సాక్షి, హైదరాబాద్: ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా నామినేట్ అయిన భారత–అమెరికన్ అజయ్ బంగా బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్) విద్యార్థే. మాస్టర్ కార్డ్ మాజీ సీఈవో అజయ్ బంగా 1976 బ్యాచ్‌కు చెందిన హెచ్‌పీఎస్ విద్యార్థి. ప్రస్తుత వరల్డ్ బ్యాంకు ప్రెసిడెంట్ మాల్పాస్ తర్వాత అజయ్ నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ‘మా పూర్వ విద్యార్థుల్లో మరొకరు ప్రపంచ సంస్థలో ఉన్నత స్థాయికి చేరుకోవటం పాఠశాలకు గర్వకారణం’అని హెచ్‌పీఎస్ సొసైటీ ప్రెసిడెంట్ గుస్తీ జే నోరి యా తెలిపారు.
కాగా, ప్రపంచంలోని ప్రము ఖ కంపెనీల అధినేతలు హెచ్‌పీఎస్ విద్యార్థులే కావటం విశేషం. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల, అడోబ్ సీఈవో శంతను నారాయణ్‌తో పాటు కావియం కో–ఫౌండర్ సయ్యద్ భష్రత్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, క్రికెటర్ కామెంటర్ హర్షా భోగ్లే, ప్రముఖ సినీనటులు రానా దగ్గుపాటి, అక్కి నేని నాగార్జున, రామ్‌చరణ్, ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, సమైఖ్యాంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వంటి ఎందరో ప్రముఖులు హెచ్‌పీఎస్ పూర్వ విద్యార్థులు.
Comments
Please login to add a commentAdd a comment