 29 రోజుల కాల పరిమితి గల డిపాజిట్లపై 2.50 శాతం వడ్డీని, 30 నుండి 90 రోజుల డిపాజిట్లపై 3 శాతం వడ్డీని అందిస్తుంది. ఇక 91 రోజుల నుండి 6 నెలల వరకు 3.5 శాతం, 6 నెలల 1 రోజు నుండి 4.4 శాతం, ఒక సంవత్సరం ఎఫ్‌డిలపై 4.9 శాతం వడ్డీని అందిస్తుంది. 2 నుండి 3 సంవత్సరాల ఎఫ్‌డిలపై వడ్డీ 5.15 శాతం, 3 నుంచి 5 ఏళ్ల డిపాజిట్లపై 5.30 శాతం, 5 -10 సంవత్సరాల డిపాజిట్లు 5.50 శాతం వడ్డీని వర్తింప జేస్తుంది. మరోవైపు సీనియర్ సిటిజన్స్ ఐదేళ్ల నుంచి పదేళ్ల మధ్య ఉన్న డిపాజిట్లపై 75 బేసిస్ పాయింట్ల మేర అధిక వడ్డీ లభిస్తుంది. ఇతర డిపాజిట్లపై 3 శాతం నుంచి 6.25 శాతం వరకు వడ్డీ రేట్లను సీనియర్ సిటిజనులకు ఆఫర్ చేస్తోంది. -
ఎఫ్‌పీఐలకు సెబీ ఊరట
సాక్షి, ముంబై: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై కొత్త కేవైసీ నిబంధనలకు సంబంధించి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌పీఐలు)సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) భారీ ఊరట నిచ్చింది. ఈ మేరకు నిబంధనలను సరళతరం చేస్తూ మార్కెట్ రెగ్యులేటరీ సెబీ శుక్రవారం సర్క్యులర్ జారీ చేసింది. ఈ ప్రతిపాదనలను సెబీ బోర్డు ఇప్పటికే ఆమోదించింది. తాజాగా ఈ కెవైసి నిబంధనల మార్గదర్శకాలను జారీ చేసింది. ముఖ్యంగా కేసుల పరిష్కారానికి సవరణలతోపాటు, విదేశీ పోర్ట్ ఫోలియో పెట్టుబడిదారులకు నో యువర్ కస్టమర్ (కెవైసి) నిబంధనల్లో మార్పులు చేసింది. దీని ప్రకారం కమోడీటీ మార్కెట్లో( సెన్సిటివ్ కమోడిటివ్ మినహా) కూడా ట్రేడింగ్ అవకాశాన్ని ఎఫ్‌పీఐలకు లభించనుంది. అలాగే దేశీయ మార్కెట్లలో ఎఫ్‌పీఐ రిజిస్ట్రేషన్ కోసం సాధారణ దరఖాస్తు ఫారమ్ సరిపోనుంది. అంటే ఫండ్స్‌ను నిర్వహిస్తున్న ఆయా ఇన్వెస్టర్లపై ఎటువంటి నియంత్రణలూ వుండవు. ఆయా ఇన్వెస్టర్ల కెవైసీకి అదనపు డాక్యుమెంట్లను సమర్పించాల్సిన అవసరం లేదు -
శాంసంగ్ క్యూ3 అంచనాలివే...
సియోల్: కొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ మేకర్ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ తన మూడో త్రైమాసిక ఫలితాలను రివైజ్ చేసింది. గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ ఫోన్ ఆపివేస్తున్నట్లు ప్రకటించిన అనంతరం క్షీణించిన ఆదాయ అంచనాలను ప్రకటించింది. లాభాలను 2.3 బిలియన్లకు (సుమారు రూ. 15,375కోట్లు) సవరించింది.ప్రాథమిక అంచనాలను సవరించిన సంస్థ తన నష్టాలను ప్రతిబింబించేలా ఈ అంచనాలను బుధవారం ప్రకటించింది. శాంసంగ్ వెల్లడించిన తాజా అంచనాల ప్రకారం మూడవ త్రైమాసికంలో నిర్వహణ లాభం 7.8 ట్రిలియన్ డాలర్లనుంచి 5.2 ట్రిలియన్ (రూ. 30,953కోట్లు) కు తగ్గింది. ఇది గత ఏడాదితో పోలిస్తే దాదాపు 29.63 శాతం, ప్రీవియస్ క్వార్టర్ తో పోలిస్తే 36.12 శాతం క్షీణించింది. మూడవ త్రైమాసికంలో ఆదాయాన్ని 49 ట్రిలియన్ల నుంచి 47 ట్రిలియన్ సుమారు (రూ. 2,91,384కోట్లు) తగ్గించబడింది. గత ఏడాదితో పోలిస్తే 9.06 శాతానికి, గత త్రైమాసికం నుంచి 7.73 శాతానికి పడిపోయింది.