Ajay Banga
-
'వర్క్ లైఫ్ బ్యాలెన్స్'పై ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడి అమూల్యమైన సలహాలు.!
ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు, మాస్టర్ కార్డ్ మాజీ సీఈవో అజయ్ బంగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఛాలెంజ్‌పై అమూల్యమైన సలహాలు సూచనలందించారు. నిజానికి వర్క్‌లైఫ్ బ్యాలెన్స్ అనేది పూర్తిగా వ్యక్తిగతానికి సంబంధించిందని అన్నారు. ఎందుకంటే ఇది వ్యక్తి నుంచి వ్యక్తికి గణనీయంగా మారుతుంది. కొంతమంది వ్యక్తులు ప్రతిరోజూ సుమారు 12 నుంచి 18 గంటలు సమతుల్యంగా పనిచేయగా, మరికొందరూ ఆరుగంటలకు పైగా కష్టపడతారు. కాబట్టి ఇక్కడ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది పూర్తిగా వ్యక్తిగతం అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరూ తమకు తాముగా నిర్వర్తించాల్సిన బాధ్యత అని నొక్కి చెప్పారు. అలాగే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సాధించడం అనేది రెండు కీలక అంశాలపై ఆధారపడి ఉంటుందన్నారు. అవేంటంటే....పనిని ప్రేమించడం, ప్రియమైన వారి కోసం సమయాన్ని కేటాయించడం. దీని అర్థం పనిని ఆస్వాదించినట్లయితే కష్టపడి పనిచేయడం అనేది సాధ్యమవుతుంది. లేదంటే అదోక జర్నీలా సాగుతుంది అంతే. లేదా ఆ పని నచ్చనట్లయితే మీకు నచ్చిన పనిని చేసేందుకు ప్రయత్నించండి అప్పుడూ పని-జీవితంపై బ్యాలెన్స్ సాధించగలుగుతారని చెబుతున్నారు బంగా. దీంతోపాటు కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాల్లో మీ వంతు పాత్ర పోషించేలా పాలుపంచుకోవడం, వాళ్లతో గడిపేలా కొంత సమయం కేటాయించడం వంటివి చేయడం కూడా అత్యంత ముఖ్యం. మనవాళ్లకు అవసరమైనప్పుడూ పక్కనే మనం లేనప్పుడూ ఏవిధంగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సాధించగలుగుతారు. అందరూ కూడా మొబైల్ పరికరాలకి ప్రాధాన్యత ఇవ్వకండి, దానితోనే అందరితోనూ టచ్‌లో ఉన్నామని అస్సులు భావించొద్దు". అని సూచిస్తున్నారు బంగా. వ్యక్తిగతంగా మీ వాళ్లతో స్పెండ్ చేయండి లేదా వ్యక్తిగత చర్యలకి ప్రాధాన్యత ఇవ్వండని చెబుతున్నారు. ఇక్కడ సాంకేతికత మనుషుల మధ్య ఉన్న కనెక్షన్లను దూరం చేస్తుందనేది గ్రహించండి. ఇది మీ వ్యక్తిగత జీవితంలోకి చొరబడకుండా జాగ్రత్త పడండి. అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సాధించాలంటే కొన్ని సరిహద్దుల అవసరాన్ని నొక్కి చెబుతూ.. హెచ్చరించారు బంగా. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. Former Mastercard CEO, Ajay Banga on work-life balance: pic.twitter.com/Hi3liSr5of— Business Nerd 🧠 (@BusinessNerd_) October 13, 2024 (చదవండి: 50 గంటల్లో 16 వేల కేలరీల ఫాస్ట్ ఫుడ్ ఛాలెంజ్..కట్‌చేస్తే..!) -
తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యతలు భేష్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో ప్రభుత్వ ప్రాధాన్యతలు బాగున్నాయని ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం ప్రశంసించింది. గత నెలలో వాషింగ్టన్లో ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భేటీ అయిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తదుపరి చర్చల కోసం ప్రపంచబ్యాంకు దక్షిణాసియా ప్రాంత ఉపాధ్యక్షుడు మార్టీన్ రైజర్ నేతృత్వంలో వరల్డ్ బ్యాంక్ కంట్రీ ఆపరేషన్ హెడ్ పాల్ ప్రోసీ, అర్బన్ ఇన్ఫ్రా, ప్రాజెక్ట్ లీడ్ నటాలియా కె, డిజిటల్ డెవలప్మెంట్ సీనియర్ స్పెషలిస్ట్ మహిమాపత్ రే శనివారం హైదరాబాద్ వచ్చారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రితో వారు సమావేశమయ్యారు.ఈ సందర్భంగా పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి, విద్యా, వైద్య, సాగునీటి రంగాలను తమ ప్రభుత్వ ప్రాధాన్యాలుగా పెట్టుకున్నామని, ఆయా రంగాల్లో తాము తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వారికి వివరించారు. తాము ప్రాధాన్యంగా తీసుకుంటున్న ప్రాజెక్టులకు ఆర్థిక సహకారంతో పాటు అత్యుత్తమ ప్రమాణాలతో తెలంగాణ ప్రాజెక్టులు నిలిచేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. విద్యా, వైద్య రంగాల్లో రేవంత్‌రెడ్డి దార్శనికత బాగుందని, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని మార్టీన్ రైజర్ ప్రశంసించారు. ప్రపంచ బ్యాంకు ఏ రంగాలను ప్రాధాన్య అంశాలుగా ఎంచుకుందో అవే తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్య అంశాలుగా ఉన్నాయని మార్టిన్ రైజర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి సహకరించేందుకు తాము ఆసక్తిగా ఉన్నామని ఆయన తెలిపారు. సమావేశంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పాల్గొన్నారు.‘ఏటీసీల్లో సిబ్బంది కొరతను అధిగమించాలి’రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో సిబ్బంది కొరతను అధిగమించాలని సీఎం ఎ.రేవంత్ అధికారులను ఆదేశించారు. శనివారం సచివాల యంలో కార్మిక, ఉపాధి కల్పన శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్న నేపథ్యంలో సిబ్బంది కొరత లేకుండా చూడాలని స్పష్టం చేశారు.ప్రస్తుత ఇండస్ట్రీ అవసరాలకనుగుణంగా సిలబస్‌ను అప్‌గ్రేడ్ చేయాలని, మార్కెట్ అవసరాలకనుగుణంగా ఏటీసీల్లో సిలబస్ ఉండాలని, ఈ మేరకు సిలబస్ మార్పునకు ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించి నిపుణుల సలహాలు, సూచనలు స్వీకరించాలని ఆదేశించారు. వృత్తి నైపుణ్యం అందించే ఏటీసీలను, పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొచ్చేలా విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు. సమావేశంలో సీ.ఎస్ శాంతికుమారి, కారి్మక శాఖ ముఖ్యకార్యదర్శి సంజయ్ కుమార్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
