kyc norms
-
ఫిన్‌టెక్ కంపెనీలకు ఆర్బీఐ ఆదేశాలు
ఫిన్‌టెక్ స్టార్టప్‌లు కస్టమర్ వెరిఫికేషన్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. ఇటీవల కేవైసీ నిబంధనలకు సంబంధించి ఆర్బీఐ అధికారులు ఫిన్‌టెక్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. చర్చల అనంతరం ఆర్బీఐ గతంలో వెల్లడించిన నిబంధనల్లో ఎలాంటి మార్పలు లేవని స్పష్టం చేశారు.ఆఫ్‌లైన్ ఆధార్ ధ్రువీకరణ, సెంట్రలైజ్డ్ కేవైసీ, డిజిలాకర్ వంటి అన్ని డాక్యుమెంట్ సేకరణ ప్రక్రియలతో పాటు ఫిన్‌టెక్ కంపెనీలు డిజిటల్ కస్టమర్ ఆన్‌బోర్డింగ్‌లో భాగంగా వీడియో కేవైసీని పాటించాలని ఆర్బీఐ తెలిపింది. గతంలో వీడియో కేవైసీ తప్పనిసరనే నిబంధనేదీ లేదు. కానీ ఇటీవల ఆర్బీఐ ఫిన్‌టెక్ కంపెనీల కస్టమర్ కేవైసీ విధానంలో మార్పులు తీసుకొచ్చింది. అందులో భాగంగా కస్టమర్ ఆన్‌బోర్డింగ్‌లో తప్పకుండా వీడియో కేవైసీ నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే దీన్ని సడలించాలని కంపెనీ ప్రతినిధులు ఆర్బీఐతో చర్చలు జరిపారు. కానీ నిబంధనల్లో ఎలాంటి మార్పులు లేవని ఆర్బీఐ స్పష్టం చేసింది. కచ్చితంగా అన్ని ఫిన్‌టెక్ కంపెనీలు, స్టార్టప్‌లు నిబంధనలు పాటించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.ఇదీ చదవండి: తయారీ రంగానికి నిధులు పెంచుతారా..?పీర్-టు-పీర్(ఆన్లైన్లో నేరుగా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తి అప్పు తీసుకోవడం) రుణాలపై సమావేశంలో చర్చించారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు ఆర్బీఐ సిద్ధంగా ఉందని తెలిసింది. అయితే పీర్ టు పీర్(పీ2పీ) లెండింగ్ కంపెనీలు కొన్ని పరిమితులకు కట్టుబడి ఉండాలనే వాదనలున్నాయి. ఈ స్టార్టప్‌లపై ఆర్బీఐ మరిన్ని నిబంధనలు విధించే వీలుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలాఉండగా, పీ2పీలో అప్పు తీసుకుని చెల్లించకుండా డీఫాల్ట్ అవుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. -
SEBI: కేవైసీ నిబంధనలు సరళతరం
న్యూఢిల్లీ: కేఆర్‌ఏల (కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీలు) ద్వారా కేవైసీ రికార్డుల ధృవీకరణ ప్రక్రియకు సంబంధించి రిస్కుల నిర్వహణ విధానాన్ని సరళతరం చేయాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్ణయించింది. కొత్త విధానం ప్రకారం కేఆర్ఏలు అధికారిక డేటాబేస్‌ల ఆధారంగా పాన్, పేరు, చిరునామా, ఈమెయిల్, మొబైల్ నంబరును ధృవీకరించవచ్చు. ఇవన్నీ సక్రమంగా ఉంటే రికార్డులను ధృవీకరించినట్లుగా పరిగణిస్తారని సైన్జీ సహ వ్యవస్థాపకుడు అంకిత్ రతన్ తెలిపారు. పెట్టుబడుల కోసం డిజిటల్ ప్లాట్‌ఫాంలను ఎంచుకునే వారి సంఖ్య