యావత్ భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి, మాస్టర్ కార్డ్ మాజీ సీఈఓ 'అజయ్ బంగా' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన 2023 జూన్ 02 నుంచి వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే అజయ్ బంగా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
ప్రపంచ బ్యాంకు కొత్త అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించనున్న అజయ్ బంగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసి, ఢిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టభద్రుడయ్యాడు. చదువు పూర్తయిన తరువాత 1981లో నెస్లేతో ఉద్యోగ జీవితం ప్రారంభించారు. ఆ తరువాత పెప్సికోలో కూడా పనిచేశారు.
2010లో అజయ్ బంగా మాస్టర్ కార్డ్‌లో ప్రెసిడెంట్ బాధ్యతలను, ఆ తరువాత సీఈఓగా నియమితులయ్యారు. 2020లో ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ICC) ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఈయన ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ జనరల్ అట్లాంటిక్‌లో వైస్ చైర్మన్‌గా ఉన్నారు.
(ఇదీ చదవండి: 1998లో ప్రభంజనం సృష్టించిన టాటా ఇండికా - అరుదైన వీడియో)
భారతదేశానికి కేఎఫ్‌సి, పిజ్జా హట్ వంటివి రావడం వెనుక అజయ్ బంగా హస్తం ఉందని కొంతమంది భావిస్తున్నారు. నివేదికల ప్రకారం అజయ్ బంగా మొత్తం ఆస్తుల విలువ 2021లో 206 మిలియన్ డాలర్లు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 1689 కోట్లకంటే ఎక్కువ. అంతే కాకుండా 11,31,23489 విలువైన మాస్టర్ కార్డ్ స్టాక్‌లను కలిగి ఉన్నట్లు సమాచారం. మాస్టర్ కార్డ్‌లో ఆయన జీతం రోజుకి 52 లక్షలు కావడం గమనార్హం.
(ఇదీ చదవండి: ఈ ప్లాన్ కింద 5జీబీ డేటా ఫ్రీ - కేవలం వారికి మాత్రమే!)
పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన అజయ్ బంగా తండ్రి భారత సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్. ఈ కారణంగానే దేశంలో చాలా ప్రాంతాలను తిరగాల్సి వచ్చింది. మొత్తానికి ఈ రోజు భారతదేశం మొత్తం గర్వించే స్థాయికి ఎదిగాడు. ప్రపంచ బ్యాంక్ అజయ్ బంగాతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తోంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ సందేహాలను, అభిప్రాయాలను తప్పకుండా మాతో పంచుకోండి.
Comments
Please login to add a commentAdd a comment