భాగస్వామ్యానికి సిద్ధం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికల్లో భాగస్వామ్యం పంచుకునేందుకు తాము సంసిద్ధమని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. ఈ మేరకు పలు అంశాలపై ఆసక్తి చూపింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అక్కడ ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగాతో ప్రత్యేకంగా సమావేశమై వివిధ అంశాలపై గంట పాటు చర్చించారు. తెలంగాణలో స్కిల్ డెవలప్మెంట్, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, నెట్ జీరో సిటీ, ఆరోగ్య సంరక్షణ, డయాగ్నస్టిక్స్, హెల్త్ ప్రొఫైల్ రంగాల్లో ప్రపంచ బ్యాంకుతో భాగస్వామ్యానికి సంబంధించి ఈ భేటీలో సంప్రదింపులు జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టే వివిధ ప్రాజెక్టులపై సంయుక్తంగా రోడ్ మ్యాప్ రూపొందించాలని నిర్ణయించారు. ప్రజల జీవన ప్రమాణాలు, పర్యావరణం, జీవనోపాధి, నైపుణ్యాల వృద్ధి, ఉద్యోగాలు, ఆర్థిక సుస్థిరత తదితర అంశాలపైనా వారు చర్చించారు.యుద్ధ ప్రాతిపదికన అమలు చేస్తాం: రేవంత్తమ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఉందని.. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు వాటిని యుద్ధ ప్రాతిపదికన అమలు చేస్తామని సీఎం రేవంత్ తెలిపారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో పారదర్శకత పాటిస్తామని చెప్పారు. ప్రాంతాల వారీగా చేపట్టే ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలపై నిపుణుల బృందం ఏర్పాటు ఆలోచనను ప్రపంచ బ్యాంకు బృందంతో సీఎం పంచుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ అభివృద్ధికి రేవంత్ అనుసరిస్తున్న సమతుల దృక్పథం సానుకూల ఫలితాలు ఇస్తుందని ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరమేశ్వరన్ అయ్యర్ ప్రశంసించారు. గతంలో భారత్‌లో తమ భాగస్వామ్యంతో చేపట్టిన వివిధ ప్రాజెక్టులు సానుకూల ఫలితాలు అందించాయని గుర్తు చేశారు.అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో ఇదే తొలిసారి!ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో కలసి పనిచేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం ఇదే తొలిసారి అని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, స్కిల్ యూనివర్సిటీ, సిటిజన్ హెల్త్‌కేర్, హైదరాబాద్ 4.0 ఫ్యూచర్ సిటీ తదితరాలపై సీఎం ఇప్పటికే ప్రత్యేక దృష్టి సారించారని.. ఈ ప్రాజెక్టులకు, భవిష్యత్తు వ్యూహాలకు ప్రపంచ బ్యాంకు మద్దతు మరింత ఊతమిస్తుందని అంటున్నాయి. ఈ భేటీలో మంత్రి శ్రీధర్‌బాబు, సీఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.కొత్త ఆవిష్కరణల కోసం కార్నింగ్‌తో ఒప్పందంతెలంగాణలో నైపుణ్యాభివృద్ధితోపాటు నూతన ఆవిష్కరణలు లక్ష్యంగా దిగ్గజ సంస్థ కార్నింగ్ ఇన్ కార్పొరేషన్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం మేరకు అడ్వాన్స్డ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో కార్నింగ్ సంస్థ సహకారం అందిస్తుంది. ఫార్మాస్యూటికల్, కెమికల్ రంగాల్లో అత్యాధునిక పరిశోధన, అభివృద్ధి కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దడానికి తోడ్పడుతుంది. ఫార్మా, కెమికల్ పరిశ్రమలలో ఆవిష్కరణతోపాటు ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీలోనూ సహకారం అందించనుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఫార్మా గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం స్థాపనపైనా చర్చ జరిగింది. 2025లో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఈ మేరకు సీఎం రేవంత్ సమక్షంలో అవగాహన ఒప్పందంపై కార్నింగ్ ప్రతినిధులు సంతకాలు చేశారు.జీనోమ్ వ్యాలీలో రూ.400 కోట్లతో ‘వివింట్’ విస్తరణవివింట్ ఫార్మా కంపెనీ హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. రూ.400 కోట్ల పెట్టుబడితో నేరుగా వెయ్యి మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపింది. జీనోమ్ వ్యాలీలో ఇప్పటికే పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఉన్న వివింట్ సంస్థ తాజాగా సీఎం రేవంత్‌తో చర్చల అనంతరం విస్తరణ ప్రణాళికను వెల్లడించింది. అంకాలజీ, క్రిటికల్ కేర్ విభాగాలకు సంబంధించి నాణ్యమైన ఇంజెక్టబుల్స్, ఔషధాలను ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తుంది. -
స్థానిక వినియోగమే భారత్‌కు బలం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మందగమనం చూస్తున్న తరుణంలో, దేశీ వినియోగమే భారత్ ఆర్థిక వ్యవస్థకు సహజ ప్రేరణగా నిలుస్తోందని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా అభిప్రాయపడ్డారు. భారత్ జీడీపీ అధిక శాతం దేశీయ డిమాండ్‌పైనే ఆధారపడి ఉన్నట్టు చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో అజయ్ బంగా బుధవారం సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జీ20కి సంబంధించిన అంశాలు, ప్రపంచబ్యాంక్, భారత్ మధ్య సహకారంపై ఆర్థిక మంత్రితో చర్చించినట్టు చెప్పారు. ‘‘జీ20లో ఏం చేశామన్నది, అలాగే సమావేశం ఎలా కొనసాగిందన్నది మాట్లాడుకున్నాం. జీ20లో భాగంగా ప్రపంచబ్యాంక్, భారత్ ఇంకా ఏం చేయగలవన్నదీ చర్చించాం. ప్రపంచబ్యాంక్‌కు పోర్ట్‌ఫోలియో పరంగా భారత్ అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. ఈ మార్కెట్‌పై ఎంతో ఆసక్తి నెలకొంది’’అని బంగా వివరించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పనితీరుపై మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ఆరంభంలో మరింత క్షీణించేందుకు రిస్క్‌లు ఉన్నట్టు చెప్పారు. ‘‘భారత్ జీడీపీలో అధిక భాగం దేశీయ వినియోగం నుంచే సమకూరుతోంది. కనుక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరికొన్ని నెలల పాటు నిదానించినా, దేశీ వినియోగంతో భారత్ బలంగా నిలబడుతుంది’’అని బంగా పేర్కొన్నారు. జీ20 సమావేశంలో పాల్గొనేందుకు గాను భారత సంతతికి చెందిన అజయ్ బంగా ఇక్కడకు విచ్చేశారు. గత నెలలోనే ఆయన ప్రపంచబ్యాంక్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. అనంతరం భారత్ పర్యటనకు తొలిసారి విచ్చేశారు. విజ్ఞానం, టెక్నాలజీ అంతరాలను తగ్గించడమనేది భవిష్యత్ ఆర్థిక వృద్ధికి కీలకమని ఆర్థిక మంత్రి సీతారామన్ అన్నట్టు బంగా తెలిపారు. -
వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడి హోదాలో..భారత పర్యటనలో అజయ్ బంగా
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా అజయ్ బంగా భారత్ పర్యటనకు వస్తున్నారు. వచ్చే వారం అహ్మదాబాద్ కేంద్రంగా జీ20 ఆర్ధిక మంత్రులు, కేంద్ర బ్యాంక్ గవర్నర్ల ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అజయ్ బంగా పాల్గొననున్నారు. 63ఏళ్ల ఇండో- అమెరిక్ అజయ్ బంగా ఈ ఏడాది జూన్‌లో వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వికరించారు. అంతేకాదు, ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి అనే రెండు ప్రపంచ ఆర్థిక సంస్థలకు అధిపతిగా ఉన్న మొదటి వ్యక్తిగా నిలిచారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఈ పదవికి నామినేట్ చేసిన తర్వాత ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు బంగాను మేలో ఐదేళ్ల కాలానికి ప్రపంచ బ్యాంక్ 14వ అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బంగా భారత్‌కు రావడం ఇదే తొలిసారి. -
ఇండియాకు కేఎఫ్సి, పిజ్జా హట్ రావడానికి కారణం ఇతడే..!