పెరిగిపోతుండటంతో డిజిటల్ గుర్తింపును ధృవీకరించడం చాలా కీలకంగా మారిందని ఆయన పేర్కొన్నారు. తాజా పరిణామం ఇన్వెస్టర్లకు లావాదేవీలను సులభతరం చేసేందుకు తోడ్పడగలదని వివరించారు. కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను అమలు చేయడానికి వీలుగా ఎక్స్చేంజీలు, డిపాజిటరీలు, సంబంధిత మధ్యవర్తిత్వ సంస్థలు మే నెలాఖరు నాటికి తగిన సాంకేతిక మార్పులు, చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. క్యామ్స్, బీఎస్ఈ, ఎన్ఎస్ఈ మొదలైనవి కేఆర్‌ఏలుగా వ్యవహరిస్తున్నాయి. ఇవి సాధారణంగా బ్రోకింగ్ సంస్థలు, ఎక్సే్చంజీలు, ఇంటర్మీడియరీల నుంచి సేకరించిన ఇన్వెస్టర్ల కేవైసీ వివరాలను నిర్వహిస్తున్నాయి. -
బ్యాంక్ లాకర్లపై అనాసక్తి
ముంబై: బ్యాంక్ లాకర్లు.. ఒకప్పుడు వీటిని పొందడం కష్టంగా ఉండేది. డిమాండ్ ఎక్కువ, సరఫరా తక్కువగా అన్నట్టు గతంలో పరిస్థితి. కానీ, ఇప్పుడు బ్యాంక్ లాకర్లు అంటే చాలా మందిలో అనాసక్తి నెలకొంది. లాకర్ చార్జీలు గణనీయంగా పెరిగిపోవడం, క్లిష్టమైన కేవైసీ ప్రక్రియ తదితర ఎన్నో అంశాలు లాకర్లు అంటే మొహం మొత్తిపోయేలా చేస్తున్నాయి. 50 శాతం మంది కస్టమర్లు లాకర్లను ఇటీవలి కాలంలో మూసివేయడం, లేదంటే మూసివేయాలనే యోచనతో ఉన్నారు. లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో ఈ ఆసక్తికర విషయాలు తెలిశాయి. 11,000 మంది అభిప్రాయాలను తెలుసుకుని లోకల్ సర్కిల్స్ ఈ వివరాలను విడుదల చేసింది. లాకర్లను మూసివేసినట్టు 36 శాతం మంది చెప్పగా.. అధిక చార్జీల కారణంగా లాకర్లను మూసివేయాలని అనుకుంటున్నట్టు 4 శాతం మంది పేర్కొన్నారు. 16 శాతం మంది లాకర్ సైజును తగ్గించుకున్నట్టు చెప్పారు. నూతన చార్జీలు తమకు సమ్మతమేనని, లాకర్లను కొనసాగిస్తామని 36 శాతం మంది వెల్లడించారు. ‘‘బ్యాంక్ సేఫ్ డిపాజిట్ లాకర్లకు సంబంధించి కొత్త నిబంధనలు జనవరి 1 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. దీంతో శాఖకు వచ్చి కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలంటూ కస్టమర్లను బ్యాంక్‌లు కోరుతున్నాయి. డిసెంబర్ 31 నాటికి కస్టమర్లు బ్యాంక్‌కు వెళ్లి లీజ్ డాక్యుమెంట్‌పై సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఇటీవలి సంవత్సరాల్లో లాకర్ చార్జీలు కూడా పెరిగాయి’’అని లోకల్ సర్కిల్స్ తెలిపింది. చార్జీలు గణనీయంగా పెరగడం వల్లే తాము లాకర్లను రద్దు చేసుకున్నామని, లేదంటే మూసివేయాలని అనుకుంటున్నామని, లేదంటే సైజును తగ్గించుకుంటామని 56 శాతం మంది చెప్పినట్టు ఈ సంస్థ వెల్లడించింది. -
అమెజాన్ పే కంపెనీకి ఆర్బీఐ జరిమానా
ముంబై: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు చెందిన ఆన్లైన్ పేమెంట్స్ ప్రాసెసింగ్ సర్వీసుల్లో ఉన్న అమెజాన్ పే ఇండియాకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ.3.06 కోట్ల జరిమానా విధించింది. ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాలు, నో యువర్ కస్టమర్ (కేవైసీ) అంశాల్లో కొన్ని నిబంధనలను పాటించకపోవడంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూ పాలని సూచిస్తూ గతంలోనే కంపెనీకి ఆర్బీఐ నోటీసు జారీ చేసింది. అమెజాన్ పే ప్రతిస్పందనను పరిశీలించిన అనంతరం పెనాల్టీ విధించింది. -
అమెజాన్ పేపై ఆర్బీఐ కొరడా: భారీ జరిమానా
సాక్షి,ముంబై: ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ చెల్లింపుల సంస్థ అమెజాన్ భారీ షాక్ తగిలింది. రెగ్యులేటరీ నిబంధనల ఉల్లంఘలన కింద ఆర్బీఐ అమెజాన్ పే (ఇండియా)పై రూ. 3.06 కోట్ల జరిమానా విధించింది. గతంలో ఆర్బీఐ జారీ చేసిన నోటీసులకు అమెజాన్‌పే స్పందనపై సంతృప్తి చెందని ఆర్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. అమెజాన్ పే (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ (పిపిఐలు), నో యువర్ కస్టమర్ (కెవైసి) డైరెక్షన్‌కు సంబంధించిన కొన్ని నిబంధనలను పాటించలేని ఆర్బీఐ తేల్చింది. దీనికి సంబంధించిన రూ. 3.06 (రూ.3,06,66,000) కోట్ల పెనాల్టీ విధించినట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆదేశాలను పాటించనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలన్న ఆర్బీఐ నోటీసులకు సంస్థ స్పందనను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, నిబంధనలను పాటించలేదన్నఅభియోగం రుజువైన కారణంగా ఈ పెనాల్టీ విధించినట్టు తెలిపింది. (చదవండి : 2024 మారుతి డిజైర్: స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్‌తో, అతి తక్కువ ధరలో! ) -
ఎస్బీఐలో కేవైసీ స్కాం, రూ.50లక్షల ఫ్రీ గిఫ్ట్స్ గెలుచుకోవచ్చు
డియర్ ఎస్బీఐ కష్టమర్ మీ అకౌంట్ సస్పెండ్ అయ్యింది. పదినిమిషాల్లో కేవైసీ అప్ డేట్ చేయండి లేదంటే మీ అకౌంట్ శాశ్వతంగా బ్లాక్ అవుతుందంటూ ఓ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ మెసేజ్ పై ఎస్బీఐ స్పందించింది. గత కొంత కాలంగా కొంతమంది కేటుగాళ్లు కేవైసీ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. వెరిఫికేషన్ పేరుతో ప్రమాదకర లింక్స్‌ను షేర్ చేస్తున్నారు. పొరపాటున ఆ లింక్స్‌ను క్లిక్ చేస్తే ఎస్బీఐ అకౌంట్లలో ఉన్న మనీ మాయమవుతుంది. ఈ నేపథ్యంలో సైబర్ నేరాల్ని అరికట్టేలా ఎస్బీఐ తన వియోగదారుల్ని అప్రమత్తం చేస్తోంది. ఇందులో భాగంగా మరోసారి ఎస్బీఐ తన కష్టమర్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఎస్బీఐ ఫ్రీ గిఫ్ట్స్ KYC fraud is real, and it has proliferated across the country. The fraudster sends a text message pretending to be a bank/company representative to get your personal details. Report such cybercrimes here: https://t.co/3Dh42iwLvh#StateBankOfIndia #CyberCrime #StaySafeStayVigilant pic.twitter.com/eVVFAnMgTN — State Bank of India (@TheOfficialSBI) July 12, 2021 చైనాకు చెందిన సైబర్ నేరస్తులు ఎస్బీఐ అఫీషియల్ వెబ్సైట్ ను పోలిఉండే ఫేక్ ఎస్బీఐ వెబ్‌సైట్‌ను క్రియేట్ చేసి ఓ సర్వే లింక్ ను షేర్ చేస్తున్నారు. ఆ సర్వే పూర్తి చేస్తే ఎస్బీఐ రూ.50లక్షల ఫ్రీ గిఫ్ట్స్ గెలుచుకోవచ్చన్నది ఆ మెసేజ్ సారాంశం. తాజాగా ఆ మెసేజ్ పై ఎస్బీఐ స్పందించింది. కేవైసీ అప్డేట్ పేరుతో మీ ఫోన్ నెంబర్ కు వచ్చే మెసేజ్ లపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కేవైసీ అప్ డేట్ కోసం బ్యాంకులు ఎలాంటి లింక్స్ పంపవని చెబుతూనే..మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్, డెబిట్ కార్డ్ నెంబర్, పిన్, ఓటీపీ లాంటి విషయాల్ని ఎవరికి షేర్ చేయోద్దని తెలిపింది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు ఆర్బీఐ షాక్
సాక్షి,ముంబై: ప్రయివేటు బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) భారీ జరిమానా విధించింది. నో యువర్ కస్టమర్ (కెవైసీ) నిబంధనలను పాటించలేదని ఆరోపిస్తూ కోటి రూపాయల జరిమానా విధించింది. 39 ఖాతాలు కేవైసీ రూల్స్‌ను అతిక్రమించాయని ఆర్బీఐ పేర్కొంది. దీంతో సెక్షన్ 47 ఎ (1) (సి) బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 లోని సెక్షన్ 46 (4) (ఐ) ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాలను పాటించడంలో బ్యాంక్ వైఫల్యాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. మార్చి 31, 2017 తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి హెచ్డీఎఫ్సీ ఆన్-సైట్ తనిఖీ సందర్భంగా ఆర్బీఐ లోపాలను గుర్తించింది. ప్రారంభ పబ్లిక్ ఆఫర్లో బిడ్డింగ్ కోసం వినియోగదారులు తెరిచిన 39 కరెంట్ ఖాతాల పరిశీలన జరిగిందని, ఈ ఖాతాల్లో కేవైసీ నిబంధనలు పాటించడంలో బ్యాంకు విఫలమైందని ఆర్బీఐ తెలిపింది. ఈ కరెంట్ ఖాతాలలో జరిపిన లావాదేవీలు, వారి ఆదాయం, ప్రొఫైల్‌కు సరితూగలేదని గుర్తించినట్టు తెలిపింది. అనంతరం జరిమానా విధింపుపై బ్యాంకునకు ఆర్బీఐ నోటీసు జారీ చేసింది. దీనికి బ్యాంకు జవాబును పరిశీలించిన తరువాత, ద్రవ్య జరిమానా విధించాల్సిన అవసరం ఉందని నిర్ధారణకు వచ్చినట్టు ఆర్బీఐ వెల్లడించింది. -
కేవైసీ నిబంధనల సవరణ
న్యూఢిల్లీ: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ)కు సంబంధించి సవరించిన కేవైసీ నిబంధనలను మార్కెట్ రెగ్యులేటర్ సెబీ శుక్రవారం విడుదల చేసింది. ఎన్ఆర్ఐలు, దేశీయంగా నివసించే పౌరులు ఎఫ్‌పీఏల్లో అనియంత్రిత వాటా కలిగి ఉండేందుకు సెబీ తాజాగా అనుమతించింది. కేవైసీ (మీ కస్టర్ ఎవరన్నది తెలుసుకోవడం)కి సంబంధించి రెండు సర్క్యులర్లను విడుదల చేసింది. గతంలో విడుదల చేసిన మార్గదర్శకాలపై ఎఫ్‌పీఏల్లో ఆందోళన తలెత్తడం, నిబంధనల పాటింపు విషయంలో గందరగోళం కారణంగా రూ.4 లక్షల కోట్ల మేర ఎఫ్‌పీఐల పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతాయన్న అంచనాలు వ్యక్తమయ్యాయి. వీటికి పరిష్కారంగా ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ హెచ్ఆర్ ఖాన్ అధ్యక్షతన గల ప్యానల్ పలు సవరణలను సూచించింది. ఈ మేరకు సెబీ సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. కొత్త నిబంధనలు ఎన్ఆర్ఐలు, ఓసీఐలు (విదేశాల్లోని భారత పౌరులు), ఆర్ఐ (భారత్‌లో నివాసం ఉండేవారు)లు ఎఫ్‌పీఐల్లో అనియంత్రింత వాటా కలిగి ఉండొచ్చు. ఒక్కరే అయితే 25 శాతం, ఎన్ఆర్ఐ/ఓసీఐ/ఆర్ఐ మొత్తం హోల్డింగ్స్ కలిపి ఓ ఎఫ్‌పీఐ ఆధ్వర్యంలోని ఆస్తుల్లో 50 శాతం మించకూడదు. వీరిని భాగస్వాములుగానూ అనుమతిస్తారు. ఎఫ్‌పీఐలను ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ (ఐఎం) నియంత్రించొచ్చు. ఈ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ ఎన్ఆర్ఐ లేదా ఓసీఐ లేదా ఆర్ఐ అయినా కావచ్చు. లేదా వీరి నియంత్రణలో అయినా ఉండొచ్చు. ఇలాంటి సవరణలు, వెసులుబాట్లు నూతన నిబంధనల్లో ఉన్నాయి. వీటిని పాటించేందుకు ఎఫ్‌పీఐలకు ఆరు నెలల సమయం ఇవ్వగా, నిబంధనలు పాటించని వారు తమ పొజిషన్లను మూసివేసేందుకు మరో 180 రోజుల గడువు ఇచ్చింది. కేటిగిరీ–2, 3 పరిధిలోని ఎఫ్‌పీఐలు తమ నిర్వహణలోని ఆస్తుల లబ్దిదారులతో జాబితాను నిర్వహించాలి. ఈ వివరాలను సెబీకి కూడా సమర్పించాల్సి ఉంటుంది. -
ఎఫ్‌పీఐలకు సెబీ ఊరట
సాక్షి, ముంబై: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై కొత్త కేవైసీ నిబంధనలకు సంబంధించి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌పీఐలు)సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) భారీ ఊరట నిచ్చింది. ఈ మేరకు నిబంధనలను సరళతరం చేస్తూ మార్కెట్ రెగ్యులేటరీ సెబీ శుక్రవారం సర్క్యులర్ జారీ చేసింది. ఈ ప్రతిపాదనలను సెబీ బోర్డు ఇప్పటికే ఆమోదించింది. తాజాగా ఈ కెవైసి నిబంధనల మార్గదర్శకాలను జారీ చేసింది. ముఖ్యంగా కేసుల పరిష్కారానికి సవరణలతోపాటు, విదేశీ పోర్ట్ ఫోలియో పెట్టుబడిదారులకు నో యువర్ కస్టమర్ (కెవైసి) నిబంధనల్లో మార్పులు