
ముంబై: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు చెందిన ఆన్‌లైన్ పేమెంట్స్ ప్రాసెసింగ్ సర్వీసుల్లో ఉన్న అమెజాన్ పే ఇండియాకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రూ.3.06 కోట్ల జరిమానా విధించింది.
ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాలు, నో యువర్ కస్టమర్ (కేవైసీ) అంశాల్లో కొన్ని నిబంధనలను పాటించకపోవడంతో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూ పాలని సూచిస్తూ గతంలోనే కంపెనీకి ఆర్‌బీఐ నోటీసు జారీ చేసింది. అమెజాన్ పే ప్రతిస్పందనను పరిశీలించిన అనంతరం పెనాల్టీ విధించింది.
Comments
Please login to add a commentAdd a comment