World Bank
-
అమెరికా సుంకాలు ప్రపంచానికే ప్రమాదం
అమెరికా ఉత్పత్తులపై సుంకాలు పెంచాలనే నిర్ణయం వల్ల ప్రపంచ వృద్ధి ప్రభావం చెందుతుందని ప్రపంచ బ్యాంకు హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా విడుదల చేసిన గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్ నివేదిక ప్రకారం, వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు, వాణిజ్య భాగస్వాములు తమ సొంత టారిఫ్‌లను పెంచుతూ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే ఇప్పటికే మందకొడిగా 2.7%గా ఉన్న ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 2025లో 0.3 శాతం పడిపోయే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది.ఇతర దేశాలు అనుసరిస్తే ప్రమాదంఅమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన వివరాల ప్రకారం.. ప్రపంచ దిగుమతులపై 10 శాతం సుంకం, కెనడా, మెక్సికో దిగుమతులపై 25 శాతం, చైనా వస్తువులపై 60 శాతం సుంకాన్ని విధించబోతున్నట్లు సమాచారం. ప్రపంచ స్థూల ఆర్థిక నమూనా ప్రకారం ఇలాంటి నిర్ణయాల వల్ల ప్రపంచ వృద్ధి 0.3 శాతం తగ్గిపోనుంది. ఇతర దేశాలు కూడా ఇదే పంథాను అనుసరిస్తే మరింత ప్రమాదం వాటిల్లుతుందని ప్రపంచ బ్యాంకు తెలిపింది.కుంటుపడనున్న వృద్ధిరేటుఅభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు 2000 సంవత్సరం తర్వాత అత్యంత బలహీనమైన దీర్ఘకాలిక వృద్ధి సమస్యను ఎదుర్కొంటున్నాయని నివేదిక ఎత్తిచూపింది. అధిక రుణ భారాలు, బలహీనమైన పెట్టుబడులు, ఉత్పాదకతలో తగ్గుతున్న వృద్ధి, పెరుగుతున్న వాతావరణ మార్పుల ఖర్చుల కారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 2025-26 ఏడాదికిగాను వృద్ధి రేటు 4%గా ఉంటుందని అంచనా.ఇదీ చదవండి: భారత్‌లో టాప్ 5 బ్రాండ్ లిస్ట్‌లోకి యాపిల్వచ్చే 25 ఏళ్లు మరిన్ని సవాళ్లుపెట్టుబడులను ప్రోత్సహించడానికి, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి వివిధ దేశాలు మెరుగైన సంస్కరణలను అవలంబించాలని ప్రపంచ బ్యాంకు చీఫ్ ఎకనమిస్ట్ ఇందర్మిత్ గిల్ నొక్కి చెప్పారు. గత 25 సంవత్సరాలతో పోలిస్తే వచ్చే 25 ఏళ్లు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు కఠినమైన అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. వీటిని తగ్గించుకునేందుకు క్రియాశీల చర్యలు తీసుకోవాలని కోరారు. బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ సైతం ప్రపంచ వాణిజ్యంలో పెరుగుతున్న అనిశ్చితుల గురించి హెచ్చరించింది. -
ప్రపంచ బ్యాంకు రిపోర్ట్‌లో మంచి స్కోర్ రావాలంటే కష్టమే..
వివిధ దేశాల్లో వ్యాపారాలకు అనువైన పరిస్థితుల ఆధారంగా ప్రపంచ బ్యాంకు రూపొందించే బీ–రెడీ రిపోర్ట్(Report)లో మంచి స్కోరు దక్కించుకోవాలంటే భారత్‌కి కాస్త సవాలుతో కూడుకున్న వ్యవహారమేనని మేధావుల సంఘం జీటీఆర్ఐ ఒక నివేదికలో పేర్కొంది. బిజినెస్ ఎంట్రీ, కార్మిక చట్టాలు, అంతర్జాతీయ వాణిజ్యం తదితర అంశాల విషయంలో ప్రపంచ బ్యాంకు(World Bank) అంచనాలకు భారత్ దూరంగా ఉందని వివరించింది.ఈ నేపథ్యంలో బీ–రెడీలో (బిజినెస్ రెడీ) చోటు కోసం భారత్, ప్రధానంగా దేశీయంగా సంస్కరణలతో పాటు అంతర్జాతీయంగా అమలవుతున్న ఉత్తమ విధానాలను కూడా అధ్యయనం చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) తెలిపింది. సాధారణంగా డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ పేరిట వివిధ దేశాల్లో వ్యాపారాలకు అనువైన పరిస్థితులపై ప్రపంచ బ్యాంక్ గ్రూప్ .. ర్యాంకింగ్‌లు ఇస్తూ వస్తోంది. కానీ, దీని రూపకల్పనలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు రావడంతో 2020 నుంచి దాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. దాని స్థానంలో కొత్త విధానాలతో బీ–రెడీ రిపోర్ట్‌ను రూపొందిస్తోంది. వ్యాపారాల విషయంలో అవరోధాలు ఈ రిపోర్ట్‌లో ప్రధాన అంశాలుగా ఉంటాయి.ఇదీ చదవండి: రూ.15,100 కోట్ల క్లెయిమ్‌లను అనుమతించలేదు!బీ-రెడీ నివేదిక ప్రపంచ బ్యాంకు కొత్త ఫ్లాగ్ షిప్ రిపోర్ట్. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థల్లో వ్యాపార, పెట్టుబడి వాతావరణాన్ని అంచనా వేస్తోంది. ఇది గతంలో ఉన్న ‘డూయింగ్ బిజినెస్ ఇండెక్స్’ను భర్తీ చేస్తుంది. దేశంలోని వ్యాపార అనుకూలతలు, కార్మిక నిబంధనలు, అంతర్జాతీయ వాణిజ్యం వంటి ఎన్నో అంశాలను పరిగణిస్తుంది. బీ-రెడీ ఫ్రేమ్‌వర్క్‌లో చేరడానికి భారత్ సిద్ధమవుతుంది. అయితే ఇందులో మంచి స్కోర్ సంపాదించడం కొంత కష్టమని జీటీఆర్ఐ తెలిపింది. భారత్ చాలా రంగాల్లో పురోగతి సాధించినప్పటికీ, డిజిటల్ ఇంటిగ్రేషన్, కస్టమ్స్(Customs) చెల్లింపుల్లో ఆలస్యం, కొన్ని విభాగాల్లో స్థిరమైన నిర్ణయాలు అమలు చేయడంలేదనే వాదనలున్నట్లు హైలైట్ చేసింది. -
ఏపీ రాజధాని అమరావతికి తప్పని వరద ముప్పు
-
ఆర్థిక అసమానతలకు కారణం ఏమిటంటే..
దేశంలో పెరుగుతున్న ఆహార ద్రవ్యోల్బణం ప్రజల్లో ఆర్థిక అసమానతలను సృష్టిస్తుందని ప్రపంచ బ్యాంక్ మాజీ చీఫ్ ఎకనామిస్ట్ కౌశిక్‌బసు అభిప్రాయపడ్డారు. సామాన్య ప్రజలు తమ ఆదాయంలో దాదాపు 50 శాతం కంటే ఎక్కువ ఆహార అవసరాలకే ఖర్చు చేస్తున్నారని చెప్పారు. దిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.‘సామాన్య ప్రజల ఆదాయాలు గణనీయంగా తగ్గుతున్నాయి. నెలవారీ ఆదాయంలో గరిష్ఠంగా ఆహార అవసరాలకే ఖర్చు చేస్తున్నారు. భారత్‌లో ద్ర్యవ్యోల్బణం 5.1 శాతంగా ఉంది. దీన్నిబట్టి ఆహార ద్రవ్యోల్బణం 30 శాతంగా ఉంటుంది. నెలవారీ ఆదాయంలో 50 శాతం కంటే ఎక్కువ ఆహారానికే ఖర్చు చేసే కుటుంబాలు మరింత పేదరికంలోకి నెట్టవేయబడుతున్నాయి. దానివల్ల ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. భారత్‌లో కార్మిక చట్టాలను సమర్థంగా అమలు చేయాలి. ఏఐలో ఆవిష్కరణలు పెరుగుతున్నాయి. ఇప్పటికే సంప్రదాయ కార్మిక రంగంపై దీని ప్రభావం పడుతోంది. విద్య ఒక్కటే పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలకు పరిష్కారం కాదు. ఏ రంగంలో పనిచేస్తున్న వారైనా నైపుణ్యాలు పెంచుకోవాలి. భారత్‌లో పేదరికాన్ని తగ్గించడానికి ప్రభుత్వం పీఎం గరీబ్ కల్యాణ్ యోజన వంటి పథకాలు ప్రవేశపెట్టింది. అయినా మరిన్ని సంస్కరణలు రావాలి’ అని బసు సూచించారు.ఇదీ చదవండి: ‘ఆరేళ్లలో 14.8 కోట్ల ఉద్యోగాలు సృష్టించాలి’ -
మీరిక్కడున్నట్లు వాళ్లకెలా తెలిసింది సార్!
-
టైమ్ మ్యాగజైన్లో ఇద్దరు బారతీయ అమెరికన్లకు చోటు..!
టైమ్ మ్యాగజైన్ 2024 ఏడాదికి అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. వందమంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలోని రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నవల్నీ భార్య యులియా నవల్ని, ప్రపంచ బ్యాంక్ చీఫ్ అజయ్ బంగా వంటి ప్రముఖులు ఉన్నారు. ఈ జాబితాలో నాయకుల విభాగంలో భారత సంతతికి చెందిన యూఎస్ అధికారి జిగర్ షా, ఇటాలియాన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని, ఇరాన్ మానవ హక్కుల కార్యకర్త నర్గేస్ మొహ్మది వంటి వారు కూడా ఉన్నారు. ఈ జాబితాను టైమ్ మ్యాగజైన్ నాయకులు, ఆదర్శవంతమైన వ్యక్తులు, ఆయా రంగాల్లో ప్రావీణ్యం గల వారుగా వర్గీకరించి మరీ ఈ జాబితాను విడుదల చేసింది. ఇక రష్యా ప్రతిపక్ష నాయకుడు భార్య యులియా తన భర్త మరణాంతరం రాజకీయాల్లోకి వచ్చారు. తన భర్త అలెక్సి ఉనికిని సజీవంగా ఉంచేందుకు రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. ఇక భారతీయ అమెరికన్ అజయ్ బంగా గతేడాది ప్రపంచ బ్యాంకుకి అధ్యక్షుడయ్యారు. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక సంస్థలైన ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధికి నాయకత్వం వహించిన తొలి భారత సంతతి అమెరికన్‌గా చారిత్రతక ఘట్టాన్ని ఆవిష్కరించారు. బంగా ఐదేళ్ల కాలానికి 14వ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఈ జాబితాలో మరో భారతీయ అమెరికన్ జిగర్ షా యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ ప్రోగ్రామ్ ఆఫీస్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ డిపార్ట్మెంట్ స్వచ్ఛమైన మౌలిక సదుపాయాలు, ఇంధన కార్యక్రమాల కోసం పబ్లిక్ ఫండ్‌లో దాదాపు వంద బిలియన్ డాలర్లను పర్యవేక్షిస్తుంది. అలాగే నాయకుల జాబితాలో ఉన్న అగ్ర రాజకీయ నాయకులలో టాలియన్ ప్రధాని జార్జియా మెలోని ఒకరు. 47 ఏళ్ల మెలోని 2022లో అధికారంలోకి వచ్చి ఇటలీకి తొలి మహిళ నాయకురాలయ్యింది. ఆమెకు దేశంలో భారీగా మద్దతు ఉండటం విశేషం. ఇక 51 ఏళ్ల నర్గేస్ మొహమ్మది ఇరాన్ మానవహక్కుల కోసం ఆమె అలసిపోని న్యాయవాదానికి గుర్తుగా 2023 నోబెల్ శాంతి బహుమతి గెలుచుకుంది. దీని గురించి ఆమె గత ఇరవై ఏళ్లులో ఎన్నో సార్లు జైలుల పాలయ్యింది. ఇప్పటికీ టెహ్రాన్‌లో ఎవిన్ జైలులో నిర్బంధింపబడి ఉంది. ఇక ఈ టైమ్స్ ప్రతిభావంతమైన వ్యక్తుల జాబితాలో ఈ జాబితాలో రెజ్లర్ సాక్షి మాలిక్ , సత్య నాదెళ్లకు కూడా చోటు దక్కించుకున్నారు. (చదవండి: సోషల్ మీడియా క్రేజ్ కోసం ఓ తండ్రి పసికందుపై పిచ్చి ప్రయోగం! చివరికి..) -
ప్రపంచ పర్యావరణానికి కొత్త గీతం
ఆడవాళ్లకు ఇంటి పని, వంటపని, మహా అయితే చిన్నదో పెద్దదో ఉద్యోగం చేయడం తప్ప పెద్ద పెద్ద ఆర్థిక వ్యవహారాలేం తెలుస్తాయి... అని చప్పరించేసే వారికి చెంపపెట్టు గీతాబాత్రా. భారతదేశానికి చెందిన ఆర్థికవేత్తల పేర్లు కొన్ని చెప్పమంటే మొదటి పది అంకెల్లోనే ఉండే పేరు ఆమెది. ఆర్థికవేత్తగా ఎంతో క్రమశిక్షణతో... అంతకుమించిన నిబద్ధతతో ఆమె తీసుకునే విధానపరమైన కీలక నిర్ణయాలే ప్రపంచ బ్యాంకు తాజా సమావేశంలో ఆమెను గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ డైరెక్టర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకునేలా చేశాయి. అంతేకాదు, ఆ పదవిలో నియామకం అయిన తొలి మహిళా డైరెక్టర్‌గా కూడా యాభై ఏడు సంవత్సరాల గీతాబాత్రా పేరు ఒక్కసారిగా జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో పతాక శీర్షికలకు ఎక్కింది. నిజానికి ఈ నియామకం ఇప్పటికి ప్పుడు తీసుకున్న నిర్ణయం ఏమీ కాదు. సుమారు మూడు వారాల క్రితం వాషింగ్టన్లో జరిగిన జీఈఎఫ్ 66వ కౌన్సిల్ మీటింగ్‌లోనే ఆమె పేరు పరిశీలనకు వచ్చింది. ఆ తర్వాత గీతాబాత్రా అయితేనే ఈ పదవికి తగిన న్యాయం చేయగలదని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే ఆమెను ఈ స్థానంలో నియమించారు. అయితే జీఈఎఫ్ డైరెక్టర్‌గా నియమితురాలు కావడం ఆమెకు ఏదో గొప్ప పదవిని కట్టబెట్టినట్టు కాదు... ఎన్నో సవాళ్లతో కూడిన ఎంతో బాధ్యతాయుతమైన స్థానం అది. 1998లో వరల్డ్ బ్యాంక్‌లో చేరడానికన్నా ముందు ఆమె అమెరికాలోని కొన్ని ప్రైవేట్ బ్యాంక్‌లలో పై స్థాయిలో పని చేసింది. అసలు ఆమె నేపథ్యం ఏమిటో చూద్దాం. గీతాబాత్రాది కొత్తదిల్లీ. ముంబాయిలోని విల్లా థెరిసా స్కూల్లో చదువు పూర్తయ్యాక చెన్నైలోని స్టెల్లా మేరిస్ కాలేజీలో అర్థశాస్త్రంలో డిగ్రీ చేసింది. ఆ తర్వాత ఎంబీఏ ఫైనాన్స్ చేసింది. ఇక ఉద్యోగం చూసుకుందాం అనుకుంటుండగా ఆమె ప్రోఫెసర్లలో ఒకరి ప్రోద్బలంతో అమెరికా వెళ్లి ఎకనామిక్స్‌లో పీహెచ్డీ చేసింది. అక్కడే అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంక్‌లో సీనియర్ మేనేజర్‌గా కొన్ని సంవత్సరాల పాటు పని చేసింది. వరల్డ్ బ్యాంక్‌కు అనుబంధ సంస్థలలో ఆమె 2005 వరకు పని చేసింది. అప్పుడే ఆమె ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు అడ్వైజరీ సర్వీసెస్‌లో పని చేసింది. ఆ తర్వాత ఆమె భారతదేశం నుంచి వరల్డ్ బ్యాంక్ ఐఈజీలో చీఫ్ ఎవల్యూటర్ అండ్ మేనేజర్‌గా కార్పొరేట్ థీమాటిక్ ఎవల్యూషన్ బాధ్యతలు చేపట్టింది. ఆ తర్వాత 2015 లో జీఈఎఫ్ ఐఈవోగా చేరి, నాటినుంచి టీమ్‌తో పని చేయిస్తోంది. నాటినుంచి ఆమె ఎన్నో విపత్కర పరిస్థితులను అధిగమించడంలో ఎంతో సమర్థనీయమైన పాత్రను పోషించింది. ఎన్నో పుస్తకాలు రాసింది. మరెన్నింటికో సంపాదకత్వ బాధ్యతలు వహించింది. ప్రస్తుతం నార్ద్రన్ వర్జీనియాలో భర్త ప్రకాష్, కుమార్తె రోషిణితో కలిసి జీవిస్తోంది. జీఈఎఫ్ ‘గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ) పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ బ్యాంకు చేపట్టే అన్ని బాధ్యతలను ఆమె పర్యవేక్షించడమే కాదు.. అందుకు కావలసిన. కీలక నిర్ణయాలు కూడా తీసుకోనున్నారు. -
వరల్డ్ బ్యాంక్ నుంచి ఎస్బీఐ లోన్.. కారణం ఇదే
న్యూఢిల్లీ: రూఫ్‌టాప్ సోలార్ ప్రాజెక్ట్‌లను ప్రోత్సహించడం కోసం ప్రపంచ బ్యాంక్‌తో రూ.1,300 కోట్లకు పైగా లైన్ ఆఫ్ క్రెడిట్‌పై (ఎల్ఓసీ) సంతకం చేసినట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) శుక్రవారం తెలిపింది. గృహ,ఇన్స్టిట్యూషనల్ విభాగాల్లో గ్రిడ్‌కు అనుసంధానించే రూఫ్‌టాప్ సోలార్ పీవీ ప్రాజెక్ట్‌లకు మద్దతు ఇవ్వడం కోసం ఈ ఎల్ఓసీ అని ఎస్బీఐ శుక్రవారం తెలిపింది. పర్యావరణ పరిరక్షణ ప్రాజెక్ట్‌లకు రుణ సా యం అందించేందుకు యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్‌తో సుమారు రూ.1,800 కోట్ల ఎల్ఓసీపై ఎస్బీఐ ఈ వారం ప్రారంభంలో సంతకం చేసింది.ఎల్ఓసీ అనేది బ్యాంక్ లేదా ఇతర ఆర్థిక సంస్థ ద్వారా ప్రభుత్వం, కంపెనీ లేదా వ్యక్తిగత కస్టమర్‌కు ఇచ్చే రుణ సదుపాయం. -
2024 గ్లోబల్ బ్యాంకింగ్‌పై నెగటివ్ అవుట్‌లుక్: మూడీస్
న్యూఢిల్లీ: కేంద్ర బ్యాంకుల కఠిన ద్రవ్య విధానాల వల్ల పలు దేశాల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి తగ్గే అవకాశం ఉందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ పేర్కొంది. దీనివల్ల 2024కి సంబంధించి ప్రపంచ బ్యాంకుల అవుట్‌లుక్ ప్రతికూలంగా (నెగటివ్) ఉందని పేర్కొంది. మొండి బకాయిలకు కేటాయింపు (ప్రొవిజనింగ్స్) వ్యయాలు తగ్గే అవకాశాలు, దేశ చక్కటి వృద్ధి రేటు వల్ల భారత్ బ్యాంకుల లాభదాయకత పెరుగుతుందని మూడీస్ అంచనావేయడం గమనార్హం. అధిక నిధుల సమీకరణ వ్యయాలు, రుణ వృద్ధి తక్కువగా ఉండడం వంటి సమస్యలు ఉన్నప్పటికీ భారత్ బ్యాంకింగ్ సవాళ్లను తట్టుకుని నిలబడుతుందన్న అభిప్రాయాన్ని నివేదిక వ్యక్తం చేసింది. ‘‘లిక్విడిటీ తగ్గడం (ద్రవ్య లభ్యత), రుణ చెల్లింపుల నాణ్యత పడిపోవడం వల్ల ప్రపంచంలోని పలు దేశాల బ్యాంకుల అసెట్ నాణ్యత దెబ్బతింటుంది’’ అని మూడీస్ తన గ్లోబల్ బ్యాంకింగ్ అవుట్‌లుక్ నివేదికలో పేర్కొంది. కఠినమైన ద్రవ్య విధానాల వల్ల బ్యాంకింగ్ నిర్వహణా పరిస్థితులు క్షీణిస్తాయని అభిప్రాయపడింది. ప్రధాన కేంద్ర బ్యాంకులు రేట్లు తగ్గించడం ప్రారంభించినప్పటికీ, కఠిన ద్రవ్య పరిస్థితులే 2024లో కొనసాగుతాయని, ఇది ఆయా దేశాల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిపై ప్రభావం చూపుతుందని మూడీస్ పేర్కొంది. ద్రవ్యోల్బణం ఒత్తిడులు తగ్గినప్పటికీ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పర్యావరణ సవాళ్లు ఆందోళనకు గురిచేస్తాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రైవేట్ వ్యయాలు తగ్గడం, బలహీన ఎగుమతులు, ప్రాపర్టీ మార్కెట్ దిద్దుబాటు కారణంగా చైనా ఆర్థిక వృద్ధి మందగిస్తుందని అభిప్రాయపడింది. దీనివల్ల పలు చైనా బ్యాంకులపై ప్రతికూల ప్రభావం పడే వీలుందని అంచనావేసింది. -
ఆహార పంటల విస్తీర్ణం పెరగాలి
సాక్షి, విశాఖపట్నం: నీటి కొరత పెరిగే కొద్దీ ప్రజల జీవన ప్రమాణాల్లో అనేక మార్పులు వస్తాయని ప్రపంచ బ్యాంక్ గ్రూప్ గ్లోబల్ మిషన్ లీడర్ అమల్ తాల్బి తెలిపారు. ముఖ్యంగా ఆహార కొరత వేధిస్తుందని చెప్పారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆకలి కేకలు తప్పవన్నారు. 2030 నాటికి 670 మిలియన్ల మంది ఆకలితో అలమటిస్తారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో పెరుగుతున్న జనాభాకు అనుగణంగా ఆహార పంటల విస్తీర్ణాన్ని పెంచాల్సి ఉందన్నారు. 2050 నాటికి ప్రస్తుతం ఉన్న ఆహార ఉత్పత్తి రెట్టింపయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాల్లో 500 మిలియన్లకు పైగా ఉన్న వ్యవసాయ క్షేత్రాల నుంచి 80 శాతం వరకూ ఆహారం ఉత్పత్తవుతోందని తెలిపారు. పేదరికాన్ని జయించేందుకు ప్రపంచ బ్యాంక్ అత్యంత కీలక నిర్ణయాలను అమలు చేస్తోందన్నారు. విశాఖపట్నంలో 25వ అంతర్జాతీయ కాంగ్రెస్, ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ (ఐసీఐడీ) ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ 74వ అంతర్జాతీయ సమావేశాల్లో అమల్ తాల్బి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ‘సాక్షి’తో పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. నీటి ఎద్దడి పెరుగుతోంది.. గత 50 ఏళ్లలో వర్షపాతం గణనీయంగా 233 శాతం పెరిగింది. అయితే.. భూమికి చేరుతున్న వర్షపు నీటిని ఒడిసిపట్టడంలో పూర్తిగా విఫలమవుతున్నాం. ఈ కారణంగానే నీటి ఎద్దడి పెరుగుతోంది. వాతావరణంలో తలెత్తుతున్న 10 మార్పుల్లో 8 నీటికి సంబంధించినవే ఉంటున్నాయి. దీన్నిబట్టి చూస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. సుస్థిర లక్ష్యాలు నిర్దేశించుకున్నాం.. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ప్రపంచ బ్యాంక్ మిషన్ మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా నీటి ఉత్పాదకత– సంరక్షణ, ఆహార ఉత్పత్తిని పెంపొందించడం తదితర అంశాలపై ప్రపంచ బ్యాంక్ సుస్థిర లక్ష్యాల్ని నిర్దేశించుకుంది. ఫార్మర్ లెడ్ ఇరిగేషన్ డెవలప్మెంట్ పేరుతో నీటిపారుదల రంగంలో స్థితిస్థాపకత, సాగునీటి నిర్వహణలో ఖచ్చితత్వం, నీటివనరుల అభివృద్ధి, మురుగు నీటి నిర్వహణ, వ్యవసాయంలో అత్యాధునిక పద్ధతులు, యాంత్రీకరణ తదితర అంశాలపై ఈ మిషన్ పనిచేస్తోంది. తొలి విడతలో ఆఫ్రికా దేశాల్లో 450 మిలియన్ యూఎస్ డాలర్లు ఖర్చు చేస్తున్నాం. ఈ మిషన్‌లో భాగంగా 77 మిలియన్ల మంది రైతులకు లబ్ధి చేకూరుస్తున్నాం. అక్కడ విధానాల్లో అనేక మార్పుల్ని తీసుకొచ్చాం. భవిష్యత్తులో మిగిలిన దేశాల్లోనూ ప్రపంచ బ్యాంక్ మిషన్‌ని అమలు చేస్తాం. తద్వారా నీటి ఎద్దడి, ఆహార సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాం. -
కమోడిటీ, చమురు మార్కెట్లకు ప్రపంచ బ్యాంక్ హెచ్చరిక
మిడిల్ఈస్ట్ దేశాల్లో కొనసాగుతున్న సంఘర్షణల వల్ల ప్రపంచ కమోడిటీ, ముడి చమురు ధరలు పెరిగే ప్రమాదం ఉందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. ఇప్పటివరకు పరిమిత ప్రభావం ఉన్నప్పటికీ, ఇంధన మార్కెట్, ఆహార భద్రతపై కూడా ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రభావం చూపుతుందని తెలిపింది. ప్రపంచబ్యాంక్ తాజా కమోడిటీ మార్కెట్లకు సంబంధించి ఔట్‌లుక్‌ను విడుదల చేసింది. అందులోని వివరాల ప్రకారం.. ప్రస్తుత త్రైమాసికంలో చమురు ధరలు సగటున బ్యారెల్‌కు 90 యూఎస్ డాలర్లు ఉంటుందని అంచనా. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి మందగించడంతో వచ్చే ఏడాది బ్యారెల్‌కు సగటున 81 డాలర్లకు తగ్గుతుంది. ప్రపంచ చమురు సరఫరా రోజుకు 20లక్షల నుంచి 5లక్షల బ్యారెళ్లకు తగ్గుతుందని దాంతో ధరలు 3-13 శాతం పెరుగుతాయని నివేదిక తెలిపింది. వచ్చే ఏడాది మొత్తం కమోడిటీ ధరలు 4.1 శాతం తగ్గుతాయని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. రానున్న కాలంలో సరఫరా పెరగడంతో వ్యవసాయ వస్తువుల ధరలు తగ్గుముఖం పడతాయి. మూల లోహాల ధరలు 2024లో 5 శాతం తగ్గుతాయని తెలిసింది. అయితే 2025లో మాత్రం వస్తువుల ధరలు స్థిరంగా ఉంటాయని సమాచారం. మిడిల్ఈస్ట్ దేశాల్లో 1970 తర్వాత తాజా యుద్ధ పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిందని ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్, డెవలప్మెంట్ ఎకనామిక్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇందర్మిత్గిల్ అన్నారు. ఈ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. -
నిర్మలా సీతారామన్ మొరాకో పర్యటన నేటి నుంచి
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ఆరు రోజుల పర్యటన నిమిత్తం మొరాకో బయలుదేరనున్నారు. ఆ దేశ ఆర్థిక రాజధాని మారకేచ్‌లో ఈ ఆరు రోజుల అధికారిక పర్యటనను ప్రారంభించనున్నారు. జీ20 ఆర్థికమంత్రులు, సెంట్రల్ బ్యాంకుల గవర్నర్ల (ఎఫ్‌ఎంసీబీజీ) సమావేశంతో పాటు ప్రపంచ బ్యాంక్–అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ వార్షిక సమావేశంలో ఆర్థికమంత్రి పాల్గొననున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. దీనితోపాటు ఇండోనేషియా, మొరాకో, బ్రెజిల్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్‌లతో భారత్ ద్వైపాక్షిక సమావేశాలు అక్టోబర్ 11–15 తేదీల మధ్య మరకేచ్‌లో జరగనున్నాయి. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్ వార్షిక సమావేశాల కోసం వెళుతున్న భారత ప్రతినిధి బృందానికి ఆర్థిక మంత్రి నాయకత్వం వహిస్తున్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ, భారత్ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) అధికారులు ఈ ప్రతినిధి బృందంలో సభ్యులుగా ఉంటారని ఒక అధికారిక ప్రకటన తెలిపింది. ఈ పర్యటనలో, సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నాల్గవ జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశానికి సహ అధ్యక్షత వహిస్తారు.ఈ సమావేశంలో జీ20 దేశాలు, ఆహా్వనిత దేశాలు, అంతర్జాతీయ సంస్థల నుండి దాదాపు 65 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. అంతర్జాతీయ సమస్యలు, సవాళ్లు, ఆర్థిక అనిశి్చతి, బహుళజాతి బ్యాంకుల పటిష్టత, క్రిప్టో కరెన్సీ వంటి అంశాలు ఈ సమావేశాల చర్చల్లో ప్రధాన భాగం కానున్నాయి. బహుళజాతి బ్యాంకుల పటిష్టతకు సంబంధించి నిపుణుల గ్రూప్ రూపొందించిన రెండవ వ్యాల్యూమ్ నివేదిక ఈ సమావేశాల్లో విడుదల కానుంది. మొదటి వ్యాల్యూమ్ నివేదిక గుజరాత్ గాం«దీనగర్‌లో జూలైలో జరిగిన మూడవ ఎఫ్‌ఎంసీబీజీ సమావేశాల్లో విడుదలైన సంగతి తెలిసిందే. -
భారత్ వృద్ధిపై భరోసా.. వరల్డ్ బ్యాంక్ అంచనా
ఢిల్లీ: భారత్ ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) 6.3 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటుందన్న తన అంచనాలను ప్రపంచ బ్యాంక్ పునరుద్ఘాటించింది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి పరిస్థితి నెలకొన్నప్పటికీ, భారత్ సేవల రంగం పటిష్టంగా ఉంటుందని ఇండియా డెవలప్మెంట్ తాజా అక్టోబర్ అవుట్‌లుక్‌లో స్పష్టం చేసింది. భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో సేవల రంగం మెజారిటీ వాటాను కలిగి ఉన్న సంగతి తెలిసిందే. 2022–23 భారత్ వృద్ధి రేటు 7.2 శాతం. కాగా, దక్షిణాసియా వృద్ధి రేటు 5.8 శాతంగా ఉంటుందని ప్రపంచబ్యాంక్ అంచనావేసింది. ఇతర వర్థమాన మార్కెట్, అభివృద్ధి చెందుతున్న దేశాల ఎకానమీ (ఈఎండీఏ)ల వృద్ధి రేటు 2023–24లో 6.3 శాతం, 2024–25లో 6.4 శాతం నమోదుకావచ్చని అంచనా వేస్తోంది. ప్రపంచ బ్యాంక్ తాజా అంచనాల ప్రకారం... 2023–24లో వ్యవసాయ రంగం 3.5 శాతం పురోగమిస్తుంది. పరిశ్రమల రంగం 5.7 శాతం, సేవల రంగం 7.4 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటాయి. పెట్టుబడుల్లో వృద్ధి 8.9 శాతంగా ఉంటుంది. ప్రభుత్వ చర్యల వల్ల ద్రవ్యోల్బణం నెమ్మదిగా దిగివస్తుంది. ఆర్థిక సంవత్సరంలో సగటును రిటైల్ ద్రవ్యోల్బణం 5.9 శాతం ఉంటుందని అంచనా. ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు జీడీపీలో లక్ష్యాల మేరకు 6.4 శాతం నుంచి (2022–23లో జీడీపీతో పోల్చి) 5.9 శాతానికి దిగివస్తుంది. ప్రభుత్వ రుణ భారం జీడీపీలో 83 శాతం వద్ద స్థిరంగా ఉంటుంది. ప్రభుత్వ స్థూల రుణం జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి రూ.159.54 లక్షల కోట్లుగా నమోదయ్యింది. మార్చితో ముగిసిన త్రైమాసికంతో పోల్చితే (రూ.156.08 లక్షల కోట్లు) ఈ పరిమాణం 2.2 శాతం పెరిగింది. మొత్తం రుణాల్లో పబ్లిక్ డెట్ 89.5 శాతంగా ఉంది. భారత్ విదేశీ రుణ భారం జూన్ ముగిసే నాటికి 629.1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.52 లక్షల కోట్లు) చేరింది. దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ కరెన్సీ అకౌంట్‌కు సంబంధించిన కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) జీడీపీలో దేశం భరించగలిగిన స్థాయిలోనే 1.4 శాతంగా ఉంటుంది. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకుల రుణ నాణ్యత మెరుగుపడుతుంది. అధిక రుణ వృద్ధి, మొండిబకాయిలు తగ్గడం, చక్కటి రికవరీలు, మొండి బకాయిల రైటాఫ్స్ దీనికి కారణం. 2022 మార్చిలో 5.9 శాతంగా ఉన్న షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకుల స్థూల మొండిబకాయిల నిష్పత్తి, 2023 మార్చి నాటికి 3.9 శాతానికి తగ్గడం గమనార్హం. కొన్ని సంస్థల అంచనా ఇలా.. (వృద్ధి శాతాల్లో) సంస్థ 2023–24 ఆర్బీఐ 6.5 ఎస్అండ్పీ 6.0 ఫిచ్ 6.3 మూడీస్ 6.1 ఏడీబీ 6.3 ఇండియా రేటింగ్స్ 6.2 ఓఈసీడీ 6.3 -
థాంక్యూ జగన్ మామయ్యా
గుమ్మలక్ష్మీపురం/విజయనగరం అర్బన్: అమెరికా వెళ్లడం.. ఐక్యరాజ్య సమితి, వరల్డ్ బ్యాంకు కార్యాలయాల్లో ప్రసంగించడం.. వైట్ హౌస్‌ను సందర్శించడం... రాష్ట్రప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకునేందుకు ఆయా సంస్థల ప్రతినిధులు ఆసక్తి చూపడం.. మమ్మలను మనసారా ఆశీర్వదించడం.. అంతా ఓ మిరాకిల్. చదువులో రాణించిన తమలాంటి పేదకుటుంబాల విద్యార్థులకు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కల్పించిన ఓ సువర్ణావకాశం ఇది.. థాంక్యూ జగన్మామయ్యా అంటూ.. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇటీవల అమెరికా వెళ్లి తిరిగి వచ్చిన కస్పా మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థిని అల్లం రిషితారెడ్డి, సామల మనస్విని ఆనందబాష్పాలు రాల్చారు. 15 రోజుల పాటు (గతనెల 15 నుంచి 27వ తేదీవరకు) పర్యటన అనంతరం స్వస్థలాలకు వచ్చిన వారు ‘సాక్షి’తో మంగళవారం కాసేపు ముచ్చటించారు. పర్యటన వివరాలు వారి మాటల్లోనే... సంతోషంగా ఉంది మాది కురుపాం మండలంలోని కొండబారిడి గిరిజన గ్రామం. 1 నుంచి 5వ తరగతి వరకు గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్‌పేట ఎంపీపీ స్కూల్లోను, 6వ తరగతి విద్యను కురుపాం మండలం మొండెంఖల్లు జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదివాను. సింగిల్ పేరెంట్కావడంతో గుమ్మలక్ష్మీపురం కేజీబీవీలో 7వ తరగతిలో సీటు లభించింది. ప్రసుత్తం 9వ తరగతి చదుతున్నాను. ఈ ఏడాది జూన్ 28న నాలుగోవిడత ‘జగనన్న అమ్మఒడి పథకం’ నిధుల విడుదలకు కురుపాం నియోజకవర్గ కేంద్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వచ్చారు. ఆ సమయంలో రాష్ట్రంలో పేద విద్యార్థుల చదువుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించాను. సీఎం ఆశీర్వదించి అమెరికా పర్యటనకు అవకాశం కల్పించారు. మారుమూల గ్రామానికి చెందిన నేను ఓ సారి విశాఖపట్నం, మరోసారి విజ్ఞానప్రదర్శన కోసం విజయవాడకు వెళ్లాను. అంతే.. విమానం ఎక్కుతానని కలలోకూడా ఊహించలేదు. ముఖ్యమంత్రి చొరవతో ఏకంగా అగ్రరాజ్యమైన అమెరికాను సందర్శించాను. అక్కడకి వచ్చిన వివిధ దేశాల విద్యార్థులతో మమేకమయ్యాం. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ విద్యా విధానంతో విద్యార్థులకు కలుగుతున్న ప్రయోజనాలను వివరించాను. చదువుకోసం ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యానికి వారంతా ముగ్దులయ్యారు. భవిష్యత్తులో అమెరికాలో ఉన్నత చదువులు చదువుకోవాలన్నా, స్థిరపడాలన్నా సంప్రదించాలంటూ అక్కడి అధికారులు ఆహ్వానించడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇంతటి గుర్తింపును, అనుభవాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డినికి ప్రత్యేక కృతజ్ఞతలు. – సామల మనస్విని, గుమ్మలక్ష్మీపురం కేజీబీవీ విద్యార్థిని ఆశయ సాధనకు భరోసా దొరికింది మాది విజయనగరం శివారు కాలనీ జమ్మునారాయణపురం. తండ్రి రామకృష్టారెడ్డి ప్రైవేటు సంస్థలో మెకానిక్. తల్లి ఉదయలక్ష్మి గృహిణి. అక్క హోహితారెడ్డి నూజివీడు ట్రిపుల్ ఐటీలో బీటెక్ చదువుతోంది. నాకు కూడా ఈ ఏడాది అదే కళాశాలలో సీటు వచ్చింది. వాస్త వంగా మాది నిరుపేద కుటుంబం. చాలీచాలని జీతంతో ఇద్దరమ్మాయిలను ఎలా చదివించగలమంటూ నిత్యం మా తల్లిదండ్రులు మదనపడేవారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఆ బెంగ తీరింది. పదోతరగతిలో 587 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచాను. ప్రభుత్వం నిర్వహించిన ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి ఐక్యరాజ్య సమితి సందర్శనకు వెళ్లాను. అక్కడ అన్ని దేశాల కల్చర్‌ను తెలుసుకున్నాను. మన దేశ సంస్కృతి సంప్రదాయాలను తెలియజేశాను. పేదపిల్లల చదువుకు ఆంధ్రా ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వివరించాను. ఐక్యరాజ్య సమితి నిర్వహించే చర్చావేదికల్లో పాల్గొన్నా. ప్రభుత్వం అందిస్తున్న చదువుసాయంతో ఉన్నతంగా రాణిస్తాను. – అల్లం రిషితారెడ్డి, విజయనగరం -
ప్రపంచ బ్యాంక్ మీటింగ్ లో ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు
-
పాకిస్థాన్‌కు ప్రపంచ బ్యాంకు హెచ్చరికలు
అప్పుల్లో కూరుకుపోయిన పాకిస్థాన్‌కు ప్రపంచ బ్యాంకు హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. దేశంలో నెలకొన్న ఆర్ధిక సంక్షోభాన్ని సరిదిద్దడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సైనిక, రాజకీయ, వాణిజ్యంలో నాయకుల స్వార్ధప్రయోజనాలు పక్కకు పెట్టి నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని వరల్డ్ బ్యాంకు పాక్ ప్రతినిధి నజీ బాన్‌హాస్సిన్ అన్నారు. పాకిస్థాన్ ప్రస్తుతం సంక్షోభం అంచున ఉంది. 40 శాతం జనాభా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న విద్యుత్ ధరలు, తగినన్ని వనరులు లేకపోవడం సహా అనేక ఆర్ధిక కష్టాలను పాక్ ఎదుర్కొంటోంది. పిల్లల విద్యా ప్రమాణాలు, చిన్నారుల మరణాలు వంటి సూచికలు.. పాక్ పేదరికం తారా స్థాయికి చేరిందని చెబుతున్నాయని నజీ బాన్‌హాస్సిన్ తెలిపారు. 2000 నుంచి 2020 మధ్య కాలంలో పాకిస్థాన్ సగటు వాస్తవ తలసరి వృద్ధి రేటు కేవలం 1.7 శాతం మాత్రమే. ఇది దక్షిణాఫ్రికా దేశాల సగటు తలసరి వృద్ధి రేటులో సగం కంటే తక్కువగా ఉందని నజీ వెల్లడించారు. పాక్ మానవాభివృద్ధి సూచికలోనూ దక్షిణాసియాలో చిట్టచివరన ఉంది. విదేశీ నిల్వలు అడుగంటాయి. వాతావరణ మార్పులు ఆ దేశానికి శాపంగా మారుతున్నాయి. పాక్‌లో వచ్చే జనవరిలో జాతీయ స్థాయిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దేశంలో ఆర్ధిక పరిస్థితులు బాగులేని కారణంగా ప్రపంచ బ్యాంకు హెచ్చరికలు జారీ చేసింది. ఆర్ధిక వ్యవస్థను సరిచేసుకోవాల్సిన సమయమని సూచించింది. నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం ఉచిత హామీలకు పోకూడదని పేర్కొంది. ఆర్ధిక రంగాన్ని గాడిన పెట్టడానికి నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలని కోరింది. వృధా ఖర్చులను తగ్గించుకోవాలని ప్రపంచ బ్యాంకు సూచించింది. ప్రజా సేవలు, మౌలిక సదుపాయాల్లో పరిమితమైన ఖర్చు చేయాలని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: పీఓకేను ఖాళీ చేయండి: భారత్ అల్టిమేటమ్ -
యాంటీబయోటిక్స్ కూడా పనిచేయవా?
గుండెల నిండా హాయిగా గాలి పీల్చుకోవాలంటే భయం. మాస్కు లేకుండా ఇల్లు కదలాలంటే భయం, భయం శరీరాన్ని, మెదడుని ఆక్రమించిన కలుషిత గాలి ఇప్పుడు వ్యాధుల నుంచి బయటపడేసే సంజీవిని లాంటి యాంటీబయోటిక్స్ రెసిస్టెన్స్‌పై ప్రభావం చూపిస్తోంది. వాయు కాలుష్యంతో యాంటీబయోటిక్స్ పని చేయడం లేదని, ప్రపంచవ్యాప్తంగా ఈ కేసుల సంఖ్య పెరిగిపోతోందని తాజా అధ్యయనం హెచ్చరించింది. ఢిల్లీకి చెందిన సమత వయసు 40 సంవత్సరాలు. ఒకరోజు హఠాత్తుగా శ్వాస తీసుకోవడం కష్టమైంది. ఆస్తమా అటాక్ అయింది. ఇంట్లో ఎవరికీ లేని ఆస్తమా ఎందుకొచ్చిందా అని ఆందోళనతో ఉంటే మందులు పని చెయ్యకపోవడంతో కుటుంబ సభ్యులు బెంబేలెత్తిపోయారు. చివరికి ఆస్పత్రిలో చేరితే వైద్యులు అతి కష్టమ్మీద ఆమె ప్రాణాలు కాపాడగలిగారు. దీనికంతటికీ కారణం వాయు కాలుష్యం. వాహనాలు, పరిశ్రమలు వెదజల్లే కాలుష్యం గాల్లో కలిసిపోయి మనుషుల ఊపిరితిత్తులు, గుండె, మెదడుకి పాకుతోంది. వాయు కాలుష్యంతో శ్వాసకోశ సమస్యలు, గుండె వ్యాధులు, కేన్సర్, చివరికి ఆయుఃప్రమాణాలు క్షీణిస్తాయనే మనకి తెలుసు. ఇలాంటి ప్రాణాంతక వ్యాధులకు సంజీవనిలా ఉపయోగపడే యాంటీబయోటిక్స్ పని చేయకుండా వాయుకాలుష్యం చేస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇది పెరిగిపోతే భవిష్యత్‌లో మనుషుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయన్న ఆందోళనలున్నాయి. కలుషిత గాలితో వచ్చే అనర్థాల్లో తాజాగా యాంటీబయోటిక్ నిరోధకత పెరిగిపోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తోందని లాన్సెట్ హెల్త్ జర్నల్ అధ్యయనాన్ని ప్రచురించింది. చైనా, యూకేకు చెందిన శాస్త్రవేత్తలు వాయు కాలుష్యం ప్రభావాలపై వివిధ సంస్థలు సేకరించిన గణాంకాల ఆధారంగా యాంటీబయోటిక్స్ పనిచేయకపోవడం అతి పెద్ద పెనుముప్పుగా మారనుందని హెచ్చరించారు. 2000 నుంచి 2018 మధ్య కాలంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూరోపియన్ ఎని్వరాన్‌మెంట్ ఏజెన్సీ, వరల్డ్ బ్యాంక్ సహా 116 దేశాల డేటాను సేకరించి అధ్యయనం చేశారు. ► గాల్లోని సూక్ష్మాతి సూక్ష్మ ధూళి కణాలు పీఎం 2.5 వల్ల యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ పెరిగిపోతోంది. గాలిలో కాలుష్యం 10శాతం పెరిగితే యాంటీబయోటిక్‌ను నిరోధించే సామర్థ్యం 1.1% పెరుగుతోంది ► ప్రపంచవ్యాప్తంగా 703 కోట్ల మంది ప్రజలు పీఎం 2.5 దు్రష్పభావాలను ఎదుర్కొంటున్నారు. ► గాల్లో పీఎం 2.5 ధూళి కణాలు మనుషుల వెంట్రుక కంటే 30 రెట్లు చిన్న కణాలతో ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా యాంటీబయోటిక్ నిరోధకతను ఇవి ఎంత ప్రభావితం చూపిస్తున్నాయన్నది అర్థం చేసుకోవడం దుర్లభంగా మారింది. ► యాంటీబయోటిక్స్ పనిచెయ్యకపోవడానికి ప్రధాన కారణం వాటిని మితి మీరి వాడడం అయినప్పటికీ వాయు కాలుష్యమూ మనుషుల శరీరంలో యాంటీబయోటిక్ నిరోధక బ్యాక్టీరియాను పెంచుతోంది. ► ఆస్పత్రులు, వ్యవసాయ క్షేత్రాలు, వ్యర్థాల శుద్ధి ప్లాంట్లు వంటి వాటి నుంచి యాంటీబయోటిక్‌లు పని చెయ్యకుండా చేసే కలుషిత గాలి ఎక్కువగా వెలువడుతున్నట్టు అధ్యయనం వివరించింది. ప్రాణం పోసే యాంటీబయోటిక్ ప్రాణమెలా తీస్తుంది? యాంటీబయోటిక్స్‌ని మితి మీరి వాడకం వల్ల శరీరంలో సహజసిద్ధమైన రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటోంది. దీనివల్ల సూపర్ బగ్స్ ఏర్పడి మంచి బ్యాక్టీరియాను తినేస్తున్నాయి. ఫలితంగా వ్యాధులు సోకినప్పుడు మందులు వేసుకున్నా పని చేయకుండా పోతున్నాయి. యాంటీబయోటిక్స్ పని చెయ్యకపోవడం వల్ల ప్రస్తుతం ఏడాదికి లక్ష మంది మరణిస్తున్నారు. 2050 నాటికి ఈ కారణంతో ప్రపంచ దేశాల్లో అత్యధికమరణాలు సంభవించే ముప్పు ఉంది. -
ప్రపంచ బ్యాంక్‌లో మన తెలుగమ్మాయి
ఇందుది కృష్ణా జిల్లా పెనమలూరు. సాధారణ మధ్యతరగతి కుటుంబం. తండ్రి గెస్ట్ లెక్చరర్. తల్లి గృహిణి. ఎం.ఎస్. చేయడం కోసం యూఎస్ వెళ్లింది. ప్రపంచ బ్యాంకు ఉద్యోగం తెచ్చుకుంది. చిన్నప్పటి నుంచి కష్టపడి చదివే మనస్తత్వం... స్పష్టమైన గమ్యం... లక్ష్యంపై ఏకాగ్రత... నిండైన ఆత్మవిశ్వాసం ఇందు సొంతం. తల్లిదండ్రులు మాధవి, సత్యనారాయణ. విజయవాడలో బీటెక్ పూర్తి చేసి, అమెరికాలో ఎం.ఎస్. పబ్లిక్ పాలసీ చేసింది. ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం సాధించిన వైనాన్ని ఆమె ‘సాక్షి’తో వివరించింది. ► పర్యావరణ పరిరక్షణ ‘‘అమెరికాలో ఎం.ఎస్. చదివి అక్కడే ఉద్యోగం చేయాలని ఉండేది. కోవిడ్ క్లిష్ట పరిస్థితుల్లో అమెరికా వెళ్లాను. అక్కడికి వెళ్లిన తరువాత నా దృక్కోణం విస్తరించింది. ప్రపంచ స్థాయిలో మానవజాతిని ప్రభావితం చేయగల ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ సంస్థల్లో పని చేయాలని నిర్ణయించుకున్నా. ‘యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్– మేసన్’లో ఎంఎస్, పబ్లిక్ పాలసీ కోర్సులో చేరాను. యూనివర్సిటీ స్థాయిలో అనేక అంశాలపై అధ్యయనం చేసి అమెరికాలోనే ప్రఖ్యాతి గాంచిన ప్రొఫెసర్ టిమ్ స్మీడింగ్ వద్ద నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాను. యూనివర్సిటీ స్థాయిలో నేను ఇచ్చిన ప్రజెంటేషన్లు, పరిశోధనల ఆధారంగా ప్రపంచ బ్యాంకు ఉద్యోగం ఇచ్చింది. ► దక్షిణ ఆసియా వాతావరణం నాకు ఉద్యోగంలో దక్షిణ ఆసియా దేశాలకు చెందిన వాతావరణ విభాగం బాధ్యతలను కేటాయించారు. వాతావరణ మార్పును అధ్యయనం చేసే నిపుణురాలిగా, జాయింట్ మల్టీ బ్యాంకు డెవలప్మెంట్ మధ్య సమన్వయకర్తగా, విధానాల రూపకల్పనలు, వాటికి సాంకేతికతను అన్వయించడం, అమలు చేయటం, వివిధ దేశాలలో ఉండవలసిన కచ్చితమైన వాతావరణ కాలుష్యం ప్రామాణికతల నిర్ణయం, సంబంధిత దేశాల వాతావరణ కాలుష్య కార్యక్రమాల్లో అమలు తేడాలను విశ్లేషించడం నా విధులు. వీటికి సంబంధించిన నివేదికల తయారీ, ఒప్పందాల అమలు పర్యవేక్షణ, సమావేశాల్లో చర్చించటం మా విభాగం నిర్వర్తించాల్సిన ప్రత్యేక విధులు. అమెరికా ప్రభుత్వం నాకు ప్రత్యేకంగా జీ4 వీసా జారీ చేసింది. విధులకు హాజరుకావాలని ప్రపంచ బ్యాంకు నుంచి ఆదేశాలు వచ్చాయి. త్వరలోనే అమెరికాకు వెళ్లి విధుల్లో చేరాలి’’ అని చెప్పారు ఇందు కిలారు. సాధించిన విజయాలివి ► కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో జాతీయ స్థాయి క్యాంపస్ ఇంజినీరు పరీక్షకు హాజరై రాష్ట్రం నుంచి ఎంపికైన ఇద్దరిలో ఇందు ఒకరు. ► యూఎస్ యూనివర్సిటీలో ఏకగ్రీవంగా యూనిటీ అండ్ డైవర్సిటీ సంఘానికి ఏకగ్రీవంగా కోఆర్డినేటర్‌గా ఎన్నిక. ఆ బాధ్యతల్లో విదేశీ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి. విద్యార్థులు, యూనివర్సిటీ అధికారులకు మధ్య వారధిగా పనిచేసి మల్టీ టాస్కింగ్ విజర్డ్‌గా గుర్తింపు. ► క్రిసాలిస్ అనే ఎన్జీఓ సంస్థలో మేనేజ్మెంట్ బోర్డు అడ్వయిజర్‌గా సేవలు అందించడం. ► టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, టీచ్ ఫర్ చేంజ్ సంస్థలకు సేవలు అందించడం. ► ఎం.ఎస్.లో అత్యుత్తమ గ్రేడ్స్ సాధించి మూడు సెమిస్టర్లలో రూ 65 లక్షల రూపాయల ఉపకార వేతనం పొందడం. ► విదేశీ విద్యార్థినిగా స్నాతకోత్సవ సభలో యూనివర్సిటీ ఫ్లాగ్ బేరర్‌గా ఎన్నిక. ఔట్‌స్టాండింగ్ స్టూడెంట్ అవార్డు, బెస్ట్ స్టూడెంట్ ఎంప్లాయ్‌గా గోల్డెన్ బ్రిక్ అవార్డు, బెస్ట్ పైరో ఫ్రైజ్ విన్నర్, బెస్ట్ పేపర్ ఇన్ సైన్స్ అండ్ పబ్లిక్ పాలిసీ పురస్కారం. ► ప్రతిష్ఠాత్మకమైన యూరోపియన్ యూనియన్ ప్రాజెక్టు. గ్లోబల్ వార్మింగ్‌పై అధ్యయనం ప్రపంచ బ్యాంకు టీమ్‌తో కలిసి దక్షిణ ఆసియా దేశాలలో గ్లోబల్ వార్మింగ్ తగ్గింపుపై ప్రత్యేక ప్రాజెక్టు రూపొందించాలి. ప్రధానంగా భారత్–పాకిస్థాన్ దేశాలలో వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేస్తాను. ఇండియన్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా గ్రౌండ్ లెవల్లో కూలింగ్ సొల్యూషన్స్‌పై సాంకేతికంగా పాలసీని రూపొందించి దాని అమలుకు కృషి చేస్తాను. ఉష్ణోగ్రతలు 1.5–2 డిగ్రీల వరకు తగ్గించగలిగితే వ్యవసాయం, ఆరోగ్యం, కార్మికులకు అనువైన వాతావరణం నెలకొంటుంది. – ఇందు కిలారు – పోలవరపు వాసుదేవ్, సాక్షి, పెనమలూరు, కృష్ణా జిల్లా. -
వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడి హోదాలో..భారత పర్యటనలో అజయ్ బంగా
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా అజయ్ బంగా భారత్ పర్యటనకు వస్తున్నారు. వచ్చే వారం అహ్మదాబాద్ కేంద్రంగా జీ20 ఆర్ధిక మంత్రులు, కేంద్ర బ్యాంక్ గవర్నర్ల ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అజయ్ బంగా పాల్గొననున్నారు. 63ఏళ్ల ఇండో- అమెరిక్ అజయ్ బంగా ఈ ఏడాది జూన్‌లో వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వికరించారు. అంతేకాదు, ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి అనే రెండు ప్రపంచ ఆర్థిక సంస్థలకు అధిపతిగా ఉన్న మొదటి వ్యక్తిగా నిలిచారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఈ పదవికి నామినేట్ చేసిన తర్వాత ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు బంగాను మేలో ఐదేళ్ల కాలానికి ప్రపంచ బ్యాంక్ 14వ అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బంగా భారత్‌కు రావడం ఇదే తొలిసారి. -
భారత్ వృద్ధి రేటును తగ్గించిన ప్రపంచ బ్యాంక్
వాషింగ్టన్: భారత్ 2023–24 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాలను ప్రపంచబ్యాంక్ 30 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది. దీనితో ఈ అంచనా 6.6 శాతం నుంచి 6.3 శాతానికి చేరింది. అధిక ద్రవ్యోల్బణం వల్ల ప్రైవేటు వినియోగం తగ్గడం, ప్రభుత్వ రుణ వ్యయాలు, ద్రవ్యలోటు భయాల వంటి అంశాలు తమ అంచనాల కోతకు కారణమని ప్రపంచ ఆర్థిక అంశాలకు సంబంధించి విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది. అయితే సేవల రంగం పటిష్టంగా ఉండడం భారత్‌కు కలిసి వచ్చే అంశంగా వివరించింది. కాగా 2022లో ప్రపంచ వృద్ధి 3.1 శాతం ఉంటే, 2023లో ఇది 2.1 శాతానికి తగ్గుతుందని కూడా తాజా నివేదికలో ప్రపంచ బ్యాంక్ అంచనావేసింది. ఇక చైనా కాకుండా మిగిలిన వర్థమాన దేవాల ఎకానమీ గత ఏడాది 4.1 శాతం ఉంటే, 2023లో 2.9 శాతానికి తగ్గుతుందని కూడా పేర్కొంది. ఇదీ చదవండి: గుడ్ న్యూస్: తనఖా లేకుండా రూ.800 కోట్ల రుణాలు -
ప్రపంచంలో 230 కోట్ల మందికి వంటగ్యాస్ లేదు
ఐక్యరాజ్యసమితి: నేటి ఆధునిక యుగంలోనూ విద్యుత్ వెలుగులు చూడనివారు, వంటగ్యాస్ అందుబాటులో లేనివారు ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ఉన్నారు. ఈ మేరకు ఐదు అంతర్జాతీయ సంస్థలు.. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ, ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఎజెన్సీ, ఐక్యరాజ్యసమితి గణాంక విభాగం, ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తాజాగా ఒక నివేదిక విడుదల చేశాయి. ప్రపంచంలో దాదాపు 230 కోట్ల మంది వంటచెరుకుగా కట్టెలు, పిడకల వంటివి ఉపయోగిస్తున్నారని వెల్లడించాయి. 67.50 కోట్ల మందికి ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేదని తెలియజేశాయి. ♦ 2030 నాటికి కరెంటు లేని వారి సంఖ్య 66 కోట్లకు, వంట గ్యాస్ లేని వారి సంఖ్య 190 కోట్లకు తగ్గిపోతుంది. ♦ 2010లో ప్రపంచంలో 84 శాతం మందికి విద్యుత్ సౌకర్యం ఉంది. 2021 నాటికి ఇది 91 శాతానికి చేరింది. కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి వల్ల 2019–21లో ఈ వృద్ది కొంత మందగించింది. ♦ కరెంటు సౌకర్యం లేనివారిలో 80 శాతం మంది (56.7 కోట్లు) సబ్ సహారన్ ఆఫ్రికాలో నివసిస్తున్నారు. ♦ ఇంధన వనరుల విషయంలో ప్రపంచ దేశాలు అనుసరిస్తున్న విధానాలు ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ♦ వంట గ్యాస్ లేకపోవడంతో కట్టెలు, పిడకలు వంటి కాలుష్యకారక ఇంధనాల వాడకం, దానివల్ల వాయు కాలుష్యం కారణంగా ప్రపంచంలో ప్రతిఏటా దాదాపు 32 లక్షల మంది చనిపోతున్నారని అంచనా. -
విదేశాలకు విద్యార్థినుల క్యూ
‘ఆకాశంలో సగం.. అవకాశాల్లోనూ సగం’ అనే నినాదాన్ని భారతీయ విద్యార్థినులు విదేశీ విద్యను అభ్యసించే విషయంలోనూ చాటుకుంటున్నారు. ఉన్నత విద్య కోసం విదేశాల బాట పడుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రధానంగా 2019 తరువాత ఉన్నత విద్య కోసం దేశంలోని విద్యార్థినులు విదేశాలకు వెళ్లడం దాదాపు 150 శాతం పెరగడం విశేషం. దేశంలోని నగరాల నుంచే కాకుండా.. చిన్న పట్టణాల నుంచి కూడా విద్యార్థినులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళుతుండటం పెరుగుతోందని ప్రపంచ బ్యాంక్ నివేదికను ఉటంకిస్తూ విద్యారంగంలోని ప్రముఖ కన్సల్టెన్సీ ప్రొడిగీ ఫైనాన్స్ నివేదిక వెల్లడించింది. అమెరికా, బ్రిటన్‌లతోపాటు యూరప్‌లోని పలుదేశాల్లో ఉన్నత విద్య పట్ల మన విద్యార్థినులు ఆసక్తి చూపిస్తున్నారు. విదేశీ విద్య కన్సల్టెన్సీలను, విదేశీ విద్య రుణం కోసం బ్యాంకులను సంప్రదిస్తున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. – సాక్షి, అమరావతి విద్యా రుణాల కోసం పోటీ విదేశీ విద్య కోసం బ్యాంకులకు వస్తున్న దరఖాస్తుల్లో కూడా పురుషులతోపాటు మహిళలు సమానంగా ఉంటుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. 2019కి ముందు విదేశీ విద్య కోసం బ్యాంకులకు అందే దరఖాస్తుల్లో విద్యార్థినులు 10శాతం మంది మాత్రమే ఉండేవారు. కాగా.. 2022లో విదేశీ విద్యా రుణాల కోసం బ్యాంకులను ఆశ్రయించే విద్యార్థినుల దరఖాస్తులు ఏకంగా 49 శాతానికి పెరగడం విశేషం. మేనేజ్మెంట్, మెడిసిన్ రంగాల్లో ఉన్నత విద్య కోసం బ్యాంకు రుణాల కోసం భారతీయ విద్యార్థినుల నుంచి 145 శాతం దరఖాస్తులు పెరిగాయని ప్రముఖ కన్సల్టెన్సీ ప్రొడిగీ ఫైనాన్స్ వెల్లడించింది. విదేశీ విద్యలోనూ సగం 2019కు ముందు దేశంలోని మెట్రో నగరాల నుంచి విదేశీ విద్య కోసం వెళ్లే పురుషులు, మహిళల నిష్పత్తి 70:30గా ఉండేది. అంటే విదేశాలకు వెళ్లేవారిలో పురుషులు 70 శాతం, మహిళలు 30 శాతం మంది ఉండేవారు. కానీ.. 2022లో మెట్రో నగరాల నుంచి విదేశాల్లో విద్య కోసం వెళ్లిన పురుషులు, మహిళల నిష్పత్తి 50:50గా ఉండటం విశేషం. అంటే పురుషులు, మహిళలు సమానంగా ఉన్నారు. దేశంలోని చిన్న నగరాల నుంచి 2019కి ముందు విద్య కోసం విదేశాలకు వెళ్లే పురుషులు, మహిళల నిష్పత్తి 80:20గా ఉండేది. కానీ 2022లో దేశంలో చిన్న నగరాల నుంచి విదేశాల్లో విద్య కోసం వెళ్లిన పురుషులు, మహిళల నిష్పత్తి 60:40గా ఉండటం విశేషం. 2019కి ముందు దేశంలోని చిన్న పట్టణాల నుంచి విదేశాల్లో విద్య కోసం వెళ్లే పురుషులు, మహిళల నిష్పత్తి 80:20గా ఉండేది. 2022లో చిన్న పట్టణాల విదేశాల్లో విద్య కోసం వెళ్లిన పురుషులు, మహిళల నిష్పత్తి 55:45గా ఉంది. ప్రపంచ బ్యాంక్ ప్రశంసలు ప్రపంచంలో మిగిలిన దేశాల కంటే భారతీయ విద్యార్థినులు అత్యున్నత విద్యా ప్రమాణాలు సాధిస్తున్నారని ప్రపంచ బ్యాంక్ నివేదిక ఇటీవల ప్రశంసించడం విశేషం. భారత్‌లో సైన్స్–టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేథమెటిక్స్ సబ్జెక్టుల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న వారిలో మహిళలు 43 శాతంగా ఉన్నారని పేర్కొంది. విద్య, ఉపాధి రంగాల్లో ఆడ పిల్లలను ప్రోత్సహించే దృక్పథం భారతీయ తల్లిదండ్రుల్లో పెరుగుతుండటమే అందుకు కారణమని చెప్పింది. విద్యార్థినుల కోసం స్కాలర్షిప్లు, ఫెలోషిప్‌లు పెరుగుతుండటం కూడా అందుకు దోహదపడుతోందని చెప్పింది. ఈ సానుకూల దృక్పథం రానున్న కాలంలో మరింతగా పెరుగుతుందని కూడా పేర్కొంది. -
నాలుగేళ్లలో ఎంఎస్ఎంఈల రైజింగ్ లక్ష్యంగా ముందడుగు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈలకు) పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తోంది వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం. కరోనా సంక్షోభ సమయంలోనూ వాటికి చేయూతనిచ్చి, తిరిగి జీవం పోసుకొనేలా చేసింది రాష్ట్ర ప్రభుత్వం. వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈలు, వాటి వ్యాపారాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం వరల్డ్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైజింగ్ అండ్ యాక్సలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్ (ర్యాంప్ ప్రోగ్రాం)ను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఎంఎస్ఎంఈలకు నూతన సాంకేతిక పరిజ్ఞానం అదుబాటులోకి తేవడం, మార్కెటింగ్, రుణ సదుపాయం, ఎగుమతుల అవకాశాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చెల్లింపుల్లో జాప్యం నివారించడం, ఎంఎస్ఎంఈల్లో స్త్రీల భాగస్వామ్యం పెంచడం వంటివి ఈ ర్యాంప్ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం. కోవిడ్ వల్ల దెబ్బతిన్న ఎంఎస్ఎంఈ రంగాన్ని ఆదుకునే ఉద్దేశంతో 2022–23 నుంచి 2026–27 కాలానికి రూ.6,062.45 కోట్లతో ర్యాంప్ ప్రోగ్రాంని కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది. ఇందులో రూ. 3,750 కోట్లు ప్రపంచ బ్యాంకు రుణంగా ఇస్తుంది. మిగిలిన రూ.2,312.45 కోట్లు కేంద్రం సమకూరుస్తుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఒక స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రాంను (సిప్) రూపొందించాలి. దీనిని కేంద్రం పరిశీలించి ఆమోదం తెలిపిన తర్వాత నిధులు మంజూరు చేస్తుంది. ఇందులో అత్యధిక నిధులను పొందేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందుకోసం రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి చైర్మన్‌గా ఆరుగురు సభ్యులతో స్టేట్ ర్యాంప్ ప్రోగ్రాం కమిటీని ఏర్పాటు చేసింది. ర్యాంప్ నోడల్ ఏజెన్సీగా ఏపీఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్, నోడల్ అధికారిగా పరిశ్రమల శాఖ కమిషనర్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. సమస్యల పరిష్కారానికి ప్రాంతీయ సదస్సులు రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈల సమస్యలను తెలుసుకొని వాటికి చక్కటి పరిష్కార మార్గాలను సూచిస్తూ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రాంను జూన్ 15లోగా కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం పంపించాల్సి ఉంది. ఇందు కోసం రాష్ట్ర పరిశ్రమల శాఖ రాష్ట్రవ్యాప్తంగా వర్క్‌షాపులు నిర్వహిస్తోంది. ర్యాంప్ కార్యక్రమంపై అధికారులకు అవగాహన కల్పించడం కోసం తాజాగా పరిశ్రమల శాఖ కమిషనర్ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన వర్క్‌షాప్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్లో ఏటా అత్యధిక మొత్తం పొందేలా ప్రణాళికలు రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈల సమస్యలను తెలుసుకోవడానికి ఈ నెలాఖరులోగా 5 పట్టణాల్లో వర్క్‌షాపులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ పట్టణానికి దగ్గరగా ఉండే జిల్లాలకు చెందిన ఎంఎస్ఎంఈ ప్రతినిధులు, అసోసియేషన్లు సమావేశంలో పాల్గొని వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే వాటికి పరిష్కార మార్గాలను సూచిస్తూ సిప్‌ను రూపొందిస్తామన్నారు. -
వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా అజయ్ బంగా: వేతనం, నెట్‌వర్త్ ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: భారతీయ-అమెరికన్ ప్రస్తుతం ఈక్విటీ కంపెనీ జనరల్ అట్లాంటిక్క వైస్ చైర్మన్ అజయ్‌పాల్ సింగ్ బంగా ప్రపంచ బ్యాంకు తదుపరి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం విశేషంగా నిలిచింది. అందరి అంచనాలకు తగినట్టుగానే భారతీయ సంతతికి చెందిన అజయ్ బంగా ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి భారతీయ-అమెరికన్‌గా రికార్డు సృష్టించారు. ఈ నేపథ్యంలో బంగా వేతనం, ఆయన నెట్‌వర్త్ తదితర అంశాలు ఆసక్తికరంగా మారాయి. ప్రపంచ బ్యాంక్ 14వ అధ్యక్షుడిగా జూన్ 2న బాధ్యతలు స్వీకరించనున్న అజయ్ బంగా ఐదేళ్ల కాలానికి పనిచేయనున్న సంగతి తెలిసిందే. పంజాబ్‌కు చెందిన సిక్కు కుటుంబానికి చెందిన బంగా మహారాష్ట్ర, పూణేలోని ఖడ్కీ కంటోన్మెంట్లో జన్మించారు. తండ్రి హర్భజన్ బంగా. ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్‌గా పనిచేశారు. దీంతో ఇండియాలో పలు నగరాల్లో అతని విద్యాభ్యాసం సాగింది. ముఖ్యంగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు. ఢిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ నుండి ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (ఆనర్స్) పొందారు. ఆ తర్వాత అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుండి పీజీ చేశారు. బంగా తన కరియర్‌ను 1981లో నెస్లేతో ప్రారంభించారు. అక్కడ 13 సంవత్సరాలు తన సేవలందించారు. అలాగే సిటీ గ్రూప్‌లోనూ పనిచేశారు. మాస్టర్ కార్డ్ సీఈవో గానూ, డచ్ ఇన్వెస్ట్మెంట్స్ హోల్డింగ్ ఫర్మ్ ఎక్సోర్‌కు ఛైర్మన్‌గా కూడా పనిచేశారు . అలాగే ది సైబర్ రెడీనెస్ ఇన్స్టిట్యూట్ కో -ఫౌండర్ అయిన అజయ్ బంగా ఎకనామిక్ క్లబ్ ఆఫ్ న్యూయార్క్ వైస్ చైర్ గానూ, అప్పటి అధ్యక్షుడు అమెరికా బరాక్ ఓబామా అండ్ నేషనల్ సైబర్‌సెక్యూరిటీ కమిషన్ సభ్యునిగా ,ట్రేడ్ పాలసీకి సంబంధించిన ఒబామా సలహా కమిటీలో సభ్యుడినూ కూడా పనిచేశారు. ఫార్చ్యూన్ ప్రపంచ ప్రముఖ వ్యాపారవేత్తల జాబితాలో కూడా ఉన్నారు. 2016లో ఇంటర్నేషనల్ అండర్ స్టాండింగ్ బిజినెస్ కౌన్సిల్ నుంచి లీడర్షిప్ అవార్డు అందుకున్నారు. 2016లో భారత ప్రభుత్వం నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీతో సత్కరించింది. అజయ్ బంగా: నికర విలువ, జీతం సీఎన్‌బీసీ ప్రకారం 2021 నాటికి అజయ్ బంగా నికర విలువ 206 మిలియన్ డాలర్లు (రూ.1700 కోట్లు). మాస్టర్‌కార్డ్ సీఈవోగా బంగా వార్షిక సంపాదన 23,250,000 డాలర్లు. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.1.92 బిలియన్లు. దీని ప్రకారం రోజుకురూ.52 లక్షల వేతనాన్ని ఆయన అందుకున్నారు. అజయ్ బంగా యాజమాన్యంలోని మాస్టర్ కార్డ్ స్టాక్‌ల విలువ 113,123,489 డాలర్లు. గత 13 సంవత్సరాలుగా వేల డాలర్ల విలువైన స్టాక్లను విక్రయించారు. కాగా ప్రపంచ బ్యాంక్ 13వ ప్రెసిడెంట్ డేవిడ్ ఆర్ మాల్పాస్ వార్షిక వేతనం సుమారు 390,539 డాలర్లు. -
భారతీయ అమెరికన్ల విలువ పెంచిన ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగా ఎన్నిక