యావత్ భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి, మాస్టర్ కార్డ్ మాజీ సీఈఓ 'అజయ్ బంగా' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన 2023 జూన్ 02 నుంచి వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే అజయ్ బంగా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రపంచ బ్యాంకు కొత్త అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించనున్న అజయ్ బంగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసి, ఢిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టభద్రుడయ్యాడు. చదువు పూర్తయిన తరువాత 1981లో నెస్లేతో ఉద్యోగ జీవితం ప్రారంభించారు. ఆ తరువాత పెప్సికోలో కూడా పనిచేశారు. 2010లో అజయ్ బంగా మాస్టర్ కార్డ్‌లో ప్రెసిడెంట్ బాధ్యతలను, ఆ తరువాత సీఈఓగా నియమితులయ్యారు. 2020లో ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ICC) ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఈయన ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ జనరల్ అట్లాంటిక్‌లో వైస్ చైర్మన్‌గా ఉన్నారు. (ఇదీ చదవండి: 1998లో ప్రభంజనం సృష్టించిన టాటా ఇండికా - అరుదైన వీడియో) భారతదేశానికి కేఎఫ్సి, పిజ్జా హట్ వంటివి రావడం వెనుక అజయ్ బంగా హస్తం ఉందని కొంతమంది భావిస్తున్నారు. నివేదికల ప్రకారం అజయ్ బంగా మొత్తం ఆస్తుల విలువ 2021లో 206 మిలియన్ డాలర్లు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 1689 కోట్లకంటే ఎక్కువ. అంతే కాకుండా 11,31,23489 విలువైన మాస్టర్ కార్డ్ స్టాక్లను కలిగి ఉన్నట్లు సమాచారం. మాస్టర్ కార్డ్‌లో ఆయన జీతం రోజుకి 52 లక్షలు కావడం గమనార్హం. (ఇదీ చదవండి: ఈ ప్లాన్ కింద 5జీబీ డేటా ఫ్రీ - కేవలం వారికి మాత్రమే!) పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన అజయ్ బంగా తండ్రి భారత సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్. ఈ కారణంగానే దేశంలో చాలా ప్రాంతాలను తిరగాల్సి వచ్చింది. మొత్తానికి ఈ రోజు భారతదేశం మొత్తం గర్వించే స్థాయికి ఎదిగాడు. ప్రపంచ బ్యాంక్ అజయ్ బంగాతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తోంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ సందేహాలను, అభిప్రాయాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా అజయ్ బంగా: వేతనం, నెట్‌వర్త్ ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: భారతీయ-అమెరికన్ ప్రస్తుతం ఈక్విటీ కంపెనీ జనరల్ అట్లాంటిక్క వైస్ చైర్మన్ అజయ్‌పాల్ సింగ్ బంగా ప్రపంచ బ్యాంకు తదుపరి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం విశేషంగా నిలిచింది. అందరి అంచనాలకు తగినట్టుగానే భారతీయ సంతతికి చెందిన అజయ్ బంగా ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి భారతీయ-అమెరికన్‌గా రికార్డు సృష్టించారు. ఈ నేపథ్యంలో బంగా వేతనం, ఆయన నెట్‌వర్త్ తదితర అంశాలు ఆసక్తికరంగా మారాయి. ప్రపంచ బ్యాంక్ 14వ అధ్యక్షుడిగా జూన్ 2న బాధ్యతలు స్వీకరించనున్న అజయ్ బంగా ఐదేళ్ల కాలానికి పనిచేయనున్న సంగతి తెలిసిందే. పంజాబ్‌కు చెందిన సిక్కు కుటుంబానికి చెందిన బంగా మహారాష్ట్ర, పూణేలోని ఖడ్కీ కంటోన్మెంట్లో జన్మించారు. తండ్రి హర్భజన్ బంగా. ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్‌గా పనిచేశారు. దీంతో ఇండియాలో పలు నగరాల్లో అతని విద్యాభ్యాసం సాగింది. ముఖ్యంగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు. ఢిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ నుండి ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (ఆనర్స్) పొందారు. ఆ తర్వాత అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుండి పీజీ చేశారు. బంగా తన కరియర్‌ను 1981లో నెస్లేతో ప్రారంభించారు. అక్కడ 13 సంవత్సరాలు తన సేవలందించారు. అలాగే సిటీ గ్రూప్‌లోనూ పనిచేశారు. మాస్టర్ కార్డ్ సీఈవో గానూ, డచ్ ఇన్వెస్ట్మెంట్స్ హోల్డింగ్ ఫర్మ్ ఎక్సోర్‌కు ఛైర్మన్‌గా కూడా పనిచేశారు . అలాగే ది సైబర్ రెడీనెస్ ఇన్స్టిట్యూట్ కో -ఫౌండర్ అయిన అజయ్ బంగా ఎకనామిక్ క్లబ్ ఆఫ్ న్యూయార్క్ వైస్ చైర్ గానూ, అప్పటి అధ్యక్షుడు అమెరికా బరాక్ ఓబామా అండ్ నేషనల్ సైబర్‌సెక్యూరిటీ కమిషన్ సభ్యునిగా ,ట్రేడ్ పాలసీకి సంబంధించిన ఒబామా సలహా కమిటీలో సభ్యుడినూ కూడా పనిచేశారు. ఫార్చ్యూన్ ప్రపంచ ప్రముఖ వ్యాపారవేత్తల జాబితాలో కూడా ఉన్నారు. 2016లో ఇంటర్నేషనల్ అండర్ స్టాండింగ్ బిజినెస్ కౌన్సిల్ నుంచి లీడర్షిప్ అవార్డు అందుకున్నారు. 2016లో భారత ప్రభుత్వం నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీతో సత్కరించింది. అజయ్ బంగా: నికర విలువ, జీతం సీఎన్‌బీసీ ప్రకారం 2021 నాటికి అజయ్ బంగా నికర విలువ 206 మిలియన్ డాలర్లు (రూ.1700 కోట్లు). మాస్టర్‌కార్డ్ సీఈవోగా బంగా వార్షిక సంపాదన 23,250,000 డాలర్లు. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.1.92 బిలియన్లు. దీని ప్రకారం రోజుకురూ.52 లక్షల వేతనాన్ని ఆయన అందుకున్నారు. అజయ్ బంగా యాజమాన్యంలోని మాస్టర్ కార్డ్ స్టాక్‌ల విలువ 113,123,489 డాలర్లు. గత 13 సంవత్సరాలుగా వేల డాలర్ల విలువైన స్టాక్లను విక్రయించారు. కాగా ప్రపంచ బ్యాంక్ 13వ ప్రెసిడెంట్ డేవిడ్ ఆర్ మాల్పాస్ వార్షిక వేతనం సుమారు 390,539 డాలర్లు. -
భారతీయ అమెరికన్ల విలువ పెంచిన ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగా ఎన్నిక
ప్రపంచ దేశాలు అనేక ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలో వాటికి దిశానిర్దేశం చేసే ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా భారతీయ అమెరికన్ అజయ్ బంగా ఎన్నికవడం ఇండియాకు గర్వకారణం. ఇండియాలోని పుణె ఖడ్కీ కంటోన్మెంటులో పంజాబీ సిక్కు సైనికాధికారి కుటుంబంలో జన్మించిన 63 ఏళ్ల అజయ్ పాల్ సింగ్ బంగా తర్వాత దేశంలోని అనేక నగరాల్లో విద్యాభ్యాసం చేశారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూలులో కూడా చదివిన బంగా కొన్నేళ్ల క్రితం అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. అమెరికా పౌరుడయ్యారు. ఈ విషయం ఎందుకు చెప్పాల్సివచ్చిందంటే రెండో ప్రపంచయుద్ధం తర్వాత ప్రపంచ దేశాలను ఆదుకోవడానికి స్థాపించిన ప్రపంచ బ్యాంక్ గ్రూప్ అధ్యక్ష పదవికి కేవలం అమెరికన్లకు ఎన్నికయ్యే అవకాశం ఇవ్వడం, ఈ బ్యాంక్ జోడు సంస్థ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సారధి పదవిని ఐరోపా దేశీయుడికే ఇవ్వడం ఆనవాయితీ. సాధారణంగా ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష పదవి బ్యాంకు బోర్డ్ ఆఫ్ గవర్నర్ల ఏకాభిప్రాయ సాధనతో జరుగుతుంది. అయితే, ఈసారి 24 మంది బోర్డు సభ్యులు పాల్గొన్న ఓటింగ్ ద్వారా బంగా ఎన్నిక బుధవారం నిర్వహించారు. బోర్డులో సభ్యత్వం ఉన్న రష్యా ప్రతినిధి ఈ ఎన్నిక ఓటింగులో పాల్గొనలేదు. భారతదేశంలో పుట్టినాగాని కొన్నేళ్లు దేశంలో పనిచేసిన తర్వాత అమెరికా వెళ్లి అక్కడ పెప్సికో, మాస్టర్ కార్డ్ వంటి దిగ్గజ కంపెనీల్లో బంగా పనిచేశారు. అలా ఆయన అమెరికా పౌరుడు కావడంతో ప్రపంచ బ్యాంక్ సారధిగా ఎన్నికవడం వీలైంది. జూన్ 2 నుంచి ఐదేళ్లు పదవిలో జూన్ 2న కొత్త పదవి స్వీకరించే బంగాను ఈ పదవికి బుధవారం ఎన్నుకునే ముందు సోమవారం ప్రపంచ బ్యాంక్ బోర్డు సభ్యులు నాలుగు గంటలపాటు ఆయనను ఇంటర్వ్యూ చేశారు. ఈ అత్యున్నత పదవికి బంగాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫిబ్రవరి నెలాఖరులో ప్రతిపాదన రూపంలో నామినేట్ చేశారు. ఆయన నామినేషన్ ను బ్యాంకు బోర్డు ఖరారు చేయడం భారతీయ అమెరికన్లతో పాటు భారతీయులకు గర్వకారణంగా భావిస్తున్నారు. గత పాతికేళ్లలో పలువురు భారతీయ అమెరికన్లు అనేక అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు, సంస్థల అధిపతులుగా నియమితులై, విజయవంతంగా వాటిని నడుపుతూ మంచి పేరు సంపాదిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ జూన్ ఒకటి వరకూ పదవిలో ఉంటారు. ఆయన గతంలో అమెరికా ఆర్థికశాఖలో ఉన్నతోద్యోగిగా పనిచేసిన గొప్ప ఆర్థికవేత్త. మాల్పాస్ మాదిరిగానే బంగా కూడా ఐదేళ్లు బ్యాంక్ ప్రెసిడెంట్ గా పదవిలో జూన్ 2 నుంచి కొనసాగుతారు. 1944 నుంచి ఇప్పటి వరకూ ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ పదవిని 13 మంది అమెరికన్లు నిర్వహించారు. బాంగాకు ముందు ఆసియా దేశమైన దక్షిణ కొరియాలో పుట్టిన జిమ్ యాంగ్ కిమ్ (2012–2019) కూడా ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా పనిచేశారు. బంగా మాదిరిగానే 1959లో జన్మించిన యాంగ్ ఐదేళ్ల వయసులో తన కుటుంబంతో పాటు అమెరికా వలసపోయి స్థిరపడి అమెరికా పౌరుడయ్యారు. గతంలో ఈ బ్యాంక్ అధ్యక్షులుగా పనిచేసిన ఆర్థికరంగ నిపుణుల్లో యూజీన్ ఆర్ బ్లాక్ (1949–1962), రాబర్ట్ ఎస్ మెక్ నమారా (1968–1981)లు 12 ఏళ్లు దాటి పదవిలో ఉండడం విశేషం. మెక్ నమారా కాలంలోనే ఈ అంతర్జాతీయ బ్యాంక్ తన కార్యకపాలు విస్తరించింది. బ్యాంకు సిబ్బందితోపాటు అనేక దేశాలకు రుణాలు ఇవ్వడం పెంచింది. పేదరిక నిర్మూలనపై దృష్టి పెట్టింది. మెక్ నమారా ఈ బ్యాంక్ ప్రెసిడెంట్ గా ఎన్నికవడానికి ముందు అమెరికా రక్షణ మంత్రిగా పనిచేశారు. మొదటిసారి ఒక భారతీయ అమెరికన్ ఈ ప్రతిష్ఠాత్మక పదవిని చేపట్టడం భారతీయులందరికీ స్ఫూర్తిదాయకమని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేదరికం తగ్గించి, సంపద విస్తరించడానికి కృషి చేసే అత్యంత ముఖ్యమైన సంస్థల్లో ఒకటైన ప్రపంచబ్యాంక్ సారధిగా బంగా అత్యధిక సభ్యుల ఆమోదంతో ఎన్నికవడం హర్షణీయమని అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ అభినందించడం భారతీయ అమెరికన్ల సమర్ధతకు అద్దంపడుతోంది. విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సిపి, రాజ్యసభ ఎంపీ -
ప్రపంచ బ్యాంక్ అధ్యక్షునిగా అజయ్ బంగా
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా పలు దిగ్గజ సంస్థలకు సారథులుగా వెలుగొందుతున్న భారతీయుల జాబితాలో ప్రముఖ భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త అజయ్ బంగా నిలిచారు. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షునిగా ఎంపికయ్యారు! ఆయన నియామకాన్ని ఖరారుచేస్తున్నట్లు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు బుధవారం ప్రకటించారు. జూన్ రెండో తేదీ నుంచి ఐదేళ్లపాటు అధ్యక్షునిగా బంగా సేవలందిస్తారని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఒక భారతీయ అమెరికన్ అధ్యక్షుడు ప్రపంచ బ్యాంక్ పగ్గాలు చేపట్టడం ఇదే తొలిసారి. 63 ఏళ్ల బంగాను ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఈ పదవికి నామినేట్‌చేశారు. బంగా జనరల్ అట్లాంటిక్ సంస్థ ఉపాధ్యక్షునిగా, మాస్టర్‌కార్డ్ సీఈవోగా చేశారు. కేంద్రం 2016లో ఆయనను పద్మశ్రీతో సత్కరించింది. -
వరల్డ్ బ్యాంక్ అధ్యక్ష బరిలో ఆయనొక్కరే.. అజయ్ బంగా ఎన్నిక లాంఛనమే!
