Bank account holders
-
బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ గుడ్ న్యూస్!
ముంబై: ఆన్లైన్లో కేవైసీ (ఖాతాదారుల వివరాలు) వెరిఫికేషన్ పూర్తి చేసే బ్యాంకు కస్టమర్లు వార్షికంగా తమ వ్యక్తిగత వివరాల్లో మార్పులేమైనా ఉంటే వాటిని కూడా ఆన్లైన్లో అప్డేట్ చేయొచ్చని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. కేవైసీ ధృవీకరణ లేదా అప్డేషన్ కోసం కస్టమర్లు కచ్చితంగా శాఖకు రావాలంటూ బ్యాంకులు డిమాండ్ చేయజాలవని, అలాంటి నిబంధనేదీ పెట్టలేదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. అలాగే సెంట్రల్–కేవైసీ (సీ–కేవైసీ) పోర్టల్‌లో తమ వివరాలను అప్లోడ్ చేసిన కస్టమర్లను కూడా బ్యాంకులు.. వెరిఫికేషన్ కోసం అడగనక్కర్లేదని తెలిపారు. అలాంటి సందర్భాల్లో కస్టమర్లు తమ కేవైసీ వివరాలను సీ–కేవైసీ పోర్టల్ నుంచి యాక్సెస్ చేసుకోవాలంటూ అధికారిక ఈమెయిల్ ఐడీ లేదా మొబైల్ నంబరు ద్వారా బ్యాంకుకు మెయిల్ లేదా మెసేజీ పంపించవచ్చని దాస్ పేర్కొన్నారు. -
బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త అందించిన ఆర్బీఐ..!
బ్యాంకు ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా శుభవార్తను అందించింది. ఇంటర్నెట్ సౌకర్యం లేని ఫీచర్స్ ఫోన్ల నుంచి యూపీఐ సేవలను పొందే వెసులబాటును సదరు ఖాతాదారులకు ఆర్బీఐ తీసుకొచ్చింది. దాంతో పాటుగా డిజిటల్ పేమెంట్లకు సంబంధించి కొత్త హెల్స్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. దీంతో బ్యాంకింగ్ సేవలను మరింత సులభంగా పొందవచ్చును. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తాజాగా ఫీచర్ ఫోన్ కోసం యూపీఐ సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సర్వీసును యూపీఐ123పే(UPI123Pay) పేరుతో లాంచ్ చేశారు. డిజిటల్ పేమెంట్లకు సంబంధించి 24 గంటల హెల్ప్ లైన్ డిజిసాథి(DigiSaathi) సర్వీసును ఆవిష్కరించారు.14431 లేదా 1800 891 3333 నెంబర్ల ద్వారా డిజిటల్ పేమెంట్లకు సంబంధించిన సేవలను పొందవచ్చును. ఈ సర్వీసు 40 కోట్ల భారతీయులకు ఉపయోగపడుతుందని ఆర్బీఐ పేర్కొంది. గ్రామీణ ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ ఈ సేవలను లాంచ్ చేసింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా యూపీఐ సేవల వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉందని ఆర్బీఐ అభిప్రాయపడింది. ఈ సేవలు డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పునకు సాక్షంగా నిలుస్తుందని శక్తికాంత్ దాస్ తెలిపారు. ఇవి మాత్రమే అందుబాటులో..! యూపీఐ123పే ద్వారా సదరు ఫీచర్ ఫోన్ బ్యాంకు ఖాతాదారులు దాదాపు అన్ని రకాల యూపీఐ సేవలు పొందవచ్చును. కాగా స్కాన్ అండ్ పే సర్వీసులు మాత్రం అందుబాటులో ఉండవు. ఆయా లావాదేవీలను ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా చేయవచ్చును. ఈ ఫీచర్‌ను పొందడానికి సదరు బ్యాంకు ఖాతాదారులు వారి బ్యాంక్ అకౌంట్‌ను ఫీచర్ ఫోన్‌తో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. నగదు ట్రాన్స్ఫర్ ఇలా చేయండి ఫీచర్ ఫోన్లో *99# అని టైప్ చేసి డయల్ చేయాలి. ఇప్పుడుMy Profile', 'Send Money', 'Receive Money', 'Pending Requests', 'Check Balance', 'UPI PIN', 'Transactions' అనే కొన్ని ఆప్షన్స్ వస్తాయి. డబ్బులు పంపాలంటే డయల్ ప్యాడ్‌లో 1 ప్రెస్ చేసి Send Money ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు మీరు మీరు ఫోన్ నెంబర్, యూపీఐ ఐడీ, అకౌంట్ నెంబర్ నుంచి డబ్బులు పంపే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. ఈ పేమెంట్స్ మెథడ్‌లో ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఫోన్ నెంబర్ సెలెక్ట్ చేస్తే మీరు ఎవరికి డబ్బులు పంపాలో వారి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు యుపీఐని ఎంచుకున్నట్లయితే, అప్పుడు మీరు యుపీఐ ఐడీని నమోదు చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే 11 అంకెల ఐఎఫ్ఎస్సీ కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీరు ఎంత మొత్తం పంపాలనుకుంటున్నారో టైప్ చేయాలి. ఆ తర్వాత మీ యూపీఐ పిన్ నమోదు చేసి send పైన క్లిక్ చేయాలి. ఇలా చేస్తే మీ అకౌంట్ నుంచి అవతలి వారి అకౌంట్లోకి డబ్బులు వెళ్తాయి. గమనిక: ఈ ఫీచర్‌ను పొందాలంటే సదరు మొబైల్ నంబర్‌తో బ్యాంకు ఖాతా రిజస్టరై ఉండాలి. చదవండి: పోస్టల్ ఖాతాదారులకు అలర్ట్.. ఆ పథకాలను ఖాతాతో లింకు చేశారా? -
‘సర్.. నాకు ఐదు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి! మంచిదేనా?’
Banking Tips: ఇవాళ రేపు అవసరానికో బ్యాంక్ ఖాతా తెరవాల్సి వస్తోంది. అలాగే ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉంటున్నవాళ్లు చాలామందే ఉంటున్నారు. అయితే ఇలా ఎక్కువగా కలిగి ఉండడం వల్ల లాభం కంటే.. ఇబ్బందులే ఎక్కువ ఎదుర్కోవాల్సి వస్తుంది. పైగా ఖాతాదారుడికి తెలియకుండానే డబ్బును పొగొట్టుకోవాల్సి వస్తుంది. అందుకే అవసరం లేని అకౌంట్లను క్లోజ్ చేయడం ఉత్తమమని సూచిస్తున్నారు బ్యాంకింగ్ నిపుణులు. ‘మినిమమ్’ ట్రబుల్ ఎక్కువ ఖాతాలు ఉంటే.. వాటిల్లో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయాలి. అన్ని ఖాతాల్లో ఎంతో కొంత డబ్బును డిపాజిట్ చేయాలి. ప్రధాన బ్యాంకుల్లో అకౌంట్లలో(జీరో బ్యాలెన్స్ అకౌంట్లు మినహాయించి) మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ ఛార్జీలు వెయ్యి, మూడు, ఐదు వేలు, పది వేలు ఇలా ఉంటోంది. ఉదాహరణకు.. ఐదు బ్యాంకుల్లో ఖాతాలు ఉంటే.. పది, పాతిక, యాభై.. ఇలా వేల రూపాయల్లో డబ్బును ఖాతాల్లో ‘మినిమమ్ బ్యాలెన్స్’ రూపంలో ఉంచాల్సి వస్తుంది. ఇదికాకుండా ఇతర ఛార్జీల వసూలు ఉంటుంది. ఇలా ఎలా చూసినా ఇబ్బందే!. శాలరీ అకౌంట్లే ఎక్కువ! బ్యాంకులు స్టూడెంట్ అకౌంట్లు, శాలరీ అకౌంట్లుగా ‘జీరో బ్యాలెన్స్’ అకౌంట్లతో టార్గెట్లను పూర్తి చేసుకుంటాయి. ముఖ్యంగా ఉద్యోగులు కంపెనీలు మారినప్పుడు.. మరో అకౌంట్‌కు ఎక్కువగా మారిపోవాల్సి వస్తోంది. అలాంటి సందర్భాల్లో బద్ధకాన్ని వదిలి బ్యాంకులకు వెళ్లి పాత బ్యాంక్ ఖాతాను(అవసరం లేకుంటే) మూసివేయడమే మంచిది. ఎందుకంటే శాలరీ అకౌంట్లు, జీరో బ్యాలెన్స్ అకౌంట్లో చాలాకాలం డిపాజిట్ చేయకుండా ఉంటే.. సాధారణ సేవింగ్స్ అకౌంట్‌కు మారిపోతాయి. అప్పుడు కచ్చితంగా మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మెయింటెన్ చేయకపోతే.. సర్ ఛార్జీలు పడుతూనే పోతుంటాయి. ఒకానొక దశకు వచ్చేసరికి అవి వేల రూపాయల్లోకి కూడా కూడా చేరుకోవచ్చు!!. ఐటీ రిటర్న్స్ టైంలో.. కొన్ని అకౌంట్లు సంవత్సరాల తరబడి అలాగే ఉండిపోతాయి. బ్యాంకులు వాటిని మూసేయవు. కాకపోతే ఎక్కువ కాలం ట్రాన్జాక్షన్స్ జరగని అకౌంట్లను సాధారణంగా కొన్ని బ్యాంకులు డీయాక్టివేట్ చేస్తాయి. ఒకవేళ ఆ అకౌంట్లను తిరిగి ఉపయోగించుకోవాలనుకుంటే(యాక్టివేషన్ కోసం) రాతపూర్వకంగా రిక్వెస్ట్ లెటర్‌తో బ్యాంక్‌ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. పైగా సేవింగ్స్ ఖాతాల్లో(అవసరం లేనివి, పెద్దగా ఉపయోగించని అకౌంట్లు) మినిమమ్ బ్యాలెన్స్‌తో ఎలాంటి రాబడీ రాకపోగా, ఆదాయ పన్ను రిటర్నుల సమయంలో అన్ని ఖాతాల వివరాలు అందించాల్సి ఉంటుంది. అలాగే వాటి నుంచి డబ్బు సర్‌ఛార్జీల రూపంలో కట్ అయినప్పుడల్లా.. మరింత డిపాజిట్ జమ చేయాల్సి ఉంటుంది. ఇక కార్డుల మెయింటెనెన్స్, ఏటీఎం ఛార్జీలు, మొబైల్ అలర్టు అంటూ పడే ఛార్జీల సంగతి సరేసరి!. ఇలా చేస్తే బెటర్ ఒక వ్యక్తికి సగటున శాలరీ అకౌంట్, అవసరాలకు తగ్గట్లు పర్మినెంట్ అకౌంట్లు, ఉమ్మడి ఖాతాలు ఉంటే చాలు. ఉద్యోగం మారినప్పుడు వేతన ఖాతాలు మారుతుంటాయి. వీలుంటే ఉద్యోగం మారినా.. పర్మినెంట్ అకౌంట్‌నే శాలరీ అకౌంట్‌గా మార్చేసుకునే ప్రయత్నం చేయాలి. కొత్త ఖాతాకి వెళ్లినప్పుడు మాత్రం.. అవసరం లేని పాత ఖాతాల్ని మూసేయడం మంచిది. ముఖ్యంగా పీఎఫ్ అకౌంట్ల విషయంలోనూ పాత అకౌంట్లను క్లోజ్ చేసి.. కొత్త అకౌంట్లకు షిఫ్ట్ చేయడం వల్ల ఒక అదనపు అకౌంట్‌ను మెయింటెన్ చేయాల్సిన బాధ తప్పుతుంది. ఇక ఇన్వెస్ట్మెంట్ల కోసం ప్రత్యేకంగా ఖాతాలు తీసుకోకుండా.. పర్మినెంట్ అకౌంట్‌నే ఉపయోగించాలి. బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీలు వస్తాయన్నది తెలిసిందే. కానీ, ఖాతాదారుడు అన్ని ఖాతాల్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండలేడుగా!. కాబట్టే.. అవసరాలకు తగ్గట్లు రెండు లేదా మూడు అకౌంట్ల కంటే ఎక్కువ కలిగి ఉండకపోవడమే మంచిదని ఆర్థిక సలహాదారులు చెప్తున్నారు. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేప్పుడు సింగిల్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉంటే పని తేలిక అవుతుంది. వీటికి తోడు బ్యాంక్ ట్రాన్జాక్షన్స్ను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడం, పాస్ వర్డ్‌లను, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వ్యవహారాలను తేలికగా గుర్తుపెట్టుకోవడం ఈజీగా ఉంటుంది. -
ఎస్బీఐ ఖాతాదారులకు హెచ్చరిక..! వాటితో జాగ్రత్త..!
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులను హెచ్చరించింది. ఎస్బీఐకు చెందిన కస్టమర్ కేర్ నంబర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఖాతాదారులకు వెల్లడించింది. తప్పుడు కస్టమర్ కేర్ నంబర్లతో మోసాల బారిన పడే ప్రమాదం ఉందని ఖాతాదారులను ఎస్బీఐ పేర్కొంది. చదవండి: రిలయన్స్‌తో డీల్ క్యాన్సల్..! భారత్‌ను వదులుకునే ప్రసక్తే లేదు...! సైబర్ నేరస్తులు కొత్త పుంతలు తొక్కుతూ..కస్టమర్ కేర్ నంబర్ల సహాయంతో ఖాతాదారుల నుంచి డబ్బులను సేకరిస్తోన్నట్లు ఎస్బీఐ గుర్తించింది. ఖాతాదారుల వ్యక్తిగత డేటాను సైబర్ నేరస్తుల చేతిలో పెడితే భారీగా ప్రమాదం అవకాశం ఉందని ఎస్బీఐ పేర్కొంది. కాగా ఎస్బీఐ తాజాగా ఇలాంటి వాటిపై అవగాహన కల్పిస్తూ ఓ వీడియోను తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఎస్బీఐ తన ట్విట్లో...‘మోసపూరిత కస్టమర్ కేర్ నంబర్లతో జాగ్రత్తగా ఉండండి. సరైన కస్టమర్ కేర్ నంబరు కోసం దయచేసి ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే సంప్రదించండి. మీ ఖాతాకు సంబంధించిన వివరాలను ఎవరితో షేర్ చేసుకోవద్దునని’ పేర్కొంది. Beware of fraudulent customer care numbers. Please refer to the official website of SBI for correct customer care numbers. Refrain from sharing confidential banking information with anyone.#CyberSafety #CyberCrime #Fraud #BankSafe #SafeWithSBI pic.twitter.com/70Sw7bIuvo — State Bank of India (@TheOfficialSBI) November 21, 2021 చదవండి: అరె డాల్ఫిన్‌లా ఉందే, వరల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ రికార్డ్లను తుడిచి పెట్టింది -
కౌలు రైతుకు పెద్ద కష్టం..పంట డబ్బూ పోయే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కౌలురైతులకు మరో పెద్ద కష్టం వచ్చిపడింది. ధాన్యం కొనుగోలు డబ్బులను.. సదరు భూమి యజమాని బ్యాంకు ఖాతాల్లోనే వేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కొత్త సమస్య మొదలైంది. ఇందుకోసం రైతులు కౌలుకు తీసుకున్న భూమి యజమానుల ఆధార్, బ్యాంకు ఖాతా నంబర్లు కావాలనడం, ధాన్యం డబ్బులను ఆ ఖాతాల్లోనే జమ చేస్తుండటంతో కౌలు రైతులు ఆందోళన చెందుతున్నారు. అంతేగాకుండా.. సదరు భూయజమానికి చెందిన పాస్‌బుక్‌లో ఎంత మేర భూమి ఉందో.. దానికి తగినంత మాత్రమే ధాన్యం కొంటామని చెప్తుండటంతో దిగాలు పడుతున్నారు. తాము ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు ఈ కొత్త నిబంధనలు ఏమిటని మండిపడుతున్నారు. ధాన్యం కొనుగోలు భారం తగ్గించుకునేందుకే కొత్త రూల్స్ పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. అయితే.. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలను అడ్డుకునేందుకే ఈ కొత్త విధానం అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం చెప్తోంది. రైతు బంధుతో లింక్ అయిన ఖాతాల్లోకే.. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ భూములన్నింటికీ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమలు చేస్తోంది. ఏటా రెండుసార్లు ఎకరానికి రూ.5 వేల చొప్పున సదరు భూయజమానుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తోంది. ఇప్పుడు పంట కొనుగోళ్లు, ధాన్యం డబ్బులను జమ చేయడానికి అవే వివరాలను ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో.. జిల్లా కలెక్టర్లు పౌరసరఫరాల శాఖ అధికారులు/సిబ్బందిని అప్రమత్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభమైన సుమారు 4 వేల కొనుగోలు కేంద్రాల వద్ద లాప్టాప్/ట్యాబ్లెట్లతో పౌరసరఫరాల శాఖ తరఫున ఒక్కో వ్యక్తిని నియమించారు. ఆ వ్యక్తి ధాన్యం విక్రయించేందుకు వచ్చిన రైతుల నుంచి ఆధార్ నంబర్ తీసుకుని ఆన్లైన్లో నమోదు చేయగానే సదరు రైతుకున్న భూమి వివరాలు కనిపిస్తాయి. ఆ రైతు పేరు మీద ఎంత భూమి ఉంది, ఏమేం పంటలు వేశారు, రైతుబంధుకు లింక్ అయిన బ్యాంక్ ఖాతా తదితర వివరాలు వస్తాయి. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు.. ఆ వివరాలు అన్నీ సరి చూసుకున్నాకే వడ్లను తూకానికి వేస్తున్నారు. వివరాల్లో ఎక్కడ తేడా వచ్చినా కొనడం లేదు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన సొమ్మును రైతుబంధు జమవుతున్న బ్యాంకు ఖతాల్లోనే జమ చేయాలని పౌరసరఫరాల శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ శాఖ డేటాతో అనుసంధానించి.. రైతులకు ఉన్న భూమి విస్తీర్ణం, వేసిన పంట, రైతుబంధు కింద రైతుకు అందుతున్న సొమ్ము వివరాలన్నీ మండలాల వారీగా వ్యవసాయ శాఖ అధికారుల వద్ద ఉంటాయి. వానాకాలం, యాసంగి పంటలు వేసిన తర్వాత మండలాల ఏఈవోలు.. రైతుల భూమి విస్తీర్ణం, వేసిన పంటల వివరాలను సేకరించి ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఇప్పుడు ఆ డేటాను పౌర సరఫరాల శాఖ తరఫున నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోళ్లకు అనుసంధానం చేశారు. దీనివల్ల కొనుగోలు కేంద్రంలో రైతుల ఆధార్ నంబర్ నమోదు చేయగానే.. వారికి ఉన్న భూమి, వారు వేసిన పంటల వివరాలు కనిపిస్తున్నాయి. అయితే రైతుల ఆధార్ నంబర్ నమోదు చేసినప్పుడు దానికి లింక్ అయి ఉన్న రైతుల ఫోన్‌కు ఓటీపీ (వన్‌టైం పాస్వర్డ్) వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేశాకే.. వివరాలన్నీ కనిపిస్తాయి. భూమికి తగినంతే కొనుగోళ్లు.. రైతులకు ఎంత భూమి ఉంటే.. దానికి అనుగుణంగానే ధాన్యం కొనుగోలు చేయాలని పౌరసరఫరాల శాఖ ఆదేశాలు ఇచ్చింది. గరిష్టంగా ఎకరానికి 36 క్వింటాళ్ల ధాన్యం వస్తుందని లెక్కలు వేసింది. రైతులు తెచ్చిన పట్టాదారు పాస్‌బుక్‌లో ఉన్న భూమికి, కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యానికి లెక్క కుదిరితేనే సేకరిస్తోంది. దీనివల్ల కౌలు రైతులు తమకున్న కొద్దిపాటి భూమి పాస్‌బుక్ ఆధారంగా.. కౌలు పంట అంతా విక్రయించుకునే పరిస్థితి ఉండదు. భూయజమానులను బతిమాలి పాస్‌బుక్, ఇతర వివరాలు తెచ్చుకోవాల్సిందే. పంట డబ్బులు వారి ఖాతాల్లో జమ అయ్యాక వెళ్లి తీసుకోవాల్సిందే. ఆధార్ ఫోన్ నంబర్లు, ఓటీపీల సమస్యతో.. చాలా మంది రైతులు తాము ఆధార్ కార్డు తీసుకున్నప్పుడు.. తమ పిల్లల ఫోన్ నంబర్లు, తెలిసిన వారి నంబర్లను ఇచ్చారు. గ్రామాల్లో అయితే మీసేవ సెంటర్ల ఓనర్ల నంబర్లు కూడా ఇచ్చి నమోదు చేసుకున్నారు. వీటిలో చాలా వరకు ఫోన్ నంబర్లు మారిపోవడమో, ఏ నంబర్ ఇచ్చామన్నది మర్చిపోవడమో జరిగింది. ఇప్పుడా రైతులంతా ఓటీపీ ఏ నంబర్‌కు వచ్చిందో తెలియక.. ధాన్యం అమ్ముకోలేకపోతున్నారు. విరాసత్, మ్యుటేషన్ భూములు.. ధరణి సమస్యలు ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత క్రయవిక్రయాలు జరిగిన వ్యవసాయ భూముల వివరాలు చాలావరకు వ్యవసాయ శాఖ రికార్డుల్లో నమోదుకాలేదు. రైతుబంధుకు దరఖాస్తు చేసుకునే వీలు లేకపోవడంతోపాటు ఇతర కారణాల వల్ల మ్యూటేషన్, విరాసత్ అయిన భూములు వ్యవసాయ శాఖ రికార్డుల్లో లేవు. సదరు రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద తమ ఆధార్ నంబర్ ఇస్తే.. కేవలం రెవెన్యూ శాఖ పరిధిలో ఉన్న భూముల వివరాలు మాత్రమే కనిపిస్తున్నాయి. వ్యవసాయశాఖ పరిధిలోని డేటా (వేసిన పంటలు, రైతుబంధు ఖాతా నంబర్ వంటివి) చూపించడం లేదు. అలాగే ధరణి పోర్టల్‌లో అప్డేట్ కాని వ్యవసాయ భూములకు కూడా ఇదే సమస్య తలెత్తింది. ఈ రైతులెవరూ కూడా తమ ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితి లేకుండా పోతోంది. కౌలు రైతులనే అంశమే లెక్కలోకి రాదు పంట పండించిన రైతులకు ధాన్యం సొమ్ము చేరేలా చర్యలు తీసుకున్నాం. కౌలు రైతులు అనే అంశమే మా లెక్కలోకి రాదు. అందుకే రైతు ఖాతాలోకే ధాన్యం సొమ్మును జమ చేస్తున్నాం. అలాగే రైతుకు ఉన్న భూమికి తగిన మేర పంటను మాత్రమే కొంటాం. రెండెకరాల పొలంలో 200 క్వింటాళ్లు దిగుబడి రాదు కదా. ఎకరానికి గరిష్టంగా 36 క్వింటాళ్లుగా నిర్ణయించాం. పీడీఎస్ బియ్యాన్ని కూడా కస్టమ్ మిల్లింగ్ రైస్‌గా చూపించే పరిస్థితి ఉండకూడదనే కఠినంగా వ్యవహరిస్తున్నాం. విరాసత్, మ్యుటేషన్ అయిన భూముల వివరాలను వ్యవసాయ శాఖ వద్ద నమోదు చేయించుకుంటే ధాన్యం కొనుగోలు చేస్తాం. గంగుల కమలాకర్, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈయన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లికి చెందిన కౌలు రైతు తంగెళ్ల శ్రీనివాస్. రెండెకరాలు కౌలుకు తీసుకుని పండించిన ధాన్యాన్ని 15 రోజుల కిందే కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాడు. రెండు రోజుల క్రితమే కొనుగోళ్లు మొదలవడంతో కాంటా వేసేందుకు సిద్ధమయ్యారు. భూయజమాని పాస్‌బుక్, ఆధార్ కార్డు జిరాక్స్‌లు ఇచ్చిన శ్రీనివాస్.. పంట సొమ్మును జమచేసేందుకు తన బ్యాంకు ఖాతా జిరాక్స్ కాపీ ఇచ్చాడు. కొనుగోలు కేంద్రంలో ఉన్న ఓ వ్యక్తి ఆ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయగా.. వ్యవసాయ శాఖ వద్ద ఉన్న డేటాలోని బ్యాంకు ఖాతా నంబర్‌తో సరిపోలలేదు. దానితో వడ్లు కాంటా వేసేందుకు నిరాకరించారు. భూయజమాని బ్యాంకు ఖాతా నంబర్‌ను నమోదు చేశాకే.. కొనుగోలుకు ఓకే అయింది. ఇప్పుడు పంట డబ్బులు భూయజమాని ఖాతాలోనే పడనున్నాయి. వారి నుంచి శ్రీనివాస్ డబ్బులు తీసుకోవాల్సి రానుంది. -తంగెళ్ల శ్రీనివాస్) ఎక్కడికని పోవాలె..? రాష్ట్రంలో వ్యవసాయం చేస్తున్నవారిలో 20శాతం నుంచి 30 శాతం వరకు కౌలు రైతులే. ఎక్కడో హైదరాబాద్‌లోనో, ఇతర జిల్లాలు, దూర ప్రాంతాల్లోనో ఉన్నవారి భూములను స్థానికంగా ఉన్నవారు కౌలుకు తీసుకుని పంటలు వేస్తున్నారు. ఇప్పుడు కౌలు రైతులు ఎక్కడో ఉన్న భూయజమానుల నుంచి ఆధార్, పట్టా పాస్‌బుక్, ఇతర వివరాలు తీసుకోవడం.. వారి ఫోన్‌కు వచ్చిన ఓటీపీ అడిగి తెలుసుకుని నమోదు చేయించడం తప్పడం లేదు. ఇంతా చేసి ధాన్యం డబ్బులు భూయజమాని బ్యాంకు ఖాతాలో పడితే.. మళ్లీవారి వెంటపడి తీసుకోవాల్సిన పరిస్థితి. దీనితో కౌలు రైతులు దిగాలు పడుతున్నారు. అగ్గువకు అమ్ముకోవాల్సిన దుస్థితి కౌలు రైతులు అయితే తాము కౌలుకు తీసుకున్న భూయజమానుల నుంచి ఆధార్, ఇతర వివరాలు తీసుకుని ఇవ్వాల్సి వస్తోంది. పంట డబ్బులు కూడా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతాయి. భూయజమానులు వివరాలు ఇవ్వకున్నా, ఆ వివరాల్లో ఏవైనా తేడాలు ఉన్నా.. కౌలు రైతులకు ఇబ్బందే. చివరికి ఏ దిక్కూ లేక.. మిల్లర్లు, దళారుల వద్దకు వెళ్లి అగ్గువకో సగ్గువకో ధాన్యం అమ్ముకోక తప్పని పరిస్థితి. మిగతాది ఎవరు కొనాలి? పట్టాదారు పాస్‌బుక్‌లో ఉన్న భూమికి తగినట్టే ధాన్యాన్ని కొనాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. అయితే చాలా మంది కౌలు రైతులకు సొంతంగా కొద్ది గుంటలో, అర ఎకరం వరకో భూమి ఉంటుంది. వారు మరింత భూమిని కౌలుకు తీసుకుని పంట వేస్తుంటారు. ఇప్పుడు తమ పాస్‌బుక్‌లో ఉన్న కొద్దిపాటి భూమికి అనుగుణంగా కొంత పంటనే కొనుగోలు చేస్తే.. మిగతా ధాన్యాన్ని ఎక్కడ అమ్ముకోవాలని కౌలు రైతులు వాపోతున్నారు. మా పైసలు మాకియ్యరా? రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ఓబులాపూర్‌కు చెందిన ఏనుగుల రాజు ఓ కౌలు రైతు. 12 ఎకరాల్లో వేసిన పంట కోతకు రాగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యాడు. కానీ పంట కొనుగోళ్ల కోసం ఆధార్ అడుగుతుండటం, డబ్బులను భూ యజమాని ఖాతాలో వేస్తామంటుండటంతో ఆందోళనలో పడ్డాడు. అసలు తమ ధాన్యం కొంటరా లేదా, తమ వడ్ల పైసలు తమకు రావంటే ఎట్లాగని ప్రశ్నిస్తున్నాడు. -
