సాక్షి,ముంబై: ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ చెల్లింపుల సంస్థ అమెజాన్ భారీ షాక్ తగిలింది. రెగ్యులేటరీ నిబంధనల ఉల్లంఘలన కింద ఆర్‌బీఐ అమెజాన్ పే (ఇండియా)పై రూ. 3.06 కోట్ల జరిమానా విధించింది. గతంలో ఆర్‌బీఐ జారీ చేసిన నోటీసులకు అమెజాన్‌పే స్పందనపై సంతృప్తి చెందని ఆర్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది.
అమెజాన్ పే (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (పిపిఐలు), నో యువర్ కస్టమర్ (కెవైసి) డైరెక్షన్‌కు సంబంధించిన కొన్ని నిబంధనలను పాటించలేని ఆర్‌బీఐ తేల్చింది. దీనికి సంబంధించిన రూ. 3.06 (రూ.3,06,66,000) కోట్ల పెనాల్టీ విధించినట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆదేశాలను పాటించనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలన్న ఆర్బీఐ నోటీసులకు సంస్థ స్పందనను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, నిబంధనలను పాటించలేదన్నఅభియోగం రుజువైన కారణంగా ఈ పెనాల్టీ విధించినట్టు తెలిపింది.
(చదవండి : 2024 మారుతి డిజైర్: స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్‌తో, అతి తక్కువ ధరలో! )
Comments
Please login to add a commentAdd a comment