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన అజయ్ బంగా ఎన్నికకు మార్గం సుగమమైంది.ప్రపంచ బ్యాంక్ గ్రూప్ తదుపరి ప్రెసిడెంట్ పదవికి నామినేషన్ల సమర్పణకు గడువు మార్చి 29తో ముగిసింది. బరిలో అజయ్ బంగా ఒక్కరే నిలిచారు. దీంతో వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక లాంఛనమే కానుంది. ఇతర అభ్యర్థులెవరూ నామినేట్ కానందున తదుపరి అధ్యక్షుడిగా అజయ్ బంగా నామినేషన్‌ను మాత్రమే పరిశీలిస్తామని ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డు తెలిపింది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో విజయవంతమైన సంస్థలకు నాయకత్వం వహించిన విస్తృత అనుభవం కలిగిన వ్యాపార నాయకుడైన అజయ్ బంగాను ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా నామినేట్ చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫిబ్రవరిలో ప్రకటించారు. (ఆ మందులు వాడే వారికి ఊరట.. దిగుమతి సుంకం మినహాయింపు) అజయ్ బంగా ప్రస్తుతం జనరల్ అట్లాంటిక్‌లో వైస్ ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. గతంలో ఆయన మాస్టర్‌కార్డ్‌కు ప్రెసిడెంట్, సీఈవోగా చేశారు. సెంట్రల్ అమెరికా కోసం పార్టనర్షిప్ కో-చైర్‌గా వైస్ ప్రెసిడెంట్ హారిస్‌తో కలిసి పనిచేశారు. ప్రపంచ బ్యాంక్ అధిపతిగా కాబోతున్న మొట్ట మొదటి భారతీయ అమెరికన్ అజయ్ బంగా ఇటీవల భారత్ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లను కలవాల్సి ఉంది. అయితే ఆయనకు కోవిడ్ సోకడంతో ఆ సమావేశాలన్నీ రద్దయ్యాయి. మహారాష్ట్రలోని పుణె నగరంలో జన్మించిన బంగా ఢిల్లీ యూనివర్సిటీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్-అహ్మదాబాద్ నుంచి మేనేజ్మెంట్లో పట్టా పొందారు. 2016లో అజయ్బంగాను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. -
వరల్డ్ బ్యాంక్ కాబోయే ప్రెసిడెంట్‌కు కోవిడ్
ప్రపంచ బ్యాంకు కాబోయే అధ్యక్షుడు (అమెరికన్ నామినీ) భారతీయ అమెరికన్ అజయ్ బంగాకు కోవిడ్ సోకింది. మూడు వారాల ప్రపంచ పర్యటనలో భాగంగా మార్చి 23న అజయ్ బంగా ఢిల్లీ వచ్చారు. ఈ సందర్భంగా చేసిన రొటీన్ పరీక్షల్లో ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణైంది. అజయ్ బంగా ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ వెల్లడించింది. ఇదీ చదవండి: ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్: ఆలస్యమైతే రూ. 5 వేలు కట్టాలి! రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్ వచ్చిన అజయ్ బంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ తదితరులతో సమావేశం కావాల్సి ఉంది. అయితే కోవిడ్ సోకడంతో ఆ సమావేశాలన్నీ రద్దు అయ్యాయి. ఈ మేరకు ఆర్థిక శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అజయ్ బంగా మూడు వారాల ప్రపంచ పర్యటనలో భారత్ సందర్శన చివరిది. ఆఫ్రికా నుంచి ప్రారంభమైన ఆయన పర్యటన యూరప్, లాటిన్ అమెరికా మీదుగా ఆసియాకు చేరుకుంది. తన గ్లోబల్ లిజనింగ్ టూర్లో బంగా.. ఆయా ప్రాంతాల్లో సీనియర్ ప్రభుత్వ అధికారులు, వాటాదారులు, వ్యాపార నాయకులు, వ్యవస్థాపకులు, పౌర సమాజంతో సమావేశమవుతూ వస్తున్నారు. దేశంలో గత కొద్ది రోజులుగా ఇన్ఫ్లూయెంజాతో పాటు కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. బుధవారం నాటి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. దేశంలో 1,134 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో క్రియాశీల కేసులు 7,026కి పెరిగాయి. -
భారత్‌లో వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ 'అజయ్ బంగా'.. ప్రముఖులతో సమావేశాలు
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్‌గా అమెరికా ప్రతిపాదించిన అజయ్ బంగా తాజాగా భారత్ పర్యటనకు వచ్చారు. రెండు రోజుల పర్యటనలో (మార్చి 23, 24) భాగంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ తదితరులతో సమావేశం కానున్నారు. భారత్ అభివృద్ధి ప్రణాళికలు, ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ఆర్థికాభివృద్ధిపరమైన సవాళ్లు వంటి అంశాలపై ఈ సందర్భంగా చర్చించనున్నారని అమెరికా ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే, నేషనల్ స్కిల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో కలిసి ఏర్పాటు చేసిన వృత్తి విద్యా కోర్సుల సంస్థల నెట్వర్క్ ’లెర్నెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్’ను కూడా బంగా సందర్శించనున్నారు. దీనికి ప్రపంచ బ్యాంక్ పాక్షికంగా నిధులు సమకూర్చింది. మాస్టర్‌కార్డ్ చీఫ్‌గా ఉన్న బంగా పేరును ప్రపంచ బ్యాంక్‌కు కొత్త ప్రెసిడెంట్‌గా ప్రతిపాదించిన వెంటనే భారత ప్రభుత్వం మద్దతు తెలిపిందని అమెరికా ఆర్థిక శాఖ తెలిపింది. ఇప్పటికే బంగ్లాదేశ్, ఫ్రాన్స్, ఈజిప్ట్, జర్మనీ, ఇటలీ, సౌదీ అరేబియా, బ్రిటన్ తదిన్‌దేశాలు కూడా మద్దతు ప్రకటించినట్లు వివరించింది. తన అభ్యర్థిత్వానికి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల్లో భాగంగా ఆయన మూడు వారాలుగా వివిధ దేశాలను సందర్శిస్తున్నారు. ఆఫ్రికాతో ప్రారంభించి యూరప్, లాటిన్ అమెరికా, ఆసియా దేశాల తర్వాత ఆఖరుగా భారత్ వచ్చారు. -
అజయ్ బంగా హెచ్‌పీఎస్ విద్యార్థే
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా నామినేట్ అయిన భారత–అమెరికన్ అజయ్ బంగా బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్) విద్యార్థే. మాస్టర్ కార్డ్ మాజీ సీఈవో అజయ్ బంగా 1976 బ్యాచ్‌కు చెందిన హెచ్‌పీఎస్ విద్యార్థి. ప్రస్తుత వరల్డ్ బ్యాంకు ప్రెసిడెంట్ మాల్పాస్ తర్వాత అజయ్ నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ‘మా పూర్వ విద్యార్థుల్లో మరొకరు ప్రపంచ సంస్థలో ఉన్నత స్థాయికి చేరుకోవటం పాఠశాలకు గర్వకారణం’అని హెచ్‌పీఎస్ సొసైటీ ప్రెసిడెంట్ గుస్తీ జే నోరి యా తెలిపారు. కాగా, ప్రపంచంలోని ప్రము ఖ కంపెనీల అధినేతలు హెచ్‌పీఎస్ విద్యార్థులే కావటం విశేషం. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల, అడోబ్ సీఈవో శంతను నారాయణ్‌తో పాటు కావియం కో–ఫౌండర్ సయ్యద్ భష్రత్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, క్రికెటర్ కామెంటర్ హర్షా భోగ్లే, ప్రముఖ సినీనటులు రానా దగ్గుపాటి, అక్కి నేని నాగార్జున, రామ్‌చరణ్, ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, సమైఖ్యాంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వంటి ఎందరో ప్రముఖులు హెచ్‌పీఎస్ పూర్వ విద్యార్థులు. -
Ajay Banga ప్రపంచబ్యాంకు నూతన అధ్యక్షుడు: బైడెన్ ప్రతిపాదన
వాషింగ్టన్: ప్రపంచబ్యాంకు అధ్యక్షుడుగా భారత సంతతికి చెందిన, మాస్టర్‌కార్డ్ మాజీ సీఈఓ అజయ్ బంగా నామినేట్ అయ్యారు. ప్రస్తుత చీఫ్ డేవిడ్ మాల్పాస్ ముందస్తుగా పదవీ విరమణ చేయనున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో మాస్టర్‌కార్డ్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అజయ్ బంగాను ప్రపంచబ్యాంకుకు నాయకత్వం వహించేందుకు నామినేట్ చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ గురువారం తెలిపారు. అమెరికా ప్రపంచ బ్యాంక్ అతిపెద్ద వాటాదారుగా ఉన్న సంగతి తెలిసిందే. "వాతావరణ మార్పులతో సహా మన కాలంలోని అత్యంత అత్యవసర సవాళ్లను పరిష్కారానికి సంబంధించి పబ్లిక్-ప్రైవేట్ వనరులను సమీకరణలో బంగాకు అపారమైన అనుభవం ఉందని బిడెన్ ఒక ప్రకటనలో తెలిపారు. క్లిష్ట సమయంలో ఉన్న ప్రపంచ బ్యాంకును లీడ్ చేసేందుకు అజయ్ ప్రత్యేక అర్హతలున్నాయని ఆయన ప్రశంసించారు. వరల్డ్ బ్యాంకు ప్రెసిడెంట్ ఎంపిక కోసం అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. మార్చి 29 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. మహిళా అభ్యర్థులకు ఎక్కువ ప్రోత్సాహనిస్తున్నట్టు బ్యాంక్ పేర్కొంది. దీనికితోడు మరొక ప్రధాన వాటాదారు అయిన జర్మనీ 77 ఏళ్ల చరిత్రలో బ్యాంక్‌కు ఎన్నడూ మహిళ నాయకత్వం వహించనందున ఉద్యోగం మహిళకే చెందాలని పేర్కొంది. అజయ్ బంగా 1959 నవంబర్ 10 న పూణేలోని ఖడ్కీ కంటోన్మెంట్లో జన్మించారు. అజయ్ బంగా. ఢిల్లీ యూనివర్శిటీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ నుండి ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (ఆనర్స్) డిగ్రీ, అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుండి మేనేజ్మెంట్లో పీజీపీ పట్టా పొందాడు.భారత ప్రభుత్వం 2016లో బంగాకు పద్మశ్రీ పౌర గౌరవాన్ని అందించింది. అజయ్ బంగా ప్రస్తుతం ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్‌లో వైస్ ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. అతను గతంలో మాస్టర్ కార్డ్‌లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా సేవలందించారు.12 సంవత్సరాల తరువాత డిసెంబర్ 2021లో మాస్టర్ కార్డ్ కు పదవీ విరమణ చేసారు. కాగా పదవీకాలం ముగిసేందుకు మరో ఏడాది సమయం ఉండగానే ప్రపంచబ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ రాజీనామా చేయబోతున్నట్లు ఈనెల (ఫిబ్రవరి) ప్రకటించారు.జూన్ నుంచి బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. -
‘ఫార్చూన్’ బిజినెస్ పర్సన్.. నాదెళ్ల
శాన్ ఫ్రాన్సిస్కో: తెలుగు తేజం, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల.. ఈ ఏడాది ‘ఫార్చూన్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్–2019’ జాబితాలో ప్రథమ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ధైర్యంగా లక్ష్యాలను చేరుకోవడం, అసాధ్యాలను సుసాధ్యం చేయడం, సృజనాత్మక పరిష్కార మార్గాలను కనుగొనడం వంటి కీలక అంశాల ఆధారంగా రూపొందించిన ఈ జాబితాలో మొత్తం 20 మంది పేర్లు ఉండగా.. వీరిలో ముగ్గురు భారతీయ సంతతికి చెందిన వారే ఉండడం విశేషం. ఇక తెలుగు వాడైన సత్య నాదెళ్ల తొలి స్థానంలో ఉండడం మరో విశేషం. వ్యూహాత్మక నాయకుడి పాత్రలో ఒదిగిపోయిన ఆయన.. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో విజయవంతంగా దూసుకుపోతూ కస్టమర్లలో నమ్మకాన్ని పెంచడం ద్వారా ఈ స్థానానికి చేరుకోగలిగారని ఫార్చూన్ మ్యాగజైన్ ఈ సందర్భంగా కొనియాడింది. తాజాగా 10 బిలియన్ డాలర్ల పెంటగాన్ క్లౌడ్ కాంట్రాక్టును అందుకోవడంలో నాదెళ్ల చూపిన చొరవ కంపెనీని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చిందని స్వయంగా ఆ సంస్థ స్వతంత్ర డైరెక్టర్లు చెప్పినట్లు వివరించింది. బిల్ గేట్స్ వలే వ్యవస్థాపకుడు, స్టీవ్ బాల్మెర్ వంటి సేల్స్ లీడర్ కాకపోయినప్పటికీ.. 2014లో ఆశ్చర్యకరంగా ఆయన ఎన్నిక జరిగింది. ఇటీవలే ప్రతిష్టాత్మక హార్వర్డ్ బిజినెస్ రివ్యూ(హెచ్బీఆర్) రూపొందించిన 10 అగ్రశేణి కంపెనీల సీఈఓల జాబితాలో నాదెళ్ల కూడా ఉన్నారు. బంగాకు 8వ స్థానం: ఫార్చూన్ జాబితాలో మరో ఇద్దరు భారతీయ సంతతికి చెందిన వారు స్థానం సంపాదించారు. మాస్టర్ కార్డ్ సీఈఓ అజయ్ బంగా 8వ స్థానంలో ఉండగా.. కాలిఫోర్నియా కంప్యూటర్ నెట్వర్కింగ్ సంస్థ అరిస్టా హెడ్ జయశ్రీ ఉల్లాల్ 18వ స్థానంలో నిలి చారు. 2వ స్థానంలో ఫోర్టెస్క్యూ మెటల్స్ గ్రూప్ సీఈఓ ఎలిజబెత్ గెయినెస్, చిపోటిల్ మెక్సికన్ గ్రిల్ సీఈఓ బ్రియాన్ నికోల్ 3వ స్థానంలో ఉన్నారు. సింక్రొనీ ఫైనాన్షియల్ సీఈఓ మార్గరెట్ కీనే (4), ప్యూమా సీఈఓ జోర్న్ గుల్డెన్ 5వ స్థానంలో నిలిచారు. -
ఫార్చ్యూన్ టాప్-50లో సత్య నాదెళ్ల, అజయ్ బంగా
న్యూయార్క్: బిజినెస్ మ్యాగజైన్ ఫార్చ్యూన్ రూపొందించిన ప్రపంచ టాప్ 50 బిజినెస్ లీడర్ల జాబితాలో భారత సంతతికి చెందిన అజయ్ బంగా, ఫ్రాన్సిస్ డి సౌజా, సత్య నాదెళ్లకు చోటు దక్కింది. ఈ జాబితాలో మాస్టర్ కార్డ్ అజయ్ బంగా ఐదవ స్థానంలో, కాగ్నిజంట్ ఫ్రాన్సిస్ డిసౌజా 16 వ స్థానంలో మైక్రోసాఫ్ట్ నాదెళ్ల 47వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో నైక్ కంపెనీకి చెందిన మైక్ పార్కర్ అగ్రస్థానంలో ఉన్నారు. ఈ ఏడాది బిజినెస్ పర్సన్ ఘనత కూడా పార్కర్కే దక్కింది. ఇక టాప్ 50 గ్లోబల్ బిజినెస్ లీడర్ల జాబితాలో రెండో స్థానంలో ఫేస్బుక్ మార్క్ జుకర బర్గ్ ఉన్నారు. -
ఫార్చూన్ సీఈవోల్లో సత్య నాదెళ్ల
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ సీఈవోల జాబితాలో ప్రవాస భారతీయులు ముగ్గురు చోటు దక్కిం చుకున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, మాస్టర్‌కార్డ్ సీఈవో అజయ్ బంగా, హర్మన్ ఇంటర్నేషనల్ చైర్మన్ దినేష్ పాలివాల్ ఈ జాబితాలో ఉన్నారు. 50 మంది కార్పొరేట్ దిగ్గజాలతో ఫార్చూన్ మ్యాగజైన్ ‘బిజినెస్‌పర్సన్ ఆఫ్ ది ఇయర్’ పేరిట రూపొందించిన లిస్టులో గూగుల్ సీఈవో ల్యారీ పేజ్ అగ్రస్థానంలో, యాపిల్ సీఈవో టిమ్ కుక్ రెండో స్థానంలో నిల్చారు. బంగా 28వ స్థానంలో, నాదెళ్ల 38వ స్థానంలో, పాలివాల్ 42వ స్థానంలో ఉన్నారు. ఇటు మార్కెట్లపరంగాను అటు రాజకీయాలపరంగాను అనేక ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ జాబితాలోని సీఈవోలు తమ కంపెనీలు ముందుకు దూసుకెళ్లేలా కృషి చేశారని ఫార్చూన్ పేర్కొంది. -
అత్యుత్తమ సీఈఓల్లో మాస్టర్‌కార్డ్ బంగా
* హార్వర్డ్ బిజినెస్ రివ్యూ ప్రపంచ టాప్-100 జాబితాలో 64వ ర్యాంక్ * భారత్ సంతతికి చెందిన ఎకైక వ్యక్తి... న్యూయార్క్: ప్రపంచంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన కంపెనీ సీఈఓల్లో మాస్టర్ కార్డ్ చీఫ్ అజయ్ బంగా చోటు దక్కించుకున్నారు. ప్రతిష్టాత్మక హార్వర్డ్ బిజినెస్ రివ్యూ(హెచ్బీఆర్) మ్యాగజైన్ రూపొందించిన ఈ ఏడాది టాప్-100 ప్రపంచ సీఈఓల్లో బంగా 64వ స్థానంలో నిలిచారు. అంతేకాదు.. భారత్‌లో జన్మించిన సీఈఓల్లో ఆయన ఒక్కరికి మాత్రమే ఈ జాబితాలో ర్యాంకు లభించడం విశేషం. దీర్ఘకాలంలో అద్భుత ఫలితాలు సాధించడం, వాటాదారులకు మంచి రాబడులు, కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ పెంపు వంటి నిర్దిష్ట అంశాలను ఇందుకు కొలమానంగా తీసుకున్నట్లు హెచ్‌బీఎస్ పేర్కొంది. 2010లో మాస్టర్‌కార్డ్ పగ్గాలను చేపట్టిన బంగా.. షేర్హోల్డర్లకు 169 శాతం లాభాలను అందించారని.. అదేవిధంగా కంపెనీ మార్కెట్ క్యాప్‌ను 66 బిలియన్ డాలర్ల మేర పెంచినట్లు తెలిపింది. కాగా, ర్యాం కింగ్స్‌లో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సీఈఓ జెఫ్రీ బెజోస్ అగ్రస్థానంలో నిలిచారు. తర్వాత స్థానాల్లో గిలీడ్ సెన్సైస్ సీఈఓ జాన్ మార్టిన్, సిస్కో సిస్టమ్స్ సీఈఓ జాన్ చాంబర్స్ రెండు, మూడు ర్యాంకులను చేజిక్కించుకున్నారు. ఇతర ముఖ్యాంశాలివీ.. * టాప్-100లో ఇద్దరు మహిళలకే చోటుదక్కింది. వెంటాస్ సీఈఓ డెబ్రా కఫారో(27), టీజేఎక్స్ చీఫ్ కరోల్ మేరోవిట్జ్(51) ఇందులో ఉన్నారు. * ర్యాంకింగ్స్‌లోని కంపెనీల్లో ఇతర దేశాలకు చెందిన సీఈఓలు 13 మంది ఉండగా.. వారిలో బంగా ఒకరు. టాప్-100 సీఈఓల్లో 29 మంది ఎంబీఏ గ్రాడ్యుయేట్లు. 24 మందికి ఇంజినీరింగ్‌లో అండర్గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ డిగ్రీలు ఉన్నాయి. * ఇంజినీరింగ్ విద్య వల్ల ప్రాక్టికల్(ఆచరణాత్మక) దృక్పథం అలవడుతుందని.. ఇది ఎలాంటి కెరీర్‌లోనైనా చోదోడుగా నిలుస్తుందని హార్వర్డ్ బిజినెస్ స్కూల్ డీన్ నితిన్ నోహ్రియా చెప్పారు. ముంబై ఐఐటీలో కెమికల్ ఇంజినీరింగ్ చేసిన నోహ్రియా కూడా భారతీయుడే కావడం గమనార్హం. -
మంగుళూరుకీ మల్టినేషనల్ కీ లింకేమిటి?