బ్యాంకు ఖాతా తెరవకుండానే ఫిక్స్డ్ డిపాజిట్ చేయవచ్చు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గూగుల్ పే యూజర్లు బ్యాంక్ ఖాతా తెరవకుండానే ఫిక్స్డ్ డిపాజిట్స్ చేయవచ్చు. ఈ విధమైన సేవలను పరిశ్రమలో తొలిసారిగా తాము ఆఫర్ చేస్తున్నట్టు ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రకటించింది. ఒక ఏడాదిపాటు చేసే ఎఫ్డీలపై 6.35 శాతం వరకు వడ్డీ అందుకోవచ్చని వెల్లడించింది. రూ.5 లక్షల వరకు డిపాజిట్ గ్యారంటీ ఉంటుందని వివరించింది. వినియోగదార్లు గూగుల్ పే యాప్‌లో బిజినెస్ అండ్ బిల్స్ విభాగంలో ఈక్విటాస్ బ్యాంక్‌ను ఎంచుకోవాలి. డిపాజిట్ చేయదలచిన మొత్తం, కాల పరిమితి నిర్ధేశిస్తూ వ్యక్తిగత, కేవైసీ వివరాలను సమర్పించాలి. కాల పరిమితి ముగియక ముందే ఎఫ్డీని రద్దు చేసుకుంటే అదే రోజు వినియోగదారుకు చెందిన బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ అవుతుందని ఈక్విటాస్ వెల్లడిం చింది. చదవండి: పండుగ సెంటిమెంట్, కార్లను తెగకొనేస్తున్నారు -
ఎస్బీఐలో కేవైసీ స్కాం, రూ.50లక్షల ఫ్రీ గిఫ్ట్స్ గెలుచుకోవచ్చు
డియర్ ఎస్బీఐ కష్టమర్ మీ అకౌంట్ సస్పెండ్ అయ్యింది. పదినిమిషాల్లో కేవైసీ అప్ డేట్ చేయండి లేదంటే మీ అకౌంట్ శాశ్వతంగా బ్లాక్ అవుతుందంటూ ఓ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ మెసేజ్ పై ఎస్బీఐ స్పందించింది. గత కొంత కాలంగా కొంతమంది కేటుగాళ్లు కేవైసీ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. వెరిఫికేషన్ పేరుతో ప్రమాదకర లింక్స్‌ను షేర్ చేస్తున్నారు. పొరపాటున ఆ లింక్స్‌ను క్లిక్ చేస్తే ఎస్బీఐ అకౌంట్లలో ఉన్న మనీ మాయమవుతుంది. ఈ నేపథ్యంలో సైబర్ నేరాల్ని అరికట్టేలా ఎస్బీఐ తన వియోగదారుల్ని అప్రమత్తం చేస్తోంది. ఇందులో భాగంగా మరోసారి ఎస్బీఐ తన కష్టమర్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఎస్బీఐ ఫ్రీ గిఫ్ట్స్ KYC fraud is real, and it has proliferated across the country. The fraudster sends a text message pretending to be a bank/company representative to get your personal details. Report such cybercrimes here: https://t.co/3Dh42iwLvh#StateBankOfIndia #CyberCrime #StaySafeStayVigilant pic.twitter.com/eVVFAnMgTN — State Bank of India (@TheOfficialSBI) July 12, 2021 చైనాకు చెందిన సైబర్ నేరస్తులు ఎస్బీఐ అఫీషియల్ వెబ్సైట్ ను పోలిఉండే ఫేక్ ఎస్బీఐ వెబ్‌సైట్‌ను క్రియేట్ చేసి ఓ సర్వే లింక్ ను షేర్ చేస్తున్నారు. ఆ సర్వే పూర్తి చేస్తే ఎస్బీఐ రూ.50లక్షల ఫ్రీ గిఫ్ట్స్ గెలుచుకోవచ్చన్నది ఆ మెసేజ్ సారాంశం. తాజాగా ఆ మెసేజ్ పై ఎస్బీఐ స్పందించింది. కేవైసీ అప్డేట్ పేరుతో మీ ఫోన్ నెంబర్ కు వచ్చే మెసేజ్ లపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కేవైసీ అప్ డేట్ కోసం బ్యాంకులు ఎలాంటి లింక్స్ పంపవని చెబుతూనే..మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్, డెబిట్ కార్డ్ నెంబర్, పిన్, ఓటీపీ లాంటి విషయాల్ని ఎవరికి షేర్ చేయోద్దని తెలిపింది. -
బ్యాంకుల్లో నిరుపయోగంగా రూ.60 వేల కోట్లు?
ప్రపంచ బ్యాంకు 2017 గ్లోబల్ ఫైండెక్స్ నివేదిక ప్రకారం, భారతదేశంలో దాదాపు సగం మంది ఖాతాదారులు 2016లో క్రియారహితంగా ఉన్న ఖాతాలు కలిగి ఉన్నట్లు పేర్కొంది. అంటే అక్షరాల 60 కోట్లకు పైమాటే అన్నమాట. ఇన్ని ఖాతాలలో కనీసం రూ.1000 ఉన్నాయి అనుకున్న సుమారు అరవై వేల కోట్ల రూపాయలు ఎటువంటి ప్రయోజనం లేకుండా ఖాతాలో ఉన్నాయి అనుకోవచ్చు. కాబట్టి అనేక ఖాతాలు కలిగి ఉండటం వల్ల ఆర్ధికంగా చాలా నష్టపోతారని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే అన్ని ఖాతాల్లో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండలేం. ఖాతాల్లో కనీస నిల్వ లేకుంటే ఛార్జీలు పడతాయి. అందుకే ఎంతో కొంత డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. పెద్ద బ్యాంకులు చార్జీల రూపంలోనే ఏడాదికి రూ.100 కోట్లు వసూలు చేస్తున్నాయి. దీన్ని బట్టి మనం అర్ధం చేసుకోవచ్చు మనం ఎక్కువ ఖాతాలు కలిగి ఉండటం వల్ల ఏమి కోల్పోతున్నామో అని. ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉంటే ఎక్కువ డబ్బు నష్ట పోతున్నారని అర్థం చేసుకోవాలి. చాలా బ్యాంకులు ఖాతాదారులు కనీస బ్యాలెన్స్ ఉంచకపోతే ఛార్జీలు వేస్తాయి. ఇలా మీరు కలిగిఉన్న ఖాతాలో కచ్చితంగా కనీస నిల్వలు పాటించాల్సి ఉంటుంది. చాలా వరకు బ్యాంకుల్లో కనీస నిల్వ రూ.5000 నుంచి రూ.10 వేల వరకు ఉంచాలి. అంటే మీకు ఐదు బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయనుకుంటే రూ.25,000 నుంచి రూ.50,000 వేల వరకు ఖాతాల్లోనే ఉండిపోతుంది. బ్యాంకుల్లో ఉన్న కనీస నిల్వలపై 3-4 శాతం వార్షిక వడ్డీ మాత్రమే లభిస్తుంది. అదే మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్లలో లేదా స్టాక్ మార్కెట్లో పెడితే దానికంటే రెట్టింపు వడ్డీ లభిస్తుంది. ఇవే కాకుండా పొదుపు ఖాతాలపై డెబిట్ కార్డ్ ఛార్జీలు, క్రెడిట్ కార్డు ఛార్జీలు వంటివి వర్తిస్తాయి. మీ వేతన ఖాతా లేదా జీరో బ్యాలెన్స్ పొదుపు ఖాతాలో వరుసగా మూడు నెలలు ఎలాంటి డిపాజిట్ చేయకపోతే ఆ తర్వాత అది సాధారణ పొదుపు ఖాతాగా మారుతుంది. అప్పుడు కచ్చితంగా కనీస నిల్వలను పాటించాల్సి ఉంటుంది. ఒక బ్యాంకు ఖాతాను అసలు ఉపయోగించకపోతే దానిని మూసివేయడమే మంచిది. ఎక్కువ ఖాతాలు ఉండటం వల్ల వాటి డెబిట్, క్రెడిట్ పిన్ నంబర్లు గుర్తుంచుకోవాలంటే కూడా కష్టమే. మీ ఖాతా ద్వారా ఎలాంటి లావాదేవీలు జరపకపోతే రెండేళ్ల తర్వాత బ్యాంకులు ఖాతాను డీయాక్టివేట్ చేస్తాయి. ఇలా చేయడం వల్ల నగదు కోల్పోవాల్సి ఉంటుంది. దానిని తిరిగి తెరవలన్న చాలా ఇబ్బంది. మరి ఏం చేయాలి? బ్యాంకు ఖాతాలు ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది అని చెప్పుకోవాలి. ఒకటి వేతన ఖాతా కోసం, కుటుంబ సభ్యులతో కలిపి ఉమ్మడి ఖాతా ఉంటే సరిపోతుంది. డబ్బు అత్యవసరం అయినప్పుడు మీరు అందుబాటులో లేకపోతే ఉమ్మడి ఖాతా వల్ల ఖాతాదారులు డబ్బు తీసుకునే అవకాశం ఉంటుంది. మరీ అంతగా కావాలనుకుంటే మరొక ఖాతాను శాశ్వత ఖాతాగా తెరుచుకోవచ్చు. ఉద్యోగం మారినప్పుడు వేతన ఖాతాలు అనేవి మారుతుంటాయి. చదవండి: కరోనా బీమా పాలసీ దారులు మీకు ఈ విషయాలు తెలుసా? -