చేసింది. దీని ప్రకారం కమోడీటీ మార్కెట్లో( సెన్సిటివ్ కమోడిటివ్ మినహా) కూడా ట్రేడింగ్ అవకాశాన్ని ఎఫ్‌పీఐలకు లభించనుంది. అలాగే దేశీయ మార్కెట్లలో ఎఫ్‌పీఐ రిజిస్ట్రేషన్ కోసం సాధారణ దరఖాస్తు ఫారమ్ సరిపోనుంది. అంటే ఫండ్స్‌ను నిర్వహిస్తున్న ఆయా ఇన్వెస్టర్లపై ఎటువంటి నియంత్రణలూ వుండవు. ఆయా ఇన్వెస్టర్ల కెవైసీకి అదనపు డాక్యుమెంట్లను సమర్పించాల్సిన అవసరం లేదు -
పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్
బెంగళూరు : పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది ఆ కంపెనీ. నో యువర్ కస్టమర్(కేవైసీ) వివరాలు సమర్పించనప్పటికీ, పేటీఎం వాలెట్‌లోకి నగదును లోడ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. డిజిటల్ వాలెట్ యూజర్లు తప్పనిసరిగా కేవైసీ వివరాలు సమర్పించాలని ఆర్బీఐ ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. లేదంటే వాలెట్లు పనిచేయవని, వాలెట్స్‌లోకి కొత్తగా నగదును పంపించుకోవడం జరుగదని పేర్కొంది. అయితే ప్రస్తుతం పేటీఎం యూజర్లు కేవైసీ వివరాలు సమర్పించనప్పటికీ, గిఫ్ట్ ఓచర్ల ద్వారా వాలెట్‌లోకి నగదును లోడ్ చేసుకోవచ్చని ఆ కంపెనీ తెలిపింది. ఈ గిఫ్ట్ ఓచర్లను ఇతరులకు పంపించుకోవడం కానీ, బ్యాంకు అకౌంట్లలోకి ట్రాన్సఫర్ చేసుకోవడం కానీ జరుగదు. ఆర్బీఐ యూజర్లు తీసుకొచ్చిన ఈ నిబంధనలతో డిజిటల్ వాలెట్లు భారీ ఎత్తున్న తమ కస్టమర్లను కోల్పోతున్నారు. అమెజాన్ ఇండియా తన ఈ-వాలెట్ యూజర్ బేస్‌లో 30 శాతం క్షీణతను నమోదుచేసింది. పేటీఎం కూడా తన కోర్ ఈ-వాలెట్ బిజినెస్‌లను ఇతర వ్యాపారాలకు విస్తరిస్తోంది. మరోవైపు తగ్గిపోతున్న యూజర్ బేస్‌ను కాపాడుకోవడానికి ఈ గిఫ్ట్ ఓచర్లను కూడా పేటీఎం జారీచేస్తోంది. ఈ గిఫ్ట్ ఓచర్లను గ్రే ఏరియాలో ఆపరేటింగ్ చేస్తున్నట్టు కూడా ఓ ఇండస్ట్రి ఎగ్జిక్యూటివ్ చెప్పారు. -
మీ పేటీఎం, మొబిక్విక్ వాలెట్లు పనిచేయవు..
బెంగళూరు : మీ మొబైల్ వాలెట్‌లోకి కొత్తగా ఫండ్స్‌ను పంపించాలనుకుంటున్నారా? అయితే నేటి నుంచి అది సాధ్యపడదట. ఫుల్ కేవైసీ(నో యువర్ కస్టమర్) విధివిధానాలను పూర్తి చేసిన కస్టమర్లకు మాత్రమే ఇది సాధ్యపడుతుందట. ఒకవేళ కేవైసీ వివరాలను సమర్పించిన కస్టమర్లు ఇక తమ వాలెట్లలోకి కొత్తగా ఫండ్స్‌ను పంపించుకోవడం జరుగదు. ఇది డిజిటల్ పేమెంట్స్ ఇండస్ట్రీకి గట్టి ఎదురుదెబ్బగా వెల్లడవుతోంది. నేటి నుంచి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా విధించిన కేవైసీ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దీంతో వాలెట్ యూజర్లు తమ లావాదేవీలపై ఆర్బీఐ విధించే పలు నిబంధనలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఫిబ్రవరి 