బ్యాంకుల్లో నిరుపయోగంగా రూ.60 వేల కోట్లు? | Too many bank accounts can harm your money | Sakshi
Sakshi News home page

ఎక్కువ బ్యాంక్ ఖాతాలతో ఎన్ని నష్టాలో తెలుసా?

Published Mon, May 3 2021 8:02 PM | Last Updated on Mon, May 3 2021 8:41 PM

Too many bank accounts can harm your money - Sakshi

ప్రపంచ బ్యాంకు 2017 గ్లోబల్ ఫైండెక్స్ నివేదిక ప్రకారం, భారతదేశంలో దాదాపు సగం మంది ఖాతాదారులు 2016లో క్రియారహితంగా ఉన్న ఖాతాలు కలిగి ఉన్నట్లు పేర్కొంది. అంటే అక్షరాల 60 కోట్లకు పైమాటే అన్నమాట. ఇన్ని ఖాతాలలో కనీసం రూ.1000 ఉన్నాయి అనుకున్న సుమారు అరవై వేల కోట్ల రూపాయలు ఎటువంటి ప్రయోజనం లేకుండా ఖాతాలో ఉన్నాయి అనుకోవచ్చు. కాబట్టి అనేక ఖాతాలు కలిగి ఉండటం వల్ల ఆర్ధికంగా చాలా నష్టపోతారని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే అన్ని ఖాతాల్లో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండ‌లేం. ఖాతాల్లో క‌నీస నిల్వ లేకుంటే ఛార్జీలు ప‌డ‌తాయి. అందుకే ఎంతో కొంత డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

పెద్ద బ్యాంకులు చార్జీల రూపంలోనే ఏడాదికి రూ.100 కోట్లు వసూలు చేస్తున్నాయి. దీన్ని బట్టి మనం అర్ధం చేసుకోవచ్చు మనం ఎక్కువ ఖాతాలు కలిగి ఉండటం వల్ల ఏమి కోల్పోతున్నామో అని. ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉంటే ఎక్కువ డబ్బు నష్ట పోతున్నారని అర్థం చేసుకోవాలి. చాలా బ్యాంకులు ఖాతాదారులు కనీస బ్యాలెన్స్ ఉంచకపోతే ఛార్జీలు వేస్తాయి. ఇలా మీరు కలిగిఉన్న ఖాతాలో కచ్చితంగా కనీస నిల్వలు పాటించాల్సి ఉంటుంది. చాలా వ‌ర‌కు బ్యాంకుల్లో క‌నీస నిల్వ రూ.5000 నుంచి రూ.10 వేల వ‌ర‌కు ఉంచాలి. అంటే మీకు ఐదు బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయ‌నుకుంటే రూ.25,000 నుంచి రూ.50,000 వేల వ‌ర‌కు ఖాతాల్లోనే ఉండిపోతుంది. బ్యాంకుల్లో ఉన్న క‌నీస నిల్వ‌ల‌పై 3-4 శాతం వార్షిక వ‌డ్డీ మాత్రమే ల‌భిస్తుంది. అదే మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో లేదా స్టాక్ మార్కెట్లో పెడితే దానికంటే రెట్టింపు వ‌డ్డీ ల‌భిస్తుంది. 

ఇవే కాకుండా పొదుపు ఖాతాల‌పై డెబిట్ కార్డ్ ఛార్జీలు, క్రెడిట్ కార్డు ఛార్జీలు వంటివి వ‌ర్తిస్తాయి. మీ వేత‌న ఖాతా లేదా జీరో బ్యాలెన్స్ పొదుపు ఖాతాలో వ‌రుస‌గా మూడు నెల‌లు ఎలాంటి డిపాజిట్ చేయ‌క‌పో‌తే ఆ త‌ర్వాత అది సాధార‌ణ పొదుపు ఖాతాగా మారుతుంది. అప్పుడు క‌చ్చితంగా క‌నీస నిల్వ‌లను పాటించాల్సి ఉంటుంది. ఒక బ్యాంకు ఖాతాను అస‌లు ఉప‌యోగించ‌క‌పోతే దానిని మూసివేయ‌డ‌మే మంచిది. ఎక్కువ ఖాతాలు ఉండటం వల్ల వాటి డెబిట్, క్రెడిట్ పిన్ నంబర్లు గుర్తుంచుకోవాలంటే కూడా కష్టమే. మీ ఖాతా ద్వారా ఎలాంటి లావాదేవీలు జరపకపోతే రెండేళ్ల తర్వాత బ్యాంకులు ఖాతాను డీయాక్టివేట్ చేస్తాయి. ఇలా చేయడం వల్ల నగదు కోల్పోవాల్సి ఉంటుంది. దానిని తిరిగి తెరవలన్న చాలా ఇబ్బంది.

మ‌రి ఏం చేయాలి?
బ్యాంకు ఖాతాలు ఎంత త‌క్కువ‌గా ఉంటే అంత మంచిది అని చెప్పుకోవాలి. ఒకటి వేత‌న ఖాతా కోసం, కుటుంబ స‌భ్యుల‌తో క‌లిపి ఉమ్మ‌డి ఖాతా ఉంటే సరిపోతుంది. డ‌బ్బు అత్యవ‌స‌రం అయిన‌ప్పుడు మీరు అందుబాటులో లేక‌పోతే ఉమ్మడి ఖాతా వల్ల ఖాతాదారులు డ‌బ్బు తీసుకునే అవ‌కాశం ఉంటుంది. మ‌రీ అంత‌గా కావాల‌నుకుంటే మ‌రొక ఖాతాను శాశ్వ‌త ఖాతాగా తెరుచుకోవచ్చు. ఉద్యోగం మారిన‌ప్పుడు వేత‌న ఖాతాలు అనేవి మారుతుంటాయి. 

చదవండి:

కరోనా​​ బీమా పాలసీ దారులు మీకు ఈ విషయాలు తెలుసా?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement