ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా అజయ్ బంగా భారత్ పర్యటనకు వస్తున్నారు. వచ్చే వారం అహ్మదాబాద్ కేంద్రంగా జీ20 ఆర్ధిక మంత్రులు, కేంద్ర బ్యాంక్ గవర్నర్ల ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అజయ్ బంగా పాల్గొననున్నారు.
63ఏళ్ల ఇండో- అమెరిక్ అజయ్ బంగా ఈ ఏడాది జూన్‌లో వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వికరించారు. అంతేకాదు, ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి అనే రెండు ప్రపంచ ఆర్థిక సంస్థలకు అధిపతిగా ఉన్న మొదటి వ్యక్తిగా నిలిచారు.
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఈ పదవికి నామినేట్ చేసిన తర్వాత ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు బంగాను మేలో ఐదేళ్ల కాలానికి ప్రపంచ బ్యాంక్ 14వ అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బంగా భారత్‌కు రావడం ఇదే తొలిసారి.
Comments
Please login to add a commentAdd a comment