డియర్ ఎస్‌బీఐ కష్టమర్ మీ అకౌంట్ సస్పెండ్ అయ్యింది. పదినిమిషాల్లో కేవైసీ అప్ డేట్ చేయండి లేదంటే మీ అకౌంట్ శాశ్వతంగా బ్లాక్ అవుతుందంటూ ఓ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ మెసేజ్ పై ఎస్‌బీఐ స్పందించింది. గత కొంత కాలంగా కొంతమంది కేటుగాళ్లు కేవైసీ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. వెరిఫికేషన్ పేరుతో ప్రమాదకర లింక్స్‌ను షేర్ చేస్తున‍్నారు. పొరపాటున ఆ లింక్స్‌ను క్లిక్ చేస్తే ఎస్‌బీఐ అకౌంట్లలో ఉన్న మనీ మాయమవుతుంది. ఈ నేపథ్యంలో సైబర్ నేరాల్ని అరికట‍్టేలా ఎస్‌బీఐ తన వియోగదారుల్ని అప్రమత్తం చేస్తోంది. ఇందులో భాగంగా మరోసారి ఎస్బీఐ తన కష్టమర్లకు హెచ‍్చరికలు జారీ చేసింది.
ఎస్‌బీఐ ఫ్రీ గిఫ్ట్స్
KYC fraud is real, and it has proliferated across the country. The fraudster sends a text message pretending to be a bank/company representative to get your personal details. Report such cybercrimes here: https://t.co/3Dh42iwLvh#StateBankOfIndia #CyberCrime #StaySafeStayVigilant pic.twitter.com/eVVFAnMgTN
— State Bank of India (@TheOfficialSBI) July 12, 2021
చైనాకు చెందిన సైబర్ నేరస్తులు ఎస్‌బీఐ అఫీషియల్ వెబ్‌సైట్ ను పోలిఉండే ఫేక్ ఎస్‌బీఐ వెబ్‌సైట్‌ను క్రియేట్ చేసి ఓ సర్వే లింక్ ను షేర్ చేస్తున్నారు. ఆ సర్వే పూర్తి చేస్తే ఎస్‌బీఐ రూ.50లక్షల ఫ్రీ గిఫ్ట్స్ గెలుచుకోవచ్చన్నది ఆ మెసేజ్ సారాంశం. తాజాగా ఆ మెసేజ్ పై ఎస్‌బీఐ స్పందించింది. కేవైసీ అప్‌డేట్ పేరుతో మీ ఫోన్ నెంబర్ కు వచ్చే మెసేజ్ లపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కేవైసీ అప్ డేట్ కోసం బ్యాంకులు ఎలాంటి లింక్స్ పంపవని చెబుతూనే..మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్, డెబిట్ కార్డ్ నెంబర్, పిన్, ఓటీపీ లాంటి విషయాల్ని ఎవరికి షేర్ చేయోద్దని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment