న్యూఢిల్లీ: భారతీయ-అమెరికన్ ప్రస్తుతం ఈక్విటీ కంపెనీ జనరల్ అట్లాంటిక్‌క వైస్ చైర్మన్ అజయ్‌పాల్ సింగ్ బంగా ప్రపంచ బ్యాంకు తదుపరి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం విశేషంగా నిలిచింది. అందరి అంచనాలకు తగినట్టుగానే భారతీయ సంతతికి చెందిన అజయ్ బంగా ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి భారతీయ-అమెరికన్‌గా రికార్డు సృష్టించారు. ఈ నేపథ్యంలో బంగా వేతనం, ఆయన నెట్‌వర్త్ తదితర అంశాలు ఆసక్తికరంగా మారాయి.
ప్రపంచ బ్యాంక్ 14వ అధ్యక్షుడిగా జూన్ 2న బాధ్యతలు స్వీకరించనున్న అజయ్ బంగా ఐదేళ్ల కాలానికి పనిచేయనున్న సంగతి తెలిసిందే. పంజాబ్‌కు చెందిన సిక్కు కుటుంబానికి చెందిన బంగా మహారాష్ట్ర, పూణేలోని ఖడ్కీ కంటోన్మెంట్‌లో జన్మించారు. తండ్రి హర్భజన్ బంగా. ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్‌గా పనిచేశారు. దీంతో ఇండియాలో పలు నగరాల్లో అతని విద్యాభ్యాసం సాగింది. ముఖ్యంగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించారు. ఢిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ నుండి ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (ఆనర్స్) పొందారు. ఆ తర్వాత అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుండి పీజీ చేశారు.
బంగా తన కరియర్‌ను 1981లో నెస్లేతో ప్రారంభించారు. అక్కడ 13 సంవత్సరాలు తన సేవలందించారు. అలాగే సిటీ గ్రూప్‌లోనూ పనిచేశారు. మాస్టర్ కార్డ్ సీఈవో గానూ, డచ్ ఇన్వెస్ట్‌మెంట్స్ హోల్డింగ్ ఫర్మ్ ఎక్సోర్‌కు ఛైర్మన్‌గా కూడా పనిచేశారు .
అలాగే ది సైబర్ రెడీనెస్ ఇన్‌స్టిట్యూట్ కో -ఫౌండర్ అయిన అజయ్ బంగా ఎకనామిక్ క్లబ్ ఆఫ్ న్యూయార్క్ వైస్ చైర్ గానూ, అప్పటి అధ్యక్షుడు అమెరికా బరాక్ ఓబామా అండ్ నేషనల్ సైబర్‌సెక్యూరిటీ కమిషన్ సభ్యునిగా ,ట్రేడ్ పాలసీకి సంబంధించిన ఒబామా సలహా కమిటీలో సభ్యుడినూ కూడా పనిచేశారు. ఫార్చ్యూన్ ప్రపంచ ప్రముఖ వ్యాపారవేత్తల జాబితాలో కూడా ఉన్నారు. 2016లో ఇంటర్నేషనల్ అండర్ స్టాండింగ్ బిజినెస్ కౌన్సిల్ నుంచి లీడర్‌షిప్ అవార్డు అందుకున్నారు. 2016లో భారత ప్రభుత్వం నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీతో సత్కరించింది.
అజయ్ బంగా: నికర విలువ, జీతం
సీఎన్‌బీసీ ప్రకారం 2021 నాటికి అజయ్ బంగా నికర విలువ 206 మిలియన్ డాలర్లు (రూ.1700 కోట్లు). మాస్టర్‌కార్డ్ సీఈవోగా బంగా వార్షిక సంపాదన 23,250,000 డాలర్లు. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.1.92 బిలియన్లు. దీని ప్రకారం రోజుకురూ.52 లక్షల వేతనాన్ని ఆయన అందుకున్నారు. అజయ్ బంగా యాజమాన్యంలోని మాస్టర్ కార్డ్ స్టాక్‌ల విలువ 113,123,489 డాలర్లు. గత 13 సంవత్సరాలుగా వేల డాలర్ల విలువైన స్టాక్‌లను విక్రయించారు. కాగా ప్రపంచ బ్యాంక్ 13వ ప్రెసిడెంట్ డేవిడ్ ఆర్ మాల్పాస్ వార్షిక వేతనం సుమారు 390,539 డాలర్లు.
Comments
Please login to add a commentAdd a comment