ఫార్చ్యూన్ టాప్-50లో సత్య నాదెళ్ల, అజయ్ బంగా
న్యూయార్క్: బిజినెస్ మ్యాగజైన్ ఫార్చ్యూన్ రూపొందించిన ప్రపంచ టాప్ 50 బిజినెస్ లీడర్ల జాబితాలో భారత సంతతికి చెందిన అజయ్ బంగా, ఫ్రాన్సిస్ డి సౌజా, సత్య నాదెళ్లకు చోటు దక్కింది. ఈ జాబితాలో మాస్టర్ కార్డ్ అజయ్ బంగా ఐదవ స్థానంలో, కాగ్నిజంట్ ఫ్రాన్సిస్ డిసౌజా 16 వ స్థానంలో మైక్రోసాఫ్ట్ నాదెళ్ల 47వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో నైక్ కంపెనీకి చెందిన మైక్ పార్కర్ అగ్రస్థానంలో ఉన్నారు. ఈ ఏడాది బిజినెస్ పర్సన్ ఘనత కూడా పార్కర్‌కే దక్కింది. ఇక టాప్ 50 గ్లోబల్ బిజినెస్ లీడర్ల జాబితాలో రెండో స్థానంలో ఫేస్‌బుక్ మార్క్ జుకర బర్గ్ ఉన్నారు.