ప్రపంచ దేశాలు అనేక ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలో వాటికి దిశానిర్దేశం చేసే ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా భారతీయ అమెరికన్ అజయ్ బంగా ఎన్నికవడం ఇండియాకు గర్వకారణం. ఇండియాలోని పుణె ఖడ్కీ కంటోన్మెంటులో పంజాబీ సిక్కు సైనికాధికారి కుటుంబంలో జన్మించిన 63 ఏళ్ల అజయ్ పాల్ సింగ్ బంగా తర్వాత దేశంలోని అనేక నగరాల్లో విద్యాభ్యాసం చేశారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూలులో కూడా చదివిన బంగా కొన్నేళ్ల క్రితం అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. అమెరికా పౌరుడయ్యారు. ఈ విషయం ఎందుకు చెప్పాల్సివచ్చిందంటే రెండో ప్రపంచయుద్ధం తర్వాత ప్రపంచ దేశాలను ఆదుకోవడానికి స్థాపించిన ప్రపంచ బ్యాంక్ గ్రూప్ అధ్యక్ష పదవికి కేవలం అమెరికన్లకు ఎన్నికయ్యే అవకాశం ఇవ్వడం, ఈ బ్యాంక్ జోడు సంస్థ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సారధి పదవిని ఐరోపా దేశీయుడికే ఇవ్వడం ఆనవాయితీ. సాధారణంగా ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష పదవి బ్యాంకు బోర్డ్ ఆఫ్ గవర్నర్ల ఏకాభిప్రాయ సాధనతో జరుగుతుంది. అయితే, ఈసారి 24 మంది బోర్డు సభ్యులు పాల్గొన్న ఓటింగ్ ద్వారా బంగా ఎన్నిక బుధవారం నిర్వహించారు. బోర్డులో సభ్యత్వం ఉన్న రష్యా ప్రతినిధి ఈ ఎన్నిక ఓటింగులో పాల్గొనలేదు. భారతదేశంలో పుట్టినాగాని కొన్నేళ్లు దేశంలో పనిచేసిన తర్వాత అమెరికా వెళ్లి అక్కడ పెప్సికో, మాస్టర్ కార్డ్ వంటి దిగ్గజ కంపెనీల్లో బంగా పనిచేశారు. అలా ఆయన అమెరికా పౌరుడు కావడంతో ప్రపంచ బ్యాంక్ సారధిగా ఎన్నికవడం వీలైంది. జూన్ 2 నుంచి ఐదేళ్లు పదవిలో జూన్ 2న కొత్త పదవి స్వీకరించే బంగాను ఈ పదవికి బుధవారం ఎన్నుకునే ముందు సోమవారం ప్రపంచ బ్యాంక్ బోర్డు సభ్యులు నాలుగు గంటలపాటు ఆయనను ఇంటర్వ్యూ చేశారు. ఈ అత్యున్నత పదవికి బంగాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫిబ్రవరి నెలాఖరులో ప్రతిపాదన రూపంలో నామినేట్ చేశారు. ఆయన నామినేషన్ ను బ్యాంకు బోర్డు ఖరారు చేయడం భారతీయ అమెరికన్లతో పాటు భారతీయులకు గర్వకారణంగా భావిస్తున్నారు. గత పాతికేళ్లలో పలువురు భారతీయ అమెరికన్లు అనేక అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు, సంస్థల అధిపతులుగా నియమితులై, విజయవంతంగా వాటిని నడుపుతూ మంచి పేరు సంపాదిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ జూన్ ఒకటి వరకూ పదవిలో ఉంటారు. ఆయన గతంలో అమెరికా ఆర్థికశాఖలో ఉన్నతోద్యోగిగా పనిచేసిన గొప్ప ఆర్థికవేత్త. మాల్పాస్ మాదిరిగానే బంగా కూడా ఐదేళ్లు బ్యాంక్ ప్రెసిడెంట్ గా పదవిలో జూన్ 2 నుంచి కొనసాగుతారు. 1944 నుంచి ఇప్పటి వరకూ ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ పదవిని 13 మంది అమెరికన్లు నిర్వహించారు. బాంగాకు ముందు ఆసియా దేశమైన దక్షిణ కొరియాలో పుట్టిన జిమ్ యాంగ్ కిమ్ (2012–2019) కూడా ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా పనిచేశారు. బంగా మాదిరిగానే 1959లో జన్మించిన యాంగ్ ఐదేళ్ల వయసులో తన కుటుంబంతో పాటు అమెరికా వలసపోయి స్థిరపడి అమెరికా పౌరుడయ్యారు. గతంలో ఈ బ్యాంక్ అధ్యక్షులుగా పనిచేసిన ఆర్థికరంగ నిపుణుల్లో యూజీన్ ఆర్ బ్లాక్ (1949–1962), రాబర్ట్ ఎస్ మెక్ నమారా (1968–1981)లు 12 ఏళ్లు దాటి పదవిలో ఉండడం విశేషం. మెక్ నమారా కాలంలోనే ఈ అంతర్జాతీయ బ్యాంక్ తన కార్యకపాలు విస్తరించింది. బ్యాంకు సిబ్బందితోపాటు అనేక దేశాలకు రుణాలు ఇవ్వడం పెంచింది. పేదరిక నిర్మూలనపై దృష్టి పెట్టింది. మెక్ నమారా ఈ బ్యాంక్ ప్రెసిడెంట్ గా ఎన్నికవడానికి ముందు అమెరికా రక్షణ మంత్రిగా పనిచేశారు. మొదటిసారి ఒక భారతీయ అమెరికన్ ఈ ప్రతిష్ఠాత్మక పదవిని చేపట్టడం భారతీయులందరికీ స్ఫూర్తిదాయకమని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేదరికం తగ్గించి, సంపద విస్తరించడానికి కృషి చేసే అత్యంత ముఖ్యమైన సంస్థల్లో ఒకటైన ప్రపంచబ్యాంక్ సారధిగా బంగా అత్యధిక సభ్యుల ఆమోదంతో ఎన్నికవడం హర్షణీయమని అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ అభినందించడం భారతీయ అమెరికన్ల సమర్ధతకు అద్దంపడుతోంది. విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సిపి, రాజ్యసభ ఎంపీ -
ప్రపంచ బ్యాంక్ అధ్యక్షునిగా అజయ్ బంగా
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా పలు దిగ్గజ సంస్థలకు సారథులుగా వెలుగొందుతున్న భారతీయుల జాబితాలో ప్రముఖ భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త అజయ్ బంగా నిలిచారు. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షునిగా ఎంపికయ్యారు! ఆయన నియామకాన్ని ఖరారుచేస్తున్నట్లు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు బుధవారం ప్రకటించారు. జూన్ రెండో తేదీ నుంచి ఐదేళ్లపాటు అధ్యక్షునిగా బంగా సేవలందిస్తారని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఒక భారతీయ అమెరికన్ అధ్యక్షుడు ప్రపంచ బ్యాంక్ పగ్గాలు చేపట్టడం ఇదే తొలిసారి. 63 ఏళ్ల బంగాను ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఈ పదవికి నామినేట్‌చేశారు. బంగా జనరల్ అట్లాంటిక్ సంస్థ ఉపాధ్యక్షునిగా, మాస్టర్‌కార్డ్ సీఈవోగా చేశారు. కేంద్రం 2016లో ఆయనను పద్మశ్రీతో సత్కరించింది. -
భారత్ లాజిస్టిక్స్ దూకుడు
న్యూఢిల్లీ: భారత్‌కు విషయంలో ప్రపంచ బ్యాంకు 2023 లాజిస్టిక్ ఇండెక్స్ (ఎల్పీఐ) ర్యాంక్ 2022కన్నా 2023లో ఆరు స్థానాలు మెరుగుపడింది. ప్రపంచంలోని 139 దేశాలను పరిగణనలోకి తీసుకున్న ఈ సూచీ– భారత్ ర్యాంక్ 38కి పెరిగింది. 2022లో ఈ సూచీ ర్యాంక్ 44. 2014తో ఈ ర్యాంక్ 54. లాజిస్టిక్స్ అనేది సప్లై చైన్ మేనేజ్మెంట్లో ఒక భాగం. ఇది కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వస్తువులు, సేవలు సరఫరాలు, నిల్వల నిర్వహణకు సంబంధించిన కీలక విభాగం. ఆయా అంశాల్లో ప్రపంచ బ్యాంక్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ సర్వే, తత్సంబంధ అంశాలను పరిశీలిస్తే.. ► భారత్ మౌలిక రంగం అటు భౌతికంగా (హార్డ్), ఇటు సాంకేతికంగా (సాఫ్ట్) ఎంతో మెరుగుపడింది. రెండు విభాగాల్లోనూ గణనీయమైన పెట్టుబడులు వచ్చాయి. ► ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 2024–25 నాటికి లాజిస్టిక్స్ వ్యయాన్ని తగ్గించి ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం నింపడానికి తగిన ప్రయత్నాలు చేస్తోంది. మల్టీమోడల్ కనెక్టివిటీ కోసం నేషనల్ మాస్టర్ ప్లాన్– పీఎం గతి శక్తి పేరుతో కీలక చొరవలకు అక్టోబర్ 2021 శ్రీకారం చుట్టింది. ► త్వరితగతిన డెలివరీకి, రవాణా సంబంధిత సవాళ్లను అధిగమించడానికి, తయారీ రంగం సమయం, డబ్బును ఆదా చేయడానికి, లాజిస్టిక్స్ రంగంలో కావలసిన వేగాన్ని తీసుకురావడానికి 2022లో ప్రధాన మంత్రి నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ (ఎన్ఎల్పీ)ని ప్రారంభించారు. ► ఈ విధాన చర్యలు ఫలవంతమవుతున్నాయి. ఇది ఇప్పుడు ఎల్పీఐ మెరుగుదలకు దోహదపడుతోంది. ► భారత్ ర్యాంక్ మౌలిక సదుపాయాలకు సంబంధించి 2018లో 52వ స్థానం వద్ద ఉంటే, 2023లో 47వ స్థానానికి ఎగబాకింది. ఇదే సమయంలో అంతర్జాతీయ సరకు ఎగుమతులకు సంబంధించి ర్యాంక్ 44 నుంచి 22కు ఎగసింది. లాజిస్టిక్స్ సామర్థ్యం, సమానత్వంలో విషయంలో నాలుగు స్థానాలు ఎగబాకి 48వ స్థానానికి చేరుకుంది. ట్రాకింగ్, ట్రేసింగ్ విషయాల్లో ర్యాంక్ 3 స్థానాలు జంప్ చేసి 38కి ఎగసింది. ► భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు లాజిస్టిక్స్ విషయంలో అభివృద్ధి చెందిన దేశాలను అధిగమించడానికి ఆధునికీకరణ, డిజిటలైజేషన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ► 2015 నుండి భారత ప్రభుత్వం వాణిజ్య సంబంధిత సాంకేతికతను గణనీయంగా మెరుగుపరిచింది. అలాగే భౌతికంగా సైతం మౌలిక రంగంలో గణనీయంగా పెట్టుబడులు పెట్టింది. లాజిస్టిక్స్ పురోగతిలో సాంకేతికత కీలకమైన అంశంగా ఉంది. పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యంతో సప్లయ్ చైన్ విజిబిలిటీ ప్లాట్‌ఫారమ్ నిర్వహణ వల్ల లాజిస్టిక్స్ విభాగంలో ఆలస్యాలు గణనీయంగా తగ్గాయి. ► 2022 మే – అక్టోబర్ మధ్య కంటైనర్ నిరీక్షణ (పోర్ట్ లేదా టెర్మినల్స్‌లో) సమయం భారతదేశం, సింగపూర్లలో మూడు రోజులుగా ఉంది. ఇది కొన్ని పారిశ్రామిక దేశాల కంటే మెరుగ్గా ఉంది. అమెరికాలో ఈ సమయం ఏడు రోజులు ఉంటే, జర్మనీలో 10 రోజులుగా ఉంది. విశాఖపట్నం పోర్ట్ విషయంలో 2015లో ఈ సమయంలో 32.4 రోజులు ఉంటే, 2019లో 5.3 రోజులకు తగ్గింది. 50వేల కిలోమీటర్ల అదనపు జాతీయ రహదారులు దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల నిర్మాణం పెద్ద ఎత్తున నడుస్తోంది. మోదీ సర్కారు గత తొమ్మిదేళ్ల పాలనా కాలంలో 50,000 కిలోమీటర్ల మేర అదనంగా జాతీయ రహదారుల నిడివి పెరిగింది. 2014–15 నాటికి జాతీయ రహదారుల విస్తీర్ణం 97,800 కిలోమీటర్లుగా ఉంటే.. 2023 మార్చి నాటికి 1,45,155 కిలోమీటర్లకు పెరిగినట్టు అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2014–15లో సగటున ఒక్క రోజు 12.1 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను నిర్మించగా, 2021–22లో ఇది 28.6 కిలోమీటర్లకు పెరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థలో రహదారుల వసతులు ముఖ్య పాత్ర పోషించడం తెలిసిందే. ఆర్థికాభివృద్ధితోపాటు సామా జికాభివృద్ధి కూడా రహదారుల విస్తరణతో సా ధ్యపడుతుంది. ఏటా మన దేశంలో వస్తు రవాణాలో 70 శాతం, ప్రయాణికుల రవాణాలో 85 శాతాన్ని రహదారులే తీరుస్తున్నాయి. 63.73 ల క్షల కిలోమీటర్ల రోడ్డు నెట్‌వర్క్‌తో భారత్ ప్రపంచంలో విస్తీర్ణం పరంగా రెండో స్థానంలో ఉంది. -
మండుటెండల్లో మహా నిర్లక్ష్యం
ప్రకృతి ప్రకోపానికి గురికావడం వేరు. పాలకుల అనాలోచిత చర్య, నిర్లక్ష్యానికి బలి కావడం వేరు. నవీ ముంబయ్‌లోని ఖార్ఘర్ ప్రాంతంలో ఆదివారం 38 డిగ్రీల మండుటెండలో 306 ఎకరాల్లో ఆరుబయట ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో అసువులు బాసిన 13 మంది అమాయకులు అక్షరాలా పాలనా యంత్రాంగపు నిర్లక్ష్యానికి బలిపశువులే. మహారాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారం ‘మహారాష్ట్ర భూషణ్’ను సంఘ సంస్కరణవాది అప్పాసాహెబ్ ధర్మాధికారికి ప్రదానం చేసే ఆ బహిరంగ సభకు 10 లక్షల మంది హాజరయ్యారు. కేంద్ర హోమ్ మంత్రి, సీఎం లాంటి వీవీ ఐపీలకు ఎండ కన్నెరగని రీతిలో ఏర్పాట్లు చేసిన పెద్దలు, సామాన్యులకు నెత్తి మీద నీడ కాదు కదా.. తాగేందుకు గుక్కెడు చల్లటి మంచినీటినైనా ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారంటే ఏమనాలి? 650 మంది దాకా వేసవి ఉష్ణతాపం వల్ల అస్వస్థతకు గురి కాగా, 18 మంది ఆస్పత్రి పాలైన ఆ సభావేదిక దృశ్యాలు చూస్తుంటే, ఎవరికైనా గుండె మండిపోతుంది. ఎండలు ముదిరిన వేసవిలో, మహారాష్ట్రలో ప్రచండ గ్రీష్మపవనాల ప్రభావం తప్పదని వాతావరణ శాఖ హెచ్చరించి సంగతి తెలిసీ... ఇలా మిడసరిలగ్నంలో బహిరంగ సభ పెట్టి మనుషుల ప్రాణాలతో చెలగాటమాడే హక్కు ఏ పార్టీకైనా, ఏ ప్రభుత్వానికైనా ఎవరిచ్చారు? పర్యావరణ విధ్వంసం, వాతావరణ మార్పుల వల్ల ఇప్పుడు ఏటేటా పెరుగుతున్న ఉష్ణోగ్రత, వేడిగాలులపై పాలకులు దృష్టి పెట్టాల్సిన అత్యవసరాన్ని ఈ నిర్లక్ష్యం, వ్యవస్థాగత వైఫల్యం గుర్తుచేస్తున్నాయి. ఈ ఘటన అటు పాలకులకూ, ఇటు వేసవి గడిచేకొద్దీ ఎన్నికల రాజకీయ వేడి పెరిగి, భారీ సభలకు దిగే పార్టీలకూ పాఠాలు చెబుతోంది. మహారాష్ట్ర ఘటనలో మహాపరాధాలు అనేకం. సాయంత్రం 5 గంటలకు అనుకున్న సభను ఎందుకు ఆరు గంటలు ముందుకు జరిపినట్టు? పక్క రాష్ట్రాల నుంచి కూడా లక్షల మంది హాజరయ్యేలా ఎర్రటి ఎండలో గంటలకొద్దీ సభ పెట్టినప్పుడు నీడలో కూర్చొనే ఏర్పాటు, సక్రమంగా మంచినీటి వసతి ఎందుకు చేయలేకపోయినట్టు? ఎండ వేడి, ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరై, దాహంతో నోరు పిడచగట్టుకుపోయి, కళ్ళు తిరిగి వడదెబ్బకూ, గుండెపోట్లకూ జనం మరణిస్తే, ‘దురదృష్టకరం’ అని ఒక్కమాట అనేస్తే చాలా? మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం ప్రకటించినంత మాత్రాన... చేసిన పాపం, ఏర్పాట్లలో చూపిన నిర్లక్ష్యం మాసిపోతాయా? ఉష్ణపవనాలపై వాతా వరణ శాఖ హెచ్చరికలను యంత్రాంగం పెడచెవిన పెట్టిన ఫలితమిది. ఇది దేశంలో అందరికీ ఓ గుణపాఠం. తాజాగా ఏప్రిల్ 17 నుంచి అయిదురోజులు యూపీ, బెంగాల్, సిక్కిమ్, ఒడిశా, జార్ఖండ్, కోస్తా ఆంధ్రలో ఉష్ణతీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ హెచ్చరికలు రావడం గమనార్హం. గడిచిన 2022లో ఏకంగా 280 రోజులు 16 రాష్ట్రాల్లో ఉష్ణ పవనాలు వీచినట్టు ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్’ నివేదిక. ఇది గత దశాబ్దిలోకెల్లా అత్యధికం. ఒక్క మహా రాష్ట్రలోనే నిరుడు వేసవిలో 2 నెలల్లో, 4 హీట్ వేవ్స్ వచ్చాయి. 31 మంది మరణించారు. ఈ ఏడాదీ మార్చి నుంచి మే వరకు మధ్య, వాయవ్య భారతంలో గ్రీష్మ పవనాలు వచ్చే అవకాశం ఎక్కువని ఐఎండీ ఫిబ్రవరిలోనే పారాహుషార్ చెప్పింది. ఆ అంచనా సాక్ష్యమే ఇటీవలి ఎండలు, వడగాడ్పులు. ఏటేటా పెరుగుతూ, జనజీవనాన్ని ప్రభావితం చేస్తున్న ఈ వేడిమిపై పాలకులు తక్షణం దృష్టి పెట్టాలంటున్నది అందుకే! 2010లోనే ఉష్ణపవనాల తాకిడికి 800 మందికి పైగా మరణించిన అహ్మదాబాద్‌లో అక్కడి నగరపాలక సంస్థ నిపుణుల సాయంతో దేశంలోనే తొలి ‘గ్రీష్మపవన కట్టడి కార్యాచరణ ప్రణాళిక’ (హెచ్ఏపీ)ను రూపొందించింది. 2013 నుంచి అమలులో పెట్టి, ఏటా వెయ్యికి పైగా మరణాలను నివారిస్తోంది. జనం జీవనోపాధినీ, ఆరోగ్యాన్నీ దెబ్బతీసే ఈ వడగాడ్పులను ఎదుర్కోవడానికి ఇంకా అనేకచోట్ల వివిధ పాలనా యంత్రాంగాలు ప్రణాళికలు రూపొందించక పోలేదు. పిల్లల బడి వేళల్లో, రోజువారీ కూలీల పని వేళల్లో మార్పులు, ప్రథమ చికిత్స, మంచినీటి వసతుల ఏర్పాటు లాంటి ప్రామాణిక కార్యాచరణ విధానాలను (ఎస్ఓపీ) ఒడిశా లాంటి రాష్ట్రాలు రూపొందించాయి. అయితే, మన దేశంలో ఈ హెచ్‌ఏపీలను ఎక్కడికక్కడ స్థానిక అవసరాలకు తగ్గట్లు తయారు చేయట్లేదు. అది పెద్ద లోపం. నిధుల కొరత సరేసరి. పదులకొద్దీ ప్రణాళికల్ని అధ్యయనం చేసి ‘సెంటర్ ఫర్ పాలసీ రిసెర్చ్’ ఇది తేల్చింది. ఆ మాట మనకు మరో కనువిప్పు. అందుకే, ఈ ప్రణాళికలన్నిటినీ జాతీయ స్థాయిలో ఒకచోట సమీకరించడం అవసరం. పారదర్శకంగా, ఆన్లైన్లో అందరికీ అందుబాటులో ఉంచి, తరచూ వాటి పనితీరును మదింపు చేయాలి. సీపీఆర్ ఆ సూచనే చేస్తోంది. అలాగే, రోజువారీ కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతల్ని కొలిచే సంప్రదాయ విధానాలు సరిపోవు. ఒక ప్రాంతపు వేడినీ, తేమనూ కలిపి కొలిచే ‘వెట్–బల్బ్’ ఉష్ణోగ్రత; అలాగే గాలి వేడిమి, సాపేక్ష ఆర్ద్రత, వాయువేగాల కలయికైన ఒంటికి అనిపించే ఉష్ణోగ్రత లాంటి కొత్త విధానాల్ని అనుసరించడం మంచిది. దీనివల్ల ఒంటిపై ఉష్ణప్రభావాన్ని గ్రహించి, సునిశిత చర్యలు చేపట్టవచ్చు. ప్రజలకు వాతావరణ అక్షరాస్యత కల్పించి, అవగాహన పెంచి, అవాంఛనీయ మార్పులకు సంసిద్ధం చేయడమూ అవసరం. అందులోనూ రానున్న కాలంలో... ప్రపంచంలో తొలిసారిగా మానవ ఉనికికే ప్రమాదమయ్యే స్థాయి ఉష్ణపవనాలు ఎదురయ్యే ప్రాంతాల్లో ఒకటి భారత్ కావచ్చని ప్రపంచ బ్యాంక్ హెచ్చరిక. పంచాగ్ని మధ్యంలో పడిపోక ముందే తెలివి తెచ్చుకొని, సత్వర కార్యాచరణకు దిగడమే విజ్ఞత. ఉదాసీనతతో, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మహారాష్ట్ర లాంటి ఘటనలే మళ్ళీ ఎదురవుతాయి. -
వాతావరణ మార్పులపై ప్రజా ఉద్యమం
వాషింగ్టన్: వాతావరణ మార్పుల సమస్యకు అడ్డుకట్ట వేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ అంశంపై ప్రపంచ బ్యాంకు ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి శనివారం ఆయన వీడియో లింక్ ద్వారా ప్రసంగించారు. ‘‘వాతావరణ మార్పులను అడ్డుకోవడం ప్రభుత్వాల స్థాయిలో జరగాల్సిన పని అని చాలామంది భావిస్తారు. ఇందులో వ్యక్తిగతంగా తామేమీ చేయలేమని అనుకుంటారు. కానీ ఈ విషయంలో మనమంతా ఎంతో చేయగలం. కేవలం సదస్సుల ద్వారా ఏమీ జరగదు. ఈ పోరు చర్చా వేదికల నుంచి ప్రతి ఇంట్లోనూ డిన్నర్ టేబుళ్ల దాకా వెళ్లాలి. అప్పుడే అది ప్రజా ఉద్యమంగా మారుతుంది. ఈ విషయంలో భారత ప్రజలు కొన్నేళ్లుగా ఎంతో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. జల పరిరక్షణ, సహజ సాగు, చిరుధాన్యాల వాడకం, ఆరోగ్యకరమైన జీవన విధానం, లింగ సమానత్వ సాధన, స్వచ్ఛత, సూక్ష్మసేద్యం వంటివాటిని ఓ ఉద్యమంగా చేపట్టి విజయవంతం చేస్తున్నారు. అన్ని దేశాల్లోనూ ఇలాంటి ప్రయత్నాలను ప్రోత్సహించడంలో అంతర్జాతీయ సంస్థలది కీలక పాత్ర’’ అన్నారు. -
భారత్ వృద్ధి రేటుకు ప్రపంచ బ్యాంక్ కోత
వాషింగ్టన్: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఏప్రిల్‌తో ప్రారంభమైన ఆర్థిక సంవత్సరంలో (2023–24) 6.3 శాతానికి పరిమితమవుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ఈ మేరకు క్రితం అంచనాలను 6.6 శాతం నుంచి 30 బేసిస్ పాయింట్లు తగ్గించింది. పెరుగుతున్న వడ్డీరేట్లు, ఆదాయ వృద్ధి మందగమనం, అధిక ధరలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు తన క్రితం అంచనాల తాజా తగ్గింపునకు కారణమని దక్షిణాసియాకు సంబంధించి ఆవిష్కరించిన నివేదికలో బహుళజాతి బ్యాంకింగ్ దిగ్గజం పేర్కొంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు వార్షిక (స్ప్రింగ్) సమావేశాలకు ముందు వరల్డ్ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ (దక్షిణాసియా) హన్స్ టిమ్మర్ ఈ నివేదిక విడుదల చేశారు. నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలు... ♦ బలహీన వినియోగం, కఠిన వడ్డీరేట్ల వ్యవస్థ ముఖ్యంగా ప్రభుత్వ ప్రస్తుత వ్యయ నియంత్రణ అంచనాల డౌన్‌గ్రేడ్‌కు ప్రధాన కారణం. ♦ దక్షిణాసియాలోని అనేక ఇతర దేశాల కంటే భారతదేశంలో పరిస్థితి మెరుగ్గానే ఉంది. ఆర్థిక రంగంలో పరిస్థితి ఇతర దేశాల కంటే బాగుంది. భారతదేశంలోని బ్యాంకులు పటిష్ట స్థితిలో ఉన్నాయి. మహమ్మారి తర్వాత బ్యాంకింగ్ చక్కటి రికవరీ సాధించింది. ఆర్థిక వ్యవస్థలో తగిన రుణాలకుగాను లిక్విడిటీ బాగుంది. ఇటీవలి సంవత్సరాలతో పోలిస్తే ప్రైవేట్ పెట్టుబడులు చాలా బలంగా ఉన్నాయి. సమస్యల్లా దేశం తన సామర్థ్యాన్ని తక్కువ స్థాయిలో వినియోగించుకోవడమే. ♦ భారతదేశంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం 20 శాతం కంటే తక్కువకు పడిపోయింది. అసంఘటిత రంగం ఉత్పాదకత పెరుగుతోందన్న దాఖలాలు లేవు. అలాగని ఫలితాలూ మరీ అధ్వానంగానూ లేవు. ఆయా అంశాలను పరిశీలిస్తే అన్ని వర్గాల భాగస్వామ్యంతో వృద్ధిని మరింత పెంచడానికి భారత్ ముందు భారీ నిర్మాణాత్మక ఎజెండా ఉందని భావిస్తున్నాం. ♦ విదేశాల నుండి ప్రైవేట్ పెట్టుబడులు మరింత పెరగాలి. ముఖ్యంగా సేవల రంగాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఇందుకుగాను సంస్కరణల ఎజెండాను మరింత ముందుకు తీసుకువెళ్లాలి. అలాగే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వాతావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, ఉద్గారాల కట్టడికి పటిష్ట చర్యలు తీసుకోవాలి. దక్షిణాసియా దేశాలపై ఇలా.. స్వల్పకాలికంగా చూస్తే, భారత్ దక్షిణాసియాలో ఇతర దేశాలకంటే పటిష్ట ఎకానమీని కలిగి ఉంది. భూటాన్ మినహా ఈ ప్రాంతంలోని అన్ని దేశాలు తమ వృద్ధి అంచనాలను కుదించుకుంటున్నాయి. గత ఏడాది విపత్తు వరదల ప్రభావంతో పాకిస్తాన్ ఇంకా సతమతమవుతూనే ఉంది. సరఫరాల వ్యవస్థకు తీవ్ర అంతరాయాలు ఎదురవుతున్నాయి. పెట్టుబడిదారుల విశ్వాసం దిగజారుతోంది. అధిక రుణ, మూలధన వ్యయాలు భారమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పాక్ వృద్ధి ఈ ఏడాది 0.4 శాతానికి తగ్గుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఇక రుణ సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక ఎకానమీలో వృద్ధి లేకపోగా, ఇది ఈ ఏడాది 4.3% క్షీణిస్తుందన్నది అంచనా. పర్యాటకం ఊపందుకోవడం మాల్దీవులు, నేపాల్‌కు సానుకూల అంశాలైనా, అంతకుమించి అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ప్రభావాలు ఈ దేశాలు ఎదుర్కొననున్నాయి. దక్షిణాసియాలో 2023లో 8.9 శాతం ద్రవ్యోల్బణం అంచనాలు ఉన్నాయి. 2024లో ఇది 7% లోపునకు తగ్గవచ్చు. అయితే బలహీన కరెన్సీలు పెద్ద సమస్యగా ఉంది. ద్రవ్యోల్బణం భయాలను పెంచే అంశమిది. వృద్ధి 6.4 శాతం: ఏడీబీ ఇదిలాఉండగా, 2023–24లో భారత్ వృద్ధి రేటు 6.4 శాతంగా ఉంటుందని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) అవుట్‌లుక్ ఒకటి పేర్కొంది. 2023 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనావేసిన ఏడీబీ, 2023–24లో ఈ రేటు తగ్గడానికి కఠిన ద్రవ్య పరిస్థితులు, చమురు ధరలు పెరగడాన్ని కారణంగా చూపింది. కాగా, 2024–25లో వృద్ధి రేటు 6.7 శాతానికి పెరుగుతుందని ఏడీబీ అంచనావేసింది. ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు పెరగడం దీనికి కారణంగా చూపింది. రవాణా రంగం పురోగతికి, వ్యాపార పరిస్థితులు మెరుగుపడ్డానికి ప్రభుత్వం తీసుకునే చర్యలు ఫలితాలు ఇస్తాయని ఏడీబీ వివరించింది. అంతర్జాతీయంగా పలు దేశాలు మాంద్యం ముంగిట నుంచున్నప్పటికీ, భారత్ ఎకానమీ తన సహచర దేశాల ఎకానమీలతో పోల్చితే పటిష్టంగా ఉందని ఏడీబీ కంట్రీ డైరెక్టర్ టకియో కినీషీ పేర్కొన్నారు. -
భారత్ వృద్ధికి సంస్కరణల ఊతం
న్యూఢిల్లీ: భారత్ ఇప్పటికే అమలు చేస్తున్న ప్రతిష్టాత్మకమైన సంస్కరణల ఎజెండాను మరింత వేగవంతంగా అమలు చేయడం వల్ల దేశ వృద్ధి వేగం మరింత పెరిగే అవకాశం ఉంటుందని ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక పేర్కొంది. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు ప్రపంచ ఆర్థికాభివృద్ధిపై తీవ్ర ప్రతికూలతకు దారితీసిందని బహుళజాతి బ్యాంకింగ్ దిగ్గజం స్పష్టం చేసింది. ఆయా పరిస్థితులు ఎకానమీ పురోగతికి సంబంధించి ప్రపంచం ఒక ‘దశాబ్దాన్ని’ కోల్పోయే పరిస్థితిని సృష్టిస్తున్నాయని హెచ్చరించింది. 2030 నాటికి ప్రపంచ ఆర్థిక పురోగతి మూడు దశాబ్దాల కనిష్టానికి పడిపోయే అవకాశం ఉందని విశ్లేషించింది. 2000–2010 మధ్య ప్రపంచ స్థూల వృద్ధి రేటు దాదాపు 6.5 శాతం ఉంటే, 2020–30 మధ్య కాలానికి ఈ రేటు 2.2 శాతానికి పడిపోవచ్చని తెలిపింది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల విషయానికొస్తే, ఎకానమీ క్షీణత 2000– 2010 మధ్య సంవత్సరానికి సగటున 6 శాతం ఉంటే, ఈ దశాబ్దంలో మిగిలిన కాలంలో సంవత్సరానికి 4 శాతానికి పడిపోతుందని అభిప్రాయపడింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం– మాంద్యం పరిస్థితులు తలెత్తితే ఈ పతనం మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. ‘దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలు తిరోగమనం–పోకడలు, అంచనాలు–విధానాల’ పేరుతో విడుదలైన నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలు. ► భారత్ తోటి దేశాల కంటే వేగవంతమైన పురోగతి సాధిస్తున్నప్పటికీ, సంస్కరణ ఎజెండాను ముఖ్యంగా తయారీ, మౌలిక రంగంలో వేగవంతంగా అమలు చేయడం ద్వారా మరింత ప్రయోజనం పొందవచ్చు. ముఖ్యంగా ఫైనాన్షియల్ రంగంలో ఒత్తిడులను తొలగించాల్సి ఉంది. ఈ విభాగంలో సవాళ్లు దేశ పురోగతికి బ్రేకులు వేస్తున్నాయి. ► 2000–10లో భారత్ పెట్టుబడుల సగటు వార్షిక వృద్ధి 10.5 శాతం అయితే, 2011–21లో ఈ రేటు 5.7 శాతానికి పడిపోయింది. ► విద్యుత్, రోడ్డు, రైలు నెట్వర్క్, వ్యాపారాలకు ఎదురవుతున్న అవరోధాలు, బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిల వంటి బలహీనతలు వంటి అంశాలు భారత్ ఎకానమీకి అవరోధాలుగా ఉన్నాయి. ► కోవిడ్–19తో ఎదురవుతున్న పరిణామాలు ప్రపంచ దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ► భౌగోళిక ఉద్రిక్తతలూ ప్రపంచ వృద్ధి తిరోగమనానికి దారితీస్తున్నాయి. ► పెట్టుబడుల్లో వృద్ధి క్షీణిస్తోంది. ప్రపంచ శ్రామిక శక్తి మందకొడిగా పెరుగుతోంది. కరోనావైరస్ మహమ్మారి వల్ల మానవ వనరుల నైపుణ్య కొరత ఎదురవుతోంది. అంతర్జాతీయ వాణిజ్యంలో వృద్ధి.. జీడీపీ పురోగతికి తగిన విధంగా సరిపోవడం లేదు. -
సీఎం జగన్ తో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధి బృందం భేటీ
-
వరల్డ్ బ్యాంక్ కాబోయే ప్రెసిడెంట్‌కు కోవిడ్
ప్రపంచ బ్యాంకు కాబోయే అధ్యక్షుడు (అమెరికన్ నామినీ) భారతీయ అమెరికన్ అజయ్ బంగాకు కోవిడ్ సోకింది. మూడు వారాల ప్రపంచ పర్యటనలో భాగంగా మార్చి 23న అజయ్ బంగా ఢిల్లీ వచ్చారు. ఈ సందర్భంగా చేసిన రొటీన్ పరీక్షల్లో ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణైంది. అజయ్ బంగా ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ వెల్లడించింది. ఇదీ చదవండి: ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్: ఆలస్యమైతే రూ. 5 వేలు కట్టాలి! రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్ వచ్చిన అజయ్ బంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ తదితరులతో సమావేశం కావాల్సి ఉంది. అయితే కోవిడ్ సోకడంతో ఆ సమావేశాలన్నీ రద్దు అయ్యాయి. ఈ మేరకు ఆర్థిక శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అజయ్ బంగా మూడు వారాల ప్రపంచ పర్యటనలో భారత్ సందర్శన చివరిది. ఆఫ్రికా నుంచి ప్రారంభమైన ఆయన పర్యటన యూరప్, లాటిన్ అమెరికా మీదుగా ఆసియాకు చేరుకుంది. తన గ్లోబల్ లిజనింగ్ టూర్లో బంగా.. ఆయా ప్రాంతాల్లో సీనియర్ ప్రభుత్వ అధికారులు, వాటాదారులు, వ్యాపార నాయకులు, వ్యవస్థాపకులు, పౌర సమాజంతో సమావేశమవుతూ వస్తున్నారు. దేశంలో గత కొద్ది రోజులుగా ఇన్ఫ్లూయెంజాతో పాటు కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. బుధవారం నాటి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. దేశంలో 1,134 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో క్రియాశీల కేసులు 7,026కి పెరిగాయి. -
‘మేడిన్ ఇండియా’ బంగా!
భారత్ మూలాలున్నవారు ప్రపంచ యవనికపై తళుక్కున మెరవటం ‘అలవాటైపోయిన’ వర్తమానంలో కూడా ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి ఇక్కడే పుట్టి పెరిగి పెద్ద చదువులు చదివిన అజయ్ బంగాను అమెరికా ప్రతిపాదించిందంటే అందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ భారతీయ మూలాలున్నవారే. కుదిరితే రిపబ్లికన్ పార్టీ తరఫున దేశాధ్యక్ష స్థానానికి పోటీ చేయాలనుకుంటున్న వివేక్ రామస్వామి సైతం ఇక్కడివారే. ఇక కోకా కోలా మొదలు అనేకానేక బహుళజాతి సంస్థలకు చాన్నాళ్లనుంచి భారతీయ సంతతికి చెందినవారు సారథ్యం వహించారు, వహిస్తున్నారు. మునుపటంత కాకపోయినా ఇప్పటికీ ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల తీరుతెన్నులనూ, వాటి తలరాతలనూ నిర్దేశించటంలో ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌లు కీలకపాత్ర పోషిస్తున్నాయి. వర్ధమాన దేశానికి చెందిన ఒక వ్యక్తి అలాంటి సంస్థలకు నేతృత్వం వహించటమంటే సాధారణం కాదు. ఆ రెండు సంస్థలూ ఆవిర్భవించిన నాటినుంచీ వాటిపై వస్తున్న ప్రధాన విమర్శ– ఎప్పుడూ సంపన్న దేశాల నుంచీ, ప్రధానంగా అమెరికా నుంచీ మాత్రమే వాటి సారథులను ఎన్నుకుంటున్నారు. రెండో ప్రపంచ యుద్ధానంతరం తీవ్రంగా దెబ్బతిన్న అంత ర్జాతీయ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దటం కోసం బ్రెటెన్‌వుడ్స్ సదస్సు జరగ్గా, అందులో కుదిరిన ఒప్పందం పర్యవసానంగా ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌లు ఉనికిలోకొచ్చాయి. ప్రపంచ బ్యాంకుకు ఆది నుంచీ అమెరికా పౌరులే అధ్యక్షులు. అలాగే ఐఎంఎఫ్ ఉపాధ్యక్ష పదవి కూడా ఆ దేశానిదే. ఐఎంఎఫ్ అధ్యక్ష పదవి మాత్రం యూరోపియన్ దేశాలకు చెందినవారిది. నిజానికి ఇప్పుడు అమెరికా ఎంపిక చేసిన బంగా ఇక్కడివారే అయినా, ప్రస్తుతం పూర్తి స్థాయి అమెరికా పౌరుడు. సుపరిపాలన... సంప్రదింపులు... పాలుపంచుకోవటం అనేవి ప్రపంచబ్యాంకు మూల సూత్రాలు. కానీ ఆ మూడింటిని రుణం కోసం వచ్చే వర్ధమాన దేశాధినేతలకు ప్రవచించటం తప్ప సంస్థ పాటించదన్న విమర్శ చాన్నాళ్లుగా ఉంది. అందులో 189 సభ్యదేశాలుంటాయి. సంపన్న దేశాలైన అమెరికా, యూరోప్ దేశాల పెట్టుబడులు అధికం గనుక, బ్యాంకులోని ప్రధాన భాగస్వామ్య ఆర్థిక సంస్థలన్నీ ఆ దేశాలకు సంబంధించినవే గనుక బ్యాంకు అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు ఆ దేశాలకే సొంతం. అయితే ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలన్న డిమాండ్ మొదటినుంచీ ఉంది. గతంలో అమెరికా నిర్ణయించినవారిలో కొందరికి ఆర్థికరంగ నేపథ్యమే లేదన్న విమర్శలు కూడా వచ్చాయి. పర్యావరణ పరిరక్షణ ఎజెండాలోకొచ్చిన వర్తమానంలో ప్రపంచ బ్యాంకు దానిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలనీ, రుణాలిచ్చే క్రమంలో అదొక షరతుగా ఉండాలనీ కొన్నేళ్లుగా ఉద్యమ కారులు కోరుతున్నారు. ఇంకా ఏడాది పదవీకాలం ఉండగానే రాబోయే జూన్‌లో పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్న డేవిడ్ మల్పాస్ అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నామినీ. పర్యావరణంతో సహా ప్రపంచాన్ని వేధిస్తున్న కీలక అంశాల విషయంలో ట్రంప్ అభిప్రాయాలే ఆయనవి కూడా. నిరుడు సెప్టెంబర్‌లో ఒక సదస్సు సందర్భంగా శిలాజ ఇంధనాలవల్ల భూగోళానికి జరిగే ప్రమాదంపై ప్రశ్నించినప్పుడు ‘నేను శాస్త్రవేత్తను కాదు’ అని జవాబిచ్చి అందరి ఆగ్రహానికీ గురయ్యారు. నిజానికి అంతక్రితమే ప్రపంచ బ్యాంకుపై ఆర్థికరంగ నిపుణులకు ఆశలు పోయాయి. పేరులో తప్ప నిజంగా ప్రపంచానికి ప్రాతినిధ్యం వహించే, దాన్ని నడిపించే లక్షణాలు బ్యాంకుకు సన్నగిల్లాయని వారి అభిప్రాయం. దాని నిబంధనలు, అదిచ్చే రుణాలకుండే షరతులు కఠినమైనవి. రుణ మంజూరులో అలవిమాలిన జాప్యం. ఇప్పుడు ధైర్యంగా సత్వర నిర్ణయాలు తీసుకునే కెనడాకు చెందిన సీడీపీక్యూ, ఎన్డీబీ(గతంలో బ్రిక్స్ బ్యాంక్), ఎన్ఐఐఎఫ్, అమెరికాకు చెందిన ఐడీఎఫ్సీ వంటివి రంగంలోకొచ్చాయి. అయితే ఫలానా ప్రాజెక్టుకు లేదా సంస్థకూ ప్రపంచ బ్యాంకు అప్పిచ్చిందంటే అది భారీ ప్రాజెక్టు, అన్నివిధాలా మేలైందని అభిప్రాయపడేవారు చాలామందే ఉంటారు. అయితే బంగాయే స్వయంగా చెప్పుకున్నట్టు ఆయన నూరుశాతం ‘మేడిన్ ఇండియా’వాడు. ప్రపంచ మార్కెట్లను శాసించే అమెరికాకు చెందిన ‘వాల్ స్ట్రీట్’నుంచి నేరుగా వస్తున్నవాడు. ఈసారి మహిళను ప్రోత్సహించదల్చుకున్నామని ప్రపంచ బ్యాంకు డైరెక్టర్ల బోర్డు ప్రకటించిన కొన్ని గంటలకే బంగా ఎంపికను ప్రకటించటం అందరినీ ఒకింత ఆశ్చర్యపోయేలా చేసింది. అయితే అందుకు కారణం ఉంది. బ్యాంకు పేదరిక నిర్మూలన లక్ష్యం నుంచి పర్యావరణ పరిరక్షణ వైపు పోవటం బ్యాంకులోని వర్ధమాన దేశాలకు నచ్చటం లేదు. ఇందువల్ల తమ అభివృద్ధి ప్రాజెక్టులు ఇబ్బందుల్లో పడతాయన్నది వాటి అభిప్రాయం. భారత్‌కు చెందిన బంగా ఈ విషయంలో అందరినీ ఒప్పిస్తారనీ, ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడుల సమీకరణలో విజయం సాధిస్తారనీ అమెరికా విశ్వ సిస్తోంది. భారత్ మార్కెట్ ఆవిర్భవించి విస్తరిస్తున్న తొలి దశలో దాన్ని చాలా దగ్గరగా చూసిన అనుభవం బంగాకు ఉన్నదని ఆ దేశం భావన. దాదాపు దశాబ్దకాలం నుంచి మాస్టర్‌కార్డ్ సారథిగా ఆ సంస్థ విస్తరణలో, దాని రెవెన్యూ పెంపులో బంగా పాత్ర ప్రధానమైనది. అదీగాక 2021లో గ్లాస్గోలో జరిగిన కాప్–26 సదస్సు సందర్భంగా కర్బన ఉద్గారాల తగ్గింపునకు కృషి చేయాలంటూ ప్రపంచ దేశాలనుద్దేశించి బహిరంగ లేఖ రాసిన డజను మంది సీఈఓల్లో ఆయనొకరు. ఇక పర్యావరణ పరిరక్షణపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించదల్చుకున్న ప్రపంచ బ్యాంకుకు బంగాను మించిన అర్హుడు మరొకరుండరని అమెరికా భావించటంలో ఆశ్చర్యమేముంది? -
అజయ్ బంగా హెచ్‌పీఎస్ విద్యార్థే
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా నామినేట్ అయిన భారత–అమెరికన్ అజయ్ బంగా బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్) విద్యార్థే. మాస్టర్ కార్డ్ మాజీ సీఈవో అజయ్ బంగా 1976 బ్యాచ్‌కు చెందిన హెచ్‌పీఎస్ విద్యార్థి. ప్రస్తుత వరల్డ్ బ్యాంకు ప్రెసిడెంట్ మాల్పాస్ తర్వాత అజయ్ నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ‘మా పూర్వ విద్యార్థుల్లో మరొకరు ప్రపంచ సంస్థలో ఉన్నత స్థాయికి చేరుకోవటం పాఠశాలకు గర్వకారణం’అని హెచ్‌పీఎస్ సొసైటీ ప్రెసిడెంట్ గుస్తీ జే నోరి యా తెలిపారు. కాగా, ప్రపంచంలోని ప్రము ఖ కంపెనీల అధినేతలు హెచ్‌పీఎస్ విద్యార్థులే కావటం విశేషం. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల, అడోబ్ సీఈవో శంతను నారాయణ్‌తో పాటు కావియం కో–ఫౌండర్ సయ్యద్ భష్రత్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, క్రికెటర్ కామెంటర్ హర్షా భోగ్లే, ప్రముఖ సినీనటులు రానా దగ్గుపాటి, అక్కి నేని నాగార్జున, రామ్‌చరణ్, ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, సమైఖ్యాంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వంటి ఎందరో ప్రముఖులు హెచ్‌పీఎస్ పూర్వ విద్యార్థులు. -
Ajay Banga ప్రపంచబ్యాంకు నూతన అధ్యక్షుడు: బైడెన్ ప్రతిపాదన
వాషింగ్టన్: ప్రపంచబ్యాంకు అధ్యక్షుడుగా భారత సంతతికి చెందిన, మాస్టర్‌కార్డ్ మాజీ సీఈఓ అజయ్ బంగా నామినేట్ అయ్యారు. ప్రస్తుత చీఫ్ డేవిడ్ మాల్పాస్ ముందస్తుగా పదవీ విరమణ చేయనున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో మాస్టర్‌కార్డ్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అజయ్ బంగాను ప్రపంచబ్యాంకుకు నాయకత్వం వహించేందుకు నామినేట్ చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ గురువారం తెలిపారు. అమెరికా ప్రపంచ బ్యాంక్ అతిపెద్ద వాటాదారుగా ఉన్న సంగతి తెలిసిందే. "వాతావరణ మార్పులతో సహా మన కాలంలోని అత్యంత అత్యవసర సవాళ్లను పరిష్కారానికి సంబంధించి పబ్లిక్-ప్రైవేట్ వనరులను సమీకరణలో బంగాకు అపారమైన అనుభవం ఉందని బిడెన్ ఒక ప్రకటనలో తెలిపారు. క్లిష్ట సమయంలో ఉన్న ప్రపంచ బ్యాంకును లీడ్ చేసేందుకు అజయ్ ప్రత్యేక అర్హతలున్నాయని ఆయన ప్రశంసించారు. వరల్డ్ బ్యాంకు ప్రెసిడెంట్ ఎంపిక కోసం అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. మార్చి 29 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. మహిళా అభ్యర్థులకు ఎక్కువ ప్రోత్సాహనిస్తున్నట్టు బ్యాంక్ పేర్కొంది. దీనికితోడు మరొక ప్రధాన వాటాదారు అయిన జర్మనీ 77 ఏళ్ల చరిత్రలో బ్యాంక్‌కు ఎన్నడూ మహిళ నాయకత్వం వహించనందున ఉద్యోగం మహిళకే చెందాలని పేర్కొంది. అజయ్ బంగా 1959 నవంబర్ 10 న పూణేలోని ఖడ్కీ కంటోన్మెంట్లో జన్మించారు. అజయ్ బంగా. ఢిల్లీ యూనివర్శిటీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ నుండి ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (ఆనర్స్) డిగ్రీ, అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుండి మేనేజ్మెంట్లో పీజీపీ పట్టా పొందాడు.భారత ప్రభుత్వం 2016లో బంగాకు పద్మశ్రీ పౌర గౌరవాన్ని అందించింది. అజయ్ బంగా ప్రస్తుతం ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్‌లో వైస్ ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. అతను గతంలో మాస్టర్ కార్డ్‌లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా సేవలందించారు.12 సంవత్సరాల తరువాత డిసెంబర్ 2021లో మాస్టర్ కార్డ్ కు పదవీ విరమణ చేసారు. కాగా పదవీకాలం ముగిసేందుకు మరో ఏడాది సమయం ఉండగానే ప్రపంచబ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ రాజీనామా చేయబోతున్నట్లు ఈనెల (ఫిబ్రవరి) ప్రకటించారు.జూన్ నుంచి బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. -
ముంచుకొస్తోంది..ఆర్ధిక మాంద్యం
మాంద్యం... ప్రపంచాన్ని ఇప్పుడు వెంటాడుతున్న పదం ఇది. కరోనా దెబ్బతో కకావికలమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి... ఇప్పుడు ధరాభారంతో పెనం మీంచి పొయ్యిలో పడినట్లయింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలయ్యాక యూరప్, అమెరికా దేశాల్లోనే కాదు ఆసియాలోని చాలా దేశాల్లోనూ ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో ద్రవ్యోల్బణం సెగను తగ్గించేందుకు అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లను ఎడాపెడా పెంచుతుండటం... చైనాలో మళ్లీ కరోనా భయాలతో అంతర్జాతీయ వాణిజ్యం మందగించడం.. రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షలతో చమురు, గ్యాస్ రేట్లు భగ్గుమనడం.. ఇలా అనేక పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మాంద్యం కోరల్లో చిక్కుకునేలా చేస్తున్నాయి. ప్రపంచ బ్యాంకు ఇప్పటికే 2023లో చాలా దేశాలు ఆర్థిక మాంద్యంలోకి జారిపోవచ్చనే డేంజర్ బెల్స్ మోగించింది. యూరప్, అమెరికాలో ఈ ముప్పు ఎక్కువగా ఉందని కూడా చెబుతోంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, గూగుల్, హెచ్‌పీ వంటి అనేక అమెరికా టెక్నాలజీ దిగ్గజాలు ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగాల కోతలు ప్రకటించడం కూడా మాంద్యం ఆందోళనలను మరింత పెంచుతోంది. అసలు ఆర్థిక మాంద్యం వస్తే ఏం జరుగుతుంది? ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎందుకింత ఘోరంగా తయారైంది? కొలువుల కోతలకు కారణమేంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదవండి! శివరామకృష్ణ మిర్తిపాటి 2007లో ప్రపంచం నెత్తిన పడిన అమెరికా సబ్‌ప్రైమ్ సంక్షోభం ఇంకా మన కళ్లముందు కదలాడుతూనే ఉంది. ఎందుకంటే ఆ దెబ్బకు ప్రపంచమంతా అత్యంత ఘోరమైన ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయింది. స్టాక్ మార్కెట్లు పేకమేడల్లా కుప్పకూలాయి. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డునపడ్డారు. అనేక బ్యాంకులు, పరిశ్రమలు దివాలా తీశాయి. నిరుద్యోగం ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరింది. 2009 జూన్ వరకు ఇది ప్రపంచ దేశాలను కుదిపేసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా, ఇంకా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొన్న అత్యంత తీవ్ర మాంద్యంగా అది చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ దాదాపు 14 ఏళ్ల తర్వాత ప్రపంచాన్ని మరో మాంద్యంలోకి తోసేస్తున్నది కూడా అమెరికానే కావడం గమనార్హం. గత సంక్షోభాల నుంచి గట్టెక్కేందుకు సహాయ ప్యాకేజీల రూపంలో ఎడాపెడా డాలర్లను ప్రింట్ చేసి, కృత్రిమంగా ఎకానమీలను నిలబెట్టిన అమెరికా, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకులకు ఇప్పుడు దాని సెగ బాగానే తగులుతోంది. ద్రవ్యోల్బణం అంతకంతకూ కొండెక్కి... ప్రజల జేబులను గుల్ల చేస్తుండటంతో చేసేదేమీలేక అవి వడ్డీరేట్ల పెంపు బాట పట్టాయి. అంతేకాదు, గతంలో అందించిన సహాయ ప్యాకేజీ సొమ్మును వ్యవస్థ నుంచి వెనక్కి తీసుకోవడంతో పాటు, అత్యంత వేగంగా వడ్డీరేట్లను పెంచుకుంటూ పోతుండటంతో ఆర్థిక వ్యవస్థలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. వెరసి, డిమాండ్ సన్నగిల్లి పరిశ్రమలు పడకేసే పరిస్థితి నెలకొనడం వల్ల గ్లోబల్ ఎకానమీకి మాంద్యం ముప్పు అంతకంతకూ తీవ్రమవుతోంది. ఇప్పట్లో ధరలు దిగొచ్చే పరిస్థితి లేకపోవడం, వడ్డీరేట్లు కూడా మరింత పెరిగే అవకాశాలు ఉండటంతో ప్రపంచం 2023లో మరో మాంద్యానికి చేరువ కావచ్చని ఆర్థికవేత్తలతో పాటు ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. అయితే, మరికొంత మంది ఆర్థిక వేత్తలు మాత్రం ఇది మందగమనం మాత్రమేనని, ఒకవేళ మాంద్యం వచ్చినా చాలా స్వల్పకాలమే ఉంటుందని లెక్కలేస్తున్నారు. ప్రపంచ బ్యాంకు తాజా వార్నింగ్... అంచనాలను మించిన ద్రవ్యోల్బణం.. దీనికి అడ్డుకట్ట వేసేందుకు అకస్మాత్తుగా పెరిగిన వడ్డీరేట్లు, మళ్లీ కోవిడ్ మహమ్మారి భయాలు, బలహీన డిమాండ్ ప్రభావంతో ప్రపంచ ఎకానమీ వృద్ధి రేటు 2023లో 1.7 శాతానికి పడిపోవచ్చని ప్రపంచ బ్యాంకు తాజా వార్షిక నివేదికలో పేర్కొంది. గత అంచనా 3 శాతం కాగా, దాదాపు సగానికి కోతపెట్డడం గమనార్హం. ఒకవేళ అమెరికా మాంద్యాన్ని తప్పించుకున్నప్పటికీ, వృద్ధి రేటు మాత్రం 0.5 శాతానికి పడిపోవచ్చని లెక్కగట్టింది. అధిక ధరలు, తీవ్ర వడ్డీరేట్లు, ప్రపంచ ఆర్థిక బలహీనతలు అమెరికా వ్యాపార సంస్థలు, వినియోగదారుల నడ్డివిరుస్తాయని ప్రపంచ బ్యాంకు విశ్లేషించింది. కోవిడ్ మరింత విస్తరించి, ఉక్రెయిన్–రష్యా యుద్ధం ముదిరిపోతే... సరఫరా వ్యవస్థలు కుప్పకూలుతాయని.. అంతిమంగా మాంద్యానికి దారితీయొచ్చని వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు... బలహీన చైనా ఎకానమీ కారణంగా, యూరప్ దేశాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొంది. అమెరికా, యూరప్, చైనా ఏకకాలంలో మందగమనంలో ఉండటం అనేది ప్రపంచ ఎకానమీకి పెను ముప్పుగా మారుతుందని ఐఎంఎఫ్ అధిపతి క్రిస్టీనా జార్జియేవా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈయూ ఎకానమీ వృద్ధి 0 స్థాయిలో... చైనా వృద్ధి 4.3 శాతానికి, బ్రెజిల్ వృద్ధి రేటు 0.8 శాతానికి దిగజారవచ్చనేది ప్రపంచ బ్యాంక్ అంచనా. భారత్ బెటర్... అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆర్థిక వృద్ధి రేటు 2022తో పోలిస్తే ఈ ఏడాది సగానికి పడిపోయే అవకాశం ఉన్నప్పటికీ.. మెరుగైన స్థాయిలో 3.4 శాతంగా నమోదు కావచ్చని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ముఖ్యంగా, భారత్ జీడీపీ తగ్గినా కూడా మిగతా దేశాలతో పోలిస్తే మెరుగైన పనితీరును నమోదు చేయొచ్చని చెబుతోంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.6 శాతానికి తగ్గొచ్చని పేర్కొంది. 2022–23 ఏడాది అంచనా 6.9 శాతంగా ఉంది. దీని ప్రకారం చూస్తే ఏడు అతిపెద్ద వర్ధమాన దేశాలు, అభివృద్ధి చెందిన దేశాల్లో అత్యంత వేగవంతమైన వృద్ధి రేటు సాధించిన దేశంగా ఈ ఏడాది భారత్ నిలుస్తుంది. 2020–21లో కోవిడ్ కారణంగా భారత్ జీడీపీ 7.3 శాతం క్షీణించినా, 2021–22లో తిరిగి కోలుకోవడమే కాకుండా 8.7 శాతం వృద్ధి చెందింది. ప్రపంచ ప్రతికూలతల నేపథ్యంలో ఈ ఏడాది వృద్ధి రేటు 7 శాతానికి పరిమితం కావచ్చనేది ప్రభుత్వ అంచనా. మొత్తంమీద చూస్తే ప్రపంచ ఎకానమీ మాంద్యంలోకి జారినప్పటికీ, భారత్ మాత్రం దీన్ని తప్పించుకునే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. అంతా అమెరికానే చేసింది!! 2007–2009 ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ట్రిలియన్ల కొద్దీ డాలర్ల ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించడంతో పాటు వడ్డీరేట్లను దాదాపు సున్నా స్థాయిలోనే అనేక సంవత్సరాలు కొనసాగించింది అమెరికా. పరిస్థితులు కాస్త సద్దుమణగడం.. అమెరికా స్టాక్ మార్కెట్ల జోరు నేపథ్యంలో 2018లో వడ్డీరేట్లను నెమ్మదిగా పెంచడం మొదలుపెట్టింది ఆ దేశ సెంట్రల్ బ్యాంక్. అయితే, పులి మీద పుట్రలా కరోనా మహమ్మారి 2020లో ప్రపంచాన్ని అతలాకుతలం చేయడంతో అన్ని దేశాల ఎకానమీలు ఒక్కసారిగా స్తంభించిపోయి, కుప్పకూలాయి. దీంతో మళ్లీ అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్లను అమాంతం సున్నా స్థాయికి తీసుకొచ్చి, లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించాల్సి వచ్చింది. కోవిడ్ నుంచి గట్టెక్కుతున్న తరుణంలో.. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ముంచుకొచ్చింది. అమెరికా, యూరప్ ఇతరత్రా వాటి మిత్ర దేశాలు రష్యాపై పరోక్ష యుద్ధానికి కాలుదువ్వడం.. ఆంక్షల కొరడా ఝుళిపించడంతో క్రూడ్, ఆహారోత్పత్తుల ధరల మంట మొదలైంది. ద్రవ్యోల్బణం దూసుకెళ్లడంతో అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు తప్పనిసరి పరిస్థితుల్లో వడ్డీరేట్లను ఎకాయెకిన పెంచేయడం మొదలెట్టాయి. అమెరికా తన ఆర్థిక ప్యాకేజీలను వెనక్కి తీసుకోవడం ప్రారంభించింది. కాగా, చైనాలో మళ్లీ కరోనా కల్లోలం, యుద్ధానికి ఇప్పట్లో ముగింపు కనిపించకపోవడంతో ధరాఘాతం మరికొన్నాళ్లు కొనసాగవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఈ ఏడాదీ వడ్డీరేట్లు మరింత పెరిగిపోవచ్చనేది ఆర్థికవేత్తల అభిప్రాయం. ఇదే జరిగితే.. ఎకానమీలు మరింత మందగిస్తాయని.. వెరసి ప్రపంచ మాంద్యానికి ఇంకాస్త చేరువకావడం ఖాయమని కూడా వారు హెచ్చరిస్తున్నారు. ‘ప్రపంచ వృద్ధి తీవ్రంగా మందగిస్తోంది. ఇది మరింత దిగజారితే, చాలా దేశాలు మాంద్యంలోకి జారిపోతాయి. ఈ ధోరణులు చాలాకాలం కొనసాగనుండటం అందోళనకరమైన విషయం. ఇదే జరిగితే వర్థమాన దేశాల ప్రజలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటారు’ అని ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ డేవిడ్ మల్పాస్ అభిప్రాయపడ్డారు. వణికిస్తున్న వడ్డీరేట్లు... 2007లో దాదాపు 5 శాతం స్థాయిలో ఉన్న అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేటు.. అప్పటి ఆర్థిక సంక్షోభం తర్వాత సున్నా స్థాయికి దిగొచ్చింది. దాదాపు 2016 వరకూ ఇదే స్థాయిలో కొనసాగింది. అయితే, తర్వాత మళ్లీ పెరుగుతూ 2.25 శాతానికి చేరింది. ఆ సమయంలో కోవిడ్ దెబ్బకు మళ్లీ 2020లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేటును సున్నాకు తగ్గించేసింది. రెండేళ్లపాటు అక్కడే ఉంచింది. ఎకానమీ కాస్త మెరుగైన సంకేతాలకు తోడు.. ద్రవ్యోల్బణం దాదాపు 9 శాతానికి చేరి (40 ఏళ్ల గరిష్ఠం) ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేయడంతో ఈ ఏడాది మళ్లీ పెంపు మొదలుపెట్టి డిసెంబర్ నాటికి 4.5 శాతానికి చేర్చింది. ఈ ఏడాదిలో ఇది 5.25 శాతానికి చేరే అవకాశం ఉంది. దీంతో డాలరు విలువ ఎగబాకి.. ప్రపంచవ్యాప్తంగా కరెన్సీలను కుదేలు చేసింది. మన రూపాయి కూడా దాదాపు 83 స్థాయికి బక్కచిక్కి ఆల్‌టైమ్ కనిష్ఠానికి పడిపోవడం తెలిసిందే. అయితే, మిగతా కరెన్సీలతో పోలిస్తే మనదే కాస్త తక్కువ క్షీణించడం విశేషం. అమెరికా వడ్డీరేట్ల పెంపు జోరు, ద్రవ్యోల్బణంపై పోరు కారణంగా అటు యూరప్‌తో పాటు ఇతర దేశాల సెంట్రల్ బ్యాంకులూ వడ్డీరేట్లను తప్పక పెంచాల్సి వస్తోంది. మన ఆర్బీఐ కూడా కీలక రెపో రేటును 4 శాతం నుంచి ఇప్పుడు 6.25 శాతానికి పెంచడంతో కార్పొరేట్లు, ఇటు రిటైల్ రుణ గ్రహీతలపై వడ్డీ భారం తడిసిమోపెడవుతోంది. వెరసి ఆర్థిక వ్యవస్థలు మరింత మందగిస్తున్నాయి. యూరప్ సెల్ఫ్ గోల్... అసలే అంతంతమాత్రంగా ఉన్న యూరోపియన్ ఆర్థిక వ్యవస్థ.. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో మరింత దిగజారింది. ముఖ్యంగా అమెరికా ప్రోద్బలంతో రష్యాపై విధించిన ఆంక్షలు చివరికి యూరప్ దేశాల మెడకే చుట్టుకున్నాయి. రష్యా నుంచి చమురు, గ్యాస్ సరఫరాలను నిలిపివేయడం, ఇతరత్రా కమోడిటీ దిగుమతులపై ఆంక్షలకు తోడు జర్మనీకి గ్యాస్ సరఫరా చేసే నార్డ్‌స్ట్రీమ్ పైప్‌లైన్‌ను పేల్చివేయడం (అమెరికా ఏజెంట్లే చేశారన్నది రష్యా ఆరోపణ)తో యూరోపియన్ దేశాల్లో ద్రవ్యోల్బణం కనీవినీ ఎరుగని స్థాయికి (చాలా దేశాల్లో ఆల్‌టైమ్ గరిష్ఠం) ఎగబాకింది. రష్యా చౌక గ్యాస్, క్రూడ్‌ను కాదని భారీ మొత్తానికి అమెరికా ఇతర దేశాల నుంచి యూరప్ దిగుమతి చేసుకుంటోంది. దీంతో అక్కడి పరిశ్రమలు అధిక వ్యయాలతో మూతబడే పరిస్థితి నెలకొంది. ఇది ఉద్యోగాల కోతకు దారితీస్తోంది. బ్రిటన్ ఎకానమీ ఇప్పటికే క్షీణతలోకి (2022 మూడో త్రైమాసికంలో జీడీపీ మైనస్ 0.3% క్షీణించింది) జారుకొని మాంద్యాన్ని చవిచూస్తోంది. మిగతా దేశాలూ అదే బాటలోకి వెళ్లే ప్రమాదం ఉంది. యూరప్ వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్తే అది ప్రపంచ ఎకానమీపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. మొత్తంమీద రష్యా విషయంలో అమెరికా వలలో చిక్కుకుని యూరప్ సెల్ఫ్ గోల్ వేసుకుందనేది ఆర్థికవేత్తల విశ్లేషణ. ధరదడ... స్టాగ్ఫ్లేషన్! పశ్చిమ దేశాల విచ్చలవిడి కరెన్సీ ప్రింటింగ్‌కు తోడు కరోనా దెబ్బతో సరఫరా వ్యవస్థలు ఛిన్నాభిన్నం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ధరలకు రెక్కలొచ్చాయి. ధరల దెబ్బకు సామాన్యుడే కాదు, ఆర్థిక వ్యవస్థలు సైతం అల్లాడిపోతున్నాయి. మన పొరుగున ఉన్న శ్రీలంకలో ద్రవ్యోల్బణం దెబ్బకు ప్రజలు ఎలా రోడ్డెక్కి అధ్యక్షుడిని సైతం పారిపోయేలా చేశారో మనం కళ్లారా చూశాం. అలాగే పాకిస్తాన్లో గోధుమ పిండి, ఇతరత్రా నిత్యావసరాల కోసం జరుగుతున్న కొట్లాటలకూ ధరల తీవ్రతే కారణం. మరోపక్క, ఆర్థిక మందగమనం కూడా కొనసాగుతుండటంతో ప్రస్తుతం ప్రపంచం ‘స్టాగ్ఫ్లేషన్’ను ఎదుర్కొంటోందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. అధిక ద్రవ్యోల్బణానికి తోడు జీడీపీ వృద్ధి అంతకంతకూ పడిపోతూ ఉండటం, ఫలితంగా నిరుద్యోగం తీవ్రతరం కావడాన్ని స్టాగ్‌ఫ్లేషన్‌గా పేర్కొంటారు. కంపెనీల లాభదాయకత పడిపోవడంతో ఉద్యోగాల కోతకు దారితీస్తుంది. మాంద్యం–ద్రవ్యోల్బణంగా కూడా దీన్ని చెప్పొచ్చు. ఇది పాలసీ నిర్ణయాల విషయంలో డైలమాకు కారణమవుతుంది. ఎందుకంటే, అధిక ధరలకు కళ్లెం వేయాలంటే కొన్ని నెలల పాటు వడ్డీరేట్లను పెంచుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. ఫలితంగా డిమాండ్ సన్నగిల్లి, ఆర్థిక వ్యవస్థ మరింత మందగమనంలోకి జారిపోతుంది. ధరలు కట్టడి అయ్యేంతవరకూ సెంట్రల్ బ్యాంకులు అదేపనిగా వడ్డీరేట్లను పెంచడం వల్ల నిరుద్యోగం మరింత పెరగడంతో పాటు అంతిమంగా ఆర్థిక వ్యవస్థ కూడా మాంద్యంలోకి వెళ్లిపోతుందని నిపుణులు పేర్కొంటున్నారు. చైనాలో జీరో కోవిడ్ పాలసీ దెబ్బ... కరోనాతో 2020లో పాతాళానికి పడిపోయిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు.. 2021లో మళ్లీ పుంజుకోవడం మొదలైంది. అయితే, చైనా మాత్రం జీరో కోవిడ్ పాలసీ పేరుతో విధించిన ఆంక్షలకు తోడు, 2022లో కొత్త వేరియంట్ బీఎఫ్7 కారణంగా లాక్డౌన్లకు తెరతీసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. ప్రపంచ తయారీ భాండాగారంగా పేరొందిన చైనా నుంచి వాణిజ్యం కుంటుపడటం.. ద్రవ్యోల్బణాన్ని మరింత ఎగదోసింది. ఈ పరిణామాలతో చైనాలో పారిశ్రామిక, వ్యాపార కార్యకలాపాలు స్తంభించడంతో ఆర్థిక వ్యవస్థ ఘోరంగా పడిపోయింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 2022లో 3 శాతానికి పరిమితమైంది. 2020లో కోవిడ్ వల్ల 2.2 శాతానికి పడిపోయిన ఉదంతాన్ని మినహాయిస్తే, 1976 తర్వాత ఇంత తక్కువ స్థాయిలో నమోదవడం ఇదే తొలిసారి. 2021లో జీడీపీ వృద్ధి 8.1 శాతం కావడం గమనార్హం. అయితే, ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో జీరో కోవిడ్ పాలసీకి 2022 డిసెంబర్లో చైనా చెల్లు చెప్పినప్పటికీ.. తిరిగి మళ్లీ ఎకానమీ పుంజుకోవడానికి చాలా నెలలు పట్టొచ్చనేది ఆర్థిక వేత్తల మాట. పెరుగుతున్న కోవిడ్ కేసులు.. రియల్ ఎస్టేట్ మార్కెట్ క్షీణత, బలహీన ప్రపంచ డిమాండ్ వంటివి 2023లో చైనాకు పెను సవాళ్లుగా నిలుస్తాయని మూడీస్ ఎకనమిస్ట్ హ్యారీ మర్ఫీ క్రూయిజ్ విశ్లేషిస్తున్నారు. రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కుంటుపడటం అంటే ప్రపంచ మాంద్యానికి మరింత దగ్గరైనట్లేనని కూడా పేర్కొంటున్నారు. ఒకపక్క మాంద్యం భయాలకు తోడు... వ్యయాలు తడిసిమోపెడవుతుండంతో టెక్నాలజీ కంపెనీలు గత ఏడాది నుంచే కొలువుల కోతకు తెరతీశాయి. అంతేకాదు, చాలా కంపెనీలు కొత్త ఉద్యోగాలను కూడా (హైరింగ్) తాత్కాలికంగా ఆపేస్తుండటం ఆర్థిక వ్యవస్థల్లో బలహీనతకు నిదర్శనం. ప్రపంచ టాప్ టెక్నాలజీ కంపెనీలన్నీ ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నట్లు ప్రకటించాయి. దీంతో అసలే అంతంతమాత్రంగా ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి పుండుమీద కారంలా తయారైంది. గూగుల్ దాదాపు 12,000 ఉద్యోగాల్లో కోత పెట్టనుండగా, హెచ్‌పీ దాదాపు 6,000 మందిని సాగనంపింది. ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ మెటా సైతం ఆదాయాలు పడిపోతుండటంతో 11,000 కొలువులకు కోత పెట్టింది. ఇక ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత సిబ్బందిని సగానికి సగం తగ్గించి, దాదాపు 3,500 మందిని ఇంటికి పంపారు. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ అయితే, ఏకంగా 18,000 మందిపై వేటు వేసింది. కంపెనీ చరిత్రలో ఇదే అతిపెద్ద కోత. ఇందులో భారత్‌లోనూ 1,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. తాజాగా మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా 10,000 కొలువులు (మొత్తం ఉద్యోగుల్లో 5%) కట్ చేస్తామని ప్రకటించింది. ఇంకా చిన్నాచితకా టెక్ కంపెనీలతో పాటు పెప్సికో, ఫోర్డ్ వంటి తయారీ రంగ కంపెనీలు సైతం ఇదే బాటలో వెళ్తున్నాయి. ‘లేఆఫ్స్.ఎఫ్‌వైఐ’ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది టెక్నాలజీ కంపెనీలు దాదాపు 1,50,000 ఉద్యోగులను తొలగించినట్లు అంచనా. ఇక 2023 విషయానికొస్తే, ఇప్పటికే 104 పైగా కంపెనీలు సుమారు 26,000 మందికి పింక్ స్లిప్స్ ఇచ్చాయి. అంటే రోజుకు 1,600 మంది కొలువులు కోల్పోయారన్నమాట! ఆర్థిక వృద్ధి మరింత పడిపోయి, వడ్డీరేట్ల పెంపు కొనసాగితే రానున్నకాలంలో ఒక్క టెక్నాలజీ కంపెనీలే కాకుండా అన్ని రంగాల్లోనూ మరిన్ని కోతలు తప్పవని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2007లో ప్రపంచం నెత్తిన పడిన అమెరికా సబ్‌ప్రైమ్ సంక్షోభం ఇంకా మన కళ్లముందు కదలాడుతూనే ఉంది. ఎందుకంటే ఆ దెబ్బకు ప్రపంచమంతా అత్యంత ఘోరమైన ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయింది. స్టాక్ మార్కెట్లు పేకమేడల్లా కుప్పకూలాయి. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డునపడ్డారు. అనేక బ్యాంకులు, పరిశ్రమలు దివాలా తీశాయి. నిరుద్యోగం ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరింది. 2009 జూన్ వరకు ఇది ప్రపంచ దేశాలను కుదిపేసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా, ఇంకా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొన్న అత్యంత తీవ్ర మాంద్యంగా అది చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ దాదాపు 14 ఏళ్ల తర్వాత ప్రపంచాన్ని మరో మాంద్యంలోకి తోసేస్తున్నది కూడా అమెరికానే కావడం గమనార్హం. గత సంక్షోభాల నుంచి గట్టెక్కేందుకు సహాయ ప్యాకేజీల రూపంలో ఎడాపెడా డాలర్లను ప్రింట్ చేసి, కృత్రిమంగా ఎకానమీలను నిలబెట్టిన అమెరికా, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకులకు ఇప్పుడు దాని సెగ బాగానే తగులుతోంది. ద్రవ్యోల్బణం అంతకంతకూ కొండెక్కి... ప్రజల జేబులను గుల్ల చేస్తుండటంతో చేసేదేమీలేక అవి వడ్డీరేట్ల పెంపు బాట పట్టాయి. అంతేకాదు, గతంలో అందించిన సహాయ ప్యాకేజీ సొమ్మును వ్యవస్థ నుంచి వెనక్కి తీసుకోవడంతో పాటు, అత్యంత వేగంగా వడ్డీరేట్లను పెంచుకుంటూ పోతుండటంతో ఆర్థిక వ్యవస్థలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. వెరసి, డిమాండ్ సన్నగిల్లి పరిశ్రమలు పడకేసే పరిస్థితి నెలకొనడం వల్ల గ్లోబల్ ఎకానమీకి మాంద్యం ముప్పు అంతకంతకూ తీవ్రమవుతోంది. ఇప్పట్లో ధరలు దిగొచ్చే పరిస్థితి లేకపోవడం, వడ్డీరేట్లు కూడా మరింత పెరిగే అవకాశాలు ఉండటంతో ప్రపంచం 2023లో మరో మాంద్యానికి చేరువ కావచ్చని ఆర్థికవేత్తలతో పాటు ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. అయితే, మరికొంత మంది ఆర్థిక వేత్తలు మాత్రం ఇది మందగమనం మాత్రమేనని, ఒకవేళ మాంద్యం వచ్చినా చాలా స్వల్పకాలమే ఉంటుందని లెక్కలేస్తున్నారు. -
దిగువబాటన భారత్ వృద్ధి రేటు
న్యూఢిల్లీ: భారత్ 2023–24 ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను ప్రపంచ బ్యాంక్ కుదించింది. 6.9 శాతంగా ఉన్న క్రితం అంచనాలను 6.6 శాతానికి కుదిస్తున్నట్లు తన తాజా ఎకనమిక్ అప్డేట్లో తెలిపింది. భారత్ 2021–22లో 8.7 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకోగా, ప్రస్తుత 2022–23లో ఈ రేటు 6.9 శాతంగా ఉంటుందని ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. కాగా, 2024–25 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటును ప్రపంచ బ్యాంక్ 6.1 శాతంగా అంచనావేసింది. అంటే వృద్ధి రేటు క్రమంగా దిగువకే పయనిస్తుందన్నది ప్రపంచ బ్యాంక్ అంచనా. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితి, ఎగుమతులు, పెట్టుబడుల వేగం తగ్గడం తన అంచనాలకు కారణమని ప్రపంచ బ్యాంక్ పేర్కొంటోంది. అయితే ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఎకానమీల్లో భారత్ తొలి స్థానంలో ఉంటుందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. చదవండి: టాలెంట్ కోసం విప్రో కీలక నిర్ణయం: ఉద్యోగులకు బంపర్ ఆఫర్ -
ఈ ఏడాది భారత జీడీపీ వృద్ధిరేటు 7 శాతమే!
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2022–23 ఆర్థిక సంవత్సరంలో 7 శాతానికి పరిమితం అవుతుందని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) తొలి ముందస్తు అంచనాలు వెల్లడించాయి. 2021–22 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే (8.7 శాతం) ఇది 1.7 శాతం తక్కువ కావడం గమనార్హం. తయారీ, మైనింగ్ రంగాల పేలవ పనితీరు వృద్ధి రేటు అంచనా భారీ తగ్గుదలకు కారణమని తొలి అంచనాలు వెలువరించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తయారీ రంగంలో అసలు వృద్ధిలేకపోగా 1.6 శాతం క్షీణత నమోదవుతుందని ఎన్ఎస్ఓ అంచనా. 2021–22లో ఈ రంగం 9.9% వృద్ధిని నమోదుచేసింది. మొత్తం ఎకానమీలో పారిశ్రామిక రంగం వెయిటేజ్ దాదాపు 15 శాతంకాగా ఇందులో మెజారిటీ వాటా తయారీ రంగానికి కావడం గమనార్హం. ఇక మైనింగ్‌లో కూడా వృద్ధి రేటు 11.5 శాతం నుంచి 2.4%కి పడిపోతుందని అంచనాలు వెలువడ్డం గమనార్హం. కాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 6.8% అంచనాలకన్నా కేంద్రం అంచనాలు 20 బేసిస్ పాయింట్లు అధికంగా ఉండడం గమనార్హం. ఎన్ఎస్ఓ ప్రకటనలో ముఖ్యాంశాలు ఇవీ.. ►జీడీపీలో దాదాపు 15 శాతం వాటా కలిగిన వ్యవసాయ రంగంలో వృద్ధి 3.5 శాతంగా ఉండనుంది. 2021–22లో ఈ రేటు 3%. ►ట్రేడ్, హోటెల్, రవాణా, కమ్యూనికేషన్లు,, బ్రాడ్‌కాస్టింగ్ విభాగానికి సంబంధించిన సర్వీసుల వృద్ధి రేటు 11.1 శాతం నుంచి 13.7 శాతానికి చేరనుంది. ►ఫైనాన్షియల్, రియల్టీ, ప్రొఫెషనల్ సేవలలో వృద్ధి రేటు 4.2% నుంచి 6.4%కి పెరగనుంది. ►అయితే నిర్మాణ రంగంలో వృద్ధి రేటు 11.5%నుంచి 9.1 శాతానికి తగ్గనుంది. ►పబ్లిక్ అడ్మినిస్టేషన్, రక్షణ, ఇతర సేవల వృద్ధి రేటు కూడా 12.6% నుంచి 7.9%కి పడనుంది. ►స్థూల విలువ జోడింపు (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్– జీవీఏ) ప్రాతిపదికన 2022–23లో వృద్ధి రేటు 8.1% నుంచి 6.7%కి తగ్గనుంది. ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రాంతం, పరిశ్రమ లేదా రంగంలో ఉత్పత్తి చేసిన వస్తువులు, సేవల విలువే జీవీఏ. ఇంకా చెప్పాలంటే జీడీపీలో ఒక నిర్దిష్ట రంగం ఉత్పత్తి తోడ్పాటును జీవీఏ ప్రతిబింబిస్తుంది. అన్ని రంగాల జీవీఏలను కలిపి, పన్నులు– సబ్సిడీలకు సంబంధించి అవసరమైన సర్దుబాటు చేస్తే ఆర్థిక వ్యవస్థ జీడీపీ విలువ వస్తుంది. ఎన్ఎస్ఓ అంచనా విలువల్లో. 2011–12 స్థిర ధరల ప్రాతిపదికన (ద్రవ్యోల్బణం సర్దుబాటు చేస్తూ) వాస్తవ జీడీపీ విలువ 2021–22లో రూ.147.36 లక్షల కోట్లయితే, ఇది 2022–23లో రూ.157.60 లక్షల కోట్లకు పెరగనుందని ఎన్ఎస్ఓ తాజా అంచనా. అంటే వృద్ధి రేటు 7 శాతం అన్నమాట. -
భారత్ వృద్ధిరేటు అప్‌గ్రేడ్
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) వృద్ధి అంచనాలను పలు అంతర్జాతీయ, దేశీయ ఆర్థిక సంస్థలు తగ్గిస్తున్న నేపథ్యంలో ప్రపంచబ్యాంక్ ఇందుకు భిన్నంగా మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధి రేటు అంచనాలను తాజాగా 6.5 శాతం నుంచి 6.9 శాతానికి పెంచింది. నిజానికి అక్టోబర్‌లోనే బహుళజాతి బ్యాంకింగ్ దిగ్గజం భారత్ 2022–23 వృద్ధి రేటును 7.5 శాతం నుంచి 1 శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి దిగివచ్చింది. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లను తట్టుకుని భారత్ ఎకానమీ నిలబడగలగడమే తాజా 40 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) అంచనా పెంపునకు కారణమని పేర్కొంది. దీనితోపాటు రెండవ (సెప్టెంబర్) త్రైమాసికంలో భారత్ ఎకానమీ వృద్ధి రేటు అంచనాలకు మించి 6.3 శాతంగా నమోదుకావడమూ తమ తాజా ఎగువముఖ సవరణకు కారణమని వివరించింది. భారత్ ఎకానమీ మొదటి త్రైమాసికంలో 13.5 శాతం పురోగతి సాధించిన సంగతి తెలిసిందే. ‘నావిగేటింగ్ ది స్ట్రోమ్’ (తుపానులో ప్రయాణం) శీర్షికన ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన ఇండియా డెవలప్మెంట్ అప్డేట్ నివేదికలో మరికొన్ని ముఖ్యాంశాలు... ► క్షీణిస్తున్న అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు భారతదేశ వృద్ధి అవకాశాలపైనా ప్రభావం చూపుతాయి. అయితే ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కె ట్లతో పోలిస్తే భారత్ ఎకానమీ అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనగలుగుతోంది. ► మంచి డిమాండ్ వాతావరణంలో ప్రపంచంలోనే వేగవంతమైన ఎకానమీ హోదాను కొనసాగిస్తోంది. ► అయితే అంతర్జాతీయ పరిణామాలపై నిరంతర నిఘా అవసరం. అభివృద్ధి చెందిన దేశాల కఠిన ద్రవ్య పరపతి విధానాలు, రూపాయి పతనం, కమోడిటీ ధరల తీవ్రత, ఆయా అంశాల నేపథ్యంలో కరెంట్ అకౌంట్ సవాళ్లు దేశం ఎదుర్కొనే వీలుంది. దీనితోపాటు ఎగుమతుల పరిస్థితిపై ప్రత్యేక దృష్టి అవసరం. ►2023–24లో ఎకానమీ వృద్ధి రేటు 6.6%గా నమోదుకావచ్చు. ► భారీ పన్ను వసూళ్ల నేపథ్యంలో ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 2022–23లో లక్ష్యాల మేరకు జీడీజీలో 6.4%కి (విలువలో రూ.16.61 లక్షల కోట్లు) కట్టడి కావచ్చు. ఫిచ్ 7% అంచనా యథాతథం కాగా, ఫిచ్ రేటింగ్ 2022–23 ఆర్థిక సంవత్సరానికి భారత్ వృద్ధి అంచనాలను యథాతథంగా 7 శాతంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల అంచనాలను తగ్గిస్తున్నట్లు తెలిపింది. -
భారత్ వృద్ధి రేటు అప్‌గ్రేడ్
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) వృద్ధి అంచనాలను పలు అంతర్జాతీయ, దేశీయ ఆర్థిక సంస్థలు తగ్గిస్తున్న నేపథ్యంలో ప్రపంచబ్యాంక్ ఇందుకు భిన్నంగా మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధి రేటు అంచనాలను తాజాగా 6.5 శాతం నుంచి 6.9 శాతానికి పెంచింది. నిజానికి అక్టోబర్‌లోనే బహుళజాతి బ్యాంకింగ్ దిగ్గజం భారత్ 2022–23 వృద్ధి రేటును 7.5 శాతం నుంచి 1 శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి దిగివచ్చింది. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లను తట్టుకుని భారత్ ఎకానమీ నిలబడగలగడమే తాజా 40 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) అంచనా పెంపునకు కారణమని పేర్కొంది. దీనితోపాటు రెండవ (సెప్టెంబర్) త్రైమాసికంలో భారత్ ఎకానమీ వృద్ధి రేటు అంచనాలకు మించి 6.3 శాతంగా నమోదుకావడమూ తమ తాజా ఎగువముఖ సవరణకు కారణమని వివరించింది. భారత్ ఎకానమీ మొదటి త్రైమాసికంలో 13.5 శాతం పురోగతి సాధించిన సంగతి తెలిసిందే. ‘నావిగేటింగ్ ది స్ట్రోమ్’ (తుపానులో ప్రయాణం) శీర్షికన ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన ఇండియా డెవలప్మెంట్ అప్డేట్ నివేదికలో మరికొన్ని ముఖ్యాంశాలు... ►క్షీణిస్తున్న అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు భారతదేశ వృద్ధి అవకాశాలపైనా ప్రభావం చూపుతాయి. అయితే ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కె ట్లతో పోలిస్తే భారత్ ఎకానమీ అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనగలుగుతోంది. ►మంచి డిమాండ్ వాతావరణంలో ప్రపంచంలోనే వేగవంతమైన ఎకానమీ హోదాను కొనసాగిస్తోంది. ►అయితే అంతర్జాతీయ పరిణామాలపై నిరంతర నిఘా అవసరం. అభివృద్ధి చెందిన దేశాల కఠిన ద్రవ్య పరపతి విధానాలు, రూపాయి పతనం, కమోడిటీ ధరల తీవ్రత, ఆయా అంశాల నేపథ్యంలో కరెంట్ అకౌంట్ సవాళ్లు దేశం ఎదుర్కొనే వీలుంది. దీనితోపాటు ఎగుమతుల పరిస్థితిపై ప్రత్యేక దృష్టి అవసరం. ►2023–24లో ఎకానమీ వృద్ధి రేటు 6.6%గా నమోదుకావచ్చు. ►భారీ పన్ను వసూళ్ల నేపథ్యంలో ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 2022–23లో లక్ష్యాల మేరకు జీడీజీలో 6.4%కి (విలువలో రూ.16.61 లక్షల కోట్లు) కట్టడి కావచ్చు. ఫిచ్ 7% అంచనా యథాతథం కాగా, ఫిచ్ రేటింగ్ 2022–23 ఆర్థిక సంవత్సరానికి భారత్ వృద్ధి అంచనాలను యథాతథంగా 7 శాతంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల అంచనాలను తగ్గిస్తున్నట్లు తెలిపింది. -
మధ్యతరగతి విస్ఫోటం
డి.శ్రీనివాసరెడ్డి: మధ్య తరగతి జన విస్ఫోటనం. కొంతకాలంగా ప్రపంచమంతటా శరవేగంగా జరుగుతున్న పరిణామమిది! మార్కెట్ల విస్తరణ, ఆదాయ వనరుల పెరుగుదల తదితర కారణాలతో ఏ దేశంలో చూసినా మధ్య తరగతి జనం ఏటా విపరీతంగా పెరుగుతున్నారు. ముఖ్యంగా ఆసియా దేశాల్లో ఈ ట్రెండ్ మరీ ఎక్కువగా ఉంది. ఇప్పటికే ప్రపంచ జనాభాలో 40 శాతం పైగా వాటా మధ్యతరగతిదే. దాదాపుగా అన్ని దేశాల్లోనూ ప్రభుత్వాలు నడవడానికి వీరి ఆదాయ వ్యయాలే ఇంధనంగా మారుతున్నాయంటే అతిశయోక్తి కాదు! ప్రఖ్యాత వ్యాపార దిగ్గజాలు కూడా వ్యాపార విస్తరణ ప్రణాళికల్లో మిడిల్ క్లాస్‌ను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది! ఏటా 14 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా మధ్య తరగతి జనాభా ఏటా ఏకంగా 14 కోట్ల చొప్పున పెరిగిపోతోందని, ప్రస్తుతం 320 కోట్లుగా ఉందని ప్రపంచ బ్యాకు తాజా నివేదిక వెల్లడించింది. 2030 నాటికి వీరి సంఖ్య 520 కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది. అంటే ప్రపంచ జనాభాలో ఏకంగా 65 శాతానికి చేరనుందన్నమాట! మొత్తం ప్రపంచ ఆదాయంలో మూడో వంతు ఈ మధ్యతరగతి మహాజనుల నుంచే సమకూరుతోందట! సింహభాగం ఆసియాదే... ఈ శతాబ్దారంభంలో అమెరికా తదితర సంపన్న యూరప్ దేశాల్లో అధిక సంఖ్యాకులు మధ్యతరగతి వారే ఉండేవారు. క్రమంగా అక్కడ వారి వృద్ధి తగ్గుతూ ఆదియా దేశాల్లో శరవేగగంగా పెరుగుతోంది. వరల్డ్ డేటా లాబ్ అంచనా ప్రకారం వచ్చే ఎనిమిదేళ్లలో కొత్తగా రానున్న 100 కోట్ల మంది మధ్యతరగతి జనంలో ఏకంగా 90 శాతం ఆసియాకు చెందినవారే ఉండనున్నారు! భారత్, చైనాతోపాటు ఇండొనేసియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌వంటి ఆసియా దేశాలు మిడిల్ క్లాస్ జనంతో మరింతగా కళకళలాడతాయట. ఆ దేశాల్లో శరవేగంగా సాగుతున్న పట్టణీకరణే అక్కడ మధ్యతరగతి ప్రాబ ల్యానికి తార్కాణం. వీరు చైనాలో 2010 నాటికి జనాభాలో 49 శాతముండగా ఇప్పటికే 56 శాతానికి పెరిగారు. 2035 నాటికి చైనా జనాభాలో ఏకంగా 100 కోట్ల మంది పట్టణవాసులే ఉంటారని అంచనా. భారత్‌లోనూ 2035 నాటికి 67.5 కోట్ల మంది (45 శాతం) పట్టణాల్లో నివసిస్తారట. ఆసియాలో ఈ సంఖ్య 300 కోట్లుగా ఉండనుంది. యూఎస్‌లో పాపం మిడిల్‌క్లాస్... ఒకప్పుడు మధ్యతరగతి ఆదాయ వర్గాల దేశంగా నిలిచిన అమెరికాలో వారి సంఖ్య బాగా తగ్గుతోంది. అక్కడ 35 వేల నుంచి 1.06 లక్షల డాలర్ల వార్షికాదాయముంటే మధ్యతరగతిగా పరిగణిస్తారు. 1971లో దేశ జనాభాలో 61 శాతం మిడిల్ క్లాసే కాగా గతేడాదికి 50 శాతానికి తగ్గిందని ప్యూ రీసెర్చ్ సెంటర్ వెల్లడించింది. ఇక రష్యా, ఉక్రెయిన్లలో యుద్ధం దెబ్బకు ఒక్క ఈ ఏడాదే ఏకంగా కోటి మంది దాకా మధ్య తరగతి నుంచి దిగువ తరగతికి దిగజారినట్టు ప్యూ నివేదిక వెల్లడించింది. దేశ, కాలమాన పరిస్థితులను బట్టి కొన్ని తేడాలున్నా మొత్తమ్మీద ఒక వ్యక్తి తన అన్ని అవసరాలకు కలిపి రోజుకు దాదాపు రూ.1,000, ఆ పైన వెచ్చించగలిగితే అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం అతన్ని మధ్యతరగతిగా లెక్కిస్తారు. రూ.5 లక్షల నుంచి 30 లక్షల వార్షికాదాయం ఉన్నవారిని మధ్యతరగతిగా పరిగణిస్తారు. మన దగ్గర కూడా... మధ్యతరగతి మందహాసమే భారత్‌లో ప్రస్తుతం ప్రతి ముగ్గురిలో ఒకరు మిడిల్ క్లాస్ జీవులే. 2047 నాటికి వీరి సంఖ్య రెట్టింపై ప్రతి ముగ్గురిలో ఇద్దరు వాళ్లే ఉంటారని పీపుల్ రీసెర్చ్ ఆఫ్ ఇండియాస్ కన్సూ్యమర్ ఎకానమీ (ప్రైజ్) అంచనా. 2005లో దేశ జనాభాలో కేవలం 14 శాతమున్న మధ్యతరగతి ఇప్పుడు ఏకంగా 31 శాతానికి పెరిగింది. 2035 కల్లా 43.5 శాతానికి వృద్ధి చెందనుంది! -
‘సాల్ట్’ అమలు శభాష్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ (సాల్ట్) ప్రాజెక్టు అమలు పురోగతి సంతృప్తికరంగా సాగుతోందని ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది. ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చక్కగా అమలు చేస్తోందని కితాబిచ్చింది. పాఠశాల విద్యలో ఏపీ సర్కార్ చేపట్టిన సంస్కరణల నేపథ్యంలో మరింత మెరుగైన ఫలితాలను సాధించడానికి ప్రపంచ బ్యాంకు 250 మిలియన్ డాలర్లు ఆర్థికసాయం అందిస్తున్న విషయం తెలి సిందే. ఈ నేపథ్యంలో.. ప్రాజెక్టు అమలు ఫలితాల పై ఆ బ్యాంకు అధ్యయనం చేసి నివేదికను వెల్లడించింది. ముఖ్యంగా రాష్ట్రంలో 15 వేలకు పైగా పాఠశాలల్లో అభ్యాస వాతావరణాన్ని మెరుగుపరిచిందని, తద్వారా కీలకమైన ముందస్తు ఫలితాన్ని రాష్ట్రం సాధించిందని.. ఏపీ సర్కార్ ఈ ప్రాజెక్టును ప్రశంసనీయ స్థాయిలో అమలుచేస్తోందని ఆ నివేదిక పేర్కొంది. ఇక కరోనా కారణంగా రాష్ట్రంతో పాటు జాతీయంగా కూడా స్థూల ఆర్థికంపై ప్రతి కూల ప్రభావం కొనసాగుతోందని, అయితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని ప్రపంచ బ్యాంకు నివేదికలో స్పష్టం చేసింది. అలాగే, ట్రెజరీ ద్వారా సకాలంలో నిధులు విడుదలవుతున్నాయని.. అమలుచేసే నోడల్ ఏజెన్సీలకు రాష్ట్ర ఖజానా నుంచి నిధులు అందుతున్నాయని పేర్కొంది. ప్రాజెక్టు అమలులో ఊహించిన కీలక ఆవిష్కరణలు, కార్యకలాపాలను క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయని, సాంకేతిక సహాయ ఏజెన్సీల ఏర్పాటులో ప్రభుత్వం నిమగ్నమైందని వివరించింది. కార్యకలాపాల ప్రణాళిక, డెలివరీలో నోడల్ విద్యా సంస్థలకు మద్దతివ్వడానికి అవసరమైన చర్యలు, పనులను నిశితంగా పర్యవేక్షించేం దుకు సాంకేతిక మద్దతును అందించడానికి టాస్క్ టీమ్‌నూ ఏర్పాటు చేసిందని ఆ నివేదిక పేర్కొంది. కరోనాలోనూ పటిష్టంగా ఏర్పాట్లు గత రెండేళ్లుగా కోవిడ్ మహమ్మారి కారణంగా ఏపీ సహా దేశవ్యాప్తంగా దాదాపు ఏడాదిపాటు విద్యా సంస్థలు మూతపడినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం మాత్రం పటిష్టంగా ఏర్పాట్లుచేసిందని బ్యాంకు పేర్కొంది. పాఠశాలల మూసివేత, పునఃప్రారంభ నిర్వహణకు సంబంధించిన ప్రక్రియల్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు వ్యాప్తిచెందకుండా మార్గదర్శకాలు రూపొందించి అమలుచేసినట్లు ప్రపంచ బ్యాంకు ఏపీ సర్కార్‌ను ప్రశంసించింది. కోవిడ్ సమయంలో ఆన్లైన్, టెలివిజన్, రేడియో, సోషల్ మీడియాను బలోపేతం చేశారని. తక్కువ ఆదాయ కుటుంబాల విద్యార్థులకు రిమోట్ లెర్నింగ్‌ను బలోపేతం చేసి అందుబాటులోకి తెచ్చిందని బ్యాంకు కొనియాడింది. ప్రపంచ బ్యాంకు ప్రస్తావించిన ప్రధానాంశాలివే.. ► విద్యా సంస్థల నిర్వహణ, సామర్థ్యాన్ని పెంచి తద్వారా ఆశించిన ఫలితాలను సాధించడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక మద్దతు ఏజెన్సీలను ఏర్పాటు చేసింది. ► స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్ఈఆర్టీ) మద్దతుతో వృత్తిపరంగా టీచర్ల అభివృద్ధి, అభ్యాస కార్యకలాపాలను అంచనా వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విభాగాన్నీ ఏర్పాటు చేసింది. ► ప్రాజెక్టు ఫలితాల సాధనకు థర్డ్‌పార్టీ ఏజెన్సీని, ప్రాజెక్టు నిర్వహణ, పర్యవేక్షణకు ప్రోగ్రామ్ కన్సల్టెన్సీ ఏజెన్సీని కూడా ఏర్పాటు చేసింది. ► అలాగే, ప్రోగ్రాం డెవలప్మెంట్ ఆబ్జెక్టివ్ (పీడీఓ) సాధన దిశగా మొత్తం ప్రాజెక్టు పురోగతి సంతృప్తికరంగా కొనసాగుతోంది. ► ప్రాథమిక విద్యలో అభ్యాస ఫలితాలతో పాటు బోధనా విధానాల్లో నాణ్యత పెంచడం, పాఠశాలల నిర్వహణను మరింత మెరుగుపరచడమే ప్రాజెక్టు ప్రధానాశయం, లక్ష్యం. ఇందులో భాగంగా.. ప్రాథమిక దశలోనే ప్రాజెక్టు అమలు సంతృప్తికరంగా సాగుతోంది. ► పాఠశాలల నిర్వహణ, పనితీరుపై నిరంతరం సమాచారం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం తల్లిదండ్రుల కమిటీలను మరింత పటిష్టం చేస్తోంది. -
ఏపీ విద్యారంగ పథకాలు నచ్చి .. ప్రపంచ బ్యాంకు సాయం
-
వృద్ధి, ద్రవ్యోల్బణం రానున్న బడ్జెట్ లక్ష్యాలపై నిర్మలా సీతారామన్
వాషింగ్టన్: ఆర్థికాభివృద్ధి, ద్రవ్యోల్బణం కట్టడే 2022-23 వార్షిక బడ్జెట్ (2023 ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో సమర్పించే అవకాశం) లక్ష్యాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వార్షిక సమావేశాల్లో పాల్గొనడానికిగాను ఆరు రోజుల అమెరికా పర్యటనకు వచ్చిన నిర్మలా సీతారామన్ మొదటిరోజు-మంగళవారం వాషింగ్టన్ డీసీలో బిజీబిజీగా గడిపారు. అమెరికా ఆర్థికమంత్రి జనెత్ యెల్లెన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో భేటీ, ప్రతిష్టాత్మక బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూట్లో ఆర్థికవేత్తలు, వ్యాపారవేత్తలను ఉద్దేశించి చేసిన ప్రసంగం ఇందులో ఉన్నాయి. బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూట్లో కార్యక్రమంలో ప్రముఖ ఆర్థికవేత్త ఈశ్వర్ ప్రసాద్‌సహా పలువురు నిపుణుల అడిగిన ప్రశ్నలకు ఆమె సవివరంగా సమాధానాలు ఇచ్చా రు. ఆమె ప్రసంగంలో మరిన్ని ముఖ్యాంశాలు.. ► భారత్ ఎకానమీ సమీప భవిష్యత్తులో ఎదుర్కొనబోయే ప్రధాన సవాళ్లలో అధిక ఇంధన ధరలు ఒకటి. ► మహమ్మారి సవాళ్ల నుంచి సమర్థవంతంగా బయటపడిన భారత్ అటు వృద్ధి-ఇటు ద్రవ్యోల్బణాన్ని సమర్థవంతంగా సమతౌల్యం చేయగలుగుతోంది. ఇది గమనించడం చాలా ముఖ్యం. ► భారత్ దేశ ఆర్థిక వ్యవస్థను గమనిస్తున్న పలు రేటింగ్, విశ్లేషణా, ఆర్థిక సంస్థలు కూడా భారత్ ఎకానమీ బలహీనపడలేదన్న విషయాన్ని గుర్తిస్తున్నాయి. ► ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి వల్ల ఇంధనం, ఎరువులు, ఆహార రంగాలకు సంబంధించిన సవాళ్లను భారత్ ఎదుర్కొంటోంది. వీటన్నింటినీ భారత్ జాగ్రత్తగా గమనిస్తోంది. ► అంతర్జాతీయ ఒత్తిళ్లు ప్రజలకు చేరకుండా చూసుకుంటున్నాము. ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం వల్ల ఇంధన ధరల పెరుగుదల భారం సామాన్య ప్రజలపై పడ్డం లేదు. ► రూపాయిని తమ దేశాల్లో ఆమోదయోగ్యంగా మార్చేందుకు వివిధ దేశాలతో భారత్ చర్చలు జరుపుతోంది. ► యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్), బీహెచ్ఐఎం యాప్, ఎన్సీపీఐ (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) అన్నీ ఇప్పుడు ఆయా దేశాల్లో వ్యవస్థలతో కలిసి పటిష్టంగా పనిచేయడానికి తగిన ప్రయత్నం జరుగుతోంది. మన వ్యవస్థకు ఇంటర్–ఆపరేటబిలిటీ కూడా ఆ దేశాల్లోని భారతీయుల నైపుణ్యానికి బలాన్ని ఇస్తుంది. బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూట్లో ప్రముఖ ఆర్థికవేత్త ఈశ్వర్ ప్రసాద్‌తో ఆర్థికమంత్రి -
‘నాడు-నేడు’ను గుర్తించిన వరల్డ్ బ్యాంక్.. ఆర్థిక సాయం ప్రకటన
ఏపీ ప్రభుత్వం విద్యా రంగ సంస్కరణల కోసం అమలు చేస్తున్న నాడు-నేడు పథకాన్ని ప్రపంచం బ్యాంకు గుర్తించింది. ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఇంగ్లీషు మీడియంలో నాణ్యమైన చదువులు అందించే ‘నాడు-నేడు’కు వరల్డ్ బ్యాంకు ఆర్థిక సాయం ప్రకటించింది. 250 మిలియన్ డాలర్లతో మరింత సమర్థవంతంగా పథకం అమలు చేసేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు 250 మిలియన్ డాలర్ల నిధులను షరతులు లేని రుణంగా మంజూరు చేసింది. రాష్ట్రంలో నాడు-నేడు పథకం క్రింద పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో ఇప్పటికే నిర్వహిస్తున్నారు. సాల్ట్ (SALT-Supporting AP Learning Transformation) ప్రాజెక్టు కింద కొత్తగా ప్రపంచ బ్యాంకు 250 మిలియన్ డాలర్ల ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది. ఈ సాయంతో మొత్తం ప్రపంచ బ్యాంకు నిధులతో పాఠశాల విద్యాశాఖలో చేపట్టిన ఇది తొలి ప్రాజెక్టుగా నిలవనుంది. గడచిన మూడేళ్లలో పాఠశాల విద్యాశాఖలో ప్రభుత్వం రూ. 53 వేల కోట్ల ఖర్చు చేసింది. ఒక్క అమ్మ ఒడి పథకానికే రూ.19,617 కోట్లు సీఎం జగన్ కేటాయించారు. వచ్చే ఇదేళ్లలో ఈ నిధులను ఉపయోగించుకుని జరిగే అభివృద్ధి ని ప్రోగ్రాం ఫర్ రిజల్ట్స్ కింద చూడనున్నట్లు వరల్డ్ బ్యాంకు పేర్కొంది. చదవండి: విశాఖ రాజధానిపై విషం.. ఉత్తరాంధ్ర ప్రగతికి మోకాలడ్డు 14, 15 న దక్షిణాది రాష్ట్రాల సదస్సు పాఠశాల విద్యలో ఉత్తమ పద్ధతులు, సంస్కరణలే ధ్యేయంగా ప్రభుత్వ పాఠశాలల సామర్థ్యం పెంచాలనే ఉదేశ్యంగా దక్షిణాది రాష్ట్రాల యుడిఐఎస్ఈ సదస్సును విజయవాడలో రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ సదస్సులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా సంస్కరణలను చర్చించడంతో పాటు ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నాడు నేడు పథకంపై ప్రత్యేక ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. -
2022–23లో భారత్ వృద్ధి 6.5 శాతమే!
వాషింగ్టన్: భారత్ ఎకానమీ 2022–23 వృద్ధి అంచనాలకు ప్రపంచబ్యాంక్ ఒక శాతం (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) కోత పెట్టింది. జూన్‌లో వేసిన తొలి అంచనా 7.5 శాతాన్ని తాజాగా 6.5 శాతానికి కుదించింది. అంతర్జాతీయ ప్రతికూల అంశాలను దీనికి కారణంగా చూపింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంక్ వార్షిక సదస్సు నేపథ్యంలో దక్షిణ ఆసియా ఆర్థిక అంశాలపై విడుదలైన నివేదికలో ఈ అంచనాలను వెలువరించింది. అయితే ప్రపంచంలో ఇతర దేశాలతో పోల్చితే భారత్ ఎకానమీ రికవరీ పటిష్టంగా ఉందని ప్రపంచ బ్యాంక్ అభిప్రాయపడింది. మహమ్మారి సవాళ్ల నుంచి, తీవ్ర క్షీణత నుంచి ఎకానమీ బయటపడిందని ప్రశంసించారు. దక్షిణాసియాకు సంబంధించి ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ హన్స్ టిమ్మర్ నివేదికలోని ముఖ్యాంశాలను వెల్లడించారు. వాటిలో కొన్ని... ►భారీ అంతర్జాతీయ రుణ భారాలు లేవు. అటువైపు నుంచి సవాళ్లు ఏమీ లేవు. పటిష్ట ద్రవ్య పరపతి విధానాన్ని అవలంభిస్తోంది. ►సేవలు, సేవలు రంగాల ఎగుమతులు ఆర్థిక వ్యవస్థకు మంచి మద్దతును ఇస్తున్నాయి. ►అంతర్జాతీయ ప్రతికూల అంశాలే వృద్ధి రేటు తాజా తగ్గింపునకు కారణం. ►ద్రవ్యోల్బణం తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ►డిజిటల్ ఆలోచనలన ఉపయోగించుకుని సామాజిక భద్రతా వ్యవస్థను విస్తరించడంలో మిగిలిన ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శంగా నిలుస్తోంది. ►గోధుమల ఎగుమతిపై నిషేధం, బియ్యం ఎగుమతులపై అధిక టారిఫ్‌ల విధింపు వంటి ప్రభుత్వ చర్యలను సమర్థింలేం. స్వల్పకాలంలో అవి దేశీయంగా ఆహార భద్రతకు దారితీసినా, దీర్ఘకాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి విధానాలు ప్రతికూలతకు దారితీయవచ్చు. ►కార్మిక మార్కెట్, ఎకానమీలో మరింతమంది ప్రజలను భాగస్వాములుగా చేయడం భారత్ తక్షణ అవసరం. -
రెసిషన్ భయాలు: రుపీ మరోసారి క్రాష్
సాక్షి, ముంబై: గ్లోబల్ మాంద్యం భయాలతో డాలర్‌తో పోలిస్తే దేశీయ కరెన్సీ రూపాయి మరోసారి బలహీనపడింది ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ దేశాలకు కూడా ఆర్థిక కష్టాలు తప్పవనే ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ వ్యాఖ్యల నేపథ్యంలో శుక్రవారం ఆరంభంలోనే రూపాయి పతనమైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 11 పైసలు పడిపోయి 79.82 వద్దకు చేరింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచబ్యాంకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన కేంద్ర బ్యాంకులు మాంద్యంలోకి వెళ్లవచ్చని తాజాగా హెచ్చరించాయి. దీనికి తోడు అమెరికాలోద్రవ్యోల్బణం స్థాయి కూడా ఊహించని రీతిలో ఉండటతో వచ్చేవారం ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేటువడ్డన భారీగా ఉంటుందనే అంచనాలు ఇన్వెస్టర్లను సెంటిమెంట్‌ను దెబ్బ తీసాయి. గురువారం ముగింపు 79.7012తో పోలిస్తే, కీలకమైన 80 స్థాయికి అతి వేగంగా జారిపోతోంది. దీనికి తోడు ఈక్విటీ మార్కెట్ల భారీ నష్టాలు కూడా రూపాయి క్షీణతకు దారి తీసింది.సె న్సెక్స్ ఒక దశలో ఏకంగా 750 పాయింట్లు కుప్పకూలి 60వేల దిగువకు, అనంతరం 59500 దిగువకు పడిపోయింది. అటు నిఫ్టీ కూడా కీలకమైన మద్దతుస్థాయిని 18వేలను, ఆ తరువాత 17750 స్థాయిని కూడా కోల్పోయింది. -
ఆర్బీకేలు అద్భుత ఆవిష్కరణలే
సాక్షి, అమరావతి/అవనిగడ్డ: ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు అంతర్జాతీయ ఆవిష్కరణలు అనడంలో ఎలాంటి సందేహం లేదని ప్రపంచ బ్యాంకు సీనియర్ కన్సల్టెంట్ (అగ్రికల్చర్, ఫుడ్ గ్లోబల్ ప్రాక్టీస్) హిమ్మత్ పటేల్ పేర్కొన్నారు. గ్రామస్థాయిలో రైతులకు సేవలందించే ఆర్బీకేలు ఎంతో వినూత్నంగా ఉన్నాయని ప్రశంసించారు. వ్యవసాయంపై ఆధారపడ్డ దేశాలన్నీ వీటిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రప్రభుత్వ సిఫార్సు మేరకు ఆర్బీకే తరహా వ్యవస్థ ఏర్పాటుకు ఆఫ్రికాలోని ఇథియోపియా సన్నద్ధమవుతున్న నేపథ్యంలో హిమ్మత్ పటేల్ రాష్ట్రంలో పర్యటించి వీటి పనితీరును స్వయంగా పరిశీలించారు. మంగళవారం గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్ కిసాన్ కాల్ సెంటర్, ఆర్బీకే ఛానల్‌ను సందర్శించారు. పెనమలూరు మండలం వణుకూరు ఆర్బీకే వద్ద రైతులు వినియోగించుకుంటున్న సేవలను పరిశీలించారు. వ్యవసాయ ఉత్పాదకత పెంచుకునేం దుకు ఇథియోపియా సహకారం కోరిన సమ యంలో ఏపీలో ఆర్బీకేలు సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో రైతులకు అందిస్తున్న సేవల గురించి తెలుసుకుని ఆశ్చర్యానికి గురైనట్లు చెప్పారు. ఇంత టెక్నాలజీ ఎక్కడా లేదు.. ‘ఆర్బీకేలు వన్‌స్టాప్ సెంటర్‌గా విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అన్ని రకాల సేవలు గ్రామ స్థాయిలో అందించడంపై మాకున్న సందేహాలు ఇక్కడకు వచ్చాక పటాపంచలయ్యాయి. ఆర్బీకేల ద్వారా నిజంగా అద్భుతమైన సేవలందిస్తు న్నారు. వ్యవసాయ రంగంలో టెక్నాలజీ ని ఇంత బాగా వినియోగిస్తున్న ప్రభుత్వం బహుశా మరెక్కడా లేదు. ఈ తరహా సేవలను వ్యవసాయ ఆధారిత దేశాలన్నీ అందిపుచ్చుకోవాలి’ అని సూచించారు. ఇథియోపియా వ్యవసాయశాఖ మంత్రి నేతృత్వంలో ప్రతినిధి బృందం సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ఏపీలో పర్యటించి రాష్ట్ర ప్రభు త్వంతో ఎంవోయూ కుదుర్చుకోనుందని వెల్లడించారు. గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్ కిసాన్ కాల్ సెంటర్‌కు ఫోన్‌చేసే రైతుల సందేహాలను శాస్త్రవేత్తలు, అధికారులు నివృత్తి చేస్తున్న తీరును హిమ్మత్ పటేల్ పరిశీలించారు. వణుకూరు ఆర్బీకేలో కియోస్క్ ద్వారా రైతులు ఇన్పుట్స్ బుకింగ్ చేస్తున్న తీరును పరిశీలించారు. వైఎస్సార్ సంచార వెటర్నరీ అంబులెన్స్ పనితీరును గమనించారు. ఘంట సాలలోని కృషివిజ్ఞాన కేంద్రాన్ని (కేవీకే) సందర్శించారు. సీఎం జగన్ కృషి అభినందనీయం సీఎం వైఎస్ జగన్ క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల ఇబ్బందులను తెలుసుకుని దూరదృష్టితో ఆర్బీకేలను ఏర్పాటు చేశారని, ఆయన కృషి అభినందనీయమని హిమ్మత్ పటేల్ ప్రశంసించారు. సీఎం జగన్ ఆలోచనలకు అనుగుణంగా ఏర్పాటైన ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలో రైతులకందిస్తున్న సేవలను వ్యవసా యశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వివరిం చారు. శాఖల వారీగా అందిస్తున్న సేవలను వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాల కొండయ్య, స్పెషల్ కమిషనర్ హరికిరణ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తెలియచేశారు. కార్యక్రమంలో మార్కెటింగ్‌శాఖ ప్రిన్సిపల్ సెక్ర టరీ చిరంజీవి చౌదరి, ఉద్యాన, మత్స్యశాఖల కమిషనర్లు శ్రీధర్, కె.కన్నబాబు, విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ Ôశేఖర్‌బాబు, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ అమరేంద్రకుమార్, ఉద్యాన శాఖ అదనపు డైరెక్టర్లు ఎం.వెంకటేశ్వర్లు, బాలాజీ నాయక్, స్టేట్ ఆర్బీకేల ఇన్చార్జి శ్రీధర్, ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ పి రాంబాబు, ప్రిన్సిపాల్ డాక్టర్ ముకుందరావు తదితరులు పాల్గొన్నారు. -
దుష్టచతుష్టయానికి షాక్ తగిలేలా వరల్ట్ బ్యాంక్ రిపోర్ట్
-
ఇండియన్ రైల్వేకు వరల్డ్ బ్యాంక్ రుణం!
న్యూఢిల్లీ: రైలు సరుకు రవాణా, లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలకు ప్రపంచ బ్యాంకు మద్దతు తెలిపింది. ఇందుకుగాను 245 మిలియన్ డాలర్ల (డాలర్‌కు రూ.78 చొప్పున రూ.1,911 కోట్లు రుణాన్ని ఆమోదించినట్లు బహుళజాతి ఆర్థిక సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ (ఐబీఆర్డీ) విభాగం నుంచి ఈ రుణ మంజూరీలకు ప్రపంచ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల అమోదం లభించింది. ఏడు సంవత్సరాల గ్రేస్ పీరియడ్సహా 22 సంవత్సరాల్లో రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది.ప్రపంచ బ్యాంక్ ప్రకటన ప్రకారం, భారత్ చేపట్టిన రైల్ లాజిస్టిక్స్ ప్రాజెక్ట్ అభివృద్ధి దేశంలో మరింత ట్రాఫిక్‌ను రోడ్డు నుండి రైలుకు మార్చడానికి సహాయపడుతుంది. అలాగే సరుకు రవాణా, ప్రయాణీకులను సురక్షితంగా, వేగంగా గమ్య స్థానాలకు చేర్చడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది. ప్రతి సంవత్సరం మిలియన్ల టన్నుల గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను (జీహెచ్‌సీ) తగ్గిస్తుంది. ఈ ప్రాజెక్ట్ రైల్వే రంగంలో మరిన్ని ప్రైవేట్ రంగ పెట్టుబడులను కూడా ప్రోత్సహిస్తుందని వరల్డ్ బ్యాంక్ (ఇండియా) ఆపరేషన్స్ మేనేజర్, యాక్టింగ్ కంట్రీ డైరెక్టర్ హిడేకి మోరీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రకటనకు సంబంధించి మరిన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ♦ ఇండియన్ రైల్వే మార్చి 2020తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో 1.2 బిలియన్ టన్నుల సరుకు రవాణా చేసి, ప్రపంచంలో నాల్గవ–అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌గా రికార్డులకు ఎక్కింది. అయినప్పటికీ, ఇప్పటికీ భారతదేశంలోని సరుకు రవాణాలో 71 శాతం రోడ్డు మార్గం ద్వారా, 17 శాతం మాత్రమే రైలు ద్వారా జరుగుతుండడం గమనార్హం. ♦ భారతీయ రైల్వేల సామర్థ్య పరిమితులు ఈ విభాగం పురోగతికి అడ్డంకిగా మారుతున్నాయి. సరకు రవాణా వేగం, విశ్వసనీయతలకు కూడా ప్రతికూల పరిస్థితి ఏర్పడుతోంది. ఫలితంగా, సంవత్సరాలుగా రోడ్డు రవాణా ట్రక్కులకు రైల్వే తన మార్కెట్ వాటాను కోల్పోతోంది. రవాణాలో రైల్వే మార్కెట్ షేర్ దశాబ్దం కిత్రం 52 శాతం అయితే, 2017–18లో 32 శాతానికి తగ్గింది. ♦రోడ్డు రవాణా కాలుష్య ఉద్గారాలకు ప్రధాన కారణంగా ఉంది. సరుకు రవాణా రంగం దాదాపు గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను కలిగి ఉంది. 2018లో జరిగిన రోడ్డు ప్రమాదాలలో 12.3 శాతం ట్రక్కులకు సంబంధించినవే. రోడ్డు రవాణా సంబంధిత మరణాలలో 15.8 శాతం వాటా కూడా ట్రక్కులదే. ట్రక్కుల గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలలో కేవలం ఐదవ వంతును మాత్రమే రైల్వే రంగం విడుదల చేస్తుంది, ♦ భారతీయ రైల్వేలు 2030 నాటికి పూర్తి కాలుష్య రహిత వాతావరణంలో పనిచేయాలని యోచించడం హర్షణీయం. ప్రతి సంవత్సరం 7.5 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్, ఇతర గ్రీన్హౌస్ వాయువులను తొలగించగల సామర్థ్యాన్ని రైల్వే రంగం కలిగి ఉంది. ♦ భారత్ చేపట్టిన రైల్ లాజిస్టిక్స్ ప్రాజెక్ట్ కాలుష్యాన్ని తగ్గించడానికే కాకుండా, కోట్లాది మంది రైలు ప్రయాణీకులకు ఊరట కలిగించే అంశం. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే అధికంగా ఉన్న రవాణా వ్యయాలను గణనీయంగా తగ్గిస్తుంది. ఇక భారత్ సంస్థల పోటీ తత్వాన్ని సైతం పెంచే అంశం ఇది. -
భారత జీడీపీ వృద్ధి: వరల్డ్ బ్యాంకు షాకింగ్ అంచనాలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23లో భారతదేశ జీడీపీ అంచనాలపై ప్రపంచ బ్యాంక్ కీలక అంచనాలను విడుదల చేసింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఊహించిన దానికంటేఎక్కువ కాలం కొనసాగుతున్న ఉక్రెయిన్-రష్యా వార్, సరఫరా గొలుసు అంతరాయాలు, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత రీత్యా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 2022-మార్చి 2023 వరకు) భారత ఆర్థికవృద్ధి అంచనాను 7.5 శాతానికి తగ్గించింది. గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ తాజా సంచికలో ఈ అంచనాలను మంగళవారం వెల్లడించింది. అంతేకాదు 2023-24లో వృద్ధి మరింత మందగించి 7.1 శాతానికి చేరుకుంటుందని కూడా పేర్కొంది. ఇండియా జీడీపీ వృద్ధి అంచనాను సవరించడం ఇది రెండోసారి. ఏప్రిల్‌లో 8.7 శాతం నుండి 8 శాతానికి తగ్గించింది. ఇపుడు 7.5 శాతానికి అంచనా వేసింది. ఇది మునుపటి (2021-22) ఆర్థిక సంవత్సరంలో 8.7 శాతంగా ఉంచింది. అలాగే వ్యాపార వాతావరణాన్ని మెరుగు పర్చేందుకు ప్రోత్సాహకాలు, సంస్కరణలను ప్రవేశపెట్టిన ప్రభుత్వం, ప్రైవేట్ రంగ స్థిర పెట్టుబడుల ద్వారా కూడా వృద్ధికి తోడ్పడాలని పేర్కొంది. కాగా గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీలు కూడా భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాను తగ్గించిన సంగతి తెలిసిందే. గత నెలలో, మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అధిక ద్రవ్యోల్బణాన్ని పేర్కొంటూ 2022 క్యాలెండర్ సంవత్సరానికి జీడీపీ ప్రొజెక్షన్‌ను 9.1 శాతం నుండి 8.8 శాతానికి తగ్గించింది. ఇంధనం మొదలు కూరగాయలు, వంట నూనె తదితర అన్ని వస్తువుల ధరల పెరుగుదల ఏప్రిల్‌లో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం రికార్డు గరిష్ట స్థాయి 15.08 శాతానికి, రిటైల్ ద్రవ్యోల్బణం దాదాపు ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 7.79 శాతానికి చేరుకుంది. మరోవైపు గత నెలలో బెంచ్‌మార్క్ వడ్డీ రేటును 4.40 శాతానికి పెంచిన ఆర్బీఐ రానున్న మానిటరీ పాలసీ రివ్యూలో మరోసారి వడ్డీ రేట్లను పెంచనుందనే అంచనాలు మార్కెట్ వర్గాల్లో నెలకొన్నాయి. -
లెక్కల్లో లేదు వాస్తవంలో ఉంది
భారతదేశంలో సగం జనాభాకు వంట గ్యాస్ అందుబాటులో లేదు. అదే స్థాయిలో పారిశుద్ధ్య సౌకర్యాలు లేవు. పక్కా ఇండ్లు, పౌష్టికాహారం, వైద్యం సరేసరి. ఎంతోమందికి ఇప్పటికీ విద్యుత్ సౌకర్యమే లేని పరిస్థితి. అయినా దేశంలో పేదరికమే లేదని నివేదికలు చెబుతున్నాయి. దీనికి కారణం – పేదరికాన్ని రకరకాల పద్ధతుల్లో నిర్వచించి గందరగోళం సృష్టించడం! గ్రామీణ ప్రాంతాల్లో నలుగురు సభ్యులున్న కుటుంబానికి నెలకు 4,200 రూపాయలు లభిస్తే ఆ కుటుంబం పేదరికంలో లేనట్టు లెక్క! అదే పట్టణ ప్రాంతాల్లో అయితే 5,140 వస్తే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడినట్టు! ఇలా పేదరికాన్ని మరుగుపరచడానికి చేస్తున్న ప్రయత్నాలు అత్యంత ఆందోళనకరం. ‘‘పేదరికాన్ని తొలగించడానికి ప్రయత్నించడం దాతృత్వం కాదు. అది అసలైన న్యాయం. ఇది ప్రాథమిక హక్కుల పరిరక్షణలో భాగం. అంత మాత్రమే కాదు. ఇది గౌరవప్రదమైన జీవితాన్ని అనుభవించే హక్కు’’. దక్షిణాఫ్రికా విముక్తి పోరాట నాయకుడు, మానవ హక్కుల ప్రతీక నెల్సన్ మండేలా గుండెల్లో నుంచి వచ్చిన మాటలు ఇవి. భారతదేశంలో పేదరికాన్ని నిజంగా నిర్మూలించకుండా, ఒక రకంగా దానిని మరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజల సామా జిక, ఆర్థిక విషయాల్లో మెరుగుదల ఉన్నట్టు నమ్మించడానికి కొత్త కొత్త ప్రాతిపదికలను రూపొందిస్తున్నారు. పేదరికాన్ని రకరకాల పద్ధతుల్లో నిర్వచించి గందరగోళం సృష్టిస్తున్నారు. కనిపిస్తున్న పేదరికాన్ని మరుగుపరచడానికి తీవ్ర ప్రయత్నాలు సాగిస్తోన్న పరిస్థితి అత్యంత ఆందోళనకరం. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే, ఇటీవల ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నిర్వహించిన సర్వేలో భారతదేశంలో పేదరికం తగ్గినదంటూ తేల్చి చెప్పారు. సుతీర్థరాయ్, రాయ్ వాండర్ వైడ్ అనే ఇద్దరు ఆర్థిక శాస్త్రవేత్తలు ఆ నివేదికను రూపొందించారు. ఈ నెలలోనే ఆ నివేదికను ప్రపంచ బ్యాంకు విడుదల చేసింది. 2011 నుంచి 2015 వరకు 3.4 శాతం పేదరికం తగ్గిందనీ, 2011లో 22.5 శాతం ఉండగా, అది 2015లో 19.1 శాతానికి తగ్గిందనీ ఆ నివేదిక బయటపెట్టింది. అంతే కాకుండా 2015 నుంచి 2019 వరకు ఎన్నడూలేని విధంగా 19.1 శాతం నుంచి పది శాతానికి పడిపోయింది. ఈ నాలుగేళ్ళలో ఏం జరిగిందో అర్థం కాదు. లెక్కల్లో మాత్రం తగ్గుదల నమోదైంది. ఇది గ్రామీణ పేదరికం సంగతి. పట్టణ పేదరికం కూడా 2011లో 14.2 శాతం ఉండగా, 2015 వరకు అది 12.9 శాతానికి తగ్గింది. అదే విధంగా 2015 నుంచి 2019 వరకు 12.9 శాతం నుంచి 6.3 శాతానికి తగ్గింది. పేదరికాన్ని వారి రోజువారీ వినిమయ ఖర్చును లెక్కపెట్టడం ద్వారా అంచనా వేయడం ఒక పద్ధతి. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని నిర్ధారించడానికి రోజూ ఒక మనిషి 35 రూపాయల ఖర్చుకన్నా తక్కువ వినియోగం చేస్తే, అతడు పేదవాడిగా నిర్ధారించబడతాడని నిపుణులు, ప్రభుత్వాలు నిర్ణయించాయి. పట్టణ ప్రాంతాల్లో దానిని 42 రూపాయలుగా నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో నలుగురు ఉన్న కుటుంబానికి రోజుకు 140 రూపాయల ఆదాయం ఉంటే చాలు, పట్టణాల్లో నలుగురికి కలిపి 168 రూపాయలుంటే చాలు. దీన్ని వినిమయ ఖర్చు సూచిక అంటారు. 2015 నుంచి 2019 వరకు పేదరికం తగ్గిందని చెప్పడానికి కొన్ని కారణాలున్నాయి. మొదటిది: పెన్షన్లు, రైతు బంధుతో పాటు, ఇతర పథకాల పేరున డబ్బును నేరుగా ప్రజలకు అందించడం వలన, ప్రతి పేద కుటుంబానికి కనీసం 2,500 నుంచి 3,500 రూపాయల వరకు నగదు అందుతున్నది. గ్రామీణ ప్రాంతాల్లో నలుగురు సభ్యులున్న కుటుంబానికి నెలకు 4,200 రూపాయలు లభిస్తే ఆ కుటుంబం పేదరి కంలో లేనట్టు లెక్క. పట్టణ ప్రాంతంలో నెలకు 5,140 రూపాయలు ఆదాయం ఉంటే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడినట్టు ప్రభుత్వం నిర్ధారిస్తుంది. రెండో విషయం: ప్రభుత్వాలు 2011లో సామాజిక ఆర్థిక కులగణన(ఎస్ఈసీసీ) నిర్వహించి అందులో పేదరికాన్ని గుర్తించడా నికి ఏడు అంశాలను పరిశీలించారు. ఆ ఏడింటిలో మట్టిగోడల ఇల్లు మాత్రమే ఉండాలి. ఆ ఇంటిలో 15 సంవత్సరాల నుంచి 59 వయస్సు ఉన్న మగవాళ్ళు ఉండకూడదు. ఆ ఇంటి యజమాని మహిళ అయి వుండాలి. ఆ ఇంటిలో దివ్యాంగులే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ ఇళ్ళల్లో ఇరవై ఐదేళ్లు పైబడిన వారెవరూ కూడా అక్షరాస్యులై ఉండకూడదు. భూమి లేని వారై ఉండాలి. అయితే ప్రధానంగా కూలీ మీద ఆధారపడి ఉండాలి. ఇవి సూచికలు. ఇటువంటి వాళ్ళనే పేదరికంలో ఉన్నట్టు గుర్తిస్తారు. ఇవి చదివిన వారెవరికైనా ఒకటి అర్థం అవుతుంది. ఈ దేశంలో పేదరికం లేదని! అందుకే ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలు ఇటువంటి నిర్ధారణకు రాగలిగాయి. ఈ విధంగా ప్రభుత్వాలు అంతర్జాతీయ స్థాయిలో తలెత్తుకుని తిరుగుతున్నాయి. అయితే మరొక అంశం ఉన్నది. అది కూడా ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ చేసిన సర్వే. ఆ సర్వే ప్రకారం భారత దేశంలో 25 శాతం మంది పేదరికంలో ఉన్నట్టు తేలింది. ఆ సంస్థ కేవలం అన్నం, కారం, నీళ్ళపప్పుతో తింటూ ఉంటే సరిపోదనీ, పేదరికం కేవలం తిండికి మాత్రమే పరిమితమై లేదనీ, పేదరికం బహుముఖీనమైనదనీ ప్రక టించి, 2021లో ఒక రిపోర్టును విడుదల చేసింది. అయితే ఈ నివేదిక గురించి అధికార పక్షం ఇప్పటి వరకు నోరెత్తలేదు. కానీ పాక్షికమైన విషయాన్ని అది కూడా కృత్రిమమైన ఆసరా, భరోసాలను లెక్కవేసి, ఇది గొప్పతనంగా చెప్పుకుంటున్నారు. ప్రపంచబ్యాంకు నివేదిక వచ్చి, రెండు రోజులే అయ్యింది. ఇప్పటికే ఇది తమ ప్రభుత్వ గొప్పత నమని చాటింపు మొదలుపెట్టారు. కానీ తమ ప్రభుత్వమే స్థాపించిన నీతి ఆయోగ్ వెలువరించిన పేదరికం నిజాలను కూడా ఒకసారి పరిశీలిస్తే విజ్ఞతగా ఉంటుంది. దీనిని మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్(ఎంపీఐ) అంటారు. ఈ సర్వేలో పన్నెండు అంశాలను పరిగణనలోనికి తీసుకున్నారు. అందులో పౌష్టికాహారం, శిశు, బాలల మరణాలు, శిశు సంరక్షణ, పాఠశాలలకు వెళ్ళే వయస్సు, స్కూల్‌కు హాజరయ్యే రోజుల వివ రాలు, వంట గ్యాస్, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, గృహ వసతి, ఆస్తులు, ఇంట్లో వస్తువులు, బ్యాంక్ ఎకౌంట్ వివరాలు, వీటన్నింటినీ పరిశీలించి పేదరికాన్ని నిర్ణయించారు. వీటి ఆధారంగానే నీతి ఆయోగ్ భారతదేశంలో నూటికి 25 శాతం మంది పేదరికంలో మగ్గుతున్నారని తన ప్రాథమిక సర్వేలో తేల్చింది. దేశం మొత్తం మీద 25 శాతమైతే, అది గ్రామీణ ప్రాంతంలో 32.75 శాతంగా, పట్టణ ప్రాంతాల్లో 8.81 శాతంగా తేల్చారు. బహుముఖ పేదరికంలో బిహార్ 51.91 శాతంతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు: జార్ఖండ్ 42.16 శాతం, ఉత్తరప్రదేశ్ 37.79 శాతం, మధ్యప్రదేశ్ 30.65 శాతం, మేఘాలయ 32.67 శాతం. తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రాలు: గోవా 3.76 శాతం, సిక్కిం 3.82 శాతం, తమిళనాడు 4.89 శాతం, పంజాబ్ 5.59 శాతం, హిమాచల్ ప్రదేశ్ 7.62 శాతం. దేశంలో సగానికి పైగా జనాభాకు వంట గ్యాస్ అందుబాటులో లేదు. అదే స్థాయిలో పారిశుద్ధ్య సౌకర్యాలు లేవు. 45.6 శాతం మందికి మంచి పక్కా ఇల్లు లేదు. 37.6 శాతం జనాభాకు పౌష్టికాహారం అందడం లేదు. 22.6 శాతం మంది తల్లులకు వైద్యం అందుబాటులో లేదు. 12.2 శాతం జనాభాకు ఇప్పటికీ విద్యుత్ సౌకర్యమే లేని పరిస్థితి ఉంది. ఇట్లా ప్రతి నలుగురిలో ఒకరు జీవితంలోని ప్రధాన మైన రంగాల్లో లోటును ఎదుర్కొంటున్నారు. తమ జీవనోపాధి ద్వారా వచ్చే ఆదాయాలతో కాకుండా, ప్రభుత్వాలు తాత్కాలికంగా ఇచ్చే పెన్షన్ల ఆధారంగా ప్రజలను పేదరికం లిస్టులో నుంచి తీసి వేయడంలో కుట్ర దాగుంది. పేదరికం నుంచి బయటపడాలంటే జీవనోపాధుల ద్వారా లభించే ఆదాయం, దానితో వివిధ అంశాల్లో కనీస వసతులను, సౌకర్యాలను లెక్కవేయాలి. అంతేకానీ, అర్థసత్యాలను సత్యాలుగా ప్రచారం చేయడం విజ్ఞత అనిపించుకోదు. నెల్సన్ మండేలా చెప్పినట్టు, పేదరికం నుంచి బయటపడడానికి ప్రభుత్వాలు చేస్తున్న మాయాతెరలను తొలగించు కొని, జీవించే హక్కు కోసం, అది కూడా గౌరవప్రదమైన జీవితం కోసం పేదలే చైతన్య వంతమైన కార్యాచరణను రూపొందించు కోవాలి. మహాకవి శ్రీశ్రీ అన్నట్టు, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరిచి నిదురపోకుమా! ఇదే ఇప్పుడు మనందరికీ మేల్కొల్పు కావాలి. మల్లెపల్లి లక్ష్మయ్య, వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
నోట్ల రద్దుతో అలా..భారత్‌పై ప్రపంచబ్యాంకు కీలక వ్యాఖ్యలు..!