కేసీఆర్ ఇస్తానన్న రూ.1500 వస్తాయో రావో
సాక్షి, నల్లగొండ: కరోనా (కోవిడ్–19) వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన వారికి ప్రభుత్వం రేషన్ బియ్యం అందిస్తోంది. ప్రతి వినియోగదారుడికి రూ.1500 ఆర్థిక సాయం వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని కూడా ప్రకటించింది. దాదాపు అన్ని కుటుంబాలకు బియ్యం అందినా, ఆర్థిక సాయం మాత్రం వారి ఖాతాలకు చేరడం లేదు. రేషన్‌కార్డుదారులు తమ బ్యాంకు ఖాతాలతో ఆధార్ కార్డు లింకు చేసుకుంటేనే సాయం అందే అవకాశం ఉందని అధికార యంత్రాంగం చెబుతోంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో అసలు బ్యాంక్ అకౌంట్లు లేని వినియోగదారులే ఎక్కువమంది ఉన్నా రు. అకౌంట్ ఉన్నా ఆధార్ లింకు చేసుకోని వారు కూడా ఎక్కువేనని అంటున్నారు. దీంతో ప్రభుత్వం చేస్తానన్న రూ.1500 ఆర్థిక సాయం వారికి ఎలా దక్కుతుందన్న ప్రశ్న తలెత్తుతోంది. బియ్యం పంపిణీ దాదాపు పూర్తి జిల్లాలో మొత్తం 4,57,364 తెల్ల రేషన్‌కార్డులు ఉన్నాయి. కార్డు ఉన్న కుటుంబంలోని సభ్యులకు ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున రేషన్ బియ్యం అందిస్తామన్న ప్రభుత్వం ఆ మేరకు పంపిణీ దాదాపు పూర్తి చేసింది. కాగా, ఈమొత్తం తెల్ల రేషన్ కార్డు దారులకు రూ.68.60కోట్ల ఆర్థిక సాయం అందాల్సి ఉంది. నేరుగా బ్యాంకు అకౌంట్లో డబ్బులు జమచేస్తామన్నారు. ప్రభుత్వమేమో ఇప్పటికే 90శాతం మంది వినియోగదారులకు డబ్బులు జమ చేశామంటోంది. కానీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితి దానికి విరుద్ధంగా ఉందంటున్నారు. కొందరికే జమ గతంలో ప్రభుత్వం రేషన్‌కార్డు, బ్యాంకు అకౌంట్‌కు, ఆధార్ అనుసంధానం చేయాలని నిర్ణయించింది. బ్యాంకు ఖాతాలు ఉన్న వారు ఆధార్ అనుసంధానం చేసుకున్నారు. ఎన్నికల ముందు ప్రభుత్వం జన్‌ధన్ ఖాతాలు (జీరో బ్యాలెన్స్ అకౌంట్) తెరవాలని అందులో కేంద్రం డబ్బులు వేస్తుందని చెప్పడంతో పేదలు అంతా ఖాతాలు తెరిచారు. అప్పుడు ఆధార్ లింక్ చేసుకున్నారు. అదే విధంగా సబ్సిడీ గ్యాస్ కనెక్షన్లు ఉన్న వారు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్‌ను ‘ఆన్లైన్’ ద్వారా అనుసంధానం చేసుకోవాలని కోరా రు. అదే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన రైతు బంధు పథకానికి కూడా బ్యాంకు అకౌంట్ తప్పనిసరి. దీంతో ఆధార్ లింక్ చేశారు. ఇంత వరకు బాగానే ఉంది. ఇంకా చాలామంది పేదలకు బ్యాంకు ఖాతాలు లేవు, దానికితోడు బ్యాంకు ఖాతాలను కూడా ఎప్పుడో తెరిచారు. వాటిని వాడకపోవడం వల్ల కూడా బ్యాంకర్లు వాటిని నిలిపివేశారు. ఇప్పుడు కొందరికే జమైనట్లు మెసెజ్‌లు వ స్తున్నాయి. మెసెజ్‌లు రాని వారు తమకు డబ్బులు ఇక పడవా అంటూ ఆందోళన చెందుతున్నారు. బ్యాంకులకు పరుగులు తమ రూ.1500 డబ్బులు జమ అయ్యాయో లేదో తెలుసుకునేందుకు వినియోగదారులు బ్యాంకుల వద్దకు పరుగులు తీస్తున్నారు. కొందరికే డబ్బులు జమ అయినట్లు మెసే జులు వస్తుండడంతో రాని వారు ఆందోళనతో బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఇక పట్టణ ప్రాంతాల్లో రెండు ఖాతాలు ఉన్న వారికి ఏ ఖాతాలో జమవుతుందో తెలి యక కూడా బ్యాంకుల వద్దకు పరుగులు పెడుతున్నారు. జిల్లా అధికారులు కూడా తమ వద్ద నియోగదారులకు జరుగుతున్న చెల్లింపుల సమచారం లేదంటున్నారు. దీనికితోడు ఏదైనా కారణాల వల్ల ఖాతాలు పని చేయక డబ్బులు జమకాని వారు, అసలు ఖాతాలు లేని వారి పరిస్థితి, మిస్ అయిన వా రికి ఏవిధంగా డబ్బులు ఇస్తారు అన్న అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పష్టత ఇవ్వకపోవడంతో వినియోగదారులు అయోమయానికి గురవుతున్నారు. వేములపల్లి మండలంలో సగం మందికే బ్యాంకు ఖాతాలకు డబ్బులు జమయ్యాయి. మిర్యాలగూడ పట్టణంలో కూడా ఇదే పరిస్థితి. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో గుర్రంపోడు, తిరుమలగిరి మండలాల్లో మాత్రం సగం మందికి నగదు జమ కాగా, మరో సగం మందికి జమ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఎంత మందికి జమైంది మాకు తెలియదు ప్రభుత్వ జిల్లాకు సంబంధించిన కార్డుదారులకు నేరుగా హైదరాబాద్ ఎన్ఐసీ నుంచి డబ్బులు జమ చేస్తోంది. బ్యాంకు ఖాతాలు ఆధార్‌కు లింక్ అయ్యి ఉన్నందున వాటి ఆధారంగా జమ చేస్తున్నారు. అందరి ఖాతాలకు డబ్బులు జమ అవుతాయి. ఎంత మందికి డబ్బులు వచ్చాయి..? ఇంకా ఎందరికి రావాల్సి ఉంది.. అన్న సమాచారం మాదగ్గర ఉండదు. ఎవరికైనా డబ్బులు జమకాక పోతే మాకు దరఖాస్తు చేసుకుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. – నిత్యానందం, ఏఎస్ఓ వస్తయో.. రావో కేసీఆర్ ఇస్తానన్న రూ.1500 వస్తాయో రావో తెలుస్తలే. అంతా డబ్బులు పడ్డాయని అంటుంటే నేనూ బ్యాంకుకు వచ్చిన. నా బ్యాంకు పుస్తకం తీసుకొని చూస్తే బ్యాంకోల్లు పడలేదన్నారు. అడిగితే మాకు తెలియదు అంటుండ్రు. వస్తయోరావో తెలియని పరిస్థితి. – గంగులు, నల్లగొండ తీరా నగదు పడలేదన్నారు నా తెల్ల రేషన్ కార్డు ఉంది. 12కిలోల బియ్యం ఇచ్చారు. అందరికీ రూ.1500 పడినట్లు చుట్టుపక్కల వాళ్లు అనుకుంటున్నారు. నేను బ్యాంక్ వద్దకు వెళ్లి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలో నిలబడ్డాను. తీరా నా దగ్గరికి వచ్చేసరికి నీ అకౌంట్లో డబ్బులు పడలేదని చెప్పారు. అసలే కష్టకాలం. ఈ డబ్బులు పడితే కొంత ఆసరాగా ఉంటుందని అనుకుంటే రాలేదు. – సిద్ది నాగమ్మ, ముత్తిరెడ్డికుంట -
అర్హులందరికీ రైతుబంధు అందాలి
మెదక్‌జోన్: జిల్లాలో అర్హులైన రైతులందరికీ రైతుబంధు పథకం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం వ్యవసాయశాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే అప్లోడ్ కాని రైతుల ఖాతాల వివరాలను వెంటనే అప్లోడ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పెండిం గ్లో ఉన్న ప్రతిరైతు వివరాలను సేకరించాలని సూచించారు. ప్రతి రైతుకు రైతుబంధు చేరాలన్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ఏరైతూ నష్టపోకుండా చూడాలన్నారు. ప్రతిఅధికారి అప్రమత్తంగా ఉండి రైతుబంధును విజయవంతం చే యాలన్నారు. ప్రతిఐదువేల ఎకరాలకో ఏఈ వోను ప్రభుత్వం నియమించిందని, వారు ప్రతి రోజు రైతులకు అందుబాటులో ఉండి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలి పారు. వ్యవసాయ, ఉద్యానవనశాఖ అదికా రులు రైతులను కూరగాయల సాగు వైపునకు మళ్లించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాకు హైదరాబాద్ నుంచి కూరగాయల దిగుమతి అవుతోందని, మన జిల్లాకు డిమాండ్ మేర కూరగాయలను మన జిల్లాలోనే సాగయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇందుకోసం అవసరమయ్యే మార్కెట్ సౌకర్యాలను పరిశీలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వరి పంటకు ప్రత్యామ్నాయ పంటలను పం డించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అన్నిగ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో సీతాఫల మొక్కలు అందుబాటులో ఉన్నాయని, ఆసక్తిగల రైతులకు వాటిని అందించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ప్రతిఇంటికి మునగ, బొప్పాయి మొక్కలను అందించాలన్నారు. ఈ సారి హరితహారంలో ప్రజలకు ఇష్టమైన మొక్కలనే పంపిణీ చేసేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ విషయంపై ఇప్పటికే పంచయతీ కార్యదర్శులు ఊరూరా సర్వే చేయడం జరిగిందని చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ జిల్లా అధికారి పరశురాం, ఉద్యానవనశాఖ అధికారి నర్సయ్య, మత్స్యశాఖ ఏడీ శ్రీనివాస్‌తో పాటు ఏడీఏలు, ఏవోలు, ఉద్యానవనశాఖ క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు. -
కొందరికే ‘బంధు’వు
మహబూబ్‌నగర్ రూరల్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన రైతుబంధు పథకం కింద నగదు జమ చేసే ప్రక్రియ నత్తనడకన కొనసాగుతోంది. రబీ సీజన్‌కు సంబంధించి అక్టోబర్ మాసంలోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయాల్సి ఉంది. అయితే, మూడు నెలలు కావొస్తున్నా ఇంకా పూర్తి స్థాయిలో రైతులకు నగదు అందలేదు. వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం 80శాతం రైతుల ఖాతాల్లో నగదు జమ అయినట్లు తెలుస్తున్నా.. వాస్తవానికి ఆ మేరకు కూడా ఖాతాల్లో డబ్బు జమ అయిన దాఖలాలు కనిపించడం లేదు. ఏ గ్రామానికి వెళ్లినా రైతులు తమ ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం జమ కాలేదని, ఎప్పుడు అవుతుందని అధికారులను అడగడం కనిపిస్తోంది. అధికారులు ఖాతాల్లో డబ్బు జమ విషయమై ఎప్పటికప్పుడు సరైన సమాచారం ఇస్తే ఇలాంటి గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండదు. చెక్కులకు బదులు నగదు రైతులు పంట పెట్టుబడి కోసం దళారులు, వ్యా పారుల చేతుల్లో మోసపోకుండా తెలంగాణ ప్ర భుత్వం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. గత ఖరీఫ్ సీజన్లో పెట్టుబడి కింద ఎకరానికి రూ. 4 వేలు అందించారు. ఆ సమయంలో రైతులకు చె క్కులు అందించగా రైతుల్లో ఖాతాల్లో జమ చేసు కుని డబ్బు తీసుకున్నారు. ఇక రబీ సీజన్‌కు సం బంధించి పెట్టుబడులను చెక్కుల రూపంలో పం పిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధం కాగా శాసనసభ ఎన్నికల కోడ్ కారణంగా బ్రేక్ పడింది. ఈ మేరకు రైతులకు చెక్కుల రూపంలో ఇవ్వకుండా వారి ఖాతాల్లో డబ్బు జమ చేయాలని ఎన్నికల కమిషన్ సూచించింది. దీంతో రైతుల ఖాతాల వివరాలు సేకరించిన అధికారులు ఆయా ఖాతాల్లో నగదు జమ చేయడం ఆరంభించారు. ఈ ప్రక్రియ అక్టోబర్‌లో ప్రారంభం కాగా.. మూడు నెలలు గడుస్తున్నప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో రైతుల ఖాతాల్లో డబ్బు జమ కాలేదు. ఇప్పటి వరకు 80 శాతం మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయని, మిగతా 20 శాతం మంది రైతుల ఖాతాల్లో డబ్బు జమ కావాల్సి ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో డబ్బు అందని రైతులు అసలు డబ్బు వస్తుందా, రాదా అంటూ ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై వ్యవసాయ అధికారులను అడుగుతుండగా.. రేపు, మాపు అంటూ రకరకాలు కారణాలు చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. ఏది ఏమైనా రబీ పెట్టుబడి, ఇతర ఖర్చులకు అండగా ఉంటుందనుకుంటున్న డబ్బు అందక వారు ఇబ్బంది పడుతున్నారు. ఖాతాల వివరాలు లేక... జిల్లాలో రైతుబంధు పథకానికి సంబంధించిన అర్హులైన రైతులు 2,77,790 మంది ఉన్నారు. వీరందరికీ కలిపి రూ.316.86 కోట్ల నగదు జమ కావాల్సి ఉంది. వ్యవసాయశాఖ ఏఈఓలు ఇప్పటి వరకు 2,50,017 మంది రైతుల బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించి ఆన్లైన్లో పొందుపరిచారు. ఈ అకౌంట్లలో రైతుబంధు నగదు జమ చేసేందుకు హైదరాబాద్‌లోని కమిషనరేట్ కార్యాలయానికి నివేదించారు. ఈ మేరకు కమిషనరేట్ అధికారులు 2,45,500 ఖాతాల్లో డబ్బు చేసేలా ట్రెజరీకి పంపించారు. అలా ఇప్పటి వరకు 2,34,300 మంది రైతులకు సంబంధించి రూ.276.34 కోట్లు ఖాతాల్లో జమ అయింది. అంటే 80 శాతం మంది రైతులకు రైతు బంధు నగదు అందినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నా యి. ఇంకా 15,717 మంది రైతుల ఖాతాల్లో డ బ్బు జమ కావాల్సి ఉంది. వీరితో పాటు ఖాతా నంబర్లు పంపింనా వివరాలు సరిగా లేకపోవడం వంటి కారణాలతో దాదాపు 1,800 ఖాతాలకు సంబం«ధించిన నగదు సుమారు రూ.45 లక్షలు తిరిగి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఆ రైతుల ఖాతాల వివరాలను మరోసారి సేకరించి పంపించనున్నట్లు తెలిపారు. బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు రబీ పంటకు సంబంధించి రైతుబంధు నగదు అకౌంట్లలో జమ కావడంలో జాపం జరుగుతుంది. ప్రక్రియ ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఇంకా పూర్తి స్థాయిలో రైతుల ఖాతాల్లో డబ్బు జమ కావడం లేదు. బ్యాంకు ఖాతాలు సరిగ్గా లేని వారితో పాటు అసలే ఖాతాల నంబర్లు ఇవ్వని వారి వివరాల సేకరణలో అధికారులు నిమగ్నమయ్యారు. రబీ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో విత్తనాలు, రసాయన ఎరువులు కొనుగోలు చేయాల్సిన తరుణంలో చేతుల్లో చిల్లిగవ్వ లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గత ఖరీఫ్లోపెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం చెక్కుల రూపంలో అందజేయగా.. సద్వినియోగం చేసుకున్నారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ కారణంగా ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో రైతులకు సంబం«ధించిన బ్యాంకు ఖాతాలు, ఆధార్, పట్టాదారు పాసు పుస్తకం వివరాలను సేకరించి కమిషనర్‌కు పంపించారు. ఆయా రైతుల ఖాతాల్లో దశల వారీగా రైతు బంధు డబ్బును జమ చేస్తున్నారు. ఈ ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగుతుండడంతో ఎప్పుడు డబ్బు జమ అవుతుందో తెలియక రైతులు ప్రతిరోజూ బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటి వరకు రూ.276.34 కోట్లు జమ జిల్లాలోని 2,34,300 మంది రైతుల అకౌంట్లలో ఇప్పటి వరకు రూ. 276.34 కోట్లు పెట్టుబడి సాయం జమ చేశాం. ఇంకా 27,773 మంది రైతులు తమ అకౌంట్ నంబర్లు ఇవ్వాల్సి ఉంది. ఆయా రైతులు కూడా త్వరగా తమ పట్టాదారు పాసు పుస్తకం, బ్యాంకు అకౌంట్ బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను ఏఈఓలను అందజేయాలి. అలా ఇచ్చిన వారి ఖాతాల్లో 15–20 రోజుల్లో రైతు బంధు నగదు జమ చేస్తాం. – సుచరిత, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
ఖాతాల్లోకే రైతుబంధు..