28 వరకు వాలెట్ యూజర్ల నుంచి కేవైసీ వివరాలను పొందాలని డిజిటల్ వాలెట్ కంపెనీలకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఆదేశించింది. ఈ గడువును మరింత పొడిగించాలని డిజిటల్ వాలెట్ కంపెనీలు కోరాయి. కానీ కంపెనీల ప్రతిపాదనను ఆర్బీఐ తోసిపుచ్చింది. మరోసారి తుది గడువును పొడిగించేది లేదంటూ తేల్చిచెప్పింది. ప్రస్తుతం నిన్నటితో ఆ గడువు ముగియడంతో, కేవైసీ వివరాలను సమర్పించని కస్టమర్లను వాలెట్ ప్రొవైడర్లు కోల్పోతున్నారు. ఫుల్ కేవైసీ వివరాలు లేకుండా 10 వేల రూపాయల వరకు ఆపరేట్ చేసుకునేలా డిజిటల్ వాలెట్లకు అనుమతి ఇవ్వాలంటూ ఇండస్ట్రి బాడీ పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, రిజర్వు బ్యాంకును కోరుతోంది. కానీ ప్రతి పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ కేవైసీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిదేనంటూ ఆర్బీఐ స్పష్టం చేసింది. దీన్ని బ్యాంకింగ్‌ఎకో సిస్టమ్‌కు కూడా విస్తరించనున్నట్టు పేర్కొంది. ఈ నిబంధనలతో వచ్చే కొన్ని నెలల్లో కస్టమర్ల కూడా భారీగా ప్రభావితం కానున్నారని ది మొబైల్ వాలెట్ ఫౌండర్ వినయ్ కలాంత్రి అన్నారు. కానీ దీర్ఘకాలీన ఇది మంచి ఫలితాలనే ఇస్తుందని చెప్పారు. క్వాలిటీ కస్టమర్లను వాలెట్లు పొందుతాయన్నారు. ఆర్బీఐ నిబంధనలు ప్రకారం, ప్రభుత్వం ఆమోదించిన డాక్యుమెంట్లను వాలెట్ ప్రొవైడర్లకు సమర్పించిన కస్టమర్లు, తాజాగా ఫండ్స్‌ను తమ వాలెట్లలోకి వేసుకోవడం కుదరదు. అంతేకాక ఇతర వాలెట్లకు ఫండ్స్ ట్రాన్సఫర్ చేయలేరు. అయితే వాలెట్లో ఉన్న ఫండ్స్‌ను కొనుగోళ్లకు మాత్రమే ఉపయోగించుకోవచ్చు. వాలెట్ నగదును కోల్పోకుండా.. వాటిని బ్యాంకులకు ట్రాన్సఫర్ చేసుకునేలా కూడా ఆర్బీఐ వీలు కల్పించింది. ప్రీపెయిడ్ వాలెట్ సర్వీసులను వినియోగిస్తున్న 90 శాతం కస్టమర్లు ఇప్పటి వరకు కేవైసీ వివరాలను వాలెట్ ప్రొవైడర్లకు సమర్పించలేదు. దీంతో నేటి నుంచి వీరిపై వాలెట్ల వాడక నిషేధం పడబోతుంది. ఈ చర్యలతో వాలెట్ ప్రొవైడర్లు భారీగా కస్టమర్లు కోల్పోనున్నారు. -
రెండు బ్యాంకులకు లక్షల్లో జరిమానా
నో యువర్ కస్టమర్ (కేవైసీ) నిబంధనలను ఉల్లంఘించినందుకు రిజర్వు బ్యాంకు రెండు బ్యాంకులకు లక్షల్లో జరిమానా విధించింది. ఐసీఐసీఐ బ్యాంకుకు రూ. 50 లక్షలు, బ్యాంక్ ఆఫ్ బరోడాకు రూ. 25 లక్షల వంతున జరిమానా విధించింది. గతంలో కూడా ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని పలు సందర్భాల్లో రిజర్వు బ్యాంకు హెచ్చరించింది. అయినా.. కొన్ని బ్యాంకులు దాన్ని పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ఈ రెండు బ్యాంకులకు జరిమానాలు వడ్డించింది.