న్యూఢిల్లీ: భారత్‌లో తీవ్ర పేదరికం 2011–2019 మధ్య 12.3 శాతం మేర తగ్గినట్టు ప్రపంచబ్యాంకు తన చర్చా పత్రంలో తెలిపింది. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాలు ఈ విషయంలో మెరుగ్గా ఉన్నట్టు పేర్కొంది. ‘‘2011 నేషనల్ శాంపిల్‌సర్వే (ఎన్ఎస్ఎస్) తర్వాత భారత్ గృహ వినియోగానికి సంబంధించిన సర్వే వివరాలను ఇంత వరకు వెల్లంచలేదు. దీనికితోడు పేదరికం, అసమానతలకు సంబంధించి గత పదేళ్లలో అధికారికంగా ఎటువంటి గణాంకాలను ప్రకటించలేదు’’అని ఈ చర్చా పత్రం రూపొందించడంలో భాగమైన ఆర్థికవేత్త సుతీర్థ సిన్హా రాయ్, రాయ్ వాన్‌డెర్ వీడ్ తెలిపారు. కరోనా సంక్షోభం తలెత్తిన 2020లో భారత్‌లో తీవ్ర పేదరికం రేటు 0.8 శాతానికి పరిమితం అయిందని.. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద పేదలకు ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ ఇందుకు సాయపడినట్టు లోగడ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) రూపొందించిన చర్చా పత్రం కూడా ప్రకటించడం గమనార్హం. ‘‘భారత్‌లో 2011–2019 మధ్య తీవ్ర పేదరికం 12.3 శాతం తగ్గింది. 2004–2011 మధ్య కాలంలో ఉన్న రేటుతో పోలిస్తే ఎంతో మెరుగుపడింది’’ అని ప్రపంచబ్యాంకు చర్చా పత్రం వివరించింది. 2016లో డీమోనిటైజేషన్ సమయంలో పట్టణాల్లో పేదరికం 2 శాతం పెరిగిందని.. ఆ తర్వాత గణనీయంగా క్షీణించినట్టు తెలిపింది. 2019లో వృద్ధి కుంటు పడడంతో గ్రామీణ పేదరికం 0.10 శాతం మేర పెరిగినట్టు పేర్కొంది. వినియోగంలో అసమానతలు పెరిగాయనడానికి ఎటువంటి ఆధారాల్లేవని ఆర్థికవేత్తలు ఈ చర్చా పత్రంలో స్పష్టం చేశారు. చిన్న రైతులకు ఆదాయం 10 శాతం మేర పెరిగినట్టు తెలిపారు. చదవండి: చరిత్ర తెలియదు.. సంస్కృతీ తెలియదు..ఇది మన పరిస్థితి..! -
Sakshi Cartoon: భారత్‌లో పేదరికం తగ్గింది
భారత్‌లో పేదరికం తగ్గింది: ప్రపంచ బ్యాంకు -
ఎంఎస్ఎంఈలకు రూ.6,062 కోట్లు
న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈలు) ప్రపంచబ్యాంకు సహకారంతో కూడిన 6,062 కోట్ల పథకానికి (ర్యాంప్) ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా మార్కెట్ అనుసంధానత, రుణ సాయం మెరుగుపడనుంది. 2022–23 ఆర్థిక సంవత్సరం నుంచి ర్యాంప్ అమల్లోకి వస్తుందని ప్రభు త్వం తెలిపింది. రూ.6,062 కోట్లలో రూ.3,750 కోట్లు ప్రపంచ బ్యాంకు రుణంగా అందించనుంది. మిగిలిన రూ.2,312 కోట్లను కేంద్రం సమ కూరుస్తుంది. కరోనా తర్వాత ఎంఎస్ఎంఈ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటుండడం తెలిసిందే. -
ఉక్రెయిన్‌కు ప్రపంచ బ్యాంక్ భారీ ఆర్ధిక సహాయం
వాషింగ్టన్: గత కొద్ది రోజులుగా రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోయింది. ఇప్పటికే యూకే పీఎం బోరిస్ జాన్సన్ 100 బిలియన్ డాలర్ల సాయం ప్రకటిస్తున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రపంచ బ్యాంక్ కూడా ఉక్రెయిన్‌కు అండగా నిలబడేందుకు ముందుకొచ్చింది. అందులో భాగంగా ఆర్థిక సహాయం చేస్తున్నట్లు ప్రపంచ బ్యాంక్ తెలిపింది. ఉక్రెయిన్ కోసం 723 మిలియన్ డాలర్ల సహాయ ప్యాకేజీని అందించనున్నట్లు ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. ఆర్థిక అత్యవసర పరిస్థితి నుంచి బయటపడేందుకు సప్లిమెంటరీ బడ్జెట్ సపోర్ట్ ప్యాకేజీకి ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. ప్యాకేజీలో 350 మిలియన్ డాలర్లు అనుబంధ రుణం, 139 మిలియన్ డాలర్లు గ్యారెంటీ, 134 మిలియన్ డాలర్లు గ్యాంట్ ఫైనాన్సింగ్, 100 మిలియన్ డాలర్లు ఫైనాన్సింగ్ కోసం నిధులుగా కేటాయించారు.ఈ ప్యాకేజీ ఉక్రేనియన్ ప్రజలకు కీలకమైన సేవలను అందించడానికి ప్రభుత్వానికి సహాయపడుతుంది. ఈ నగదును ఆసుపత్రి కార్మికులకు వేతనాలు, వృద్ధులకు పెన్షన్లు, నిస్సహాయులకు సామాజిక కార్యక్రమాలు కోసం వినియోగించనున్నారు. (చదవండి: కొత్త ఇల్లు కొనేవారికి షాక్.. ఏప్రిల్ 1 తర్వాత రూ.1.5 లక్షల రాయితీ రానట్లే!) -
యుద్ధం ఎఫెక్ట్.. రష్యా, బెలారస్‌కు ఊహించని షాక్
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడులను కొనసాగిస్తోంది. రష్యా దళాలు ఉక్రెయిన్‌పై బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితులు భయానకంగా మారాయి. దీంతో రష్యా చర్యలపై ప్రపంచ దేశాలు పుతిన్‌పై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే రష్యాపై యూరోపియన్ యూనియన్ సహా పలు దేశాలు ఆర్థిక ఆంక్షలను విధించాయి. యుద్ధంలో రష్యాకు బెలారస్ సాయం అందిస్తున్న కారణంగా ఆ దేశంపై కూడా ఆంక్షలు కొనసాగుతున్నాయి. తాజాగా రష్యా, బెలారస్ దేశాల్లో తాము అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రపంచబ్యాంక్ తెలిపింది. 2014 నుంచి రష్యాకు ప్రపంచబ్యాంకు ఎలాంటి కొత్త లోన్లు ఇవ్వలేదు. పెట్టుబడులు పెట్టలేదు. అలాగే, బెలారస్‌కు 2020 నుంచి కొత్తగా రుణాలివ్వలేదు’ అని ఒక ప్రకటనలో పేర్కొంది. రష్యా ఉక్రెయిన్‌లోని క్రిమియాను 2014లో ఆక్రమించుకోగా, 2020లో జరిగిన బెలారస్ అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి. అమెరికా సైతం రష్యాపై భారీ ఆంక్షలను విధించింది. ఉక్రెయిన్‌పై సైనిక దాడులకు దిగిన రష్యా భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని జో బైడెన్ వార్నింగ్ ఇచ్చారు. రష్యా, పుతిన్‌పై రానున్న కాలంలో యుద్ద ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలిపారు. ఉక్రెయిన్‌పై జరుగుతున్న యుద్ధంలో పుతిన్ గెలిచినా, ఓడినా.. ఆర్థిక పరంగా, ఇతర అంశాల విషయంలో రష్యా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పుతిన్ ఓ నియంత.. అతడి అంతు చూస్తామంటూ బెడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు చెందిన విలాసవంతమైన అపార్ట్మెంట్లు, ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్‌లను సీజ్ చేస్తున్నామని వెల్లడించారు. -
భారత్ ఆర్థిక వృద్ధి రేటులో ఎలాంటి మార్పు లేదు: ప్రపంచ బ్యాంక్
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక రికవరీ ఇంకా విస్తృత స్థాయిలో లేదని ప్రపంచ బ్యాంక్ తన తాజా నివేదికలో పేర్కొంది. ఈ పరిస్థితుల్లో మార్చితో ముగిసే 2021-22 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 8.3 శాతంగా ఉంటుందన్న తమ గత ఏడాది జూన్ అంచనాల్లో ఎటువంటి మార్పూ లేదని స్పష్టం చేసింది. గ్లోబల్ ఎకనమిక్ ప్రాస్పెక్ట్పై బ్యాంక్ తాజా నివేదికలో ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. కాంటాక్ట్ ఇంటెన్సెవ్ సేవల పునరుద్ధరణ నుంచి ఎకానమీ ప్రయోజనం పొందాలి. ఎకానమీకి ద్రవ్య, విధానపరమైన మద్దతు పూర్తిస్థాయిలో లభించడం కొంత కష్టం. 2022-23లో వృద్ధి 8.7 శాతం, 2023-24లో 6.8 శాతం వృద్ధి నమోదుకావచ్చు. కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, ప్రత్యేకించి తయారీ, మౌలిక రంగంలో ప్రైవేటు పెట్టుబడులు పెరగడం, ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహకం (పీఎల్ఐ) పథకం ప్రయోజనాలు, సంస్థాగత సంస్కరణలు వంటి అంశాలు తాజా అంచనాలకు కారణం. దక్షిణాసియాలో కరోనా సవాళ్లకు తోడు వినియోగ ద్రవ్యోల్బణం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సెంట్రల్ బ్యాంకుల లక్ష్యాలకన్నా ఇది తీవ్రంగా పెరుగుతోంది. ప్రపంచ ఆర్థిక వృద్ధి 2021లో 5.5 శాతంగా ఉంటే, 2022లో 4.1 శాతానికి పెరిగే వీలుంది. అయితే 2023లో వృద్ధి 3.2 శాతంగా ఉండవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా సరళతర ఆర్థిక విధానాలు వెనక్కు తీసుకోవడం, డిమాండ్ వ్యత్యాసాలు దీనికి ప్రధాన కారణం. యూబీఎస్ అంచనాలు 9.1 శాతానికి కోత మరోవైపు భారత్ 2021-22 ఆర్థిక సంవత్సరం అంచనాలను స్విస్ బ్రోకరేజ్ దిగ్గజం-యూబీఎస్ సెక్యూరిటీస్ 40 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది. దీనితో అంచనాలు 9.5 శాతం నుంచి 9.1 శాతానికి తగ్గాయి. మార్చి త్రైమాసికంలో ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం దీనికి ప్రధాన కారణమని తెలిపింది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం ఒమిక్రాన్ ప్రభావం ఉండకపోవచ్చని అభిప్రాయపడింది. దీనితో 2022-23 వృద్ధి అంచనాలను 7.7 శాతం నుంచి 8.2 శాతానికి పెంచింది. 2022-23లో భారత్ ఎకానమీ వృద్ధి రేటు ప్రపంచ దేశాల్లోనే వేగంగా ఉంటుందని పేర్కొంది. ప్రస్తుత రుణ వృద్ధి రేటు తీరు (దాదాపు 7 శాతం) పట్ల ఆందోళన వ్యక్తం చేసిన యూబీఎస్, ఈ రేటు 2022-23లో 10 శాతానికి పెరుగుతుందని అంచనావేసింది. ఇక ద్రవ్యోల్బణం 2022-23లో 5 శాతంగా ఉంటుందని విశ్లేషించింది. 2022–23 ఏప్రిల్ తర్వాత ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను 50 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉందని అంచనావేసింది. అమెరికా ఫెడ్ ఫండ్‌రేటు పెంపు, ఫారిన్ నిధులు వెనక్కు వెళ్లడం, కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ తప్పడం, చమురు ధర 100 డాలర్లకు పెరిగే అవకాశం వంటి అంశాల నేపథ్యంలో 2022లో రూపాయి మారకపు విలువ 78కి పడిపోయే వీలుందని అభిప్రాయడింది. మరికొన్ని అంచనాలు ఇలా.. ఎకానమీపై కోవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తీవ్ర ప్రభావం తప్పదని ఇక్రా రేటింగ్స్ హెచ్చరించింది. నాల్గవ త్రైమాసికంలో (జనవరి-మార్చి) దీని ప్రభావం వల్ల 40 బేసిస్ పాయింట్లు మేర (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) కోత తప్పదని విశ్లేషించింది. ఆయా అంశాల నేపథ్యంలో వృద్ధి రేటు 4.5 శాతం నుంచి 5 శాతం శ్రేణిలోనే ఉంటుందని ఆభిప్రాయపడింది. ఒమిక్రాన్ వల్ల నాల్గవ త్రైమాసికంలో వృద్ధి రేటు 0.3 శాతం మేర హరించుకుపోతుందని, ఈ నేపథ్యంలో వృద్ధి రేటు 5.8-5.9 శాతం శ్రేణికి పరిమితమవుతుందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అంచనా వేసిన మరుసటి రోజే అంతకంటే తక్కువగా వృద్ధి శాతాన్ని చూపుతూ ఇక్రా విశ్లేషణ వెలువడిన విషయం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం (2020-21) 7.4 శాతం క్షీణ ఎకానమీ గణాంకాల నేపథ్యంలో 2021-22లో మొదటి రెండు త్రైమాసికాల్లో (ఏప్రిల్-జూన్, జూలై-సెప్టెంబర్) భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేట్లు వరుసగా 20.1 శాతం, 8.4 శాతాలుగా నమోదయిన సంగతి తెలిసిందే. ఆర్థిక సంవత్సరం మొత్తంలో వృద్ధి రేటు 9 శాతంగా ఉంటుందని భావిస్తున్నట్లు ఇక్రా తెలిపింది. ఆర్బీఐ ఈ అంచనాలను 9.5 శాతంగా పేర్కొనగా, వివిధ సంస్థలు 8.3 నుంచి 9.5 శ్రేణిలో అంచనాలను వెలువరిస్తున్నాయి. (చదవండి: కేసులు పెరిగితే ఆంక్షలు విధించకండి.. కేంద్రానికి ఫిక్కీ విజ్ఞప్తి!) -
‘ది హెల్తీ స్టేట్స్, ప్రోగ్రెసివ్ ఇండియా’ ర్యాంకింగ్స్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆరోగ్య రంగంలో మెరుగుదల దిశగా ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ర్యాంకింగ్స్‌ను నీతి ఆయోగ్ ఈనెల 27న విడుదల చేయనుంది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ‘ది హెల్తీ స్టేట్స్, ప్రోగ్రెసివ్ ఇండియా’ పేరుతో రాష్ట్రాల ఆరోగ్యరంగ పనితీరుపై ఈ ర్యాంకింగ్స్‌ను సిద్ధం చేశారు. 2017లో నీతి ఆయోగ్, కేంద్ర ఆరోగ్య శాఖ, ప్రపంచ బ్యాంకు సహకారంతో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆరోగ్యం రంగం పనితీరు, ఆరోగ్య రంగ పురోభివృద్ధిని పెంపొందించేందుకు వార్షిక ఆరోగ్య సూచికను ప్రారంభించింది. దీని ద్వారా రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంచడంతోపాటు, పరస్పరం అనుభవాలను పంచుకునేందుకు ప్రోత్సహిస్తారు. -
పేదరికంలోకి 50 కోట్ల మంది.. ఇక సమయం లేదు: డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
జెనీవా: వైద్య సేవల కోసం తమ సొంతంగా ఖర్చు చేయాల్సి రావడంతో దాదాపు 50 కోట్ల కంటే ఎక్కువ మంది తీవ్ర పేదరికంలోకి నెట్టివేయబడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రజలు వైద్య సేవలు పొందే సామర్ధ్యంపై కోవిడ్ 19 ప్రభావం గురించి ఎత్తి చూపుతూ పై విధంగా డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో రెండు కొత్త నివేదికలను ప్రకటించింది. కోవిడ్ నుంచి కోలుకొని మరింత మెరుగ్గా నిర్మించుకునేందుకు ప్రయత్నించాలని అన్ని దేశాలను డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. అలాగే కొన్ని మార్గదర్శకాలను అందించింది. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ విషయంలో గత రెండు దశాబ్దాలుగా సాధించిన ప్రపంచ పురోగతిని కోవిడ్ మహమ్మారి ఆపే అవకాశం ఉందని పేర్కొంది. మహమ్మారికి ముందే తమ సొంత ఆరోగ్యం ఖర్చుల కారణంగా 50 కోట్ల ప్రజలు తీవ్ర పేదరికంలోకి నెట్టబడ్డారని పేర్కొంది. ఈ సంఖ్య ఇప్పుడు గణనీయంగా పెరిగిందని అంచనా వేస్తున్నాయి. పేదరికం పెరగడం, ఆదాయాలు తగ్గడం ప్రభుత్వాలు కఠినమైన ఆర్థిక పరిమితులను ఎదుర్కొంటున్నందున ఆర్థిక కష్టాలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ బ్యాంక్ అందించిన నివేదికలు హెచ్చరించాయి. చదవండి: ఒక్క రోజులోనే 663 ఒమిక్రాన్ కేసులు.. ‘ఏప్రిల్ నాటికి వేల సంఖ్యలో మరణాలు’! 2020లో కోవిడ్ ఆరోగ్య సేవలకు అంతరాయం కలిగించిందని, అదే విధంగా 1930 తరువాత అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి కూడా కారణమైందని పేర్కొంది. దీని వలన ప్రజలు సంరక్షణ కోసం చెల్లించడం కష్టతరంగా మారిందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. కోవిడ్‌కు ముందు దాదాపు బిలియన్‌మంది ప్రజలు(100కోట్లు) తమ సంపాదనలోని 10శాతం ఆరోగ్యంపై ఖర్చు చేస్తున్నారని ప్రపంచ బ్యాంకుకు చెందిన బువాన్ ఉరిబె వెల్లడించారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, దీని వల్ల పేదలు తీవ్రంగా ప్రభావితమయ్యారని పేర్కొన్నారు. చదవండి: యూకేలో తొలి ఒమిక్రాన్ మరణం ఆర్థిక పరిమితుల మధ్య ప్రభుత్వాలు వైద్య సేవలపై ఖర్చు చేసే వ్యయాన్ని పెంచేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ఉరిబె తెలిపారు. మహమ్మారికి ముందు 68 శాతం మందికి అత్యవసర వైద్య సేవలు అందేవని డబ్ల్యూహెచ్ఓ నివేదిక పేర్కొంది. తమ శక్తికి మించి ఆరోగ్య ఖర్చులు చేస్తున్న కుటుంబాలలో 90 శాతం వరకు ఇప్పటికే దారిద్య్ర రేఖ దిగువన ఉన్నాయని పేర్కొంది. ఇంకా ఏ మాత్రం సమయం లేదని, ప్రపంచ దేశాలన్ని ఆర్థిక పరిణామాలకు భయపకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్య సేవలు పొందగలరని తమ పౌరులకు నమ్మకం కలిగించాలని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తెలిపారు. అలాంటి ప్రయత్నాలను వెంటనే ప్రారంభించి, వేగవంతం చేయాలని పేర్కొన్నారు. దీనర్థం వైద్య సేవలపై ప్రభుత్వ వ్యయాన్ని పెంచాలని, అలాగే ఇంటికి సమీపంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుపై దృష్టి పెంచాలన్నారు. మహమ్మారికి ముందు సాధించిన పురోగతి అంత బలంగా లేదని, ఈసారి భవిష్యత్తులో ఎదురయ్యే మహమ్మారులు ఇచ్చే షాక్‌లను తట్టుకునేలా ఆర్థిక వ్యవస్థలను నిర్మించాలని పేర్కొన్నారు. యూనివర్సల్హెల్త్ కవరేజ్ దిశగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. పేదలు వైద్యం కోసం డబ్బులు వెచ్చించే పరిస్థితి నుంచి వారిని మినహాయించాల్సి ఉందని ఆరోగ్య సంస్ధ వెల్లడించింది. అందుకోసం పేద, బలహీన వర్గాలకు సేవలు అందించేలా పథకాలు రూపొందించాలని కోరింది. WHO/@WorldBank report on progress towards #HealthForAll reveals that more than half a billion people were being pushed into poverty due to health care costs and disruption in health services even before the #COVID19 pandemic https://t.co/yCt340TG2d #UHCDay pic.twitter.com/hPDqBxbLTe — World Health Organization (WHO) (@WHO) December 12, 2021 -
‘ఆధార్ కార్డు’ మోడల్..! ప్రపంచ వ్యాప్తంగా...!
UIDAI To Work With World Bank UN To Globalise Aadhaar Model: యుఐడీఏఐ రూపొందించిన ఆధార్ కార్డు మరో అరుదైన ఘనతను సొంతం చేసుకోనుంది. అంతర్జాతీయ గుర్తింపు ప్రమాణాలను అభివృద్ధి చేసేందుకుగాను ఆధార్ కార్డు లాంటి మోడల్‌ను ప్రపంచ బ్యాంక్, ఐక్యరాజ్యసమితితో కలిసి యూఐడీఏఐ పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే యూఐడీఏఐ యూనివర్సల్ గ్లోబల్ ఐడెంటిటీ సిస్టమ్‌పై చురుగ్గా పనిచేస్తోందని సంస్థ పేర్కొంది. ఆధార్‌పై ఇతర దేశాలు ఆసక్తి..! ఆసియా దేశాలతో పాటుగా, ఇతర దేశాలు కూడా ఆధార్ మోడల్ గురించి తెలుసుకున్నాయని యూఐడీఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సౌరభ్ గార్గ్ అన్నారు.కొన్ని దేశాలు ఇప్పటికే సంస్థ ఉపయోగించిన మోడల్ అనుసరించినట్లు తెలిపారు. ఆధార్‌లాంటి మోడల్‌పై ఆసక్తి కనబరుస్తున్నాయని సౌరభ్ వెల్లడించారు. పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన డిజిటల్ మనీ కాన్ఫరెన్స్‌లో సౌరభ్ గార్గ్ ప్రసంగిస్తూ...ఆధార్ ఆర్కిటెక్చర్‌ను ప్రతిబింబించేలా ప్రపంచ దేశాలు ఆసక్తి చూపుతున్నాయని అన్నారు. దేశ జనాభాలో 99.5 శాతం మందికి ఆధార్ కార్డు ఉందని తెలిపారు. పలు ఆర్థిక సేవలకు ఆధార్ కీలక అంశం పనిచేస్తోందని అభిప్రాయపడ్డారు. దాంతోపాటుగా భద్రతా ముప్పు సమస్యపై కూడా చర్చించారు. ఆధార్ డిజైన్ అనేది అంతర్నిర్మిత గోప్యతతో కూడిన ఆర్కిటెక్చర్. యూఐడీఏఐ సమ్మతి ద్వారా మాత్రమే ఆధార్‌ను ఉపయోగించడానికి అనుమతిస్తామని అన్నారు. అంతేకాకుండా భద్రత విషయంలో ఏలాంటి రాజీ ఉండదని పేర్కొన్నారు. ఆధార్ డేటా సిస్టమ్ భద్రత చాలా ముఖ్యమైనదని గార్గ్ చెప్పారు. ఇట్టే పసిగడతాయి..! ఆధార్ డేటా సెంటర్లు సమాచారాన్ని వేరుగా ఉంచుతాయని, సురక్షితమైన స్నేహపూర్వక యంత్రాంగాల ద్వారా మాత్రమే ఆధార్‌ను యాక్సెస్ అవుతుంది. 24X7 పాటు నడిచే యూఐడీఏఐ సెక్యూరిటీ కేంద్రాల సహాయంతో ఏమి జరుగుతుందనే విషయాన్ని ఇట్టే పసిగడతాయి. చదవండి: ఆండ్రాయిడ్‌లో అదిరిపోయే ఫీచర్స్..! పిల్లలను, కార్లను కంట్రోల్ చేయొచ్చు....! -
ప్రభుత్వ పాఠశాలలపై ఏపీ విజన్‌కు ప్రపంచబ్యాంక్ సహకారం
సాక్షి, ఢిల్లీ: ప్రభుత్వ పాఠశాలలను అత్యుత్తమ విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దాలన్న ఆంధ్రప్రదేశ్ విజన్‌కు సహకారం అందించడానికి ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చింది. విద్యా ప్రమాణాలు మెరుగుపర్చడం కోసం ప్రపంచ బ్యాంకుతో ఏపీ, కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నాయి. (చదవండి: మనోళ్లు పంపింది 83 బిలియన్ డాలర్లు..!) 250 మిలియన్ డాలర్లతో 50 లక్షల మంది విద్యార్థుల ప్రమాణల పెంపుకు ప్రత్యేక ప్రాజెక్టు తీసుకురాన్నున్నారు. దీనివల్ల 45 వేల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, టీచర్లు, అంగన్వాడీ సిబ్బందికి ప్రయోజనం చేకూరనుంది. టీచర్లలో నైపుణ్యం పెంచడంపై దృష్టి పెట్టనున్నారు. (చదవండి: వచ్చే ఏడాది నుంచి పాఠశాలలకు ర్యాంకింగ్ విధానం అమలు) ఈ ప్రాజెక్ట్‌లో పేద, గిరిజన విద్యార్థులు, బాలికలకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. అంగన్వాడి టీచర్లకు, సిబ్బందికి ప్రత్యేక ఫౌండేషన్ కోర్సులు ప్రవేశపెట్టనున్నారు. డిజిటల్ వసతులు లేక విద్యలో నష్టపోతున్న పేద గిరిజన విద్యార్థుల కోసం టెలివిజన్, రేడియోలో ప్రత్యేక కంటెంట్ రూపకల్పన చేయాలని భావిస్తున్నారు. కరోనా లాంటి మహమ్మారులతో విద్యార్థులు నష్ట పోకుండా ఉండే దిశగా చర్యలు తీసుకోనున్నారు. చదవండి: ఏపీ విద్యా వ్యవస్థ భేష్ -
8.3 శాతం వృద్ధికి అవకాశం
వాషింగ్టన్: భారత్ జీడీపీ వృద్ధి అంచనాలను ప్రపంచబ్యాంకు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22)లో 8.3 శాతం మేర వృద్ధిని నమోదు చేయవచ్చని తాజాగా అంచనా వేసింది. పెరిగిన ప్రభుత్వ పెట్టుబడులు, తయారీని పెంచేందుకు ఇస్తున్న ప్రోత్సాహకాలు వృద్ధికి తోడ్పడతాయని తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. కరోనా రెండో విడత ప్రబలడానికి ముందు ఈ ఏడాది ఆరంభంలో వేసిన అంచనాల కంటే ఇది తక్కువేనని తెలిపింది. కరోనా రెండో విడత ప్రభావంతో ఆర్థిక రికవరీ నిలిచిపోయిందని.. వాస్తవానికి రికవరీ క్షీణించినట్టు కొన్ని సంకేతాల ఆధారంగా తెలుస్తోందని ప్రపంచబ్యాంకు దక్షిణాసియా ప్రాంత ముఖ్య ఆర్థికవేత్త హన్స్ టిమ్మర్ అన్నారు. ఈ ఏడాది మార్చిలో విడుదల చేసిన నివేదికలో భారత్ జీడీపీ వృద్ధి 2021–22లో 7.5–12.5 మధ్య ఉంటుందని పేర్కొనడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్–మే నెలల్లో దేశంలో కరోనా కేసులు గణనీయంగా పెరగడం తెలిసిందే. దీంతో తన తాజా అంచనాల్లో దిగువ స్థాయికి వృద్ధి అంచనాలను సవరించినట్టు టిమ్మర్ పేర్కొన్నారు. కరోనా రెండో విడత ప్రభావం ఆర్థిక వ్యవస్థమీద ఎక్కువే ఉందన్నారు. కార్మిక, వ్యవసాయ సంస్కరణలు అవసరం కార్మిక, వ్యవసాయ సంస్కరణలు అవసరానికి అనుగుణంగానే ఉన్నాయని టిమ్మర్ అభిప్రాయపడ్డారు. ఇవి ఆర్థిక వ్యవస్థలో వెలుగు చూడని సామర్థ్యాలని బయటకు తీసుకొస్తాయని చెప్పారు. సామాజిక భద్రతా వ్యవస్థల కోసం నిధులను ఏర్పాటు చేయడం వంటివి సంఘటిత రంగంలోని కారి్మకులకే కాకుండా.. అసంఘటిత రంగంలోని వారికీ మేలు చేస్తుందన్నారు. ‘‘భారత్‌లో అమలు చేస్తున్న ఎన్నో స్వల్పకాలిక ఉపశమన చర్యలు దీర్ఘకాలం కోసం కాదు. దేశం మొత్తానికి సంబంధించి బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ప్రస్తుత సంస్కరణలు (కారి్మక, వ్యవసాయ) ఆ దిశలోనే ఉన్నాయి. కానీ, అదే సమయంలో చేయాల్సింది ఎంతో ఉంది’’ అని టిమ్మర్ వివరించారు. -
భారత ఎకానమీపై ప్రపంచ బ్యాంకు కీలక వ్యాఖ్యలు..!
గత నాలుగు సంవత్సరాల నుంచి భారత జీడీపీ వృద్ది రేటు గణనీయంగా తగ్గుతూ వస్తోంది. కరోనా రాకతో జీడీపీ వృద్ధి రేటు భారీగా పడిపోయింది. 2020 ఆర్థిక సంవత్సరంలో -7.96 శాతం వృద్ది రేటును భారత్‌ను నమోదు చేసింది. 2019 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. జీడీపీ గ్రోత్ రేట్ 12 శాతం మేర పడిపోయింది. 2021-2022 జీడీపీ రేటు 8.3 శాతం..! తాజాగా ప్రపంచ బ్యాంకు భారత ఎకానమీపై కీలక వ్యాఖ్యలను చేసింది. 2021-2022 ఆర్థిక సంవత్సరానికిగాను జీడీపీ 8.3 శాతం నమోదుచేస్తోందని గురువారం విడుదల చేసిన ఒక నివేదికలో ప్రపంచబ్యాంకు అంచనా వేసింది. భారత్ ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో స్థూల జాతీయోత్పత్తి 20.1 శాతంగా నమోదుచేసింది. కరోనా రాకతో దేశ వ్యాప్త లాక్డౌన్ కారణంగా మునుపటి ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో మునుపెన్నడూ లేని విధంగా జీడీపీ 24.4 శాతం మేర తగ్గింది. చదవండి: అమ్మేది మాంసం..! సుమారు ఒక బిలియన్ డాలర్లు వారి సొంతం..! గృహ ఆదాయాలే కీలకం లేకపోతే .. అంతే సంగతులు..! కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్‌తో సతమతమైనా భారత జీడీపీ వృద్దిరేటుపై ప్రపంచ బ్యాంకు తన నివేదికలో...కరోనా వ్యాక్సినేషన్, వ్యవసాయ, కార్మిక సంస్కరణలు, గృహ ఆదాయాల(నెలసరి, వార్షిక ఆదాయాలు) పెరుగుదల వంటి అంశాలు భారత జీడీపీ పెరుగుదలను నిర్ణయిస్తోందని పేర్కొంది. గృహా ఆదాయాల్లో రికవరీ ఉంటేనే..భారత ఎకానమీ పునరుద్దరణ ఉంటుందని తెలిపింది. గృహా ఆదాయాల్లో పెరుగుదల కన్పిస్తేనే ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుంది దీంతో జీడీపీ పెరుగుదలలో మార్పు కన్పిస్తోందని ప్రపంచ బ్యాంకు అభిప్రాయపడింది. ఏదేమైనా, భారత్‌లో వివిధ రంగాలలో ఆర్థిక పునరుద్ధరణ అసమానంగా ఉందని ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొంది. తయారీ, నిర్మాణ రంగాలు 2021 లో స్థిరంగా కోలుకున్నప్పటికీ, తక్కువ నైపుణ్యం కలిగిన వ్యక్తులు, మహిళలు, స్వయం ఉపాధి వ్యక్తులు, చిన్న సంస్థలు వెనుకబడి ఉన్నాయని నివేదిక వెల్లడించింది. దాంతో పాటుగా దక్షిణాసియా దేశాల్లో అనేక ఆర్థిక రంగాల్లో లింగ అసమానతలు భారీగా పెరిగిందని ప్రపంచ బ్యాంకు చీఫ్ ఎకనామిస్ట్ హన్స్ టిమ్మెర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. చదవండి: ఎలన్ మస్క్ కంపెనీ బలుపు చేష్టలు..టెస్లాకు భారీ షాక్! -
చైనా మెడకు బిగుస్తున్న ఉచ్చు.. పాక్ పాత్ర కూడా!
China Ease of doing business index Scam: డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌ల విషయంలో చైనా భారీ అవినీతికి పాల్పడిందన్న ఆరోపణలు.. ఇప్పుడు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ర్యాంకింగ్‌లో పురోగతి అనేది దేశ ఆర్థిక పురోగతిని, అంతర్జాతీయ మార్కెట్లో పెట్టుబడుల్ని ప్రభావితం చేసే అంశం. అయితే అంతటి బలమైన వ్యవస్థను.. చైనా అంతతేలికగా ఎలా ప్రభావితం చేయగలిగిందన్నది ఇప్పుడు ప్రధానంగా వ్యక్తం అవుతున్న అనుమానం. ఇక ఈ ఆరోపణలు వెలుగుచూడడంతో.. డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌ల విడుదలను నిలిపివేస్తూ(ఈ ఏడాదికి మాత్రమేనా? శాశ్వతంగానా?) ప్రపంచ బ్యాంక్ సంస్థ ప్రకటించడంతో అన్ని దేశాలు దిగ్భ్రాంతికి లోనయ్యాయి. డబ్ల్యూటీవో రూల్స్‌ను కాలి కింద తొక్కిపట్టి మరీ.. ప్రపంచ మార్కెట్‌ను శాసించాలనే అత్యాశ ఇప్పుడు పాముగా మారి డ్రాగన్ మెడకు చుట్టుకుంటోంది. డూయింగ్ బిజినెస్ ర్యాకింగ్స్లో అవకతవకలు బయటపడడంతో అంతర్జాతీయ సమాజం చైనాపై దుమ్మెత్తిపోస్తోంది. గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు వీలుగా.. చైనా డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో పైరవీలు చేసి మెరుగైన ర్యాంకులు సంపాదించింది. డూయింగ్ బిజినెస్ ర్యాకింగ్స్లో.. 2018 ఏడాదికి(హాంకాంగ్‌తో కలిసి ఐదవ స్థానం-వ్యక్తిగతంగా 78వ స్థానం, 2020లో హాంకాంగ్‌తో కలిసి మూడవ స్థానం-వ్యక్తిగతంగా 31వ స్థానానికి ఎగబాకింది. అయితే 2018, 2020తో పాటు మధ్యలో 2019లోనూ ఫేక్ ర్యాంక్ దక్కించుకుందనేది ప్రపంచ బ్యాంక్ అంతర్గత దర్యాప్తు వెల్లడించిన అంశం. ఉన్నత పదవుల్లో అవినీతి, నివేదికల్లో డేటాపరమైన అవకతవకలు, బ్యాంకు సిబ్బంది నైతిక విలువలు పాటించకపోవడం వంటి వ్యవహారాలు చైనా ర్యాంక్‌ను ప్రభావితం చేశాయని దర్యాప్తు వెల్లడించింది. ఇవేకాదు.. అంతర్గతంగా విచారణ ద్వారా మరిన్ని నిజాల్ని నిగ్గు తేలుస్తామని ఇప్పటికే ప్రపంచ బ్యాంకు ప్రకటించుకుంది కూడా. గత రెండు దశాబ్దాలుగా ఐఎంఎఫ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వంటి అంతర్జాతీయ సంస్థలపై పట్టు సాధించేందుకు చైనా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో తాజా పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆరోపణలు నిజమని తేలితే.. చైనాపై కొంతకాలం కఠిన ఆంక్షలు విధించడంతో పాటు విదేశీ పెట్టుబడులకు అనుమతుల నిరాకరణకు ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరల్డ్ బ్యాంక్ మాజీ ప్రెసిడెంట్ జిమ్ యోంగ్ కిమ్, సీఈవో(ప్రస్తుతం కూడా) క్రిస్టలీనా జార్జియేవా.. ఒత్తిళ్ల మేరకు చైనాకు మెరుగైన ర్యాంకింగ్ లభించేలా వరల్డ్ బ్యాంక్ సిబ్బంది డేటాను మార్చేశారని ఈ వ్యవహారంలో దర్యాప్తు చేపట్టిన న్యాయసేవల సంస్థ విల్మర్హేల్ నిర్ధారించింది. పాక్ పాత్ర కూడా.. ప్రస్తుతం డూయింగ్ బిజినెస్ ర్యాకింగ్‌లో చైనా పైరవీల వ్యవహారంపై వరల్డ్ బ్యాంక్ ఎథిక్స్ కమిటీ దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో పాకిస్థాన్ పాత్రను కూడా గుర్తించినట్లు సమాచారం. పాక్ లాంటి దేశాల వెన్నుదన్నుతోనే చైనా ఫేక్ ర్యాంకింగ్‌తో డూయింగ్ బిజినెస్ లిస్ట్‌లో ఎగబాకగలిగిందని ఎథిక్స్ కమిటీ సమర్పించిన 16 పేజీల నోట్లో ఓ ముఖ్యాంశంగా ఉంది. చైనాను హైలీ ప్రమోట్ చేయడం ద్వారా పాక్ సైతం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నట్లు అయ్యింది. అంతేకాదు గ్లోబల్ ఇన్వెస్టర్లను చైనాకు మళ్లించేలా ప్రభావితం చేయడంతో పాటు చైనాతో పరస్పర సహకారం భారీ ముడుపులు పాక్ అందుకుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చైనాతో ఆర్థిక లావాదేవీల కొనసాగింపు, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, ఇస్లామాబాద్-ఫైసలాబాద్-కరాచీలలో భారీ పెట్టుబడుల హామీతోనే చైనాకు పాక్ మద్దతుగా నిలుస్తోందనేది ఆ నివేదికలోని సారాంశం. మరో విషయం ఏంటంటే.. ప్రపంచ ఆరోగ్య సంస్థను సైతం ప్రభావితం చేస్తూ చైనా ఈ తతంగాన్ని నడిపించిందని. కావాలంటే ఎంక్వైరీ చేస్కోండి చైనా ఈ ఆరోపణలు తోసిపుచ్చుతోంది. ఇదంతా అమెరికా కుట్రలో భాగమని అంటోంది. అంతర్గత దర్యాప్తు కాదు.. అవసరమైతే నిఘా వర్గాలతోనూ దర్యాప్తు జరిపించుకోండంటూ ప్రపంచ బ్యాంకుకు సవాల్ విసురుతోంది. మరోవైపు, ప్రపంచ బ్యాంకు ఈ ఆరోపణలపై సమగ్రమైన విచారణ నిర్వహించాలని, విశ్వసనీయతను పాటించాలని చైనా విదేశాంగ శాఖ అభిప్రాయపడింది. ఇక అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)కి డైరెక్టరుగా ఉన్న జార్జియేవా ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. విచారణ నివేదికలో వెల్లడైన విషయాలతో విభేదిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇక ఆ టైంలో వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా పని చేసిన జిమ్ కిమ్ సైతం ఆరోపణల్ని తోసిపుచ్చారు. వరల్డ్ బ్యాంక్ ఎథిక్స్ కమిటీ.. ఈ ఆరోపణలపై దర్యాప్తు జరుపుతోంది. సెప్టెంబర్ 15న ‘ఇన్వెస్టిగేషన్ ఆఫ్ డేటా ఇర్రెగ్యులారిటీస్ ఇన్ డూయింగ్ బిజినెస్ 2018 అండ్ డూయింగ్స్ బిజినెస్ 2020.. ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ అండ్ రిపోర్ట్ టు ది బోర్డ్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్స్’ పేరుతో 16 పేజీల రిపోర్ట్‌ను తయారు చేసింది ఎథిక్స్ కమిటీ. . అవుట్‌డేటెడ్ మల్టీలాటెరల్ స్ట్రక్చర్స్, అవినీతి లాంటి చైనా ప్రయత్నాలపై ఈ నివేదిక వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఓవైపు ఆర్థికంగా వరుస దెబ్బలు.. తాజాగా డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ ఆరోపణలు చైనాను మరింత ఇరకాటంలోకి నెట్టేయడం ఖాయంగా కనిపిస్తోంది. చదవండి: డూయింగ్ బిజినెస్ నివేదిక నిలిపివేత -
2050 నాటికి ఆ మొత్తం మంది ఉన్న ఊరుని వదలక తప్పదా?