హన్మకొండ: యాసంగి పెట్టుబడి నేరుగా రైతు ఖాతాల్లో జమకానుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. రైతులపై పెట్టుబడి భారం పడకుండా ఉండేందుకు గత ఖరీఫ్ నుంచి ప్రభుత్వం రైతు బంధు పథకం కింద ఎకరాకు రూ.4 వేల చొప్పున అందిస్తోంది. ఖరీఫ్‌లో చెక్కులను పంపిణీ చేయగా.. ఈ యాసంగిలోనూ అదే తరహాలో ఇచ్చేందుకు సన్నద్ధమైంది. అయితే.. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈ విధానానికి ఎన్నికల కమిషన్ అభ్యంతరాలు తెలిపింది. గతంలో ఇచ్చిన రైతులకు మాత్రమే యాసంగిలో రైతుబంధు పథకం అమలు చేయాలని, కొత్త వారిని మినహాయించాలని ఈసీ సూచించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ క్రమంలో గత ఖరీఫ్‌లో చెక్కులు పొందిన రైతులకు యాసంగికి గాను నేరుగా వారి ఖాతాల్లో సొమ్ము జమచేయనున్నారు. ఇందులో భాగంగా బుధవారం నుంచి 25వ తేదీ వరకు వ్యవసాయ విస్తరణాధికారులు రైతుల ఇంటికి వెళ్లి బ్యాంకు ఖాతా నంబర్లు, ఇతర వివరాలు సేకరించనున్నారు. దీని కోసం నిర్ధిష్టమైన ప్రొఫార్మాను సిద్ధం చేశారు. రైతుల నుంచి సేకరించిన వివరాలు ఇందులో పొందుపరచనున్నారు. 74,664 మంది రైతులకు.. యాసంగికి సంబంధించి అర్బన్ జిల్లాలో 74,664 మంది రైతులకు 75,825 చెక్కుల రూపంలో రూ.69,12,56,170 ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మొత్తాన్ని నేరుగా రైతు ఖాతాల్లో వేయనున్నారు. గత ఖరీఫ్‌లో జిల్లాలో 75,085 మంది రైతులకు 75,540 చెక్కుల రూపంలో రూ.67,63,09,650 పంపిణీ చేయాల్సి ఉండగా.. ఇందులో వివిధ కారణాలతో 6,756 మంది రైతులకు 6,817 చెక్కులు పంపిణీ కాలేదు. ఎన్నారైలు, చనిపోయిన రైతులు, డబుల్ జారీ అయిన వారు, వివాదాల్లో ఉన్న వారు మిగిలిపోయారు. అడ్డంకులు తొలగిపోయినా దూరమే.. గతంలో అన్ని సక్రమంగా ఉన్న ‘ఏ’ గ్రూపు రైతులకు మాత్రమే రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం అందించారు. సమస్యలుండి పాస్ బుక్కులు అందుకోని రైతులను బీ గ్రూపులో చేర్చి వారికి చెక్కులు అందించలేదు. ప్రస్తుతం అన్ని అడ్డంకులు తొలగిపోయి కొత్తగా పాస్ బుక్కులు అందుకున్న రైతులు ఉన్నారు. అయితే ఈ యాసంగిలో కొత్త వారికి రైతుబంధు పథకం అమలు చేయొద్దని ఎన్నికల కమిషన్ నిబంధనలు విధించింది. దీంతో కొత్త రైతులు యాసంగి పెట్టుబడికి దూరం కానున్నారు. వివరాలు అందజేయాలి.. ఇంటికి వచ్చే వ్యవసాయ విస్తరాణాధికారులకు రైతులు పూర్తిస్థాయిలో వివరాలు అందజేయాల్సి ఉంటుంది. నిర్ణీత ప్రొఫార్మాలో ఉన్న అంశాల మేరకు వివరాలు అందించాలి. బ్యాంకు ఖాతా వివరాలు, కొత్తగా జారీ చేసిన పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్ ప్రతి, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతి, రైతు ఫోన్ నంబర్‌ను అధికారులకు ఇవ్వాలి. పెట్టుబడి సొమ్ము రైతుల ఖాతాల్లోకి వెళ్లగానే ఫోన్ నంబర్‌కు సమాచారం వస్తుందని వ్యవసాయ అధికారులు చెప్పారు. -
రూ.4.5 కోట్లు స్వాహా..!
బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్‌గా నమ్మకంగా పనిచేశాడు. అతనికున్న సాంకేతిక పరిజ్ఞానం మరింత కలిసివచ్చింది. అంచెలంచెలుగా ఎదిగిన ఆ బ్యాంకు చైర్మన్‌కు దగ్గరయ్యాడు. అదే బ్యాంకులో పనిచేసిన ఉన్నతాధికారి సహకారంతో అక్రమాలకు తెరతీశాడు. లక్ష కాదు..రెండు లక్షలు కాదు..ఏకంగా రూ.4.5కోట్లు స్వాహా చేశాడు. మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడు రోడ్డులో గల ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో చోటు చేసుకున్న ఈ అవినీతి బాగోతం వివరాలు ఇలా... మిర్యాలగూడ అర్బన్ : సంతోష్..ఇతను సదరు బ్యాంక్ నందిపాడు శాఖలో ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. మూడున్నరేళ్ల కాలంగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతనికి కంప్యూటర్ హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ పరిజ్ఞానం మెండుగా ఉంది. ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తూనే బ్యాంకులో ఏమైనా సాంకేతిక సమస్యలు వచ్చినప్పుడు సరిచేసేవాడు. ఇలా సిబ్బందికి దగ్గరయ్యాడు. ఒకానొక దశలో ఏపీజీవీబీ చైర్మన్‌కు దగ్గరయ్యాడు. దీంతో డివిజన్లోని ఏ శాఖలో సాంకేతిక సమస్య వచ్చినా ఇతనినే పంపించేవారు. సాంకేతిక పరిజ్ఞానంతో తప్పుడుమార్గం తనకున్న పరిజ్ఞానంతో తప్పుడు మార్గం పట్టాడు. లేని సమభావన సంఘాలను సృష్టించాడు. ఆన్లైన్లో పలువురి ఆధార్‌కార్డులు డౌన్‌లోడ్‌చేసి తన మిత్రుల కుటుంబ సభ్యులతో బ్యాంకు అకౌంట్లు తెరిపించాడు. తను సృష్టించిన సమభావన సంఘాలకు రుణాలు మంజూరు చేయడం ప్రారంభించాడు. ఈ విషయంలో బ్యాంకు ఉద్యోగుల ఐడీలను హ్యాక్చేశాడు. ఈ తతంగం 2017 మార్చి నుంచి నడుస్తున్నట్లు స్పష్టమవుతోంది. సదరు ఉద్యోగి ఒకేరోజు 20 డాక్యుమెంట్లను పూర్తిచేసి వాటికి రుణాలు మంజూరు చేశాడు. ఈ క్రమంలో బ్యాంకు సిబ్బంది ఐడీలను సైతం సంపాదించడంతో పాటు మేనేజర్ ఐడీని సైతం హ్యాక్‌చేసినట్లు సమాచారం. దీంతో ఇప్పటివరకు వివిధ సంఘాల పేరుతో రూ.4.50కోట్లను నకిలీ సంఘాలకు మంజూరుచేసి స్వాహా చేశాడు. ఒకేసారి 20సంఘాలకు రుణాలు మంజూరు చేసినందుకు గాను సదరు ఉద్యోగిని బ్యాంకు చైర్మన్ సైతం ప్రసంశించాడు. అంతే కాకుండా అతడి ఫొటోనే బ్యాంకు వెబ్సైట్లో పెట్టి ప్రశంసలు కురిపించినట్లు తెలుస్తోంది. వెలుగులోకి ఇలా.. బ్యాంకులో ఎలాంటి ఖాతాలేని ఒక మహిళ సెల్‌నంబర్‌కు సమభావన సంఘం రుణాల డబ్బులు మంజూరైనట్లు మెసేజ్ వచ్చింది. కంగుతిన్న ఆ మహిళ బ్యాంకులో ఎలాంటి ఖాతాలేదు. నేను ఏ సమభావన సంఘంలో సభ్యురాలిని కాను కాని నాసెల్ఫోన్కు బ్యాంకునుంచి మెసేజ్ రావండమేంటి అని బ్యాంకు అధికారులను సంప్రదించింది. దీంతో అక్రమాల విషయం వెలుగులోకి వచ్చింది. గత ఐదురోజులుగా విచారణ.. బ్యాంకులో చోటు చేసుకున్న అక్రమాలపై నిజాలను నిగ్గుతేల్చేందుకు రంగంలోకి దిగిన స్టేట్ విజిలెన్స్, సీబీఐ, నాబార్డు సిజియన్స్కు సైతం ఫిర్యాదులు అందాయి. విజిలెన్స్ బృందాలు ఐదురోజులుగా విచారణను వేగవంతం చేసింది. పూర్తిస్థియిలో నివేదిక తయారుచేసి ఉన్నతాధికారులకు అందజేసేందుకు చర్యలు తీసుకుంది. అక్రమాల్లో ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో అధికారులు విచారణ చేపట్టి తొలుత సదరు ఉద్యోగిని బదిలీచేసినట్లు తెలిసింది. కానీ ఆ బదిలీ స్థానంలోకి విధుల్లోకి చేరలేదు. అధిక మొత్తంలో బ్యాంకు సొమ్ము స్వాహా కావడంతో ఉన్నా«తాధికారులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. బ్యాంకు మేనేజర్‌తో పాటు మరో ఆరుగురిపై వేటు.. కాగా ఏపీజీవీబీ ప్రధాన బ్యాంకులో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణ చేస్తున్న బృందం ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఆరుగురిపై వేటు వేసినట్లు సమాచారం. బ్యాంకులో భారీ మొత్తంలో అక్రమాలు జరుగుతున్నా పట్టించుకోవడంలో నిర్లక్ష్యం వహించిన మేనేజర్‌ను నల్లగొండలో ఈ నెల 7న జరిగిన జిల్లా ఏపీజీవీబీ బ్యాంకర్ల సమావేశంలో విచారించి విధులనుంచి విధులనుంచి తొలగించినట్లు తెలిసింది. ఫలితంగా మూడు రోజులుగా ఆయన విధుల్లోకి రావడంలేదని తెలిసింది. కాగా సోమవారం నుంచి నూతన మేనేజర్ విదుల్లో చేరుతారని సమాచారం. బ్యాంకులో ఎంతసోమ్ము స్వాహా అయ్యింది..? ఎన్నికోట్ల కుంబకోణం జరిగిందనే విషయాన్ని అధికారికంగా ప్రకటించి త్వరలో బ్యాంకులపై క్రిమినల కేసులు నమోదు చేసేందుకు విజిలెన్స్ బృందం విచారణను వేగవంతం చేసినట్లు తెలిసింది. చర్యలు తీసుకుంటాం మిర్యాలగూడ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో అక్రమాలు జరిగిన విషయం అంతర్గత సమస్య. ఫీల్డ్ ఆఫీసర్ అక్రమాలకు పాల్పడినట్టు తెలసింది. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్య తీసుకుంటాం. –రఘునాథరెడ్డి జీఎం ఏపీజీవీబీ, నల్లగొండ -
ఖాతాదారులను ఎగరేసుకుపోయే ప్రమాదం
- పేమెంట్ బ్యాంకుల రాకపై ఎస్బీఐ చీఫ్ అరుంధతి భట్టాచార్య వ్యాఖ్యలు ముంబై: ప్రతిపాదిత పేమెంటు బ్యాంకులు (పీబీ) క్రమంగా పూర్తి స్థాయి బ్యాంకుల ఖాతాదారులను ఎగరేసుకుపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమ స్థాయి జీతాలు మొదలైన బాదరబందీ ఉండని, సాంకేతికంగా అధునాతనమైన పీబీల రాకతో పోటీ తీవ్రమై బ్యాంకులు ‘కాట్లకుక్కల్లా’ పోటీపడాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. ఈ-కామర్స్ కంపెనీల బాటలోనే పారిశ్రామిక దిగ్గజాలకు చెందిన పేమెంట్ బ్యాంకులు.. మార్కెట్ వాటా దక్కించుకునేందుకు తొలుత భారీగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని అరుంధతి చెప్పారు. ప్రస్తుతం కార్యకలాపాలు కొనసాగిస్తున్న పూర్తి స్థాయి బ్యాంకులకు దీనివల్ల సంక్లిష్టమైన పరిస్థితి ఎదురవుతుందని ఎఫ్‌ఐబీఏసీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆమె పేర్కొన్నారు. పీబీలతో పోటీపడేం దుకు ఆయా బ్యాంకులు కొంగొత్త వ్యూహాలు అమలు చేయాల్సి వస్తుందన్నారు. కాగా కాల్‌డ్రాప్ కష్టాలు తనకూ తప్పడంలేదని ఒక సందర్భంలో ఆమె పేర్కొన్నారు. -
ఒక్క నిమిషంలో నిధుల బదిలీ
ఎమిరేట్స్ ఎన్బీడీ డెరైక్ట్రెమిట్2 మొబైల్ ద్వారా.. హైదరాబాద్: యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ప్రముఖ బ్యాంక్ అయిన ఎమిరేట్స్ ఎన్బీడీ ఫండ్స్రెమిటెన్స్కు సంబంధించి వినూత్నమైన డెరైక్ట్రెమిట్2మొబైల్ సర్వీస్‌ను ప్రారంభించింది. ఈ సర్వీస్‌తో యూఏఈలో తమ బ్యాంక్ ఖాతాదారులు భారత్‌లో ఏ మొబైల్ నంబర్‌కైనా ఫండ్స్‌ను బదిలీ చేసుకోవచ్చని ఎమిరేట్స్ ఎన్బీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఒక్క నిమిషంలోనే నిధుల బదిలీ జరుగుతుందని ఎమిరేట్స్ ఎన్బీడీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సువొ సర్కార్ పేర్కొన్నారు. భారత్‌లో యాక్సిస్ బ్యాంక్ ద్వారా ఈ సర్వీస్‌ను అందిస్తున్నామని, త్వరలో ఇతర బ్యాంక్‌ల ద్వారా కూడా ఈ సర్వీస్‌ను అందించగలమని వివరించారు. -
బ్యాంకు ఖాతా ఉంటేనే కనెక్షన్: పీయూష్
హైదరాబాద్: కొత్తగా విద్యుత్ కనెక్షన్లు తీసుకునే వారికి బ్యాంక్ ఖాతాను తప్పనిసరి చేయాలని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్‌గోయల్ ఆంధ్రపద్రేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. 2017 సంవత్సరం నాటికి ఆంధ్రపదేశ్ 27 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని సాధిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అక్టోబర్ 2 నుంచి అమలు చేసే ‘అందరికీ విద్యుత్’ పథకానికి సంబంధించి మంగళవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పలు ఒప్పందాలు జరిగిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అన్ని రాష్ట్రాల్లోనూ విద్యుత్ నష్టాలు భారీగా ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్ మాత్రం అతి తక్కువగా ఉండటం అభినందనీయమని పేర్కొన్నారు. దీన్ని మరింత తగ్గించాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘జన్‌ధన్ యోజన’కు ఏపీ సర్కారు సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతా తీసుకునేందుకు వీలుగా, విద్యుత్ బిల్లులను సైతం బ్యాంకులోనే చెల్లించే ఏర్పాటు చేయాలని సూచించారు. దీనివల్ల సబ్సిడీలను నేరుగా అందించొచ్చని అభిప్రాయపడ్డారు. అందరికీ విద్యుత్ పథకం వెల్లడించిన 50 రోజుల్లోనే ఒప్పందాలు చేసుకోవడం హర్షణీయమని, రాష్ట్రాభివృద్ధికి బాబు పడుతున్న తపనకు ఇది నిదర్శనమని ప్రశంసించారు. అందరికీ విద్యుత్‌పై కసరత్తు చేయాలి రాష్ట్రంలో కరెంట్ దొంగతనాలు జరగకుండా చూడాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ దిశగా ఇక నుంచి ఆన్లైన్ పద్ధతిని అమలులోకి తెస్తామన్నారు. అందరికీ విద్యుత్ ఎలా ఇవ్వాలనే విషయమై ఇంకా కసరత్తు చేయాల్సిన అవసరం ఉందని, అందుకే తేదీని ప్రకటించలేదని తెలిపారు. గతంలో విద్యుత్ సంస్కరణలు తానే తెచ్చానని, ఇప్పుడు అధికారంలోకి వచ్చేనాటికి 22 మిలియన్ యూనిట్లు విద్యుత్ లోటు ఉందన్నారు. దీన్ని అధిగమించేందుకు తిరిగి సంస్కరణలు చేపడుతున్నట్టు చెప్పారు. రాయలసీమలో పెద్ద ఎత్తున సోలార్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం సాహసోపేతమైన నిర్ణయంగా అభివర్ణించారు. రాష్ట్రంలో 9 వేల ఫీడర్లున్నాయని, వినియోగదారులు ఇక నుంచి ఇంట్లో కూర్చునే విద్యుత్ పరిస్థితిని తెలుసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోకగజపతిరాజు, ఎంపీలు సుజనాచౌదరి, సి.ఎం.రమేష్, సీఎస్ ఐ.వై.ఆర్.కృష్ణారావు, ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి రామ్మోహన్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వంద రోజుల పాలనపై రాష్ట్ర కమ్యూనికేషన్ సలహాదారు పరకాల ప్రభాకర్ రూపొందించిన పుస్తకాన్ని బాబు ఆవిష్కరించారు.