వాషింగ్టన్: భారత్ 2023–24 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాలను ప్రపంచబ్యాంక్ 30 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది. దీనితో ఈ అంచనా 6.6 శాతం నుంచి 6.3 శాతానికి చేరింది. అధిక ద్రవ్యోల్బణం వల్ల ప్రైవేటు వినియోగం తగ్గడం, ప్రభుత్వ రుణ వ్యయాలు, ద్రవ్యలోటు భయాల వంటి అంశాలు తమ అంచనాల కోతకు కారణమని ప్రపంచ ఆర్థిక అంశాలకు సంబంధించి విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది.
అయితే సేవల రంగం పటిష్టంగా ఉండడం భారత్‌కు కలిసి వచ్చే అంశంగా వివరించింది. కాగా 2022లో ప్రపంచ వృద్ధి 3.1 శాతం ఉంటే, 2023లో ఇది 2.1 శాతానికి తగ్గుతుందని కూడా తాజా నివేదికలో ప్రపంచ బ్యాంక్ అంచనావేసింది. ఇక చైనా కాకుండా మిగిలిన వర్థమాన దేవాల ఎకానమీ గత ఏడాది 4.1 శాతం ఉంటే, 2023లో 2.9 శాతానికి తగ్గుతుందని కూడా పేర్కొంది.
ఇదీ చదవండి: గుడ్ న్యూస్: తనఖా లేకుండా రూ.800 కోట్ల రుణాలు
Comments
Please login to add a commentAdd a comment