World Bank President
-
స్థానిక వినియోగమే భారత్‌కు బలం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మందగమనం చూస్తున్న తరుణంలో, దేశీ వినియోగమే భారత్ ఆర్థిక వ్యవస్థకు సహజ ప్రేరణగా నిలుస్తోందని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా అభిప్రాయపడ్డారు. భారత్ జీడీపీ అధిక శాతం దేశీయ డిమాండ్‌పైనే ఆధారపడి ఉన్నట్టు చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో అజయ్ బంగా బుధవారం సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జీ20కి సంబంధించిన అంశాలు, ప్రపంచబ్యాంక్, భారత్ మధ్య సహకారంపై ఆర్థిక మంత్రితో చర్చించినట్టు చెప్పారు. ‘‘జీ20లో ఏం చేశామన్నది, అలాగే సమావేశం ఎలా కొనసాగిందన్నది మాట్లాడుకున్నాం. జీ20లో భాగంగా ప్రపంచబ్యాంక్, భారత్ ఇంకా ఏం చేయగలవన్నదీ చర్చించాం. ప్రపంచబ్యాంక్‌కు పోర్ట్‌ఫోలియో పరంగా భారత్ అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. ఈ మార్కెట్‌పై ఎంతో ఆసక్తి నెలకొంది’’అని బంగా వివరించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పనితీరుపై మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ఆరంభంలో మరింత క్షీణించేందుకు రిస్క్‌లు ఉన్నట్టు చెప్పారు. ‘‘భారత్ జీడీపీలో అధిక భాగం దేశీయ వినియోగం నుంచే సమకూరుతోంది. కనుక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరికొన్ని నెలల పాటు నిదానించినా, దేశీ వినియోగంతో భారత్ బలంగా నిలబడుతుంది’’అని బంగా పేర్కొన్నారు. జీ20 సమావేశంలో పాల్గొనేందుకు గాను భారత సంతతికి చెందిన అజయ్ బంగా ఇక్కడకు విచ్చేశారు. గత నెలలోనే ఆయన ప్రపంచబ్యాంక్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. అనంతరం భారత్ పర్యటనకు తొలిసారి విచ్చేశారు. విజ్ఞానం, టెక్నాలజీ అంతరాలను తగ్గించడమనేది భవిష్యత్ ఆర్థిక వృద్ధికి కీలకమని ఆర్థిక మంత్రి సీతారామన్ అన్నట్టు బంగా తెలిపారు. -
ఇండియాకు కేఎఫ్సి, పిజ్జా హట్ రావడానికి కారణం ఇతడే..!
యావత్ భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి, మాస్టర్ కార్డ్ మాజీ సీఈఓ 'అజయ్ బంగా' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన 2023 జూన్ 02 నుంచి వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే అజయ్ బంగా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రపంచ బ్యాంకు కొత్త అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించనున్న అజయ్ బంగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసి, ఢిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టభద్రుడయ్యాడు. చదువు పూర్తయిన తరువాత 1981లో నెస్లేతో ఉద్యోగ జీవితం ప్రారంభించారు. ఆ తరువాత పెప్సికోలో కూడా పనిచేశారు. 2010లో అజయ్ బంగా మాస్టర్ కార్డ్‌లో ప్రెసిడెంట్ బాధ్యతలను, ఆ తరువాత సీఈఓగా నియమితులయ్యారు. 2020లో ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ICC) ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఈయన ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ జనరల్ అట్లాంటిక్‌లో వైస్ చైర్మన్‌గా ఉన్నారు. (ఇదీ చదవండి: 1998లో ప్రభంజనం సృష్టించిన టాటా ఇండికా - అరుదైన వీడియో) భారతదేశానికి కేఎఫ్సి, పిజ్జా హట్ వంటివి రావడం వెనుక అజయ్ బంగా హస్తం ఉందని కొంతమంది భావిస్తున్నారు. నివేదికల ప్రకారం అజయ్ బంగా మొత్తం ఆస్తుల విలువ 2021లో 206 మిలియన్ డాలర్లు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 1689 కోట్లకంటే ఎక్కువ. అంతే కాకుండా 11,31,23489 విలువైన మాస్టర్ కార్డ్ స్టాక్లను కలిగి ఉన్నట్లు సమాచారం. మాస్టర్ కార్డ్‌లో ఆయన జీతం రోజుకి 52 లక్షలు కావడం గమనార్హం. (ఇదీ చదవండి: ఈ ప్లాన్ కింద 5జీబీ డేటా ఫ్రీ - కేవలం వారికి మాత్రమే!) పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన అజయ్ బంగా తండ్రి భారత సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్. ఈ కారణంగానే దేశంలో చాలా ప్రాంతాలను తిరగాల్సి వచ్చింది. మొత్తానికి ఈ రోజు భారతదేశం మొత్తం గర్వించే స్థాయికి ఎదిగాడు. ప్రపంచ బ్యాంక్ అజయ్ బంగాతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తోంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ సందేహాలను, అభిప్రాయాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