మీరు మంగుళూరు యూనివర్సిటీలో చదువుకున్నారా? అయితే మీకు విశ్వ విఖ్యాత మల్టినేషనల్ కంపెనీకి గ్లోబల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అయ్యే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. అవును. మైక్రోసాఫ్ట్ కి మెగా హెడ్ అయిన సత్య నాదెళ్ల మంగుళూరు యూనివర్సిటీలో చదువుకున్నాడు. అన్నీ కలిసొస్తే నోకియా కార్పొరేషన్ కీ మంగుళూరు యూనివర్సిటీ విద్యార్థే కాబోతున్నాడు. నోకియా టెలికామ్ ఎక్విప్ మెంట్ బిజినెస్ కి హెడ్ గా ఉన్న రాజీవ్ సూరి ఈ నెలాఖరుకి గ్లోబల్ హెడ్ గా హాట్ సీట్ లో కూర్చుంటారని తెలుస్తోంది. ఫిన్లండ్ కేంద్రంగా ఉండే రాజీవ్ సూరి మంగుళూరు యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్స్ లో ఇంజనీరింగ్ డిగ్రీ తీసుకున్నారు. గత చాలా ఏళ్లుగా నోకియాలో పనిచేస్తున్నారు. దీంతో ప్రపంచప్రఖ్యాత మల్టినేషనల్స్ ని ముందుండి నడిపించే మహారథుల్లో మరొక మనోడు చేరాడు. మల్టి నేషనల్స్ పై మనోళ్లదే పెత్తనం మైక్రోసాఫ్ట్ సత్యా నాదెళ్ల పెప్పికో ఇందిరా నూయి రెకెట్ బెంకినేర్ రాకేశ్ కపూర్ మాస్టర్ కార్డ్ అజయ్ బంగా డౌచ్ బ్యాంక్ అంశు జైన్ హార్వర్డ్ కాలేజీ రాకేశ్ ఖురానా డీబీఎస్ గుప్త పీయూష్ గుప్త -
ఫార్చూన్ 50 వ్యాపారవేత్తల్లో.. ఇద్దరు భారతీయులు
న్యూయార్క్: ఈ ఏడాదికి సంబంధించి ఫార్చూన్ మ్యాగజైన్ టాప్ 50 వ్యాపారవేత్తల్లో ఇద్దరు ప్రవాస భారతీయులు చోటు దక్కించుకున్నారు. మాస్టర్‌కార్డ్ సీఈవో అజయ్ బంగా, వర్క్‌డే సహ-సీఈవో అనిల్ భూశ్రీ ఇందులో ఉన్నారు. బంగా 15వ స్థానాన్ని, భూశ్రీ 37వ స్థానాన్ని దక్కించుకున్నారు. క్యాష్‌లెస్, మొబైల్ లావాదేవీలు పెరుగుతుండటం మాస్టర్‌కార్డ్ వ్యాపారం పెరగడానికి దోహదపడుతున్నాయని, ప్రస్తుతం 735 డాలర్లుగా ఉన్న షేరు ధర 1,000 డాలర్లకు కూడా ఎగిసే అవకాశం ఉందని ఫార్చూన్ పేర్కొంది. ఇక, భూశ్రీ సహ-సీఈవోగా వ్యవహరిస్తున్న వర్క్‌డే సంస్థ క్లౌడ్ ఆధారిత ఆర్థిక సేవలు, మానవ వనరులకు సంబంధించిన సాఫ్ట్వేర్ సర్వీసులు అందిస్తోంది. 2013లో వర్క్‌డే అమ్మకాలు భారీగా పెరగడంతో పాటు షేరు ధర .. పోటీ సంస్థ ఒరాకిల్ను మించి ఎగిసింది. అంచనాలకు భిన్నంగా వ్యవహరిస్తూ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న వారికి ఈ జాబితాలో చోటు దక్కింది. ఎలక్ట్రిక్ కార్లు తయారుచేసే టెస్లా మోటార్స్ సీఈవో ఎలాన్ మస్క్ ..ఫార్చూన్ 50 జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. అలాగే బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా కూడా నిల్చారు. విప్లవాత్మకమైన చర్యలతో ఆటోమొబైల్, ఇంధన రంగాల్లో ఇతర సంస్థలకు మస్క్ సవాల్ విసురుతున్నారని ఫార్చూన్ పేర్కొంది. ఇన్వెస్ట్మెంట్ గురు, బెర్క్‌షైర్ హాథ్‌వే చైర్మన్ వారెన్ బఫెట్ రన్నరప్‌గా నిల్చారు. మరోవైపు, వాషింగ్టన్ పోస్ట్ పత్రికను కొనుగోలు చేయడం తదితర సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఆరో స్థానంలో ఉన్నారు. గూగుల్ సహ వ్యవస్థాపకుడు ల్యారీ పేజ్ 8వ స్థానం దక్కించుకున్నారు. వివిధ విభాగాలకు సంబంధించి బెస్ట్ పురస్కారాలను కూడా ఫార్చూన్ ప్రకటించింది. దీని ప్రకారం బెస్ట్ న్యూ ఓనర్‌గా బెజోస్ నిలవగా, బెస్ట్ టర్న్‌ఎరౌండ్ సంస్థగా నెట్‌ఫ్లిక్స్ నిల్చింది. ఉత్తమ బిజినెస్ స్కూల్‌గా హార్వర్డ్, అత్యధిక పర్యాటకులు సందర్శించే బెస్ట్ సిటీగా బ్యాంకాక్ ఉన్నాయి.