సాక్షి, ముంబై: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై కొత్త కేవైసీ నిబంధనలకు సంబంధించి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌పీఐలు)సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) భారీ ఊరట నిచ్చింది. ఈ మేరకు నిబంధనలను సరళతరం చేస్తూ మార్కెట్ రెగ్యులేటరీ సెబీ శుక్రవారం సర్క్యులర్ జారీ చేసింది. ఈ ప్రతిపాదనలను సెబీ బోర్డు ఇప్పటికే ఆమోదించింది. తాజాగా ఈ కెవైసి నిబంధనల మార్గదర్శకాలను జారీ చేసింది.
ముఖ్యంగా కేసుల పరిష్కారానికి సవరణలతోపాటు, విదేశీ పోర్ట్ ఫోలియో పెట్టుబడిదారులకు నో యువర్ కస్టమర్ (కెవైసి) నిబంధనల‍్లో మార్పులు చేసింది. దీని ప్రకారం కమోడీటీ మార్కెట్లో( సెన్సిటివ్ కమోడిటివ్ మినహా) కూడా ట్రేడింగ్ అవకాశాన్ని ఎఫ్‌పీఐలకు లభించనుంది. అలాగే దేశీయ మార్కెట్లలో ఎఫ్‌పీఐ రిజిస్ట్రేషన్ కోసం సాధారణ దరఖాస్తు ఫారమ్ సరిపోనుంది. అంటే ఫండ్స్‌ను నిర్వహిస్తున్న ఆయా ఇన్వెస్టర్లపై ఎటువంటి నియంత్రణలూ వుండవు. ఆయా ఇన్వెస్టర్ల కెవైసీకి అదనపు డాక్యుమెంట్లను సమర్పించాల్సిన అవసరం లేదు
Comments
Please login to add a commentAdd a comment