ప్రపంచ బ్యాంక్ అధ్యక్షునిగా అజయ్ బంగా
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా పలు దిగ్గజ సంస్థలకు సారథులుగా వెలుగొందుతున్న భారతీయుల జాబితాలో ప్రముఖ భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త అజయ్ బంగా నిలిచారు. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షునిగా ఎంపికయ్యారు! ఆయన నియామకాన్ని ఖరారుచేస్తున్నట్లు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు బుధవారం ప్రకటించారు. జూన్ రెండో తేదీ నుంచి ఐదేళ్లపాటు అధ్యక్షునిగా బంగా సేవలందిస్తారని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఒక భారతీయ అమెరికన్ అధ్యక్షుడు ప్రపంచ బ్యాంక్ పగ్గాలు చేపట్టడం ఇదే తొలిసారి. 63 ఏళ్ల బంగాను ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఈ పదవికి నామినేట్‌చేశారు. బంగా జనరల్ అట్లాంటిక్ సంస్థ ఉపాధ్యక్షునిగా, మాస్టర్‌కార్డ్ సీఈవోగా చేశారు. కేంద్రం 2016లో ఆయనను పద్మశ్రీతో సత్కరించింది. -
వరల్డ్ బ్యాంక్ అధ్యక్ష బరిలో ఆయనొక్కరే.. అజయ్ బంగా ఎన్నిక లాంఛనమే!
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన అజయ్ బంగా ఎన్నికకు మార్గం సుగమమైంది.ప్రపంచ బ్యాంక్ గ్రూప్ తదుపరి ప్రెసిడెంట్ పదవికి నామినేషన్ల సమర్పణకు గడువు మార్చి 29తో ముగిసింది. బరిలో అజయ్ బంగా ఒక్కరే నిలిచారు. దీంతో వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక లాంఛనమే కానుంది. ఇతర అభ్యర్థులెవరూ నామినేట్ కానందున తదుపరి అధ్యక్షుడిగా అజయ్ బంగా నామినేషన్‌ను మాత్రమే పరిశీలిస్తామని ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డు తెలిపింది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో విజయవంతమైన సంస్థలకు నాయకత్వం వహించిన విస్తృత అనుభవం కలిగిన వ్యాపార నాయకుడైన అజయ్ బంగాను ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా నామినేట్ చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫిబ్రవరిలో ప్రకటించారు. (ఆ మందులు వాడే వారికి ఊరట.. దిగుమతి సుంకం మినహాయింపు) అజయ్ బంగా ప్రస్తుతం జనరల్ అట్లాంటిక్‌లో వైస్ ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. గతంలో ఆయన మాస్టర్‌కార్డ్‌కు ప్రెసిడెంట్, సీఈవోగా చేశారు. సెంట్రల్ అమెరికా కోసం పార్టనర్షిప్ కో-చైర్‌గా వైస్ ప్రెసిడెంట్ హారిస్‌తో కలిసి పనిచేశారు. ప్రపంచ బ్యాంక్ అధిపతిగా కాబోతున్న మొట్ట మొదటి భారతీయ అమెరికన్ అజయ్ బంగా ఇటీవల భారత్ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లను కలవాల్సి ఉంది. అయితే ఆయనకు కోవిడ్ సోకడంతో ఆ సమావేశాలన్నీ రద్దయ్యాయి. మహారాష్ట్రలోని పుణె నగరంలో జన్మించిన బంగా ఢిల్లీ యూనివర్సిటీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్-అహ్మదాబాద్ నుంచి మేనేజ్మెంట్లో పట్టా పొందారు. 2016లో అజయ్బంగాను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. -
భారత్‌లో వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ 'అజయ్ బంగా'.. ప్రముఖులతో సమావేశాలు