బార్సిలోనా: వాతారవణంలోని మార్పులు కారణంగా 2050 కల్లా దాదాపుగా 200 మిలియన్ల మంది ప్రజలు తమ నివాసాలు వదిలి వలసలు వెళ్లతారని ప్రపంచ బ్యాంక్ నివేదికలో తెలిపింది. వాతావరణ మార్పుల కారణంగా నీటి కొరత, సముద్ర మట్టాలు పెరగడం, పంట ఉత్తాదకత తగ్గడం. వంటి వాటితో మొదలై 2050 కల్లా అది తీవ్ర వలసలకు మారిపోవచ్చు మారిపోవచ్చు అని నివేదికలో హెచ్చరించింది. అభివృద్ధి ముసుగులో అత్యధిక పరిశ్రమలను నెలకొల్పి వాటి నుంచి విడుదలై ఉద్గారాలను శుద్ధి చేయకుండా గాల్లోకి వదిలి మానవుడు తన వినాశనానికి తానే శ్రీకారం చుడుతున్నాడంటూ వ్యాఖ్యానించింది. ప్రధానంగా ఆరు దేశాలైన లాటిన్ అమెరికా, నార్త్ ఆఫ్రికా, సహారా ఆఫ్రికా, తూర్పు యూరప్, పసిఫిక్ వంటి ప్రాంతాల్లో సుమారుగా 216 మిలియన్ల మంది ప్రజలు తమ మాతృభూమిని వీడి పోవాల్సి వస్తుందని నివేదిక నొక్కి చెప్పింది. వలసలు ప్రేరేపించేలా... సహారా ఆఫ్రికాలో అత్యధిక శాతం మంది ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం అందువల్ల దాదాపు 86 మిలియన్ల మంది ప్రజలు వలసి వెళ్లిపోక తప్పదని నివేదికలో తెలిపింది. నార్త్ ఆఫ్రికా, ఈశాన్య తునిషియా, వాయువ్య అల్గేరియా, మొరాకో, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో వరదలు, నీటి కొరత కారణంగా సుమారు 19 మిలియన్ల మంది వలసి పోయే ప్రమాదం ఉందని నివేదిక వెల్లడించింది. ఇక రానురానూ భవిష్యత్తరాలలో వలసలను ప్రేరేపించే విధంగా వాతావరణం అత్యంత ప్రమాదకరంగా మారుతుందని వాతావరణ నిపుణుడు వివియనే వీ చెన్ నివేదికలో పేర్కొన్నారు. (చదవండి: క్వాడ్ సదస్సుకు అమెరికా ఆతిధ్యం) శరణార్థుల శిభిరాల కేంద్రంగా... అనుకూలమైన వాతావరణం ఉండి, కాలుష్యం తక్కువగా ఉన్నా కూడా తమ అభివృద్ధి కోసమో లేక ఉన్నత ఉద్యోగమనో...లేదా మరే ఇతర కారణాల వల్ల ఇప్పటికే సుమారు 44 మిలియన్ల మంది ప్రజలకు తమ సోంత గడ్డను విడిచి పట్టణాలు/ విదేశాల బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పర్యావరణ నిపుణురాలు డాక్టర్ కాంత కుమారి రిగౌడ్ మాట్టాడుతూ..."వలసలు మనకేమి కొంత కాదు. ప్రపంచంలో మనకు తెసిన ప్రతి నలుగురిలో ముగ్గురు మాత్రమే ఇక్కడ ఉంటున్నారు. దీనికి అననూకూల వాతావరణం తోడైతే వలసలు అధికమై శరణార్థుల శిభిరాల కేంద్రాలు ఎక్కువయ్యే ప్రమాదం పొంచి ఉంటుందని" అన్నారు. కార్యాచరణ దిశగా అడుగులు పడాలి... ప్రపంచ దేశాలన్ని ఉద్గారాలను తగ్గించడానికి ముందుకొస్తేనే ఈ పరిస్థితి జయించగలమన్నారు. వాతావరణ అత్యవసర పరిస్థితి రావడానికి బాధ్యులైన దేశాల్లో ముందున్నది అమెరికానే అని నివేదిక స్పష్టం చేసిందన్నారు. ప్రతి ఏటా కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్(కాప్ 25) వంటి సదస్సులు పెట్టి తీసకుంటున్న నిర్ణయాలు మాటల వరకే పరిమతమవుతున్నాయి తప్ప కార్యచరణ దిశగా తీసుకురావడానికీ ఏ దేశం ముందుకు రావటం లేదని నివేదికలో వ్యాఖ్యానించారు. కర్బన ఉద్గారాలకు ప్రధాన కారణమైన దేశాల నుంచి ముందుకు వస్తేనే 2050 నాటికి కార్బన్ న్యూట్రాలిటీ సాధించే దిశగా అడుగులు వేయగలమని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. (చదవండి: సీబీఐ, ఈడీపై పశ్చిమ బెంగాల్ స్పీకర్ ఆగ్రహం) -
World Bank: ఎంఎస్ఎంఈలకు బంపర్ బొనాంజా
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సంక్షోభంతో భారీగా ప్రభావితమైన ఎంఎస్ఎంఈ (మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్) రంగానికి ప్రపంచ బ్యాంకు బంపర్ బొనాంజా ప్రకటించింది. ఈ రంగం పునరుజ్జీవం కోసం 500 మిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించింది. భారతదేశం దేశవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమానికి మద్దతుగా ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు కీలక వెన్నెముకలాంటి ఎంఎస్ఎంఇ రంగం కోవిడ్ -19 మహమ్మారి తీవ్రంగా దెబ్బతిందని ప్రపంచ బ్యాంకు కంట్రీ డైరెక్టర్ జునైద్ అహ్మద్ అన్నారు. ఇది తిరిగి పుంజుకునేందుకు సంబంధించిన ప్రయత్నాలనువ్తమ మద్దతును మ రింత ముమ్మరం చేస్తుందని, తద్వారా దీర్ఘకాలిక ఉత్పాదకత-ఆధారిత వృద్ధికి, ఈ రంగంలో మరిన్ని ఉద్యోగాల ఉత్పత్తికి పునాదులు వేస్తున్నామని ఆయన అన్నారు. కోవిడ్-19 మహమ్మారి ద్వారా తీవ్రంగా ప్రభావితమైన ఎంఎస్ఎంఈ ల యొక్క తక్షణ ద్రవ్యత, క్రెడిట్ అవసరాల కోసం దీన్ని వినియోగించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రదానంగా 555,000 ఎంఎస్ఎంఈల పనితీరు మెరుగుదలను లక్ష్యంగా పెట్టుకుంది. పోస్ట్-కోవిడ్ రెసిలెన్స్ అండ్ రికవరీ ప్రోగ్రాంలో భాగంగా ప్రభుత్వ 3.4 బిలియన్ల డాలర్లలో 15.5 బిలియన్ డాలర్ల ఫైనాన్సింగ్‌ను సమీకరించాలని భావిస్తున్నట్లు ప్రపంచ బ్యాంక్ తెలిపింది. ఇందులో టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలు, హరిత పెట్టుబడులు మహిళల నేతృత్వంలోని వ్యాపారాలు ప్రయోజనం పొందడాన్ని ప్రోత్సహిస్తుందని, ప్రైవేటు రంగాలతో సేవా ప్రదాతలుగా అధిక స్థాయికి చేరుకోవడానికి భాగస్వామ్యాన్ని పెంచుతుందని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. ర్యాంప్ కార్యక్రమం ఐదు "ఫస్ట్ మూవర్" రాష్ట్రాల్లో గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు కార్యకలాపాలను ప్రారంభిస్తుంది. తదుపరి ఇతర రాష్ట్రాలుకూడా చేరే అవకాశం ఉందని పేర్కొంది. చదవండి : నైకీ, హెచ్అండ్ఎం బ్రాండ్స్‌కు చైనా షాక్ 5 నిమిషాల మాక్ డ్రిల్: 22 మంది ప్రాణాలు గాల్లో! -
మనోళ్లు పంపింది 83 బిలియన్ డాలర్లు..!
వాషింగ్టన్: కరోనా కష్టకాలంలోనూ విదేశాల్లోని భారతీయులు సొంత గడ్డకు భారీ మొత్తాలను (రెమిటెన్సులు) పంపారు. 2020లో రెమిటెన్సుల ద్వారా భారతీయులు పొందిన మొత్తం 83 బిలియన్ డాలర్లు. 2019తో పోల్చితే ఈ మొత్తాలు కేవలం 0.2% తగ్గాయి. 2019లో భారత్ స్వీకరిం చిన నిధులు 83.3 బిలియన్ డాలర్లు. 2020 రెమిటెన్సులకు సంబంధించి ప్రపంచబ్యాంక్ విడుదల చేసిన తాజా నివేదికలోని ముఖ్యాంశాలను చూస్తే.. ► 2019లో చైనా 68.3 బిలియన్ డాలర్లను రెమిటెన్సుల రూపంలో పొందితే, 2020లో ఈ పరిమాణం 59.6 బిలియన్ డాలర్లకు పడిపోయింది. తద్వారా భారత్ తర్వాత రెండవ స్థానంలో చైనా నిలిచింది. ► తాజా సమీక్షా సంవత్సరంలో భారత్‌కు యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ) నుంచి రెమిటెన్సులు 17 శాతం పడిపోయాయి. అయితే అమెరికా, ఇతర దేశాల నుంచి భారీగా నిధులు రావడంతో ఈ ప్రభావం మొత్తం స్వీకరణలపై పడలేదు. గల్ఫ్ నుంచి పెద్ద ఎత్తున భారతీయులు దేశానికి తిరిగి రావడం రెమిటెన్సులపై ప్రభావం చూపింది. ► భారత్, చైనాల తర్వాతి స్థానంలో మెక్సికో (42.8 బిలియన్ డాలర్లు), ఫిలిప్పైన్స్ (34.9 బిలియన్ డాలర్లు), ఈజిప్టు (29.6 బిలియన్ డాలర్లు), పాకిస్తాన్ (26 బిలియన్ డాలర్లు), ఫ్రాన్స్ (24.4 బిలియన్ డాలర్లు), బంగ్లాదేశ్ (21 బిలియన్ డాలర్లు) ఉన్నాయి. ► పాకిస్తాన్‌కు రెమిటెన్సులు 17 శాతం పెరిగాయి. ఇందులో అధిక భాగం సౌదీ అరేబియా నుంచి వచ్చాయి. తరువాతి స్థానంలో యూరోపియన్ యూనియన్ దేశాలు, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ ఉన్నాయి. ► బంగ్లాదేశ్ విషయంలో పెరుగుదల రేటు 18.4 శాతం ఉంటే, శ్రీలంక విషయంలో ఈ రేటు 5.8 శాతంగా ఉంది. ► నేపాల్ విషయంలో ఈ పరిమాణం 2 శాతం పడిపోయింది. ► 2020లో భారీగా రెమిటెన్సులు పడిపోతాయని అంచనావేసినప్పటికీ, ఇలాంటి ప్రతికూల పరిస్థితి నెలకొనలేదు. దిగువ, మధ్య ఆదాయ దేశాలకు 2019లో 548 బిలియన్ డాలర్లు వస్తే, 2020లో ఈ పరిమాణం కేవలం 1.6 శాతం తగ్గి 540 బిలియన్ డాలర్లకు చేరింది. ఇది ఆయా దేశాలకు పెద్ద ఆదాయ వనరుగా మారింది. ► రెమిటెన్సులు పెరిగిన ప్రాంతాల్లో లాటిన్ అమెరికా, కరేబియన్ (6.5 శాతం), దక్షిణ ఆసియా (5.2 శాతం), పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికా (2.3 శాతం)లు ఉన్నాయి. ► తగ్గిన ప్రాంతాల్లో తూర్పు ఆసియా, పసిఫిక్ (7.9 శాతం), యూరోప్, సెంట్రల్ ఆసియా (9.7 శాతం), సహారా ప్రాంత ఆఫ్రికా (12.5 శాతం) ఉన్నాయి. అమెరికా నుంచే అత్యధిక రెమిటెన్సులు రెమిటెన్సులు భారీగా తరలివెళ్లిన దేశాల్లో అమెరికా 68 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో నిలిచింది. తరువాతి స్థానాల్లో యూఏఈ (43 బిలియన్ డాలర్లు), సౌదీ అరేబియా (34.5 బిలియన్ డాలర్లు), స్విట్జర్లాండ్ (27.9 బిలియన్ డాలర్లు), జర్మనీ (22 బిలియన్ డాలర్లు), చైనా (18 బిలియన్ డాలర్లు) నిలిచాయి. భారత్ విషయంలో ఈ పరిమాణం 7 బిలియన్ డాలర్లుగా ఉంది. 2019లో ఈ పరిమాణం 7.5 బిలియన్ డాలర్లుగా ఉంది. -
బ్యాంకుల్లో నిరుపయోగంగా రూ.60 వేల కోట్లు?
ప్రపంచ బ్యాంకు 2017 గ్లోబల్ ఫైండెక్స్ నివేదిక ప్రకారం, భారతదేశంలో దాదాపు సగం మంది ఖాతాదారులు 2016లో క్రియారహితంగా ఉన్న ఖాతాలు కలిగి ఉన్నట్లు పేర్కొంది. అంటే అక్షరాల 60 కోట్లకు పైమాటే అన్నమాట. ఇన్ని ఖాతాలలో కనీసం రూ.1000 ఉన్నాయి అనుకున్న సుమారు అరవై వేల కోట్ల రూపాయలు ఎటువంటి ప్రయోజనం లేకుండా ఖాతాలో ఉన్నాయి అనుకోవచ్చు. కాబట్టి అనేక ఖాతాలు కలిగి ఉండటం వల్ల ఆర్ధికంగా చాలా నష్టపోతారని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే అన్ని ఖాతాల్లో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండలేం. ఖాతాల్లో కనీస నిల్వ లేకుంటే ఛార్జీలు పడతాయి. అందుకే ఎంతో కొంత డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. పెద్ద బ్యాంకులు చార్జీల రూపంలోనే ఏడాదికి రూ.100 కోట్లు వసూలు చేస్తున్నాయి. దీన్ని బట్టి మనం అర్ధం చేసుకోవచ్చు మనం ఎక్కువ ఖాతాలు కలిగి ఉండటం వల్ల ఏమి కోల్పోతున్నామో అని. ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉంటే ఎక్కువ డబ్బు నష్ట పోతున్నారని అర్థం చేసుకోవాలి. చాలా బ్యాంకులు ఖాతాదారులు కనీస బ్యాలెన్స్ ఉంచకపోతే ఛార్జీలు వేస్తాయి. ఇలా మీరు కలిగిఉన్న ఖాతాలో కచ్చితంగా కనీస నిల్వలు పాటించాల్సి ఉంటుంది. చాలా వరకు బ్యాంకుల్లో కనీస నిల్వ రూ.5000 నుంచి రూ.10 వేల వరకు ఉంచాలి. అంటే మీకు ఐదు బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయనుకుంటే రూ.25,000 నుంచి రూ.50,000 వేల వరకు ఖాతాల్లోనే ఉండిపోతుంది. బ్యాంకుల్లో ఉన్న కనీస నిల్వలపై 3-4 శాతం వార్షిక వడ్డీ మాత్రమే లభిస్తుంది. అదే మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్లలో లేదా స్టాక్ మార్కెట్లో పెడితే దానికంటే రెట్టింపు వడ్డీ లభిస్తుంది. ఇవే కాకుండా పొదుపు ఖాతాలపై డెబిట్ కార్డ్ ఛార్జీలు, క్రెడిట్ కార్డు ఛార్జీలు వంటివి వర్తిస్తాయి. మీ వేతన ఖాతా లేదా జీరో బ్యాలెన్స్ పొదుపు ఖాతాలో వరుసగా మూడు నెలలు ఎలాంటి డిపాజిట్ చేయకపోతే ఆ తర్వాత అది సాధారణ పొదుపు ఖాతాగా మారుతుంది. అప్పుడు కచ్చితంగా కనీస నిల్వలను పాటించాల్సి ఉంటుంది. ఒక బ్యాంకు ఖాతాను అసలు ఉపయోగించకపోతే దానిని మూసివేయడమే మంచిది. ఎక్కువ ఖాతాలు ఉండటం వల్ల వాటి డెబిట్, క్రెడిట్ పిన్ నంబర్లు గుర్తుంచుకోవాలంటే కూడా కష్టమే. మీ ఖాతా ద్వారా ఎలాంటి లావాదేవీలు జరపకపోతే రెండేళ్ల తర్వాత బ్యాంకులు ఖాతాను డీయాక్టివేట్ చేస్తాయి. ఇలా చేయడం వల్ల నగదు కోల్పోవాల్సి ఉంటుంది. దానిని తిరిగి తెరవలన్న చాలా ఇబ్బంది. మరి ఏం చేయాలి? బ్యాంకు ఖాతాలు ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది అని చెప్పుకోవాలి. ఒకటి వేతన ఖాతా కోసం, కుటుంబ సభ్యులతో కలిపి ఉమ్మడి ఖాతా ఉంటే సరిపోతుంది. డబ్బు అత్యవసరం అయినప్పుడు మీరు అందుబాటులో లేకపోతే ఉమ్మడి ఖాతా వల్ల ఖాతాదారులు డబ్బు తీసుకునే అవకాశం ఉంటుంది. మరీ అంతగా కావాలనుకుంటే మరొక ఖాతాను శాశ్వత ఖాతాగా తెరుచుకోవచ్చు. ఉద్యోగం మారినప్పుడు వేతన ఖాతాలు అనేవి మారుతుంటాయి. చదవండి: కరోనా బీమా పాలసీ దారులు మీకు ఈ విషయాలు తెలుసా? -
రికవరీ ఉన్నా... కష్టాలు కొనసాగుతున్నాయ్!
వాషింగ్టన్: కరోనా మహమ్మారి నేపథ్యంలో 2020 కఠిన లాక్డౌన్ పరిస్థితుల నుంచి భారత్ ఎకానమీ గణనీయంగా కోలుకున్నప్పటికీ, కష్టాల నుంచి బయటపడిపోలేదని ప్రపంచబ్యాంక్ తన తాజా నివేదికలో పేర్కొంది. 2021–22లో భారత్ ఆర్థిక వ్యవస్థ 7.5 శాతం నుంచి 12.5 శాతం శ్రేణిలోనే నమోదవుతుందని వాషింగ్టన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న గ్లోబల్ లెండర్ అంచనావేసింది. ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వార్షిక ‘స్పింగ్’ సమావేశాలు త్వరలో జరగనున్న నేపథ్యంలో దక్షిణాసియా ఎకానమీలపై బహుళజాతి బ్యాంకింగ్ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2016–17లో 8.3 శాతం వృద్ధిని సాధించిన తర్వాత 2019–20లో భారత్ కేవలం 4 శాతం వృద్ధికి పరిమితమైంది. -
హఫీజ్ సయీద్‌కు పదేళ్ల జైలు శిక్ష
ఇస్లామాబాద్: ముంబై 26/11 ఉగ్రదాడి సూత్రధారి, జమాత్-ఉల్-దవా ఉగ్రసంస్థ చీఫ్ హఫీజ్ సయీద్‌కు పాకిస్తాన్ కోర్టు పదేళ్లపాటు జైలు శిక్ష విధించింది. రెండు ఉగ్రదాడుల్లో దోషిగా తేలడంతో కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. ఉగ్ర కార్యకలాపాలకు వ్యతిరేకంగా పనిచేసే లాహోర్ కోర్టు(యాంటీ టెర్రరిజం కోర్టు) హఫీజ్‌తో పాటు జాఫర్ ఇక్బాల్, యహ్యా ముజాహిద్ లకు పదిన్నరేళ్ల పాటు శిక్ష ఖరారు చేసింది. అతడి తోడల్లుడు అబ్దుల్ రెహమాన్ మక్కికి ఆర్నెళ్ల శిక్ష పడింది. కాగా 2008లో ముంబై తాజ్ హోటల్లో హఫీజ్ పెంచి పోషించిన ఉగ్రబృందం కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో 166 మంది అమాయకులు మృత్యువాత పడగా వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మారణకాండలో మొత్తం పది మంది ఉగ్రమూకలు పాల్గొన్నాయి. ఈ కేసుకు సంబంధించి కరడుగట్టిన ఉగ్రవాది కసబ్‌కు ఇప్పటికే ఉరిశిక్ష అమలైంది. గతంలో ప్రపంచ ఉగ్రవాదిగా హఫీజ్‌ను ప్రకటించిన ఐక్యరాజ్య సమితి అతడి తల తీసుకు వస్తే 10మిలియన్ డాలర్లు బహుమతిగా ఇస్తామని పేర్కొన్న విషయం తెలిసిందే.(చదవండి: చిత్తశుద్ధి లేని చర్య) అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి ఇక ఉగ్రవాద సంస్థలకు ఆర్ధిక సహాయం చేస్తున్న హఫీజ్‌ను అరెస్టు చేయాలని అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడి రావడంతో పాకిస్తాన్ ప్రభుత్వం గత ఏడాది జూలైలో అతడిని అరెస్టు చేసింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య హఫీజ్ సయీద్ పాక్‌లోని కోట్ లాక్‌పాత్ జైలులో ఉన్నాడు. ప్రపంచ తీవ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సహాయం చేస్తున్న హఫీజ్ పాకిస్తాన్ కేంద్రంగా భారత్‌లో ఉగ్రదాడులకు పాల్పడుతున్నాడని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్ఏటిఎఫ్) పేర్కొంది. అతడిపై చర్యలు తీసుకోవాలని ఎఫ్ఏటిఎఫ్ పాకిస్తాన్‌పై ఒత్తిడి తీసుకొచ్చింది. అయితే జమాత్-ఉల్-దవా ప్రతినిధులపై పాకిస్తాన్ ఉగ్ర వ్యతిరేక సంస్థ ఇప్పటి వరకు 41కేసులు నమోదు చేసింది. 4 కేసుల్లో హఫీజ్ సయీద్ దోషిగా తేలగా మిగతావి పాక్‌లోని పలు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. పాకిస్తాన్లో ఉగ్రవాదులకు స్థావరం లేకుండా చేయాలని భారత్ తన మిత్ర దేశాలతో పాటు పలు అంతర్జాతీయ సంస్థలను ఎప్పటి నుంచో కోరుతోంది. పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్థావరం కల్పించడంపై ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ కేంద్రంగా పని చేస్తున్న ఎఫ్ఏటిఎఫ్ కు భారత్ కొన్ని ఆధారాలను అందించింది. గత ఏడాది ఫిబ్రవరిలో జమ్మూ-కశ్మీర్‌లోని పుల్వామా ప్రాంతంలో సిఆర్పిఎఫ్ జవాన్లపై బాంబు దాడికి పాల్పడిన జైషే-మహ్మద్ ఉగ్రవాద సంస్థకు కొన్ని పాక్ సంస్థలు ఆర్థిక సహాయం చేస్తున్నాయని భారత్ ఆధారాలతో సహా ఎఫ్ఏటిఎఫ్ కు ఫిర్యాదు చేసింది. ఉగ్రవాదులకు మద్దతిస్తుందన్న ఆరోపణల కారణంగా ఎఫ్ఏటిఎఫ్ పాకిస్తాన్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టింది. దీంతో ప్రంపంచ బ్యాంకు, ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంకు, ఐఎమ్ఎఫ్ వంటి సంస్థలు పాకిస్తాన్‌కు అప్పు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న పాక్ గత్యంతరం లేక ఉగ్రవాదులపై చర్యలకు ఉపక్రమించింది. -
కోవిడ్–19పై శక్తివంచనలేకుండా పోరు
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థను, ప్రజారోగ్యాన్ని కోవిడ్–19 ప్రభావం నుంచి తప్పించడానికి తగిన చర్యలను నిరంతరం తీసుకుంటున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రపంచబ్యాంక్ డెవలప్మెంట్ కమిటీ ప్లీనరీ 102వ సమావేశాన్ని ఉద్దేశించి శుక్రవారం ఆమె మాట్లాడారు. భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 10 శాతానికి సమానమైన ఉద్దీపన ప్యాకేజ్సహా, కార్మిక రంగంలో భారీ సంస్కరణలను తీసుకువస్తున్నట్ల వివరించారు. ఇంకా ఆమె ఏమన్నారంటే... కరోనా వైరస్ అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. పేదరికం నిర్మూలనకు పలు సంవత్సరాలుగా జరుగుతున్న కృషి తాజా పరిస్థితుల్లో నీరుగారిపోయే వాతావరణం నెలకొంది. మహమ్మారి ప్రభావం సామాజిక, ఆర్థిక రంగాలపై పడకుండా తగిన చర్యలు అన్నింటినీ భారత్ ప్రభుత్వం తీసుకుంటోంది. నాబార్డ్ ద్వారా రీఫైనాన్షింగ్ మద్దతు మార్గంలో గ్రామీణ రంగానికి అండగా నిలవడం జరుగుతోంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపులను పెంచడం జరిగింది. ప్రత్యేకించి ఆరోగ్య రంగాన్ని మెరుగుపరచడానికి తగిన కృషి జరుగుతోంది. మహమ్మారి నిర్మూలనకు ప్రపంచదేశాలన్నీ కలిసికట్టుగా కృషి చేయాల్సి ఉంది. ఈ దిశలో తనవంతు సహకారం, అనుభవ పాఠాలను అందించడానికి భారత్ సిద్ధంగా ఉంటుంది. 80 సంవత్సరాల్లో ఎన్నడూలేని విపత్కర పరిస్థితి: ప్రపంచబ్యాంక్, ఐఎంఎఫ్ కాగా కరోనా మహమ్మారి ప్రతికూలతల నేపథ్యంలో ప్రపంచం గత 80 సంవత్సరాల్లో ఎన్నడూ లేని పరిస్థితులను ఎదుర్కొంటోందని ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అభిప్రాయపడ్డాయి. రెండు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల వార్షిక సమావేశం శుక్రవారం ముగిసింది. అనంతరం విడుదలైన ఒక సంయుక్త ప్రకటన విడుదలైంది. ‘‘కోవిడ్–19 వల్ల ప్రపంచవ్యాప్తంగా పేదరికం పెరిగింది. అసమానతలు తీవ్రమయ్యాయి. దీర్ఘకాలంలో వృద్ధి అవకాశాలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. ఈ సమస్య తీవ్రత ఇంకా కొనసాగుతోంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి ప్రపంచదేశాలన్నీ ఒకతాటిపైకి రావాలి. పరస్పర సహకారంతోనే సమస్య పరిష్కారం సాధ్యమవుతుంది’’ అని ప్రకటన పేర్కొంది. ఇదిలావుండగా, జూన్ 2021 నాటికి కరోనా వైరస్ పోరులో భాగంగా 160 బిలియన్ డాలర్ల సహాయాన్ని అందించడానికి ప్రపంచబ్యాంక్ తగిన కృషి జరపాలని బ్యాంక్ స్టీరింగ్ కమిటీ శుక్రవారం విజ్ఞప్తి చేసింది. అభివృద్ధి చెందిన దేశాలకు అదనపు అత్యవసర నిధి, రుణ సౌలభ్యతలను కలిగించేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది. ఇప్పటికే 100 బిలియన్ డాలర్ల సహాయం పట్ల హర్షం వ్యక్తం చేసింది. ఐఎంఎఫ్ కూడా కరోనా పోరు విషయంలో తన చర్యలను మరింత ముమ్మరం చేయాలని విజ్ఞప్తి చేసింది. -
కోవిడ్-19 : మాంద్యం గుప్పిట్లో ప్రపంచం
న్యూయార్క్ : 1930ల నాటి గ్రేట్ డిప్రెషన్ తర్వాత తీవ్ర ఆర్థిక మాందాన్ని ప్రపంచం చవిచూస్తోందని ప్రపంచ బ్యాంక్ చీఫ్ డేవిడ్ మల్పాస్ అన్నారు. పలు వర్ధమాన, పేద దేశాలకు కోవిడ్-19 పెను ముప్పుగా ముంచుకొచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్ విస్తృతితో ఆర్థిక వ్యవస్థ కుదేలైన క్రమంలో ఆయా దేశాలోల రుణ సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాక్ వార్షిక సమావేశాలను పురస్కరించుకుని మల్పాస్ మీడియాతో మాట్లాడారు. చాలా లోతైన ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని చుట్టుముట్టిందని, పేదరికంతో కొట్టుమిట్డాడుతున్న దేశాలను ఇది భారీగా దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఆయా దేశాలకు భారీ వృద్ధి కార్యక్రమాన్ని ప్రపంచ బ్యాంక్ రూపొందిస్తోందని చెప్పారు. ఇక వ్యాక్సిన్లను సమకూర్చుకోలేని దేశాలకు వ్యాక్సిన్లు, మందుల సరఫరా కోసం 1200 కోట్ల డాలర్ల హెల్త్ ఎమర్జెన్సీ కార్యక్రమాల విస్తరణకు ప్రపంచ బ్యాంక్ బోర్డు ఇప్పటికే ఆమోదముద్ర వేసింది. కోవిడ్-19తో ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థ సజావుగా సాగేందుకు సహకరిస్తున్నారని, అసంఘటిత రంగంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి సామాజిక భద్రతా పథకాలతో ప్రభుత్వాలు ఆదుకుంటున్నాయని చెప్పారు. పేద దేశాల్లో ప్రజలకు అదనపు సామాజిక భద్రత కలిగించే దిశగా ప్రపంచ బ్యాంక్ కసరత్తు సాగిస్తోందన్నారు. వ్యవసాయంలో ఎదురయ్యే సవాళ్ల పరిష్కారంపైనా పనిచేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. చదవండి : భారత్‌పై వరల్డ్ బ్యాంక్ కీలక అంచనాలు -
కరోనా కష్టంతో 9.6% క్షీణత
వాషింగ్టన్: భారత్ ఆర్థిక వ్యవస్థ 2020 (ఏప్రిల్)–2021 (మార్చి) ఆర్థిక సంవత్సరంలో 9.6 శాతం క్షీణతను నమోదుచే సుకుంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనావేస్తోంది. కరోనా కట్టడికి విధించిన కఠిన లాక్డౌన్ పరిస్థితులు, గృహాలు, పరిశ్రమల ఆదాయాలు పడిపోవడం వంటి అంశాలు దీనికి కారణంగా వివరించింది. ‘దక్షిణాసియా ఆర్థిక పరిస్థితిపై దృష్టి’ పేరుతో గురువారంనాడు విడుదలైన ప్రపంచబ్యాంక్ నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. భారత్ ఇంతకుముందెన్నడూ లేని దారుణ పరిస్థితులను ఎదుర్కొంటోందని పేర్కొంది. తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) భారత స్థూల దేశీయోత్పత్తి 23.9 శాతం క్షీణించిన నేపథ్యంలో ప్రపంచబ్యాంక్ తాజా నివేదిక విడుదలైంది. ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వార్షిక సమావేశాల నేపథ్యంలో విడుదలైన నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు... ► దక్షిణాసియా ప్రాంతం ఆర్థిక వ్యవస్థ గడచిన ఐదేళ్ల నుంచీ వార్షికంగా 6 శాతం వృద్ధి నమోదుచేసుకోగా, 2020లో 7.7 శాతం క్షీణించనుంది. అయితే 2021లో ఈ ప్రాంతం 4.5 శాతం వృద్ధిని నమోదు చేసుకునే అవకాశం ఉంది. ► కరోనా వైరస్ ప్రభావంతో భారత్‌లో సరఫరాలు–డిమాండ్ పరిస్థితుల మధ్య సమతౌల్యత పూర్తిగా దెబ్బతింది. ► వృద్ధికి మౌలిక రంగంలో పెట్టుబడులు అవసరం. అయితే ఇప్పుడు ద్రవ్య వనరులను ఆరోగ్యం, సామాజిక భద్రతపై అధికంగా కేంద్రీకరించాల్సి ఉంటుంది. ఆయా అంశాలకు అనుగుణంగా మధ్య కాలానికి ద్రవ్య వ్యవస్థ–వ్యయ ప్రక్రియలను పునఃసమీక్షించాల్సి ఉంటుంది. అయితే క్లిష్ట ద్రవ్య పరిస్థితుల్లోనూ కేంద్రం తన వంతు తగిన చర్యలను సమర్థవంతంగా తీసుకుంటోంది. ► అసలే మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను కరోనా మహమ్మారి మరింత దెబ్బతీసింది. పెద్ద సంఖ్యలో ప్రజలు ఉపాధి అవకాశాలను కోల్పోయారు. దీనితో పేదరికం సమస్య తీవ్రమవుతోంది. ఏడాదిలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారి సంఖ్య 33 శాతం పెరిగే అవకాశం ఉంది. ► బ్యాంకింగ్‌లో పెరుగుతున్న మొండిబకాయిల (ఎన్పీఏ) పరిమాణం ఆందోళన కలిగిస్తోంది. అన్ని అంచనాలూ క్షీణతలోనే... మొదటి త్రైమాసికం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో భారత్ ఆర్థిక వ్యవస్థ 23.9% క్షీణ రేటును నమోదుచేసుకున్న నేపథ్యంలో... 2020–21లో అంచనాలను పరిశీలిస్తే (అంచనాలు శాతాల్లో).. -
భారత్‌పై వరల్డ్ బ్యాంక్ కీలక అంచనాలు
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక వ్యవస్థపై కోవిడ్-19 ప్రభావాన్ని నిరోధించేందుకు భారత్ కీలక సంస్కరణలను కొనసాగించాలని ప్రపంచ బ్యాంక్ నివేదిక పేర్కొంది. కరోనా వైరస్ విధ్వంసంతో దక్షిణాసియా తీవ్ర మాంద్యంలోకి జారుకునే ప్రమాదం ఉందని, 2020లో ఈ ప్రాంత వృద్ధి 7.7 శాతం తగ్గుతుందని అంచనా వేసింది. ఇక దక్షిణాసియాలో అత్యంత వేగంగా ఎదుగుతున్న భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది మార్చితో ప్రారంభమైన ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 9.6 శాతం క్షీణిస్తుందని పేర్కొంది. అయితే 2022 ఆర్థిక సంవత్సరంలో భారత్ తిరిగి పుంజుకుని 5.4 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని ప్రపంచ బ్యాంక్ నివేదిక వెల్లడించింది. కోవిడ్-19 నియంత్రణలు 2022 నాటికి పూర్తిగా తొలగిపోతాయని అంచనా వేసింది. ఇక కోవిడ్-19 ప్రభావంతో దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలు మందగించడంతో భారత ఎగుమతులు, దిగుమతులు దెబ్బతింటాయని పేర్కొంది. చదవండి : కోవిడ్-19 : ప్రపంచం ఎప్పుడు కోలుకుంటుంది..? భారత్‌లో ఇంతకుముందెన్నడూ లేని విధంగా పరిస్థితి మరింత దిగజారిందని ప్రపంచ బ్యాంక్, దక్షిణాసియా ముఖ్య ఆర్థికవేత్త హన్స్ టిమర్ పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నప్పుడే కోవిడ్-19 విరుచుకుపడిందని అయితే సత్వర సమగ్ర చర్యలతో భారత్ ఈ విపత్తును అధిగమించవచ్చన్నారు. భారత్ దూరదృష్టితో కూడిన సంస్కరణలను చేపట్టిన ఫలితంగా పేదరికంపై సాధించిన విజయాలను సంరక్షించుకోగలుగుతోందని ప్రపంచ బ్యాంక్‌లో భారత్ డైరెక్టర్ జునైద్ అహ్మద్ పేర్కొన్నారు. భారత్‌లో సామాజిక భద్రతా చట్టాలకు తీసుకువచ్చిన సవరణలతో గతంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో సాయం పొందని వర్గాలు ఇప్పుడు ఆయా పథకాలు, కార్యక్రమాల్లో లబ్ధి పొందుతున్నాయని ఆయన వెల్లడించారు. -
కోవిడ్-19 : ప్రపంచం ఎప్పుడు కోలుకుంటుంది..?
న్యూయార్క్ : కరోనా వైరస్ సృష్టించిన సంక్షోభం నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు ఐదేళ్ల సమయం పడుతుందని వరల్డ్ బ్యాంక్ ప్రధాన ఆర్థిక వేత్త కార్మెన్ రెన్హర్ట్ గురువారం పేర్కొన్నారు. లాక్డౌన్ నియంత్రణలను ఎత్తివేస్తే వేగంగా వృద్ధి చోటుచేసుకుంటుందని, అయితే పూర్తి స్ధాయిలో ఆర్థిక వ్యవస్థ రికవరీకి ఐదేళ్లు పట్టవచ్చని మాడ్రిడ్‌లో జరిగిన ఓ వీడియో కాన్ఫరెన్స్‌లో రెన్హర్ట్ వ్యాఖ్యానించారు. కరోనా సంక్షోభంతో నెలకొన్న మాంద్యం కొన్ని దేశాల్లో అత్యధిక కాలం ఉంటుందని, రికవరీలో అసమానతలు ఉంటాయని అన్నారు. సంపన్న దేశాల కంటే పేద దేశాలు ఎక్కువగా దెబ్బతింటాయని ఆమె చెప్పుకొచ్చారు. కరోనా సంక్షోభంతో గత ఇరవై సంవత్సరాల్లో తొలిసారిగా ప్రపంచవ్యాప్తంగా పేదరిక శాతం పెరిగిందని ఆమె వెల్లడించారు. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు మూడు కోట్లకు చేరువవగా, వ్యాధి బారినపడి 2.3 కోట్ల మంది కోలుకున్నారు. మహమ్మారి సోకి మరణించిన వారి సంఖ్య 9.45 లక్షలకు పెరిగింది. మరోవైపు మహమ్మారి నిరోధానికి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో అభివృద్ధి చేస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో వివిధ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. చదవండి : కోవిడ్-19 వ్యాక్సిన్‌పై కీలక ప్రకటన