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్‌గా అమెరికా ప్రతిపాదించిన అజయ్ బంగా తాజాగా భారత్ పర్యటనకు వచ్చారు. రెండు రోజుల పర్యటనలో (మార్చి 23, 24) భాగంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ తదితరులతో సమావేశం కానున్నారు. భారత్ అభివృద్ధి ప్రణాళికలు, ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ఆర్థికాభివృద్ధిపరమైన సవాళ్లు వంటి అంశాలపై ఈ సందర్భంగా చర్చించనున్నారని అమెరికా ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే, నేషనల్ స్కిల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో కలిసి ఏర్పాటు చేసిన వృత్తి విద్యా కోర్సుల సంస్థల నెట్వర్క్ ’లెర్నెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్’ను కూడా బంగా సందర్శించనున్నారు. దీనికి ప్రపంచ బ్యాంక్ పాక్షికంగా నిధులు సమకూర్చింది. మాస్టర్‌కార్డ్ చీఫ్‌గా ఉన్న బంగా పేరును ప్రపంచ బ్యాంక్‌కు కొత్త ప్రెసిడెంట్‌గా ప్రతిపాదించిన వెంటనే భారత ప్రభుత్వం మద్దతు తెలిపిందని అమెరికా ఆర్థిక శాఖ తెలిపింది. ఇప్పటికే బంగ్లాదేశ్, ఫ్రాన్స్, ఈజిప్ట్, జర్మనీ, ఇటలీ, సౌదీ అరేబియా, బ్రిటన్ తదిన్‌దేశాలు కూడా మద్దతు ప్రకటించినట్లు వివరించింది. తన అభ్యర్థిత్వానికి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల్లో భాగంగా ఆయన మూడు వారాలుగా వివిధ దేశాలను సందర్శిస్తున్నారు. ఆఫ్రికాతో ప్రారంభించి యూరప్, లాటిన్ అమెరికా, ఆసియా దేశాల తర్వాత ఆఖరుగా భారత్ వచ్చారు. -
డిజిటలైజేషన్లో భారత్ మార్గదర్శి
వాషింగ్టన్: డిజిటలైజేషన్ విషయంలో ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటని ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ డేవిడ్ మాల్పాస్ పేర్కొన్నారు. సాధికారత, సామాజిక భద్రతా ప్రమాణాల పెంపు వంటి అంశాలకు సంబంధించి భారత్‌లో డిజిటలైజేషన్ గణనీయమైన పాత్ర పోషిస్తోందని ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో అన్నారు. కోవిడ్–19 సమయంలో సామాజిక భద్రత విషయంలో భారత్‌లో డిజిటలైజేషన్ కీలక ప్రాత పోషించిందని అన్నారు. పేదరికం సమస్యలు కూడా డిజిటలైజేషన్లో తగ్గుముఖం పడతాయని పేర్కొంటూ, భారత్‌లో ఈ పరిస్థితి కనిపిస్తోందన్నారు. ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెరుగుదల, వాతావరణ మార్పులు వంటి పలు అంశాల విషయంలో భారత్‌సహా పలు వర్థమాన దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ పేర్కొన్నారు. డిసెంబర్లో భారత్‌లో జరగనున్న జీ–20 దేశాల సదస్సులో దేశాల రుణ సమస్యలు, విద్యారంగం పురోగతి, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతుందని డేవిడ్ మాల్పాస్ వెల్లడించారు. -
వృద్ధికి మరిన్ని సంస్కరణలే కీలకం..
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులే భారత ఆర్థిక వ్యవస్థ మందగమనానికి కూడా కారణమని ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్ డేవిడ్ మల్పాస్ పేర్కొన్నారు. మరిన్ని సంస్కరణలు, నవకల్పనలు భారత వృద్ధికి కీలకంగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే, 2024–25 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా భారత్ ఎదగాలంటే.. ఆర్థిక రంగంలో కొత్త ఆవిష్కరణలు అవసరమని డేవిడ్ తెలిపారు. ఆర్థిక రంగంలో భారత్ ఎంతో పురోగతి సాధించినా.. బ్యాంకింగ్ రంగం, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగం (ఎన్బీఎఫ్సీ), క్యాపిటల్ మార్కెట్ల వంటి వాటి విషయంలో మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. ‘మూడు ప్రధాన రంగాల్లో పురోగతి సాధించాలి. ముందుగా ప్రైవేట్ రంగం సహా బ్యాంకింగ్ పరిశ్రమ వృద్ధికి తోడ్పాటు అందించాలి. కార్పొరేట్ బాండ్ మార్కెట్, తనఖా రుణాల మార్కెట్ మరింతగా విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలి. భారత ఆర్థిక వ్యవస్థతో పాటే ఎదిగిన ఎన్బీఎఫ్సీల్లో రిస్కులు ఉన్న నేపథ్యంలో వాటిని నియంత్రించాలి. సరైన నియంత్రణ చర్యలు తీసుకుంటే.. ఆర్థిక రంగం మరింత మెరు గుపడుతుంది’ అని డేవిడ్ పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌లో 97 ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయం అందిస్తోందని డేవిడ్ చెప్పారు. ఈ ప్రాజెక్టుల కోసం 24 బిలియన్ డాలర్లు అందించేందుకు ప్రపంచ బ్యాంకు కట్టుబడి ఉందన్నారు. -
ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు రాజీనామా
వాషింగ్టన్: ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్ తన పదవికి రాజీనామా చేశారు. పదవీ కాలానికి మూడేళ్లు ముందే ఆయన వైదొలగడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అధ్యక్షుడి బాధ్యతల నుంచి తప్పకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. మౌలిక రంగంలోని సంస్థలో అవకాశం రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రపంచ సంస్థకు అధ్యక్షుడిగా ఉండటం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని, పేదరికం నిర్మూలన కోసం ఎంతో కృషి చేసినట్లు జిమ్ యాంగ్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా పేదరికం పెరుగుతున్న దశలో ప్రపంచ బ్యాంక్ సేవలు ఎంతో అవసరమని ఆయన అన్నారు. కిమ్ ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా 2012లో తొలిసారి బాధ్యతలు స్వీరించారు. 2017లో రెండోసారి ఎన్నికై కిమ్ పదవీ కాలం 2022 వరకు ఉంది. అంతర్జాతీయంగా పేదరిక నిర్మూలనకు అవిశ్రాంతంగా పోరాడిన వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. 2012లో తొలిసారి ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా నియమితులైనప్పుడు 2030 నాటికి పేదరికాన్ని నిర్మూలించడం, వర్ధమాన దేశాల్లోని వ్యక్తుల ఆదాయాన్ని పెంచడం అనే రెండు లక్ష్యాలను బ్యాంకుకు నిర్దేశించారు. ప్రపంచ బ్యాంకు ప్రస్తుత సీఈవో క్రిస్టాలినా జార్జియేవా ఆయన స్థానంలో తాత్కాలిక అధ్యక్షురాలిగా వచ్చే నెల ఒకటో తేదీ నుంచి బాధ్యతలను స్వీకరించనున్నట్లు సమాచారం. 59 ఏళ్ల కిమ్ దక్షిణ కొరియా దేశానికి చెందినవారు. -
ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా మళ్లీ జిమ్ యాంగ్ కిమ్
వాషింగ్టన్: ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా మళ్లీ జిమ్ యాంగ్ కిమ్ నియమితుల య్యారు. ఈయన పదవీ కాలం వచ్చే ఏడాది జూలై 1 నుంచి ప్రారంభమౌతుంది. కాగా జిమ్ యాంగ్ కిమ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా ఐదేళ్లపాటు కొనసాగుతారు. ‘బ్యాంక్ అధ్యక్షుడిగా వరుసగా రెండవసారి ఎన్నిక కావడం ఎంతో ఆనందంగా ఉంది. దీన్ని గొప్ప గౌరవంగా భావిస్తాను. అంతర్జాతీయంగా పేదరిక నిర్మూలనకు అవిశ్రాంతంగా శ్రమిస్తాను’ అని కిమ్ పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లందరూ కిమ్‌ను ఏకగ్రీవంగా ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. కాగా కిమ్ 2012లో బ్యాంక్ ప్రెసిడెంట్‌గా నియమితులైనప్పుడు 2030 నాటికి పేదరికాన్ని నిర్మూలించడం, వర్ధమాన దేశాల్లోని వ్యక్తుల ఆదాయాన్ని పెంచడం అనే రెండు లక్ష్యాలను బ్యాంకుకు నిర్దేశించారు. -
వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా జిమ్ యాంగ్ కిమ్
-
నేడు భారత్‌కు ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్ జిమ్ యాంగ్ కిమ్... రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం (నేడు) భారత్ కు చేరుకుంటారు. కిమ్ తన పర్యటనలో భాగంగా న్యూట్రిషన్, పునరుత్పాదక ఇంధన వృద్ధికి భారత్ తీసుకుంటున్న చర్యలను సమీక్షిస్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పలు సంస్కరణలకు ఆర్థికంగా చేయూతనందించడానికి తగిన మార్గాలను అన్వేషించనున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీని, ఆర్థిక మంత్రి జైట్లీని కలుస్తారు. పేదరిక నిర్మూలనకు పటిష్టమైన చర్యలు అవసరమని ఈ సందర్భంగా కిమ్ అభిప్రాయపడ్డారు.